Shaun Marsh
-
ఆసీస్ స్టార్ ప్లేయర్ మార్ష్ సంచలన నిర్ణయం
ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు, బిగ్‌బాష్ లీగ్‌లో మెల్బోర్న్ రెనెగేడ్స్ ఓపెనర్ షాన్ మార్ష్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఫామ్‌లో (బిగ్‌బాష్ లీగ్) ఉండగానే ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన మార్ష్ తాజాగా అన్ని రకాల క్రికెట్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు. బీబీఎల్‌లో జనవరి 16న సిడ్నీ థండర్స్‌తో జరిగే మ్యాచ్ తనకు చివరిదని స్పష్టం చేశాడు. మంచి ఫామ్‌లో ఉండటంతో పాటు తన చివరి మ్యాచ్‌లో (బిగ్‌బాష్ లీగ్) ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన షాన్ ఈ అనూహ్య నిర్ణయం తీసుకోవడంతో అందరూ షాకయ్యారు. మార్ష్.. తన చివరి మ్యాచ్‌లో మెల్బోర్న్ స్టార్స్‌పై 49 బంతుల్లో 10 బౌండరీల సాయంతో 64 పరుగులతో అజేయంగా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. మార్ష్ తన రెనెగేడ్స్ సహచరుడు, ఆసీస్ మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ ప్రొఫెషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రోజుల వ్యవధిలోనే తాను కూడా ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. 2008-19 మధ్యలో షాన్ మార్ష్ ఆస్ట్రేలియా తరఫున 38 టెస్ట్‌లు, 73 వన్డేలు, 15 టీ20లు ఆడాడు. ఇందులో అతను 13 సెంచరీలు, 25 హాఫ్ సెంచరీల సాయంతో 5000 పైచిలుకు పరుగులు చేశాడు. ఐపీఎల్‌లోనూ అదరగొట్టిన మార్ష్ 2008-17 మధ్యలో వివిధ ఫ్రాంచైజీల తరఫున 71 మ్యాచ్‌లు ఆడి సెంచరీ, 20 హాఫ్ సెంచరీల సాయంతో 132 స్ట్రయిక్‌రేట్‌తో 2477 పరుగులు చేశాడు. ఐపీఎల్ ఆరంభ సీజన్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన మార్ష్ (కింగ్స్ ఎలెవెన్ పంజాబ్).. ఆ సీజన్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా (616 పరుగులు) నిలిచాడు. ఆసీస్ దిగ్గజ ఆటగాడు జెఫ్ మార్ష్ పెద్ద కొడుకైన 40 ఏళ్ల షాన్ మార్ష్.. ప్రస్తుత ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్‌కు స్వయానా అన్న అవుతాడు. -
రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్
ఆస్ట్రేలియా వెటరన్ బ్యాటర్ షాన్ మార్ష్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్, అంతర్జాతీయ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇకపై అతడు కేవలం టీ20 క్రికెట్లో మాత్రమే కొనసాగనున్నాడు. 39 ఏళ్ల మార్ష్ 2001లో వెస్ట్రన్ ఆస్ట్రేలియా తరపున ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేసాడు. 2022లో ప్రతిష్టాత్మక షెఫీల్డ్ షీల్డ్ ట్రోఫీని సారథిగా వెస్ట్రన్ ఆస్ట్రేలియాకు మార్ష్ అందించాడు. లిస్ట్-ఎ కెరీర్లో 177 మ్యాచ్‌లు ఆడిన మార్ష్.. 44.45 సగటుతో 7158 పరుగులు చేశాడు. 26 ఏళ్ల ఫస్ట్‌క్లాస్ కెరీర్లో వెస్ట్రన్ ఆస్ట్రేలియాకు ఎన్నో అద్భుత విజయాలను షాన్ అందించాడు. ఇక మార్ష్ అంతర్జాతీయ కెరీర్ విషయానికి వస్తే.. ఆస్ట్రేలియా తరపున 38 టెస్టులు, 73 వన్డేలు, 15 టీ20ల్లో ప్రాతినిథ్యం వహించాడు. కాగా 2019లోనే టెస్టు క్రికెట్‌కు మార్ష్ గుడ్‌బై చెప్పాడు. టెస్టుల్లో అతడు 32.32 సగటుతో 2265 పరుగులు సాధించాడు. అతడి టెస్టు కెరీర్లో 6 సెంచరీలు, 10 అర్ధ శతకాలు ఉన్నాయి. అదే విధంగా వన్డేల్లో 2773 పరుగులు, టీ20ల్లో కేవలం 255 పరుగులు మాత్రమే మార్ష్ చేశాడు. కాగా షాన్ మార్ష్ సోదరుడు మిచెల్ మార్ష్ ప్రస్తుత ఆస్ట్రేలియా జట్టులో కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. చదవండి: IND vs AUS: చరిత్ర సృష్టించిన అశ్విన్.. తొలి భారత బౌలర్‌గా! దరిదాపుల్లో ఎవరూ లేరు -
ముగ్గురూ క్రికెటర్లే.. 34 ఏళ్ల క్రితం అద్భుతం చేసిన తండ్రి.. ఇప్పుడు కొడుకు కూడా
T20 World Cup 2021 Final: Mitchell Marsh Repeats His Father's Geoff Marsh World Cup Winner 34 Years Record: ఆస్ట్రేలియాకు తీరని కలగా ఉన్న టీ20 ప్రపంచకప్ ఎట్టకేలకు కంగూరూల సొంతమైంది. నవంబరు 14న న్యూజిలాండ్‌తో ఫైనల్లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించి మొదటిసారి టైటిల్‌ను గెలిచింది. ఐదు సిరీస్ పరాజయాల నుంచి చాంపియన్‌గా నిలిచి ఆరోన్ ఫించ్ తమ సత్తా ఏమిటో నిరూపించుకుంది. ముఖ్యంగా ఫైనల్లో స్టార్ ఓపెపర్ డేవిడ్ వార్నర్ (53 పరుగులు), మిచెల్ మార్ష్(77) అద్భుతంగా రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. 34 ఏళ్ల క్రితం తండ్రి.. ప్రధానంగా మార్ష్ 50 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 77 పరుగులు చేసి చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఆసీస్‌ను చాంపియన్‌గా నిలపడంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, 34 ఏళ్ల క్రితం మార్ష్ తండ్రి జెఫ్ మార్ష్ కూడా వన్డే వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా తొలిసారిగా విజేతగా నిలవడంలో కీలకంగా వ్యహరించాడు. ప్రపంచకప్-1987 టోర్నీలో మొత్తంగా 428 పరుగులు చేసి సత్తా చాటాడు. ఇందులో రెండు సెంచరీలు ఉండటం విశేషం. అంతేకాదు... రిటైర్మెంట్ తర్వాత ఆస్ట్రేలియా హెడ్‌కోచ్‌గా మారిన జెఫ్ మార్ష్... ఆసీస్ 1999లో తమ రెండో టైటిల్ గెలవడంలో ప్రధాన పాత్ర పోషించాడు. తండ్రిలాగే కొడుకు తండ్రి జెఫ్ మార్ష్ అడుగుజాడల్లోనే నడిచాడు మిచెల్ మార్ష్(mitchell marsh). గత ఆరు పర్యాయాలుగా అందని ద్రాక్షగా ఆసీస్‌ను ఊరిస్తున్న టీ20 వరల్డ్‌కప్ టైటిల్ సాధించడంలో ప్రముఖ పాత్ర పోషించాడు. ఇక ఈ టోర్నీలో మార్ష్ మొత్తంగా.. ఐదు ఇన్నింగ్స్‌లో మార్ష్ 185 పరుగులతో రాణించాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక జెఫ్ మార్ష్ మరో తనయుడు, మిచెల్ మార్ష్ సోదరుడు షాన్ మార్ష్ సైతం క్రికెటర్ అన్న సంగతి తెలిసిందే. ఇలా కుటుంబమంతా ఆసీస్ జట్టులో చోటు సంపాదించడమే కాకుండా పలు కీలక సమయాల్లో విజయాలు అందించడం విశేషం. చదవండి: T20 World Cup 2021 Prize Money: విజేత, రన్నరప్.. ఇతర జట్ల ప్రైజ్ మనీ ఎంతంటే.. -
టాప్ ఆర్డర్ ఆటగాడికి నో చాన్స్
సిడ్నీ: క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ప్రకటించిన ఆటగాళ్ల తాజా కాంట్రాక్ట్ జాబితాలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. ఆసీస్ టాపార్డర్ బ్యాట్స్‌మన్ ఉస్మాన్ ఖవాజాను కాంట్రాక్ట్ జాబితా నుంచి సీఏ తొలగించింది. గత ఏడాది ఆగస్టు నుంచి ఆస్ట్రేలియా టెస్టు జట్టులో చోటు కోల్పోయిన ఖవాజాకు కాంట్రాక్ట్ జాబితాలో చోటివ్వలేదు. గత జాబితాలో ఉన్న ఖవాజను కొత్త జాబితా నుంచి తప్పించడం ఆసక్తికరంగా మారింది. ఖవాజాతో పాటు పీటర్ హ్యాండ్స్కోంబ్, మార్కస్ హారిస్, షాన్ మార్ష్, నాథన్ కౌల్టర్ నైల్, మార్కస్ స్టోయినిస్‌లను తప్పించింది.( అక్తర్‌పై ‘పీసీబీ’ పరువు నష్టం కేసు) వీరిలో ఖవాజా, షాన్ మార్ష్ కాంట్రాక్ట్‌లను కొనసాగించకపోవడం చర్చనీయాంశమైంది. ఇక వారి స్థానాల్లో మార్కస్ లబూషేన్, ఆస్టన్ ఆగర్, మిచెల్ మార్ష్, కేన్ రిచర్డ్సన్, మాథ్యూ వేడ్లకు అవకాశం ఇచ్చింది. గతంలో ఆయా ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా 12 అప్‌గ్రేడ్ పాయింట్లను(మూడు ఫార్మాట్లకు కలిపి) కేటాయించిన సీఏ.. తాజాగా దానిని 8 అప్‌గ్రేడ్ పాయింట్లకే పరిమితం చేసింది. ఒక్కో టెస్టు మ్యాచ్‌కు 5 పాయింట్లు, వన్డేకు రెండు పాయింట్లు, టీ20కి ఒక్కో పాయింట్ చొప్పున కేటాయించి ఆటగాళ్ల కాంట్రాక్ట్ జాబితాను రూపొందించింది. ఈ మేరకు 20 మందితో కూడిన కొత్త జాబితాను ప్రకటించింది. (హిట్‌మ్యాన్‌కు స్పెషల్ డే..!) క్రికెట్ ఆస్ట్రేలియా కాంట్రాక్ట్ జాబితా ఇదే.. ఆస్టన్ ఆగర్, జో బర్న్స్, అలెక్స్ క్యారీ, ప్యాట్ కమిన్స్, అరోన్ ఫించ్, జోష్ హజల్‌వుడ్, ట్రావిస్ హెడ్, లబూషేన్, నాథన్ లయాన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, టిమ్ పైన్, జేమ్స్ పాటిన్సన్, జహీ రిచర్డ్సన్, కేన్ రిచర్డ్సన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా -
ఆసీస్‌కు భారీ ఎదురుదెబ్బ..!
ప్రపంచకప్‌లో భాగంగా ఆసీస్ టాపార్డర్ బ్యాట్స్‌మెన్ షాన్‌మార్ష్ స్థానంలో పీటర్ హ్యాండ్స్కోంబ్ ప్రపంచకప్ తుది జట్టుతో చేరతాడని ఐసీసీ పేర్కొంది. ఈ మేరకు...‘ ప్రపంచకప్‌లో భాగంగా గాయపడిన షాన్‌మార్ష్ స్థానాన్ని పీటర్ హ్యాండ్స్కోంబ్తో భర్తీ చేసేందుకు, ఆస్ట్రేలియా తదుపరి మ్యాచ్‌లలో అతడు ఆడే విషయాన్ని ఐసీసీ ధ్రువీకరించింది’ అని గురువారం ప్రకటన విడుదల చేసింది. కాగా ఈ ప్రపంచకప్‌లో సెమీస్‌లో అడుగుపెట్టిన తొలి జట్టుగా నిలిచిన ఆసీస్ తమ తదుపరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనున్న సంగతి తెలిసిందే. శనివారం జరిగే ఈ మ్యాచ్ కోసం ఓల్డ్ ట్రఫార్డ్‌లో నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొన్న షాన్ మార్ష్ గాయపడ్డాడు. పాట్ కమిన్స్ బంతులను ఎదుర్కొనే క్రమంలో అతడి మణికట్టుకు తీవ్ర గాయమైంది. దీంతో సర్జరీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్ కుడి ముంజేతికి కూడా గాయమైంది. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో అతడు గాయపడ్డాడు. అయితే శనివారం నాటి మ్యాచ్‌కు అతడు అందుబాటులోకి వస్తాడని కోచ్ జస్టిన్ లాంగర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక షాన్‌మార్ష్ స్థానంలో హ్యాండ్స్‌కోంబ్‌ను ఎంపిక చేయడం గురించి మాట్లాడుతూ..‘ పీటర్‌పై నమ్మకం ఉంది. మిడిల్ ఆర్డర్లో రాణించగలడనే భావిస్తున్నాం. ఇండియా, యూఏఈ టూర్లలో అతడు గొప్ప ప్రదర్శన కనబరిచాడు’ అని లాంగర్ పేర్కొన్నాడు. కాగా హ్యాండ్స్కోంబ్ ఆస్ట్రేలియా తరఫున ఇప్పటివరకు 21 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో ఒక సెంచరీ, నాలుగు అర్ధసెంచరీలు చేశాడు. -
కోహ్లి ఔట్.. హాఫ్ సెంచరీ మిస్
మెల్బోర్న్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్ నిర్ణయాత్మక వన్డేలో భారత్.. కెప్టెన్ విరాట్ కోహ్లి వికెట్ కోల్పోయింది. జట్టు స్కోర్ 113 పరుగుల వద్ద కోహ్లి (46: 66 బంతుల్లో 3 ఫోర్లు) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. రిచర్డ్సన్ వేసిన 29 ఓవర్ చివరి బంతి కోహ్లి బ్యాట్ ఎడ్జ్ తీసుకొని కీపర్ క్యారీ చేతిలో పడింది. దీంతో కోహ్లి నలుగు పరుగుల తేడాతో అర్ధశతకాన్ని చేజార్చుకున్నాడు. ఇక 10 పరగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కోహ్లికి లైఫ్ లభించింది. స్టాన్లేక్ బౌలింగ్‌లో కోహ్లి ఇచ్చిన కష్టతరమైన క్యాచ్ హ్యాండ్స్కోంబ్ అందుకోలేకపోయాడు. కోహ్లి వికెట్ అనంతరం క్రీజులోకి జాదవ్ వచ్చాడు. 32 ఓవర్లు ముగిసే సరికి భారత్ 3 వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసింది. ఇంకా భారత విజయానికి 111 పరుగుల అవసరం. -
ధోని అదిరే స్టంపింగ్ చూశారా?
మెల్బోర్న్ : టీమిండియా సీనియర్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని మరోసారి తన మార్క్కీపింగ్తో ఔరా అనిపించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో ఆ జట్టు బ్యాట్స్‌మన్ షాన్ మార్ష్‌ను తనదైన స్టంపింగ్‌తో పెవిలియన్ చేర్చాడు. గత మ్యాచ్‌లో శతకంతో మెరిసిన షాన్ మార్ష్.. తాజా మ్యాచ్‌లో ధోని దెబ్బకు 39 పరుగులతోనే సరిపెట్టుకున్నాడు. తొలుత మార్ష్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను వదిలేసిన ఈ సీనియర్ వికెట్ కీపర్.. కొద్దిసేపటికి ఆ తప్పిదాన్ని చురుకైన స్టంపింగ్‌తో సరిదిద్దుకున్నాడు. టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజువేంద్ర చహల్ వేసిన వైడ్ బంతిని ముందుకొచ్చి ఆడబోయిన మార్ష్.. ధోని వ్యూహానికి అడ్డంగా దొరికిపోయాడు. ఈ మ్యాచ్‌లో 6 వికెట్లతో చెలరేగిన చహల్‌కు ఇది తొలి వికెట్ కావడం ఇక్కడ విశేషం. దీంతో వన్డేల్లో అత్యధికసార్లు స్టంపౌట్ అయిన రెండో బ్యాట్స్‌మన్‌గా షాన్‌మార్ష్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. 60 మ్యాచ్‌ల్లో ఈ లెఫ్టార్మ్ బ్యాట్స్‌మన్ ఆరు సార్లు స్టంపౌట్ కావడం గమనార్హం. ఈ జాబితాలో మార్ష్ కన్నా ముందు ఇంగ్లండ్ ఆటగాడు నాసీర్ హుస్సేన్ (77 మ్యాచ్‌ల్లో 8 స్లార్లు) ఉన్నాడు. ఇక ఆస్ట్రేలియా తరఫున అత్యధిక సార్లు స్టంపౌట్ అయిన బ్యాట్స్‌మన్‌గా కూడా మార్షే నిలిచాడు. మార్ష్ తరువాత టామ్ మూడీ (52 మ్యాచ్‌ల్లో 5 సార్లు) ఉన్నాడు. ధోని క్యాచ్ మిస్.. పెదవి విరిచిన కోహ్లి అంతకుముందు భారత పార్ట్‌టైం స్పిన్నర్ కేదార్ జాదవ్ వేసిన 17వ ఓవర్లో షాన్ మార్ష్ బంతిని కట్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ.. బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి నేరుగా ధోనీ చేతుల్లోకి వెళ్లింది. కానీ.. ఆ బంతిని ధోని జారవిడచడంతో.. సునాయస క్యాచ్ నేలపాలైంది. రెండో వన్డేలో శతకం బాది మంచి ఫామ్‌లో ఉన్న షాన్ మార్ష్.. ఔట్ అయ్యే మంచి అవకాశం చేజారడంతో బౌలర్ కేదార్ జాదవ్, కెప్టెన్ కోహ్లిలు పెదవి విరిచారు. ఇది టీవీలో స్పష్టంగా కనిపించింది. ఇక నిలకడలేమి ఆటతో విమర్శలు ఎదుర్కొన్న ధోని ఈ సిరీస్‌తో గాడిలో పడ్డాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఈ మాజీ కెప్టెన్ హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా రెండో వన్డేలో విలువైన పరుగులతో విజయంలో కీలకపాత్ర పోషించాడు. -
ధోని అదిరిపోయే స్టంపింగ్ చూశారా?
-
విజయ సమక్రాంతి
భారత్ లక్ష్యాన్ని ఛేదిస్తున్నప్పుడు కోహ్లి తొందరగా ఔటైతే ఒక లెక్క... అతను క్రీజ్‌లో ఉంటే మరో లెక్క...విరాట్ దీనిని మరోసారి చేసి చూపించాడు. తొలి మ్యాచ్ వైఫల్యం తర్వాత ఇప్పుడు మరో అద్భుత సెంచరీతో భారత కెప్టెన్ జట్టును విజయం దిశగా నడిపించాడు. శుభారంభాన్ని కొనసాగించడంతో పాటు చేయాల్సిన రన్‌రేట్ పెరిగిపోతున్నా ఎక్కడా ఒత్తిడికి లోను కాకుండా సాధికారికంగా ఆడిన కోహ్లి సిరీస్‌లో జట్టును సమంగా నిలిపాడు. అంతకు ముందు చక్కటి బౌలింగ్‌తో భువనేశ్వర్ ఆసీస్‌ను దెబ్బ తీసి భారత్‌కు భారీ లక్ష్యం నిర్దేశించకుండా అడ్డుకున్నాడు. కెప్టెన్ మాటల్లో చెప్పాలంటే అది ‘ఎమ్మెస్ క్లాసిక్’... మరికొంత కాలం వరకు విమర్శకులకు ఎలాంటి అవకాశం ఇవ్వని ఇన్నింగ్స్‌తో ధోని తన విలువేంటో చూపించాడు. 42 డిగ్రీల తీవ్ర ఉష్ణోగ్రతలో 50 ఓవర్ల కీపింగ్ తర్వాత బ్యాటింగ్‌లో దాదాపు 20 ఓవర్లు నిలబడి టీమ్‌ను విజయతీరం చేర్చడంలో పాత ధోనిని గుర్తుకు తెచ్చాడు. వేడితో కుప్పకూలే స్థితిలోనూ సింగిల్స్ కోసం తగ్గని శైలితో పాటు సిక్సర్‌తో స్కోరును సమం చేయడం వరకు మాజీ కెప్టెన్ తన మహిమను చూపిస్తే... మరో ఎండ్‌లో కార్తీక్ ‘ఫినిషర్’ పాత్రను సమర్థంగా పోషించాడు. అడిలైడ్: సంక్రాంతి పండగ రోజున భారత క్రికెట్ జట్టు అభిమానులకు ఆనందాన్ని పంచింది. ఆసక్తికరంగా సాగిన పోరులో విజేతగా నిలిచి సిరీస్ ఫలితాన్ని ఆఖరి పోరు వరకు తీసుకెళ్లింది. మంగళవారం ఇక్కడ జరిగిన రెండో వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది.షాన్ మార్ష్ (123 బంతుల్లో 131; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీ సాధించగా, గ్లెన్ మ్యాక్స్‌వెల్ (37 బంతుల్లో 48; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్ (4/45) మెరుగైన ప్రదర్శన నమోదు చేయగా, షమీకి 3 వికెట్లు దక్కాయి. మరింత భారీ స్కోరు దిశగా దూసుకెళుతున్న దశలో భారత బౌలర్లు చెలరేగడంతో ఆసీస్ 3 పరుగులకే చివరి 4 వికెట్లు కోల్పోయింది. అనంతరం భారత్ 49.2 ఓవర్లలో 4 వికెట్లకు 299 పరుగులు సాధించింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ విరాట్ కోహ్లి (112 బంతుల్లో 104; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) శతకంతో చెలరేగాడు. మహేంద్ర సింగ్ ధోని (54 బంతుల్లో 55 నాటౌట్; 2 సిక్సర్లు), రోహిత్ శర్మ (52 బంతుల్లో 43; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. మూడు వన్డేల సిరీస్‌లో ప్రస్తుతం ఇరు జట్లు 1–1తో సమంగా నిలవగా... సిరీస్‌లో చివరి మ్యాచ్ శుక్రవారం జరుగుతుంది. మార్ష్ దూకుడు... ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ మరోసారి పేలవంగా ప్రారంభమైంది. భువీ చక్కటి బంతికి కెప్టెన్ ఫించ్ (6) బౌల్డ్ కావడంతో జట్టు తొలి వికెట్ కోల్పోయింది. తర్వాతి ఓవర్లోనే బౌన్సర్‌తో కారీ (18)ని షమీ ఔట్ చేశాడు. అయితే ఆ తర్వాత వరుసగా నాలుగు అర్ధ సెంచరీ భాగస్వామ్యాలు ఆసీస్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాయి. మార్‡్ష, ఉస్మాన్ ఖాజా (21) కలిసి చక్కటి సమన్వయంతో బ్యాటింగ్ చేశారు. వీరిద్దరు నిలదొక్కుకుంటున్న దశలో జడేజా అద్భుతమైన డైరెక్ట్ త్రోకు ఖాజా రనౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత కొద్ది సేపు మార్‡్షకు అండగా నిలిచిన హ్యాండ్స్కోంబ్ (20)...జడేజా బౌలింగ్‌లో స్వీప్‌కు ప్రయత్నించి స్టంపౌటయ్యాడు. ఆ తర్వాత మార్ష్ తో మరో కీలక భాగస్వామ్యం నెలకొల్పిన అనంతరం స్టొయినిస్ (29) కూడా వెనుదిరిగాడు. ఈ స్థితిలో ఆరో వికెట్‌కు షాన్ మార్ష్, మ్యాక్స్‌వెల్ కలిసి జోడించిన 94 పరుగులు ఆసీస్‌కు మెరుగైన స్కోరును అందించాయి. కుల్దీప్ ఓవర్లో వీరిద్దరు భారీ సిక్సర్లు బాదడంతో 16 పరుగులు రాగా, సిరాజ్ వేసిన తర్వాతి ఓవర్లో ఆసీస్ బ్యాట్స్‌మెన్ మూడు ఫోర్లు కొట్టారు. ఈ క్రమంలో 108 బంతుల్లో మార్ష్ శతకం పూర్తయింది. వీరిద్దరి జోరుతో 47 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ స్కోరు 281/5. అయితే ఇక్కడ ఆట మలుపు తిరిగింది. 48వ ఓవర్లో మ్యాక్స్‌వెల్, మార్ష్ లను ఔట్ చేసిన భువీ...చివరి ఓవర్లో సిడిల్ (0) వికెట్ కూడా తీశాడు. అంతకు ముందు ఓవర్లో రిచర్డ్సన్ (2)ను షమీ పెవిలియన్ పంపించాడు. ఫలితంగా 50వ ఓవర్లో వచ్చిన సిక్స్, ఫోర్ సహా చివరి 3 ఓవర్లలో ఆసీస్ 16 పరుగులు మాత్రమే చేయగలిగింది. సమష్టి భాగస్వామ్యాలు... ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ తరహాలోనే భారత్ బ్యాటింగ్‌లో కూడా నాలుగు అర్ధ సెంచరీ భాగస్వామ్యాలు ఉండటం విశేషం. ఐదో వికెట్ వరకు బ్యాట్స్‌మెన్ వరుసగా 47, 54, 59, 82, 57 పరుగులు జత చేయడం విశేషం. ఓపెనర్లు రోహిత్, ధావన్ (28 బంతుల్లో 32; 5 ఫోర్లు) దూకుడుగా ఆడి శుభారంభం అందించారు. స్వేచ్ఛగా ఆడిన ధావన్‌ను బెహ్రన్‌డార్ఫ్ ఔట్ చేయడంతో ఎనిమిదో ఓవర్లో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. కెప్టెన్‌తో కీలక భాగస్వామ్యం తర్వాత భారీ షాట్‌కు ప్రయత్నించి కొద్ది సేపటికే రోహిత్ కూడా వెనుదిరిగాడు. ఆ తర్వాత తడబడుతూనే ఇన్నింగ్స్ కొనసాగించిన రాయుడు (36 బంతుల్లో 24; 2 ఫోర్లు)ను మ్యాక్స్‌వెల్ వెనక్కి పంపించాడు. ఈ దశలో కెప్టెన్, మాజీ కెప్టెన్ పార్ట్నర్షిప్ జట్టును ముందుకు నడిపించింది. భారీ షాట్లు ఆడకపోయినా సింగిల్స్‌పైనే వీరిద్దరు దృష్టి పెట్టి చకచకా పరుగులు సాధించారు. సిడిల్ బౌలింగ్‌లో డీప్‌స్క్వేర్ లెగ్ దిశగా ఆడటంతో 108 బంతుల్లో కోహ్లి శతకం పూర్తయింది. ఆ వెంటనే అతని వికెట్ తీసిన ఆసీస్ గెలుపుపై ఆశలు పెంచుకుంది. అయితే ధోని, కార్తీక్ (14 బంతుల్లో 25 నాటౌట్; 2 ఫోర్లు) వారికి ఆ అవకాశం ఇవ్వలేదు. విరాట్ వెనుదిరిగాక విజయానికి 38 బంతుల్లో 57 పరుగులు చేయాల్సి ఉండగా మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే భారత్ లక్ష్యం చేరింది. సిరాజ్‌కు కలిసిరాని అరంగేట్రం హైదరాబాద్ పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ భారత్ తరఫున వన్డేలు ఆడిన 225వ ఆటగాడిగా గుర్తింపు పొందాడు. 2 అంతర్జాతీయ టి20లు ఆడిన అనంతరం అతనికి వన్డే అవకాశం దక్కింది. అయితే తొలి టి20లాగే తొలి వన్డే కూడా అతనికి చేదు అనుభవాన్నే మిగిల్చింది. అడిలైడ్ వన్డేలో 10 ఓవర్లలో 76 పరుగులిచ్చిన అతను ఒక్క వికెట్ కూడా తీయలేదు. భారత్ తరఫున కర్సన్ ఘావ్రీ (0/83) తర్వాత అరంగేట్రంలో అతి చెత్త ప్రదర్శన సిరాజ్‌దే. ఏడాది క్రితం తన తొలి టి20లో 4 ఓవర్లలో 53 పరుగులిచ్చి 1 వికెట్ తీసిన సిరాజ్... జోగీందర్ శర్మ (0/57) తర్వాత అరంగేట్రంలో రెండో చెత్త గణాంకాలు నమోదు చేసిన భారత బౌలర్‌గా నిలిచాడు. -
షాన్ మార్ష్ సెంచరీ
అడిలైడ్: భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ షాన్ మార్ష్ సెంచరీ సాధించాడు. 108 బంతుల్లో 10 ఫోర్లతో శతకం పూర్తి చేశాడు. వన్డేల్లో అతడికిది 7వ సెంచరీ. శతకంతో ఆసీస్ భారీ స్కోరుకు బాటలు వేశాడు మార్ష్. ఖవాజాతో కలిసి మూడో వికెట్‌కు 56 పరుగులు జోడించారు. హ్యాండ్స్కోంబ్తో కలిసి నాలుగో వికెట్‌కు 52 పరుగులు, స్టొయినిస్‌తో కలిసి ఐదో వికెట్‌కు 55 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆస్ట్రేలియా 44 ఓవర్లలో 247/5 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. -
130 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు
అడిలైడ్: ఆస్ట్రేలియాతో తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా బౌలర్లు పదునైన బంతులతో విజృంభించారు. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు జతగా పేసర్లు ఇషాంత్ శర్మ, బూమ్రాలు రాణించి ఆసీస్ టాపార్డర్‌ను నిలువరించారు. ఈ క్రమంలోనే షాన్ మార్ష్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. అది కూడా 130 ఏళ్ల తర్వాత చెత్త గణాంకాలను నమోదు చేయడం గమనార్హం. అడిలైడ్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఆఫ్ స్టంప్‌కి దూరంగా అశ్విన్ విసిరిన బంతిని షాన్ మార్ష్ హిట్ చేసేందుకు ప్రయత్నించగా.. బ్యాట్ అంచున తాకిన బంతి నేరుగా వెళ్లి వికెట్లను గిరాటేసింది. దాంతో రెండు పరుగుల వద్దే మార్ష్ పెవిలియన్ చేరాడు. ఇలా టెస్టుల్లో షాన్ మార్ష్ ఇలా సింగిల్ డిజిట్‌కే వరుసగా ఔటవడం ఇది ఆరోసారి. కాగా, 1888 తర్వాత ఆసీస్ టాప్-5 ఆటగాళ్లలో ఎవరూ వరుసగా ఆరు ఇన్నింగ్స్‌ల్లోనూ సింగిల్ డిజిట్‌కి ఔటయిన దాఖలా లేదు. పేలవ ఫామ్ కారణంగా విమర్శలు ఎదుర్కొంటున్న షాన్ మార్ష్ గత 13 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో కనీసం ఒక్కసారి కూడా 40కి మించి పరుగులు చేయలేదు. రెండో రోజు ఆట ముగిసేసమయానికి ఆసీస్ ఏడు వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. వరుస వికెట్లు కోల్పోయిన ఆసీస్‌ను ట్రావిస్ హెడ్(61 బ్యాటింగ్) ఆదుకోవడంతో తిరిగి తేరుకుంది. -
గెలుపు బాటలో ఆసీస్
సిడ్నీ: మార్ష్ సోదరులు షాన్, మిచెల్ అద్భుత సెంచరీలు చేయడంతో... యాషెస్ సిరీస్ చివరి టెస్టులో ఆస్ట్రేలియా విజయం ముంగిట నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌ను 649/7 వద్ద డిక్లేర్ చేసిన ఆస్ట్రేలియాకు 303 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది. ప్రస్తుతం జో రూట్ (42 బ్యాటింగ్), బెయిర్‌స్టో (17 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ మరో 210 పరుగులు వెనుకబడి ఉంది. ఈ మ్యాచ్ కాపాడుకోవాలంటే ఇంగ్లండ్ చివరి రోజు పూర్తిగా బ్యాటింగ్ చేయాల్సి ఉండగా... ఆసీస్ మరో ఆరు వికెట్లు తీస్తే నాలుగో విజయాన్ని ఖాయం చేసుకుంటుంది. ఓవర్‌నైట్‌స్కోరు 479/4తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా ఆటలో మార్ష్ సోదరుల బ్యాటింగే హైలైట్. అన్నదమ్ములిద్దరూ ఒకరిని మించి ఒకరు దూకుడుగా ఆడటంతో.. ఇంగ్లండ్ బౌలర్లు ప్రేక్షక పాత్ర వహించారు. ఈ క్రమంలో ముందు షాన్ మార్ష్ (291 బంతుల్లో 156; 18 ఫోర్లు)... ఆ తర్వాత మిచెల్ మార్ష్ (145 బంతుల్లో 101; 15 ఫోర్లు, 2 సిక్స్‌లు) శతకాలు పూర్తి చేసుకున్నారు. పాయింట్ దిశగా బంతిని పంపిన మిచెల్ మార్ష సెంచరీ సంబరాల్లో పడి రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. తొలి పరుగు పూర్తవగానే పిచ్ మధ్యలో సోదరుడిని హత్తుకొని రెండో పరుగు పూర్తి చేయడం మరిచాడు. అనంతరం షాన్ మార్ష్ గుర్తుచేయడంతో క్రీజులోకి చేరి బతికిపోయాడు. ► ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో అన్నదమ్ములు సెంచరీలు చేయడం ఇది మూడోసారి. గతంలో చాపెల్ సోదరులు గ్రెగ్, ఇయాన్ (1972లో)... ‘వా’ సోదరులు మార్క్, స్టీవ్ (2001లో)లు కూడా ఇంగ్లండ్ పైనే ఈ ఘనత సాధించడం విశేషం. ఓవరాల్‌గా టెస్టు క్రికెట్లో అన్నదమ్ములిద్దరూ ఒకే ఇన్నింగ్స్‌లో సెంచరీలు చేయడం ఇది ఎనిమిదో సారి. ► రెండో ఇన్నింగ్స్‌లో 4 పరుగుల వద్ద కుక్ టెస్టుల్లో 12 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ ఘనత సాధించిన ఆరో బ్యాట్స్‌మన్‌గా కుక్ రికార్డు నమోదు చేశాడు. ► గత 80 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా సిడ్నీలో ఆదివారం 47.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విపరీతమైన ఉక్కపోతతో ఇంగ్లండ్ బౌలర్లు ఉక్కిరిబిక్కిరయ్యారు. -
ఫాల్కనర్, షాన్ మార్ష్‌లకు నో ప్లేస్!
సిడ్నీ: ఆస్ట్రేలియా క్రికెటర్ల కాంట్రాక్ట్ జాబితాలో ఆల్ రౌండర్ జేమ్స్ ఫాల్కనర్ తో పాటు వెటరన్ బ్యాట్స్‌మన్ షాన్ మార్ష్‌కు చోటు దక్కలేదు. 2017-18 సంవత్సరానికిగాను ప్రకటించిన ఆటగాళ్ల కాంట్రాక్ట్ లిస్ట్‌లో వీరిద్దర్నీ పక్కన పెట్టేశారు. 2013 నుంచి ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల క్రికెట్ లో రెగ్యులర్ సభ్యునిగా కొనసాగుతున్న ఫాల్కనర్ కు చోటు దక్కకపోవడం ఆశ్చర్యకర పరిణామం. మరొకవైపు ఇటీవల భారత పర్యటనలో విశేషంగా రాణించి 19 వికెట్లు తీసిన స్టీవ్ ఓకీఫ్ కు కాంట్రాక్ట్ జాబితాలో చోటు దక్కుతుందని తొలుత భావించినా చివరకు అతనికి కూడా నిరాశే ఎదురైంది. ఇదిలా ఉంచితే ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో కొత్త ముఖం కార్ట్ రైట్ తో పాటు ఇంకా టెస్టుల్లో అరంగేట్రం చేయని ఫాస్ట్ బౌలర్ బిల్లీ స్టాన్ లేక్‌లకు కాంట్రాక్ట్ జాబితాలో చోటు దక్కడం ఇక్కడ విశేషం. రాబోవు ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాల సిరీస్‌లను దృష్టిలో ఉంచుకుని మాత్రమే 20 మందికి కాంట్రాక్ట్ జాబితాలో చోటు కల్పించినట్లు సీఏ సెలక్షన్ చైర్మన్ ట్రావెర్ హాన్స్ తెలిపారు. -
ఆసీస్... అతి జాగ్రత్తగా!
► ఇబ్బంది పెట్టిన భారత బౌలర్లు ► ఆదుకున్న రెన్షా, షాన్ మార్ష్ ► ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 237/6 ప్రస్తుత ఆధిక్యం 48 తొలి రోజు భారత బ్యాట్స్‌మెన్ పూర్తిగా చేతులెత్తేసినా రెండో రోజు ఆటలో మన బౌలర్లు ఆస్ట్రేలియాను కాస్త కట్టడి చేయగలిగారు. కచ్చితమైన బౌలింగ్‌తో వారి దూకుడును తగ్గించి ఆత్మరక్షణలో పడేశారు. స్పిన్నర్ రవీంద్ర జడేజా మూడు వికెట్లతో రెచ్చిపోగా... పేసర్లు ఉమేశ్, ఇషాంత్ శర్మ పరుగులను నియంత్రించారు. మొత్తంగా రెండో రోజు 197 పరుగులు మాత్రమే ఇవ్వగలిగిన భారత్‌కు మిగిలిన రోజుల్లో వరుణుడు కరుణించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే ఈ టెస్టు వారి చేతుల్లో నుంచి జారే పరిస్థితి ఉండదేమో! అటు తొలి రెండు సెషన్లు జాగ్రత్తగా ఆడిన ఆస్ట్రేలియా చివరి సెషన్లో మాత్రం కొంచెం పుంజుకోగలిగింది. యువ బ్యాట్స్‌మన్ రెన్షా మరోసారి తన ప్రతిభను చాటుకోగా షాన్ మార్ష్ నిలకడైన ఆటతో జట్టుకు అండగా నిలబడ్డాడు. అయితే దూకుడైన ఆటతో కనీసం వంద పరుగుల ఆధిక్యాన్ని సాధించి భారత్‌పై ఒత్తిడి పెంచుదామనుకున్న స్మిత్ సేనకు ఆ అవకాశం దక్కలేదు. ప్రస్తుతం 48 పరుగుల స్వల్ప ఆధిక్యంతో ఉన్న ఆసీస్‌కు మూడో రోజు ఆట కీలకం కానుంది. బెంగళూరు: రెండో రోజు భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగి భారీ స్కోరుతో ఒత్తిడి పెంచాలనుకున్న ఆస్ట్రేలియా... పూర్తిగా రక్షణాత్మక ఆటతీరుకే పరిమితమైంది. బ్యాటింగ్ చేసేందుకు పిచ్ అంతగా సహకరించకపోవడంతో ఆసీస్ ఆచితూచి ఆడింది. ఓపిగ్గా క్రీజులో నిలిచిన షాన్ మార్ష్ (197 బంతుల్లో 66; 4 ఫోర్లు), యువ ఓపెనర్ మ్యాట్ రెన్షా (196 బంతుల్లో 60; 5 ఫోర్లు, 1 సిక్స్) చక్కటి అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. ఫలితంగా రెండో టెస్టులో ఆదివారం ఆట ముగిసే సమయానికి ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 106 ఓవర్లలో 6 వికెట్లకు 237 పరుగులు చేసింది. వార్నర్ (67 బంతుల్లో 33; 3 ఫోర్లు) ఓ మాదిరిగా ఆడాడు. క్రీజులో వేడ్ (68 బంతుల్లో 25 బ్యాటింగ్; 2 ఫోర్లు), మిషెల్ స్టార్క్ (19 బంతుల్లో 14 బ్యాటింగ్; 2 ఫోర్లు) ఉన్నారు. ప్రస్తుతం ఆసీస్ 48 పరుగుల ఆధిక్యంలో ఉంది. స్పిన్నర్ రవీంద్ర జడేజా మూడు వికెట్లతో చెలరేగగా.. అశ్విన్, పేసర్లు ఉమేశ్, ఇషాంత్‌లకు తలా ఓ వికెట్ దక్కింది. సెషన్–1: భారత్ ఆధిపత్యం రెండో రోజు తొలి బంతినే ఓపెనర్ డేవిడ్ వార్నర్ బౌండరీగా మలిచి తమ ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. అయితే ఆట జరుగుతున్నకొద్దీ భారత బౌలర్లు పైచేయి సాధించారు. 22వ ఓవర్లో అశ్విన్ వేసిన అద్భుత బంతి సుడులు తిరుగుతూ ఆఫ్‌స్టంప్‌ను పడగొట్టడంతో విధ్వంసకర బ్యాట్స్‌మన్ వార్నర్ బౌల్డ్ అయ్యాడు. దీంతో తొలి వికెట్‌కు 52 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత బంతికే స్మిత్ (8) ఆడిన స్ట్రెయిట్ డ్రైవ్ బౌలింగ్ ఎండ్‌లో ఉన్న రెన్షా పక్కకు వెళ్లింది. దీన్ని అందుకోవడానికి అశ్విన్ వెళ్లగా రెన్షా అడ్డుగా నిలబడ్డాడు. దీంతో స్మిత్‌తో అశ్విన్.. బ్యాటింగ్ వైపు వెళ్లిన రెన్షాతో కోహ్లి వాగ్వాదానికి దిగారు. అయితే అంపైర్ కలుగజేసుకుని వివాదాన్ని సద్దుమణిచారు. ఇక 30వ ఓవర్లో స్మిత్ ఎల్బీ కోసం భారత్ రివ్యూకు వెళ్లినా నిరాశే ఎదురైంది. 38వ ఓవర్లో బరిలోకి దిగిన స్పిన్నర్ జడేజా కొద్దిసేపట్లోనే కీలకమైన స్మిత్ వికెట్ తీశాడు. బ్యాట్, ప్యాడ్‌కు తాకుతూ వెళ్లిన బంతిని కీపర్ సాహా తన ఎడమ వైపునకు పరిగెత్తుతూ సూపర్ డైవ్ క్యాచ్ తీసుకున్నాడు. పేసర్లు ఇషాంత్, ఉమేశ్ యాదవ్ తమ బౌన్స్‌తో ఇబ్బంది పెట్టినా వికెట్లు తీయలేకపోయారు. ఓవర్లు: 29, పరుగులు: 47, వికెట్లు: 2 సెషన్–2: రెన్షా, మార్ష్ నిలకడ లంచ్ బ్రేక్ అనంతరం టర్నింగ్ ట్రాక్‌పై అశ్విన్, జడేజా తమ బంతులతో మరింత ఇబ్బంది పెట్టారు. దీంతో రెన్షా, షాన్ మార్‡్ష భారీ షాట్లకు వెళ్లకుండా సింగిల్స్‌కే పరిమితమయ్యారు. 59వ ఓవర్లో ఉమేశ్ వేసిన బంతి మార్‡్ష బొటన వేలికి తాకుతూ కీపర్ చేతుల్లో పడింది. అయితే అంపైర్ నాటౌట్‌గా ప్రకటించగా... భారత్ రివ్యూ కోరలేదు. అటు అద్భుత డిఫెన్స్‌తో భారత బౌలర్లను విసిగించిన రెన్షా 183 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే జడేజా వేసిన 67వ ఓవర్ తొలి బంతిని సిక్సర్‌గా మలిచిన తను మూడో బంతిని అంచనా వేయడంలో బోల్తా పడ్డాడు. కచ్చితంగా ముందుకు వస్తాడని ఊహించిన జడేజా బంతిని లెగ్ సైడ్ వేశాడు. అలాగే వచ్చిన రెన్షా చివరి నిమిషంలో ప్యాడ్‌తో అడ్డుకుందామని భావించినా బంతి కీపర్ సాహా చేతుల్లోకి వెళ్లగా మెరుపు వేగంతో స్పందించిన అతను వికెట్లను గిరాటేశాడు. రెన్షా, మార్‡్ష మధ్య మూడో వికెట్‌కు 53 పరుగులు జత చేరాయి. ఆ తర్వాత హ్యాండ్స్కోంబ్ (16) ఫోర్లతో చెలరేగినా జడేజా బౌలింగ్‌లో తను ఆడిన షాట్‌ను మిడ్ వికెట్లో అశ్విన్ సూపర్ క్యాచ్ తీసుకున్నాడు. కింద పడే క్రమంలో బంతి చేజారినా తిరిగి తన భుజాలకు తాకి చేతుల్లోకి వచ్చింది. టీ విరామానికి ముందు చివరి బంతికి మిషెల్ మార్‡్షను ఇషాంత్ ఎల్బీగా అవుట్ చేశాడు. ఓవర్లు: 35, పరుగులు: 76, వికెట్లు: 3 సెషన్–3: స్వల్ప జోరు టీ బ్రేక్ అనంతరం షాన్ మార్ష్ రివ్యూ రూపంలో బతికిపోయాడు. 85వ ఓవర్లో ఉమేశ్ యాదవ్ బంతికి మార్‡్షను ఎల్బీగా అంపైర్ అవుటిచ్చాడు. అయితే మార్ష్ మాత్రం రివ్యూకు వెళ్లాడు. బంతి ఆఫ్ స్టంప్‌కు ఆవలగా వెళ్లడంతో మార్ష్ ను నాటౌట్‌గా ప్రకటించారు. ఆ తర్వాత ఓవర్లో మార్ష్ వికెట్ కోసమే ఇషాంత్ ఎల్బీ అప్పీల్ చేసినా అది నోబాల్‌గా తేలింది. ఇదే క్రమంలో మార్ష్ 162 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. 94వ ఓవర్లో వేడ్ ఎల్బీ అవుట్‌పై రివ్యూకు వెళ్లినా భారత్‌కు ఫలితం దక్కలేదు. నిలకడగా ఆడుతున్న మార్ష్ ను ఉమేశ్ యాదవ్ పెవిలియన్‌కు పంపాడు. అదే ఓవర్లో స్టార్క్ ఇచ్చిన క్యాచ్‌ను సాహా మిస్ చేశాడు. మరో వికెట్ పడకుండా ఆసీస్ తమ రెండో రోజును ముగించింది. ఓవర్లు: 26, పరుగులు: 74, వికెట్: 1 స్మిత్... ఇషాంత్ ‘సయ్యాట’ తొలి టెస్టు సెంచరీ హీరో కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను రెచ్చగొడుతూ పేసర్ ఇషాంత్ తన విచిత్ర హావభావాలతో ఆకట్టుకున్నాడు. ఇన్నింగ్స్ 27వ ఓవర్లో ఇషాంత్ వేసిన నాలుగో బంతిని స్మిత్ ఆడేందుకు ప్రయత్నించగా అది బ్యాట్ కింది నుంచి వెళ్లిపోయింది. ఇదే సమయంలో ఇషాంత్ తన కళ్లను, నోటిని పెద్దగా చేస్తూ తల ఊపుతూ స్మిత్‌ను వెక్కిరించాడు. వెంటనే ఐదో బంతిని ఎదుర్కొనేందుకు స్మిత్ వికెట్లకు కుడి వైపు జరిగి డిఫెన్స్ ఆడిన అనంతరం బ్యాట్‌ను ఝుళిపిస్తూ ఇషాంత్ వైపు రెండడుగులు వేస్తూ అరిచాడు. దీనికి దీటుగా స్పందించిన ఇషాంత్ మరోసారి తన విచిత్ర హావభావాలతో ఆట పట్టించాడు. ఈ రెండు సందర్భాల్లో వికెట్ల వెనకాల ఫీల్డింగ్ చేస్తూ ఇదంతా గమనిస్తున్న కోహ్లి ముసిముసి నవ్వులు నవ్వుకున్నాడు. అటు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి అభిమానులను ఆకట్టుకుంటోంది. ►8 టెస్టుల్లో వార్నర్ వికెట్‌ను అత్యధికంగా ఎనిమిది సార్లు తీసిన బౌలర్ అశ్విన్. అలాగే అన్ని ఫార్మాట్లలో కలిపి వార్నర్ వికెట్‌ను అశ్విన్ పది సార్లు పడగొట్టాడు. -
ఆస్ట్రేలియా శుభారంభం
తొలి ఇన్నింగ్స్‌లో 327/5 స్మిత్, మార్ష్ సెంచరీలు భారత్ ‘ఎ’తో ప్రాక్టీస్ మ్యాచ్ ముంబై: భారత పర్యటనను ఆస్ట్రేలియా ఆత్మవిశ్వాసంతో ప్రారంభించింది. భారత్ ‘ఎ’తో శుక్రవారం ప్రారంభమైన మూడు రోజుల మ్యాచ్‌లో ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌కు మంచి ప్రాక్టీస్ లభించింది. ఫలితంగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 90 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (161 బంతుల్లో 107; 12 ఫోర్లు, 1 సిక్స్), షాన్ మార్ష్ (173 బంతుల్లో 104; 11 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీలు సాధించారు. ప్రస్తుతం క్రీజ్‌లో మిషెల్ మార్ష్ (16 బ్యాటింగ్), వేడ్ (7 బ్యాటింగ్) ఉన్నారు. భారత యువ బౌలర్లు తొలి రోజు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. భారత్ ‘ఎ’ జట్టులోకి ఎంపికైన హైదరాబాద్ క్రికెటర్లు సిరాజ్, రాహుల్ సింగ్‌లకు ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగే అవకాశం మాత్రం దక్కలేదు. సైనీకి 2 వికెట్లు... టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్‌తో తొలి టెస్టు తుది జట్టులో ఉండే అవకాశం ఉన్న టాప్–5 బ్యాట్స్‌మెన్‌తో బరిలోకి దిగిన ఆసీస్... ప్రధాన పేసర్లు స్టార్క్, హాజల్‌వుడ్‌లకు ఈ మ్యాచ్‌లో విశ్రాంతినిచ్చింది. ఢిల్లీకి చెందిన పేసర్ నవదీప్ సైనీ ఆరంభంలోనే రెండు వికెట్లు పడగొట్టి ఆసీస్‌ను దెబ్బ తీశాడు. అతను వేసిన షార్ట్ బాల్‌ను వార్నర్ (30 బంతుల్లో 25; 4 ఫోర్లు) సరిగా ఆడలేకపోవడంతో ఎడ్జ్ తీసుకొని గాల్లో లేచిన బంతిని కీపర్ ఇషాన్ అందుకున్నాడు. మరి కొద్దిసేపటికే సైనీ బౌలింగ్‌లోనే దూరంగా వెళుతున్న బంతిని ఆడి రెన్షా (11) కీపర్‌కే క్యాచ్ ఇచ్చాడు. భారీ భాగస్వామ్యం... 55/2 స్కోరు వద్ద జత కలిసిన స్మిత్, షాన్‌మార్ష్ స్వేచ్ఛగా ఆడారు. వీరిద్దరు పేస్, స్పిన్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొన్నారు. ఒక్క ఓవర్ కూడా వేయకుండానే ఆఫ్ స్పిన్నర్ కృష్ణప్ప గౌతమ్ గాయంతో మ్యాచ్ నుంచి తప్పుకోగా... లెఫ్టార్మ్ స్పిన్నర్ షాబాజ్ నదీమ్ వీరిద్దరిని కట్టడి చేయడంలో విఫలమయ్యాడు. కెరీర్లో 100వ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడుతున్న స్మిత్... 154 బంతుల్లో 15వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మూడో వికెట్‌కు 40.5 ఓవర్లలో 156 పరుగులు జోడించిన అనంతరం స్మిత్ రిటైర్డ్ అవుట్‌గా తప్పుకున్నాడు. 88 పరుగుల వద్ద సైనీ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన షాన్ మార్ష్ కూడా కొద్ది సేపటికే కెరీర్లో 21వ శతకం అందుకొని స్వచ్ఛందంగా వెనుదిరిగాడు. మార్ష్ , హ్యాండ్స్కోంబ్ (70 బంతుల్లో 45; 3 ఫోర్లు) నాలుగో వికెట్‌కు 79 పరుగులు జత చేశారు. భారత్ కొత్త బంతిని తీసుకున్న తర్వాత తొలి ఓవర్లోనే హ్యాండ్స్‌కోంబ్‌ను పాండ్యా అవుట్ చేశాడు. చివర్లో మిషెల్ మార్ష్ వేడ్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా రోజును ముగించారు. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: వార్నర్ (సి) ఇషాన్ (బి) సైనీ 25; రెన్షా (సి) ఇషాన్ (బి) సైనీ 11; స్మిత్ (రిటైర్డ్ అవుట్) 107; షాన్ మార్‡్ష (రిటైర్డ్ అవుట్) 104; హ్యాండ్స్కోంబ్ (సి) పాంచల్ (బి) పాండ్యా 45; మిషెల్ మార్‡్ష (బ్యాటింగ్) 16; వేడ్ (బ్యాటింగ్) 7; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (90 ఓవర్లలో 5 వికెట్లకు) 327. వికెట్ల పతనం: 1–33; 2–55; 3–211; 4–290; 5–305. బౌలింగ్: అశోక్ దిండా 15.2–1–49–0; హార్దిక్ పాండ్యా 17–3–64–1; సైనీ 12.4–4–27–2; నదీమ్ 23–0–90–0; అఖిల్ హేర్వాడ్కర్ 11–0–48–0; శ్రేయస్ అయ్యర్ 7–0–32–0; ప్రియాంక్ పాంచల్ 4–0–11–0. -
స్మిత్, మార్ష్ సెంచరీలు
కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్, ఓపెనర్ షాన్ మార్ష్ సెంచరీలు సాధించారు. ఆట మూడో రోజు డ్రింక్స్ విరామ సమయానికి ఆసీస్ 3 వికెట్లు నష్టపోయి 275 పరుగులు చేసింది. మార్ష్ 281 బంతుల్లో 19 ఫోర్లతో 130 పరుగుల చేయగా, స్మిత్ 218 బంతుల్లో 10 ఫోర్లు, సిక్సర్ తో 119 పరుగులు సాధించాడు. వీరిద్దరూ రెండో వికెట్ కు 246 పరుగులు జత చేసి లంకపై ఏ వికెట్ కైనా మూడో అత్యుత్తమ భాగస్వామ్యాన్ని సాధించారు. మార్ష్ కు ఇది నాలుగో టెస్టు సెంచరీ కాగా, శ్రీలంకపై రెండోది. స్మిత్ 15వ టెస్టు సెంచరీ తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 355 పరుగులకు ఆలౌటైంది. మొదటి రెండు టెస్టుల్లో ఓటమి పాలైన ఆస్టేలియా ఈ మ్యాచ్ లో గెలిచి వైట్ వాష్ తప్పించుకోవాలన్న పట్టుదలతో ఆడుతోంది. -
మ్యాక్స్ వెల్, జాన్సన్ ఫైర్
న్యూఢిల్లీ: ఐపీఎల్-9 ఆరంభం నుంచి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వార్తల్లో ఉంటూ వస్తోంది. సరిగా రాణించడం లేదని మిల్లర్ ను తప్పించి సిరీస్ మధ్యలో మురళీ విజయ్ ను జట్టు కెప్టెన్ గా నియమించింది. బెంగళూరు చేతిలో ఒక్క పరుగు తేడాతో ఓడిపోవడంతో కోచ్ సంజయ్ బంగర్ ను జట్టు సహయజమాని ప్రీతి జింతా దూషిచింనట్టు వార్తలు వచ్చాయి. ఇదిలావుండగా షాన్ మార్ష్ ను స్వదేశానికి తిప్పి పంపడంపై ఓ ఆంగ్ల దినపత్రిక ఆసక్తికర కథనం ప్రచురించింది. గాయం కారణంగా అతడిని స్వదేశానికి పంపలేదని, సహచర ఆటగాడితో గొడవ పడినందుకే మార్ష్ ను తొలగించారని పేర్కొంది. డ్రెస్సింగ్ రూములో తోటి ఆటగాడిని అతడు కొట్టాడని వెల్లడించింది. దీనిపై 'కింగ్స్' ఆటగాళ్లు మ్యాక్స్ వెల్, మిచెల్ జాన్సన్ ఘాటుగా స్పందించారు. ఇవన్నీ చెత్త వార్తలు అంటూ మ్యాక్స్ వెల్ కొట్టిపారేశాడు. 'టీమ్మేట్ ను కొట్టినందుకే మార్ష్ ను స్వేదేశానికి పంపారంట. గాయపడినందుకు కాదంటా. ఇంతకన్నా జోక్ మరోటి ఉండదంటూ' ట్వీట్ చేశాడు. ఇలాంటి కథనం రాసినందుకు దీపాంకర్ లాహిరిని ఫిక్షన్ స్టోరీ రైటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇవ్వాలని జాన్సన్ ట్విటర్ లో పేర్కొన్నాడు. -
ఐపీఎల్ కు మరో క్రికెటర్ దూరం
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో గాయాల బారిన పడుతున్నఆస్ట్రేలియా ఆటగాళ్ల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే గాయం కారణంగా మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, జాన్ హాస్టింగ్స్లు ఐపీఎల్‌కు దూరం కాగా, మరో ఆసీస్ ఆటగాడు షాన్ మార్ష్ కూడా టోర్నీ నుంచి వైదొలిగాడు. కింగ్స్ పంజాబ్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న షాన్ మార్ష్ వెన్నుముక గాయం కారణంగా సోమవారం ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. దీంతో గాయాల కారణంగా ఐపీఎల్ నుంచి తప్పుకున్న విదేశీ ఆటగాళ్ల సంఖ్య ఎనిమిదికి చేరింది. అంతకుముందు లషిత్ మలింగా(ముంబై ఇండియన్స్), కెవిన్ పీటర్సన్(పుణె సూపర్ జెయింట్స్), డు ప్లెసిస్(పుణె సూపర్ జెయింట్స్), శామ్యూల్ బద్రి(ఆర్సీబీ)లు గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యారు. -
ఒకరికి జరిమానా, మరొకరికి వార్నింగ్
హైదరాబాద్: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ కు జరిమానా విధించారు. ఐపీఎల్ నిబంధనలు ఉల్లఘించినందుకు అతడిపై మ్యాచ్ రిఫరీ ఈ చర్య తీసుకున్నారు. మరో బ్యాట్స్ మన్ షాన్ మార్ష్ కు అధికారికంగా వార్నింగ్ ఇవ్వడంతో పాటు మందలించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ తో శనివారం జరిగిన మ్యాచ్ లో వీరిద్దరూ మైదానంలో అతిగా ప్రవర్తించినట్టు మ్యాచ్ రిఫరీ గుర్తించారు. ఈ మ్యాచ్ లో మ్యాక్స్ వెల్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేశాడు. మార్ష్ 40 పరుగులు సాధించాడు. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 5 వికెట్ల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ను చిత్తు చేసింది. -
ఖాజా ఇన్.. షాన్ మార్ష్ అవుట్
మెల్ బోర్న్: వెస్టిండీస్ తో శనివారం ఇక్కడ ఆరంభం కానున్నరెండో టెస్టు(బాక్సింగ్ డే టెస్టు) కు ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖాజా తిరిగి జట్టులోకి రాగా, షాన్ మార్ష్ కు విశ్రాంతి నిచ్చారు. ఇటీవల న్యూజిలాండ్ తో జరిగిన టెస్టు సిరీస్ లో ఖాజా గాయపడిన అనంతరం జట్టుకు దూరమయ్యాడు. ఆ సిరీస్ లో తొలి రెండు టెస్టుల్లో వరుస సెంచరీలతో రాణించిన ఖాజా.. ఆ తరువాత గాయపడ్డాడు. అయితే అతను తిరిగి కోలుకోవడంతో వెస్టిండీస్ తో జరుగనున్న రెండో టెస్టులో స్థానం కల్పించారు. ఈ క్రమంలోనే వెస్టిండీస్ తో జరిగిన తొలి టెస్టులో 182 పరుగులతో రాణించిన మార్ష్ కు విశ్రాంతినిచ్చారు. ఆ మ్యాచ్ లో మార్ష్-వోజస్ జోడి నాలుగో వికెట్ కు 449 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా తొలి టెస్టులో ఘోరంగా విఫలం చెంది తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న వెస్టిండీస్ కనీసం ఈ మ్యాచ్ లోనైనా పోరాడాలని భావిస్తుండగా, ఈ మ్యాచ్ లో కూడా విండీస్ ను మట్టికరిపించి సిరీస్ ను కైవసం చేసుకోవాలని ఆసీస్ యోచిస్తోంది. -
షాన్ మార్ష్‌కు చోటు
తొలి టెస్టుకు ఆసీస్ జట్టు అడిలైడ్: కెప్టెన్ మైకేల్ క్లార్క్ ఫిట్నె స్ ఇంకా సందేహంగానే ఉన్న నేపథ్యంలో భారత్‌తో జరిగే తొలి టెస్టుకు షాన్ మార్ష్‌ను ఆస్ట్రేలియా జట్టులోకి తీసుకున్నారు. ఈనెల 9 నుంచి అడిలైడ్‌లో ఈ మ్యాచ్ జరుగనుంది. అదనపు బ్యాట్స్‌మన్‌గా మార్ష్‌ను తీసుకోవాల్సిందిగా జాతీయ సెలక్షన్ ప్యానెల్ సూచించిందని క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. ఇప్పటికే 13 మందితో కూడిన జట్టులో షాన్ సోదరుడు మిచెల్ మార్ష్ కూడా ఉన్నాడు. 2002 అక్టోబర్‌లో వా సోదరులు కలిసి చివరిసారిగా టెస్టు ఆడారు. ఆ తర్వాత జట్టులో స్థానం దక్కించుకుంది మార్ష్ సోదరులు కావడం విశేషం. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న క్లార్క్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండే విషయంలో ఇంకా స్పష్టత లేదు. గాయం నుంచి కోలుకున్నప్పటికీ హ్యూస్ మరణానంతరం అతడు చికిత్స తీసుకోలేదు. మరోవైపు హ్యూస్ అంత్యక్రియల్లో పాల్గొన్న ఆసీస్ జట్టు గురువారం అడిలైడ్‌కు చేరుకుంది. ఆసీస్ జట్టు: క్లార్క్ (కెప్టెన్), హాడిన్, హ్యారిస్, హాజెల్‌వుడ్, జాన్సన్, లియోన్, మిచెల్ మార్ష్, షాన్ మార్ష్, రోజర్స్, సిడిల్, స్మిత్, వార్నర్, వాట్సన్. హ్యూస్ గౌరవార్థంగా టెస్టు ఆడాలి: లీమన్ ఫిలిప్ హ్యూస్ స్మృతులు వెంటాడుతుండగానే టెస్టు మ్యాచ్ ఆడాల్సి రావడం కాస్త కష్టమేనని ఆసీస్ జట్టు కోచ్ డారెన్ లీమన్ అంగీకరించారు. అయితే అడిలైడ్ మ్యాచ్‌ను అతడి గౌరవార్థంగా భావించాలని తమ ఆటగాళ్లకు సూచించారు. -
ఆసీస్ టెస్టు జట్టులో షాన్ మార్ష్
మెల్ బోర్న్: ఆస్ట్రేలియా టెస్టు జాబితాలో లెఫ్ట్ హ్యాండెడ్ ఆటగాడు షాన్ మార్ష్ కు స్థానం దక్కింది. టీమిండియాతో జరిగే నాలుగు టెస్టు మ్యాచ్ ల్లో భాగంగా తొలి టెస్టుకు తిరిగి షాన్ మార్ష్ కు స్థానం కల్పిస్తూ సీఏ(క్రికెట్ ఆస్ట్రేలియా) నిర్ణయం తీసుకుంది. మైకేల్ క్లార్క్ ఫిట్ నెస్ పై ఇంకా స్పష్టత రాకపోవడంతో అదనపు ఆటగాడిగా మార్ష్ ను ఎంపిక చేసినట్లు సెలెక్షన్ ప్యానెల్ తెలిపింది. ఈ నెల 9 వ తేదీ నుంచి అడిలైడ్ లో జరిగే తొలిటెస్టుకు సంబంధించి గురు, శుక్రవారాల్లో ఆస్ట్రేలియా టెస్ట్ స్వ్కాడ్ సమావేశమయ్యే అవకాశం ఉంది.