Kings punjab
-
వచ్చీ రావడంతోనే రికార్డు.. అత్యంత వేగంగా వంద వికెట్లు
ఐపీఎల్ 16వ సీజన్లో పంజాబ్ కింగ్స్ తరపున గురువారం కగిసో రబడా తొలి మ్యాచ్ ఆఢాడు. ఈ క్రమంలో వచ్చీ రావడంతోనే అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో సాహా వికెట్ తీయడం ద్వారా రబాడ ఐపీఎల్లో వందో వికెట్ సాధించాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా తక్కువ బంతుల్లో వంద వికెట్లు తీసిన బౌలర్‌గా రబాడ తొలి స్థానంలో నిలిచాడు. ఐపీఎల్లో వంద వికెట్లు సాధించేందుకు రబాడ 1438 బంతులు తీసుకున్నాడు. రబాడ తర్వాత మలింగ 1622 బంతుల్తో రెండో స్థానంలో ఉండగా.. డ్వేన్ బ్రావో 1619 బంతులతో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక నాలుగో స్థానంలో హర్షల్‌పటేల్ 1647 బంతులతో ఉన్నాడు. ఇక మ్యాచ్‌ల పరంగానూ అతి తక్కువ మ్యాచ్‌ల్లో వంద వికెట్లు సాధించిన బౌలర్‌గా రబాడ తొలి స్థానంలో ఉన్నాడు. రబాడ 64 మ్యాచ్‌ల్లో వంద వికెట్లు సాధించాడు. రబాడ తర్వాత మలింగ(70 మ్యాచ్‌లు), భువనేశ్వర్, హర్షల్ పటేల్‌లు 81 మ్యాచ్‌లు, రషీద్ ఖాన్, అమిత్ మిశ్రా, ఆశిష్ నెహ్రాలు 83 మ్యాచ్‌లు, యజ్వేంద్ర చహల్ 84 మ్యాచల్లో వంద వికెట్ల మార్క్‌ను చేరుకున్నాడు. 𝐴𝑎𝑡𝑒 ℎ𝑖 𝑑𝑖𝑙 𝑘ℎ𝑢𝑠ℎ 𝑘𝑎𝑟 𝑑𝑖𝑡𝑡𝑎, Rabada veere! 🙌 Kagiso Rabada is 🔙 with pace 🔥 as he brings up a 💯 wickets in #TATAIPL✨#PBKSvGT #IPLonJioCinema #IPL2023 | @KagisoRabada25 @PunjabKingsIPL pic.twitter.com/vnXHyt3quI — JioCinema (@JioCinema) April 13, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
PBKS Vs RR: వారిద్దరు ఓపెనర్స్‌గా వస్తే గెలుపు అవకాశాలు ఎక్కువ
దుబాయ్: ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్‌లో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. పాయింట్ల పట్టికలో ఆరు, ఏడు స్థానాల్లో ఉన్న ఈ రెండు జట్ల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా.. మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఫెవరెట్‌గా కనిపిస్తుందని అభిప్రాయపడ్డాడు. దీంతో పాటు ఈరోజు మ్యాచ్ ఆడనున్న పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ ఎలెవెన్‌ను ప్రకటించాడు. చదవండి: Gautam Gambhir: అయ్యో ఏంటిది గంభీర్.. నీ అంచనా తప్పింది.. పంజాబ్ కింగ్స్ తన ఓపెనర్లను మార్చాల్సిన అవసరం ఉందని తెలిపాడు. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ తరపున కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాలు ఓపెనర్లుగా వస్తున్నారు. కొన్ని సీజన్ల నుంచి వీరిద్దరి కాంబినేషన్ మంచి ఆరంభాలు ఇస్తుంది. అయితే క్రిస్‌గేల్‌ను ఓపెనర్‌గా పంపి.. మయాంక్‌ను మూడోస్థానంలో బ్యాటింగ్‌కు పంపిస్తే పంజాబ్‌కు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక నాలుగో స్థానంలో నికోలస్ పూరన్‌కు అవకాశం ఇవ్వాలి. ఇక ఏడో స్థానంలో క్రిస్ జోర్డాన్ స్థానంలో మొయిసెస్ హెన్రిక్స్‌కు అవకాశం ఇవ్వాలి. అతను ఏడో స్థానంలో వస్తే బ్యాటింగ్‌లో మెరుపులతో పాటు బౌలింగ్‌లోనూ ఉపయోగపడుతాడు. ఇక స్పిన్నర్‌గా రవి బిష్ణొయి అయితే బాగుంటుంది. ఆకాశ్ చోప్రా ప్లేయింగ్ ఎలెవెన్: క్రిస్ గేల్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, నికోలస్ పూరన్, దీపక్ హుడా, షారుఖ్ ఖాన్, మొయిసెస్ హెన్రిక్స్, నాథన్ ఎల్లిస్, రవి బిష్ణోయ్, మహమ్మద్ షమీ, అర్షదీప్ సింగ్ చదవండి: RCB Vs KKR: కోహ్లి డబుల్ సెంచరీ.. ఆర్సీబీ కెప్టెన్ ఖాతాలో మరో రికార్డు -
కోట్లు పెట్టి కొన్నాం, వదిలించుకోక తప్పదు!
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో దారుణంగా విఫలమైన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్, వెస్టిండీస్ బౌలర్ షెల్డన్ కాట్రెల్‌లపై వేటు వేసేందుకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సిద్ధమైంది. వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్‌కు మరో ఆరు నెలల సమయం మాత్రమే ఉండటంతో... ఈ ఏడాది జట్టు ప్రదర్శనపై పంజాబ్ యాజమాన్యం అప్పుడే సమీక్షను ఆరంభించింది. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్, హెడ్ కోచ్‌గా అనిల్ కుంబ్లేను కొనసాగించేందుకు సిద్ధమైంది. రాహుల్ ఈ ఏడాది అద్భుతంగా రాణించాడు. 14 మ్యాచ్‌ల్లో 55.83 సగటుతో 670 పరుగులు చేసి టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడికి ఇచ్చే ఆరెంజ్ క్యాప్‌ను గెల్చుకున్నాడు. ఇందులో ఒక సెంచరీ, ఐదు అర్ధ సెంచరీలు ఉండటం విశేషం. అంతేకాకుండా పంజాబ్ కోచ్‌గా తనకు తొలి ఏడాదే అయినా... జట్టును వరుస ఓటముల నుంచి గెలుపు బాట పట్టించిన కుంబ్లే పనితీరుపై పంజాబ్ సంతృప్తితోనే ఉంది. అయితే వేలంలో కోట్లు వెచ్చించి తెచ్చుకున్న మ్యాక్స్‌వెల్ (రూ.10.75 కోట్లు), కాట్రెల్ (రూ.8.5 కోట్లు) ప్రదర్శనలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న పంజాబ్... వారిని వదిలించుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. (చదవండి: నేను అలాంటి వాడిని కాదు: రోహిత్) మ్యాక్స్‌వెల్ ఆడిన 13 మ్యాచ్‌ల్లో కేవలం 108 పరుగులు మాత్రమే చేశాడు. మయాంక్ అగర్వాల్, నికోలస్ పూరన్, షమీ, గేల్, యువ లెగ్‌స్పిన్నర్ రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్‌లను కొనసాగించే వీలుంది. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్‌ను పటిష్టం చేసేలా కసరత్తులు ఆరంభించింది. ఈ సీజన్ తొలి అర్ధ భాగంలో కేవలం ఒకే విజయాన్ని నమోదు చేసిన పంజాబ్... అనంతరం వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో గెలిచి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించేలా కనిపించింది. అయితే చివరి రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడి ఇంటి దారి పట్టింది. (చదవండి: 100 బాల్స్.. 102 రన్స్.. నో సిక్సర్స్) -
ఎంఎస్ ధోని తొలిసారి..
అబుదాబి: ఈ ఐపీఎల్ సీజన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ ఆరు విజయాలతో ముగించింది. ఆదివారం కింగ్స్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే పంజాబ్ ప్లేఆఫ్స్ ఆశలకు సీఎస్కే గండికొట్టింది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన సీఎస్కే టోర్నీ నుంచి గౌరవంగా నిష్క్రమించింది. ఇదిలా ఉంచితే, ఈ సీజన్లో సీఎస్కే కెప్టెన్ 14 మ్యాచ్‌లకు గాను 12 ఇన్నింగ్స్‌లు ఆడి 199 పరుగులు చేశాడు. ఇది ధోని నుంచి వచ్చిన నిరాశజనకమైన ప్రదర్శన. అదే సమయంలో ఈ సీజన్లో ధోని ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. ఇలా తన ఐపీఎల్ కెరీర్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేకుండా ఒక సీజన్‌ను ముగించడం ఇదే తొలిసారి.ఇక వచ్చే ఏడాది ఐపీఎల్‌ను తాను ఆడతాననే విషయాన్ని ధోని స్పష్టం చేశాడు. టాస్ సమయంలో అతనికి ఎదురైన ప్రశ్నకు సమాధానంగా తాను ఇంకా ఆడతాననే సంకేతాలిచ్చాడు. ‘ యెల్లో జెర్సీలో ఇది మీ చివరి మ్యాచ్ కావొచ్చా?’ అని అడిగిన ప్రశ్నకు కచ్చితంగా కాదు అనే సమాధానాన్ని ధోని ఇచ్చాడు. ఈ సీజన్లో ధోని ఆకట్టుకోలేనంత మాత్రాన అతన్ని తక్కువగా అంచనా వేయొద్దని శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కార పేర్కొన్నాడు. ఏదో ఒక్క సీజన్ ప్రదర్శనతో ధోనిని తక్కువగా చూడాల్సిన అవసరం లేదన్నాడు. అతను చాలా స్ట్రాంగ్ ప్లేయర్ అని, వచ్చే సీజన్లో ధోని నుంచి మంచి ఇన్నింగ్స్‌లు వస్తాయని ఆశిస్తున్నానన్నాడు. -
కింగ్స్ పంజాబ్ కథ ముగిసె..
అబుదాబి: ఈ ఐపీఎల్ సీజన్లో కింగ్స్ పంజాబ్ కథ ముగిసింది. తాజాగా సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ పరాజయం చెందడంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. తద్వారా ప్లేఆఫ్స్ రేసు నుంచి ఔటైన రెండో జట్టుగా పంజాబ్ నిలిచింది. సీఎస్కేతో మ్యాచ్ లో పంజాబ్ ముందుగా బ్యాటింగ్ చేసి 153 పరుగుల స్కోరునే చేసింది. ఆ లక్ష్యాన్ని ధోని సేన 18.5 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. పంజాబ్ కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమి పాలుకావడంతో సీజన్‌ను భారంగా ముగించింది. టార్గెట్‌ను ఛేదించే క్రమంలో డుప్లెసిస్(48; 34 బంతుల్లో 4 ఫోర్లు, 2సిక్స్‌లు), రుతురాజ్ గైక్వాడ్(62 నాటౌట్;49 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్),,అంబటి రాయుడు(30 నాటౌట్; 30 బంతుల్లో 2 ఫోర్లులు రాణించి విజయంలో కీలక పాత్ర పోషించారు. పంజాబ్ టోర్నీ నుంచి నిష్క్రమించడంతో సన్‌రైజర్స్, రాజస్తాన్,కేకేఆర్‌లు బరిలో నిలిచాయి. మంగళవారం ముంబై ఇండియన్స్-సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగనున్న మ్యాచ్ తర్వాత ప్లేఆఫ్స్ బెర్తులు ఖరారు కానున్నాయి. ఈ రోజు రాజస్తాన్ వర్సెస్ కేకేఆర్ జట్లలో విజయం సాధించిన జట్టు ప్లేఆఫ్స్ రేసులో ఉంటుంది. కానీ లీగ్ దశలో చివరి రోజు వరకూ వేచి చూడక తప్పదు. సీఎస్కేతో మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కింగ్స్ పంజాబ్ 154 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్ గెలిచిన సీఎస్కే తొలుత ఫీల్డింగ్ ఎంచుకోవడంతో పంజాబ్ బ్యాటింగ్‌కు దిగింది. పంజాబ్ ఇన్నింగ్స్‌ను కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్‌లు ఆరంభించారు. ఈ జోడి తొలి వికెట్‌కు 48 పరుగులు జత చేసిన తర్వాత అగర్వాల్(26; 15 బంతుల్లో 5 ఫోర్లు) ఔటయ్యాడు. ఎన్గిడి బౌలింగ్‌లో అగర్వాల్ బౌల్డ్ అయ్యాడు. కాసేపటికి రాహుల్(29; 27 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా పెవిలియన్ చేరాడు. ఎన్గిడి బౌలింగ్‌లోనే రాహుల్ క్లీన్‌బౌల్డ్‌గా నిష్క్రమించాడు. ఇక క్రిస్ గేల్(12), పూరన్(2), మన్దీప్ సింగ్(14), నీషమ్(2)లు నిరాశపరచడంతో పంజాబ్ కష్టాల్లో పడింది. కానీ దీపక్ హుడా(62 నాటౌట్; 30 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) బ్యాట్ ఝుళిపించడంతో కింగ్స్ పంజాబ్ తేరుకుంది. సీఎస్కే బౌలర్లలో ఎన్గిడి మూడు వికెట్లు సాధించగా, తాహీర్, శార్దూల్ ఠాకూర్, జడేజాలు తలో వికెట్ సాధించారు. సీఎస్కే ఆరు విజయాలతో టోర్నీ నుంచి ముగించింది. ఇది సీఎస్కేకు వరుసగా మూడో విజయం కావడం విశేషం. -
అదరగొట్టిన దీపక్ హుడా
అబుదాబి: చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ 154 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్ గెలిచిన సీఎస్కే తొలుత ఫీల్డింగ్ ఎంచుకోవడంతో పంజాబ్ బ్యాటింగ్‌కు దిగింది. పంజాబ్ ఇన్నింగ్స్‌ను కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్‌లు ఆరంభించారు. ఈ జోడి తొలి వికెట్‌కు 48 పరుగులు జత చేసిన తర్వాత అగర్వాల్(26; 15 బంతుల్లో 5 ఫోర్లు) ఔటయ్యాడు. ఎన్గిడి బౌలింగ్‌లో అగర్వాల్ బౌల్డ్ అయ్యాడు. కాసేపటికి రాహుల్(29; 27 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా పెవిలియన్ చేరాడు. ఎన్గిడి బౌలింగ్‌లోనే రాహుల్ క్లీన్‌బౌల్డ్‌గా నిష్క్రమించాడు. ఇక క్రిస్ గేల్(12), పూరన్(2), మన్దీప్ సింగ్(14), నీషమ్(2)లు నిరాశపరచడంతో పంజాబ్ కష్టాల్లో పడింది. కానీ దీపక్ హుడా(62 నాటౌట్; 30 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) బ్యాట్ ఝుళిపించడంతో కింగ్స్ పంజాబ్ తేరుకుంది. సీఎస్కే బౌలర్లలో ఎన్గిడి మూడు వికెట్లు సాధించగా, తాహీర్, శార్దూల్ ఠాకూర్, జడేజాలు తలో వికెట్ సాధించారు. దీపక్ హుడా మెరుపులు.. పంజాబ్ టాపార్డర్ నుంచి పెద్దగా మెరుపులు లేని సమయంలో హుడా బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. క్రీజ్‌లో నిలదొక్కుకోవడమే కాకుండా షాట్ల ఎంపికలో నియంత్రణ పాటించాడు. ఏ గ్యాప్‌ల్లోకి ఆడితే పరుగులు సాధించవచ్చో చూసుకుంటూ షాట్లు ఆడాడు. పంజాబ్ శిబిరంలో ఆందోళన నెలకొన్న సమయంలో హుడా తన ఇన్నింగ్స్‌తో మెరిపించాడు. ఈ క్రమంలోనే 26 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇది ఐపీఎల్లో హుడాకు రెండో హాఫ్ సెంచరీ. కాగా, ఈ మ్యాచ్‌లో సాధించిన 62 పరుగులే అతని అత్యధిక వ్యక్తిగత స్కోరుగా నమోదైంది. ఇది పోరాడే స్కోరు కాబట్టి కింగ్స్ పంజాబ్ బౌలర్లు ఎంతవరకూ రాణిస్తారో చూడాలి. -
ధోని.. యెల్లో జెర్సీలో చివరి మ్యాచ్ ఇదేనా ?
అబుదాబి: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని ఇది తన చివరి ఐపీఎల్ కాదనే విషయాన్ని కుండబద్దలు కొట్టాడు. ఈ ఐపీఎల్ తర్వాత ధోని ఇక ఆడడని రూమర్లు పుట్టుకొచ్చిన నేపథ్యంలో దానిపై ధోని నుంచి స్పష్టత వచ్చింది. ఆదివారం కింగ్స్ పంజాబ్‌తో మ్యాచ్‌లో భాగంగా టాస్ వేయడానికి ధోని వచ్చిన సమయంలో దీనిపై క్లారిటీ వచ్చింది. టాస్ వేసిన తర్వాత న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ డానీ మోరిసన్ నుంచి ఒక ప్రశ్న దూసుకొచ్చింది. ‘ధోని.. యెల్లో జెర్సీలో చివరి మ్యాచ్ ఇదేనా?’ అంటూ అడిగాడు. దానికి అంతే వేగంగా ధోని బదులిచ్చాడు. ‘కచ్చితంగా కాదు’ అంటూ ధోని సమాధానమిచ్చాడు. దాంతో వరుసగా పుట్టుకొస్తున్న రూమర్లకు బ్రేక్ పడింది. వచ్చే ఐపీఎల్ కూడా తాను ఆడతాననే సంకేతాలిచ్చాడు ధోని. ఈ సీజన్లో లీగ్ దశ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా సీఎస్కే నిలిచింది. ఐపీఎల్ చరిత్రలో సీఎస్కే ప్లేఆఫ్స్‌కు చేరకుండా ఇంటిదారి పట్టడం ఇదే తొలిసారి. దాంతో ధోనిపై విమర్శలు వచ్చాయి. అదే సమయంలో ధోని ఐపీఎల్ రిటైర్మెంట్పై రూమర్లు చక్కర్లు కొట్టాయి. దీనికి ధోని ఇచ్చిన సమాధానంతో ముగింపు పడింది. అంతే కాకుండా ట్వీటర్లో ధోని సమాధానానికి ప్రశంసల వర్షం కురుస్తోంది. ధోని రిప్లై అదిరిందని సీఎస్కే అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కింగ్స్ పంజాబ్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని.. ముందుగా పంజాబ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ సీజన్లో ఇరుజట్ల మధ్య జరిగిన తొలి అంచె మ్యాచ్‌లో సీఎస్కే 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే తాజా మ్యాచ్ కింగ్స్ పంజాబ్‌కు కీలకం. రాహుల్ గ్యాంగ్ గెలిస్తేనే ప్లేఆఫ్స్ రేసులో ఉంటుంది. ఈ సీజన్లో ఇరుజట్లకు లీగ్ దశలో చివరి మ్యాచ్. -
రేసులో నిలవాలంటే ‘పంజా’ విసరాలి
అబుదాబి: కింగ్స్ పంజాబ్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని.. ముందుగా పంజాబ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ సీజన్లో ఇరుజట్ల మధ్య జరిగిన తొలి అంచె మ్యాచ్‌లో సీఎస్కే 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓవరాల్‌గా ఇరుజట్లు 22సార్లు ముఖాముఖి పోరులో తలపడితే అందులో సీఎస్కే 13సార్లు విజయం సాధించగా, పంజాబ్ 9సార్లు గెలుపొందింది. ఇక ఇప్పటికే సీఎస్కే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్ర్కమించగా, కింగ్స్ పంజాబ్ ఇంకా రేసులోనే ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే కింగ్స్ పంజాబ్ తన ప్లేఆఫ్స్ ఆశల్ని సజీవంగా ఉంచుకుంటుంది. సీఎస్కేపై గెలిచినా మెరుగైన రన్‌రేట్‌తో గెలవాలి. ఇంకా మూడు ప్లేఆఫ్స్ స్థానాలు ఖరారు కావాల్సి ఉంది. అందులో నాల్గో స్థానం కోసం విపరీతమైన పోటీ ఉంది. దాంతో పంజాబ్ కనీసం నాల్గో స్థానంలో ఉండాలంటే ధోని సేనపై భారీ విజయం సాధించాలి. (‘అందుకే ధోనికి బిగ్ ఫ్యాన్ అయ్యా’) ప్రస్తుతం కింగ్స్ పంజాబ్ ఆరు విజయాలు సాధించి 12 పాయింట్లతో కొనసాగుతోంది. ఇక్కడ రన్‌రేట్ -0.133గా ఉంది. అదే సమయంలో సన్‌రైజర్స్ కూడా 12 పాయింట్లతో రేసులోకి వచ్చేసింది. ఇక్కడ ఆరెంజ్ ఆర్మీ రన్‌రేట్ 0.555గా ఉంది. కింగ్స్ పంజాబ్ ఓ మంచి విజయాన్ని సాధిస్తేనే ప్లేఆఫ్స్ ఆశల్ని సజీవంగా ఉంచుకుంటుంది. నాల్గో స్థానం రేసులో సన్‌రైజర్స్, కింగ్స్ పంజాబ్, రాజస్తాన్ రాయల్స్‌ల మధ్య ఎక్కువ పోటీ ఉండవచ్చు. ఈ మ్యాచ్‌లో పంజాబ్ విజయం సాధించి, సన్‌రైజర్స్, రాజస్తాన్‌లు తమ తదుపరి మ్యాచ్‌ల్లో(చివరి మ్యాచ్‌ల్లో) గెలిచిన పక్షంలో ప్లేఆఫ్స్ రేసు ఆసక్తికరంగా ఉంటుంది. అవన్నీ దృష్టిలో పెట్టుకునే కింగ్స్ పంజాబ్ ఆడాల్సి ఉంటుంది. మరొకవైపు ధోని అండ్ గ్యాంగ్ కూడా వరుస విజయాలతో టచ్‌లోకి రావడం పంజాబ్‌ను కలవరపరుస్తోంది. (‘శ్రేయస్ అయ్యర్ గ్యాంగ్‌కు ప్లేఆఫ్స్ చాన్స్ కష్టమే’) గత ఐదు మ్యాచ్‌లకు గాను కింగ్స్ పంజాబ్ నాలుగు విజయాలు సాధించగా, సీఎస్కే రెండు విజయాలే సాధించింది. కింగ్స్ పంజాబ్ ఆడిన గత మ్యాచ్‌లో ఓటమి పాలైంది. రాజస్తాన్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో పంజాబ్ ఏడు వికెట్ల తేడాతో పరాజయం చవిచూసింది. దాంతో పంజాబ్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. కాగా, ఇరుజట్లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కేఎల్ రాహుల్(641-పంజాబ్), డుప్లెసిస్(401-సీఎస్కే), మయాంక్ అగర్వాల్(398- పంజాబ్), నికోలస్ పూరన్(351-పంజాబ్), అంబటి రాయుడు(329-సీఎస్కే)లు టాప్ ఫెర్ఫార్మెర్స్‌గా ఉన్నారు. ఇక బౌలింగ్ విభాగంలో అత్యధిక వికెట్లు సాధించిన జాబితాలో మహ్మద్ షమీ(20-పంజాబ్), సామ్ కరాన్(13-సీఎస్కే), రవి బిష్నోయ్(12-పంజాబ్), దీపక్ చాహర్(12-సీఎస్కే), మురుగన్ అశ్విన్(10-పంజాబ్)లు వరుసగా ఉన్నారు. -
‘శ్రేయస్ అయ్యర్ గ్యాంగ్‌కు ప్లేఆఫ్స్ చాన్స్ కష్టమే’
దుబాయ్: ఈ ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్ చేరడం కష్టమని శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కార అభిప్రాయపడ్డాడు. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ ఘోర పరాజయం చవిచూడటం కంటే ముందుగానే సంగక్కార ఈ వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ -2020 స్టార్ స్పోర్ట్స్ కామెంటరీ ప్యానల్లో జాయిన్ అయిన సంగక్కార లైవ్ షోలో మాట్లాడుతూ శ్రేయస్ అయ్యర్ అండ్ గ్యాంగ్ బ్యాటింగ్‌పై ఆందోళన వ్యక్తం చేశాడు. ఢిల్లీ పేలవమైన బ్యాటింగ్‌ను చూస్తుంటే ఆ జట్టు టాప్-4లో నిలవడం చాలా కష్టమన్నాడు. ('నేను బౌలింగ్‌కు వస్తే గేల్ సెంచరీ చేయలేడు') ‘ఢిల్లీ టాపార్డర్ బ్యాటింగ్‌లో నిలకడ కనిపించడం లేదు. వారి టాపార్డర్ రాణిస్తేనే ప్లేఆఫ్ ఆశలు పెట్టుకోవచ్చు. గ్యారంటీగా ఢిల్లీ ప్లేఆఫ్స్‌కు చేరుతుందని చెప్పలేను. ప్రస్తుత పరిస్థితుల్లో ఢిల్లీ ప్లేఆఫ్ చాన్స్‌లు చాలా తక్కువ. ఇప్పటికే ముంబై ప్లేఆఫ్స్‌కు చేరింది. ఆర్సీబీ ప్లేఆఫ్‌కు చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదే సమయంలో కింగ్స్ పంజాబ్ కూడా టాప్-4లో ఉంటుందనే అనుకుంటున్నా. కానీ ప్లేఆఫ్ స్థానం దక్కించుకునే నాల్గో జట్టు ఏదో చెప్పడం నాకు కష్టంగా ఉంది’ అని సంగక్కరా అభిప్రాయపడ్డాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ దారుణమైన ఓటమి చవిచూసింది. దాంతో ఆ జట్టు నెట్‌రన్‌రేట్ మైనస్‌లోకి వెళ్లిపోయింది. అటు తొలుత బ్యాటింగ్‌లో నిరాశపరిచిన ఢిల్లీ, బౌలింగ్‌లో కూడా రాణించలేదు. దాంతో ముంబై ఇండియన్స్ ఈజీ విక్టరీని నమోదు చేసింది. ఢిల్లీ నిర్దేశించిన 111 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ముంబై అలవోకగా ఛేదించింది. ఓపెనర్లు ఇషాన్ కిషాన్(72 నాటౌట్; 47 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) కీలక పాత్ర పోషించాడు. (టాప్ లేపిన ముంబై.. చిత్తుగా ఓడిన ఢిల్లీ) -
బ్యాట్ విసిరేసిన గేల్..
అబుదాబి: రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ ఓటమి పాలైంది. కాగా, ఈ మ్యాచ్‌లో గేల్ సెంచరీని తృటిలో కోల్పోయాడు. 63 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్స్‌లతో 99 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. జోఫ్రా ఆర్చర్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్ నాల్గో బంతికి గేల్ బౌల్డ్ అయ్యాడు. బంతి బ్యాట్ ఇన్సైడ్ ఎడ్జ్‌ను తాకుతూ వెళ్లి వికెట్లను గిరాటేసింది. దాంతో అసహనానికి గురైన గేల్ బ్యాట్‌ను విసిరేశాడు. సెంచరీ ముందు ఔట్ కావడంతో గేల్ తన కోపాన్ని ఆపుకోలేకపోయాడు. ఇలా నెర్వస్ నైన్టీస్లో పెవిలియన్ చేరడం, అందులోనే కేవలం పరుగు మాత్రమే కావాల్సిన తరుణంలో బౌల్డ్ కావడంతో గేల్ ఆ కోపాన్ని బ్యాట్‌పై చూపించాడు. ఆ తర్వాత తేరుకున్న గేల్ బ్యాట్ తీసుకుని వెళ్లి ఆర్చర్‌ను అభినందించాడు. కింగ్స్ పంజాబ్ నిర్దేశించిన 186 పరుగుల టార్గెట్‌ను రాజస్తాన్ 17.3 ఓవర్లో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. బెన్‌స్టోక్స్(50;26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), సంజూ శాంసన్((48; 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) కీలక పాత్ర పోషించగా, రాబిన్ ఊతప్ప(30; 23 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) ఆకట్టుకున్నాడు. చివర్లో స్టీవ్ స్మిత్(31 నాటౌట్; 20 బంతుల్లో 5 ఫోర్లు), బట్లర్( 22 నాటౌట్;11 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) బ్యాట్ ఝుళిపించడంతో రాజస్తాన్ ఇంకా ఓవర్ ఉండగానే విజయం సాధించింది. దాంతో ఈ సీజన్లో కింగ్స్ పంజాబ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ రాజస్తాన్ విజయం సాధించినట్లయ్యింది. లక్ష్య ఛేదనలో స్టోక్స్, ఊతప్పలు రాజస్తాన్ ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించారు. ఈ జోడి 5.3 ఓవర్లలో 60 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పి మంచి ఆరంభాన్ని ఇచ్చింది. ప్రధానం స్టోక్స్ దూకుడుగా ఆడి విలువైన పరుగులు సాధించాడు. కాగా, హాఫ్ సెంచరీ సాధించిన తర్వాత స్టోక్స్ ఔట్ కాగా, ఊతప్ప, సంజూ శాంసన్‌లు స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు. శాంసన్ కీలక ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ప్రతీ వికెట్‌కు విలువైన భాగస్వామ్యం సాధించడంతో రాజస్తాన్ అవలీలగా గెలిచింది. -
కింగ్స్ పంజాబ్‌కు బ్రేక్
అబుదాబి: ఈ ఐపీఎల్ సీజన్లో కింగ్స్ పంజాబ్ జైత్రయాత్రకు బ్రేక్‌పడింది. వరుసగా ఐదు విజయాలు సాధించి మంచి ఊపు మీద ఉన్న కింగ్స్ పంజాబ్‌కు రాజస్తాన్ రాయల్స్ అడ్డుకట్టవేసింది. కింగ్స్ పంజాబ్ నిర్దేశించిన 186 పరుగుల టార్గెట్‌ను రాజస్తాన్ 17.3 ఓవర్లో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. బెన్‌స్టోక్స్(50;26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), సంజూ శాంసన్((48; 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) కీలక పాత్ర పోషించగా, రాబిన్ ఊతప్ప(30; 23 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) ఆకట్టుకున్నాడు. చివర్లో స్టీవ్ స్మిత్(31 నాటౌట్; 20 బంతుల్లో 5 ఫోర్లు), బట్లర్( 22 నాటౌట్;11 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) బ్యాట్ ఝుళిపించడంతో రాజస్తాన్ 15 బంతులు ఉండగానే విజయం సాధించింది. దాంతో ఈ సీజన్లో కింగ్స్ పంజాబ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ రాజస్తాన్ విజయం సాధించినట్లయ్యింది. (ప్లేఆఫ్స్ రేసు: ఎవరికి ఎంత అవకాశం?) లక్ష్య ఛేదనలో స్టోక్స్, ఊతప్పలు రాజస్తాన్ ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించారు. ఈ జోడి 5.3 ఓవర్లలో 60 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పి మంచి ఆరంభాన్ని ఇచ్చింది. ప్రధానం స్టోక్స్ దూకుడుగా ఆడి విలువైన పరుగులు సాధించాడు. కాగా, హాఫ్ సెంచరీ సాధించిన తర్వాత స్టోక్స్ ఔట్ కాగా, ఊతప్ప, సంజూ శాంసన్‌లు స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు. శాంసన్ కీలక ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ప్రతీ వికెట్‌కు విలువైన భాగస్వామ్యం సాధించడంతో రాజస్తాన్ అవలీలగా గెలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కింగ్స్ పంజాబ్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. క్రిస్ గేల్ (99; 63 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్స్‌లు), కేఎల్ రాహుల్(46;41 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు)లు రాణించడంతో పాటు పూరన్(22; 10 బంతుల్లో 3 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించడంతో పంజాబ్ పోరాడే స్కోరును బోర్డుపై ఉంచింది. రాజస్తాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో కింగ్స్ పంజాబ్ బ్యాటింగ్‌కు దిగింది. పంజాబ్ ఇన్నింగ్స్‌ను రాహుల్, మన్దీప్ సింగ్‌లు ఆరంభించారు. కాగా, ఆడిన తొలి బంతికి మన్దీప్ సింగ్ గోల్డెన్ డక్ అయ్యాడు. ఆర్చర్ వేసిన తొలి ఓవర్ ఆఖరి బంతికి మన్దీప్.. స్టోక్స్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అనంతరం పంజాబ్ ఇన్నింగ్స్‌ను రాహుల్, గేల్లు నడిపించారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 120 పరుగులు జోడించడంతో కింగ్స్ గాడిలో పడింది. ఈ జోడి తమదైన శైలిలో రాజస్తాన్‌పై ఎదురుదాడి చేస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. ప్రధానంగా రాహుల్ ఔటైన తర్వాత గేల్ చెలరేగి ఆడాడు. పూరన్‌తో కలిసి 41 పరుగుల భాగస్వామ్యం, మ్యాక్స్‌వెల్‌తో కలిసి 22 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేశాడు గేల్. కాగా, సెంచరీ పరుగు దూరంలో గేల్ షాట్ ఆడబోయి ఔటయ్యాడు. ఆర్చర్ వేసిన ఆఖరి ఓవర్ నాల్గో బంతి గేల్ బ్యాట్‌ను తాకి వికెట్ల గిరాటేయడంతో పెవిలియన్ చేరాడు. -
క్రిస్ గేల్ మెరుపులు
అబుదాబి: రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ 186 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. క్రిస్ గేల్ (99; 63 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్స్‌లు), కేఎల్ రాహుల్(46;41 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు)లు రాణించడంతో పాటు పూరన్(22; 10 బంతుల్లో 3 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించడంతో పంజాబ్ పోరాడే స్కోరును బోర్డుపై ఉంచింది. రాజస్తాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో కింగ్స్ పంజాబ్ బ్యాటింగ్‌కు దిగింది. పంజాబ్ ఇన్నింగ్స్‌ను రాహుల్, మన్దీప్ సింగ్‌లు ఆరంభించారు. కాగా, ఆడిన తొలి బంతికి మన్దీప్ సింగ్ గోల్డెన్ డక్ అయ్యాడు. ఆర్చర్ వేసిన తొలి ఓవర్ ఆఖరి బంతికి మన్దీప్.. స్టోక్స్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అనంతరం పంజాబ్ ఇన్నింగ్స్‌ను రాహుల్, గేల్లు నడిపించారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 120 పరుగులు జోడించడంతో కింగ్స్ గాడిలో పడింది. ఈ జోడి తమదైన శైలిలో రాజస్తాన్‌పై ఎదురుదాడి చేస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. ప్రధానంగా రాహుల్ ఔటైన తర్వాత గేల్ చెలరేగి ఆడాడు. పూరన్‌తో కలిసి 41 పరుగుల భాగస్వామ్యం, మ్యాక్స్‌వెల్‌తో కలిసి 22 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేశాడు గేల్. కాగా, సెంచరీ పరుగు దూరంలో గేల్ షాట్ ఆడబోయి ఔటయ్యాడు. ఆర్చర్ వేసిన ఆఖరి ఓవర్ నాల్గో బంతి గేల్ బ్యాట్‌ను తాకి వికెట్ల గిరాటేయడంతో పెవిలియన్ చేరాడు. కింగ్స్ పంజాబ్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. -
కింగ్స్ పంజాబ్ జైత్రయాత్ర కొనసాగేనా?
అబుదాబి: ఈ ఐపీఎల్ సీజన్లో భాగంగా కింగ్స్ పంజాబ్‌తో జరుగుతున్న రెండో అంచె మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ముందుగా కింగ్స్ పంజాబ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ సీజన్లో కింగ్స్ పంజాబ్‌తో జరిగిన తొలి అంచె మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 224 టార్గెట్‌ను నిర్దేశించగా, రాజస్తాన్ 19.3 ఓవర్లలో దాన్ని ఛేదించింది. ఇక ఓవరాల్‌గా ఇరుజట్ల మధ్య 20 మ్యాచ్‌లు జరగ్గా అందులో రాజస్తాన్ 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, కింగ్స్ పంజాబ్ 9 మ్యాచ్‌ల్లో గెలిచింది. (ఈపీఎల్‌ను దాటేసిన ఐపీఎల్!) ప్రస్తుతం కింగ్స్ పంజాబ్ పాయింట్ల పట్టికలో నాల్గో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకూ 12 పాయింట్లు సాధించింది కింగ్స్ పంజాబ్. వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో విజయం సాధించడంతో కింగ్స్ పంజాబ్ కూడా బరిలో నిలిచింది. ఇప్పుడు కింగ్స్ పంజాబ్ మరో విజయం సాధించి జైత్రయాత్రను కొనసాగించాలని చూస్తోంది. ఇక రాజస్తాన్ పరిస్థితి మెరుగ్గా లేదు. ఐదు మ్యాచ్‌ల్లో గెలిచి 10 పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతోంది. ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే రాజస్తాన్ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో(ఈ మ్యాచ్‌తో కలుపుకుని) భారీ విజయాలు సాధించాలి. అప్పుడే అవకాశం ఉంటుంది. మరొకవైపు మిగిలిన రెండు మ్యాచ్‌లో గెలిస్తే కింగ్స్ పంజాబ్ ప్లేఆఫ్‌కు చేరుతుంది. ఒక మ్యాచ్‌లో ఓడి ఒక మ్యాచ్‌లో గెలిచినా రేసులో ఉంటుంది. కానీ మిగిలిన జట్ల ఫలితాలపై కింగ్స్ పంజాబ్ ఆధారపడాల్సి ఉంటుంది. కాగా, ఇక్కడ కేకేఆర్ కంటే కింగ్స్ పంజాబ్ రన్‌రేట్ బాగుండటం వారికి సానుకూలాంశం. సన్‌రైజర్స్ రన్‌రేట్‌తో పోలిస్తే కింగ్స్ పంజాబ్ రన్‌రేట్ బాలేదు. ఈ రెండు జట్ల మధ్యే నాలుగో స్థానం కోసం అధికపోటీ ఉండవచ్చు. (ప్లేఆఫ్స్ రేసు: ఎవరికి ఎంత అవకాశం?) ఇక ఇరుజట్లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కేఎల్ రాహుల్(595-కింగ్స్ పంజాబ్), మయాంక్ అగర్వాల్(398-కింగ్స్ పంజాబ్), నికోలస్ పూరన్(329-కింగ్స్ పంజాబ్), సంజూ శాంసన్(326-రాజస్తాన్), స్టీవ్ స్మిత్(276-రాజస్తాన్)లు వరుస స్థానాల్లో ఉన్నారు. ఇరుజట్లలో అత్యధిక వికెట్ల తీసిన జాబితాలో మహ్మద్ షమీ(20-కింగ్స్ పంజాబ్), జోఫ్రా ఆర్చర్(17-రాజస్తాన్), రవిబిష్నోయ్(12- కింగ్స్ పంజాబ్), శ్రేయస్ గోపాల్(9- రాజస్తాన్), మురుగన్ అశ్విన్(9-కింగ్స్ పంజాబ్)లు వరుసగా ఉన్నారు. కింగ్స్ పంజాబ్ కేఎల్ రాహుల్(కెప్టెన్), మన్దీప్ సింగ్, క్రిస్ గేల్, నికోలస్ పూరన్, మ్యాక్స్‌వెల్, దీపక్ హుడా, క్రిస్ జోర్డాన్, మురుగన్ అశ్విన్, రవి బిష్నోయ్, మహ్మద్ షమీ, అర్షదీప్ సింగ్ రాజస్తాన్ స్టీవ్ స్మిత్(కెప్టెన్), రాబిన్ ఊతప్ప, బెన్ స్టోక్స్, సంజూ శాంసన్, జోస్ బట్లర్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, జోఫ్రా ఆర్చర్, శ్రేయస్ గోపాల్, వరుణ్ ఆరోన్, కార్తీక్ త్యాగి -
ప్లేఆఫ్స్ రేసు: ఎవరికి ఎంత అవకాశం?
దుబాయ్: ఈ ఐపీఎల్ సీజన్లో ప్లేఆఫ్‌కు వెళ్లిన తొలి జట్టుగా డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ నిలిచింది. ఇక గతేడాది రన్నరప్ సీఎస్కే.. ఈ ఐపీఎల్లో లీగ్ దశలో నిష్క్రమించిన తొలి జట్టు. ఆర్సీబీతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో గెలిచిన ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ బెర్తును దాదాపు ఖాయం చేసుకోగా, నిన్న(గురువారం) కోల్‌కతా నైట్‌రైడర్స్ జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే విజయం సాధించడంతో ముంబై ప్లే ఆఫ్‌కు చేరింది. ఇక్కడ కేకేఆర్ ఓటమి చెందడంతోనే ముంబై నేరుగా ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అయిన మొదటి జట్టుగా నిలిచింది. వారి రన్‌రేట్ కూడా అన్ని జట్లు కంటే మెరుగ్గా ఉంది. ముంబై 1.186 రన్‌రేట్‌తో ఉంది. దాంతో వారు లీగ్ దశను టాప్-2తో ముగించే అవకాశం ఉంది. ప్రస్తుతం 16 పాయింట్లలతో ఉన్న ముంబైకు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ జట్లతో తలపడనుంది. (ఐపీఎల్ ప్లేఆఫ్స్ షెడ్యూల్ ఇదే..) కేకేఆర్.. కేకేఆర్ ప్లేఆఫ్ ఆశలు దాదాపు అడుగు అంటి పోయాయి. కేకేఆర్ ఇప్పటివరకూ 13 మ్యాచ్‌లాడి 12 పాయింట్లతో ఉంది. టాప్-4లో నిలవడానికి కేకేఆర్‌కు పాయింట్ల పరంగా అవకాశం ఉన్నా నెట్రన్ రేట్ వారి బెర్తుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆదివారం రాజస్తాన్ రాయల్స్‌తో జరుగనున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ భారీ తేడాతో గెలిస్తేనే ప్లే ఆఫ్ రేసులో ఉంటుంది. ప్రస్తుతం కేకేఆర్ నెట్రన్ రేట్ -0.467గా ఉంది. ఒకవేళ తన చివరి మ్యాచ్‌లో కేకేఆర్ గెలిచి 14 పాయింట్లతో నిలిచినా వారిపై నెట్‌రన్‌రేట్ ప్రభావం చూపనుంది. లీగ్ దశలో కేకేఆర్‌కు ఒక మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. కింగ్స్ పంజాబ్ ఈ సీజన్ ఆరంభంలో వరుస మ్యాచ్‌ల్లో చతికిలబడి ఒక్కసారి రేసులో వచ్చిన జట్టు ఏదైనా ఉందంటే అది కింగ్స్ పంజాబ్. తొలి అంచెలో విజయానికి చాలా దగ్గరగా వచ్చి పలు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైన కింగ్స్ పంజాబ్.. రెండో అంచెలో తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో విజయాలతో దుమ్మురేపింది. మొత్తంగా ఆరు మ్యాచ్‌ల్లో విజయం సాధించి 12 పాయింట్లతో ఉంది. ఆ జట్టు రన్‌రేట్ -0.049గా ఉంది. ఆ జట్టు ఇంకా రాజస్తాన్ రాయల్స్‌తో, చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడాల్సి ఉంది. రెండు మ్యాచ్‌లో గెలిస్తే కింగ్స్ పంజాబ్ ప్లేఆఫ్‌కు చేరుతుంది. ఒక మ్యాచ్‌లో ఓడి ఒక మ్యాచ్‌లో గెలిచినా రేసులో ఉంటుంది. కానీ మిగిలిన జట్ల ఫలితాలపై కింగ్స్ పంజాబ్ ఆధారపడాల్సి ఉంటుంది. కాగా, ఇక్కడ కేకేఆర్ కంటే కింగ్స్ పంజాబ్ రన్‌రేట్ బాగుండటం వారికి సానుకూలాంశం. సన్‌రైజర్స్ రన్‌రేట్‌తో పోలిస్తే కింగ్స్ పంజాబ్ రన్‌రేట్ బాలేదు. ఈ రెండు జట్ల మధ్యే నాలుగో స్థానం కోసం అధికపోటీ ఉండవచ్చు. రాజస్తాన్ రాయల్స్ ఈ సీజన్ ఆరంభంలో అదరగొట్టి ఆపై అంచనాలను అందుకోలేకపోయిన జట్టు రాజస్తాన్. ప్రస్తుతం 12 మ్యాచ్‌లో ఆడి 10 పాయింట్లతో ఉంది రాజస్తాన్. ఇంకా కింగ్స్ పంజాబ్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆ జట్టు ఆడాల్సి ఉంది. కానీ వారి నెట్‌రన్‌రేట్ చాలా దారుణంగా ఉంది. ప్రస్తుతం రాజస్తాన్ రన్‌రేట్ -0.505గా ఉంది. రాజస్తాన్ తన చివరి రెండు మ్యాచ్‌ల్లో గెలిచినా రన్‌రేట్‌పై ఆధారపడక తప్పదు. అదే సమయంలో కింగ్స్ పంజాబ్‌ను చెన్నై సూపర్‌కింగ్స్ ఓడించడమే కాకుండా సన్‌రైజర్స్ ఆడాల్సి ఉన్నా రెండు మ్యాచ్‌ల్లో ఓడితేనే రాజస్తాన్‌కు నేరుగా క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది. ఆర్సీబీ అందరి అంచనాలను తల్లక్రిందలు చేస్తూ అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్న జట్లలో ఆర్సీబీ ఒకటి. ఇప్పటివరకూ 12 మ్యాచ్‌లో ఆడిన ఆర్సీబీ.. 14 పాయింట్లతో ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న కోహ్లి అండ్ గ్యాంగ్.. ఇంకా సన్‌రైజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడాల్సి ఉంది. వారి రన్‌రేట్ 0.048తో మెరుగ్గా ఉంది. ఇక మిగిలి ఉన్న మ్యాచ్‌ల్లో కనీసం ఒక మ్యాచ్ గెలిచినా ఆర్సీబీ నేరుగా ప్లేఆఫ్స్‌కు చేరుతుంది. ఒకవేళ రెండు మ్యాచ్‌లో ఓడినా ఆర్సీబీకి నెట్‌రన్‌రేట్ ఆధారంగా ప్లేఆఫ్స్‌కు చేరే అవకాశాలు ఎక్కువ. కానీ అప్పుడు అది వారి నెట్‌రన్‌రేట్‌పై ప్రభావం చూసుకోవాలి. భారీ ఓటములు ఎదురైతే మాత్రం అప్పుడు అది వారి నెట్‌రన్‌రేట్‌పై ప్రభావం చూపనుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఆరంభంలో ఇరగదీసిన జట్లలో ఢిల్లీ క్యాపిటల్స్ ఒకటి. ముందుగా ఢిల్లీని ప్లేఆఫ్ చేరుతుందని భావించారు. కానీ ఇంకా ఢిల్లీ ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకోలేదు. ప్రస్తుతం 12 మ్యాచ్‌లాడిన ఢిల్లీ క్యాపిటల్స్.. 14 పాయింట్లతో ఉంది. వారి రన్‌రేట్‌గా కూడా మెరుగ్గానే ఉంది. ఢిల్లీ రన్‌రేట్ 0.030గా ఉండటంతో ఆ జట్టు టాప్-4లో ఉండే అవకాశాలు ఎక్కువ. అప్పుడు రన్‌రేట్ తగ్గకుండా చూసుకోవడమే కాకుండా రేసులో ఉన్న జట్లు భారీ తేడాతో గెలవకుండా ఉంంది. ఇటీవల సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 88 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆ తరహా ఓటములు వస్తేనే ఢిల్లీ ప్లేఆఫ్ బెర్తు కష్టం అవుతుంది. ముంబై ఇండియన్స్, రాయల్స్ చాలెంజర్స్ బెంగళూరు జట్లతో ఢిల్లీ తన మిగిలిన లీగ్ మ్యాచ్‌ల్లో తలపడనుంది. ప్రస్తుతానికి ఢిల్లీ సేఫ్జోన్లో ఉన్నట్లే. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్లో గెలవాల్సిన మ్యాచ్‌ల్లో ఓటమి పాలు కావడంతో సన్‌రైజర్స్ ప్లేఆఫ్ ఆశలు కాస్త క్లిష్టంగానే ఉన్నాయని చెప్పాలి. ఇప్పటివరకూ 12 మ్యాచ్‌లాడిన వార్నర్ సేన 10 పాయింట్లతో ఉంది. అంటే రెండు మ్యాచ్‌లు కచ్చితంగా గెలవాలి. అదే సమయంలో ఆర్సీబీ, ఢిల్లీ, కింగ్స్ పంజాబ్ జట్లలో కనీసం ఒక జట్టు 16 పాయింట్లతో ఉండకూడదు. అప్పుడు సన్‌రైజర్స్‌కు అవకాశం ఉంటుంది. ఇక్కడ సన్‌రైజర్స్ హైదరాబాద్ రన్‌రేట్ 0.396గా ఉంది. అంటే కింగ్స్ పంజాబ్ కంటే మెరుగ్గా ఉంది సన్‌రైజర్స్. ప్రస్తుతం 14 పాయింట్లతో ఉన్న ఆర్సీబీ, ఢిల్లీల కంటే సన్‌రైజర్స్ రన్‌రేట్ బాగుండటం వారికి సానుకూలాంశం. ఇది నిలబడాలంటే మిగిలిని రెండు మ్యాచ్‌ల్లో గెలిచి తీరాలి. సన్‌రైజర్స్ తన తదుపరి మ్యాచ్‌ల్లో ఆర్సీబీ, ముంబై ఇండియన్స్‌లతో తలపడనుంది. -
వారిదే టైటిల్.. ఆర్చర్ జోస్యం నిజమయ్యేనా?
దుబాయ్: ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ తన బౌలింగ్‌తోనే కాదు.. తన ట్వీట్ల ద్వారాను ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. ఆర్చర్ ఎప్పుడో చెప్పింది వాస్తవ రూపం దాల్చడంతో అతని ట్వీట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రధానంగా క్రికెట్లో ఏది జరిగినా ఆర్చర్ ముందే చెప్పాడనే ట్వీట్ మన ముంగిట నిలుస్తూ ఉంటుంది. అయితే అందులో వాస్తవం ఎంతనేది ఆర్చర్‌కే తెలియాలి. నిజంగానే ఆర్చర్ టైమ్ మిషీన్ ఉందా అని ప్రశ్న కూడా అభిమానులు మనసుల్లో ఇప్పటికీ మెదులుతూనే ఉంది. (సల్మాన్ పాత ట్వీట్ వైరల్!) ప్రస్తుత ఐపీఎల్లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్ రాజస్తాన్ తరఫున ఆడుతున్న ఆర్చర్ ఒక అద్భుతమైన క్యాచ్‌ను పట్టాడు. కార్తీక్ త్యాగి వేసిన 11 ఓవర్ నాల్గో బంతిని భారీ షాట్ ఆడిన ముంబై ఓపెనర్ ఇషాన్ కిషన్.. బౌండరీ లైన్ కు కాస్త ముందు ఆర్చర్ ఒంటి చేత్తో క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. ఆ క్యాచ్‌ను పట్టడం కష్టసాధ్యమనుకున్న తరుణంలో ఆర్చర్ దాన్ని అందుకుని శభాష్ అనిపించాడు. అసాధారణమైన క్యాచ్‌లను పట్టడం క్రికెట్లో ఒకటైతే, ఈ విషయాన్ని ఆర్చర్ దాన్ని ముందుగా చెప్పడమే ఆసక్తికరంగా మారింది. 2014లో ఆర్చర్ ఒక ట్వీట్ చేశాడు. అది ‘క్యాచ్ ఆఫ్ ది ఐపీఎల్’ అని ఆర్చర్ తన ట్వీట్లో పేర్కొన్నాడు. వారిదే టైటిల్.. ఆర్చర్ జోస్యం ఐపీఎల్ 13 సీజన్ తుది దశకు చేరుకుంది. అయితే ఈ సీజన్ టైటిల్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ గెలుస్తుందని రాజస్థాన్ రాయల్స్ పేసర్ జోఫ్రా ఆర్చర్ జోస్యం చెప్పాడు. అయితే ఈ ఇంగ్లండ్ పేసర్ చెప్పింది ఇప్పుడు కాదు... ఆరేళ్ల క్రితం. కింగ్స్ పంజాబ్ టైటిల్ గెలుస్తుందని 2014లో ట్వీట్ చేశాడు. ఆర్చర్ 2014లో చేసిన ట్వీట్ కింగ్స్ పంజాబ్ ఇటీవలే రీ ట్వీట్ చేసింది. కింగ్స్ పంబాబ్ ఇప్పటివరకూ ఆరు మ్యాచ్‌ల్లో గెలవగా, అందులో ఐదు వరుసగా గెలిచినవే. వరుస ఐదు ఓటముల తర్వాత పంజాబ్ పుంజుకుని ఇలా ప్లే ఆఫ్ రేసులోకి రావడంతో పంజాబ్‌దే టైటిల్‌ను అంతా అనుకుంటున్నారు. 2014లో ఫైనల్‌కు చేరిన కింగ్స్ పంజాబ్.. కేకేఆర్ చేతిలో చతికిలబడింది. ఈసారి కచ్చితంగా టైటిల్‌ను కింగ్స్ పంజాబ్ ఎగురేసుకుపోతుందని ఒక సెక్షన్ వర్గం అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరికొంతమంది అంత సీన్లేదని అంటున్నారు. ప్రధానంగా సెకండ్ లెగ్‌లో కింగ్స్ పంజాబ్ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. అదే సమయంలో ఆర్చర్ ఎప్పుడో ట్వీట్ చేసిన మరొకసారి ప్రత్యక్షం కావడం, దాన్ని కింగ్స్ పంజాబ్ రీట్వీట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. మరి పంజాబ్ టైటిల్ గెలుస్తుందా.. ఆర్చర్ జోస్యం నిజమవుతుందా అనేది చూడాలి. ఆర్చర్ జోస్యం నిజమవుతుందా.. లేదా అనేది కూడా కింగ్స్ పంజాబ్‌కు ప్రశ్నగానే ఉంది. ఇదే విషయాన్ని పేర్కొంటూ ఆర్చర్ ట్వీట్‌ను రీట్వీట్ చేసింది కింగ్స్ పంజాబ్.(వచ్చే ఏడాది కూడా ధోనీ సారథ్యంలోనే!) #Jofradamus at it again 🔮#SaddaPunjab #IPL2020 #KXIP #KXIPvSRH https://t.co/UI6jrPl03B — Kings XI Punjab (@lionsdenkxip) October 24, 2020 -
కింగ్స్ పంజాబ్ జైత్రయాత్ర
షార్జా: వరుసగా ఐదు ఓటముల తర్వాత ఒక్కసారి పుంజుకున్న కింగ్స్ పంజాబ్ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. వరుసగా ఐదో విజయాన్ని ఖాతాలో వేసుకుని రేసులోకి వచ్చేసింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కోల్‌కతా ముందుగా బ్యాటింగ్ చేసి 150 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. లక్ష్య ఛేదనలో కేఎల్ రాహుల్(28;25 బంతుల్లో 4ఫోర్లు), మన్దీప్ సింగ్(66 నాటౌట్; 56 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), గేల్((51; 28 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లు)లు ఆకట్టుకున్నారు. కింగ్స్ 47 పరుగుల వద్ద రాహుల్ ఔటయ్యాడు. వరుణ్ చక్రవర్తి వేసిన 8వ ఓవర్ ఆఖరి బంతికి రాహుల్ ఔటయ్యాడు. ఆ తర్వాత మన్దీప్ సింగ్, క్రిస్ గేల్లు మరో వికెట్ పడకుండా జట్టుకు విజయాన్ని అందించారు. క్రిస్ గేల్ 25 బంతుల్లో 5 సిక్స్‌లు, 2 ఫోర్లతో హాఫ్ సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇది కింగ్స్ పంజాబ్‌కు ఆరో విజయం కాగా, కేకేఆర్‌కు ఇది ఆరో ఓటమి.ఈ మ్యాచ్‌లో విజయం తర్వాత కింగ్స్ పంజాబ్ నాల్గో స్థానానికి చేరింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. టాస్ గెలిచిన కింగ్స్ పంజాబ్ తొలుత ఫీల్డింగ్ తీసుకోవడంతో కేకేఆర్ బ్యాటింగ్‌కు దిగింది. కేకేఆర్ ఇన్నింగ్స్‌ను శుబ్‌మన్ గిల్, నితీష్ రాణాలు ఆరంభించారు.కాగా, మ్యాక్స్‌వెల్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో రాణా డకౌట్ అయ్యాడు. మొదటి ఓవర్ రెండో బంతికే రాణా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత ఓవర్లో రాహుల్ త్రిపాఠి(7), దినేశ్ కార్తీక్(0)లు ఔటయ్యారు. మహ్మద్ షమీ వేసిన రెండో ఓవర్ నాల్గో బంతికి త్రిపాఠి ఔట్ కాగా, ఆఖరి బంతికి కార్తీక్ డకౌట్ అయ్యాడు. దాంతో కేకేఆర్ 10 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరుణంలో గిల్‌కు జత కలిసిన ఇయాన్ మోర్గాన్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ 81 పరుగులు చేయడంతో కేకేఆర్ తేరుకుంది. మోర్గాన్ 25 బంతుల్లో 5 ఫోర్లు, 2సిక్స్‌లతో 40 పరుగులు చేశాడు. ఆపై నరైన్(6),నాగర్కోటి(6), కమిన్స్(1)లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరారు. ఇక గిల్ 45 బంతుల్లో 3 ఫోర్లు, 4సిక్స్‌లతో 57 పరుగులు సాధించాడు. చివర్లో ఫెర్గ్యూసన్(24 నాటౌట్; 13 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) బ్యాట్ ఝుళిపించాడు. కింగ్స్ పంజాబ్ బౌలర్లలో షమీ మూడు వికెట్లు సాధించగా, రవి బిష్నోయ్, క్రిస్ జోర్డాన్ చెరో రెండు వికెట్లు తీశారు. మురుగన్ అశ్విన్, మ్యాక్స్‌వెల్‌లు తలో వికెట్ తీశారు. -
ఆదుకున్న గిల్, మోర్గాన్
షార్జా: కింగ్స్ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 150 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్ గెలిచిన కింగ్స్ పంజాబ్ తొలుత ఫీల్డింగ్ తీసుకోవడంతో కేకేఆర్ బ్యాటింగ్‌కు దిగింది. కేకేఆర్ ఇన్నింగ్స్‌ను శుబ్‌మన్ గిల్, నితీష్ రాణాలు ఆరంభించారు.కాగా, మ్యాక్స్‌వెల్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో రాణా డకౌట్ అయ్యాడు. మొదటి ఓవర్ రెండో బంతికే రాణా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత ఓవర్లో రాహుల్ త్రిపాఠి(7), దినేశ్ కార్తీక్(0)లు ఔటయ్యారు. మహ్మద్ షమీ వేసిన రెండో ఓవర్ నాల్గో బంతికి త్రిపాఠి ఔట్ కాగా, ఆఖరి బంతికి కార్తీక్ డకౌట్ అయ్యాడు. దాంతో కేకేఆర్ 10 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరుణంలో గిల్‌కు జత కలిసిన ఇయాన్ మోర్గాన్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ 81 పరుగులు చేయడంతో కేకేఆర్ తేరుకుంది. మోర్గాన్ 25 బంతుల్లో 5 ఫోర్లు, 2సిక్స్‌లతో 40 పరుగులు చేశాడు. ఆపై నరైన్(6),నాగర్కోటి(6), కమిన్స్(1)లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరారు. ఇక గిల్ 45 బంతుల్లో 3 ఫోర్లు, 4సిక్స్‌లతో 57 పరుగులు సాధించాడు. చివర్లో ఫెర్గ్యూసన్(24 నాటౌట్; 13 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) బ్యాట్ ఝుళిపించడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. కింగ్స్ పంజాబ్ బౌలర్లలో షమీ మూడు వికెట్లు సాధించగా, రవి బిష్నోయ్, క్రిస్ జోర్డాన్ చెరో రెండు వికెట్లు తీశారు. మురుగన్ అశ్విన్, మ్యాక్స్‌వెల్‌లు తలో వికెట్ తీశారు. -
ఫస్ట్ బ్యాటింగ్ జట్టుకు కష్టాలు తప్పవా?
షార్జా: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్‌కు ఎంచుకుంది. టాస్ గెలిచిన కింగ్స్ పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్.. ముందుగా కేకేఆర్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ సీజన్లో ఇరు జట్ల మధ్య జరిగిన తొలి అంచె మ్యాచ్‌లో కేకేఆర్ రెండు పరుగుల తేడాతో గెలిచింది. కేకేఆర్ ముందుగా బ్యాటింగ్ చేసి 164 సాధిస్తే, కింగ్స్ పంజాబ్ 162 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. కేకేఆర్ 11మ్యాచ్‌లు ఆడి ఆరు విజయాలు సాధించగా, కింగ్స్ పంజాబ్ 11 మ్యాచ్‌లకు ఐదు విజయాలు నమోదు చేసింది. దాంతో ఈ మ్యాచ్‌లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని కింగ్స్ పంజాబ్ భావిస్తోంది. మరొకవైపు ఈ మ్యాచ్ గెలిచి మరో మెట్టు ఎక్కాలని కేకేఆర్ యోచిస్తోంది. ఏది ఏమైనా ఇరుజట్ల మధ్య పోరు ఆసక్తికరంగా జరిగే అవకాశం ఉంది. కాగా, ముందుగా బ్యాటింగ్ చేసే జట్టుకు కష్టాలు తప్పవని పిచ్ రిపోర్ట్‌ను బట్టి అర్థమవుతుంది. పిచ్ స్లోగా ఉండటంతో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టుకు ఇబ్బందికర పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. ఆ క్రమంలోనే టాస్ గెలిచిన రాహుల్ ముందుగా ఫీల్డింగ్ వైపు మొగ్గుచూపాడు.ఇదే విషయాన్ని టాస్ వేసిన క్రమంలో రాహుల్ స్పష్టం చేశాడు. ఛేదించే క్రమంలో బోర్డుపై ఎంత స్కోరు ఉందో తెలిస్తే గేమ్ ప్లాన్ సక్రమంగా అమలు చేసే అవకాశం ఉంటుందన్నాడు. ఇదిలాఉంచితే, ఈ మ్యాచ్‌లో ఇరుజట్లు ఎటువంటి మార్పులు లేకుండా గత మ్యాచ్‌లో జట్టునే కొనసాగిస్తున్నాయి. ఇక ఓవరాల్‌గా ఇరుజట్లు 26సార్లు ముఖాముఖి పోరులో తలపడితే కేకేఆర్ 18సార్లు విజయం సాధించగా, కింగ్స్ పంజాబ్ 8మ్యాచ్‌ల్లో గెలిచింది. 2014లో కింగ్స్ పంజాబ్‌తో జరిగిన తుదిపోరులో కేకేఆర్ గెలిచి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఇక ఈ సీజన్లో కింగ్స్ పంజాబ్ ఆడిన గత ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింట విజయం సాధించి దూసుకుపోతుండగా, కేకేఆర్ ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు మాత్రమే నమోదు చేసింది. ఇరుజట్లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కేఎల్ రాహుల్(567-కింగ్స్ పంజాబ్), మయాంక్ అగర్వాల్(398- కింగ్స్ పంజాబ్), నికోలస్ పూరన్(327- కింగ్స్ పంజాబ్), శుబ్‌మన్ గిల్(321-కేకేఆర్), ఇయాన్ మోర్గాన్(295- కేకేఆర్)లు వరుస స్థానాల్లో ఉన్నారు. ఇరుజట్లలో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో మహ్మద్ షమీ(17-కింగ్స్ పంజాబ్), వరుణ్ చక్రవర్తి(12-కేకేఆర్), రవి బిష్నోయ్(10-కింగ్స్ పంజాబ్)లు వరుస స్థానాల్లో కొనసాగుతున్నారు. రాహుల్ వర్సెస్ వరుణ్ ఈ మ్యాచ్‌లో రాహుల్-వరుణ్ చక్రవర్తిల మధ్య ఆసక్తికర పోరు జరగవచ్చు. రాహుల్ బ్యాటింగ్‌లో దుమ్ములేపుతుంటే, వరుణ్ బౌలింగ్‌లో ఇరగదీస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో వరుణ్ ఐదు వికెట్లు సాధించి కేకేఆర్ భారీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. రాహుల్ 133.41 స్టైక్‌రేట్‌తో పాటు 63 యావరేజ్‌తో ఉండగా, వరుణ్ 7.05 ఎకానమీతో కొనసాగుతున్నాడు. దాంతో వీరిద్దరిలో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి. కేకేఆర్ ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, నితీష్ రాణా, రాహుల్ త్రిపాఠి, దినేశ్ కార్తీక్, సునీల్ నరైన్, ప్యాట్ కమిన్స్, లూకీ ఫెర్గ్యూసన్, నాగర్కోటి, ప్రసిద్ధ్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి కింగ్స్ పంజాబ్ కేఎల్ రాహుల్(కెప్టెన్), మన్దీప్ సింగ్, క్రిస్ గేల్, నికోలస్ పూరన్, మ్యాక్స్‌వెల్, దీపక్ హుడా, క్రిస్ జోర్డాన్, మురుగన్ అశ్విన్, రవి బిష్నోయ్, మహ్మద్ షమీ, అర్షదీప్ సింగ్ -
శభాష్ అనిల్ కుంబ్లే: గావస్కర్
న్యూఢిల్లీ: వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓటమి తర్వాత పుంజుకుని ప్లేఆఫ్స్ రేసు ఆశల్ని సజీవంగా ఉంచుకున్న కింగ్స్ పంజాబ్‌పై దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ ప్రశంసలు కురిపించాడు. వరుసగా నాలుగు విజయాలు సాధించి ఒక్కసారిగా రేసులోకి వచ్చేసిన పంజాబ్ పోరాట స్ఫూర్తితో దూసుకుపోవడానికి కోచ్ అనిల్ కుంబ్లేనే కారణమని గావస్కర్ కొనియాడాడు. తన క్రికెట్ కెరీర్లో ఏ విధంగా అయితే పోరాటం చేశాడో, అదే స్ఫూర్తితోనే జట్టులోకి నింపాడని గావస్కర్ ప్రశంసించాడు. స్టార్ స్పోర్స్ క్రికెట్ లైవ్ షోలో గావస్కర్ మాట్లాడుతూ.. ‘ కింగ్స్ పంజాబ్ వరుస విజయాల్లో కుంబ్లే రోల్‌ను మరచిపోకూడదు. కుంబ్లే ఒక పోరాట యోధుడు. అది అతని క్రికెట్ కెరీర్లో చాలా దగ్గరగా చూశాం. తల పగిలినప్పుడు కూడా కట్టుకట్టుకుని బౌలింగ్ వేసి తన అంకిత భావాన్ని చాటుకున్నాడు. (ధోని ఈజ్ బ్యాక్: సెహ్వాగ్) ఇప్పుడు కింగ్స్ పంజాబ్‌లో కూడా అదే అంకిత భావాన్ని నింపుతున్నాడు కుంబ్లే. అసాధ్యమనుకున్న పరిస్థితుల్ని నుంచి కింగ్స్ పంజాబ్‌ను గాడిలో పెట్టాడు. ప్రస్తుతం కింగ్స్ పంజాబ్ రేసులోకి వచ్చింది’ అని గావస్కర్ పేర్కొన్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఇటీవల జరిగిన మ్యాచ్‌లో 126 పరుగుల్ని కూడా కాపాడుకుని విజయాన్ని సాధించడం పంజాబ్ ఆటగాళ్లలో గెలవాలి అనే కసే కారణమన్నాడు. అందుకు వారిలో అనిల్ కుంబ్లే నింపిన స్ఫూర్తే ప్రధాన కారణంగా గావస్కర్ చెప్పుకొచ్చాడు. ఇక కింగ్స పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై కూడా గావస్కర్ ప్రశంసలు కురిపించాడు. కెప్టెన్సీ పాత్రలో రాహుల్ ఎంతో చక్కగా ఒదిగిపోయాడో మనం చూస్తున్న మ్యాచ్‌లే ఉదాహరణ అని తెలిపాడు.బ్యాటింగ్‌లో ఆకట్టుకోవడమే కాకుండా, ఫీల్డింగ్‌లో మార్పులు, బౌలింగ్ చేయిస్తున్న విధానం రాహుల్ కెప్టెన్‌గా ఎంతో ఎదిగాడు అనడాన్ని చూపెడుతుందన్నాడు. హైదరాబాద్‌తో మ్యాచ్‌లో చివరి ఓవర్‌ను అర్షదీప్‌కు ఇవ్వడంలో రాహుల్ కెప్టెన్సీ చాతుర్యం కనబడిందన్నాడు. ఎస్ఆర్హెచ్ 14 పరుగులు చేయాల్సిన సమయంలో అర్షదీప్‌ను బౌలింగ్‌కు ఉపయోగించి సక్సెస్ కావడం రాహుల్‌లోని కెప్టెన్సీ పరిణితికి నిదర్శమన్నాడు. (బ్రేక్‌లో ఒక ప్లేయర్‌ను మిస్సయ్యాం..!) -
భారమైన హృదయంతో బరిలోకి దిగాడు..
దుబాయ్: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ అనూహ్య విజయం సాధించింది. సన్‌రైజర్స్ గెలుస్తుందనుకునే తరుణంలో కింగ్స్ పంజాబ్ అద్భుతం చేసింది. 14 పరుగుల వ్యవధిలో ఏడు వికెట్లు సాధించిన పంజాబ్ 12 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. తద్వారా ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. కాగా, నిన్నటి మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ జట్టు మయాంక్ అగర్వాల్‌కు విశ్రాంతినిచ్చి మన్దీప్ సింగ్‌ను జట్టులోకి తీసుకుంది. రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన మన్దీప్ 17 పరుగులే చేశాడు. ఈ మ్యాచ్‌కు భారమైన హృదయంతోనే మన్దీప్ సిద్ధమయ్యాడు. అతని తండ్రి, మాజీ అథ్లెటిక్స్ హర్దేవ్ సింగ్ శుక్రవారం రాత్రి చనిపోయారు. అయితే స్వస్థలం వెళ్లలేని స్థితిలో ఉన్న మనదీప్ సింగ్.. అతని తండ్రి చివరి చూపును వీడియో కాల్‌లోనే చూసి నివాళులు అర్పించాడు. శనివారం నాటి మ్యాచ్‌లో మన్దీప్ తండ్రి మృతికి సంతాపంగా పంజాబ్ ఆటగాళ్లు నల్లరంగు రిబ్బన్లు ధరించి బరిలోకి దిగారు. గత మ్యాచ్‌లో మయాంక్ గాయపడటంతో మన్దీప్ తుది జట్టులోకి వచ్చాడు. తండ్రి చనిపోయిన బాధలో ఉన్న మన్దీప్ జట్టుకోసం ఓపెనర్‌గా బరిలోకి దిగాడని కింగ్స్ పంజాబ్ కొనియాడింది. ఇక మాజీ క్రికెటర్లు ఆకాశ్ చోప్రాతో పాటు సచిన్ టెండూల్కర్లు కూడా మన్‌దీప్‌ను కొనియాడారు. ఎంతో గుండె నిబ్బరం ఉన్న మన్దీప్ జట్టుకోసం సిద్ధం కావడం అతని అంకితభావానికి, ధైర్యానికి నిదర్శనమన్నాడు. ‘ మనకు ఇష్టమైన వ్యక్తిని కోల్పోవడం చాలా బాధిస్తుంది. ఆ వ్యక్తికి తుది వీడ్కోలు చెప్పలేకపోతే ఇంకా కలిచివేస్తుంది. మన్‌దీప్‌కు, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. వారి కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నా’ అని సచిన్ తెలిపాడు. ఇక కేకేఆర్ ఆటగాడు నితీష్ రాణా మావయ్య సురిందర్ సింగ్ కూడా రెండు రోజుల క్రితం మరణించారు. ఈ రెండు కుటుంబాలు విషాదం నుండి కోలుకోవాలని సచిన్ ఆకాంక్షించారు. అదే సమయంలో ఫ్యాన్స్ కూడా మన్‌దీప్‌ను కొనియాడుతున్నారు. కుటుంబంలో విషాదం నెలకొని ఉన్న పరిస్థితుల్లో మ్యాచ్ ఆడటం అతని చేసే పనిలో ఎంతటి అంకిత భావం ఉందో తెలియజేస్తుందని అభిమానులు కీర్తిస్తున్నారు. -
ఏం చేస్తాం.. మరిచిపోవడం తప్పితే..: వార్నర్
దుబాయ్: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. లో స్కోరింగ్ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో చతికిలబడిన సన్‌రైజర్స్ ఓటమి పాలైంది. కింగ్స్ పంజాబ్ 126 పరుగుల స్కోరును కాపాడుకుని భళా అనిపించింది. చివరి మూడు ఓవర్లలో 20 పరుగులు చేస్తే విజయం సాధించే దశలో ఆరెంజ్ ఆర్మీ తేలిపోయింది. సన్‌రైజర్స్ 24 బంతుల్లో(నాలుగు ఓవర్లలో) 27 పరుగులు చేయాల్సిన తరుణంలో మనీష్ పాండే-విజయ్ శంకర్లు క్రీజ్‌లో ఉన్నారు. కానీ 14 పరుగుల వ్యవధిలో 7 వికెట్లను కోల్పోవడంతో సన్‌రైజర్స్ పరాజయాం పాలైంది. (ధోని చెప్పింది నిజమే కదా.. ఇప్పుడేమంటారు!) మ్యాచ్ తర్వాత ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ మాట్లాడుతూ..’ ఇది మమ్మల్ని తీవ్ర గాయం చేసింది. చాలా ఘోరమైన ఓటమి. బ్యాటింగ్‌లో పూర్తిగా తేలిపోయాం. మేము ఒత్తిడిని అధిగమించలేకపోయాం. రానురాను పిచ్ కఠినతరం అవుతుందని అనిపించింది. కానీ ఇది స్వల్ప టార్గెట్. దాన్ని ఛేదించలేకపోయాం. ఏ దశలోనూ లైన్‌ను దాటలేకపోయాం. మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి కింగ్స్ పంజాబ్‌ను కట్టడి చేశారు. మా బౌలర్ల ప్రదర్శన నిజంగా అసాధారణం. వారు గేమ్ ప్లాన్‌ను కచ్చితంగా అమలు చేశారు. బ్యాటింగ్‌లో పూర్తిగా విఫలం కావడంతో పరాజయం చెందాం. గెలవాల్సిన మ్యాచ్‌ను చేజార్చుకోవడం బాధగా ఉంది. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్‌ను కోల్పోయాం. ఏం చేస్తాం.. మరిచిపోయి ముందుకు సాగడం తప్పితే’ అని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. చివరి మూడు ఓవర్లలో 20 పరుగులు చేస్తే విజయం సాధించే దశలో ఆరెంజ్ ఆర్మీ తేలిపోయింది. అర్షదీప్ సింగ్ వేసిన 18 ఓవర్ ఐదో బంతికి విజయ్ శంకర్(26; 27 బంతుల్లో 4 ఫోర్లు) ఔట్ కావడంతో సన్‌రైజర్స్‌పై ఒత్తిడి పెరిగింది. జోర్డాన్ వేసిన 19 ఓవర్ మూడో బంతికి హోల్డర్(5) ఔట్ కాగా, ఆ మరుసటి బంతికి రషీద్ ఖాన్ డకౌట్ అయ్యాడు. దాంతో ఆరు బంతుల్లో 14 పరుగులు అవసరమయ్యాయి.ఆ తరుణంలో చివరి ఓవర్ వేసిన అర్షదీప్ పరుగు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు సాధించాడు. దాంతో కింగ్స్ పంజాబ్ విజయం సాధించగా, సన్‌రైజర్స్ ఓటమి పాలైంది. -
ఒత్తిడిలో వార్నర్ సేన చిత్తు.. పంజాబ్ భళా
దుబాయ్: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. లో స్కోరింగ్ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో చతికిలబడిన సన్‌రైజర్స్ ఓటమి పాలైంది. కింగ్స్ పంజాబ్ 126 పరుగుల స్కోరును కాపాడుకుని భళా అనిపించింది. చివరి మూడు ఓవర్లలో 20 పరుగులు చేస్తే విజయం సాధించే దశలో ఆరెంజ్ ఆర్మీ తేలిపోయింది. అర్షదీప్ సింగ్ వేసిన 18 ఓవర్ ఐదో బంతికి విజయ్ శంకర్(26; 27 బంతుల్లో 4 ఫోర్లు) ఔట్ కావడంతో సన్‌రైజర్స్‌పై ఒత్తిడి పెరిగింది. జోర్డాన్ వేసిన 19 ఓవర్ మూడో బంతికి హోల్డర్(5) ఔట్ కాగా, ఆ మరుసటి బంతికి రషీద్ ఖాన్ డకౌట్ అయ్యాడు. దాంతో ఆరు బంతుల్లో 14 పరుగులు అవసరమయ్యాయి. ఆ తరుణంలో చివరి ఓవర్ వేసిన అర్షదీప్ పరుగు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు సాధించాడు. దాంతో కింగ్స్ పంజాబ్ విజయం సాధించగా, సన్‌రైజర్స్ ఓటమి పాలైంది. కింగ్స్ పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్, జోర్డాన్లు తలో మూడు వికెట్లు సాధించగా, మహ్మద్ షమీ, మురుగన్ అశ్విన్, రవి బిష్నోయ్లకు వికెట్ చొప్పున లభించింది. ఇది కింగ్స్ పంజాబ్‌కు ఐదో విజయం కాగా, సన్‌రైజర్స్‌కు ఏడో ఓటమి. ఇది కింగ్స్ పంజాబ్‌కు వరుసగా నాల్గో విజయం కావడం విశేషం. తాజా విజయంతో కింగ్స్ పంజాబ్ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోగా, హైదరాబాద్ పరిస్థితి క్లిష్టంగా మారింది.(100 బాల్స్.. 102 రన్స్.. నో సిక్సర్స్) మనీష్ ఔటే టర్నింగ్ పాయింట్ మనీష్ పాండే ఔట్ అయ్యే సమయానికి సన్‌రైజర్స్‌కు 27 పరుగులు అవసరం . క్రిస్ జోర్డాన్ వేసిన 17 ఓవర్ తొలి బంతిని వైడ్ వేయగా అక్కడ పరుగు వచ్చింది. ఆ తర్వాత అదే బంతికి మనీష్ పాండే భారీ షాట్ ఆడాడు. అది సిక్స్‌గా మారే చివరి నిమిషంలో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ సుచిత్ పరుగెత్తుకుంటూ వచ్చి ఒక్క జంప్‌తో దాన్ని క్యాచ్ తీసుకున్నాడు. బౌండరీ లైన్ చాలా సమీపంగా వెళ్లిన సుచిత్ క్యాచ్ పట్టిన తీరు శభాష్ అనిపించింది. అక్కడే మ్యాచ్ టర్న్ అయిపోయింది. ఆపై ఎవరూ కూడా ఆడే యత్నం చేయలేకపోవడంతో సన్‌రైజర్స్‌కు ఓటమి తప్పలేదు. గెలుస్తామనుకున్న మ్యాచ్‌ను ఆరెంజ్ ఆర్మీ చేజార్చుకోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. లక్ష్య ఛేదనలో ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్‌ను డేవిడ్ వార్నర్-బెయిర్ స్టోలు ధాటిగా ఆరంభించారు. ఈ జోడి 56 పరుగుల జత చేసిన తర్వాత వార్నర్(35; 20 బంతుల్లో 3 ఫోర్లు, 2సిక్స్‌లు) తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. స్పిన్నర్ రవి బిష్నోయ్ వేసిన ఏడో ఓవర్ రెండో బంతికి రాహుల్‌కు క్యాచ్ వార్నర్ ఔటయ్యాడు. ఆపై వెంటనే బెయిర్ స్టో(19; 20 బంతుల్లో 4ఫోర్లు) రెండో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. మురుగన్ అశ్విన్ వేసిన ఎనిమిదో ఓవర్ రెండో బంతికి బెయిర్ స్టో బౌల్డ్ అయ్యాడు. అబ్దుల్ సామద్(7; 5 బంతుల్లో 1 ఫోర్) ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. దాంతో 67 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది సన్‌రైజర్స్. ఆ తరుణంలో మనీష్ పాండేకు విజయ్ శంకర్ జత కలిశాడు. వీరిద్దరూ 33 పరుగుల జత చేసిన తర్వాత మనీష్ పాండే పెవిలియన్ చేరగా, ఆ తర్వాత స్వల్ప విరామాల్లో వికెట్లను చేజార్చుకుని పరాజయం పాలైంది. 19.5 ఓవర్లలో 114 పరుగులకే సన్‌రైజర్స్ చాపచుట్టేసింది. ఆరుగురు సన్‌రైజర్స్ ఆటగాళ్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ముందుగా బ్యాటింగ్ చేసిన కింగ్స్ పంజాబ్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. ఆరెంజ్ ఆర్మీ బౌలర్లు అదరగొట్టడంతో కింగ్స్ పంజాబ్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ ఫీల్డింగ్ తీసుకోవడంతో పంజాబ్‌కు బ్యాటింగ్‌కు దిగింది. కింగ్స్ పంజాబ్ ఇన్నింగ్స్‌ను కేఎల్ రాహుల్, మనదీప్ సింగ్‌లు ఆరంభించారు. మయాంక్ అగర్వాల్ స్థానంలో జట్టులోకి వచ్చిన మన్దీప్ సింగ్(17) నిరాశపరిచాడు. సందీప్ శర్మ బౌలింగ్‌లో రషీద్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత రాహుల్-క్రిస్ గేల్ల జోడి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లింది. అయితే జట్టు స్కోరు 66 పరుగుల వద్ద ఉండగా గేల్(20;20 బంతుల్లో 2 ఫోర్లు, 1సిక్స్) రెండో వికెట్‌గా ఔటయ్యాడు. హోల్డర్ వేసిన 10 ఓవర్ ఆఖరి బంతికి భారీ షాట్ ఆడబోయిన గేల్.. వార్నర్ క్యాచ్ పట్టడంతో నిష్క్రమించాడు. ఆపై తదుపరి ఓవర్లో రాహుల్(27; 27 బంతుల్లో 2 ఫోర్లు, 1సిక్స్) ఔటయ్యాడు. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత కింగ్స్ తిరిగి తేరుకోలేకపోయింది. మ్యాక్స్‌వెల్(12), దీపక్ హుడా(0), క్రిస్ జోర్డాన్(7), మురుగన్ అశ్విన్(4)లు విఫలయ్యారు. కాగా, నికోలస్ పూరన్(32 నాటౌట్; 28 బంతుల్లో 2 ఫోర్లు) కడవరకూ క్రీజ్‌లో ఉండటంతో వంద పరుగుల మార్కును చేరింది కింగ్స్ పంజాబ్. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో సందీప్ శర్మ, హోల్డర్, రషీద్ ఖాన్లు తలో రెండు వికెట్లు సాధించారు. -
100 బాల్స్.. 102 రన్స్.. నో సిక్సర్స్
దుబాయ్: ఈ ఐపీఎల్ సీజన్లో అత్యంత దారుణంగా విఫలమైన బ్యాట్స్మెన్లలో కింగ్స్ పంజాబ్ క్రికెటర్ మ్యాక్స్‌వెల్ ఒకడు. గతంలో ఎప్పుడూ చూడని మ్యాక్స్‌వెల్‌ను ప్రస్తుత ఐపీఎల్ చూస్తున్నామనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎప్పుడూ తన విధ్వంసకర ఆట తీరుతో ప్రత్యర్థులకు దడ పుట్టించే మ్యాక్స్‌వెల్ ఈ సీజన్ ఐపీఎల్లో పూర్తిగా తేలిపోయాడు. మ్యాక్స్‌వెల్ క్రీజ్‌లో దిగుతున్నాడంటే భయపడే బౌలర్లు.. మ్యాక్సీనే కదా అనే స్థాయికి వచ్చేశాడు. ఏదో నాలుగైదు బంతులు ఆడి మనోడే వికెట్‌ను ఇస్తాడులే అనేంత పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. (‘ఇదొక భయంకరమైన పవర్ ప్లే’) ఇప్పటివరకూ 10 మ్యాచ్‌లాడిన మ్యాక్స్‌వెల్ వంద బంతులను మాత్రమే ఆడాడు. అంటే మ్యాచ్‌కు వచ్చి సగటున పది బంతులు మాత్రమే ఆడిన ఘనత మ్యాక్సీది. ఇక్కడ మ్యాక్స్‌వెల్ చేసిన పరుగులు 102. ఈరోజు(శనివారం) సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో మ్యాక్సీ 13 బంతులాడి 12 పరుగులు చేశాడు. దాంతో ఓవరాల్‌గా ఈ సీజన్లో వంద బంతుల్ని ఎదుర్కోవడంతో పాటు వంద పరుగుల్ని కూడా కష్టపడి పూర్తి చేసుకున్నాడు. పించ్ హిట్టర్లలో ఒకడైన మ్యాక్సీ 10 ఇన్నింగ్స్‌ల్లో ఒక సిక్స్ కూడా లేకపోవడం గమనార్హం. ఒక జట్టు ఎంతో నమ్మకంతో వరుసపెట్టి అవకాశాలు ఇస్తుంటే మనోడేమో ఇలా పేలవ ప్రదర్శనతో పంజాబ్ పరాజయాల్లో భాగమవుతున్నాడు. ఎవరైనా విజయాల్లో భాగమైతే అతనిపై ఆయా జట్లు కూడా నమ్మకం ఉంచుతాయి. మరి మ్యాక్సీ విఫలం కావడం అతని అంతర్జాతీయ కెరీర్‌పైనే కాకుండా లీగ్‌ల్లో కూడా ప్రభావం చూపడం ఖాయం. కాగా, నేటి మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ 127 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. ఆరెంజ్ ఆర్మీ బౌలర్లు అదరగొట్టడంతో కింగ్స్ పంజాబ్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. పంజాబ్ ఇన్నింగ్స్‌లో నికోలస్ పూరన్(32 నాటౌట్; 28 బంతుల్లో 2 ఫోర్లు)దే అత్యధిక వ్యక్తిగత స్కోరు. -
ఎస్ఆర్హెచ్ టార్గెట్ 127
దుబాయ్: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ 127 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. ఆరెంజ్ ఆర్మీ బౌలర్లు అదరగొట్టడంతో కింగ్స్ పంజాబ్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ ఫీల్డింగ్ తీసుకోవడంతో పంజాబ్ బ్యాటింగ్‌కు దిగింది. కింగ్స్ పంజాబ్ ఇన్నింగ్స్‌ను కేఎల్ రాహుల్, మనదీప్ సింగ్‌లు ఆరంభించారు. మయాంక్ అగర్వాల్ స్థానంలో జట్టులోకి వచ్చిన మన్దీప్ సింగ్(17) నిరాశపరిచాడు. సందీప్ శర్మ బౌలింగ్‌లో రషీద్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత రాహుల్-క్రిస్ గేల్ల జోడి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లింది. అయితే జట్టు స్కోరు 66 పరుగుల వద్ద ఉండగా గేల్(20;20 బంతుల్లో 2 ఫోర్లు, 1సిక్స్) రెండో వికెట్‌గా ఔటయ్యాడు. హోల్డర్ వేసిన 10 ఓవర్ ఆఖరి బంతికి భారీ షాట్ ఆడబోయిన గేల్.. వార్నర్ క్యాచ్ పట్టడంతో నిష్క్రమించాడు. ఆపై తదుపరి ఓవర్లో రాహుల్(27; 27 బంతుల్లో 2 ఫోర్లు, 1సిక్స్) ఔటయ్యాడు. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత కింగ్స్ తిరిగి తేరుకోలేకపోయింది. మ్యాక్స్‌వెల్(12), దీపక్ హుడా(0), క్రిస్ జోర్డాన్(7), మురుగన్ అశ్విన్(4)లు విఫలయ్యారు. కాగా, నికోలస్ పూరన్(32 నాటౌట్; 28 బంతుల్లో 2 ఫోర్లు) కడవరకూ క్రీజ్‌లో ఉండటంతో కింగ్స్ పంజాబ్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో సందీప్ శర్మ, హోల్డర్, రషీద్ ఖాన్లు తలో రెండు వికెట్లు సాధించారు. -
మయాంక్ అగర్వాల్ దూరం
దుబాయ్: ఈ ఐపీఎల్ సీజన్లో భాగంగా కింగ్స్ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ కెప్టెన్ డేవిడ్ వార్నర్.. ముందుగా కింగ్స్ పంజాబ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇరుజట్ల మధ్య జరిగిన తొలి అంచె మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ 69 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఎస్ఆర్హెచ్ ముందుగా బ్యాటింగ్ చేసి 201 పరుగులు చేయగా, కింగ్స్ పంజాబ్ 132 పరుగులకే కుప్పకూలింది. ఇక ఇప్పటివరకూ ఇరు జట్ల మధ్య ఓవరాల్‌గా 15 మ్యాచ్‌లు జరగ్గా అందులో ఎస్ఆర్హెచ్ 11 సార్లు విజయం సాధించగా, కింగ్స్ పంజాబ్ 4 విజయాలు మాత్రమే అందుకుంది. ఈ సీజన్లో ఇరుజట్లు ఇప్పటివరకూ తలో 10 మ్యాచ్‌లు ఆడి నాలుగేసి విజయాలు సాధించాయి. దాంతో ఇక నుంచి ప్రతీ మ్యాచ్ ఇరుజట్లకు కీలకం. ఈ మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ ఒక మార్పు చేసింది నదీమ్ స్థానంలో ఖలీల్‌ను జట్టులోకి తీసుకుంది.మరొకవైపు కింగ్స్ పంజాబ్ రెండు మార్పులు చేసింది. మయాంక్ అగర్వాల్, జిమ్మీ నీషమ్‌లు ఈ మ్యాచ్‌కు దూరమయ్యారు. వారి స్థానాల్ల మన్దీప్ సింగ్, క్రిస్ జోర్డాన్‌లను తుది జట్టులోకి తీసుకుంది. ఇరుజట్ల మధ్య స్టార్ ఆటగాళ్లు ఉండటంతో మ్యాచ్ ఆసక్తికరంగా జరగవచ్చు. కింగ్స్ పంజాబ్ జట్టు బ్యాటింగ్ విభాగంలో కేఎల్ రాహుల్(540), మయాంక్ అగర్వాల్(398), పూరన్(295)లు టాప్ ఫెర్ఫామర్స్గా ఉండగా బౌలింగ్ విభాగంలో మహ్మద్ షమీ(16), రవి బిష్నోయ్(9), మురుగన్ అశ్విన్(7)లు కీలక పాత్ర పోషిస్తున్నారు. మరొకవైపు సన్‌రైజర్స్ జట్టు బ్యాటింగ్ విభాగంలో డేవిడ్ వార్నర్(335), జోనీ బెయిర్ స్టో(326), మనీష్ పాండే(295)లు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. బౌలింగ్ విషయానికొస్తే రషీద్ ఖాన్(12), నటరాజన్(11), ఖలీల్ అహ్మద్(8)లు టాప్ ఫెర్మమర్స్గా ఉన్నారు. ప్రధానంగా స్పిన్నర్ రషీద్ ఖాన్ మంచి ఫామ్‌లో ఉండటంతో ప్రత్యర్థి ఆటగాళ్లు అతని బౌలింగ్‌లో సాహసం చేయడానికి భయపడుతున్నారు. వార్నర్ వర్సెస్ షమీ ఈ రోజు ఇరుజట్ల మధ్య జరిగే మ్యాచ్‌లో వార్నర్-షమీల్లో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి. సన్‌రైజర్స్ జట్టులో వార్నర్ టాప్ స్కోరర్‌గా ఉండగా, కింగ్స్ పంజాబ్ జట్టు షమీ టాప్ బౌలర్‌గా ఉన్నాడు. ఈ ఐపీఎల్లో వార్నర్ ఆడపా దడపా మెరుస్తూ ఉండటంతో అతని స్టైక్‌రేట్ అంత బాలేదు. కేవలం 124.07 స్టైక్‌రేట్‌తో మాత్రమే వార్నర్ ఉన్నాడు. ఇది టీ20 మ్యాచ్‌ల్లో ఆకర్షణీయమైన స్టైక్‌రేట్ కాదు. ఇక షమీ ఎకానమీ 8.43గా ఉంది. దాంతో షమీ బౌలింగ్‌లో వార్నర్ ఎంతవరకూ రాణిస్తాడనేది ఆసక్తికరం. -
‘20 సార్లు కరోనా టెస్ట్.. కోవిడ్ పరీక్షలో క్వీన్‌ని’
కింగ్స్ పంజాబ్ జట్టు సహ యజమాని ప్రీతి జింటా ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం ప్రస్తుతం దుబాయ్ ఉన్న సంగతి తెలిసిందే. ప్రేక్షకులెవరూ లేకుండా ఖాళీ స్టేడియాల్లో తొలిసారి ఐపీఎల్ నిర్వహిస్తున్నారు. కరోనా ప్రభావం లేకుండా చూడటం కోసం బీసీసీఐ అనేక జాగ్రత్తలు తీసుకుంటోంది. ఆటగాళ్లందర్నీ బయో బబుల్‌లో ఉంచి కోవిడ్ బారిన పడకుండా చూస్తోంది. ఈ క్రమంలో మంగళవారం ప్రీతి జింటా పోస్ట్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం తెగ ట్రెండ్ అవుతోంది. దీనిలో ఆమెకు జరిగిన స్వాబ్ టెస్ట్‌ని చూడవచ్చు. మెడికల్ సిబ్బంది ఒకరు ప్రీతి స్వాబ్ కలెక్ట్ చేశారు. ఈ సందర్భంగా ప్రీతి ‘ఇది నా 20వ కోవిడ్ టెస్ట్. నేను కరోనా పరీక్షలు చేయించుకోవడంలో నేను క్వీన్ అయ్యాను’ అన్నారు. దాంతో పాటు బయో బబుల్ గురించి కూడా వివరించారు ప్రీతి జింటా. అయితే ఈ వీడియోపై రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. ఓ యూజర్ ‘నేను ఐదు సార్లు కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. కానీ ఇంత ఈజీగా లేదు’ అని కామెంట్ చేయగా మరొక యూజర్.. ‘మీకు టెస్ట్ చేసే విధానం సరైంది కాదు’ అంటూ కామెంట్ చేస్తున్నారు. (చదవండి: 4 ఏళ్ల నాటి సల్మాన్ ట్వీట్ వైరల్..) View this post on Instagram Everyone asks me what does it mean being in the IPL team bio bubble. Well ! It’s starts with a 6 day quarantine, covid tests every 3-4 days and no going out - only ur room, designated #KXIP restaurant & gym & of course the stadium in ur car. The drivers, chefs etc are also in the bio bubble & quarantined so No food from outside & no people interaction. It’s tough if ur a free bird like me but then it’s 2020 & one must appreciate that #IPL is actually happening in the middle of a pandemic. I must thank #BCCI, the staff of KXIP & @sofiteldubaipalm for all their efforts in keep us safe & productive 🙏 #Grateful #pzipldiaries #Ipl2020 #Dream11 #Ting ❤️ @kxipofficial A post shared by Preity G Zinta (@realpz) on Oct 20, 2020 at 3:03am PDT ఇక దీంతో పాటుగా ‘బయో బబుల్’ అంటే ఏంటో కూడా వివరించారు ప్రీతి జింటా. ‘చాలా మంది బయో బబుల్ అంటే ఏంటని నన్ను అడుగుతున్నారు. ఆరు రోజుల క్వారంటైన్, నాలుగు రోజులకోసారి కోవిడ్ టెస్టులు చేయించుకోవడం, మనకు కేటాయించిన గదికే పరిమితం కావడం. జట్టుకు కేటాయించిన రెస్టారెంట్, జిమ్, స్టేడియంను మాత్రమే ఉపయోగించడమే బయో బబుల్. బీసీసీఐకి, కింగ్స్ పంజాబ్ స్టాఫ్‌కు చాలా థ్యాంక్స్. మమ్మల్ని సేఫ్‌గా ఉంచడం కోసం, ఐపీఎల్ కొనసాగడం కోసం వీరేంతో శ్రమిస్తున్నారు’ అని ప్రీతి జింటా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. -
కింగ్స్ పంజాబ్ ‘హ్యాట్రిక్’
దుబాయ్: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ నిర్దేశించిన 165 పరుగుల టార్గెట్‌ను కింగ్స్ పంజాబ్ 19 ఓవర్లో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఫలితంగా హ్యాట్రిక్ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. వరుస ఓటములతో ఢీలా పడ్డ కింగ్స్ పంజాబ్.. ఆపై వరుసగా మూడో విజయాన్ని సాధించడంతో రేసులోకి వచ్చేసింది. ఆర్సీబీతో 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన తర్వాత ముంబై ఇండియన్స్‌పై సూపర్ ఓవర్ గెలుపును అందుకుంది. ఆపై తాజా మ్యాచ్‌లో కూడా కింగ్స్ పంజాబ్ ఆకట్టుకుని ఢిల్లీపై పైచేయి సాధించింది. దాంతో ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై సూపర్ ఓవర్లో ఓడిన దానికి కింగ్స్ పంజాబ్ ఘనమైన ప్రతీకారం తీర్చుకుంది. ఇది కింగ్స్‌కు నాల్గో విజయం కాగా, ఢిల్లీకి మూడో ఓటమి. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కేఎల్ రాహుల్(15) తొలి వికెట్‌గా ఔటయ్యాడు. అనంతరం గేల్ బ్యాట్‌ను ఝుళిపించాడు. క్రిస్ గేల్(29;13 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా బ్యాటింగ్ చేసి కింగ్స్ పంజాబ్ స్కోరును పరుగులు పెట్టించాడు. గేల్ రెండో వికెట్‌గా ఔటైన కాసేపటికి మయాంక్ అగర్వాల్(5) రనౌట్ అయ్యాడు. నికోలస్ పూరన్‌తో సమన్వయం లోపించడంతో మయాంక్ రనౌట్‌గా నిష్క్రమించాడు. కాగా, పూరన్(53; 28 బంతుల్లో 6 ఫోర్లు, 3సిక్స్‌లు) దుమ్ములేపడంతో కింగ్స్ పంజాబ్ రన్‌రేట్ ఎక్కడా తగ్గలేదు. అతనికి జతగా మ్యాక్స్‌వెల్(32; 24 బంతుల్లో 3 ఫోర్లు) మంచి సహకారం అందించాడు. ఈ జోడి నాల్గో వికెట్‌కు 69 పరుగులు జోడించడంతో కింగ్స్ పంజాబ్ గాడిలో పడింది. జట్టు స్కోరు 125 పరుగుల వద్ద ఉండగా పూరన్ ఔట్ కాగా, 147 పరుగుల వద్ద ఉండగా మ్యాక్స్‌వెల్ నిష్క్రమించాడు. చివర్లో దీపక్ హుడా(15 నాటౌట్; 22 బంతుల్లో 1 ఫోర్), నీషమ్(10 నాటౌట్; 8 బంతుల్లో 1 సిక్స్)లు లక్ష్యాన్ని పూర్తిచేసి కింగ్స్‌కు విజయాన్ని అందించారు. ఢిల్లీ బౌలర్లలో రబడా రెండు వికెట్లు సాధించగా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్‌లకు తలో వికెట్ లభించింది. (ఐదో ప్లేయర్‌గా గబ్బర్..) అంతకుముందు ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఓపెనర్ శిఖర్ మరోసారి తన మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. క్లాస్ టచ్ అంటే ఇలా ఉంటుందంటూ వరుసగా రెండో సెంచరీని సాధించాడు. సీఎస్కేతో గత మ్యాచ్‌లో సెంచరీ సాధించి ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించిన ధావన్.. పంజాబ్‌తో మ్యాచ్‌లో మరొకసారి చెలరేగిపోయాడు. 61 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌లతో 106 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. ఓ వైపు ఢిల్లీ టాపార్డర్ వికెట్లను చేజార్చుకున్నా ధావన్ మాత్రం బాధ్యతాయుతంగా ఆడాడు. ఈ క్రమంలోనే శతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఇది శిఖర్‌కు ఓవరాల్ ఐపీఎల్లో రెండో సెంచరీ కాగా, అది కూడా వరుసగా సాధించడం విశేషం. ఫలితంగా ఐపీఎల్ చరిత్రలో వరుసగా రెండో సెంచరీలు సాధించిన తొలి ఆటగాడుగా ధావన్ రికార్డు నెలకొల్పాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ ఆదిలోనే పృథ్వీ షా(7) వికెట్‌ను కోల్పోయింది. నీషమ్ బౌలింగ్‌లో పృథ్వీ షా క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తరుణంలో శిఖర్‌కు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జత కలిశాడు. వీరిద్దరూ 48 పరుగులు జత చేసిన తర్వాత అయ్యర్(14) రెండో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. మురుగన్ అశ్విన్ బౌలింగ్‌లో రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి అయ్యర్ ఔటయ్యాడు. ఆపై రిషభ్ పంత్(14) కూడా నిరాశపరిచాడు. కానీ ధావన్ మాత్రం అత్యంత నిలకడగా ఆడాడు. 57 బంతుల్లో12 ఫోర్లు, 3 సిక్సర్లతో సెంచరీని సాధించాడు. హిట్టర్లు స్టోయినిస్(9), హెట్మెయిర్(10; 6 బంతుల్లో 1 సిక్స్)ల నుంచి ఆశించిన మెరుపులు రాకపోవడంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. కింగ్స్ పంజాబ్ బౌలర్లలో షమీ రెండు వికెట్లు సాధించగా, నీషమ్, మురుగన్ అశ్విన్, మ్యాక్స్‌వెల్‌లు తలో వికెట్ తీశారు. -
శిఖర్ మళ్లీ దంచేశాడు..
దుబాయ్: కింగ్స్ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ శిఖర్ మరోసారి తన మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. క్లాస్ టచ్ అంటే ఇలా ఉంటుందంటూ వరుసగా రెండో సెంచరీని సాధించాడు. సీఎస్కేతో గత మ్యాచ్‌లో సెంచరీ సాధించి ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించిన ధావన్.. పంజాబ్‌తో మ్యాచ్‌లో మరొకసారి చెలరేగిపోయాడు. 61 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌లతో 106 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. ఓ వైపు ఢిల్లీ టాపార్డర్ వికెట్లను చేజార్చుకున్నా ధావన్ మాత్రం బాధ్యతాయుతంగా ఆడాడు. ఈ క్రమంలోనే శతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఇది శిఖర్‌కు ఓవరాల్ ఐపీఎల్లో రెండో సెంచరీ కాగా, అది కూడా వరుసగా సాధించడం విశేషం. ఫలితంగా ఐపీఎల్ చరిత్రలో వరుసగా రెండో సెంచరీలు సాధించిన తొలి ఆటగాడుగా ధావన్ రికార్డు నెలకొల్పాడు.(మనం గెలవగలం.. మనం గెలుస్తాం: జడేజా) ధావన్ ఇన్నింగ్స్‌తో ఢిల్లీ 165 పరుగుల టార్గెట్‌ను బోర్డుపై ఉంచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ ఆదిలోనే పృథ్వీ షా(7) వికెట్‌ను కోల్పోయింది. నీషమ్ బౌలింగ్‌లో పృథ్వీ షా క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తరుణంలో శిఖర్‌కు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జత కలిశాడు. వీరిద్దరూ 48 పరుగులు జత చేసిన తర్వాత అయ్యర్(14) రెండో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. మురుగన్ అశ్విన్ బౌలింగ్‌లో రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి అయ్యర్ ఔటయ్యాడు. ఆపై రిషభ్ పంత్(14) కూడా నిరాశపరిచాడు. కానీ ధావన్ మాత్రం అత్యంత నిలకడగా ఆడాడు. 57 బంతుల్లో12 ఫోర్లు, 3 సిక్సర్లతో సెంచరీని సాధించాడు. హిట్టర్లు స్టోయినిస్(9), హెట్మెయిర్(10; 6 బంతుల్లో 1 సిక్స్)ల నుంచి ఆశించిన మెరుపులు రాకపోవడంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. కింగ్స్ పంజాబ్ బౌలర్లలో షమీ రెండు వికెట్లు సాధించగా, నీషమ్, మురుగన్ అశ్విన్, మ్యాక్స్‌వెల్‌లు తలో వికెట్ తీశారు.(ధోని.. మీరు అవకాశాలు ఇచ్చింది ఏది?) -
మరో సూపర్ మ్యాచ్ జరిగేనా?
దుబాయ్: ఈ ఐపీఎల్ సీజన్లో భాగంగా కింగ్స్ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిని ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముందుగా బ్యాటింగ్ చేసేందుకు మొగ్గుచూపాడు. అంతకుముందు ఇరుజట్ల మధ్య జరిగిన మొదటి అంచె లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ సూపర్ ఓవర్లో గెలిచింది. ఈ సీజన్ ఆరంభంలో ఢిల్లీ-పంబాబ్ల మధ్య రెండో మ్యాచ్ జరగ్గా అది సూపర్ ఓవర్ వరకూ వెళ్లింది. ఆ మ్యాచ్‌లో ఢిల్లీ గెలవగా, కింగ్స్ పంజాబ్‌కు చుక్కెదురైంది. కాగా, మళ్లీ ఇరు జట్ల మధ్య జరిగే మ్యాచ్‌కు యమ క్రేజ్ ఏర్పడింది. ఇరుజట్లలో స్టార్ ఆటగాళ్లు ఉండటంతో మరో సూపర్ మ్యాచ్ అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పటివరకూ ఢిల్లీ 9 మ్యాచ్‌లకు గాను 7 విజయాలు సాధించగా, కింగ్స్ పంజాబ్ 9 మ్యాచ్‌లకు 3 విజయాలే సాధించింది. ఇక ఓవరాల్‌గా ఇరుజట్లు 25సార్లు ముఖాముఖి పోరులో తలపడగా అందులో కింగ్స్ పంజాబ్ 14 సార్లు గెలవగా, ఢిల్లీ 11 సార్లు మాత్రమే విజయం సాధించింది. వరుసగా రెండు మ్యాచ్‌లను కింగ్స్ గెలవడంతో ఆ జట్టు మంచి జోష్ మీద కనిపిస్తోంది. ఆర్సీబీపై గెలిచిన తర్వాత ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ సూపర్ ఓవర్లో విజయం సాధించింది. ఢిల్లీ గత ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలను ఖాతాలో వేసుకుంది. సీఎస్కేతో ఢిల్లీ ఆడిన గత మ్యాచ్‌లో అక్షర్ పటేల్ మూడు సిక్స్‌లతో జట్టును గెలిపించాడు. జడేజా వేసిన ఆఖరి ఓవర్లో అక్షర్ బ్యాట్ ఝుళిపించి ఓటమి అంచు నుంచి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. కింగ్స్ పంజాబ్ జట్టులో కేఎల్ రాహుల్ 525 పరుగులతో టాప్‌లో కొనసాగుతున్నాడు. మయాంక్ అగర్వాల్ 393 పరుగులు సాధించగా, నికోలస్ పూరన్ 242 పరుగులు సాధించాడు. ఇక పంజాబ్ జట్టులో అత్యధిక వికెట్లు సాధించిన జాబితాలో మహ్మద్ షమీ 14 వికెట్లు సాధించగా, రవి బిష్నోయ్ 9 వికెట్లు సాధించాడు. మురుగన్ అశ్విన్ 6 వికెట్లు తీశాడు. ఢిల్లీ జట్టులో అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో శిఖర్ ధావన్ 359 పరుగులతో ఉండగా, శ్రేయస్ అయ్యర్ 321 పరుగులు సాధించాడు. స్టోయినిస్ 217 పరుగుల్ని నమోదు చేశాడు. బౌలింగ్ విభాగంలో కగిసో రబడా 19 వికెట్లతో టాప్ లేపగా, నోర్జే 12 వికెట్లు , అక్షర్ పటేల్ 7 వికెట్లు సాధించారు. రాహుల్ వర్సెస్ రబడా ఈ సీజన్లో ఇప్పటివరకూ రాహుల్ బ్యాటింగ్‌లో టాప్ లేపుతుంటే, బౌలింగ్‌లో రబడా విశేషంగా రాణిస్తున్నాడు. నేటి మ్యాచ్‌లో వీరిద్దరి మధ్య ఆసక్తికర పోరు జరిగే అవకాశం ఉంది. రాహుల్ 135.65 స్టైక్‌రేట్‌తో పాటు 75.00 యావరేజ్‌తో 525 పరుగులు సాధించగా, రబడా 7.68 ఎకానమీతో 19 వికెట్లు సాధించాడు. ఇరుజట్ల మధ్య గత మ్యాచ్‌లో రాహుల్, పూరన్‌లను సూపర్ ఓవర్లో ఔట్ చేసిన రబడా ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. -
రెండో సూపర్ ఓవర్ కూడా టైగా ముగిస్తే..?
దుబాయ్: ఈ ఐపీఎల్ సీజన్లో ఇప్పటికే పలు మ్యాచ్‌ల ఫలితాలు సూపర్ ఓవర్ వరకూ వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ నాలుగు మ్యాచ్‌లు సూపర్ ఓవర్లకు వెళితే, ఆదివారం జరిగిన కింగ్స్ పంజాబ్- ముంబై ఇండియన్స్ అందుకు భిన్నం. ఈ మ్యాచ్‌లో రెండో సూపర్ ఓవర్ వరకూ వెళితే కానీ ఫలితం తేలలేదు. తొలి సూపర్ ఓవర్లో ఇరు జట్లు ఐదు పరుగులే చేయడంతో రెండో సూపర్ ఓవర్ ఆడించారు. అందులో కింగ్స్ పంజాబ్ విజేతగా నిలిచింది. తొలుత ముంబై ఇండియన్స్ 11 పరుగులు చేస్తే దాన్ని కింగ్స్ పంజాబ్ ఛేదించింది. క్రిస్ గేల్, మయాంక్ అగర్వాల్‌లు 12 పరుగులు సాధించి జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించారు. కాగా, ఐపీఎల్ చరిత్రలో రెండు సూపర్ల ద్వారా మ్యాచ్ ఫలితం తేలడం ఇదే తొలిసారి. గతేడాది వరల్డ్‌కప్ సమయంలో ఇంగ్లండ్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ సూపర్ ఓవర్ వరకూ వెళ్లింది. ఇక్కడ సూపర్ ఓవర్ వరకూ టై కావడంతో బౌండరీ కౌంట్ ఆధారంగా ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటించారు. ఇది అప్పుడు పెద్ద వివాదాస్పదమైంది. ఈ నిబంధనపై యావత్ క్రికెట్ ప్రపంచం భగ్గుమంది. దాంతో సూపర్ ఓవర్లపై క్రికెట్ లామేకర్ మెరిల్‌బోన్ క్రికెట్ కమిటీ(ఎంసీసీ) కొన్ని సూచనలు చేయడంతో దానికి ఐసీసీ ఆమోద ముద్ర వేసింది. అందులో సూపర్ ఓవర్ల నిబంధనను మార్చారు. సెమీస్,ఫైనల్(నాకౌట్ మ్యాచ్‌ల్లో) ఫలితం తేలేవరకు మళ్లీ మళ్లీ సూపర్ ఓవర్ నిర్వహించాలనే రూల్ తీసుకొచ్చింది. ఇదే నిబంధనను ఐపీఎల్లో అమలు చేశారు. రెండో సూపర్ ఓవర్ కూడా టైగా ముగిస్తే..? ఆదివారం నాటి మ్యాచ్‌లో రెండు సూపర్ ఓవర్లు పడ్డాయి. తొలుత పడిన సూపర్ ఓవర్ టైగా ముగియడంతో రెండో సూపర్ ఓవర్ తప్పలేదు. కానీ రెండో ది కూడా టై అయితే ఏంటనేది ప్రశ్న. ఇక రెండోది కూడా టై అయితే మూడో సూపర్ ఓవర్‌ను ఆడిస్తారా అనుమానం వ్యక్తమవుతోంది.. ఐపీఎల్ నిబంధనల ప్రకారం భారతకాలమాన ప్రకారం మధ్యాహ్న మ్యాచ్‌లు సూపర్ ఓవర్‌కు వెళితే రాత్రి గం.8గంటలకు ప్రారంభిచకూడదు. అదే సమయంలో రాత్రి మ్యాచ్‌లకు సూపర్ ఓవర్‌కు వెళితే అది అర్థరాత్రి 12గంటలు దాటకూడదని ఐపీఎల్ ప్రారంభానికి ముందు నిబంధన తీసుకొచ్చారు. అంటే ఇక్కడ సమయం అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. తొలి సూపర్ ఓవర్ టై అయితే రెండో సూపర్ వెళ్లే క్రమంలో కూడా సమయాన్ని చూస్తారు. అలాగే రెండో సూపర్ ఓవర్ కూడా టై అయితే ఇరుజట్ల కెప్టెన్ల ఒప్పందం ప్రకారం చెరొక పాయింట్ కేటాయిస్తారు. అంటే మూడో సూపర్ ఓవర్ ఉండదు. తలొక పాయింట్ తీసుకోవాల్సిందే. మొన్న జరిగిన రెండు సూపర్ ఓవర్ల మ్యాచ్‌ల సమయాలను పరిశీలిస్తే.. సన్‌రైజర్స్ హైదరాబాద్-కేకేఆర్ జట్ల మధ్య సూపర్ ఓవర్ రాత్రి గం7:39 ని.ల నుంచి 7:49 మధ్య జరిగింది. ఇక కింగ్స్ పంజాబ్-ముంబై ఇండియన్స్‌ల మధ్య జరిగిన తొలి సూపర్ రాత్రి గం. 11:46ని.లకు ప్రారంభమైతే, రెండో సూపర్ ఓవర్ గం.11:55 ని.ల నుంచి గం.12:12ని.ల మధ్య జరిగింది. నిబంధన ప్రకారం రెండు మ్యాచ్‌లు సూపర్ ఓవర్ల మ్యాచ్‌లు నిర్ణీత సమయానికి కంటే ముందే ప్రారంభమయ్యాయి. ఇక్కడ రెండో మ్యాచ్‌లో పడ్డ రెండో సూపర్ ఓవర్ గం. 12.12ని.లకు ముగియడంతో మూడో సూపర్ ఓవర్‌కు అవకాశం లేదు. ఈ సమయంలో మళ్లీ సూపర్ ఓవర్ టై అయితే ఇరుజట్లు పాయింట్లతో సరిపెట్టుకోవాలి. ఒకవేళ వివాదాస్పద బౌండరీ కౌంట్ రూల్ అమలు చేసి ఉంటే ముంబై ఇండియన్స్ గెలిచేది. ముంబై ఇండియన్స్ 24 బౌండరీలు( సిక్స్‌లు, ఫోర్లు) కొడితే, కింగ్స్ పంజాబ్ 22 బౌండరీలే సాధించింది. ఇదిలా ఉంచితే, నాకౌట్ మ్యాచ్‌ల్లో అయితే టై అయితే ఫలితాన్ని సూపర్ ఓవర్ల ద్వారానే ఫలితాన్ని తేల్చాలి. ఇక్కడ తొలి సూపర్ ఓవర్, రెండో సూపర్ ఓవర్లు టైగా ముగిస్తే మూడో సూపర్ ఓవర్ అనేది ఉంటుంది. నాకౌట్ మ్యాచ్‌ల్లో ఏదొక జట్టును విజేతగా తేల్చాలి కాబట్టి ఈ నిబంధనను ఫాలో కాకతప్పదు. ఇది గతేడాది ఐసీసీ తీసుకొచ్చిన నిబంధన. -
ఆ ప్రశ్నకు నాకు కోపం వచ్చింది: గేల్
దుబాయ్: ముంబై ఇండియన్స్-కింగ్స్ పంజాబ్ జట్ల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రెండు సూపర్ ఓవర్లు పడ్డాయి. ముందు జరిగిన సూపర్ ఓవర్ టై కావడంతో రెండో సూపర్ ఓవర్ అనివార్యమైంది. తొలి సూపర్ ఓవర్లో ఇరు జట్లు ఐదేసి పరుగులే చేయడంతో రెండో సూపర్ ఆడించారు. ఆ సూపర్ ఓవర్లో కింగ్స్ పంజాబ్‌ను విజయం వరించింది. రెండో సూపర్ ఓవర్లో ముంబై 11 పరుగులు చేయగా, దాన్ని కింగ్స్ ఛేదించింది. మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్లు బ్యాటింగ్‌కు దిగారు. బౌల్ట్ వేసిన తొలి బంతిని గేల్ సిక్స్ కొట్టగా, ఆ తర్వాత బంతికి సింగిల్ తీశాడు. ఇక మూడో బంతికి అగర్వాల్ ఫోర్ కొట్టాడు. ఇక నాల్గో బంతికి మరో బౌండరీకి కొట్టడంతో కింగ్స్ పంజాబ్ లక్ష్యాన్ని పూర్తి చేసి విజేతగా నిలిచింది. ఇలా ఐపీఎల్ చరిత్రలో డబుల్ సూపర్ ఓవర్లు పడటం ఇదే తొలిసారి. (ఆర్సీబీ వదులుకుంది.. ఢిల్లీ తీసుకుంది) కాగా, సెకండ్ సూపర్ ఓవర్ వరకూ మ్యాచ్‌ను తీసుకొచ్చినందుకు ఆగ్రహంతోపాటు కలత చెందానని యూనివర్శల్ బాస్ గేల్ తెలిపాడు. ఆ సమయంలో తానేమీ ఆందోళనకు చెందలేదని, క్రికెట్లో ఇటువంటివి జరుగుతూ ఉంటాయన్నాడు. కాకపోతే రెండో సూపర్ ఓవర్లో బ్యాటింగ్‌కు వెళ్తున్నప్పుడు ‘తొలి బంతిని మనిద్దరిలో ఎవరం ఎదుర్కొందాం?’ అని మయాంక్ అడిగిన ప్రశ్నకు గేల్ బాగా కలత చెందాడట. కోపం కూడా వచ్చిందని గేల్ తెలిపాడు. మయాంక్ నువ్వు నిజంగానే ఆ ప్రశ్న అడుగుతున్నావా..? , ఫస్ట్ బాల్‌ను బాస్ ఎదుర్కొంటాడు అని సమాధానం ఇచ్చాడట. మ్యాచ్ తర్వాత ఆటగాళ్లతో ఇంటరాక్షన్‌లో సూపర్ ఓవర్ల గురించి గేల్ మాట్లాడాడు. ఈ క్రమంలోనే మయాంక్‌తో కలిసి బ్యాటింగ్ చేయడానికి వెళ్లేటప్పుడు సంభాషణను వెల్లడించాడు. మరొకవైపు షమీపై ప్రశంసలు కురిపించాడు గేల్. ‘నా వరకు షమీనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. రోహిత్, డికాక్‌లకు బౌలింగ్ చేసిన షమీ.. ఆరు పరుగులు కూడా చేయకుండా సమర్థవంతంగా వ్యవహరించాడు. షమీ వేసి యార్కర్లను నేను నెట్స్‌లో ఎదుర్కొన్నాను. ప్రత్యర్థులకు కూడా షమీ యార్కర్లను రుచి చూపిస్తాడని తెలుసు. నేను అనుకున్నట్టే షమీ బౌలింగ్ చేశాడు’ అని గేల్ కొనియాడాడు. -
మురిసిపోతూ ఎగిరి గంతులేసింది
దుబాయ్: క్రికెట్లో ఎలాంటి అద్భుతమైన జరగొచ్చు అనడానికి నిన్న కింగ్స్ పంజాబ్-ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ప్రధాన మ్యాచ్ టై అయితే.. సూపర్ ఓవర్ ఆడించారు. అది కూడా టై. మళ్లీ సూపర్ ఓవర్. ఆడేవాళ్లకు, చూసేవాళ్లకు నరాలు తెగిపోయేంత టెన్షన్.ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ చివరకు మంచి మజాను అందించడంతో సూపర్ సండేగా మారింది. అసలు సూపర్ ఓవర్‌కు వెళితేనే ఇరుజట్లు ఎంతలా పోరాడాయే అర్థమవుతుంది. సూపర్ ఓవర్లో సూపర్ ఓవర్ అంటే వారు పోరు అసాధారణమనే చెప్పాలి. కింగ్స్ పంజాబ్-ముంబై ఇండియన్స్‌ల జట్ల మధ్య ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్.. అంతకుముందు సన్‌రైజర్స్ హైదరాబాద్-కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్ల మధ్య జరిగిన సూపర్ ఓవర్ మ్యాచ్‌ను మరిచిపోయేలా చేసింది. నిన్న జరిగిన రెండు మ్యాచ్‌లు సూపర్ ఓవర్ ద్వారా ఫలితం తేలితే, రాత్రి జరిగిన మ్యాచ్ మాత్రం డబుల్ ధమాకాను అందించింది. (ముంబైతో మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ రికార్డ్) ముందు జరిగిన సూపర్ ఓవర్ టై కావడంతో రెండో సూపర్ ఓవర్ అనివార్యమైంది. తొలి సూపర్ ఓవర్లో ఇరు జట్లు ఐదేసి పరుగులే చేయడంతో రెండో సూపర్ ఆడించారు. ఆ సూపర్ ఓవర్లో కింగ్స్ పంజాబ్‌ను విజయం వరించింది. రెండో సూపర్ ఓవర్లో ముంబై 11 పరుగులు చేయగా, దాన్ని కింగ్స్ ఛేదించింది. మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్లు బ్యాటింగ్‌కు దిగారు. బౌల్ట్ వేసిన తొలి బంతిని గేల్ సిక్స్ కొట్టగా, ఆ తర్వాత బంతికి సింగిల్ తీశాడు. ఇక మూడో బంతికి అగర్వాల్ ఫోర్ కొట్టాడు. ఇక నాల్గో బంతికి మరో బౌండరీకి కొట్టడంతో కింగ్స్ పంజాబ్ లక్ష్యాన్ని పూర్తి చేసి విజేతగా నిలిచింది. మురిసి మెరిసిన ప్రీతిజింటా ఈ మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ విజయం తర్వాత జట్టు సహ యాజమాని ప్రీతి జింటా ఆనందాని అవధుల్లేవు. పంజాబ్ గెలిచిన ప్రతీ సందర్భంలోనూ ఆటగాళ్లను ఉత్సాహపరిచే ప్రీతి జింటా.. రెండో సూపర్ ఓవర్ ద్వారా ఫలితం వచ్చే వరకూ ఉత్కంఠగా ఎదురుచూశారు. విజయం అంచుల వరకూ వచ్చి కొన్ని మ్యాచ్‌లను పంజాబ్ కోల్పోవడంతో ప్రీతి జింటా మళ్లీ ఏమి జరుగనుందో అని ఒత్తిడిలో కనిపించారు. చివరకు పంజాబ్ విజయం సాధించడంతో ఇక ఆమె మురిసిపోయారు. ఆ సంతోషంలో ఎగిరి గంతులేశారు. ఆ మ్యాచ్ సూపర్ ఓవర్లో పంజాబ్ గెలిచిన తర్వాత గెలుపు సంబరాల్ని వీడియో రూపంలో పంచుకున్న ప్రీతి.. ‘ మనం ఏమీ మాట్లాడాలో తెలియనప్పుడు చేసే పనులే మాట్లాడతాయి. రెండు సూపర్ ఓవర్లు. ఓ మై గాడ్. నేను ఇంకా షేక్ అవుతూనే ఉన్నాను. ఇది కింగ్స్ పంజాబ్ బాయ్స్ గెలుపు. వాటే గేమ్. వాటే నైట్.. వాటే ఫీలింగ్. టీమ్ ఎఫర్ట్‌కు థాంక్యూ. ఇక్కడ టీమ్ వర్క్ అత్యుత్తమం’ అని పేర్కొన్నారు. Actions speak louder than words as words fail me completely. Two super overs ? OMG ! I’m still shaking. So proud of the #Kxip boys. What a game, what a night, what a feeling ❤️ Thank you @lionsdenkxip for this supreme team effort 👊 Team work at its best. #MIvsKXIP #Dream11IPL https://t.co/xvdEMmdDjF — Preity G Zinta (@realpreityzinta) October 18, 2020 -
‘కుంబ్లే చూస్తున్నాడు, నీకు మామూలుగా ఉండదు’
దుబాయ్: ఐపీఎల్ 2020 సీజన్లో సగానికిపైగా మ్యాచ్‌లు పూర్తయ్యాయి. తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ జట్టు మూడు విజయాలు మాత్రమే సాధించింది. కోట్లు పెట్టి కొనుగోలు చేసిన సీనియర్ ఆటగాడు గ్లేన్ మ్యాక్స్‌వెల్ నుంచి ఒక్క గొప్ప ప్రదర్శన కూడా కానరాలేదు. ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న అతని ఆటతీరుపై జట్టు ఫ్రాంచైజీ భావన ఎలా ఉందో తెలియదు గానీ, పంజాబ్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 9 మ్యాచ్‌లలో మ్యాక్సీ 58 పరుగులు మాత్రమే చేయడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బౌలింగ్‌లో ఫరవాలేదనిపిస్తున్న ఈ ఆల్‌రౌండర్ బ్యాటింగ్‌లో ఇంత దారుణంగా విఫలమవడం జట్టును కష్టాల్లోకి నెడుతుందని అంటున్నారు. నిన్న ముంబైతో మ్యాచ్‌లోనూ రాహుల్ చహర్ బౌలింగ్‌లో పరుగులేమీ చేయకుండానే మ్యాక్సీ వెనుదిరడంతో భారమంతా కెప్టెన్ రాహుల్‌పై పడింది. పంజాబ్ కూడా సరిగ్గా 176 పరుగులే చేయడంతో మ్యాచ్ టై గా ముగిసిన సంగతి తెలిసిందే. తొలుత జరిగిన సూపర్ ఓవర్ కూడా టై కావడంతో.. రెండో సూపర్ ఓవర్లో పంజాబ్ విజయం సాధించింది. కేఎల్ రాహుల్‌కు మిగతా బ్యాట్స్‌మెన్ సహకారం ఉండి ఉంటే పంజాబ్ అలవోక విజయం సాధించేది. ఈనేపథ్యంలో ‘11 కోట్లు పెట్టి చీర్ లీడర్ని కొన్నట్టుగా మ్యాక్స్‌వెల్ ఆటతీరు ఉంది’ అని కొందరు, ‘డ్రెస్సింగ్ రూమ్‌లో కోచ్ కుంట్లే రెడీగా ఉన్నాడు. నీకు మామూలుగా ఉండదు’అని మరికొందరు అభిమానులు మీమ్స్‌తో మ్యాక్సీని ట్రోల్ చేస్తున్నారు. కాగా, గత కొన్ని సీజన్లలోనూ పెద్దగా రాణించని మ్యాక్సీని పంజాబ్ ఫ్రాంచైజీ ఐపీఎల్ 2020 సీజన్లో రూ.10.75 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఇక యూఏఈలో 2014 జరిగిన ఐపీఎల్ సీజన్లో ఒంటి చేత్తో జట్టుకు విజయాలు అందించిన మ్యాక్సీ పంజాబ్‌ను ఫైనల్‌కు చేర్చడంలో కీలకంగా పాత్ర పోషించాడు. ఆ సీజన్లో 5 మ్యాచ్‌లలోనే 300 పరుగులు చేశాడు. రెండేళ్ల క్రితం ఐపీఎల్ మ్యాచ్‌లో.. ఢిల్లీ క్యాపిటల్స్‌గా పేరు మార్చుకున్న ఢిల్లీ డేర్ డెవిల్స్‌పై సిక్సర్ బాదిన మ్యాక్స్‌వెల్.. ఇంతవరకు ఒక్క సిక్స్ కూడా కొట్టకపోవడం గమనార్హం. -
‘6 పరుగులు సేవ్ చేయడం మామూలు కాదు’
దుబాయ్: ఐపీఎల్ అంటేనే వినోదాల విందు. అందులోనూ సూపర్ ఓవర్లో ఫలితం తేలడం అంటే ఉత్కంఠగా మ్యాచ్ సాగినట్టే. అభిమానులకు ఎగ్జయిట్‌మెంట్‌కు గురిచేసినట్టే. మరి సూపర్ ఓవర్ కూడా టై గా ముగిసి రెండో సూపర్ కూడా ఆడితే.. ఆ మజా మరింత ‘సూపర్’గా ఉంటుంది. పంజాబ్, ముంబై జట్ల మధ్య ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్ దీనికి వేదికైంది. ఐపీఎల్ చరిత్రలోనే మొదటిసారి సూపర్+సూపర్ మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై 20 ఓవర్లకు 176 పరుగులు చేసింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి పంజాబ్ జట్టు సరిగ్గా 176 పరుగులే చేయడంతో మ్యాచ్ టై అయింది. తొలి సూపర్ ఓవర్లో సింగిల్ డిజిట్ పరుగులే నమోదయ్యాయి. జస్ప్రీత్ బుమ్రా చక్కని యార్కర్ స్పెల్‌తో పూరన్ (0), రాహుల్ (4) వికెట్లను కోల్పోయి పంజాబ్‌ను 5 పరుగులే చేయగలిగింది. ఇక ఆది నుంచి జోరు మీదున్న ముంబై జట్టు ఆరు పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదిస్తుందనుకున్నారంతా. కానీ, మహ్మద్ షమీ యార్కర్ల దాడితో స్వల్ప లక్ష్యాన్ని ముంబై అందుకోలేకపోయింది. డికాక్ (3) వికెట్ కోల్పోయి ఐదు పరుగులే చేయడంతో సూపర్ ఓవర్ కూడా ‘టై’ అయింది. దీంతో ఫీల్డ్ అంపైర్లు సమాలోచనలు జరిపి మరో సూపర్ ఓవర్‌ను ఆడించారు. ఈసారి తొలుత ముంబై హర్దిక్ పాండ్యా (1) వికెట్ కోల్పోయి 11 పరుగులు చేసింది. తర్వాత పంజాబ్... గేల్ (7) సిక్స్, మయాంక్ (8) 2 ఫోర్లతో ఇంకో రెండు బంతులుండగానే 15 పరుగులు చేసి గెలిచింది. (చదవండి: చెన్నై తదుపరి మ్యాచ్‌లకు బ్రేవో దూరం) షమీపై రాహుల్ ప్రశంసలు అద్భుతమైన బౌలింగ్‌తో తొలి సూపర్ ఓవర్లో ఆరు పరుగుల లక్ష్యాన్ని కాపాడిన మహ్మద్ షమీపై పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ప్రశంసలు కురిపించాడు. ముంబై నిర్దేశించిన సూపర్ ఓవర్ లక్ష్యాన్ని కాపాడుకోవాంటే ఆరు బంతులూ యార్కర్లు వేయాలని షమీ అనుకున్నానని తెలిపాడు. 6 బంతులూ యార్కర్లు వేద్దామనుకుంటున్నాడని షమీ చెప్పడం పట్ల తామంతా ఆశ్చర్యానికి గురయ్యామని పోస్ట్ మ్యాచ్ ప్రెస్ మీట్లో రాహుల్ చెప్పుకొచ్చాడు. షమీ నిర్ణయాన్ని కెప్టెన్‌గా తాను, మిగతా సీనియర్ ఆటగాళ్లు స్వాగతించామని అన్నాడు. తన ప్లాన్‌ని పక్కాగా అమలు చేసి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడని కొనియాడాడు. ఇక తాజా విజయంతో తమకు రెండు పాయింట్లు జతకావడం పట్ల రాహుల్ సంతోషం వ్యక్తం చేశాడు. కాగా, ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ మూడింట విజయం సాధించింది. (చదవండి: ఉత్కం‘టై’లో... పంజాబ్ సూపర్ గెలుపు) -
కింగ్స్ పంజాబ్ కేక..
దుబాయ్: ఈ ఐపీఎల్ సీజన్లో ఒకే మ్యాచ్‌లో రెండు సూపర్ ఓవర్లు పడ్డాయి. ఇందుకు ముంబై ఇండియన్స్-కింగ్స్ పంజాబ్ మ్యాచ్ వేదికైంది. ముందు జరిగిన సూపర్ ఓవర్ టై కావడంతో రెండో సూపర్ ఓవర్ అనివార్యమైంది. తొలి సూపర్ ఓవర్లో ఇరు జట్లు ఐదేసి పరుగులే చేయడంతో రెండో సూపర్ ఆడించారు. ఆ సూపర్ ఓవర్లో కింగ్స్ పంజాబ్‌ను విజయం వరించింది. రెండో సూపర్ ఓవర్లో ముంబై 11 పరుగులు చేయగా, దాన్ని కింగ్స్ ఛేదించింది. మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్లు బ్యాటింగ్‌కు దిగారు. బౌల్ట్ వేసిన తొలి బంతిని గేల్ సిక్స్ కొట్టగా, ఆ తర్వాత బంతికి సింగిల్ తీశాడు. ఇక మూడో బంతికి అగర్వాల్ ఫోర్ కొట్టాడు. ఇక నాల్గో బంతికి మరో బౌండరీకి కొట్టడంతో కింగ్స్ పంజాబ్ లక్ష్యాన్ని పూర్తి చేసి విజేతగా నిలిచింది. అంతకముందు ప్రధాన మ్యాచ్‌లో ముంబై నిర్దేశించిన 177 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో కింగ్స్ పంజాబ్ కూడా సరిగ్గా అన్ని పరుగులే చేసింది. చివరి ఓవర్లో కింగ్స్ పంజాబ్ విజయానికి 9 పరుగులు అవసరం కాగా, 8 పరుగులే చేశారు. బౌల్ట్ వేసిన ఆఖరి ఓవర్‌ను కట్టుదిట్టంగా వేయడంతో మ్యాచ్ టై అయ్యింది. దాంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది. కేఎల్ రాహుల్(77;51 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) మరోసారి రాణించాడు,. కింగ్స్ పంజాబ్ జట్టులో టాపార్డర్ ఆటగాళ్లు విఫలమైనా రాహుల్ మాత్రం మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు. లక్ష్య ఛేదనలో కింగ్స్ పంజాబ్ ఆదిలోనే మయాంక్ అగర్వాల్(11) వికెట్‌ను కోల్పోయింది. క్రిస్ గేల్(24; 21 బంతుల్లో 1 ఫోర్, 2సిక్స్‌లు) ఫర్వాలేదనిపించగా, నికోలస్ పూరన్(24; 12 బంతుల్లో 2 ఫోర్లు, 2సిక్స్‌లు) ఉన్నంత సేపు మెరుపులు మెరిపించాడు. కింగ్స్ విజయానికి 24 పరుగులు కావాల్సిన తరుణంలో రాహుల్ ఔటయ్యాడు. బుమ్రా వేసిన 18 ఓవర్ మూడో బంతికి రాహుల్ బౌల్డ్ అయ్యాడు. కింగ్స్ పంజాబ్ రెండు ఓవర్లలో 22 పరుగులు అవసరం కాగా, దీపక్ హుడా, జోర్డాన్లు 21 పరుగులే చేశారు. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లకు 176 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ ఆదిలోనే రోహిత్ శర్మ(9), సూర్యకుమార్ యాదవ్(0) వికెట్లను కోల్పోయింది. అర్షదీప్ వేసిన మూడో ఓవర్ ఐదో బంతికి రోహిత్ ఔట్ కాగా, షమీ వేసిన నాల్గో ఓవర్ మూడో బంతికి సూర్యకుమార్ డకౌట్ అయ్యాడు. ఇక ఇషాన్ కిషన్(7) కూడా నిరాశపరిచాడు. డీకాక్(53; 43 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు)లకు జతగా కృనాల్ పాండ్యా(34; 30 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నాడు. హార్దిక్ పాండ్యా(8) విఫలం కాగా, చివర్లో పొలార్డ్(34 నాటౌట్; 12 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్‌లు), కౌల్టర్ నైల్(24 నాటౌట్; 12 బంతుల్లో 4 ఫోర్లు)లు బ్యాట్ ఝుళిపించడంతో ముంబై గౌరవప్రదమైన స్కోరు చేసింది. కింగ్స్ పంజాబ్ బౌలర్లలో మహ్మద్ షమీ, అర్షదీప్‌లు తలో రెండు వికెట్లు సాధించగా, క్రిస్ జోర్డాన్, రవి బిష్నోయ్‌లు చెరో వికెట్ తీశారు. -
అప్పుడు సచిన్.. ఇప్పుడు డీకాక్
దుబాయ్: కింగ్స్ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 177 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ ఆదిలోనే రోహిత్ శర్మ(9), సూర్యకుమార్ యాదవ్(0) వికెట్లను కోల్పోయింది. అర్షదీప్ వేసిన మూడో ఓవర్ ఐదో బంతికి రోహిత్ ఔట్ కాగా, షమీ వేసిన నాల్గో ఓవర్ మూడో బంతికి సూర్యకుమార్ డకౌట్ అయ్యాడు. ఇక ఇషాన్ కిషన్(7) కూడా నిరాశపరిచాడు. డీకాక్(53; 43 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు)లకు జతగా కృనాల్ పాండ్యా(34; 30 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నాడు. హార్దిక్ పాండ్యా(8) విఫలం కాగా, చివర్లో పొలార్డ్(34 నాటౌట్; 12 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్‌లు), కౌల్టర్ నైల్(24 నాటౌట్; 12 బంతుల్లో 4 ఫోర్లు)లు బ్యాట్ ఝుళిపించడంతో ముంబై నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లకు 176 పరుగులు చేసింది. కింగ్స్ పంజాబ్ బౌలర్లలో మహ్మద్ షమీ, అర్షదీప్‌లు తలో రెండు వికెట్లు సాధించగా, క్రిస్ జోర్డాన్, రవి బిష్నోయ్‌లు చెరో వికెట్ తీశారు. సచిన్ తర్వాత డీకాక్ ఈ సీజన్లో డీకాక్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. చివరి ఐదు ఇన్నింగ్స్‌ల్లో నాలుగు హాఫ్ సెంచరీలు సాధించాడు. ఇందులో మూడు వరుస హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం. కింగ్స్ పంజాబ్‌తో మ్యాచ్‌కు ముందు కేకేఆర్‌పై 78 పరుగులు సాధించిన డీకాక్.. అంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో 53 పరుగులు చేశాడు. ఫలితంగా ముంబై ఇండియన్స్ తరఫున వరుసగా మూడు హాఫ్ సెంచరీలు సాధించిన రెండో ప్లేయర్‌గా రికార్డు సాధించాడు. 2010లో ఈ ఫీట్‌ను సచిన్ టెండూల్కర్ నమోదు చేయగా, ఆ తర్వాత మరో పదేళ్లకు ముంబై తరఫున ఆ ఘనతను డీకాక్ నమోదు చేశాడు. ఈ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో డీకాక్ 67 పరుగులు సాధించిన సంగతి తెలిసిందే. -
‘ఆ స్థితిలో బ్యాటింగ్ వద్దే వద్దు’
షార్జా: ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ చివరి బంతికి గెలిచినా ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించడం ఆ జట్టులో ఆత్మవిశ్వాసాన్ని తీసుకొచ్చింది. వరుస ఓటముల తర్వాత కింగ్స్ పంజాబ్ శిబిరంలో ఆనందం వెల్లివిరిసింది. తనపై పెట్టుకున్న అంచనాలను నిజం చేస్తూ స్టార్ ప్లేయర్ క్రిస్ గేల్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఫస్ట్ డౌన్లో వచ్చినా తడబాటు లేకుండా ఆచితూచి బ్యాటింగ్ చేశాడు గేల్. 45 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్స్‌లతో 53 పరుగులు సాధించిన గేల్ తన విలువ ఏమిటో చూపించాడు. మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించిన గేల్‌పై ఇప్పుడు ప్రశంసల వర్షం కురుస్తోంది. యూనివర్శల్ బాస్ అని ముద్దుగా పిలుచుకునే గేల్‌ను సహచర ఆటగాడు నికోలస్ పూరన్ కొనియాడాడు. (గెలిచారు కదా.. మొహం అలా పెట్టావేంటి?) ‘నా ప్రకారం గేల్ ఒక గ్రేటెస్ట్ టీ20 ప్లేయర్. గేల్ బ్యాటింగ్ చేస్తుంటే విజయం సాధించే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. గేల్ ఒకసారి క్రీజ్‌లోకి వెళ్లాడంటే ఆ మజానే వేరుగా ఉంటుంది. ఆర్సీబీతో మ్యాచ్‌లో మెల్లగా ఇన్నింగ్స్ ప్రారంభించాడు. చాలాకాలం నుంచి గేల్ క్రికెట్ ఆడటం లేదు. కానీ మళ్లీ గ్రేటెస్ట్ టీ20 ప్లేయర్ అని నిరూపించుకున్నాడు. గేల్ పరుగులు సాధిస్తుంటే అద్భుతంగా ఉంటుంది. చివరి ఓవర్లో మూడు బంతులకు పరుగు మాత్రమే వచ్చింది. దాంతో నాకు ఢిల్లీతో జరిగిన మ్యాచ్ గుర్తుకొచ్చింది. డగౌట్లో ఉన్న నాలో ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. అవి చాలా గందరగోళానికి గురి చేశాయి. చివరి బంతికి నాకు బ్యాటింగ్ చేసే అవకాశం చాలా కాలం తర్వాత వచ్చింది. అంత ఉత్కంఠగా ఉన్నప్పుడు ఎప్పుడూ బ్యాటింగ్ చేయాలని ఎప్పుడూ కోరుకును. అటువంటి స్థితిలో బ్యాటింగ్ వద్దే వద్దు.. కూర్చొని కూర్చొని ఆఖరి బంతికి బ్యాటింగ్‌కు దిగిన సమయంలో ఏమి చేస్తాననే ఆందోళన ఉంది. ఆ బంతి మ్యాచ్‌ను డిసైడ్ చేసే కావడంతో టెన్షన్ పడ్డా. మ్యాచ్‌ను సిక్స్‌తో ముగించినందుకు ఆనందంగా ఉంది’ అని మ్యాచ్ తర్వాత మయాంక్ అగర్వాల్‌తో తన అనుభవాన్ని షేర్ చేసుకున్నాడు పూరన్.(ఈ పేరుకు కొంచెం గౌరవం ఇవ్వండి : గేల్) -
గెలిచారు కదా.. మొహం అలా పెట్టావేంటి?
షార్జా: ప్రస్తుత ఐపీఎల్లో పదే పదే ట్రోలింగ్ బారిన పడుతున్న క్రికెటర్లలో కింగ్స్ పంజాబ్ ఆల్ రౌండర్, న్యూజిలాండ్ క్రికెటర్ జిమ్మీ నీషమ్ ఒకడు. కొన్ని రోజుల క్రితం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ ఓడిపోయిన తరుణంలో నీషమ్ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. దాంతో నీషమ్‌ను టార్గెట్ చేస్తూ ఫ్యాన్స్ విరుచుకుపడ్డారు. అదే సమయంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కూడా నీషమ్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. అసలు నీషమ్ పూర్తిస్థాయి ఆల్ రౌండర్ కానప్పుడు జట్టులో ఎందుకు అంటూ తన యూట్యూబ్ చానల్లో ప్రశ్నించాడు. అటు బ్యాటింగ్ ఆల్‌రౌండర్, ఇటు బౌలింగ్ ఆల్‌రౌండర్ కాని ఆల్‌రౌండర్ అంటూ నీషమ్‌కు చురకలంటించాడు. (4 ఏళ్ల నాటి సల్మాన్ ట్వీట్ వైరల్..) దీనికి నీషమ్ సైతం ఘాటుగానే సమాధానం చెప్పడం, ఆపై ఆకాశ్ చోప్రా కూడా మళ్లీ రిప్లై ఇవ్వడం కూడా జరిగాయి. అది కింగ్స్ పంజాబ్ ఓడిపోయిన మ్యాచ్. ఇప్పడు కింగ్స్ పంజాబ్ గెలిచిన మ్యాచ్ కూడా నీషమ్‌పై విమర్శలు తప్పడం లేదు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ చివరి బంతికి గెలిచింది. ఆ తరుణంలో కింగ్స్ పంజాబ్ శిబిరం అంతా సంబరాలు చేసుకుంటుంటే నీషమ్ మాత్రం అలానే కూర్చొని ఉన్నాడు. మొహం అదోలా పెట్టి తదేకంగా ఆలోచనలో మునిగిపోయాడు. మ్యాచ్ ఎవరు గెలిస్తే మనకెందుకెలా అన్నట్లు డగౌట్ కూర్చొని ఏదో లోకంలో విహరిస్తున్నట్లు కనిపించాడు. నీషమ్ ఉన్నచోట నుంచి లేవకుండా జట్టును ఉత్సాహపరచకపోవడంతో దాన్ని ఫోటోలు తీసిన భిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేశారు.. మ్యాచ్ గెలిచారు కదా మొహం అలా పెట్టావేంటి అంటూ విమర్శించారు. ఒకవైపు హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే, ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్‌లు చప్పట్లతో జట్టును అభినందిస్తూ ఉంటే నీషమ్ ఏమి పట్టన్నట్లు ఉండిపోయాడు. ఈ ఐపీఎల్ సీజన్లో సుదీర్ఘ విరామం తర్వాత కింగ్స్ పంజాబ్ మరో గెలుపును ఖాతాలో వేసుకుంది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. , చహల్ వేసిన ఆఖరి ఓవర్లో హైడ్రామా చోటు చేసుకుంది. ఆ ఓవర్లో కింగ్స్ పంజాబ్‌కు రెండు పరుగులు అవసరం కాగా, చహల్ తొలి నాలుగు బంతులకు పరుగు మాత్రమే ఇచ్చాడు. ఇక ఐదో బంతికి గేల్ రనౌట్ అయ్యాడు. దాంతో ఉత్కంఠ ఏర్పడింది. కానీ పూరన్ సిక్స్‌తో ఇన్నింగ్స్‌ను ఫినిష్ చేయడంతో కింగ్స్ పంజాబ్‌కు విజయం దక్కింది. (కెప్టెన్సీకి దినేశ్ కార్తీక్ గుడ్ బై) -
4 ఏళ్ల నాటి సల్మాన్ ట్వీట్ వైరల్..
ముంబై: ఈ ఐపీఎల్ సీజన్లో సుదీర్ఘ విరామం తర్వాత కింగ్స్ పంజాబ్ మరో గెలుపును ఖాతాలో వేసుకుంది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా, ఆ మ్యాచ్ ఆఖరి బంతి వరకూ వెళ్లడంతో ఉత్కంఠ ఏర్పడింది. ‘పాపం.. పంజాబ్. మళ్లీ ఓడిపోతుందా’ అనిపించింది. చహల్ వేసిన ఆఖరి ఓవర్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆ ఓవర్లో కింగ్స్ పంజాబ్‌కు రెండు పరుగులు అవసరం కాగా, చహల్ తొలి నాలుగు బంతులకు పరుగు మాత్రమే ఇచ్చాడు. ఇక ఐదో బంతికి గేల్ రనౌట్ అయ్యాడు. దాంతో ఉత్కంఠ ఏర్పడింది. (కెప్టెన్సీకి దినేశ్ కార్తీక్ గుడ్ బై) కానీ పూరన్ సిక్స్‌తో ఇన్నింగ్స్‌ను ఫినిష్ చేయడంతో కింగ్స్ పంజాబ్ ఊపిరి పీల్చుకుంది. వరుస ఓటములతో ఢీలా పడ్డ కింగ్స్ పంజాబ్‌కు గేల్ ఓ మంచి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. తన మార్కు స్టైల్ ఆటతో పంజాబ్ ఊపిరి తీసుకునే విజయాన్ని అందించాడు. తొలుత నెమ్మదిగా ఆడిన గేల్ తర్వాత సిక్స్‌లతో మంచి జోష్ తీసుకొచ్చాడు. 45 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్స్‌లతో 53 పరుగులు సాధించిన గేల్ తన విలువ ఏమిటో చూపించాడు. అతనికి జతగా కేఎల్ రాహుల్(61 నాటౌట్; 49 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్స్‌లు), మయాంక్ అగర్వాల్(45; 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు)లు రాణించడంతో కింగ్స్ గెలిచింది. కాగా, కింగ్స్ పంజాబ్ గెలుపు తర్వాత నాలుగేళ్ల క్రితం బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. 2014లో కింగ్స్ పంజాబ్ ఫైనల్లో ఓడిపోవడంపై అప్పుడు సల్మాన్ ట్వీట్ చేశాడు. ‘ప్రీతి జింటా జట్టు గెలిచిందా.. ఏమిటి?’ అంటూ సరదాగా ట్వీట్ చేశాడు. అది ఇప్పుడు మరొకసారి వైరల్ అవుతోంది. నిన్న ఆర్సీబీతో మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ విజయం సాధించడంతో ఆనాటి సల్మాన్ ట్వీట్‌ను పంజాబ్ ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు. ఇదిగో కింగ్స్ పంజాబ్ గెలిచింది సల్మాన్.. ఈ సీజన్లో ఆర్సీబీపై ఒకసారి కాదు.. రెండు సార్లు గెలిచింది పంజాబ్ ’ అంటూ సల్మాన్ ట్వీట్‌ను వైరల్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. కేకేఆర్‌తో జరిగిన ఆనాటి ఫైనల్లో కింగ్స్ పోరాడి ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్ 199 పరుగులు చేయగా, దాన్ని కేకేఆర్ ఇంకా మూడు బంతులు ఉండగా ఛేదించి విజయం సాధించింది. అప్పుడు కేకేఆర్ జట్టులో ఉన్న మనీష్ పాండే 94 పరుగులు చేసి కేకేఆర్ ట్రోఫీ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. కాగా, అప్పుడు ట్రోఫీ సాధించాలనుకున్న కింగ్స్ పంజాబ్ ఆశలు తీరలేదు. ఇప్పటివరకూ కింగ్స్ పంజాబ్ ఐపీఎల్ టైటిల్‌ను సాధించలేదు. ఆ జట్టుకు బాలీవుడ్ నటి ప్రీతిజింటా సహ యజమానిగా వ్యవహరిస్తున్నారు. -
ఉత్కంఠ పోరు.. చివరి బంతికి గెలిచారు
షార్జా: ఈ ఐపీఎల్ సీజన్లో సుదీర్ఘ విరామం తర్వాత కింగ్స్ పంజాబ్ మరో గెలుపును ఖాతాలో వేసుకుంది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వరుస ఓటములతో ఢీలా పడ్డ కింగ్స్ పంజాబ్‌కు గేల్ ఓ మంచి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. తన మార్కు స్టైల్ ఆటతో పంజాబ్ ఊపిరి తీసుకునే విజయాన్ని అందించాడు. తొలుత నెమ్మదిగా ఆడిన గేల్ తర్వాత సిక్స్‌లతో మంచి జోష్ తీసుకొచ్చాడు. 45 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్స్‌లతో 53 పరుగులు సాధించిన గేల్ తన విలువ ఏమిటో చూపించాడు. అతనికి జతగా కేఎల్ రాహుల్(61 నాటౌట్; 49 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్స్‌లు) మరోసారి రాణించడంతో కింగ్స్ పంజాబ్ విజయం సాధించింది. కింగ్స్‌పంజాబ్ జట్టులో మయాంక్ అగర్వాల్(45; 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా బ్యాటింగ్ చేసి మంచి ఆరంభాన్నిచ్చాడు. ఆ తర్వాత గేల్, రాహుల్‌లు ఓ సొగసైన ఇన్నింగ్స్ ఆడారు. కాగా, చహల్ వేసిన ఆఖరి ఓవర్లో హైడ్రామా చోటు చేసుకుంది. ఆ ఓవర్లో కింగ్స్ పంజాబ్‌కు రెండు పరుగులు అవసరం కాగా, చహల్ తొలి నాలుగు బంతులకు పరుగు మాత్రమే ఇచ్చాడు. ఇక ఐదో బంతికి గేల్ రనౌట్ అయ్యాడు. దాంతో ఉత్కంఠ ఏర్పడింది. కానీ పూరన్ సిక్స్‌తో ఇన్నింగ్స్‌ను ఫినిష్ చేయడంతో కింగ్స్ పంజాబ్‌కు విజయం దక్కింది. ఆర్సీబీ బౌలర్లలో చహల్‌కు మాత్రమే వికెట్ లభించింది. ఈ సీజన్లో ఆర్సీబీతో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ కింగ్స్ పంజాబ్‌దే పైచేయి అయ్యింది. ఇది పంజాబ్‌కు రెండో విజయం కాగా, ఆర్సీబీకి మూడో ఓటమి. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 172 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది.టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీకి శుభారంభం లభించలేదు. అరోన్ ఫించ్(20), దేవదూత్ పడిక్కల్(18)లు నిరాశపరిచారు. మురుగన్ అశ్విన్ బౌలింగ్‌లో ఫించ్ ఔట్ కాగా, అర్షదీప్ బౌలింగ్‌లో పడిక్కల్ పెవిలియన్ చేరాడు. వీరిద్దరూ ఏడు ఓవర్లలోపే పెవిలియన్‌కు వెళ్లారు. ఆ తరుణంలో కోహ్లి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఆదిలోనే ఆర్సీబీ వికెట్లను చేజార్చుకోవడంతో కోహ్లి మరో మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లి(48; 39 బంతుల్లో 3ఫోర్లు) జట్టు స్కోరును గాడిలో పెట్టాడు. అతనికి జతగా శివం దూబే(23; 19 బంతుల్లో 2 సిక్స్)లు కాసేపు మెరుపులు మెరిపించాడు. కానీ ఏబీ డివిలియర్స్(2) విఫలం కావడంతో ఆర్సీబీ స్కోరులో వేగం తగ్గింది. డివిలియర్స్ ఐదో వికెట్‌గా ఔటైన కాసేపటికే కోహ్లి ఆరో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. స్కోరును పెంచే క్రమంలో కోహ్లి ఔటయ్యాడు. దాంతో హాఫ్ సెంచరీ చేసే అవకాశాన్ని కోహ్లి చేజార్చుకున్నాడు. షమీ బౌలింగ్‌లో రాహుల్ క్యాచ్ పట్టడంతో కోహ్లి ఇన్నింగ్స్ ముగిసింది. చివర్లో క్రిస్ మోరిస్(25 నాటౌట్; 8 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు) బ్యాట్ ఝుళిపించాడు. షమీ వేసిన ఆఖరి ఓవర్లో క్రిస్ మోరిస్ 1 ఫోర్, రెండు సిక్స్‌లు కొట్టగా, ఉదానా ఒక సిక్స్ కొట్టాడు. చివరి ఓవర్లో ఆర్సీబీ 24 పరుగులు పిండుకుంది. దాంతో ఆర్సీబీ ఆరు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. మిగతా ఆర్సీబీ ఆటగాళ్లలో వాషింగ్టన్ సుందర్(13), ఉదాన(10 నాటౌట్; 1సిక్స్)లు ఫర్వాలేదనిపించారు. కింగ్స్ పంజాబ్ బౌలర్లలో మహ్మద్ షమీ, మురుగన్ అశ్విన్‌లు తలో రెండు వికెట్లు సాధించగా, అర్షదీప్ సింగ్, క్రిస్ జోర్డాన్లు చెరో వికెట్ తీశారు. -
క్రిస్ గేల్ వచ్చేశాడు..
షార్జా: ఐపీఎల్లో భాగంగా కింగ్స్ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి ముందుగా బ్యాటింగ్‌కు మొగ్గుచూపాడు. ఈ సీజన్లో ఆర్సీబీ ఏడు మ్యాచ్‌లు ఆడి ఐదు విజయాలు సాధించగా, కింగ్స్ పంజాబ్ ఏడు మ్యాచ్‌లకు గాను ఒకదాంట్లో మాత్రమే గెలుపొందింది. అది కూడా ఆర్సీబీపైనే భారీ విజయం సాధించింది కింగ్స్ పంజాబ్. దాంతో ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది విరాట్ గ్యాంగ్. ఇప్పటివరకూ ఇరుజట్లు 25సార్లు ముఖాముఖి తలపడితే కింగ్స్ పంజాబ్ 13 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, ఆర్సీబీ 12 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ గత జట్టుతోనే బరిలోకి దిగుతుండగా, కింగ్స్ పంజాబ్ మూడు మార్పులు చేసింది. క్రిస్ గేల్, దీపక్ హుడా, మురుగన్ అశ్విన్ జట్టులోకి వచ్చారు. ప్రబ్సిమ్రాన్, ముజీబ్, మన్దీప్లకు విశ్రాంతి ఇచ్చారు. (కేఎల్ రాహుల్‌కు కోహ్లి వార్నింగ్!) ఇరుజట్లలో కీలక ఆటగాళ్లు ఉండటంతో పోరు ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. ఆర్సీబీ జట్టులో కోహ్లి, దేవదూత్ పడిక్కల్, అరోన్ ఫించ్, ఏబీ డివిలియర్స్‌లు బ్యాటింగ్ బలంగా కాగా, బౌలింగ్‌లో చహల్, ఇసురు ఉదాన, వాషింగ్టన్ సుందర్, సైనీలు కీలకంగా ఉన్నారు. ఇక ఆల్‌రౌండర్ కోటాలో క్రిస్ మోరిస్ ఉండటంతో ఆర్సీబీ బలం పెరిగింది. ఇక కింగ్స్ పంజాబ్ జట్టులో కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, నికోలస్ పూరన్‌లే ప్రధానం, బౌలింగ్‌లో మహ్మద్ షమీ, రవి బిష్నోయ్, షెల్డాన్ కాట్రెల్‌లు కీలకం. తాజాగా క్రిస్ గేల్ రావడంతో అతను ఎలా ఆడతాడనే దాని కోసం కింగ్స్ పంజాబ్ అభిమానులు ఆశగా చూస్తున్నారు. గేల్ విరుచుకుపడి పంజాబ్‌కు విజయాన్ని అందిస్తాడనే ధీమాతో ఉన్నారు ఆ ఫ్రాంచైజీ ఫ్యాన్స్. డివిలియర్స్ వర్సెస్ బిష్నోయ్ ఈ మ్యాచ్‌లో డివిలియర్స్-బిష్నోయ్ల మధ్య ఆసక్తికర పోరు జరగవచ్చు. బ్యాటింగ్‌లో విశ్వరూపం ప్రదర్శిస్తున్న డివిలియర్స్‌కు యువ స్పిన్ అస్త్రం బిష్నోయ్ నుంచి ప్రమాదం లేకపోలేదు. ఈ ఐపీఎల్ ద్వారా అరంగేట్రం చేసిన బిష్నోయ్లో రెట్టించిన ఆత్మవిశ్వాసం కనబడుతోంది. ఒక బంతిని కొట్టినా ఆ తర్వాత ఎటువంటి జంకు లేకుండా బౌలింగ్ చేస్తున్న తీరు శభాష్ అనిపిస్తోంది. ఇప్పటివరకూ బిష్నోయ్ ఎనిమిది వికెట్లు సాధించగా, డివిలియర్స్ 228 పరుగులు సాధించాడు. ఇక్కడ ఏబీడి స్టైక్‌రేట్ 185. 36 గా ఉండగా, బిష్నోయ్ ఎకానమీ 7.85గా ఉంది. ఇక రాహుల్- క్రిస్ మోరిస్ల మధ్య పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి. ఈ సీజన్లో రాహుల్ 387 పరుగులతో టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. అందులో అజేయంగా 132 పరుగులు సాధించాడు. మరొకవైపు మోరిస్ ఆర్సీబీ తరఫున రెండు మ్యాచ్‌లే ఆడి ఐదు వికెట్లు సాధించాగు. ఇక్కడ మోరిస్ ఎకానమీ 4.50గా ఉంది. ఆర్సీబీ తుదిజట్టు విరాట్ కోహ్లి(కెప్టెన్), ఏబీ డివిలియర్స్, అరోన్ ఫించ్, దేవదూత్ పడిక్కల్, వాషింగ్టన్ సుందర్, శివం దూబే, క్రిస్ మోరిస్, ఇసురు ఉదాన, నవదీప్ సైనీ, మహ్మద్ సిరాజ్, చహల్ కింగ్స్ పంజాబ్ కేఎల్ రాహుల్(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, నికోలస్ పూరన్, క్రిస్ గేల్, మ్యాక్స్‌వెల్, దీపక్ హుడా, క్రిస్ జోర్డాన్, మురుగన్ అశ్విన్, మహ్మద్ షమీ, రవి బిష్నోయ్, అర్షదీప్ సింగ్ -
క్రిస్ గేల్ వస్తున్నాడు.. రాత మారుస్తాడా?
దుబాయ్: కింగ్స్ పంజాబ్ స్టార్ ఆటగాడు క్రిస్ గేల్ ఫిట్ అయ్యాడు. ఫుడ్ పాయిజిన్ కారణంగా ఆడుతాడనుకున్న గేల్.. కొన్ని మ్యాచ్‌లకు అనూహ్యంగా దూరమయ్యాడు. అయితే గేల్ కోలుకున్నట్లు కింగ్స్ పంజాబ్ తన అధికారిక వెబ్సైట్లో వెల్లడించింది. దాంతో తదుపరి మ్యాచ్‌లో గేల్ ఆడటం దాదాపు ఖాయమైంది. సన్‌రైజర్స్ జరిగిన మ్యాచ్‌లో గేల్ ఆడతాడని అంతా భావించారు. కాగా, చివరి నిమిషంలో ఫుడ్ పాయిజన్ కావడంతో అస్వస్థతకు గురైన గేల్ ఆ మ్యాచ్‌కు దూరం కావడంతో పాటు కేకేఆర్‌తో మ్యాచ్‌లో కూడా ఆడలేదు. ఆ రెండు మ్యాచ్‌లను కింగ్స్ పంజాబ్ కోల్పోయింది. (డిఫెన్స్ చెక్ చేయబోయి గోల్డెన్ డక్ అయ్యాడు..) గురువారం ఆర్సీబీతో షార్జాలో జరగబోయే మ్యాచ్‌లో గేల్ ఆడతాడని అభిమానులు ఆశిస్తున్నారు. షార్జాలో మ్యాచ్ కాబట్టి పించ్ హిట్టర్ గేల్‌ను ఆడించడానికి కింగ్స్ పంజాబ్ ఏమాత్రం వెనకాడదు. ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో ఇక రాబోవు మ్యాచ్‌ల్లో గేల్ మెరుపులు మనకు కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి కింగ్స్ పంజాబ్ రాతను గేల్ మారుస్తాడో లేదో చూడాలి. ఇప్పటివరకూ కింగ్స్ పంజాబ్ ఏడు మ్యాచ్‌లు ఆడి ఒకదాంట్లో మాత్రమే విజయం సాధించి చివరి స్థానంలో ఉంది. -
రాహుల్ ఎవరి మాట వినడా.. అంతేనా?
దుబాయ్: ప్రపంచ క్రికెట్లో ఇటీవల కాలంలో క్రికెటర్ల ట్రేడ్ మార్క్ స్టైల్ అనేది అభిమానుల్ని ఎక్కువగా అలరిస్తోంది. ఆటతో పాటు ట్రేడ్ మార్క్ స్టైల్‌తో ముందుకు సాగుతున్నారు పలువురు క్రికెటర్లు. ముఖ్యంగా వెస్టిండీస్ ఆటగాళ్లు అయితే ఈ విషయంలో యూనిక్ స్టైల్‌ను ఫాలో అవుతారు. ఒకరు గంగ్నమ్ డ్యాన్స్ చేస్తే.. మరొకరు సెల్యూట్ చేస్తుంటారు. మరొకరు నోట్ బుక్ స్టైల్‌ను ఫాలో అవుతారు. ఇక బ్యాట్స్‌మెన్ కూడా సెంచరీ చేసిన తర్వాత తమదైన శైలిలో సంబరాలు జరుపుకుంటారు. టీమిండియా క్రికెట్లో ఆకాశం వైపు చూస్తే, మరికొందరూ తమ ప్రియసఖిలకు ఫ్లైయింగ్ కిస్‌లు ఇస్తుంటారు. వీరిలో కింగ్స్ పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌ది కూడా ప్రత్యేక మైన స్టైల్.(ఆ ఇద్దరి కెప్టెన్లకు థాంక్స్: దినేశ్ కార్తీక్) రెండు చేతులతో చెవులను మూసుకొని, కళ్లూ మూసుకొని సెలెబ్రేట్ చేసుకుంటాడు. కేఎల్ రాహుల్ గత ఏడాదిన్నరగా ఈ స్టైల్‌ను ఫాలో అవుతున్నాడు. ఐపీఎల్ 2020 సీజన్లో భాగంగా గత నెల 24వ తేదీన రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో రాహుల్(132 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగాడు. శతకం పూర్తయిన తర్వాత కూడా తన ట్రేడ్ మార్క్ సెలెబ్రేషన్ చేసుకున్నాడు. దీంతో అభిమానులు, కామెంటేటర్లు ఈ సెలెబ్రేషన్కు అర్థం ఏంటనీ తెలుసుకోవడానికి ప్రయత్నించారు. మీడియా కూడా ఈ విషయాన్ని రాహుల్ ముందు ప్రస్తావించింది. కానీ అతను మాత్రం కారణం వెల్లడించలేదు. అయితే దీనికి అర్థం చేసుకోవడానికి టీమిండియా మాజీ క్రికెటర్, తెలుగు కామెంటేటర్ వేణుగోపాల్ రావు.. రాహుల్ సెలబ్రేషన్ స్టైల్ వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకోవడానికి యత్నించాడు. సోషల్ మీడియా వేదిక అభిమానులను ప్రశ్నించాడు. కానీ ఫలితం రాలేదు. కాగా, తన సహచర కామెంటేటర్ కల్యాణ్ కృష్ణ ఈ ట్రేడ్ మార్క్ స్టైల్ వేనుకున్న కారణం తెలుసుకున్నాడు. కర్ణాటక కామెంటేటర్ విజయ్ భరద్వాజ్ ద్వారా ఈ విషయం తెలుసుకున్నానని కల్యాణ్ తెలిపాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్ సందర్భంగా కల్యాణ్ ఈ విషయాన్ని తెలియజేశాడు. ‘నేను ఎవరి మాట వినను.. ఏం చేయాలనుకుంటానో అది చేసి చూపిస్తాను' అనేదే కేఎల్ రాహుల్ ట్రేడ్ మార్క్ స్టైల్‌కు అర్థమని చెప్పాడు. మరి కేఎల్ రాహుల్ ఎవరి మాటా వినడా.. ఏం చేయాలో అది చేస్తాడా? అంతేనా అని అనుకోవడం ఫ్యాన్స్ వంతైంది. -
ఆ ఇద్దరి కెప్టెన్లకు థాంక్స్: దినేశ్ కార్తీక్
అబుదాబి: పంజాబ్ కింగ్స్ ఎలెవన్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 2 పరుగులతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 164 పరుగులు చేసింది. కెప్టెన్ దినేశ్ కార్తీక్ (29 బంతుల్లో 58; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు అర్ధ సెంచరీ సాధించాడు. శుబ్‌మన్ గిల్ (47 బంతుల్లో 57; 5 ఫోర్లు) ఆకట్టుకున్నాడు. అనంతరం పంజాబ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 162 పరుగులు చేసి ఓడిపోయింది. మ్యాచ్ తర్వాత దినేశ్ కార్తీక్ మాట్లాడుతూ.. ‘ రాహుల్, మయాంక్‌లు ఆడుతున్నంతసేపు మ్యాచ్ కింగ్స్ పంజాబ్ చేతిల్లోనే ఉంది. ఆ సమయంలో మ్యాచ్‌ను మావైపు తిప్పుకోవడానికి ఉన్న వనరులన్నీ ఉపయోగించాం. సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తిలతో పాటు ప్రసిద్ధ్ కృష్ణ కూడా బాగా బౌలింగ్ చేశాడు. (గేల్.. నువ్వు త్వరగా కోలుకోవాలి) ఈ సీజన్లో తొలి గేమ్ ఆడుతున్న ప్రసిద్ధ్ మెరుగైన ప్రదర్శన చేశాడు. ప్రత్యేకంగా అతని రెండో స్పెల్‌లో విపరీతంగా ఆకట్టుకున్నాడు. ఇక నరైన్ ఎప్పుడూ బాగా అండగా నిలుస్తాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు మంచి బ్రేక్‌లు ఇస్తాడు. అయితే ఈ క్రెడిట్ అంతా ఇయాన్ మోర్గాన్, కోచ్ మెకల్లమ్‌కే చెందుతుంది. క్లిష్ట సమయంలో మోర్గాన్ సలహాలు ఉపయోగపడ్డాయి. అదే సమయంలో మెకల్లమ్ చేసిన వర్కౌట్ కూడా ఉపయోగపడింది. జట్టు అవసరాలకు తగ్గట్టు నా బ్యాటింగ్ ఆర్డర్‌ను కూడా ప్రమోట్ చేశాడు. మోర్గాన్, మెకల్లమ్‌లు మా జట్టులో ఉండటం నా అదృష్టం. వీరిద్దరూ వరల్డ్ అత్యుత్తమ కెప్టెన్లు. టీ20 స్పెషలిస్టులు. కింగ్స్ పంజాబ్‌పై విజయంలో వీరి పాత్ర వెలకట్టలేనిది. ప్రత్యేకంగా వీరిద్దరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా’ అని దినేశ్ కార్తీక్ పేర్కొన్నాడు. -
పంజాబ్ ఓటమిపై రాహుల్ అసహనం
అబుదాబి: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పోరాడి ఓడిపోవడంపై కింగ్స్ పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అసహనం వ్యక్తం చేశాడు. కింగ్స్ పంజాబ్ రెండు పరుగుల తేడాతో ఓడిపోవడం రాహుల్‌ను కలిచి వేసింది. ఓపెనింగ్ భాగస్వామ్యం వంద పరుగులకు పైగా ఉన్నప్పటికీ మ్యాచ్‌ను చేజార్చుకోవడంపై రాహుల్ మాట్లాడుతూ.. ‘ ఈ ఓటమికి నా వద్ద సమాధానం లేదు. మేము బౌలింగ్ బాగా చేసి కేకేఆర్‌ను కట్టడి చేశాం. బౌలర్లు పరిస్థితిని బట్టి బౌలింగ్ చేశారు. డెత్ ఓవర్లలో బాగా బౌలింగ్ చేశాం. మేము చేజ్ చేసే క్రమంలో ఎక్కడ కూడా సంతృప్తి చెందామని అనుకోవడం లేదు. (వాటే మ్యాచ్.. కేకేఆర్ విన్నర్) కేవలం గేమ్ గెలిచినప్పుడు మాత్రమే సంతృప్తి చెందాలి. మేము వికెట్లు కోల్పోతూ ఒత్తిడిలో పడ్డాం. లైన్‌ను అధిగమించే ప్రయత్నం చేయలేదు. స్టైక్‌రేట్ చాలా ఎక్కువగా ఉందని అనుకుంటున్నాను. నా వరకూ చూస్తే నేను ఒక్కడ్నే మ్యాచ్‌లను ఎలా గెలిపించగలను. ఒక సారథిగా బాధ్యత తీసుకునే ఆడుతున్నా’ అంటూ రాహుల్ పేర్కొన్నాడు. జట్టు బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే పరాజయాలు వస్తున్నాయని రాహుల్ మాటల ద్వారా తెలుస్తోంది. ఇకనైనా బ్యాటింగ్ కుదుటపడాలని ఆశిస్తున్నాడు. వచ్చే ఏడు మ్యాచ్‌లు తమకు ఎంతో కీలకమని, ఆ మ్యాచ్‌ల్లో కూడా తన శాయశక్తులా విజయం కోసం కృషి చేస్తానని రాహుల్ తెలిపాడు. (‘గేల్‌ను తీసుకోకుండా మళ్లీ తప్పు చేశారు’) కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్‌కు ఓటమి తప్పలేదు. కేకేఆర్ నిర్దేశించిన 165 పరుగుల టార్గెట్ ఛేదనలో కింగ్స్ పంజాబ్ గెలుపు అంచుల వరకూ వచ్చి పరాజయం పాలైంది. ఈ ఉత్కంఠ పోరులో రెండు పరుగుల తేడాతో కింగ్స్ పంజాబ్‌ను ఓటమి వెక్కిరించింది. నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయిన కింగ్స్ పంజాబ్ 162 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(74; 58 బంతుల్లో 6 ఫోర్లు), మయాంక్ అగర్వాల్(56; 39 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్)లు రాణించినా మిగతా వారు విఫలమయ్యారు. -
దినేశ్ కార్తీక్.. ఏం తిన్నావ్: మాజీ క్రికెటర్
అబుదాబి: ఈ ఐపీఎల్ సీజన్లో కేకేఆర్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. చాలాకాలం తర్వాత కార్తీక్ బ్యాట్ నుంచి మంచి సొగసైన ఇన్నింగ్స్ వచ్చింది. అసలు కార్తీక్ ఎందుకు అన్నవారికి సమాధానం చెబుతూ 29 బంతుల్లో 58 పరుగులు సాధించాడు కార్తీక్. ఇందులో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. అంటే దినేశ్ కార్తీక్ సాధించిన పరుగుల్లో 44 పరుగులు ఫోర్లు, సిక్స్‌లు రూపంలోనే రావడం విశేషం. ఇంతటి మంచి ఇన్నింగ్స్ ఆడతాడని మ్యాచ్‌కు ఎవరూ ఊహించకపోవడంతో కాస్త ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అటు మాజీలు, ఇటు ఫ్యాన్స్. దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ తనయుడు టీమిండియా మాజీ క్రికెటర్ రోహన్ గావస్కర్.. దినేశ్ కార్తీక్ స్ట్రోక్ ప్లే గురించి ఒక ట్వీట్ చేశాడు. ‘గుడ్ ఆఫ్టర్నూన్ దినేశ్ కార్తీక్. ఇంతటి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడావ్.. ఇంతకీ ఈరోజు బ్రేక్ ఫాస్ట్ ఏమి చేసి మ్యాచ్‌కు సిద్ధమయ్యావో తెలుసుకోవాలనుకుంటున్నా’ అని ట్వీట్ చేశాడు. ఇదొక అసాధారణమైన ఇన్నింగ్స్ అంటూ కార్తీక్‌పై ప్రశంసలు కురిపించాడు రోహన్. (చదవండి: వాటే మ్యాచ్.. కేకేఆర్ విన్నర్) ఈరోజు(శనివారం)కింగ్స్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. కేకేఆర్ తన 164 పరుగుల స్కోరును కాపాడుకుని విజయకేతనం ఎగురవేసింది. కింగ్స్ పంజాబ్ కడవరకూ పోరాడినా 162 పరుగులకే పరిమితం కావడంతో ఆజట్టుకు మరో ఓటమి ఎదురైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ల్కతా నైట్‌రైడర్స్ 164 పరుగులు చేసింది. శుబ్‌మన్ గిల్(57; 47 బంతుల్లో 5 ఫోర్లు), దినేశ్ కార్తీక్(58; 29 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించడంతో కేకేఆర్ గౌరవప్రదమైన స్కోరు చేసింది. దానికి కింగ్స్ పంజాబ్ ధీటుగా బదులిచ్చినా చివర్లో తేలిపోయింది. పంజాబ్ ఓపెనర్లు కేఎల్ రాహుల్(74; 58 బంతుల్లో 6 ఫోర్లు), మయాంక్ అగర్వాల్(56; 39 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్)లు రాణించినా మిగతా వారు విఫలమయ్యారు. ఓపెనర్లు 115 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పినా ఓటమి పాలుకావడం ఆ జట్టు బ్యాటింగ్ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడింది.ఇది కేకేఆర్‌కు నాల్గో విజయం కాగా, కాగా, పంజాబ్‌కు ఆరో ఓటమి. Good afternoon @DineshKarthik - just wanted to know what you ate for brekka today !! That was some mouth watering stroke play out there mate !! #IPL2020 #kkr #KKRvKXIP — Rohan Gavaskar (@rohangava9) October 10, 2020 -
వాటే మ్యాచ్.. కేకేఆర్ విన్నర్
అబుదాబి: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్‌కు ఓటమి తప్పలేదు. కేకేఆర్ నిర్దేశించిన 165 పరుగుల టార్గెట్ ఛేదనలో కింగ్స్ పంజాబ్ గెలుపు అంచుల వరకూ వచ్చి పరాజయం పాలైంది. ఈ ఉత్కంఠ పోరులో రెండు పరుగుల తేడాతో కింగ్స్ పంజాబ్‌ను ఓటమి వెక్కిరించింది. నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయిన కింగ్స్ పంజాబ్ 162 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(74; 58 బంతుల్లో 6 ఫోర్లు), మయాంక్ అగర్వాల్(56; 39 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్)లు రాణించినా మిగతా వారు విఫలమయ్యారు. కింగ్స్ పంజాబ్‌కు 14 పరుగులు అవసరమైన తరుణంలో రాహుల్ బౌల్డ్ కావడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. 19 ఓవర్ ఆఖరి బంతికి రాహుల్‌ను ప్రసిద్ధ్ క్రిష్ణ బౌల్డ్ చేయడంతో మ్యాచ్ టర్న్ అయిపోయింది. చివరి ఓవర్లో మ్యాక్స్‌వెల్ రెండు ఫోర్లు కొట్టినా ఓటమి తప్పలేదు. ఆఖరి ఓవర్ వేసిన సునీల్ నరైన్ 11 పరుగుల్చి వికెట్ తీసి విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఓపెనర్లు 115 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పినా ఓటమి పాలుకావడం ఆ జట్టు బ్యాటింగ్ వైఫల్యాన్ని మరొకసారి చూపెట్టింది. ఆఖరి బంతికి మ్యాక్స్‌వెల్ ఫోర్ కొట్టడంతో రెండు పరుగుల తేడాతో పరాజయం చెందింది. కేకేఆర్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ మూడు వికెట్లు సాధించగా, నరైన్ రెండు వికెట్లు తీశాడు.(చదవండి: ‘గేల్‌ను తీసుకోకుండా మళ్లీ తప్పు చేశారు’) ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 164 పరుగులు చేసింది. శుబ్‌మన్ గిల్(57; 47 బంతుల్లో 5 ఫోర్లు), దినేశ్ కార్తీక్(58; 29 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించడంతో కేకేఆర్ గౌరవప్రదమైన స్కోరు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కేకేఆర్ ఇన్నింగ్స్‌ను రాహుల్ త్రిపాఠి, శుబ్‌మన్ గిల్లు ఆరంభించారు. కాగా, రాహుల్ త్రిపాఠి(4) తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో త్రిపాఠిని షమీ బౌల్డ్ చేశాడు. అనంతరం నితీష్ రాణా(2) రనౌట్ అయ్యాడు. ఈ రనౌట్ అయ్యే క్రమంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అర్షదీప్ వేసిన నాల్గో ఓవర్ మూడో బంతిని శుబ్‌మన్ గిల్ షార్ట్ ఫైన్‌లెగ్‌లోకి ఆడాడు. అయితే ఆ సమయంలో ఫీల్డర్ ఉన్నాడు. కానీ దాన్ని గ్రహించని నాన్‌స్టైకర్ నితీష్ రాణా స్టైకింగ్ ఎండ్ వైపు పరుగు తీసి అనవరసంగా వికెట్ సమర్పించుకున్నాడు. ఆపై ఇయాన్ మోర్గాన్-గిల్ల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. వీరిద్దరూ 49 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తర్వాత మోర్గాన్(24) ఔటయ్యాడు. ఆ తరుణంలో గిల్‌కు -దినేశ్ కార్తీక్ జత కలిశాడు. అయితే ఎటువంటి ఆశలు లేని కార్తక్ మాత్రం ఈసారి మెరిశాడు. దినేశ్ కార్తీక్ బ్యాట్ నుంచి చూడచక్కని ఇన్నింగ్స్ వచ్చి చాలా కాలమే అయ్యింది. సొగసైన బౌండరీలతో అలరించాడు. ఈ జోడి 82 పరుగుల జోడించిన తర్వాత గిల్ ఔటయ్యాడు. దాంతో కేకేఆర్ తిరిగి తేరుకుంది. అటు తర్వాత కార్తీక్ అర్థ శతకం మార్కును చేరి బ్యాటింగ్‌లో సత్తాచాటి స్కోరు బోర్డును చక్కదిద్దాడు. దినేశ్ కార్తీక్ కడవరకూ క్రీజ్‌లో ఉండటంతో కేకేఆర్ పోరాడే స్కోరును బోర్డుపై ఉంచింది.. రసెల్(5) మరోసారి విఫలయ్యాడు. కింగ్స్ పంజాబ్ బౌలర్లలో మహ్మద్ షమీ, అర్షదీప్ సింగ్, రవిబిష్నోయ్‌లు తలో వికెట్ సాధించారు. ఆఖరి బంతికి కార్తీక్ రనౌట్ అయ్యాడు. ముగ్గురు కేకేఆర్ ఆటగాళ్లు రనౌట్ అయ్యారు. ఇది కేకేఆర్‌కు నాల్గో విజయం కాగా, పంజాబ్‌కు ఆరో ఓటమి. -
‘గేల్‌ను తీసుకోకుండా మళ్లీ తప్పు చేశారు’
దుబాయ్: ఈ ఐపీఎల్ సీజన్లో వరుస ఓటములతో సతమవుతున్నా కింగ్స్ పంజాబ్ తన సెలక్షన్లో పెద్దగా మార్పులేమీ చేయకపోవడంపై వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా పెదవి విరిచాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌కు సైతం పించ్ హిట్టర్ క్రిస్ గేల్‌కు తుది జట్టులో అవకాశం ఇవ్వకపోవడం సరైన నిర్ణయం కాదన్నాడు. కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్‌లకు జతగా క్రిస్ గేల్ కూడా ఉండి ఆ జట్టు బ్యాటింగ్ బలం పెరుగుతుందన్నాడు. బ్యాటింగ్ వైఫల్యం కారణంగా వరుస మ్యాచ్‌లను చేజార్చుకుంటున్న తరుణంలో గేల్‌ను ఆడించకపోవడం తనను నిరుత్సాహానికి గురిచేసిందన్నాడు.(ఎన్నాళ్లకెన్నాళ్లకు దినేశ్ కార్తీక్..) క్రిస్ గేల్ అనేవాడు ప్రత్యర్థి జట్టును భయభ్రాంతులకు గురి చేస్తాడనేది కాదనలేని వాస్తవమన్నాడు. కింగ్స్ పంజాబ్ బ్యాటింగ్‌లో పైచేయి సాధించాలంటే గేల్ జట్టులో ఉంటేనే అది సాధ్యమవుతుందన్నాడు. ఈ ఐపీఎల్లో జోర్డాన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ అతనికి అవకాశం ఇవ్వడం ఇక్కడ సరైనది కాదన్నాడు. కింగ్స్ పంజాబ్ బ్యాటింగ్ లైనప్‌లో క్రిస్ గేల్ ఉంటే ఆ బలమే వేరుగా ఉంటుందని లారా అభిప్రాయపడ్డాడు. కేకేఆర్‌తో మ్యాచ్‌కు ముందు స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడిన లారా.. గేల్‌ను మరొకసారి తీసుకోలేకపోవడం మాత్రం నిరాశకు గురిచేసిందన్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పంజాబ్ ఆడిన గత మ్యాచ్‌లో గేల్‌కు అవకాశం ఉంటుందని చివరి వరకూ ఊరించారు. కానీ ఆఖరి నిమిషంలో గేల్‌కు ఫుడ్ పాయిజన్ అయిందనే కారణంతో తప్పించామని కోచ్ అనిల్ కుంబ్లే చెప్పుకొచ్చాడు. కాగా, కేకేఆర్‌తో మ్యాచ్‌కు గేల్‌ను ఎందుకు తీసుకోలేదని ప్రశ్న మరొకసారి వచ్చింది. కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఫామ్‌లో లేని మ్యాక్స్‌వెల్ స్థానంలో గేల్‌ను ఆడించాలని విశ్లేషకుల సైతం అభిప్రాయపడ్డారు. -
ఎన్నాళ్లకెన్నాళ్లకు దినేశ్ కార్తీక్..
అబుదాబి: ఈ ఐపీఎల్ సీజన్లో భాగంగా కింగ్స్ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 165 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. శుబ్‌మన్ గిల్(57; 47 బంతుల్లో 5 ఫోర్లు), దినేశ్ కార్తీక్(58; 29 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించడంతో కేకేఆర్ గౌరవప్రదమైన స్కోరు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కేకేఆర్ ఇన్నింగ్స్‌ను రాహుల్ త్రిపాఠి, శుబ్‌మన్ గిల్లు ఆరంభించారు. కాగా, రాహుల్ త్రిపాఠి(4) తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో త్రిపాఠిని షమీ బౌల్డ్ చేశాడు. అనంతరం నితీష్ రాణా(2) రనౌట్ అయ్యాడు. ఈ రనౌట్ అయ్యే క్రమంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అర్షదీప్ వేసిన నాల్గో ఓవర్ మూడో బంతిని శుబ్‌మన్ గిల్ షార్ట్ ఫైన్‌లెగ్‌లోకి ఆడాడు. అయితే ఆ సమయంలో ఫీల్డర్ ఉన్నాడు. కానీ దాన్ని గ్రహించని నాన్‌స్టైకర్ నితీష్ రాణా స్టైకింగ్ ఎండ్ వైపు పరుగు తీసి అనవరసంగా వికెట్ సమర్పించుకున్నాడు.(నాన్‌స్టైకర్ పరుగే పరుగు.. ఫన్నీ రనౌట్) ఆపై ఇయాన్ మోర్గాన్-గిల్ల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. వీరిద్దరూ 49 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తర్వాత మోర్గాన్(24) ఔటయ్యాడు. ఆ తరుణంలో గిల్‌కు -దినేశ్ కార్తీక్ జత కలిశాడు. అయితే ఎటువంటి ఆశలు లేని కార్తీక్ మాత్రం ఈసారి మెరిశాడు. దినేశ్ కార్తీక్ బ్యాట్ నుంచి చూడచక్కని ఇన్నింగ్స్ వచ్చిం్ది. సొగసైన బౌండరీలతో అలరించాడు. ఈ జోడి 82 పరుగుల జోడించిన తర్వాత గిల్ ఔటయ్యాడు. దాంతో కేకేఆర్ తిరిగి తేరుకుంది. అటు తర్వాత కార్తీక్ అర్థ శతకం మార్కును చేరి బ్యాటింగ్‌లో సత్తాచాటి స్కోరు బోర్డును చక్కదిద్దాడు. దినేశ్ కార్తీక్ కడవరకూ క్రీజ్‌లో ఉండటంతో కేకేఆర్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. రసెల్(5) మరోసారి విఫలయ్యాడు. కింగ్స్ పంజాబ్ బౌలర్లలో మహ్మద్ షమీ, అర్షదీప్ సింగ్, రవిబిష్నోయ్‌లు తలో వికెట్ సాధించారు. ఆఖరి బంతికి కార్తీక్ రనౌట్ అయ్యాడు. ముగ్గురు కేకేఆర్ ఆటగాళ్లు రనౌట్ అయ్యారు. -
పంజాబ్ బ్యాటింగ్ వర్సెస్ వరుణ్
అబుదాబి: ఈ ఐపీఎల్ సీజన్లో భాగంగా కింగ్స్ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన కేకేఆర్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ ముందుగా బ్యాటింగ్‌కు మొగ్గుచూపాడు. ఇప్పటివరకూ కేకేఆర్ ఐదు మ్యాచ్‌లాడి మూడింట గెలవగా, కింగ్స్ పంజాబ్ ఆరు మ్యాచ్‌లకు గాను ఒకదాంట్లో మాత్రమే విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కూడా కేకేఆర్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. కేకేఆర్ అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్‌లో పుంజుకుని విజయాల్ని ఖాతాలో వేసుకుంటుండగా, కింగ్స్ పంజాబ్ పూర్తిగా ఒకరిద్దరిపైనే ఆధారపడుతూ వరుస పరాజయాల్ని చూస్తోంది. ఈ రోజు మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ సమిష్టిగా రాణించకపోతే మరో పరాభవాన్ని చూడాల్సి వస్తోంది. ఇప్పటివరకూ ఇరు జట్ల మధ్య 25 మ్యాచ్‌లు జరగ్గా, అందులో కేకేఆర్ 17 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, కింగ్స్ పంజాబ్ 8 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తలోక మార్పు చేసింది. శివం మావి స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణ జట్టులోకి రాగా, కాట్రెల్ స్థానంలో జోర్డాన్ తీసుకుంది కింగ్స్ పంజాబ్. శివం మావి చిన్నపాటి గాయం కారణంగా మ్యాచ్‌కు దూరమయ్యాడు. పంజాబ్ బ్యాటింగ్ వర్సెస్ వరుణ్ కింగ్స్ పంజాబ్ బ్యాటింగ్‌లోనే కాస్త బలంగా కనబడుతుండగా, బౌలింగ్‌లో పూర్తిగా తేలిపోతుంది. యువ స్పిన్నర్ రవిబిష్నోయ్ ఒక్కడే బౌలింగ్‌లో మెరుగ్గా ఉన్నాడు.అటు కేకేఆర్ బౌలింగ్ రాటుదేలింది. కింగ్స్ పంజాబ్‌కు మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్, నికోలస్ పూరన్‌లు బలమైతే, కేకేఆర్ బౌలింగ్ నాగర్కోటి, కమిన్స్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తిలతో బలంగా ఉంది. రాహుల్, అగర్వాల్, పూరన్‌లు విఫలమైతే మరొకసారి కేకేఆర్ పైచేయి సాధించే అవకాశం ఉంది. పేస్, స్పిన్ విభాగంలో కేకేఆర్ తిరుగులేకుండా ఉంది. ప్రధానంగా వరుణ్ చక్రవర్తి అత్యంత ప్రమాదంగా మారిపోయాడు. గత మ్యాచ్‌ల్లో ఎంఎస్ ధోని, ధావన్‌లను వరుణ్ చక్రవర్తి బోల్తా కొట్టించిన తీరు కేకేఆర్ శిబిరంలో మరింత జోష్‌ను తెచ్చింది. ఈ మ్యాచ్‌లో కూడా వరుణ్ చక్రవర్తితో కింగ్స్ పంజాబ్ బ్యాటింగ్‌కు ప్రమాదం పొంచి ఉంది. గతేడాది కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడిన వరుణ్.. ఈసారి కేకేఆర్‌కు కీలకంగా మారిపోయాడు. ఇక కేకేఆర్ బ్యాటింగ్ విషయానికొస్తే ఆ జట్టులో నితీష్ రాణా, శుబ్‌మన్ గిల్, మోర్గాన్, రసెల్‌లతో బలంగా ఉంది. సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ త్రిపాఠి ఓపెనర్‌గా దిగి విశేషంగా రాణించాడు. 51 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 81 పరుగులు చేశాడు. ఇది ఆ జట్టుకు శుభపరిణామం. కింగ్స్ పంజాబ్ విషయంలో మాత్రం మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ఓపెనర్లు మయాంక్, రాహుల్ విఫలమైతే ఆ జట్టు తిరిగి తేరుకోలేకపోతుంది. మరి నేటి మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ ఎంతవరకూ రాణిస్తుందో చూడాలి. -
సన్‌రైజర్స్ అదుర్స్.. భారీ విజయం
దుబాయ్: కింగ్స్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అదుర్స్ అనిపించింది. కింగ్స్ పంజాబ్‌ను 16.5 ఓవర్లలోనే 132 పరుగులకే ఆలౌట్ చేసి భారీ విజయాన్ని సాధించింది. కింగ్స్ పంజాబ్ ఆటగాళ్లలో నికోలస్ పూరన్(77; 37 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లు) మినహా ఎవరూ రాణించకపోవడంతో 69 పరుగుల తేడాతో ఘోర పరాజయం చెందింది. సన్‌రైజర్స్ బౌలర్లలో రషీద్ ఖాన్ మూడు వికెట్లు సాధించగా, ఖలీల్ అహ్మద్, నటరాజన్ తలో రెండు వికెట్లు సాధించారు. అభిషేక్ శర్మకు వికెట్ లభించింది. మరో ఇద్దరు కింగ్స్ పంజాబ్ ఆటగాళ్లు రనౌట్ అయ్యారు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్(9), ఫస్ట్ డౌన్ ఆటగాడు సిమ్రాన్ సింగ్(11)ల వికెట్లను ఆదిలోనే కింగ్స్ పంజాబ్ కోల్పోగా ఆ తరుణంలో బ్యాటింగ్‌కు దిగిన పూరన్ బ్యాట్‌కు పనిచెప్పాడు. వరుస సిక్స్‌లతో దుమ్మురేపాడు. అభిషేక్ శర్మ వేసిన ఏడో ఓవర్లో వరుసగా రెండు సిక్స్‌లు కొట్టిన పూరన్.. అబ్దుల్ సామద్ వేసిన తొమ్మిదో ఓవర్లో నాలుగు సిక్స్‌లు, ఒక ఫోర్ కొట్టాడు. అందులో హ్యాట్రిక్ సిక్స్‌లు సాధించాడు పూరన్. ఈ క్రమంలోనే అర్థ శతకాన్ని పూర్తి చేసుకుని ఈ సీజన్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. పూరన్‌కు మిగతా వారి నుంచి సరైన మద్దతు లభించలేదు. పూరన్ ఏడో వికెట్‌గా రషీద్ ఔట్ చేసిన కాసేపటికి కింగ్స్ పంజాబ్ ఇన్నింగ్స్ ముగిసింది. ఇది కింగ్స్ పంజాబ్‌కు ఐదో ఓటమి కాగా, ఎస్ఆర్హెచ్కు మూడో విజయం. (చదవండి; పూరన్ ఫాస్టెస్ట్ రికార్డు) ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 202 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. డేవిడ్ వార్నర్(52; 40 బంతుల్లో 5 ఫోర్లు, 1సిక్స్), బెయిర్ స్టో(97; 55 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్‌లు)లు రాణించడంతో ఎస్ఆర్హెచ్ భారీ స్కోరును చేయకల్గింది.పంజాబ్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచి సన్‌రైజర్స్ ముందుగా బ్యాటింగ్ తీసుకుంది. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్‌ను వార్నర్, బెయిర్ స్టోలు ధాటిగా ఆరంభించారు. వీరిద్దరూ కింగ్స్ పంజాబ్ బౌలర్లను ఆడేసుకుంటూ విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే తొలుత బెయిర్ స్టో హాఫ్ సెంచరీ సాధించగా, కాసేపటికి వార్నర్ అర్థ శతకం సాధించాడు. గత మ్యాచ్‌లకు భిన్నంగా బెయిర్ స్టో బ్యాట్ ఝుళిపించాడు. పంజాబ్ యువ బౌలర్లను టార్గెట్ చేస్తూ రెచ్చిపోయి ఆడాడు. అతనికి జతగా వార్నర్ స్టైక్ రొటేట్ చేస్తూ స్కోరు బోర్డుపై రన్‌రేట్ తగ్గకుండా చూసుకున్నారు. కాగా, వార్నర్ అర్థ శతకం సాధించిన తర్వాత తొలి వికెట్‌గా ఔటయ్యాడు. దాంతో ఆరెంజ్ ఆర్మీ 160 పరుగుల వద్ద తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆపై బెయిర్ స్టో సెంచరీకి మూడు పరుగుల దూరంలో ఔటయ్యాడు. వార్నర్, బెయిర్ స్టోలను రవి బిష్ణోయ్ పెవిలియన్‌కు పంపాడు. మనీష్ పాండే(1) కూడా ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. అర్షదీప్ దీప్ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అబ్దుల్ సామద్(8), ప్రియాం గార్గ్(0)లు కూడా స్వల్య వ్యవధిలోనే ఔటయ్యారు. 15 పరుగుల వ్యవధిలో సన్‌రైజర్స్ ఐదు వికెట్లను కోల్పోవడంతో రెండొందల పరుగుల మార్కును చేరడం కష్టమనిపించింది. కానీ కేన్ విలియమ్సన్ (20 నాటౌట్; 10 బంతుల్లో 1 ఫోర్ 1సిక్స్, అభిషేక్ శర్మ(12; 6 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్)లు చివర్లో బ్యాట్ ఝుళిపించడంతో నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. కింగ్స్ పంజాబ్ బౌలర్లలో రవి బిష్ణోయ్ మూడు వికెట్లు సాధించగా, అర్షదీప్ సింగ్ రెండు వికెట్లు తీశాడు. మహ్మద్ షమీకి వికెట్ లభించింది.(చదవండి: కింగ్స్ పంజాబ్‌పై వరుసగా 9వసారి..) -
పూరన్ ఫాస్టెస్ట్ రికార్డు
దుబాయ్: కింగ్స్ పంజాబ్ బ్యాట్స్‌మన్ నికోలస్ పూరన్ రికార్డు బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో పూరన్ 17 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఇది ఈ ఐపీఎల్ సీజన్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీగా నమోదైంది. ఎస్ఆర్హెచ్ నిర్దేశించిన 202 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో సెకండ్ డౌన్లో బ్యాటింగ్‌కు వచ్చిన పూరన్.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్(9), ఫస్ట్ డౌన్ ఆటగాడు సిమ్రాన్ సింగ్(11)ల వికెట్లను ఆదిలోనే కింగ్స్ పంజాబ్ కోల్పోగా ఆ తరుణంలో బ్యాటింగ్‌కు దిగిన పూరన్ బ్యాట్‌కు పనిచెప్పాడు. వరుస సిక్స్‌లతో దుమ్మురేపాడు. అభిషేక్ శర్మ వేసిన ఏడో ఓవర్లో వరుసగా రెండు సిక్స్‌లు కొట్టిన పూరన్.. అబ్దుల్ సామద్ వేసిన తొమ్మిదో ఓవర్లో నాలుగు సిక్స్‌లు, ఒక ఫోర్ కొట్టాడు. అందులో హ్యాట్రిక్ సిక్స్‌లు సాధించాడు పూరన్. ఈ క్రమంలోనే అర్థ శతకాన్ని పూర్తి చేసుకుని ఈ సీజన్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. కాగా, ఓవరాల్ ఐపీఎల్లో కింగ్స్ పంజాబ్ తరఫున ఇది రెండో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీగా నమోదైంది. 2018లో కేఎల్ రాహుల్ 14 బంతుల్లో అర్థ శతకం సాధించిన రికార్డు పంజాబ్ తరఫున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డుగా ఉండగా, పూరన్ తాజాగా సాధించిన హాఫ్ సెంచరీ రెండోదిగా నిలిచింది. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో మయాంక్, సిమ్రాన్‌లతో పాటు కేఎల్ రాహుల్(11) కూడా నిరాశపరిచాడు. గ్లెన్ మ్యాక్స్‌వెల్(7) రనౌట్ అయ్యాడు. పూరన్ ఒక్కడే పోరాటం చేస్తున్నా అతనికి సహకారం లభించడం లేదు. -
బెయిర్ స్టో షో.. పంజాబ్‌కు భారీ లక్ష్యం
దుబాయ్: కింగ్స్ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 202 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. డేవిడ్ వార్నర్(52; 40 బంతుల్లో 5 ఫోర్లు, 1సిక్స్), బెయిర్ స్టో(97; 55 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్‌లు)లు రాణించడంతో ఎస్ఆర్హెచ్ భారీ స్కోరును చేయకల్గింది.పంజాబ్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచి సన్‌రైజర్స్ ముందుగా బ్యాటింగ్ తీసుకుంది. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్‌ను వార్నర్, బెయిర్ స్టోలు ధాటిగా ఆరంభించారు. వీరిద్దరూ కింగ్స్ పంజాబ్ బౌలర్లను ఆడేసుకుంటూ విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే తొలుత బెయిర్ స్టో హాఫ్ సెంచరీ సాధించగా, కాసేపటికి వార్నర్ అర్థ శతకం సాధించాడు. గత మ్యాచ్‌లకు భిన్నంగా బెయిర్ స్టో బ్యాట్ ఝుళిపించాడు. పంజాబ్ యువ బౌలర్లను టార్గెట్ చేస్తూ రెచ్చిపోయి ఆడాడు. అతనికి జతగా వార్నర్ స్టైక్ రొటేట్ చేస్తూ స్కోరు బోర్డుపై రన్‌రేట్ తగ్గకుండా చూసుకున్నారు. కాగా, వార్నర్ అర్థ శతకం సాధించిన తర్వాత తొలి వికెట్‌గా ఔటయ్యాడు. దాంతో ఆరెంజ్ ఆర్మీ 160 పరుగుల వద్ద తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆపై బెయిర్ స్టో సెంచరీకి మూడు పరుగుల దూరంలో ఔటయ్యాడు. వార్నర్, బెయిర్ స్టోలను రవి బిష్ణోయ్ పెవిలియన్‌కు పంపాడు. మనీష్ పాండే(1) కూడా ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. అర్షదీప్ దీప్ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అబ్దుల్ సామద్(8), ప్రియాం గార్గ్(0)లు కూడా స్వల్య వ్యవధిలోనే ఔటయ్యారు. 15 పరుగుల వ్యవధిలో సన్‌రైజర్స్ ఐదు వికెట్లను కోల్పోవడంతో రెండొందల పరుగుల మార్కును చేరడం కష్టమనిపించింది. కానీ కేన్ విలియమ్సన్ (20 నాటౌట్; 10 బంతుల్లో 1 ఫోర్ 1సిక్స్, అభిషేక్ శర్మ(12; 6 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్)లు చివర్లో బ్యాట్ ఝుళిపించడంతో నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. కింగ్స్ పంజాబ్ బౌలర్లలో రవి బిష్ణోయ్ మూడు వికెట్లు సాధించగా, అర్షదీప్ సింగ్ రెండు వికెట్లు తీశాడు. మహ్మద్ షమీకి వికెట్ లభించింది. -
కింగ్స్ పంజాబ్‌పై వరుసగా 9వసారి..
దుబాయ్: సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్.. కింగ్స్ పంజాబ్‌పై మరోసారి సత్తాచాటాడు. తాజాగా పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో వార్నర్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 37 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో అర్థ శతకం సాధించాడు. ఫలితంగా కింగ్స్ పంజాబ్‌పై వరుసగా తొమ్మిదో హాఫ్ సెంచరీ సాధించినట్లయ్యింది. ఐపీఎల్లో ఒక ప్రత్యర్థిపై ఇలా తొమ్మిది హాఫ్ సెంచరీలు వరుసగా సాధించడం వార్నర్‌కు పంజాబ్‌పైనే అత్యధికం కావడం విశేషం. 2015 నుంచి 2020 మధ్య కాలంలో పంజాబ్‌పై ఆడిన ప్రతీసారి వార్నర్ హాఫ్ సెంచరీ సాధిస్తూ వస్తున్నాడు. ఇక ఆర్సీబీపై వరుసగా 7హాఫ్ సెంచరీలను వార్నర్ సాధించగా, సీఎస్కేపై వరుసగా 5 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. పంజాబ్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచి సన్‌రైజర్స్ ముందుగా బ్యాటింగ్ తీసుకుంది. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్‌ను వార్నర్, బెయిర్ స్టోలు ధాటిగా ఆరంభించారు. వీరిద్దరూ కింగ్స్ పంజాబ్ బౌలర్లను ఆడేసుకుంటూ విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే తొలుత బెయిర్ స్టో హాఫ్ సెంచరీ సాధించగా, కాసేపటికి వార్నర్ అర్థ శతకం సాధించాడు. వార్నర్ 40 బంతుల్లో 5 ఫోర్లు, 1సిక్స్‌తో 52 పరుగులు చేసిన తర్వాత తొలి వికెట్‌గా ఔటయ్యాడు. దాంతో ఆరెంజ్ ఆర్మీ 160 పరుగుల వద్ద తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.ఆపై వెంటనే బెయిర్ స్టో(97; 55 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్‌లు) ఔటయ్యాడు. బిష్ణోయ్ బౌలింగ్‌లో బెయిర్ స్టో ఎల్బీగా పెవిలియన్ చేరాడు.దాంతో 160 పరుగుల వద్దే ఎస్ఆర్హెచ్ మరో వికెట్‌ను కోల్పోగా, మరో పరుగు వ్యవధిలో మనీష్ పాండే(1) వికెట్‌ను నష్టపోయింది. అర్షదీప్ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి పాండే నిష్క్రమించాడు. (చదవండి: ‘బీసీసీఐ మైండ్ గేమ్ ఆడుతోంది’) -
‘నేను కూడా బ్యాటింగ్ ఎంచుకోవాలనుకున్నా’
దుబాయ్: ఈ ఐపీఎల్ సీజన్లో భాగంగా కింగ్స్ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ముందుగా బ్యాటింగ్ చేయడానికి మొగ్గుచూపాడు. ఇప్పటివరకూ సన్‌రైజర్స్ ఐదు మ్యాచ్‌లాడి రెండు విజయాలు సాధించగా, కింగ్స్ పంజాబ్ ఐదు మ్యాచ్‌లకు గాను ఒకదాంట్లో మాత్రమే గెలుపొందింది. ముంబై ఇండియన్స్‌తో ఆడిన గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఓటమి చెందగా, సీఎస్కేతో ఆడిన తన గడిచిన మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్‌కు కూడా చుక్కెదురైంది. దాంతో మరొక విజయం కోసం అటు సన్‌రైజర్స్, ఇటు కింగ్స్ పంజాబ్‌లు ఆరాటపడుతున్నాయి.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన తర్వాత వార్నర్ మాట్లాడుతూ.. ముందుగా బ్యాటింగ్ చేసి ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని విధించాలనుకుంటున్నట్లు తెలిపాడు. గత మ్యాచ్‌లో ఛేజింగ్‌లో తడబడటంతో ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేయలనుకుంటున్నట్లు వార్నర్ పేర్కొన్నాడు. (చదవండి: ‘టీ20’ని మార్చండి: సునీల్ గావస్కర్) అదే సమయంలో కేఎల్ రాహుల్ కూడా టాస్ గెలిస్తే బ్యాటింగే చేయాలనుకున్నట్లు పేర్కొన్నాడు. చాలా గేమ్‌లను దగ్గరగా వచ్చి ఓడిపోయిన విషయాన్ని రాహుల్ గుర్తుచేసుకున్నాడు. తాను టాస్ ఓడిపోతానని అనుకున్నానని, కానీ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలనుకున్నట్లు తెలిపాడు. తమకు ఆరంభం బాగున్నా, మ్యాచ్ ఫినిషింగ్ సరిగా లేదన్నాడు. అందుకే వరుస మ్యాచ్‌ల్లో ఓడిపోతున్నామన్నాడు. క్రీజ్‌లో సెట్ అయిన బ్యాట్స్‌మన్ భారీ స్కోర్లు చేయలేకపోవడం ఓటములకు కారణమన్నాడు. ఇక బౌలర్లు కూడా సరిగా తమ ప్రణాళికల్లో అమలు చేయలేకపోతున్నారన్నాడు. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఒక మార్పు చేసింది. సిద్ధార్ద్ కౌల్ స్థానంలో ఖలీల్ అహ్మద్‌ను జట్టులోకి తీసుకోగా, కింగ్స్ పంజాబ్ మూడు మార్పులతో బరిలోకి దిగింది. జోర్డాన్, బ్రార్, సర్ఫరాజ్‌లను రిజర్వ్ బెంచ్‌లో కూర్చో బెట్టిన పంజాబ్.. ప్రభ్ సిమ్రాన్, అర్షదీప్, ముజీబ్‌లను తుది జట్టులోకి తీసుకుంది. పంజాబ్‌పై వరుసగా 8 హాఫ్ సెంచరీలను సాధించిన ఘనత వార్నర్‌ది. దాంతో వార్నర్ మరోసారి మెరిసే అవకాశం ఉంది. ప్రధానంగా ఇరుజట్లలో బౌలింగ్ విభాగం బలహీనంగా కనిపిస్తోంది. సన్‌రైజర్స్‌కు భువనేశ్వర్ కుమార్ దూరం కావడం వేధిస్తుండగా, కింగ్స్ పంజాబ్‌కు కూడా సరైన బౌలింగ్ వనరులు లేక సతమతమవుతోంది. కింగ్స్ పంజాబ్ బ్యాటింగ్‌లో మిడిలార్డర్ సమస్యగా మారింది. కింగ్స్ పంజాబ్ బ్యాటింగ్ గాడిలో పడితే మరో ఆసక్తికర పోరు జరగవచ్చు. ఇప్పటివరకూ ఇరు జట్లు 14 మ్యాచ్‌లు ఆడగా సన్‌రైజర్స్ 10 మ్యాచ్‌ల్లో గెలవగా, కింగ్స్ పంజాబ్ 4 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.(చదవండి: ‘బీసీసీఐ మైండ్ గేమ్ ఆడుతోంది’) రషీద్ వర్సెస్ రాహుల్ ఇప్పటివరకూ ఈ ఐపీఎల్లో రషీద్ తన ఐదు మ్యాచ్‌ల్లో ఐదు వికెట్లు తీశాడు. ఇక్కడ రషీద్ ఎకానమీ 5.20గా ఉంది. ఓవరాల్‌గా ఈ అఫ్గాన్ సంచలనం 51 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 60 వికెట్లు సాధించాడు. ఇక రాహుల్ మాత్రం మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఐదు మ్యాచ్‌ల్లో 302 పరుగులు సాధించి అత్యధిక పరుగుల జాబితాలో టాప్‌లో ఉన్నాడు. ఇందులో 132 పరుగుల వ్యక్తిగత స్కోరు సాధించాడు రాహుల్. ఈ సీజన్లో రాహుల్ యావరేజ్ 75కి పైగా ఉండగా, స్టైక్‌రేట్ 141.78గా ఉంది. ఓవరాల్‌గా ఐపీఎల్లో 72 మ్యాచ్‌ల్లో 2,279 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, 18 అర్థ సెంచరీలు ఉన్నాయి. రాహుల్ స్టైక్‌రేట్ 138.62గా ఉంది. కింగ్స్ పంజాబ్ కేఎల్ రాహుల్(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, మన్దీప్ సింగ్, నికోలస్ పూరన్, సిమ్రాన్ సింగ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, రవిబిష్నోయ్, ముజీబ్ వార్నర్, అర్షదీప్ సింగ్, మహ్మద్ షమీ, కాట్రెల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ డేవిడ్ వార్నర్(కెప్టెన్), జోనీ బెయిర్ స్టో, మనీష్ పాండే, కేన్ విలియమ్సన్, ప్రియాం గార్గ్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సామద్, రషీద్ ఖాన్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్, టి నటరాజన్ -
డైలమాలో సన్‌రైజర్స్!
దుబాయ్: ఈ ఐపీఎల్ సీజన్ ఆరంభంలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు షాక్‌లు మీద షాక్‌లు తగిలాయి. సన్‌రైజర్స్ ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ గాయపడి టోర్నీకి దూరమైతే, కేన్ విలియమ్సన్ గాయం కారణంగా రెండు మ్యాచ్‌లకు ఆడలేదు. దాంతో సన్‌రైజర్స్ ఆదిలోనే అందుకు తగిన మూల్యం చెల్లించుకుంది. కాగా, సన్‌రైజర్స్ జట్టులోని కీలక సభ్యుడు, పేసర్ భువనేశ్వర్ కుమార్ తుంటి గాయంతో లీగ్ నుంచి వైదొలిగాడు. ఇప్పటివకే ఐదు మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ రెండు మ్యాచ్‌ల్లోనే గెలిచింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన సన్‌రైజర్స్.. వరుసగా రెండు విజయాలతో టచ్‌లోకి వచ్చింది. కానీ ముంబై ఇండియన్స్‌తో సన్‌రైజర్స్ ఆడిన గత మ్యాచ్‌లో మళ్లీ ఓటమి వెక్కిరించింది. ప్రధానంగా బౌలింగ్‌లో బలహీనంగా ఉండటంతో ముంబై ఇండియన్స్ భారీ స్కోరు చేసింది. ఈరోజు(గురువారం) కింగ్స్ పంజాబ్‌తో పోరుకు సన్నద్ధమైంది ఆరెంజ్ ఆర్మీ.(చదవండి: ‘టీ20’ని మార్చండి: సునీల్ గావస్కర్) ఈ తరుణంలో మళ్లీ గాడిలో పడాలని భావిస్తున్న సన్‌రైజర్స్ పూర్తిగా డైలమాలో ఉంది. ప్రస్తుతం ఆ జట్టుకు ఐదో బౌలర్ ఆప్షన్ లేకపోవడమే. ఆ జట్టులో బౌలింగ్ వనరులున్నా నమ్మదగిన బౌలర్ ఎవరూ కనిపించడం లేదు. సన్‌రైజర్స్ పేస్ విభాగాన్ని సిద్ధార్థ్ కౌల్, సందీప్ శర్మ, నటరాజన్‌లు పంచుకుంటే నాల్గో బౌలర్‌గా స్పిన్నర్ రషీద్ ఖాన్ ఉన్నాడు. కానీ ఐదో బౌలర్ ఎవరు అనేది సన్‌రైజర్స్‌కు ప్రశ్న. భువనేశ్వర్ స్థానంలో జట్టులోకి వచ్చిన పృథ్వీ రాజ్ యర్రాకు వెంటనే అవకాశం రాకపోవచ్చు. ఈ తరుణంలో ఐదో బౌలర్ గురించి తర్జన భర్జనలు పడుతుంది సన్‌రైజర్స్. స్పిన్నర్ షహబాజ్ నదీమ్‌కు తుది జట్టులో చోటు దక్కే అవకాశం కనబడుతోంది. కానీ స్పిన్నర్లను బాగా ఆడే కేఎల్ రాహుల్ క్రీజ్‌లో కుదురుకుంటే మాత్రం ఇది మళ్లీ సన్‌రైజర్స్‌కు తలపోటుగా మారిపోవడం ఖాయం. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో అబ్దుల్ సామద్, కేన్ విలియమ్సన్‌లు తలో రెండు ఓవర్లు వేసి ఐదో బౌలర్ ఆప్షన్‌ను పంచుకున్నారు. వీరిద్దరూ నాలుగు ఓవర్లలో 51 పరుగులిచ్చారు. దాంతో ఐదో బౌలర్‌గా స్పెషలిస్టు బౌలర్ కావాలి. మరి అది స్పిన్నర్‌కు ఇస్తే బాగుంటుందా.. లేక మీడియం ఫాస్ట్ బౌలర్‌కు ఇవ్వాలనేది సన్‌రైజర్స్‌కు సవాల్‌గా మారింది. ఒకవేళ పేస్ విభాగంలో ఇస్తే బాసిల్ థంపిని జట్టులోకి తీసుకురావొచ్చు. విదేశీ ఆటగాళ్లు నలుగురు ఉండాలనే నిబంధనలో భాగంగా జానీ బెయిర్ స్టో, డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, రషీద్ ఖాన్లకే తుది జట్టులో ఉంటారు. అంటే ఇక్కడ ఐదో బౌలర్ అనేవాడు కచ్చితంగా భారత్‌కు చెందిన ఆటగాడే ఉండాలి. అప్పుడు బాసిల్ థంపినా, నదీమ్లే సన్‌రైజర్స్‌కు అందుబాటులో ఉన్న ప్రధాన బౌలింగ్ వనరులు. (చదవండి: శాంసన్ రాత మారేనా? మళ్లీ అదే డ్రామానా?) (చదవండి: సన్‌రైజర్స్ ‘గాయం’ ఎంతవరకూ..) -
ఎంఎస్ ధోని ఫన్నీ వాక్
దుబాయ్: ఈ ఐపీఎల్ సీజన్లో ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్.. ఆదివారం కింగ్స్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘనవిజయం సాధించింది. పంజాబ్ నిర్దేశించిన 179 పరుగుల టార్గెట్‌ను సునాయాసంగా ఛేధించింది. షేన్ వాట్సన్ ఫామ్‌లోకి రావడంతో పాటు మరో ఓపెనర్ డుప్లెసిస్ మళ్లీ రాణించడంతో సీఎస్కే 10 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. వాట్సన్(83 నాటౌట్; 53 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లు ), డుప్లెసిస్(87 నాటౌట్; 53 బంతుల్లో 11 ఫోర్లు, 1సిక్స్)లు కడవరకూ క్రీజ్‌లో ఉండటంతో సీఎస్కేకు తిరుగులేకుండా పోయింది. (చదవండి: అశ్విన్ ‘ఫైనల్ వార్నింగ్’.. పాంటింగ్‌కేనా?) ఈ మ్యాచ్ తర్వాత యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్‌ను సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని కలిశాడు. గేమ్ ఆఫ్ ద స్పిరిట్‌లో భాగంగా ఇరుజట్ల ఆటగాళ్లు ఒకరి నొకరు అభినందించుకునే క్రమంలో గేల్‌తో ధోని ముచ్చటించాడు. ఇక్కడ గేల్‌ను అనుకరించే యత్నం చేశాడు ధోని. గేల్ ఎలా నడుస్తాడో దాన్ని అతనే ఎదుటే చేసి నవ్వులు పూయించాడు. దీనికి గేల్ కూడా నవ్వుకుంటా వచ్చి ధోనితో కాసేపు మాట్లాడాడు. ఇద్దరూ ఒకర్నినొకరు విష్ చేసుకుని తర్వాత మ్యాచ్ విశేషాలను షేర్ చేసుకున్నారు. గేల్‌ను అనుకరిస్తూ ధోని నడిచిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సీజన్లో ఇప్పటివరకూ క్రిస్ గేల్ ఇంకా మ్యాచ్ ఆడలేదు. పంజాబ్ ఓపెనర్లగా మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్‌లు సెట్ కావడంతో గేల్ పనిలేకుండా పోయింది. కానీ వరుసగా పంజాబ్ ఓడిపోవడం కలవరపరుస్తోంది. మిడిల్ఆర్డర్లో మ్యాక్స్‌వెల్, కరుణ్ నాయర్, మన్దీప్ సింగ్‌లు విఫలం కావడంతో పంజాబ్ గెలవాల్సిన మ్యాచ్‌లను చేజార్చుకుంటుంది. అయితే మ్యాక్స్‌వెల్ స్థానంలో గేల్‌ను తీసుకోవాలనే వాదన వినిపిస్తోంది. గేల్‌ను రాహుల్‌కు జతగా ఓపెనర్‌గా పంపితే మయాంక్‌ను ఫస్ట్ డౌన్లో ఆడిస్తే పంజాబ్ బ్యాటింగ్ బ్యాటింగ్ గాడిలో పడుతుందని ఆ ఫ్రాంచైజీ అభిమానులు ఆశిస్తున్నారు.(చదవండి: ఇటు భువనేశ్వర్...అటు అమిత్ మిశ్రా) Rare Moment 🕺😍..#MSDhoni @msdhoni #IPL2020 pic.twitter.com/Nosc7lsMuS — DhoniGifs ™ (@DhoniGifs) October 6, 2020 -
ధోనిలో ఉన్న గ్రేట్‌నెస్ అదే!
దుబాయ్: జట్టు సభ్యులపై విశ్వాసం ఉంచి ముందుకు నడిపించడం మహేంద్ర సింగ్ ధోనిలోని గొప్పదనమని ఆసీస్ మాజీ క్రికెటర్ బ్రెట్ లీ అన్నాడు. ఒత్తిడిలో కూడా మెరుగ్గా ఆడేందుకు ఇది దోహదపడుతుందని చెప్పాడు. ఫామ్ లేమితో ఇబ్బందులు పడుతున్న షేన్ వాట్సన్‌ని భుజం తట్టి ప్రోత్సహించడం వల్లనే గత మ్యాచ్‌లో రాణించగలిగాడని బ్రెట్‌లీ మీడియా చాట్‌లో పేర్కొన్నాడు. కాగా, కింగ్స్ పంజాబ్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు షేన్ వాట్సన్ వీరవిహారం చేసిన సంగతి తెలిసిందే. పంజాబ్ నిర్దేశించిన 179 పరుగుల లక్ష్యాన్ని డుప్లెసిస్‌తో కలిసి షేన్‌వాట్సన్ ఛేదించాడు. ఓపెనర్లు వాట్సన్ (53 బంతుల్లో 83 నాటౌట్; 11 ఫోర్లు, 3 సిక్సర్లు), డుప్లెసిస్ (53 బంతుల్లో 87 నాటౌట్; 11 ఫోర్లు, 1 సిక్స్) హీరోచిత ఇన్నింగ్స్‌లతో మరో 14 బంతులు మిగిలిఉండగానే చెన్నై జట్టు 10 వికెట్లతో తేడాతో భారీ విజయం సాధించింది. చెన్నైకి ఇది రెండో విజయం. ఇక తొలి నాలుగు మ్యాచుల్లో 52 పరుగులే చేసిన వాట్సన్‌ను కింగ్స్ పంజాబ్‌తో మ్యాచ్‌లో ధోని ఆడిస్తాడా? పక్కన పెడతాడా? అనే సందేహం కలిగింది అభిమానులకు. ఈ దశలో కెప్టెన్ ధోని వాట్సన్వైపు మొగ్గు చూపాడు. (చదవండి: ఆ క్రెడిట్ అంతా వారిదే: డుప్లెసిస్) -
కెప్టెన్ ఒకటి, కోచ్ మరొకటి అంటే కష్టమే: ధోని
దుబాయ్: తమ జట్టు సెలక్షన్ గురించి కానీ, పొజిషన్స్ గురించి కానీ డ్రెస్సింగ్ రూమ్‌లో పెద్దగా చర్చలు లేకపోయినా ఒక ప్రణాళిక అయితే కచ్చితంగా ఉంటుందని సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని స్పష్టం చేశాడు. అలా అని కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌తో తాను ఏమీ చర్చించనని కాదనే విషయం గ్రహించాలన్నాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఒక ప్లాన్‌ను సిద్ధం చేసుకుంటామని దాన్నే అంతా అవలంభిస్తామన్నాడు. ఒకసారి ఫీల్డ్‌లోకి దిగాక అంతా ఒకరినొకరు సహరించుకుంటామన్నాడు. జట్టు ఎంపిక, స్థానాల గురించి ఫ్లెమింగ్‌తో పెద్దగా చర్చించననేది వాస్తవం కాదన్నాడు. ఫీల్డ్‌లో ప్లాన్లు ఎలా అమలు చేయాలనే దానిపై కోచ్‌గా ఫ్లెమింగ్ పాత్ర ఉంటుందన్నాడు.ఎప్పుట్నుంచో కొనసాగుతున్న ఫ్లెమింగ్‌కు సాధ్యమైనంత గుర్తింపు దక్కలేదని తాను తరుచు భావిస్తూ ఉంటానని ధోని తెలిపాడు. (చదవండి: ఇలా ఆడితే మీ కథ ముగిసినట్లే: గంభీర్) కింగ్స్ పంజాబ్‌పై ఘన విజయం తర్వాత మాట్లాడిన ధోని..‘ ఇదొక గొప్ప విజయం.మేము గత జట్టుతోనే దిగి సత్తాచాటడం నిజంగానే గర్వంగా ఉంది. మా ప్లానింగ్‌లో కోచ్‌గా ఫ్లెమింగ్ రోల్ వెలకట్టలేనిది. సీఎస్కేకు ఫ్లెమింగ్ చాలా చేశాడు. కానీ అతని దక్కాల్సిన క్రెడిట్ ఏదైతే ఉందో అది మాత్రం దక్కలేదు. మేము జట్టుగా బరిలో దిగేటప్పుడు ఒక ప్లాన్‌తో దిగుతాం. ఎక్కువ చర్చలు లేకపోయినా ప్లానింగ్ అనేది ఉంటుంది. అక్కడ దీన్ని ఎవరు అంగీకరించినా, అంగీకరించక పోయినా మ్యాచ్ నాటికి మాత్రం అంతా ఒకతాటిపైనే ఉంటాం. దాన్నే ఆ మ్యాచ్ రోజు అమలు చేస్తాం. ఎప్పుడైనా కోచ్ వేరే కోణంలో ఆలోచించి, కెప్టెన్ మరొక కోణంలో ఆలోచిస్తే అది చాలా కష్టంగా ఉంటుంది. అటువంటప్పుడు గందరగోళానికి దారి తీస్తుంది. కానీ మా జట్టులో ప్రతీది అంతా చర్చిస్తాం. అది ఇన్సైడ్ రూమ్‌లోని జరుగుతుంది. ఒకసారి బయటకు వచ్చాక మేము ఒకర్ని ఒకరు సపోర్ట్ చేసుకుంటాం. అలా అని సెలక్షన్ విషయంలో క్రికెటర్ల పొజిషన్ల విషయంలో మా మధ్య చర్చలు ఏమీ నడవని కాదు. అది మా ఇద్దరి మధ్య ఒక అవగాహన ఉంటుంది. ఫ్లెమింగ్‌తో నా రిలేషన్షిప్ అనేది చాలా సుదీర్ఘంగా కొనసాగుతూ వస్తుంది. తొలి ఐపీఎల్ సీజన్ తర్వాత నుంచి ఫ్లెమింగ్ మాతో ఉన్నాడు. ఫ్లెమింగ్‌ది సీఎస్కేతో చాలా లాంగ్ జర్నీ’ అని ధోని తెలిపాడు. ఆదివారం కింగ్స్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో సీఎస్కే విజయం సాధించింది. ఓపెనర్లు షేన్ వాట్సన్, డుప్లెసిస్ విశేషంగా రాణించడంతో సీఎస్కే భారీ విజయం నమోదు చేసింది. అయితే వాట్సన్ విషయంలో కాస్త గందరగోళం నెలకొంది. వాట్సన్‌ను జట్టులో ఉంచాలా.. తీసేయాలా అనే విషయంలో సీఎస్కే డ్రెస్సింగ్ రూమ్‌లో చర్చ నడిచినట్లు తెలుస్తోంది. కాకపోతే చివరకు వాట్సన్ తీసుకోవడమే కాకుండా అతను రాణించడంతో సీఎస్కే బెంగ తీరింది. -
ఆ క్రెడిట్ అంతా వారిదే: డుప్లెసిస్
దుబాయ్: ఈ సీజన్ ఐపీఎల్లో భాగంగా ఆదివారం కింగ్స్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 10 వికెట్ల తేడాతో విజయకేతనం ఎగురవేసింది. హ్యాట్రిక్ ఓటములతో జూలు విదిల్చిన చెన్నై ఓ అతిపెద్ద విజయాన్ని అందుకుంది. షేన్ వాట్సన్, డుప్లెసిస్‌లు విశేషంగా రాణించడంతో సీఎస్కే 17.4 ఓవర్లలోనే కింగ్స్ పంజాబ్ నిర్దేశించిన 179 టార్గెన్‌ను ఛేదించింది. గత నాలుగ మ్యాచ్‌లుగా ఫామ్ కోసం తంటాలు పడుతున్న వాట్సన్ ఫామ్‌లోకి రావడంతో సీఎస్కే బెంగ తీరడమే కాకుండా భారీ విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో వాట్సన్ అజేయంగా 83 పరుగులు చేయగా, డుప్లెసిస్ 87 పరుగులు చేశాడు. ఎన్నో విమర్శలు చవిచూసి సరైన సమయంలో మెరిసిన వాట్సన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.(చదవండి: ఎంఎస్ ధోని మరో రికార్డు) ఈ మేరకు డుప్లెసిస్ కలిసి తన అనుభవాన్ని షేర్ చేసుకున్న వాట్సన్ ఒక వీడియోను ఐపీఎల్ టీ20 డాట్ కామ్ వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. ‘ఆటగాళ్లపై నమ్మకం ఉంచడంలో ధోనిది ప్రత్యేకశైలి. ప్లేయర్స్‌పై విశ్వాసం ఉంచడంలో ధోని తీరు అసాధారణం. అలాగే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కూడా ఆటగాళ్లపై ఎక్కువ నమ్మకం ఉంచుతాడు. ఆటగాళ్ల నాణ్యత, సామర్థ్యాలని వీరు బాగా నమ్ముతారు. ఫామ్‌లో లేనప్పుడు క్రికెటర్లపై నమ్మకం ఉంచాలనే విషయం వారికి బాగా తెలుసు. అవే మార్పులు తీసుకొస్తాయని వారు భావిస్తారు. నా మంచి స్నేహితుడు డుప్లెసిస్ కలిసి చక్కటి భాగస్వామ్యాన్ని నమోదు చేయడం ఆనందంగా ఉంది. చిన్న చిన్న విషయాల్లో మనల్ని మార్చుకుంటే అవి పెద్ద పెద్ద ఫలితాల్ని ఇస్తాయి. ఇందుకు నా తాజా ఇన్నింగ్సే కారణం. సీఎస్కే మేనేజ్మెంట్కు థాంక్స్ ’ అని వాట్సన్ తెలిపాడు. ఇక డుప్లెసిస్ మాట్లాడుతూ.. ‘ఇక్కడ క్రెడిట్ అంతా ఎంఎస్ ధోని. ఫ్లెమింగ్లకే దక్కుతుంది. అది సీఎస్కే స్టైల్ కూడా. ఫలానా ఆటగాడిలో సామర్థ్యం ఉంది అని భావిస్తే వారు దానికి కట్టుబడే అవకాశాలు ఇస్తూ ఉంటారు’ అని తెలిపాడు. -
ఎంఎస్ ధోని మరో రికార్డు
దుబాయ్: చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) కెప్టెన్, వికెట్ కీపర్ ఎంఎస్ ధోని మరో రికార్డు సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో వంద క్యాచ్‌లను అందుకున్న రెండో వికెట్ కీపర్‌గా నిలిచాడు. కింగ్స్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని ఈ మార్కును చేరాడు. కింగ్స్ పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఇచ్చిన క్యాచ్‌ను డైవ్ కొట్టి పట్టడంతో ధోని వంద క్యాచ్‌ల ఫీట్‌ను సాధించాడు. ఫలితంగా ఈ లీగ్‌లో అత్యధిక వికెట్ కీపర్ క్యాచ్‌లు పట్టిన రెండో ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఇక్కడ కేకేఆర్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ తొలి వికెట్ కీపర్ కాగా, ఆ తర్వాత ధోని దాన్ని సాధించాడు. 2017లో గుజరాత్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కార్తీక్ వంద వికెట్ కీపర్ క్యాచ్‌ల ఘనతను సాధించాడు. ఇక అత్యధిక ఔట్లలో భాగమైన వికెట్ కీపర్లలో మాత్రం ధోని తొలి స్థానంలో ఉన్నాడు. ధోని 139 ఔట్లలో భాగమయ్యాడు. క్యాచ్‌లు, స్టంపౌట్లతో కలుపుకుని దీన్ని సాధించాడు. ఈ జాబితాలో కార్తీక్ 133 ఔట్లలో భాగమై రెండో స్థానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో సీఎస్కే 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో పరాజయం చవిచూసిన సీఎస్కే.. ఆదివారం కింగ్స్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘనవిజయం సాధించింది. పంజాబ్ నిర్దేశించిన 179 పరుగుల టార్గెట్‌ను సునాయాసంగా ఛేధించింది. షేన్ వాట్సన్ ఫామ్‌లోకి రావడంతో పాటు మరో ఓపెనర్ డుప్లెసిస్ మళ్లీ రాణించడంతో సీఎస్కే విజయాన్ని అందుకుంది. వాట్సన్(83 నాటౌట్; 53 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లు ), డుప్లెసిస్(87 నాటౌట్; 53 బంతుల్లో 11 ఫోర్లు, 1సిక్స్)లు కడవరకూ క్రీజ్‌లో ఉండి విజయంలో కీలక పాత్ర పోషించారు. -
వాట్సన్ ఫామ్‌లోకి.. సీఎస్కే టచ్‌లోకి
దుబాయ్: ఈ ఐపీఎల్ సీజన్లో ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ సుదీర్ఘ విరామం తర్వాత మరో విజయం సాధించింది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో పరాజయం చవిచూసిన సీఎస్కే.. ఆదివారం కింగ్స్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘనవిజయం సాధించింది. పంజాబ్ నిర్దేశించిన 179 పరుగుల టార్గెట్‌ను సునాయాసంగా ఛేధించింది. షేన్ వాట్సన్ ఫామ్‌లోకి రావడంతో పాటు మరో ఓపెనర్ డుప్లెసిస్ మళ్లీ రాణించడంతో సీఎస్కే 10 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. వాట్సన్(83 నాటౌట్; 53 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లు ), డుప్లెసిస్(87 నాటౌట్; 53 బంతుల్లో 11 ఫోర్లు, 1సిక్స్)లు కడవరకూ క్రీజ్‌లో ఉండటంతో సీఎస్కేకు తిరుగులేకుండా పోయింది. ఈ టోర్నీ ఆరంభమైన తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమైన వాట్సన్.. తాజా మ్యాచ్‌లో విశేషంగా రాణించడంతో సీఎస్కే 17.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. ఇక డుప్లెసిన్ తన ఫామ్‌ను కొనసాగించి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇది ఐపీఎల్ చరిత్రలో సీఎస్కేకు అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం కావడం విశేషం.(చదవండి: స్టోక్స్ వచ్చాడు.. క్వారంటైన్‌కు వెళ్లాడు) ముందుగా బ్యాటింగ్ చేసిన కింగ్స్ పంజాబ్ 179 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కింగ్స్ పంజాబ్‌కు శుభారంభం లభించింది. మయాంక్ అగర్వాల్(26; 19 బంతుల్లో 3 ఫోర్లు), కేఎల్ రాహుల్(63; 52 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్)లు తొలి వికెట్‌కు 61 పరుగులు జత చేశారు. పీయూష్ చావ్లా బౌలింగ్‌లో మయాంక్ అగర్వాల్ తొలి వికెట్‌గా పెవిలియన్ చేరిన తర్వాత మన్దీప్ సింగ్(27;16 బంతుల్లో 2 సిక్స్‌లు) ధాటిగా బ్యాటింగ్ చేశాడు. కింగ్స్ పంజాబ్ స్కోరు 94 పరుగుల వద్ద ఉండగా మన్దీప్ సింగ్‌ను రవీంద్ర జడేజా ఔట్ చేశాడు. ఆపై పూరన్-రాహుల్‌ల జోడి పంజాబ్ స్కోరును చక్కదిద్దింది. ఈ జోడి మూడో వికెట్‌కు 58 పరుగుల జత చేసిన తర్వాత పూరన్(33; 17 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు) మూడో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. 18 ఓవర్ తొలి బంతికి పూరన్ ఔట్ చేసిన శార్దూల్ ఠాకూర్..ఆ మరుసటి బంతికి రాహుల్‌ను ఔట్ చేశాడు. దాంతో 152 పరుగుల వద్ద పూరన్, రాహుల్ వికెట్లను కింగ్స్ పంజాబ్ కోల్పోయింది. వీరిద్దరూ ఔటైన తర్వాత స్కోరు మందగించింది. మ్యాక్స్‌వెల్(11 నాటౌట్), సర్పరాజ్ ఖాన్(14 నాటౌట్)ల నుంచి భారీ షాట్ల రాకపోవడంతో పంజాబ్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. సీఎస్కే బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ రెండు వికెట్లు సాధించగా, రవీంద్ర జడేజా, పీయూష్ చావ్లాలు తలో వికెట్ తీశారు. -
సీఎస్కే టార్గెట్ 179
దుబాయ్: చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ 179 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కింగ్స్ పంజాబ్‌కు శుభారంభం లభించింది. మయాంక్ అగర్వాల్(26; 19 బంతుల్లో 3 ఫోర్లు), కేఎల్ రాహుల్(63; 52 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్)లు తొలి వికెట్‌కు 61 పరుగులు జత చేశారు. పీయూష్ చావ్లా బౌలింగ్‌లో మయాంక్ అగర్వాల్ తొలి వికెట్‌గా పెవిలియన్ చేరిన తర్వాత మన్దీప్ సింగ్(27;16 బంతుల్లో 2 సిక్స్‌లు) ధాటిగా బ్యాటింగ్ చేశాడు. కింగ్స్ పంజాబ్ స్కోరు 94 పరుగుల వద్ద ఉండగా మన్దీప్ సింగ్‌ను రవీంద్ర జడేజా ఔట్ చేశాడు. ఆపై పూరన్-రాహుల్‌ల జోడి పంజాబ్ స్కోరును చక్కదిద్దింది. ఈ జోడి మూడో వికెట్‌కు 58 పరుగుల జత చేసిన తర్వాత పూరన్(33; 17 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు) మూడో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. 18 ఓవర్ తొలి బంతికి పూరన్ ఔట్ చేసిన శార్దూల్ ఠాకూర్..ఆ మరుసటి బంతికి రాహుల్‌ను ఔట్ చేశాడు. దాంతో 152 పరుగుల వద్ద పూరన్, రాహుల్ వికెట్లను కింగ్స్ పంజాబ్ కోల్పోయింది. వీరిద్దరూ ఔటైన తర్వాత స్కోరు మందగించింది. మ్యాక్స్‌వెల్(11 నాటౌట్), సర్పరాజ్ ఖాన్(14 నాటౌట్)ల నుంచి భారీ షాట్ల రాకపోవడంతో పంజాబ్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. సీఎస్కే బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ రెండు వికెట్లు సాధించగా, రవీంద్ర జడేజా, పీయూష్ చావ్లాలు తలో వికెట్ తీశారు. సీఎస్కే చివరి ఐదు ఓవర్లలో 48 పరుగులే ఇవ్వడం విశేషం. -
ఐపీఎల్ 2020: రెండో విజయమే లక్ష్యంగా
దుబాయ్:ఈ ఐపీఎల్ సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన కింగ్స్ పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ముందుగా బ్యాటింగ్‌కు మొగ్గుచూపాడు. పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో కొనసాగుతున్న సీఎస్కే ఇప్పటివరకూ నాలుగు మ్యాచ్‌లు ఆడి ఒకదాంట్లో మాత్రమే గెలిచి మూడు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. (చదవండి: ‘నేనైతే వాట్సన్‌ను తీసే ప్రసక్తే ఉండదు’) ఇక కింగ్స్ పంజాబ్ సైతం నాలుగు మ్యాచ్‌లు ఆడి ఒకే విజయాన్ని సాధించింది. దాంతో ఇరుజట్లు మరొక విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నాయి. ఇరు జట్లు వరుస ఓటములతో సతమతం అవుతుండటంతో గాడిలో పడాలని భావిస్తున్నాయి. దాంతో ఈ మ్యాచ్‌ను సీరియస్‌గా తీసుకోనున్నాయి. ఇప్పటివరకూ ఇరుజట్ల మధ్య 22 మ్యాచ్‌లు జరగ్గా, అందులో సీఎస్కే 13 మ్యాచ్‌లు గెలవగా, పంజాబ్ 9 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఈ సీజన్లో కింగ్స్ పంజాబ్ విజయానికి దగ్గరగా వచ్చి మ్యాచ్‌లు చేజార్చుకుంటుంది. ప్రధానంగా బౌలింగ్ విభాగం కాస్త బలహీనంగా ఉండటంతో భారీ స్కోర్లను సైతం కాపాడుకోలేకపోతోంది. బౌలింగ్‌లో గాడిలో పడితే మాత్రం కింగ్స్ పంజాబ్ గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో ధోని అండ్ గ్యాంగ్ కూడా పటిష్టంగానే ఉంది. అంబటి రాయుడు జట్టులో చేరడంతో సీఎస్కే బలంగా కనిపిస్తోంది. ఫామ్‌లో లేని షేన్ వాట్సన్ క్రీజ్‌లో కుదురుకుంటే మాత్రం సీఎస్కే బెంగ తీరుతుంది. సీఎస్కే ఎంఎస్ ధోని(కెప్టెన్), షేన్ వాట్సన్, అంబటి రాయుడు, డుప్లెసిస్, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రేవో, సామ్ కరాన్, పీయూష్ చావ్లా, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్ కింగ్స్ పంజాబ్ కేఎల్ రాహుల్(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, మన్దీప్ సింగ్, నికోలస్ పూరన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, సర్ఫరాజ్ ఖాన్, క్రిస్ జోర్డాన్, హర్‌ప్రీత్ బార్, రవిబిష్నోయ్, మహ్మద్ షమీ, షెల్డాన్ కాట్రెల్ -
‘అతనేమీ మ్యాచ్ విన్నర్ కాదు’
అబుదాబి: కింగ్స్ పంజాబ్ మేనేజ్మెంట్ నిర్ణయాలతోనే ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోర పరాభవం ఎదురైనందని మాజీ క్రికెటర్, విశ్లేషకుడు ఆకాశ్ చోప్రా విమర్శించాడు. ప్రధానంగా జిమ్మీ నీషమ్‌ను తుది జట్టులోకి తీసుకోవడాన్ని చోప్రా తప్పుబట్టాడు. అతనేమీ మ్యాచ్ విన్నర్ కానప్పుడు ఎందుకు ప్లేయింగ్ ఎలెవన్‌లో అవకాశమిచ్చారని ప్రశ్నించాడు. నీషమ్ పూర్తిస్థాయి బౌలర్ కాదు.. పూర్తిస్థాయి బ్యాట్స్‌మన్ కూడా కానప్పుడు కింగ్స్ పంజాబ్ జట్టులోకి తీసుకోవడాన్ని తప్పుబట్టాడు. తన యూట్యూబ్‌చానల్‌లో మాట్లాడుతూ..‘ కింగ్స్ పంజాబ్ ఎలెవన్ బాలేదు. బరిలోకి దిగిన జట్టు సరైనది కాదు. ముజీబ్ జట్టులో లేనప్పుడు నీషమ్‌కు చోటు తప్పు. (చదవండి: ఇదెక్కడి డీఆర్ఎస్ రూల్?) ఓవర్సీస్ ఫాస్ట్ బౌలర్ అయిన నీషమ్ పవర్ ప్లేలోనూ బౌలింగ్ సరిగా వేయలేదు.. డెత్ ఓవర్లలోనూ ఆకట్టుకోలేదు. అతను ఆల్‌రౌండరే కానీ పూర్తిస్థాయి ఆల్‌రౌండర్ కాదు. ఇక కృష్షప్ప గౌతమ్‌కు చివరి ఓవర్ ఇవ్వడం మరో తప్పు. ఆరంభంలో మంచి స్పెల్ వేసిన కాట్రెల్ కోటా ముందుగానే పూర్తి చేశారు. గౌతమ్‌కు ఆఖరి ఓవర్ ఇస్తారా. నీషమ్, గౌతమ్‌లు డెత్ ఓవర్లు వేసే బౌలర్లా?, నాకు తెలిసి షమీ కూడా డెత్ ఓవర్ల స్పెషలిస్టు ఏమీ కాదు. కాట్రెల్ స్పెల్ బాగున్నప్పుడు కనీసం ఓవర్‌ను కూడా చివర వరకూ ఎందుకు ఉంచలేదు. సునీల్ నరైన్, అశ్విన్, హర్భజన్ సింగ్ వంటి స్పిన్నర్లకే చివరి ఓవర్లను ఇవ్వరు.. అటువంటప్పుడు గౌతమ్ ఆఖరి ఓవర్‌ను ఎలా ఇచ్చారో వారి తెలియాలి’ అని ఆకాశ్ చోప్రా విమర్శించాడు. కింగ్స్ పంజాబ్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. ముంబై 48 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పరుగు కౌంట్ కాలేదు..ఇదెక్కడి డీఆర్ఎస్ రూల్?
అబుదాబి: కింగ్స్ పంజాబ్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. ముంబై బ్యాటింగ్‌కు తొలుత పూర్తిగా చేతులెత్తేసిన కింగ్స్ పంజాబ్.. ఆ తర్వాత బౌలింగ్ పంచ్ ముందు తేలిపోయింది. దాంతో ముంబై 48 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. అయితే అంపైర్ల నిర్ణయ సమీక్ష(డీఆర్ఎస్) నిబంధనల్లో ఒక సవరణ అనివార్యమనే డిమాండ్ వ్యక్తమవుతోంది. వచ్చే ఏడాడి టీ20 ప్రపంచకప్ జరుగుతుందని, అప్పటి వరకైనా ఈ నిబంధనలోని లోపాలను సవరించాలని విశ్లేషకులు కోరుతున్నారు.కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పేసర్ మహ్మద్ షమీ వేసిన 17వ ఓవర్ చివరి బంతి కీరన్ పొలార్డ్ ప్యాడ్‌కు తగిలింది. దీంతో పంజాబ్ ఆటగాళ్లు అప్పీల్ చేయగా అంపైర్ ఔటిచ్చాడు. (చదవండి: మరో హిస్టరీ ముంగిట ధోని) ఇది బ్యాట్‌కు తగిలిందనే భావనలో పొలార్డ్ రివ్యూకు వెళ్లాడు. ఇది సక్సెస్ అయ్యింది. బ్యాట్‌ను బంతి తాకుతూ వెళ్లినట్లు రిప్లేలో కనబడింది. దాంతో పొలార్డ్ బతికిపోయాడు. అయితే ఫీల్డ్ అంపైర్ ఎల్బీగా ప్రకటించే క్రమంలో పొలార్డ్ సింగిల్ పూర్తి చేసుకున్నాడు. కానీ ఆ పరుగు కౌంట్ కాలేదు. ఐసీసీ నిబంధనల ప్రకారం అంపైర్ ఔటిచ్చిన తర్వాత ఆ బాల్ డెడ్ అయినట్లే. దాంతో సింగిల్‌ను కౌంట్ చేయలేదు. కానీ పొలార్డ్ రివ్యూ సక్సెస్ అయ్యింది. అయినా ఆ సింగిల్‌ను స్కోరులో కలపరు. ఇది నిన్న మనకు క్లియర్‌గా తెలిసింది. దీన్ని మార్చాలని కోరుతున్నాడు కామెంటేటర్ ఆకాశ్ చోప్రా. అంపైర్ల తప్పిదానికి పరుగులు ఎందుకు తగ్గించాలని ప్రశ్నిస్తున్నాడు. దీన్ని సవరించాల్సిన అవసరం ఉందన్నాడు. ఇది సరైన రూల్ కాదన్నాడు. దీన్ని మార్చాల్సిన అవసరం ఉందని ఐసీసీ లా మేకర్ అయిన ఎంసీసీ(మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్)కు విన్నవించాడు. -
కింగ్స్ పంజాబ్ ఓటమికి కారణాలు ఇవే..
అబుదాబి: ఈ సీజన్లో భారీ స్కోర్లు చేస్తూ ఫీల్డింగ్‌లో అదరగొడుతున్న కింగ్స్ పంజాబ్ కొన్ని తప్పిదాలతోనే మ్యాచ్‌లను చేజార్చుకుంటుంది.రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్ లైన్ తప్పడంతో ఓటమి పాలైన కింగ్స్ పంజాబ్.. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో కూడా ఇదే తప్పిదంతో పరాజయం పాలైంది. షమీ, కాట్రెల్ వంటి మంచి పేసర్లు ఉన్నా చివరి ఆరు ఓవర్లలో వందకు పైగా పరుగులు ఇవ్వడమే ముంబై ఇండియన్స్‌పై ఓటమి కారణం. 14 ఓవర్లు ముగిసే సరికి ముంబై మూడు వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసిన తరుణంలో మిగతా ఆరు ఓవర్లలో కింగ్స్ పంజాబ్ భారీగా పరుగులు సమర్పించుకుంది. 14 నుంచి 20 ఓవర్ల మధ్యలో షమీ వేసిన 17వ ఓవర్లో ఐదు పరుగులు మినహా మిగతా అంతా ముంబైదే పైచేయిగా నిలిచింది.(చదవండి: ఉల్లంఘిస్తే రూ. కోటి చెల్లించాల్సిందే: బీసీసీఐ) 15వ ఓవర్లో రవి బిష్నోయ్ రెండు సిక్స్‌లతో మొత్తంగా 15 పరుగులు సమర్పించుకోగా, నీషమ్ వేసిన 16వ ఓవర్లో రెండు ఫోర్లు, రెండు సిక్స్‌లు ఇచ్చి 22 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక 17వ ఓవర్లో రోహిత్ శర్మను షమీ ఔట్ చేయడంతో ఆ ఓవర్లో పరుగుల వేగం తగ్గింది. అటు తర్వాత పొలార్డ్‌కు హార్దిక్‌కు జత కలవడంతో స్కోరు బోర్డు వేగంగా పరుగులు పెట్టింది. నీషమ్ వేసిన 18 ఓవర్లో హార్దిక్ సిక్స్, రెండు ఫోర్లు కొట్టడంతో ఆ ఓవర్లో 18 పరుగులు వచ్చాయి. ఇక షమీ వేసిన 19 ఓవర్లో హార్దిక్-పొలార్డ్‌లు 19 పరుగులు పిండుకున్నారు. హార్దిక్ ఒక ఫోర్ సాయంతో ఐదు పరుగులు చేయగా, పొలార్డ్ హ్యాట్రిక్ ఫోర్లతో దుమ్ములేపాడు. ఇక గౌతమ్ వేసిన చివరి ఓవర్లో హార్దిక్ పాండ్యా ఒక సిక్స్ కొట్టగా, పొలార్డ్ హ్యాట్రిక్ సిక్స్‌లతో చెలరేగిపోయాడు. దాంతో ఆ ఓవర్లో 25 విలువైన పరుగులు ముంబై స్కోరులో కలిశాయి. దాంతో ముంబై 191 పరుగుల్ని బోర్డుపై ఉంచకల్గింది. చివరి పది ఓవర్లలో 129 పరుగుల్ని కింగ్స్ పంజాబ్ సమర్పించుకోవడమే ఆ జట్టు ఓటమికి ప్రధాన కారణం. చివరి ఓవర్ స్పిన్నర్‌కు.. కాట్రెల్ మంచి పేస్ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. కానీ అతనికి స్లాగ్ ఓవర్లు అవకాశం లేకుండానే 13 ఓవర్లు ముగిసే సరికి అతని నాలుగు ఓవర్ల కోటాను పూర్తి చేశాడు కింగ్స్ పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన కాట్రెల్ ఒక మెయిడిన్ సాయంతో 20 పరుగులిచ్చి వికెట్ తీశాడు. కానీ అతని ఓవర్లు ముందుగానే ముగిసిపోవడంతో పేస్ బౌలింగ్ లేమి కనబడింది. 20 ఓవర్‌ను ఆఫ్ స్పిన్నర్ గౌతమ్‌కు ఇవ్వడంతో ముంబై స్కోరును పెంచుకోవడానికి వీలు దొరికింది. స్పిన్నర్లను బాగా ఆడే హార్దిక్-పొలార్డ్‌లు ఉండగా గౌతమ్‌కు ఆఖరి ఓవర్‌ను ఇవ్వడం కింగ్స్ పంజాబ్ కొంపముంచింది. ఏకంగా 25 పరుగులు ఇవ్వడంతో కింగ్స్ పంజాబ్‌ను ఆందోళన గురిచేసింది. ముంబై వంటి పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ జట్టుకు బౌలింగ్ వేసేటప్పుడు బౌలింగ్ అనేది చాలా కీలకం. అటువంటిది చివరి ఓవర్ స్పిన్నర్‌కు ఇవ్వడం కింగ్స్ పంజాబ్ చేసిన తప్పిదం. ఆదిలో ముంబైను కట్టడి చేసి, చివరి ఓవర్లలో పరుగులు ఇవ్వడం కింగ్స్ పంజాబ్‌కు బౌలింగ్ లేమిని చూపెట్టింది. (చదవండి: కింగ్స్ పంజాబ్‌పై ముంబైదే పైచేయి) ఓపెనర్లు మినహా ఎవరూ లేరు.. ఈ సీజన్లో కింగ్స్ పంజాబ్ భారీ స్కోర్లు చేసిందంటే అది ఓపెనర్ల చలవే. మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్ బ్యాటింగ్‌తోనే కింగ్స్ పంజాబ్ పటిష్టంగా కనిపించింది. తాజా మ్యాచ్‌లో ఓపెనర్లు మయాంక్(25), కేఎల్ రాహుల్(17)లు విఫలం కావడంతో కింగ్స్ పంజాబ్ తేలిపోయింది. మ్యాక్స్‌వెల్, కరుణ్ నాయర్లు దారుణంగా విఫలం కావడం కింగ్స్ పంజాబ్ బ్యాటింగ్‌పై ప్రభావం చూపుతోంది. నికోలస్ పూరన్ మాదిరిగా రాణిస్తున్నా టాపార్డర్‌లో ఓపెనర్లు విఫలమైతే మాత్రం పంజాబ్ బ్యాటింగ్ గాడి తప్పుతోంది. ఈరోజు ముంబై ఇండియన్స్‌తో ఇదే జరిగింది. రాహుల్, మయాంక్‌లు ఔటైన తర్వాత నాయర్ డకౌట్‌గా పెవిలియన్ చేరితే, మ్యాక్స్‌వెల్ 11 పరుగులే చేశాడు. పూరన్ 27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 44 పరుగులు చేసినా లాంగ్ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. దాంతో కింగ్స్ పంజాబ్ గెలుపును అందుకోలేకపోయింది. -
కింగ్స్ పంజాబ్‌పై ముంబైదే పైచేయి
అబదాబి: కింగ్స్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 48 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత 192 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించిన ముంబై.. ఆపై కింగ్స్ పంజాబ్‌ను కట్టడి చేసి గెలుపును ఖాతాలో వేసుకుంది. నేటి మ్యాచ్‌లో ముంబై తడబడుతూ బ్యాటింగ్ ఆరంభించినా చివర్లో చెలరేగిపోయింది. దాంతో భారీ స్కోరును బోర్డుపై ఉంచింది. అటు తర్వాత కింగ్స్ పంజాబ్‌ను ఆదిలోనే దెబ్బకొట్టింది. ఫామ్‌లో ఉన్న మాయంక్ అగర్వాల్(25), కేఎల్ రాహుల్(17)లను భారీ స్కోర్లు చేయకుండా చేసి ముంబై ఆదిలోనే పైచేయి సాధించింది. కరుణ్ నాయర్(0), మ్యాక్స్‌వెల్(11)లు తీవ్రంగా విఫలం కావడంతో పంజాబ్‌కు ఓటమి తప్పలేదు. కింగ్స్ పంజాబ్ ఆటగాళ్లలో నికోలస్ పూరన్(44; 27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించినా జట్టుకు సరిపడా ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. గౌతమ్(22 నాటౌట్; 13 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) చివర్లో బ్యాట్ ఝుళిపించాడు. దాంతో కింగ్స్ పంజాబ్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 143 పరుగులే చేయడంతో ఓటమి పాలైంది. ముంబై బౌలర్లలో బుమ్రా, పాటిన్సన్, రాహుల్ చాహర్‌లు తలో రెండు వికెట్లు సాధించగా, బౌల్ట్, కృనాల్ పాండ్యా తలో వికెట్ తీశారు.(చదవండి: వారెవ్వా ముంబై.. వాటే బ్యాటింగ్) ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై నాలుగు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ, పొలార్డ్, హార్దిక్‌లు రాణించడంతో ముంబై బోర్డుపై భారీ స్కోరును ఉంచింది. రోహిత్(70; 45 బంతుల్లో 8 ఫోర్లు, 3సిక్స్‌లు), పొలార్డ్(47 నాటౌట్; 20 బంతుల్లో 3 ఫోర్లు, 4సిక్స్‌లు), హార్దిక్ పాండ్యా( 30 నాటౌట్; 11 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు)లు బ్యాటింగ్‌లో ఆకట్టుకున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి కింగ్స్ పంజాబ్ ముందుగా ఫీల్డింగ్ తీసుకోవడంతో ముంబై బ్యాటింగ్‌కు దిగింది. ముంబై బ్యాటింగ్‌ను ఎప్పటిలాగే రోహిత్-డీకాక్‌లు ఆరంభించారు. కాగా, తొలి ఓవర్లో ముంబైకు షాక్ తగిలింది. డీకాక్ పరుగులేమీ చేయకుండా కాట్రెల్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు.అనంతరం సూర్యకుమార్ యాదవ్(10) రనౌట్ అయ్యాడు. దాంతో 21 పరుగులకే ముంబై రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తరుణంలో ఇషాన్ కిషన్(28)తో కలిసి రోహిత్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. ఈ జోడి 62 పరుగుల జోడించిన తర్వాత గౌతమ్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్ ఔటయ్యాడు. ఇక స్లాగ్ ఓవర్లలో రోహిత్-పొలార్డ్‌లు బ్యాట్ ఝుళిపించడంతో పాటు హార్దిక్ కూడా ఆకట్టుకోవడంతో ముంబై నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. 15 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసిన ముంబై.. మరో ఐదు ఓవర్లలో 89 పరుగులు చేసి వికెట్‌ను మాత్రమే కోల్పోయింది. గౌతమ్ వేసిన చివరి ఓవర్లో 25 పరుగులు రాగా, పొలార్డ్ హ్యాట్రిక్ సిక్స్‌లు కొట్టాడు. తొలి 10 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 62 పరుగులు సాధించిన ముంబై మ్యాచ్ ముగిసేసరికి సాధారణ స్కోరుకే పరిమితం అవుతుందనే ఆశించిన తరుణంలో బోర్డుపై 190పరుగులకు పైగా మార్కును ఉంచడం విశేషం. కింగ్స్ బౌలర్లలో కాట్రెల్, షమీ, గౌతమ్‌లు తలో వికెట్ తీశారు. -
వారెవ్వా ముంబై.. వాటే బ్యాటింగ్
అబుదాబి: కింగ్స్ పంజాబ్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 192 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ, పొలార్డ్, హార్దిక్‌లు రాణించడంతో ముంబై బోర్డుపై భారీ స్కోరును ఉంచింది. రోహిత్(70; 45 బంతుల్లో 8 ఫోర్లు, 3సిక్స్‌లు), పొలార్డ్(47 నాటౌట్; 20 బంతుల్లో 3 ఫోర్లు, 4సిక్స్‌లు), హార్దిక్ పాండ్యా( 30 నాటౌట్; 11 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు)లు బ్యాటింగ్‌లో ఆకట్టుకున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి కింగ్స్ పంజాబ్ ముందుగా ఫీల్డింగ్ తీసుకోవడంతో ముంబై బ్యాటింగ్‌కు దిగింది. ముంబై బ్యాటింగ్‌ను ఎప్పటిలాగే రోహిత్-డీకాక్‌లు ఆరంభించారు. కాగా, తొలి ఓవర్లో ముంబైకు షాక్ తగిలింది. డీకాక్ పరుగులేమీ చేయకుండా కాట్రెల్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు.అనంతరం సూర్యకుమార్ యాదవ్(10) రనౌట్ అయ్యాడు. దాంతో 21 పరుగులకే ముంబై రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తరుణంలో ఇషాన్ కిషన్(28)తో కలిసి రోహిత్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. ఈ జోడి 62 పరుగుల జోడించిన తర్వాత గౌతమ్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్ ఔటయ్యాడు. ఇక స్లాగ్ ఓవర్లలో రోహిత్-పొలార్డ్‌లు బ్యాట్ ఝుళిపించడంతో పాటు హార్దిక్ కూడా ఆకట్టుకోవడంతో ముంబై నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. 15 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసిన ముంబై.. మరో ఐదు ఓవర్లలో 89 పరుగులు చేసి వికెట్‌ను మాత్రమే కోల్పోయింది. గౌతమ్ వేసిన చివరి ఓవర్లో 25 పరుగులు రాగా, పొలార్డ్ హ్యాట్రిక్ సిక్స్‌లు కొట్టాడు. తొలి 10 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 62 పరుగులు సాధించిన ముంబై మ్యాచ్ ముగిసేసరికి సాధారణ స్కోరుకే పరిమితం అవుతుందనే ఆశించిన తరుణంలో బోర్డుపై 190పరుగులకు పైగా మార్కును ఉంచడం విశేషం. కింగ్స్ బౌలర్లలో కాట్రెల్, షమీ, గౌతమ్‌లు తలో వికెట్ తీశారు. -
ఒక మార్పుతో కింగ్స్ పంజాబ్ బరిలోకి..
అబుదాబి: ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ కింగ్స్ పంజాబ్ టాస్ గెలిచి ఫీల్దింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన కింగ్స్ పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్.. ముందుగా ముంబైను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇప్పటివరకూ ఇరుజట్లు తలో మూడు మ్యాచ్‌లు ఆడగా ఒకదాంట్లో మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించాయి. ఆర్సీబీపై కింగ్స్ పంజాబ్ విజయం సాధించగా, కేకేఆర్‌పై ముంబై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంటుంది. ఇరు జట్లు పటిష్టంగా ఉండటంతో హోరాహోరీ పోరు జరిగే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. గౌతమ్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. లెగ్ స్పిన్నర్ స్థానంలో మురుగన్ అశ్విన్ స్థానంలో ఆఫ్ స్పిన్నర్ గౌతమ్‌ను తీసుకున్నారు. ఇక ముంబై ఇండియన్స్ గత మ్యాచ్ ఆడిన జట్టుతోనే పోరుకు సిద్ధమైంది. ముంబై 13.. పంజాబ్ 11 ఇరు జట్ల మధ్య ఇప్పటివరకూ 24 మ్యాచ్‌లు జరగ్గా అందులో ముంబైదే పైచేయిగా ఉంది. ముంబై 13 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, కింగ్స్ పంజాబ్ 11 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. ముంబైకు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, పొలార్డ్, హార్దిక్ పాండ్యాలే ప్రధాన బ్యాటింగ్ బలంగా కాగా, కింగ్స్‌కు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, మ్యాక్స్‌వెల్, పూరన్‌లే కీలకం. ఇక కింగ్స్ బౌలింగ్‌లో షమీ, కాట్రెల్, నీషమ్, రవిబిష్నోయ్‌లు ప్రధాన వనరులు కాగా, ముంబై ఇండియన్స్‌కు ట్రెంట్ బౌల్ట్, బుమ్రా, పాటిన్సన్, రాహుల్ చాహర్‌లు కీలకం కానున్నారు. బుమ్రా వర్సెస్ మయాంక్ ఈ మ్యాచ్‌లో బుమ్రా-మయాంక్ మధ్య ఆసక్తికర పోరు సాగే అవకాశం ఉంది. ఇప్పటివరకూ మయాంక్ ఒక సెంచరీ సాయంతో 221 పరుగులు సాధించాడు. అతని స్టైక్‌రేట్ 170.00 గా ఉంది. ఇందులో ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది. ఈ సీజన్లో 21 ఫోర్లు, 11 సిక్స్‌లను మయాంక్ కొట్టాడు. దాంతో బుమ్రాను ఎలా ఎదుర్కొంటాడో చూడాలి. ఈ ఐపీఎల్లో బుమ్రా మూడు వికెట్లు మాత్రమే సాధించినా పరిస్థితులు ఏమాత్రం కలిసొచ్చినా విశ్వరూపం ప్రదర్శిస్తాడు. ఓవరాల్‌గా 80 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన బుమ్రా 85 వికెట్లు సాధించాడు. అతని ఎకానమీ 7. 64గా ఉంది. ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ(కెప్టెన్), డీకాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కీరోన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా, జేమ్స్ పాటిన్సన్, రాహుల్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, బుమ్రా కింగ్స్ పంజాబ్ కేఎల్ రాహుల్(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, నికోలస్ పూరన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, కరుణ్ నాయర్, నీషమ్, సర్ఫరాజ్ ఖాన్, గౌతమ్, మహ్మద్ షమీ, షెల్డాన్ కాట్రెల్, రవి బిష్నోయ్ -
అరుదైన రికార్డుకు చేరువలో రోహిత్
అబుదాబి: ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఐపీఎల్ చరిత్రలో 5 వేల పరుగుల మార్కును చేరేందుకు రోహిత్ స్వల్ప దూరంలో ఉన్నాడు. ఇప్పటివరకూ ఈ జాబితాలో విరాట్ కోహ్లి, సురేశ్ రైనాలు మాత్రమే ఉండగా ఆ తర్వాత స్థానంలో నిలిచేందుకు రోహిత్‌కు రెండు పరుగులు అవసరం. ఇప్పటివరకూ 4,998 ఐపీఎల్ పరుగులు చేసిన రోహిత్.. మరో రెండు పరుగులు చేస్తే ఐదు వేల మార్కును చేరతాడు. ఈ లిస్టులో విరాట్ కోహ్లి 5,430 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా, రైనా 5,368 పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు. (చదవండి: రాబిన్ ఊతప్ప నిబంధనలు ఉల్లంఘన) కోహ్లి 180 మ్యాచ్‌ల్లో ఈ పరుగులు సాధించగా, రైనా 193 మ్యాచ్‌ల్లో 33.34 సగటుతో ఈ ఫీట్‌ను సాధించాడు. కాగా, రోహిత్ శర్మ ఇప్పటివరకూ 191 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్ కెరీర్లో రోహిత్ ఒక సెంచరీతో పాటు 37 హాఫ్ సెంచరీలు సాధించాడు.ఈరోజు(గురువారం) కింగ్స్ పంజాబ్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తలపడుతుండటంతో రోహిత్ 5 వేల పరుగుల మార్కును చేరే అవకాశం ఉంది.ఈ ఐపీఎల్ సీజన్లో భాగంగా ఆర్సీబీతో జరిగిన గత మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ రోహిత్ ఎనిమిది పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. సూపర్ ఓవర్‌కు దారి తీసిన ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధించింది. ఇరుజట్లు 201 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయ్యింది. దాంతో సూపర్ ఓవర్ అనివార్యమైన మ్యాచ్‌లో ముంబై ఏడు పరుగులు చేయగా, ఆర్సీబీ దాన్ని ఛేదించి విజయం సాధించింది. (చదవండి: కమిన్స్ నాపై సులభంగా గెలిచాడు : స్మిత్) -
తెవాటియా.. ఐయామ్ వెరీ సారీ: మాజీ చీఫ్ సెలక్టర్
షార్జా: ఐపీఎల్లో భాగంగా కింగ్స్ పంజాబ్-రాజస్తాన రాయల్స్ జట్ల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పరుగుల మోత మోగింది. తొలుత కింగ్స్ పంజాబ్ 223 పరుగులు చేస్తే, తాము ఏమీ తక్కువ తినలేదని జవాబిస్తూ రాజస్తాన్ రాయల్స్ దాన్ని ఇంకా మూడు బంతులు ఉండగానే ఛేదించి భళా అనిపించింది. ఈ మ్యాచ్‌లో గేమ్ ఛేంజర్ తెవాటియానే. తొలుత స్మిత్, సంజూ శాంసన్‌లు ధాటిగా ఆడినా తెవాటియా ఇన్నింగ్స్ మ్యాచ్‌కే హైలైట్. భారీ లక్ష్య ఛేదనలో సెకండ్ డౌన్లో వచ్చాడు. అయితే పెద్దగా అంచనాలు లేని తెవాటియాను ఆ స్థానంలో ఎందుకు పంపారనే ప్రశ్న వచ్చింది. దానికి తగ్గట్టుగానే తెవాటియా తొలుత తడబడ్డాడు. తెవాటియా ఎదుర్కొన తొలి 19 బంతుల్లో 8 పరుగులే చేసి ఇదేమి బ్యాటింగ్ అనిపించాడు. కానీ శాంసన్ ఔటైన తర్వాత మొత్తం గేమ్ స్వరూపాన్ని మార్చేశాడు తెవాటియా. కాట్రెల్ వేసిన 18 ఓవర్లో ఐదు సిక్స్‌లు కొట్టి గేమ్‌ను చేంజ్ చేసేశాడు. ఈ లెఫ్ట్ హ్యాండర్ ఆడిన ఇన్నింగ్స్ కింగ్స్ పంజాబ్‌కు పరాజయాన్ని మిగిల్చింది. తెవాటియా మొత్తంగా 31 బంతుల్లో 7 సిక్స్‌లతో 53 పరుగులు చేసి మొత్తం గేమ్ స్వరూపాన్ని మార్చేసి తిట్టిన నోళ్లనే పొగిడేలా చేసుకున్నాడు. ఇలా తెవాటియా విమర్శించిన వారిలో టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్ కూడా ఉన్నారు. (చదవండి: కోహ్లిని ఊరిస్తున్న రికార్డు) తెవాటియాను దింపి తప్పు చేశారు.. స్టార్ స్పోర్ట్స్ తెలుగు చానల్లో కామెంట్రీ చెబుతున్న సమయంలో తెవాటియా బ్యాటింగ్ చూసి ఎంఎస్కే అసహనం వ్యక్తం చేశారు. తెవాటియాకు బ్యాటింగ్ రికార్డులు ఉండటం తాను ఎక్కడ చూడలేదని, మరి రాజస్తాన్ రాయల్స్ అతన్ని సెకెండ్ డౌన్లో దింపి తప్పు చేసిందన్నాడు. దీనివల్ల అవతలి ఎండ్‌లో ఉన్న సంజూ శాంసన్‌పై ఒత్తిడి పెరుగుతుందని ఎంఎస్కే అన్నారు. ఆపై కాసేపటికి షమీ వేసిన బౌన్సర్‌ను అప్పర్ కట్ ఆడే ప్రయత్నంలో సంజూ శాంసన్ కీపర్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో కింగ్స్ పంజాబ్ విజయం ఖాయమని ఆ ఫ్రాంచైజీ సంబరాలు చేసుకుంది. కానీ ఆ తర్వాతే కథ మొదలైంది. తెవాటియా తన బ్యాట్‌కు పని చెప్పి సిక్సర్లతో హోరెత్తించాడు. టీ20లో అసలైన మజాను అందించాడు. వరుస సిక్సర్లతో కాట్రెల్‌పై విరుచుకుపడ్డాడు. దాంతో కింగ్స్ పంజాబ్ ఆటగాళ్లకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ ఓవర్లో ఐదు సిక్స్‌లు కొట్టడంతో ఒక్కసారి మ్యాచ్ టర్న్ అయిపోయింది. ఐయామ్ వెరీ సారీ.. మ్యాచ్ అనంతరం బైజూస్ క్రికెట్ లైవ్‌లో హోస్ట్ నందుతో మాట్లాడిన ఎమ్మెస్కే ప్రసాద్.. తన తప్పిదానికి క్షమాపణలు కోరాడు. ‘తెవాటియా గురించి అనవసరమైన వ్యాఖ్యలు చేసినట్లున్నాను. తెవాటియా ఒక అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. భారీ సిక్స్‌లతో విరుచుకుపడి చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. తాను ముందుగా చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెబుతున్నా. అతనిలో సామర్థ్యాన్ని గుర్తించే టీమ్ మేనేజ్మెంట్ ఆ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు’ అని అన్నారు. -
పూరన్... ఏం మాయ చేశాడే
షార్జా: ఐపీఎల్ టి20 టోర్నీలో రాజస్తాన్ రాయల్స్ అసాధారణ విజయం సాధించింది. ఓపెనర్ స్టీవ్ స్మిత్ (27 బంతుల్లో 50; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) భారీ లక్ష్యానికి పునాది వేయగా... ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ సంజూ సామ్సన్ (42 బంతుల్లో 85; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) గెలుపుదారిన మళ్లించాడు. వీరిద్దరి శ్రమకు రాహుల్ తేవటియా (31 బంతుల్లో 53; 7 సిక్సర్లు) సంచలనాన్ని జతచేశాడు. 224 పరుగుల అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఇదిలా ఉంచితే, పూరన్ కళ్లు చెదిరే విన్యాసంతో ఔరా అనిపించాడు. మురుగన్ అశ్విన్ 8వ ఓవర్ మూడో బంతిని సామ్సన్ పుల్ చేశాడు. డీప్ మిడ్ వికెట్లో అది సిక్సర్ అనుకున్నారంతా! కానీ పూరన్ బౌండరీలైన్ వెలుపల సెకనుతో పోటీపడి మరీ బంతి క్యాచ్ పట్టాడు. ఎడంచేత్తో మైదానంలోకి విసిరాడు. ఇదంతా క్షణకాలంలోనే జరగడం, రీప్లేలో అతని విన్యాసం స్పష్టమవడంతో అంతా వావ్ అన్నారు. టీవీ వ్యాఖ్యాతలు, సచిన్ టెండూల్కర్‌లాంటి క్రికెట్ దిగ్గజాలు సైతం పూరన్ మెరుపు విన్యాసాన్ని పొగడ్తలు, ట్వీట్లతో ముంచెత్తారు. దీనికి అంతే మెరుపు వేగంతో వేలసంఖ్యలో లైక్‌లు కొట్టారు. రీట్వీట్ చేశారు. (చదవండి: ఆఖరి ఓవర్లలో... ఆరేశారు ) రోడ్స్‌పై సచిన్ ప్రశంసలు.. పూరన్ క్యాచ్‌పై సచిన్ టెండూల్కర్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అంతటి మెరుపు ఫీల్డింగ్ తాను ఇంతకముందు ఎన్నడూ చూడలేదంటూ ప్రశంసించాడు. ఈ క్రమంలోనే కింగ్స్ పంజాబ్ ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్‌ను కొనియాడాడు. ‘జాంటీ ఇప్పుడు తాను బౌండరీ లైన్‌పై ఫోర్లు సేవ్ చేయడంపై మాట్లాడుతున్నా. నీ ఏరియా సాధారణంగా 30 యార్డ్లు సర్కిల్. నువ్వు ఎప్పుడూ అత్యుత్తమమే’ అని సచిన్ ప్రశంసల్లో ముంచెత్తాడు. -
వద్దు భాయ్; తేవటియాకు యువీ థాంక్స్!
న్యూఢిల్లీ: సిక్సర్ల మోత మోగించిన రాజస్తాన్ రాయల్స్ ‘హీరో’ రాహుల్ తేవటియాకు టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ధన్యవాదాలు తెలిపాడు. ఆ ఒక్క బంతి మిస్ చేసినందుకు.. థ్యాంక్స్ అంటూ సరదాగా ట్వీట్ చేశాడు. ఐపీఎల్ -2020లో భాగంగా కింగ్స్ పంజాబ్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ అపూర్వ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆఖరిదాకా ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో 224 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన ఆర్ఆర్ మరో విక్టరీని తన ఖాతాలో వేసుకుంది. కెప్టెన్ స్టీవ్ స్మిత్(50; 27 బంతుల్లో 7ఫోర్లు, 2 సిక్స్‌లు), సంజూ శాంసన్(85; 42 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లు), రాహుల్ తేవటియా( 53; 31 బంతుల్లో 7 సిక్స్‌లు) అద్భుత ఇన్నింగ్స్‌తో ప్రత్యర్థి జట్టుకు ముచ్చెమటలు పట్టించారు. (చదవండి: అత్యంత చెత్త బంతులు అవే: తేవటియా) అయితే ఈ మ్యాచ్‌లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన తేవటియా తొలుత పరుగులు తీసేందుకు ఆపసోపాలు పడినా, శాంసర్ ఔటైన తర్వాత ఒక్కసారిగా సిక్సర్లతో చెలరేగిపోయాడు. కాట్రెల్ వేసిన18వ ఓవర్లో ఐదు సిక్స్‌లు కొట్టి ఔరా అనిపించాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ విజయంపై స్పందించిన యువీ.. జట్టుకు శుభాభినందనలు తెలిపాడు. సంజూ శాంసన్, మయాంక్ అద్భుత ఇన్నింగ్స్ ఆడారంటూ కొనియాడాడు. ఇక ఒకే ఓవర్లో 5 సిక్స్‌లు బాది.. ‘సిక్సర్ల’రికార్డును బద్దలు కొట్టేలా దూకుడుగా ఆడిన తేవటియాకు మాత్రం కృతజ్ఞతలు తెలిపాడు. ‘‘మిస్టర్ రాహుల్ తేవటియా.. వద్దు భాయ్ వద్దు.. ఆ ఒక్క బంతి వదిలేసినందుకు ధన్యవాదాలు!’’అని సరదాగా వ్యాఖ్యానించాడు. కాగా 2007 టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా స్టువర్ట్ బ్రాడ్(ఇంగ్లండ్) బౌలింగ్‌లో యువీ వరుసగా ఆరు సిక్సర్లు కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక ఆదివారం నాటి మ్యాచ్‌లో తేవటియా 31 బంతుల్లో 53 పరుగులు చేశాడు. ఇందులో ఏడు సిక్స్‌లు ఉన్నాయి. (చదవండి: పాంటింగ్ వ్యంగ్య వ్యాఖ్యతో పెరిగిన కసి) Mr @rahultewatia02 na bhai na 😅 thanks for missing one ball ! What a game congratulations to rr for a spectacular win !!! #RRvKXIP @mayankcricket great knock @IamSanjuSamson brilliant ! — Yuvraj Singh (@YUVSTRONG12) September 27, 2020 -
అత్యంత చెత్త బంతులు అవే: తేవటియా
షార్జా: ‘‘నన్ను నేను నమ్మాలని నిర్ణయించుకున్నాను. ఒక్క సిక్స్ కొట్టాలనుకున్నాను. తర్వాత అదే కొనసాగించాలని ఫిక్స్ అయ్యాను. అయితే ఒకే ఓవర్లో ఐదు సిక్స్‌లు కొట్టడం నిజంగానే అద్భుతం. నిజానికి లెగ్ స్పిన్నర్ బౌలింగ్‌లో సిక్సర్లు బాదేందుకు కోచ్ నన్ను పంపించారు. దురదృష్టవశాత్తు ఆ పనిచేయలేకపోయాను. అయితే అంతిమంగా ఇతర బౌలర్లపై విజయం సాధించాను’’ అంటూ రాజస్తాన్ రాయల్స్‌కు అద్భుతమైన విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించిన రాహుల్ తేవటియా హర్షం వ్యక్తం చేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఎదుర్కొన్న తొలి 20 బంతులు తన కెరీర్లో అత్యంత చెత్త బంతులు అని క్రీజులో నిలదొక్కుకునేందుకు శ్రమించిన తీరును ప్రస్తావించాడు. (చదవండి: పరుగుల హోరులో రాజస్తాన్ దరహాసం) కాగా ఐపీఎల్-2020 సీజన్లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. స్టీవ్ స్మిత్(50; 27 బంతుల్లో 7ఫోర్లు, 2 సిక్స్‌లు), సంజూ శాంసన్(85; 42 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లు), తేవటియా( 53; 31 బంతుల్లో 7 సిక్స్‌లు)లు విక్టరీలో కీలక పాత్ర పోషించారు. అయితే చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ స్వరూపాన్నే మార్చివేసిన తేవటియా గేమ్ ఛేంజర్‌గా నిలిచాడు. అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఈ లెఫ్ట్ హ్యాండర్, 18వ ఓవర్లో ఐదు సిక్స్‌లు కొట్టి కాట్రెల్‌కు చుక్కలు చూపాడు. అయితే సెకండ్ డౌన్లో తేవటియాను రంగంలోకి దింపడంపై ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. అందుకు తగ్గట్టుగానే ఆరంభంలో అతడు తడబడ్డాడు. తాను ఎదుర్కొన్న తొలి 19 బంతుల్లో తెవాతియా కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే చేసి ఉసూరుమనిపించాడు. ఇందులో ఒక్క బౌండరీ కూడా లేదు. అయితే శాంసన్ ఔటైన తర్వాత దూకుడు పెంచిన 27 ఏళ్ల తెవాతియా తన విశ్వరూపం ప్రదర్శించాడు. 12 బంతుల్లో 45 పరుగులు చేసి కింగ్స్ పంజాబ్ ఆశలపై నీళ్లు చల్లాడు. ఏడు సిక్సర్లు బాది సత్తా చాటాడు. ఈ విషయం గురించి తేవటియా మాట్లాడుతూ.. ‘‘తొలి 20 బంతుల వంటి చెత్త బంతులు ఎప్పుడూ ఎదుర్కోలేదు. నెట్స్‌లో చాలా బలంగా బంతిని బాదేవాడిని. అదే నమ్మకంతో బరిలోకి దిగాను. కానీ తొలి హిట్టింగ్ ఆడలేకపోయా. కానీ డగౌట్లో అందరూ నావైపే చూడటం గమనించాను. ఎందుకంటే నేను సిక్సర్లు కొట్టగలనని వాళ్లకు తెలుసు. ఆ తర్వాత అదే నిజమైంది’’ అని చెప్పుకొచ్చాడు. కాగా 224 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్ఆర్, మూడు బంతులు మిగిలి ఉండగానే, నాలుగు వికెట్ల తేడాతో అపూర్వ విజయం సొంతం చేసుకుంది. -
పరుగుల హోరులో రాజస్తాన్ దరహాసం
షార్జా: కింగ్స్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ అద్భుతమైన విజయాన్ని సాధించింది. కింగ్స్ విసిరిన 224 పరుగుల భారీ టార్గెట్‌ను రాజస్తాన్ సాధించి మరో విక్టరీని ఖాతాలో వేసుకుంది. స్టీవ్ స్మిత్(50; 27 బంతుల్లో 7ఫోర్లు, 2 సిక్స్‌లు), సంజూ శాంసన్(85; 42 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లు), తెవాతియా( 53; 31 బంతుల్లో 7 సిక్స్‌లు)లు రాజస్తాన్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఓపెనర్ జోస్ బట్లర్(4) విఫలమైనా, స్టీవ్ స్మిత్, సంజూ శాంసన్ల జోడి 81 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించింది. 9 ఓవర్ల ముగిసే సరికి రాజస్తాన్ రాయల్స్ 100 పరుగుల మార్కును దాటడంతో రాజస్తాన్ సునాయాసంగా విజయం సాధిస్తుందని అనుకున్నారు. కానీ మ్యాచ్ చివరి వరకూ నువ్వా-నేనా అన్నట్లు సాగింది. ఒకవైపు శాంసన్ పరుగుల మోత మోగిస్తుంటే, తెవాతియా తొలుత ఆపసోపాలు పడ్డాడు. కానీ ఒకే ఓవర్లో ఐదు సిక్స్‌లు కొట్టిన తెవాతియా మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. శాంసన్ ఔటైన తర్వాత తెవాతియా బ్యాట్‌కు పని చెప్పడంతో రాజస్తాన్ చివరకు విజయాన్ని నమోదు చేసింది. ఆఖర్లో ఆర్చర్ (13 నాటౌట్) 3 బంతుల్లో 2 సిక్స్‌లు కొట్టడంతో రాజస్తాన్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారీ టార్గెట్‌లో ఇంకా మూడు బంతులు ఉండగానే రాజస్తాన్ గెలుపును అందుకుంది. గేమ్ ఛేంజర్ తెవాతియా ఈ మ్యాచ్‌లో గేమ్ ఛేంజర్ తెవాతియానే. తొలుత స్మిత్, సంజూ శాంసన్‌లు ధాటిగా ఆడినా తెవాతియా ఇన్నింగ్స్ మ్యాచ్‌కే హైలైట్. భారీ లక్ష్య ఛేదనలో సెకండ్ డౌన్లో వచ్చాడు. అయితే పెద్దగా అంచనాలు లేని తెవాతియాను ఆ స్థానంలో ఎందుకు పంపారనే ప్రశ్న వచ్చింది. దానికి తగ్గట్టుగానే తెవాతియా తొలుత తడబడ్డాడు. కానీ శాంసన్ ఔటైన తర్వాత మొత్తం గేమ్ స్వరూపాన్నే మార్చేశాడు తెవాతియా. కాట్రెల్ వేసిన 18వ ఓవర్లో ఐదు సిక్స్‌లు కొట్టి గేమ్‌ను ఛేంజ్ చేసేశాడు. ఈ మ్యాచ్‌లో గేమ్ ఛేంజర్ తెవాతియానే. ఈ లెఫ్ట్ హ్యాండర్ ఆడిన ఆ ఓవర్ కింగ్స్‌కు విజయాన్ని దూరం చేసింది. అంతకుముందు టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్.. ముందుగా కింగ్స్ పంజాబ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. దాంతో కింగ్స్ పంజాబ్ ఇన్నింగ్స్‌ను రాహుల్, మయాంక్‌లు ఆరంభించారు. వీరిద్దరూ వచ్చీ రావడంతోనే రాజస్తాన్ రాయల్స్‌కు చుక్కలు చూపించారు. ఏ బౌలర్‌ను విడిచిపెట్టకుండా మెరుపులు మెరిపించారు. ఈ క్రమంలోనే తొలుత మయాంక్ హాఫ్ సెంచరీ సాధించగా, ఆపై రాహుల్ అర్థ శతకం సాధించాడు. మయాంక్ ధాటిగా ఆడటంతో రాహుల్ ఎక్కువ స్టైక్ ఇస్తూ అతన్ని ఉత్తేజ పరిచాడు. దాన్ని సద్వినియోగం చేసుకున్న మయాంక్ సెంచరీ నమోదు చేశాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 183 పరుగులు జోడించారు. 50 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్స్‌లతో 106 పరుగులు చేసిన తర్వాత మయాంక్ తొలి వికెట్‌గా ఔటయ్యాడు. టామ్ కరాన్ బౌలింగ్‌లో మయాంక్ పెవిలియన్ చేరగా, రాజ్‌పుత్ బౌలింగ్‌లో రాహుల్ పెవిలియన్ చేరాడు. మయాంక్ ఔటైన మరుసటి ఓవర్లోనే రాహుల్ నిష్క్రమించాడు. 54 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 69 పరుగులు సాధించిన తర్వాత రాహుల్ రెండో వికెట్‌గా ఔటయ్యాడు. ఇక చివర్లో మ్యాక్స్‌వెల్(13 నాటౌట్; 9 బంతుల్లో 2ఫోర్లు), పూరన్(25 నాటౌట్; 8 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు)లు ధాటిగా ఆడటంతో కింగ్స్ పంజాబ్ నిర్ణీత ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 223 పరుగులు చేసింది. -
కింగ్స్ పంజాబ్ ఇరగదీసింది..
షార్జా: రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో అలరించాడు. ఐపీఎల్ అంటే ఇది కదా అనేంతగా రెచ్చిపోయి ఆడాడు. రాజస్తాన్‌కు చుక్కలు చూపిస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. బౌండరీల మోత మోగించి తన ఐపీఎల్ కెరీర్లో తొలి సెంచరీ సాధించాడు. 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించిన మయాంక్.. మరో 19 బంతుల్లో దాన్ని సెంచరీగా మలుచుకున్నాడు. 45 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్స్‌లతో శతకం సాధించి అరుదైన జాబితాలో స్థానం సంపాదించాడు. ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన రెండో భారత ఆటగాడిగా మయాంక్ నిలిచాడు. అంతకుముందు యూసఫ్ పఠాన్ 37 బంతుల్లో సెంచరీ సాధించగా, ఆ తర్వాత స్థానంలో మయాంక్ నిలిచాడు. ఈ క్రమంలోనే 46 బంతుల్లో సెంచరీ సాధించి ఇప్పటివరకూ రెండో స్థానంలో ఉన్న మురళీ విజయ్ను మయాంక్ అధిగమించాడు. టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్.. ముందుగా కింగ్స్ పంజాబ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. దాంతో కింగ్స్ పంజాబ్ ఇన్నింగ్స్‌ను రాహుల్, మయాంక్‌లు ఆరంభించారు. వీరిద్దరూ వచ్చీ రావడంతోనే రాజస్తాన్ రాయల్స్‌కు చుక్కలు చూపించారు. ఏ బౌలర్‌ను విడిచిపెట్టకుండా మెరుపులు మెరిపించారు. ఈ క్రమంలోనే తొలుత మయాంక్ హాఫ్ సెంచరీ సాధించగా, ఆపై రాహుల్ అర్థ శతకం సాధించాడు. మయాంక్ ధాటిగా ఆడటంతో రాహుల్ ఎక్కువ స్టైక్ ఇస్తూ అతన్ని ఉత్తేజ పరిచాడు. దాన్ని సద్వినియోగం చేసుకున్న మయాంక్ సెంచరీ నమోదు చేశాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 183 పరుగులు జోడించారు. 50 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్స్‌లతో 106 పరుగులు చేసిన తర్వాత మయాంక్ తొలి వికెట్‌గా ఔటయ్యాడు. టామ్ కరాన్ బౌలింగ్‌లో మయాంక్ పెవిలియన్ చేరగా, రాజ్‌పుత్ బౌలింగ్‌లో రాహుల్ పెవిలియన్ చేరాడు. మయాంక్ ఔటైన మరుసటి ఓవర్లోనే రాహుల్ నిష్క్రమించాడు. 54 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 69 పరుగులు సాధించిన తర్వాత రాహుల్ రెండో వికెట్‌గా ఔటయ్యాడు. ఇక చివర్లో మ్యాక్స్‌వెల్(13 నాటౌట్; 9 బంతుల్లో 2ఫోర్లు), పూరన్(25 నాటౌట్; 8 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు)లు ధాటిగా ఆడటంతో కింగ్స్ పంజాబ్ నిర్ణీత ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 223 పరుగులు చేసింది. -
మయాంక్ మోత.. కింగ్స్ పంజాబ్ రికార్డు
షార్జా: ఈ ఐపీఎల్లో కింగ్స్ పంజాబ్ ఆటగాడు మయాంక్ అగర్వాల్ పరుగుల మోత మోగిస్తున్నాడు. రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి బ్యాటింగ్ పవర్ మరోసారి చూపెట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జరిగిన గత మ్యాచ్‌లో 89 పరుగులు సాధించిన మయాంక్.. మళ్లీ విరుచుకుపడ్డాడు. మయాంక్ బ్యాటింగ్‌తో కింగ్స్ పంజాబ్ 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 110 పరుగులు చేసింది. ఇందులో మయాంక్వి 69 పరుగులు ఉన్నాయి. ఈ పరుగుల్లో 6 సిక్స్‌లు, 5 ఫోర్లు ఉండటం విశేషం. మరొకవైపు కింగ్స్ పంజాబ్ పవర్‌ప్లేలో రికార్డు నమోదు చేసింది. ఈ ఐపీఎల్లో అత్యధిక పవర్‌ప్లే పరుగులు చేసిన జట్టుగా నిలిచింది. పవర్‌ప్లేలో కింగ్స్ పంజాబ్ 60 పరుగులు చేసింది. దాంతో ముంబై ఇండియన్స్ నమోదు చేసిన 59 పరుగుల పవర్ ప్లే రికార్డును కింగ్స్ పంజాబ్ అధిగమించింది. రాజస్తాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్.. ముందుగా కింగ్స్ పంజాబ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. దాంతో కింగ్స్ పంజాబ్ ఇన్నింగ్స్‌ను రాహుల్, మయాంక్‌లు ఆరంభించారు. వీరిద్దరూ వచ్చీ రావడంతోనే రాజస్తాన్ రాయల్స్‌కు చుక్కలు చూపించారు. ఏ బౌలర్‌ను విడిచిపెట్టకుండా మెరుపులు మెరిపించారు. ఇక రాహుల్ 35 బంతుల్లో 5ఫోర్లు, 1 సిక్స్‌తో హాఫ్ సెంచరీ సాధించాడు. దాంతో 13 ఓవర్లలో కింగ్స్ పంజాబ్ 148 పరుగులు చేసింది. -
‘కోహ్లి మెషీన్ కాదు.. మనిషి’
దుబాయ్: ఈ ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ విఫలం కావడంపై వస్తున్న విమర్శలపై అతని చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ స్పందించారు. కోహ్లిని ఒక మనిషిలాగా చూడాలని, అతను మెషీన్ కాదని ఆ విమర్శలకు కౌంటర్ ఇచ్చాడు. ఏఎన్ఐతో మాట్లాడిన రాజ్‌కుమార్ శర్మ.. ‘ఫెయిల్యూర్, సక్సెస్ అనేది స్పోర్ట్స్‌మన్ లైఫ్‌లో ఒక భాగం. మంచి రోజులు ఉన్నట్లే చెడ్డ రోజులు కూడా ఉంటాయి. కోహ్లి అనేవాడు మనిషి అనే విషయం మర్చిపోయినట్లున్నారు. కోహ్లిని మనిషిగా గుర్తించండి.. మెషీన్ కాదనే విషయం తెలుసుకోండి. అతని మైండ్ సెట్లో సమస్య ఉన్నా, టెక్నికల్‌గా ప్రాబ్లం ఉన్నా కోహ్లిని ప్రశ్నించండి. అంతేకానీ అనవసరమైన కామెంట్లు చేయకండి.(చదవండి:ఊరిస్తున్న సన్‌రైజర్స్ టైటిల్ సెంటిమెంట్!) ప్రతీసారి ప్రతీ ఒక్కరూ సక్సెస్ కాలేరు. కోహ్లి అభిమానులకు అతను నిలకడగా బ్యాటింగ్ చేయడం అలవాటై పోయింది. ఏదో ఒకసారి చెత్త ఇన్నింగ్స్ ఆడితే అది విమర్శలకు దారి తీస్తుంది. ఎవరైనా క్యాచ్‌లు మిస్ చేయడం సహజం. చివరకు ఫీల్దింగ్ దిగ్గజం జాంటీ రోడ్స్ కూడా క్యాచ్‌లు వదిలేసిన సందర్భాలున్నాయి. అలాగే జావేద్ మియాందాద్ కూడా మంచి ఫీల్డర్. ఒకసారి వెనక్కి వెళ్లి చూస్తే మియాందాద్ కూడా క్యాచ్‌లు వదిలాడు. సహనం, సంయమనం అనేది లేకుండా మాట్లాడటం వల్ల ఉపయోగం ఉండదు. కోహ్లి ఇప్పటికే చాలా క్రికెట్ ఆడాడు. మళ్లీ స్ట్రాంగ్‌గా వచ్చి విమర్శలకు సమాధానం చెబుతాడు’ అని అన్నారు. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి 14 పరుగులు చేసి ఔటవ్వగా, కింగ్స్ పంజాబ్‌తో మ్యాచ్‌లో పరుగు మాత్రమే చేశాడు. ఇక రాహుల్ ఇచ్చిన రెండు క్యాచ్‌లను కోహ్లి వదిలేశాడు. దాంతో కోహ్లి ఆటపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. రాహుల్ క్యాచ్‌లను వదిలేయడంతో అతను సెంచరీ నమోదు చేసి కింగ్స్ పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. -
మళ్లీ పరుగుల మోత మోగేనా?
షార్జా: ఐపీఎల్-13లో భాగంగా కింగ్స్ పంజాబ్‌తో మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్.. ముందుగా కింగ్స్ పంజాబ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇప్పటివరకూ కింగ్స్ పంజాబ్ రెండు మ్యాచ్‌లు ఆడి ఒకదాంట్లో గెలవగా, రాజస్తాన్ రాయల్స్ ఆడిన ఒకదాంట్లోనూ విజయం సాధించింది. ఇరుజట్లు తాము గెలిచిన మ్యాచ్‌ల్లో రెండొందలకు పైగా స్కోర్ సాధించాయి. ఆర్సీబీతో మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ 206 పరుగులు సాధించగా, ఇక సీఎస్కేతో మ్యాచ్‌లో రాజస్తాన్ 216 పరుగులు చేసింది. దాంతో నేటి మ్యాచ్‌లో పరుగుల మోత ఖాయంగా కనబడుతోంది.(చదవండి: నా కెప్టెన్సీ స్కిల్స్‌కు అతనే కారణం: రోహిత్) రాజస్తాన్ రాయల్స్-కింగ్స్ పంజాబ్ జట్ల మధ్య ఇప్పటివరకూ 19 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో రాజస్తాన్ రాయల్స్ 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, కింగ్స్ పంజాబ్ 9 మ్యాచ్‌ల్లో గెలుపును అందుకుంది. ఇక ఇరుజట్ల మధ్య ముఖాముఖి మ్యాచ్‌ల పరంగా అత్యధిక స్కోరు 221.ఆ స్కోరు కింగ్స్ పంజాబ్ పేరిట ఉంది. ఇరు జట్ల మధ్య అత్యధిక స్కోరుల్లో రాజస్తాన్ రాయల్స్ 211 పరుగులు చేసింది. రాహుల్ వర్సెస్ ఆర్చర్ కింగ్స్ పంజాబ్ జట్టులో కేఎల్ రాహుల్ ప్రధాన బ్యాట్స్‌మన్ కాగా, రాజస్తాన్ రాయల్స్‌లో ప్రధాన బౌలర్ జోఫ్రా ఆర్చర్. వీరిద్దరి మధ్య పోరు ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. ఇప్పటివరకూ ఆర్చర్ 22 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడగా, 27 వికెట్లు సాధించాడు. ఆర్చర్ ఎకానమీ 7.47గా ఉంది. మరొకవైపు రాహుల్ ఐపీఎల్ రికార్డు అమోఘంగా ఉంది. తన ఐపీఎల్ కెరీర్లో రాహుల్ 69 మ్యాచ్‌లు ఆడి 2, 130 పరుగులు నమోదు చేశాడు. ఐపీఎల్లో రెండు సెంచరీలు, 16 హాఫ్ సెంచరీలు సాధించాడు. రాహుల్ స్టైక్‌రేట్ 140.22గా ఉంది. (చదవండి:ఊరిస్తున్న సన్‌రైజర్స్ టైటిల్ సెంటిమెంట్!)