దుబాయ్: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ 127 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. ఆరెంజ్ ఆర్మీ బౌలర్లు అదరగొట్టడంతో కింగ్స్ పంజాబ్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. టాస్ గెలిచిన ఎస్‌ఆర్‌హెచ్ ఫీల్డింగ్ తీసుకోవడంతో పంజాబ్ బ్యాటింగ్‌కు దిగింది. కింగ్స్ పంజాబ్ ఇన్నింగ్స్‌ను కేఎల్ రాహుల్, మనదీప్ సింగ్‌లు ఆరంభించారు. మయాంక్ అగర్వాల్ స్థానంలో జట్టులోకి వచ్చిన మన్‌దీప్ సింగ్(17) నిరాశపరిచాడు. సందీప్ శర్మ బౌలింగ్‌లో రషీద్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత రాహుల్-క్రిస్ గేల్‌ల జోడి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లింది.
అయితే జట్టు స్కోరు 66 పరుగుల వద్ద ఉండగా గేల్(20;20 బంతుల్లో 2 ఫోర్లు, 1సిక్స్) రెండో వికెట్‌గా ఔటయ్యాడు. హోల్డర్ వేసిన 10 ఓవర్ ఆఖరి బంతికి భారీ షాట్ ఆడబోయిన గేల్.. వార్నర్ క్యాచ్ పట్టడంతో నిష్క్రమించాడు. ఆపై తదుపరి ఓవర్‌లో రాహుల్(27; 27 బంతుల్లో 2 ఫోర్లు, 1సిక్స్) ఔటయ్యాడు. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత కింగ్స్ తిరిగి తేరుకోలేకపోయింది. మ్యాక్స్‌వెల్(12), దీపక్ హుడా(0), క్రిస్ జోర్డాన్(7), మురుగన్ అశ్విన్(4)లు విఫలయ్యారు. కాగా, నికోలస్ పూరన్(32 నాటౌట్; 28 బంతుల్లో 2 ఫోర్లు) కడవరకూ క్రీజ్‌లో ఉండటంతో కింగ్స్ పంజాబ్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లలో సందీప్ శర్మ, హోల్డర్, రషీద్ ఖాన్‌లు తలో రెండు వికెట్లు సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment