కింగ్స్ పంజాబ్ కోచ్ సెహ్వాగ్
న్యూఢిల్లీ: ఈ ఏడాది జరుగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11వ సీజన్‌కు కింగ్స్ పంజాబ్ కెప్టెన్‌గా రవిచంద్రన్ అశ్విన్‌ను ఎందుకు ఎంపిక చేయాల్సి వచ్చింది అనే దానిపై ఆ జట్టు హెడ్ కోచ్ వీరేంద్ర సెహ్వాగ్ వివరణ ఇచ్చాడు. అశ్విన్‌ను ఎంపిక చేయడానికి ఒకే ఒక్క ప్రధాన కారణం కొత్తదనం చూపించాలని అనుకోవడమేనని తెలిపాడు. అయితే తొలుత యువరాజ్ సింగ్‌కు సారథ్య బాధ్యతలు ఇద్దామని భావించినా.. చివరకు అశ్విన్ ఎంపికకే ఫ్రాంచైజీ మొగ్గు చూపిందన్నాడు. దీనిలో భాగంగా తొంభై శాతం మంది కింగ్స్ అభిమానులు మాత్రం యువీకి పగ్గాలు ఇవ్వడమే సరైన నిర్ణయమని చెప్పినట్లు సెహ్వాగ్ పేర్కొన్నాడు. కానీ, జట్టులో కాస్త భిన్నత్వం చూపించాలనే ఉద్దేశంతో అశ్విన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశామన్నాడు.
'నేను ఎప్పుడూ ఒక బౌలర్ కెప్టెన్‌గా ఉండాలనే కోరుకుంటా. ఆ క్రమంలోనే మాజీ కెప్టెన్లు వసీం అక్రమ్, వకార్ యూనిస్, కపిల్ దేవ్‌లకు నేనొక పెద్ద అభిమానిని. వారంతా దిగ్గజ బౌలర్లు.. అలానే వారి జట‍్లకు కెప్టెన్‌గా చేసి సక్సెస్ అయిన వారు కూడా. ఇదే తరహాలో అశ్విన్ కూడా కింగ్స్ పంజాబ్‌ను ముందుకు తీసుకెళతాడనే ఆశిస్తున్నా. ఈ సీజన్‌లో ఫైనల్‌కు చేరడమే మా లక్ష్యం' అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment