Ankit Rajpoot
-
ధోని శిష్యుడి సంచలన నిర్ణయం.. భారత క్రికెట్‌కు విడ్కోలు
ఉత్తరప్రదేశ్ స్టార్ పేసర్ అంకిత్ రాజ్‌పూత్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 31 ఏళ్ల రాజ్‌పూత్ భారత క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తన నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా అంకిత్ వెల్లడించాడు. "భారత క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయిచుకున్నాను. 2009-2024 మధ్య కాలంలో నా క్రికెట్ ప్రయాణం అత్యద్భుతం. నాకు అవకాశాలు ఇచ్చిన బీసీసీఐ, ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్, కాన్పూర్ క్రికెట్ అసోసియేషన్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, కింగ్స్ 11 పంజాబ్, రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీలకు ధన్యవాదాలు. క్రికెట్ ప్రపంచంలో కొత్త అవకాశాలను అన్వేషించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాను. కానీ ఏదేమైనప్పటికీ నాకు ఇష్టమైన క్రీడను మాత్రం ఇప్పటిలో విడిచిపెట్టను" అని తన రిటైర్మెంట్ నోట్లో అంకిత్ రాజ్‌పూత్ పేర్కొన్నాడు.ఇండియన్ క్రికెట్‌తో పూర్తి సంబంధాలు తెంచుకున్న రాజ్‌పూత్.. ఐపీఎల్ మినహా ఇతర ప్రాంఛైజీ క్రికెట్ లీగ్‌లలో ఆడే అవకాశముంది. ఇక 2012-13 రంజీ సీజన్లోఉత్తరప్రదేశ్ తరపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసిన రాజ్‌పూత్.. మొత్తం తన రెడ్ బాల్ కెరీర్లో 248 వికెట్లు సాధించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మెరుగైన రికార్డు ఉన్నప్పటికి అతడికి భారత జట్టు తరపున అంతర్జాతీయ స్థాయిలో ఆడే అవకాశం లభించలేదు. రాజ్‌పూత్ ఐపీఎల్లో కూడా ఆడాడు. 2013 ఐపీఎల్ సీజన్ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ అతడిని కొనుగోలు చేసింది.అప్పటి సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని సారథ్యంలో ఆడాడు. ధోని శిష్యుడిగా అతడు పేరొందాడు. ఆ తర్వాత సీజన్లలో పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ వంటి ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్లో 29 మ్యాచ్‌లు ఆడిన రాజ్‌పూత్ 24 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అందులో ఓ ఫైవ్ వికెట్ హాల్‌కూడా ఉంది.చదవండి: IND vs AUS: భారత్‌తో మూడో టెస్టు.. ఆస్ట్రేలియాకు భారీ షాక్ -
ఈ సారి ముంబై ఇండియన్స్ తరుపున..
ముంబై : న్యూజిలాండ్ స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ వచ్చే ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ తరుపున ప్రాతినిథ్యం వహించనున్నాడు. ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ తన అధికారిక ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఈ మేరకు ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ విండో ద్వారా ఒప్పందం చేసుకుంది. ఇక మరోవైపు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాడు అంకిత్ రాజ్‌పుత్ ఆటగాళ్ల మార్పులో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌కు బదిలీ అయ్యాడు. ఐపీఎల్-2020 సీజన్‌కు సంబంధించి ట్రేడింగ్ విండో గడువు రేపటికి(నవంబర్ 14)ముగుస్తుండటంతో ఆటగాళ్ల మార్పులు ఇంకా చోటు చేసుకునే అవకాశం ఉంది. ట్రేడింగ్ ముగిసిన అనంతరం ఐపీఎల్ వేలం డిసెంబర్19న కోల్‌కతాలో జరగనుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఇప్పటివరకు మూడు ఫ్రాంచైజీల తరుపున బౌల్ట్ ఆడాడు. తొలుత సన్‌రైజర్స్ తరుపున ఐపీఎల్ అరంగేట్రం చేసిన ఈ లెఫ్టార్మర్.. ఆ తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున ప్రాతినిథ్యం వహించాడు. అయితే వచ్చే సీజన్ కోసం సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్‌తో ట్రెంట్ బౌల్ట్ జతకట్టాడు. ఇక అంకిత్ రాజ్‌పుత్ కూడా కింగ్స్ పంజాబ్ తరుపున ఆడి జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. కాగా, ఇటీవలే ట్రెడింగ్ విండో విధానంతో కింగ్స్ పంజాబ్ సారథి రవిచంద్రన్ అశ్విన్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు మారిన విషయం తెలిసిందే. ఇక ట్రేడింగ్ విండో విధానం ఐపీఎల్-2015 నుంచి ప్రారంభించారు. ఈ విధానం ద్వారా ప్రాంచైజీలు ఆటగాళ్లను బదిలీ చేసుకునే వీలు ఉంటుంది. 🚨Aala Re🚨@trent_boult ⚡ joins #MumbaiIndians from Delhi Capitals!#OneFamily #CricketMeriJaan pic.twitter.com/Sh1HQbiQ0N — Mumbai Indians (@mipaltan) November 13, 2019 -
‘ఆ వ్యూహంతోనే సన్‌రైజర్స్‌ను కట్టడి చేశాం’
మొహాలి: ఐపీఎల్ భాగంగా సోమవారం సన్‌రైజర్స్‌తో హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 150 పరుగుల సాధారణ స్కోరు చేయగా, కింగ్స్ పంజాబ్ బంతి మాత్రమే మిగిలి ఉండగా విజయాన్ని అందుకుంది. అయితే సన్‌రైజర్స్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్, బెయిర్ స్టోల కోసం ప్రత్యేక వ్యూహం సిద్ధం చేసి బరిలోకి దిగామని కింగ్స్ పంజాబ్ పేసర్ అంకిత్ రాజ్‌పుత్ స్పష్టం చేశాడు. వారిద్దర్నీ ఎక్కువ పరుగులు చేయకుండా నియత్రించడమే తమ ప్రణాళికలో భాగమని పేర్కొన్నాడు. ప్రధానంగా , బెయిర్ స్టో, వార్నర్ స్వేచ్ఛగా ఆడే అవకాశం ఇవ్వకుండా కచ్చితమైన లైన్‌తో బౌలింగ్ చేయడమే లక్ష్యంగా పోరుకు సిద్ధమయ్యామన్నాడు. దానిలో భాగంగా బెయిర్ స్టో(1)ను ఆదిలోనే పెవిలియన్‌కు పంపించామన్నాడు. ఇక్కడ వార్నర్ కడవరకూ ఉండి అజేయంగా 70 పరుగులు చేసినప్పటికీ, అతను స్వేచ్ఛగా ఆడే వీలు లేకుండా కచ్చితమైన బౌలింగ్ చేయడంతోనే సన్‌రైజర్స్ భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశామన్నాడు.నిన్నటి మ్యాచ్‌లో అంకిత్ రాజ్‌పుత్ నాలుగు ఓవర్లు కోటా బౌలింగ్ వేసినప్పటికీ వికెట్ సాధించలేకపోయాడు. కాగా, 21 పరుగులు మాత్రమే ఇచ్చి పొదుపుగా బౌలింగ్ చేశాడు. (ఇక్కడ చదవండి: హైదరాబాద్ మళ్లీ ఓడింది!) -
రికార్డు సృష్టించిన యువ బౌలర్ రాజ్‌పుత్