వారితో హోరాహోరీ తప్పదు: బట్లర్‌ | A Really Tough Match Against KXIP, Jos Buttler | Sakshi
Sakshi News home page

వారితో హోరాహోరీ తప్పదు: బట్లర్‌

Published Sat, Sep 26 2020 7:01 PM | Last Updated on Sat, Sep 26 2020 7:09 PM

A Really Tough Match Against KXIP, Jos Buttler - Sakshi

అబుదాబి:  తాము ఆడబోయే తదుపరి మ్యాచ్‌లో అసలు సిసలు పోరు ఎదురుకానుందని రాజస్తాన్‌ రాయల్స్‌ ఆటగాడు జోస్‌ బట్లర్‌ తెలిపాడు. ఆదివారం కింగ్స్‌ పంజాబ్‌తో మ్యాచ్‌లో కఠిన పరీక్ష తప్పదని బట్లర్‌ అభిప్రాయపడ్డాడు. ఈ గేమ్‌ కోసం తాను ఆతృతగా ఎదురుచూస్తున్నానని పేర్కొన్న బట్లర్‌.. తమ జట్టుతో కలిసి ప్రాక్టీస్‌ చేయడం గొప్పగా అనిపిస్తోందన్నాడు. ‘ నా తొలి గేమ్‌ కోసం ఎదురుచూస్తున్నా.

మా జట్టులో అంతా మంచి జోష్‌లో ఉన్నారు. మా క్యాంప్‌లో వాతావరణం చాలా గొప్పగా అనిపిస్తోంది. కుర్రాళ్లతో ట్రైనింగ్‌ సెషన్‌లో పాల్గొనడాన్ని ఎంజాయ్‌ చేస్తున్నాను. కింగ్స్‌ పంజాబ్‌ జట్టు కూడా బలంగా ఉండటంతో  హోరాహోరీ పోరు తప్పదు.ఆర్సీబీతో జరిగిన  మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌(132 నాటౌట్‌) చెలరేగి సెంచరీ చేయడంపై బట్లర్‌ స్పందించాడు. ‘ కేఎల్‌ రాహుల్‌ ఒక అసాధారణ ఆటగాడు. ఆర్సీబీ నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. రాహుల్‌ ఎప్పుడూ కీలక వికెటే. రేపటి మ్యాచ్‌లో కూడా భారీ స్కోర్లు తప్పవని అనుకుంటున్నా. షార్జా  స్మాల్‌ గ్రౌండ్‌ కావడంతో భారీ పరుగులు వచ్చే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement