
న్యూఢిల్లీ: టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రాబోయే ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడనున్నాడు. అతడిని 2018 సీజన్‌లో రూ.7.6 కోట్లకు కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్ ఎలెవెన్ సారథ్య బాధ్యతలూ అప్పజెప్పింది. రెండు సీజన్లలో అశ్విన్ జట్టు 12 మ్యాచ్‌ల్లో గెలిచి, 16 మ్యాచ్‌ల్లో ఓడింది. ఓ దశలో మెరుగైన ఆటతో ప్లే ఆఫ్స్ రేసులో నిలిచినా తర్వాత వెనుకబడింది. ఇప్పుడు ఢిల్లీ నగదు ఒప్పందంపైనే అతడిని తీసుకోనుందని సమాచారం.
‘అశ్విన్ ఫ్రాంచైజీ మార్పు అంశంపై బీసీసీఐ నుంచి త్వరలో ప్రకటన రానుంది. జట్టులోకి యువ స్పిన్నర్‌ను తీసుకోవాలనే ఉద్దేశంతో ఉన్న పంజాబ్ అశ్విన్‌ను వదులుకునేందుకు సిద్ధపడింది’ అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. అశ్విన్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా ప్రయత్నించినా అది ముందుకు కదల్లేదని సమాచారం.