
బెంగళూరు: ఐపీఎల్ సీజన్‌లో భాగంగా స్థానిక చిన్నస్వామి స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో కింగ్స్ పంజాబ్ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కింగ్స్ పంజాబ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన కింగ్స్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ ముందుగా ఆర్సీబీని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.ఇప్పటివరకూ కింగ్స్ పంజాబ్ పది మ్యాచ్‌లు ఆడ ఐదింట గెలుపొందగా, ఆర్సీబీ పది మ్యాచ్‌లకు గాను మూడు విజయాలు మాత్రమే నమోదు చేసింది. అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో ఆర్సీబీ ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది. దాంతో మరోసారి కింగ్స్ పంజాబ్‌పై పైచేయి సాధించాలని ఆర్సీబీ భావిస్తోంది. ఆర్సీబీ ఆడే ప్రతీ మ్యాచ్‌లోనూ గెలిస్తేనే ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉంటాయి కనుక ఆ జట్టు తీవ‍్రంగా శ్రమించాల్సి ఉంది.
హోంగ్రౌండ్‌లో జరిగే మ్యాచ్ కావడంతో ఆర్సీబీ రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. ఇదే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌పై పరుగు తేడాతో ఆర్సీబీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజా మ్యాచ్‌కు ఆర్సీబీ ప్రధాన పేసర్ డేల్ స్టెయిన్ గాయం కారణంగా దూరమయ్యాడు.దాంతో అతని స్థానంలో సౌతీకి జట్టులో అవకాశం కల్పించారు. ఇక పవన్ నేగీ స్థానంలో వాషింగ్టన్ సుందర్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇక కింగ్స్ పంజాబ్ రెండు మార్పులు చేసింది. సామ్ కరన్, హర్‌ప్రీత్ బ‍్రార్ స్థానాల్లో పూరన్, అంకిత్ రాజ్‌పుత్‌లకు చోటు కల్పించింది.
కింగ్స్ పంజాబ్
అశ్విన్(కెప్టెన్), కేఎల్ రాహుల్, క్రిస్ గేల్, మయాంక్ అగర్వాల్, డేవిడ్ మిల్లర్, మన్‌దీప్ సింగ్, నికోలస్ పూరన్, విల్జోయిన్, మురుగన్ అశ్విన్, అంకిత్ రాజ్‌పుత్, మహ్మద్ షమీ
ఆర్సీబీ
విరాట్ కోహ్లి(కెప్టెన్), పార్థివ్ పటేల్, ఏబీ డివిలియర్స్, స్టోయినిస్, అక్షదీప్ నాథ్, మొయిన్ అలీ, వాషింగ్టన్ సుందరన్, సౌతీ, నవీదీప్ షైనీ, ఉమేశ్ యాదవ్, చహల్
Comments
Please login to add a commentAdd a comment