ఢిల్లీ: ఐపీఎల్‌లో భాగంగా ఇక్కడ ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ 164 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్ పంజాబ్ ఇన్నింగ్స్‌ను క్రిస్ గేల్-కేఎల్ రాహుల్‌లు ఆరంభించారు. కింగ్స్ స్కోరు 13 పరుగుల వద్ద ఉండగా కేఎల్ రాహుల్(12) తొలి వికెట్‌గా ఔటయ్యాడు. మయాంక్ అగర్వాల్(2), డేవిడ్ మిల్లర్(7)లు కూడా విఫలం కావడంతో కింగ్స్ 61 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది.
ఆ తరుణంలో గేల్-మన్‌దీప్ సింగ్‌ల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. వీరిద్దరూ 45 పరుగులు జత చేసిన తర్వాత గేల్(69;37 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లు) ఔట్ కాగా, ఆపై వెంటనే సామ్ కరన్(0) డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. మరో 23 పరుగుల వ్యవధిలో మన్‌దీప్ సింగ్(30) కూడా ఔట్ కావడంతో కింగ్స్ పంజాబ్ స్కోరులో వేగం తగ్గింది.చివర్లో అశ్విన్(16), హర్‌ప్రీత్ బ్రార్(20 నాటౌట్)లు సమయోచితంగా ఆడటంతో కింగ్స్ పంజాబ్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో లామ్‌చెన్ మూడు వికెట్లు సాధించగా, రబడ, అక్షర్ పటేల్ తలో రెండు వికెట్లు తీశారు.
Comments
Please login to add a commentAdd a comment