
దుబాయ్: ఈ ఐపీఎల్ సీజన్‌లో ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ విఫలం కావడంపై వస్తున్న విమర్శలపై అతని చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ స్పందించారు. కోహ్లిని ఒక మనిషిలాగా చూడాలని, అతను మెషీన్ కాదని ఆ విమర్శలకు కౌంటర్ ఇచ్చాడు. ఏఎన్‌ఐతో మాట్లాడిన రాజ్‌కుమార్ శర్మ.. ‘ఫెయిల్యూర్, సక్సెస్ అనేది స్పోర్ట్స్‌మన్ లైఫ్‌లో ఒక భాగం. మంచి రోజులు ఉన్నట్లే చెడ్డ రోజులు కూడా ఉంటాయి. కోహ్లి అనేవాడు మనిషి అనే విషయం మర్చిపోయినట్లున్నారు. కోహ్లిని మనిషిగా గుర్తించండి.. మెషీన్ కాదనే విషయం తెలుసుకోండి. అతని మైండ్ సెట్‌లో సమస్య ఉన్నా, టెక్నికల్‌గా ప్రాబ్లం ఉన్నా కోహ్లిని ప్రశ్నించండి. అంతేకానీ అనవసరమైన కామెంట్లు చేయకండి.(చదవండి:ఊరిస్తున్న సన్‌రైజర్స్ టైటిల్ సెంటిమెంట్!)
ప్రతీసారి ప్రతీ ఒక్కరూ సక్సెస్ కాలేరు. కోహ్లి అభిమానులకు అతను నిలకడగా బ్యాటింగ్ చేయడం అలవాటై పోయింది. ఏదో ఒకసారి చెత్త ఇన్నింగ్స్ ఆడితే అది విమర్శలకు దారి తీస్తుంది. ఎవరైనా క్యాచ్‌లు మిస్ చేయడం సహజం. చివరకు ఫీల్దింగ్ దిగ్గజం జాంటీ రోడ్స్ కూడా క్యాచ్‌లు వదిలేసిన సందర్భాలున్నాయి. అలాగే జావేద్ మియాందాద్ కూడా మంచి ఫీల్డర్. ఒకసారి వెనక్కి వెళ్లి చూస్తే మియాందాద్ కూడా క్యాచ్‌లు వదిలాడు. సహనం, సంయమనం అనేది లేకుండా మాట్లాడటం వల్ల ఉపయోగం ఉండదు. కోహ్లి ఇప్పటికే చాలా క్రికెట్ ఆడాడు. మళ్లీ స్ట్రాంగ్‌గా వచ్చి విమర్శలకు సమాధానం చెబుతాడు’ అని అన్నారు. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి 14 పరుగులు చేసి ఔటవ్వగా, కింగ్స్ పంజాబ్‌తో మ్యాచ్‌లో పరుగు మాత్రమే చేశాడు. ఇక రాహుల్ ఇచ్చిన రెండు క్యాచ్‌లను కోహ్లి వదిలేశాడు. దాంతో కోహ్లి ఆటపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. రాహుల్ క్యాచ్‌లను వదిలేయడంతో అతను సెంచరీ నమోదు చేసి కింగ్స్ పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
Comments
Please login to add a commentAdd a comment