
మొహాలి: ఐపీఎల్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ 167 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కింగ్స్ పంజాబ్ జట్టులో డేవిడ్ మిల్లర్(43), సర్పరాజ్ ఖాన్(39)లు మాత్రమే ఆడటంతో సాధారణ స్కోరుకే పరిమితమైంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్ పంజాబ్ ఆదిలోనే కేఎల్ రాహుల్(15) వికెట్‌ను నష్టపోయింది. ఆరంభంలో దూకుడుగా కనిపించిన రాహుల్.. క్రిస్ మోరిస్ బౌలింగ్‌లో ఎల్బీగా పెవిలియన్ చేరాడు.
ఆ తర్వాత కాసేపటికి సామ్ కరాన్(20) కూడా నిష్క్రమించడంతో కింగ్స్ పంజాబ్ 36 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. మరో 22 పరుగుల వ్యవధిలో మయాంక్ అగర్వాల్(6) కూడా ఔట్ కావడంతో కింగ్స్ మరింత కష్టాల్లో పడింది. ఆ తరుణంలో సర్ఫరాజ్ ఖాన్-డేవిడ్ మిల్లర్‌ల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. వీరిద్దరూ 62 పరుగులు భాగస్వామ్యం చేయడంతో కింగ్స్ తేరుకుంది. మన్‌దీప్ సింగ్(29 నాటౌట్) బాధ్యతాయుతంగా ఆడటంతో కింగ్స్ పంజాబ్ నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో క్రిస్ మోరిస్ మూడు వికెట్లు సాధించగా,లామ్‌చెన్, రబడాలు తలో రెండు వికెట్లు తీశారు.
Comments
Please login to add a commentAdd a comment