
దుబాయ్:ఈ ఐపీఎల్ సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన కింగ్స్ పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ముందుగా బ్యాటింగ్‌కు మొగ్గుచూపాడు. పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో కొనసాగుతున్న సీఎస్‌కే ఇప్పటివరకూ నాలుగు మ్యాచ్‌లు ఆడి ఒకదాంట్లో మాత్రమే గెలిచి మూడు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. (చదవండి: ‘నేనైతే వాట్సన్‌ను తీసే ప్రసక్తే ఉండదు’)
ఇక కింగ్స్ పంజాబ్ సైతం నాలుగు మ్యాచ్‌లు ఆడి ఒకే విజయాన్ని సాధించింది. దాంతో ఇరుజట్లు మరొక విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నాయి. ఇరు జట్లు వరుస ఓటములతో సతమతం అవుతుండటంతో గాడిలో పడాలని భావిస్తున్నాయి. దాంతో ఈ మ్యాచ్‌ను సీరియస్‌గా తీసుకోనున్నాయి. ఇప్పటివరకూ ఇరుజట్ల మధ్య 22 మ్యాచ్‌లు జరగ్గా, అందులో సీఎస్‌కే 13 మ్యాచ్‌లు గెలవగా, పంజాబ్ 9 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.
ఈ సీజన్‌లో కింగ్స్ పంజాబ్ విజయానికి దగ్గరగా వచ్చి మ్యాచ్‌లు చేజార్చుకుంటుంది. ప్రధానంగా బౌలింగ్ విభాగం కాస్త బలహీనంగా ఉండటంతో భారీ స్కోర్లను సైతం కాపాడుకోలేకపోతోంది. బౌలింగ్‌లో గాడిలో పడితే మాత్రం కింగ్స్ పంజాబ్ గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో ధోని అండ్ గ్యాంగ్ కూడా పటిష్టంగానే ఉంది. అంబటి రాయుడు జట్టులో చేరడంతో సీఎస్‌కే బలంగా కనిపిస్తోంది. ఫామ్‌లో లేని షేన్ వాట్సన్ క్రీజ్‌లో కుదురుకుంటే మాత్రం సీఎస్‌కే బెంగ తీరుతుంది.
సీఎస్‌కే
ఎంఎస్ ధోని(కెప్టెన్), షేన్ వాట్సన్, అంబటి రాయుడు, డుప్లెసిస్, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రేవో, సామ్ కరాన్, పీయూష్ చావ్లా, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్
కింగ్స్ పంజాబ్
కేఎల్ రాహుల్(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, మన్‌దీప్ సింగ్, నికోలస్ పూరన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, సర్ఫరాజ్ ఖాన్, క్రిస్ జోర్డాన్, హర్‌ప్రీత్ బార్, రవిబిష్నోయ్, మహ్మద్ షమీ, షెల్డాన్ కాట్రెల్
Comments
Please login to add a commentAdd a comment