మొహాలి: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్ 12లో భాగంగా సోమవారం స్థానిక ఐఎస్ బింద్రా మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్- కింగ్ప్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ సారథి రవిచంద్రన్ అశ్విన్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. విలియమ్సన్ గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో ఈ మ్యాచ్‌కు కూడా దూరమయ్యాడు. దీంతో భువనేశ్వర్ కుమార్ సన్‌రైజర్స్‌కు సారథిగా వ్యవహరించనున్నాడు. పంజాబ్‌తో మ్యాచ్‌కు ఎలాంటి మార్పులు లేకుండానే సన్‌రైజర్స్ బరిలోకి దిగుతోంది. కాగా పంజాబ్ టీమ్‌లో రెండు మార్పులు చోటుచేసుకున్నాయి. ఆండ్రూ టై, మురుగన్ అశ్విన్‌లను తప్పించి అంకిత్ రాజ్‌పుత్, ముజీబ్‌లను తుదిజట్టులోకి తీసుకుంది.
ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఇరుజట్లు చెరో ఐదు మ్యాచ్‌లు ఆడగా చెరో మూడు మ్యాచ్‌లు గెలిచాయి. అయితే ముంబై ఇండియన్స్ చేతిలో ఘోర ఓటమి అనంతరం జరుగుతున్న మ్యాచ్ కావడంతో ఆ ప్రభావం సన్‌రైజర్స్‌పై పడే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్‌లో తప్పకుండా గెలిచి విజయాల బాట పట్టాలని సన్‌రైజర్స్ ఆరాటపడుతోంది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, బెయిర్‌స్టోలపైనే సన్‌రైజర్స్ ఎక్కువగా ఆధారపడుతోంది. మిడిలార్డర్ కూడా రాణించాలని టీమ్ మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది. అలాగే సొంతగడ్డపై పరిస్థితులను సద్వినియోగం చేసుకొని మరో విజయాన్ని ఖాతాలో వేసుకోవాలని అశ్విన్‌సేన భావిస్తోంది.
తుదిజట్లు:
సన్‌రైజర్స్: భువనేశ్వర్ కుమార్(కెప్టెన్), డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో, విజయ్ శంకర్, మనీష్ పాండే, దీపక్ హుడా, యుసుఫ్ పఠాన్, మహ్మద్ నబి, రషీద్ ఖాన్, సిద్దార్థ్ కౌల్, సందీప్ శర్మ
కింగ్స్ పంజాబ్: రవిచంద్రన్ అశ్విన్(కెప్టెన్), కేఎల్ రాహుల్, క్రిస్ గేల్, మయాంక్ అగర్వాల్, సర్ఫరాజ్ ఖాన్, డేవిడ్ మిల్లర్, మన్‌దీప్ సింగ్, స్యామ్ కరన్, అంకిత్ రాజ్‌పుత్, మహ్మద్ షమీ, ముజీబ్
Comments
Please login to add a commentAdd a comment