
మొహాలి: ఐపీఎల్ భాగంగా సోమవారం సన్‌రైజర్స్‌తో హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 150 పరుగుల సాధారణ స్కోరు చేయగా, కింగ్స్ పంజాబ్ బంతి మాత్రమే మిగిలి ఉండగా విజయాన్ని అందుకుంది. అయితే సన్‌రైజర్స్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్, బెయిర్ స్టోల కోసం ప్రత్యేక వ్యూహం సిద్ధం చేసి బరిలోకి దిగామని కింగ్స్ పంజాబ్ పేసర్ అంకిత్ రాజ్‌పుత్ స్పష్టం చేశాడు.
వారిద్దర్నీ ఎక్కువ పరుగులు చేయకుండా నియత్రించడమే తమ ప్రణాళికలో భాగమని పేర్కొన్నాడు. ప్రధానంగా , బెయిర్ స్టో, వార్నర్ స్వేచ్ఛగా ఆడే అవకాశం ఇవ్వకుండా కచ్చితమైన లైన్‌తో బౌలింగ్ చేయడమే లక్ష్యంగా పోరుకు సిద్ధమయ్యామన్నాడు. దానిలో భాగంగా బెయిర్ స్టో(1)ను ఆదిలోనే పెవిలియన్‌కు పంపించామన్నాడు. ఇక్కడ వార్నర్ కడవరకూ ఉండి అజేయంగా 70 పరుగులు చేసినప్పటికీ, అతను స్వేచ్ఛగా ఆడే వీలు లేకుండా కచ్చితమైన బౌలింగ్ చేయడంతోనే సన్‌రైజర్స్ భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశామన్నాడు.నిన్నటి మ్యాచ్‌లో అంకిత్ రాజ్‌పుత్ నాలుగు ఓవర్లు కోటా బౌలింగ్ వేసినప్పటికీ వికెట్ సాధించలేకపోయాడు. కాగా, 21 పరుగులు మాత్రమే ఇచ్చి పొదుపుగా బౌలింగ్ చేశాడు.
(ఇక్కడ చదవండి: హైదరాబాద్ మళ్లీ ఓడింది!)
Comments
Please login to add a commentAdd a comment