అబుదాబి: కింగ్స్ పంజాబ్ మేనేజ్‌మెంట్ నిర్ణయాలతోనే ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోర పరాభవం ఎదురైనందని మాజీ క్రికెటర్, విశ్లేషకుడు ఆకాశ్ చోప్రా విమర్శించాడు. ప్రధానంగా జిమ్మీ నీషమ్‌ను తుది జట్టులోకి తీసుకోవడాన్ని చోప్రా తప్పుబట్టాడు. అతనేమీ మ్యాచ్ విన్నర్ కానప్పుడు ఎందుకు ప్లేయింగ్ ఎలెవన్‌లో అవకాశమిచ్చారని ప్రశ్నించాడు. నీషమ్ పూర్తిస్థాయి బౌలర్ కాదు.. పూర్తిస్థాయి బ్యాట్స్‌మన్ కూడా కానప్పుడు కింగ్స్ పంజాబ్ జట్టులోకి తీసుకోవడాన్ని తప్పుబట్టాడు. తన యూట్యూబ్‌చానల్‌లో మాట్లాడుతూ..‘ కింగ్స్ పంజాబ్ ఎలెవన్ బాలేదు. బరిలోకి దిగిన జట్టు సరైనది కాదు. ముజీబ్ జట్టులో లేనప్పుడు నీషమ్‌కు చోటు తప్పు. (చదవండి: ఇదెక్కడి డీఆర్‌ఎస్ రూల్?)
ఓవర్‌సీస్ ఫాస్ట్ బౌలర్ అయిన నీషమ్ పవర్ ప్లేలోనూ బౌలింగ్ సరిగా వేయలేదు.. డెత్ ఓవర్లలోనూ ఆకట్టుకోలేదు. అతను ఆల్‌రౌండరే కానీ పూర్తిస్థాయి ఆల్‌రౌండర్ కాదు. ఇక కృష్షప్ప గౌతమ్‌కు చివరి ఓవర్ ఇవ్వడం మరో తప్పు. ఆరంభంలో మంచి స్పెల్ వేసిన కాట్రెల్ కోటా ముందుగానే పూర్తి చేశారు. గౌతమ్‌కు ఆఖరి ఓవర్ ఇస్తారా. నీషమ్, గౌతమ్‌లు డెత్ ఓవర్లు వేసే బౌలర్లా?, నాకు తెలిసి షమీ కూడా డెత్ ఓవర్ల స్పెషలిస్టు ఏమీ కాదు. కాట్రెల్ స్పెల్ బాగున్నప్పుడు కనీసం ఓవర్‌ను కూడా చివర వరకూ ఎందుకు ఉంచలేదు. సునీల్ నరైన్, అశ్విన్, హర్భజన్ సింగ్ వంటి స్పిన్నర్లకే చివరి ఓవర్లను ఇవ్వరు.. అటువంటప్పుడు గౌతమ్ ఆఖరి ఓవర్‌ను ఎలా ఇచ్చారో వారి తెలియాలి’ అని ఆకాశ్ చోప్రా విమర్శించాడు. కింగ్స్ పంజాబ్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. ముంబై 48 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment