
దుబాయ్: చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ 179 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కింగ్స్ పంజాబ్‌కు శుభారంభం లభించింది. మయాంక్ అగర్వాల్(26; 19 బంతుల్లో 3 ఫోర్లు), కేఎల్ రాహుల్(63; 52 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్)లు తొలి వికెట్‌కు 61 పరుగులు జత చేశారు. పీయూష్ చావ్లా బౌలింగ్‌లో మయాంక్ అగర్వాల్ తొలి వికెట్‌గా పెవిలియన్ చేరిన తర్వాత మన్‌దీప్ సింగ్(27;16 బంతుల్లో 2 సిక్స్‌లు) ధాటిగా బ్యాటింగ్ చేశాడు. కింగ్స్ పంజాబ్ స్కోరు 94 పరుగుల వద్ద ఉండగా మన్‌దీప్ సింగ్‌ను రవీంద్ర జడేజా ఔట్ చేశాడు.
ఆపై పూరన్-రాహుల్‌ల జోడి పంజాబ్ స్కోరును చక్కదిద్దింది. ఈ జోడి మూడో వికెట్‌కు 58 పరుగుల జత చేసిన తర్వాత పూరన్(33; 17 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు) మూడో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. 18 ఓవర్ తొలి బంతికి పూరన్ ఔట్ చేసిన శార్దూల్ ఠాకూర్..ఆ మరుసటి బంతికి రాహుల్‌ను ఔట్ చేశాడు. దాంతో 152 పరుగుల వద్ద పూరన్, రాహుల్ వికెట్లను కింగ్స్ పంజాబ్ కోల్పోయింది. వీరిద్దరూ ఔటైన తర్వాత స్కోరు మందగించింది. మ్యాక్స్‌వెల్(11 నాటౌట్), సర్పరాజ్ ఖాన్(14 నాటౌట్)ల నుంచి భారీ షాట్ల రాకపోవడంతో పంజాబ్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. సీఎస్‌కే బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ రెండు వికెట్లు సాధించగా, రవీంద్ర జడేజా, పీయూష్ చావ్లాలు తలో వికెట్ తీశారు. సీఎస్‌కే చివరి ఐదు ఓవర్లలో 48 పరుగులే ఇవ్వడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment