హైదరాబాద్: ఐపీఎల్‌లో భాగంగా కింగ్స్ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 212 పరుగుల భారీ స్కోరు చేసింది. సన్‌రైజర్స్ ఓపెనర్ డేవిడ్ వార్నర్(81; 56 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులకు తోడు సాహా(28; 13 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్), మనీష్ పాండే(36; 25 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), మహ్మద్ నబీ(20; 10 బంతుల్లో 2 సిక్సర్లు)లు సమయోచితంగా బ్యాటింగ్ చేయడంతో సన్‌రైజర్స్ రెండొందల పరుగుల మార్కును దాటింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు వార్నర్-సాహాలు శుభారంభం అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 78 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను పరుగులు పెట్టించారు.
ఈ జోడి పవర్ ప్లేలో 77 పరుగులు సాధించి సన్‌రైజర్స్‌కు పటిష్ట పునాది వేశారు. తొలి వికెట్‌కు సాహా ఔటైన తర్వాత వార్నర్-మనీష్ పాండేలు సైతం అదే ఊపును కొనసాగించారు. వీరు 82 పరుగులు జత చేసిన తర్వాత మనీష్ పాండే ఔటయ్యాడు. దాంతో సన్‌రైజర్స్160 పరుగుల వద్ద రెండో వికెట్‌ను నష్టపోయింది. ఆపై కాసేపటికి వార్నర్ కూడా పెవిలియన్ బాట పట్టాడు. ఆ తరుణంలో కేన్ విలియమ్సన్-నబీల జంట ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లింది. వీరిద్దరూ 34 పరుగులు జోడించారు. అయితే 19 ఓవర్‌లో ఈ జంట ఔట్ కావడంతో స్కోరులో వేగం కాస్త తగ్గింది. అదే సమయంలో చివరి రెండు ఓవర్లలో 17 పరుగులు మాత్రమే రావడంతో సన్‌రైజర్స్ 213 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. కింగ్స్ పంజాబ్ బౌలర్లో షమీ, అశ్విన్‌లు తలో రెండు వికెట్లు తీయగా, అర్షదీప్ సింగ్, మురుగన్ అశ్విన్‌లకు చెరో వికెట్ దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment