ఉత్తరప్రదేశ్ స్టార్ పేసర్ అంకిత్ రాజ్‌పూత్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 31 ఏళ్ల రాజ్‌పూత్ భారత క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తన నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా అంకిత్ వెల్లడించాడు. "భారత క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయిచుకున్నాను.
2009-2024 మధ్య కాలంలో నా క్రికెట్ ప్రయాణం అత్యద్భుతం. నాకు అవకాశాలు ఇచ్చిన బీసీసీఐ, ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్, కాన్పూర్ క్రికెట్ అసోసియేషన్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, కింగ్స్ 11 పంజాబ్, రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీలకు ధన్యవాదాలు.
క్రికెట్ ప్రపంచంలో కొత్త అవకాశాలను అన్వేషించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాను. కానీ ఏదేమైనప్పటికీ నాకు ఇష్టమైన క్రీడను మాత్రం ఇప్పటిలో విడిచిపెట్టను" అని తన రిటైర్మెంట్ నోట్‌లో అంకిత్ రాజ్‌పూత్ పేర్కొన్నాడు.
ఇండియన్ క్రికెట్‌తో పూర్తి సంబంధాలు తెంచుకున్న రాజ్‌పూత్.. ఐపీఎల్ మినహా ఇతర ప్రాంఛైజీ క్రికెట్ లీగ్‌లలో ఆడే అవకాశముంది. ఇక 2012-13 రంజీ సీజన్‌లోఉత్తరప్రదేశ్ తరపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసిన రాజ్‌పూత్.. మొత్తం తన రెడ్ బాల్ కెరీర్‌లో 248 వికెట్లు సాధించాడు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మెరుగైన రికార్డు ఉన్నప్పటికి అతడికి భారత జట్టు తరపున అంతర్జాతీయ స్థాయిలో ఆడే అవకాశం లభించలేదు. రాజ్‌పూత్ ఐపీఎల్‌లో కూడా ఆడాడు. 2013 ఐపీఎల్ సీజన్ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ అతడిని కొనుగోలు చేసింది.
అప్పటి సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోని సారథ్యంలో ఆడాడు. ధోని శిష్యుడిగా అతడు పేరొందాడు. ఆ తర్వాత సీజన్లలో పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ వంటి ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్‌లో 29 మ్యాచ్‌లు ఆడిన రాజ్‌పూత్ 24 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అందులో ఓ ఫైవ్ వికెట్ హాల్‌కూడా ఉంది.
చదవండి: IND vs AUS: భారత్‌తో మూడో టెస్టు.. ఆస్ట్రేలియాకు భారీ షాక్
Comments
Please login to add a commentAdd a comment