ఢిల్లీ: ఐపీఎల్‌లో భాగంగా ఇక్కడ ఫిరోజ్ షా కోట్ల మైదానంలో కింగ్స్ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముందుగా కింగ్స్ పంజాబ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇప్పటివరకూ ఢిల్లీ, కింగ్స్ పంజాబ్ జట్లు తొమ్మిదేసి మ్యాచ్‌లు ఆడి తలో ఐదేసి మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. ఈ సీజన్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ గెలుపొందింది.
దాంతో ఢిల్లీ ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. సొంత మైదానంలో జరిగే మ్యాచ్ కావడంతో ఢిల్లీ ఎంత వరకూ కింగ్స్‌పంజాబ్ నిలువరిస్తుందో చూడాలి. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ విభాగాల్లో ఇరు జట్లు బలంగా ఉండటంతో మరోసారి ఆసక్తికర పోరు ఖాయంగా కనబడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment