ఐపీఎల్ కు మరో క్రికెటర్ దూరం | Kings XI Punjab's Shaun Marsh out of IPL with back injury | Sakshi
Sakshi News home page

ఐపీఎల్ కు మరో క్రికెటర్ దూరం

Published Mon, May 2 2016 8:31 PM | Last Updated on Sun, Sep 3 2017 11:16 PM

ఐపీఎల్ కు మరో క్రికెటర్ దూరం

ఐపీఎల్ కు మరో క్రికెటర్ దూరం

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో గాయాల బారిన పడుతున్నఆస్ట్రేలియా ఆటగాళ్ల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే గాయం కారణంగా మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, జాన్ హాస్టింగ్స్లు ఐపీఎల్కు దూరం కాగా, మరో ఆసీస్ ఆటగాడు షాన్ మార్ష్ కూడా టోర్నీ నుంచి వైదొలిగాడు. కింగ్స్ పంజాబ్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న షాన్ మార్ష్ వెన్నుముక గాయం కారణంగా సోమవారం ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు.

 

దీంతో గాయాల కారణంగా ఐపీఎల్ నుంచి తప్పుకున్న విదేశీ ఆటగాళ్ల సంఖ్య ఎనిమిదికి చేరింది. అంతకుముందు లషిత్ మలింగా(ముంబై ఇండియన్స్), కెవిన్ పీటర్సన్(పుణె సూపర్ జెయింట్స్), డు ప్లెసిస్(పుణె సూపర్ జెయింట్స్), శామ్యూల్ బద్రి(ఆర్సీబీ)లు గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement