ఐపీఎల్-2024లో టీమిండియా వెటరన్, రాజస్తాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన అశ్విన్ కేవలం రెండు వికెట్లు మాత్రమే సాధించాడు. వికెట్లు విషయం పక్కన పెడితే తన బౌలింగ్‌లో భారీగా పరుగులు కూడా సమర్పించుకుంటున్నాడు.
8 మ్యాచ్‌ల్లో 9.00 ఏకానమీతో 278 పరుగులిచ్చాడు. ఈ క్రమంలో అశ్విన్‌పై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ విమర్శల వర్షం కురిపించాడు. తనే రాజస్తాన్ కోచ్‌గా గానీ మెంటార్ ఉండి ఉంటే అశ్విన్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు ఇచ్చేవాడిని కాదని సెహ్వాగ్ మండిపడ్డాడు.
"అశ్విన్ వైట్‌బాల్ క్రికెట్‌కు సెట్ కాడు. అశ్విన్‌కు మిడిల్ ఓవర్లలలో వికెట్లు తీసే సత్తా లేదు. గతంలో ఓసారి కేఎల్ రాహుల్ తన స్ట్రైక్ రేట్ గురించి ఎవరు ఏమనుకున్న పట్టించుకోని వ్యాఖ్యనించాడు. ఇప్పుడు అదే తరహాలో అశ్విన్ కూడా వికెట్లు తీయకపోతేనేం బాగానే బౌలింగ్ చేస్తున్నా కాదా అన్నట్లు మాట్లాడుతున్నాడు.
అశ్విన్ ఈ ఏడాది సీజన్‌లో ఇదే ప్రదర్శన కొనసాగిస్తే.. వచ్చే ఏడాది మెగా వేలంలో కచ్చితంగా అమ్ముడుపోడు. ఏ జట్టు అయినా బౌలర్‌ను సొంతం చేసుకున్నప్పుడు అతడి నుంచి వికెట్లు ఆశిస్తోంది. అంతేతప్ప 4 ఓవర్లలో 25 నుంచి 30 పరుగులు ఇస్తే చాలు అని ఏ జట్టు అనుకోదు .
రెండు లేదా మూడుసార్లు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలవాలని ఏ ప్రాంఛైజీనా భావిస్తోంది. అతడి సహచరలు చాహల్, కుల్దీప్ యాదవ్ ఈ ఏడాది సీజన్‌లో అద్బుతంగా రాణిస్తున్నాడు. అశ్విన్ ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేస్తే బ్యాటర్లు టార్గెట్ చేస్తారని, క్యారమ్ బాల్స్ వేయడానికి ప్రయత్నిస్తున్నాడు.
అందుకే అతడికి వికెట్లు పడడం లేదు. అతడు తన ఆఫ్ స్పిన్‌ను నమ్ముకుంటే వికెట్లు పడే ఛాన్స్ ఉంది. కానీ నేను రాజస్తాన్ ఫ్రాంచైజీకి మెంటార్ లేదా కోచ్‌గా ఉండి ఉంటే అతడి తుది జట్టులో చోటు దక్కేది కాదని క్రిక్ బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెహ్వాగ్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment