హైదరాబాద్: సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్‌లో అనూహ్యంగా పరాజయం చవిచూసిన ఢిల్లీ క్యాపిటల్స్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ఢిల్లీ ఫ్యాన్స్, మాజీ ఆటగాళ్లు ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్ల ఆటతీరుపై మండిపడుతున్నారు. తాజాగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ఢిల్లీ జట్లుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘కింగ్స్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో మళ్లీ ఢిల్లీ డేర్ డెవిల్స్‌ను చూసినట్టుంది’అంటూ సెటైర్ వేశారు. ఇక ముఖ్యంగా యువ సంచలనం రిషభ్ పంత్ నిర్లక్ష్యంగా ఆడుతున్నాడని.. చివరి వరకు ఉండి జట్టును ఎలా గెలిపించాలో ధోనిని చూసి నేర్చువాలంటూ నెటిజన్లు సూచిస్తున్నారు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఢిల్లీ మాత్రమే ఫైనల్‌కు చేరలేదు. అయితే ఈ సీజన్‌లో కొత్త జెర్సీ. జట్టు పేరుతో ఎంట్రీ ఇచ్చిన ఢిల్లీ జట్టు ఆటతీరు మారలేదంటూ విశ్లేషకులు విమర్శిస్తున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-12లో భాగంగా సోమవారం కింగ్స్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 14 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి చవిచూసింది. ఢిల్లీ విజయానికి చివరి నాలుగు ఓవర్లలో 30 పరుగులు కావాలి. అప్పటికి చేతిలో ఏడు వికెట్లు ఉన్నాయి. దాంతో ఢిల్లీ విజయం ఖాయమనుకున్నారు. ఆ సమయంలో క్రీజ్‌లో ఉన్న రిషభ్ పంత్-ఇన్‌గ్రామ్‌లు కుదురుగా ఆడుతున్నారు. అయితే జట్టు స్కోరు 144 పరుగుల వద్ద ఉండగా రిషభ్ పంత్ బౌల్డ్ అయ్యాడు. షమీ వేసిస 17 ఓవర్ మూడో బంతికి సిక్సర్ కొట్టి మంచి దూకుడుగా కనిపించిన పంత్..ఆ మరుసటి బంతికి బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత ఢిల్లీ పతనం మొదలైంది. ఎనిమిది పరుగుల వ్యవధిలో ఏడు వికెట్లు కోల్పోవడంతో ఢిల్లీ పరాజయం చెందింది. అద్భుత బౌలింగ్‌తో హ్యాట్రిక్ సహా నాలుగు వికెట్లు తీసిన సామ్ కరన్ ఢిల్లీ పతనాన్ని శాసించాడు.
చదవండి:
‘8 పరుగులకే 7 వికెట్లు అంటే నమ్మశక్యంగా లేదు’
మరిన్ని విజయాలు సాధిస్తాం
సామ్ కరన్ హ్యాట్రిక్
‘ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ను మళ్లీ చూసినట్టుంది’
Published Tue, Apr 2 2019 7:07 PM | Last Updated on Tue, Apr 2 2019 7:07 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment