కింగ్స్ పంజాబ్ జట్టు సహ యజమాని ప్రీతి జింటా ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం ప్రస్తుతం దుబాయ్ ఉన్న సంగతి తెలిసిందే. ప్రేక్షకులెవరూ లేకుండా ఖాళీ స్టేడియాల్లో తొలిసారి ఐపీఎల్ నిర్వహిస్తున్నారు. కరోనా ప్రభావం లేకుండా చూడటం కోసం బీసీసీఐ అనేక జాగ్రత్తలు తీసుకుంటోంది. ఆటగాళ్లందర్నీ బయో బబుల్‌లో ఉంచి కోవిడ్ బారిన పడకుండా చూస్తోంది. ఈ క్రమంలో మంగళవారం ప్రీతి జింటా పోస్ట్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం తెగ ట్రెండ్ అవుతోంది. దీనిలో ఆమెకు జరిగిన స్వాబ్ టెస్ట్‌ని చూడవచ్చు. మెడికల్ సిబ్బంది ఒకరు ప్రీతి స్వాబ్ కలెక్ట్ చేశారు. ఈ సందర్భంగా ప్రీతి ‘ఇది నా 20వ కోవిడ్ టెస్ట్. నేను కరోనా పరీక్షలు చేయించుకోవడంలో నేను క్వీన్ అయ్యాను’ అన్నారు. దాంతో పాటు బయో బబుల్ గురించి కూడా వివరించారు ప్రీతి జింటా. అయితే ఈ వీడియోపై రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. ఓ యూజర్ ‘నేను ఐదు సార్లు కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. కానీ ఇంత ఈజీగా లేదు’ అని కామెంట్ చేయగా మరొక యూజర్.. ‘మీకు టెస్ట్ చేసే విధానం సరైంది కాదు’ అంటూ కామెంట్ చేస్తున్నారు. (చదవండి: 4 ఏళ్ల నాటి సల్మాన్ ట్వీట్ వైరల్..)
ఇక దీంతో పాటుగా ‘బయో బబుల్’ అంటే ఏంటో కూడా వివరించారు ప్రీతి జింటా. ‘చాలా మంది బయో బబుల్ అంటే ఏంటని నన్ను అడుగుతున్నారు. ఆరు రోజుల క్వారంటైన్, నాలుగు రోజులకోసారి కోవిడ్ టెస్టులు చేయించుకోవడం, మనకు కేటాయించిన గదికే పరిమితం కావడం. జట్టుకు కేటాయించిన రెస్టారెంట్, జిమ్, స్టేడియంను మాత్రమే ఉపయోగించడమే బయో బబుల్. బీసీసీఐకి, కింగ్స్ పంజాబ్ స్టాఫ్‌కు చాలా థ్యాంక్స్. మమ్మల్ని సేఫ్‌గా ఉంచడం కోసం, ఐపీఎల్ కొనసాగడం కోసం వీరేంతో శ్రమిస్తున్నారు’ అని ప్రీతి జింటా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment