
దుబాయ్: ఐపీఎల్-13లో భాగంగా కింగ్స్ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి.. ముందుగా కింగ్స్ పంజాబ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇప్పటివరకూ ఆర్సీబీ తాను ఆడిన తొలి మ్యాచ్‌లో గెలుపొందగా, కింగ్స్ పంజాబ్ తన తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ గెలుపొందగా, ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఓడింది. కింగ్స్ పంజాబ్ సూపర్ ఓవర్‌లో ఓడటం ఆ జట్టును ఆందోళనకు గురి చేసింది. కింగ్స్ పంజాబ్ చేసిన రెండు పరుగుల్లో ఒక పరుగును షార్ట్ రన్‌గా అంపైర్ విధించడంతో ఆ జట్టు ఓటమిలో తీవ్ర ప్రభావం చూపింది. ఆ పరుగు షార్ట్ రన్ కాకకపోయినా దాన్ని ఫీల్డ్ అంపైర్ షార్ట్ రన్‌గా ప్రకటించడంతో ఆ జట్టు పరాజయం పాలైంది. మ్యాచ్ చివరకు టై కావడంతో ఆ షార్ట్ రన్ వివాదం తీవ్రమైంది. ఆ పొరపాట్లను ఇక చేయకూడదనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది కింగ్స్ పంజాబ్.. ఇక తొలి మ్యాచ్‌లో విజయంతో కోహ్లి గ్యాంగ్ మంచి ఊపు మీద ఉంది.
ఆర్సీబీ 12.. కింగ్స్ 12
ఓవరాల్ ఐపీఎల్‌లో ఇప్పటివరకూ ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ల సంఖ్య 24. ఇరు జట్లు తలో 12 మ్యాచ్‌ల్లో గెలిచి సమ ఉజ్జీలుగా నిలిచాయి. దాంతో ఆర్సీబీ-కింగ్స్ పంజాబ్‌ల మ్యాచ్ ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. చివరిసారి ఇరు జట్లు తలపడిన మ్యాచ్‌లో ఆర్సీబీ 17 పరుగుల తేడాతో గెలిచింది. ఏబీ డివిలియర్స్ 82 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు.
కోహ్లి వర్సెస్ షమీ
ఈ మ్యాచ్‌లో కోహ్లి-షమీల్లో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి. కోహ్లి 178 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 5,426 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలున్నాయి. 2016 సీజన్‌లో కోహ్లి నాలుగు సెంచరీలతో దుమ్ములేపాడు. ఓవరాల్‌గా 36 ఐపీఎల్ హాఫ్ సెంచరీలు కోహ్లి ఖాతాలో ఉన్నాయి. కోహ్లి ఐపీఎల్ స్టైక్‌రేట్ 131. 53. ఇక షమీ 52 మ్యాచ్‌ల్లో 43 వికెట్లు సాధించాడు. అతని ఎకానమీ 8.87గా ఉంది.
కింగ్స్ పంజాబ్ తుది జట్టు
కేఎల్ రాహుల్(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్, నికోలస్ పూరన్, సర్ఫరాజ్ ఖాన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, జిమ్మీ నీషమ్, మురుగన్ అశ్విన్, రవిబిష్నోయ్, మహ్మద్ షమీ, షెల్డాన్ కాట్రెల్
ఆర్సీబీ తుది జట్టు
విరాట్ కోహ్లి(కెప్టెన్), అరోన్ ఫించ్, దేవదూత్ పడిక్కల్, ఏబీ డివిలియర్స్, శివం దూబే, జోష్ ఫిలిప్పి, వాషింగ్టన్ సుందర్, నవదీప్ సైనీ, ఉమేశ్ యాదవ్, డేల్ స్టెయిన్, యజ్వేంద్ర చహల్