Sunrisers Hyderbad
-
IPL 2023: బ్రూక్ పంట పండింది.. ఎస్ఆర్హెచ్ తలరాత మారేనా!
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీబ్రూక్ పంట పండింది. ఇటీవలే కాలంలో నిలకడగా ఆడుతున్న బ్రూక్ టి20 వరల్డ్‌కప్‌లోనూ మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తాజాగా పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్‌లో సెంచరీలతో కథం తొక్కిన హ్యారీ బ్రూక్‌కు శుక్రవారం కొచ్చి వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మినీ వేలంలో భారీ ధర పలికింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ హ్యారీ బ్రూక్‌ను రూ. 13.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ వేలంలో ఇప్పటివరకు వేలంలోకి వచ్చిన ఆటగాళ్లలో బ్రూక్‌దే అత్యధికం కావడం విశేషం. బ్రూక్ తర్వాత మయాంక్ అగర్వాల్ రూ. 8.25 కోట్లకు ఎస్ఆర్హెచ్కే అమ్ముడుపోయాడు. ఆ తర్వాత ఎస్ఆర్హెచ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను రూ. 2కోట్ల కనీస ధరకు గుజరాత్ లయన్స్ దక్కించుకుంది. ఇక అజింక్యా రహానేనను సీఎస్కే కనీస ధర రూ. 50 లక్షలకు కొనుగోలు చేసింది. ఇక హ్యారీ బ్రూక్ ఇటీవలే పాకిస్తాన్‌తో ముగిసిన టెస్టు సిరీస్ ద్వారా 125 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. తొలి ఆరు టెస్టు ఇన్నింగ్స్‌లు కలిపి అత్యధిక పరుగులు చేసిన తొలి ఇంగ్లండ్ బ్యాటర్‌గా హ్యారీబ్రూక్ నిలిచాడు.ఇప్పటివరకు మూడు టెస్టులు ఆడిన బ్రూక్ ఆరు ఇన్నింగ్స్‌లు కలిపి 480 పరుగులు(12, 153, 87, 9, 108,111) చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. మరో విషయమేంటంటే బ్రూక్ సాధించిన ఆ మూడు సెంచరీలు పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్‌లోనే వచ్చాయి. ఇంతకముందు ఇంగ్లండ్ తరపున కేఎస్ రంజిత్‌సింగ్హ్జి 418 పరుగులు( 62, 154*, 8, 11, 175,8*), టిప్ ఫోస్టర్ 411 పరుగులు(287, 19,49*, 21, 16,19)లు ఉన్నారు. తాజాగా వీరిద్దరిని అధిగమించిన హ్యారీ బ్రూక్ 480 పరుగులతో టాప్ స్థానంలో నిలిచాడు. What do you make of this buy folks? 💰💰 Congratulations to Harry Brook who joins @SunRisers #IPLAuction | @TataCompanies pic.twitter.com/iNSKtYuk2C — IndianPremierLeague (@IPL) December 23, 2022 చదవండి: సామ్ కరన్ కొత్త చరిత్ర.. వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా -
IPL 2023: సన్‌రైజర్స్‌లోకి బెన్ స్టోక్స్.. కెప్టెన్ కూడా అతడే..?
ఐపీఎల్-2023 సీజన్ మినీ వేలానికి (డిసెంబర్ 23) రోజులు దగ్గర పడుతున్న కొద్దీ.. కొత్తగా వేలం బరిలో నిలిచే విదేశీ స్టార్ ఆటగాళ్లను ఏ ఫ్రాంచైజీలు చేజిక్కించుకుంటాయోనన్న టెన్షన్ అభిమానుల్లో మొదలైంది. పలానా ఆటగాడిని పలానా ఫ్రాంచైజీ దక్కించుకుంటే బాగుంటుందని ఫ్యాన్స్ ఇప్పటినుంచే అంచనాల్లో మునిగితేలుతున్నారు. వేలానికి ఇంకా నెల రోజుల సమయం ఉనప్పటికీ.. తమతమ ఫేవరెట్ జట్లు ఇలా ఉంటే బాగుంటుందని లెక్కలేసుకుంటున్నారు. ముఖ్యంగా టీ20 వరల్డ్‌కప్-2022 స్టార్లు సామ్ కర్రన్, బెన్ స్టోక్స్, అలెక్స్ హేల్స్, ఆదిల్ రషీద్, సికందర్ రాజా, కెమరూన్ గ్రీన్ తమతమ జట్లలో ఉండాలని అన్ని ఫ్రాంచైజీలు, సంబంధిత జట్ల అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతానికి ఆయా ఫ్రాంచైజీల పర్స్ల్లో ఉన్న బ్యాలెన్స్ లెక్కలను బేరీజు వేసుకుని పై పేర్కొన్న ఆటగాళ్లను సొంతం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేయడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే, 10 ఫ్రాంచైజీల్లో ఎక్కువ పర్స్ బ్యాలెన్స్ ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (42.25 కోట్లు)కు ఎక్కువ మంది స్టార్ ఆటగాళ్లను సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఎస్ఆర్హెచ్ దగ్గర ఉన్న బ్యాలెన్స్ ప్రకారం.. బెన్ స్టోక్స్, అలెక్స్ హేల్స్, కెమరూన్ గ్రీన్‌లను చేజిక్కించుకునేందుకు ఎందాకైనా వెళ్లే ఛాన్స్ ఉంది. వీరిలో స్టోక్స్‌కు 10 నుంచి 12 కోట్లు ఖర్చు చేసినా.. హేల్స్‌కు 3 నుంచి 4 కోట్లు, గ్రీన్‌కు 6 నుంచి 8 కోట్లు వెచ్చించినా ఆ ఫ్రాంచైజీ దగ్గర ఇంకా బ్యాలెన్స్ మిగిలే ఉంటుంది. ఈ లెక్కల ప్రకారం సన్‌రైజర్స్.. స్టోక్స్‌పై ఎంతైనా ఖర్చు పెట్టే అవకాశం ఉంది. అందులోనూ ఆ జట్టు.. మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను వదిలించుకోవడంతో స్టోక్స్‌ను ఎలాగైనా దక్కించుకుని, కెప్టెన్సీ పగ్గాలు కూడా అప్పజెప్పే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సన్‌రైజర్స్ రిటెన్షన్ లిస్ట్: ఎయిడెన్ మార్క్రమ్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, మార్కో జన్సెన్, వాషింగ్టన్ సుందర్, కార్తీక్ త్యాగీ, టి నటరాజన్, ఫజల్ హక్ ఫారూఖీ. సన్‌రైజర్స్ విడిచిపెట్టిన ఆటగాళ్లు: కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్, జగదీశ సుచిత్, ప్రియమ్ గార్గ్, రవికుమార్ సమర్థ్, రొమారియో షెపర్డ్, సౌరభ్ దూబే, సీన్ అబాట్, శశాంక్ సింగ్, శ్రేయాస్ గోపాల్, సుశాంత్ మిశ్రా, విష్ణు వినోద్ ప్రస్తుతానికి ఆయా ఫ్రాంచైజీల పర్స్‌లో ఉన్న బ్యాలెన్స్ వివరాలు.. సన్‌రైజర్స్ హైదరాబాద్- 42.25 కోట్లు పంజాబ్ కింగ్స్-32.20 కోట్లు లక్నో సూపర్ జెయింట్స్-23.35 కోట్లు ముంబై ఇండియన్స్-20.55 కోట్లు చెన్నై సూపర్‌కింగ్స్-20.45కోట్లు ఢిల్లీ క్యాపిటల్స్-19.45 కోట్లు గుజరాత్ టైటాన్స్-19.25 కోట్లు రాజస్థాన్ రాయల్స్-13.20 కోట్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-8.75 కోట్లు కోల్‌కతా నైట్‌రైడర్స్-7.05 కోట్లు -
"అతడు అద్భుతమైన బౌలర్.. త్వరలోనే భారత జట్టులోకి వస్తాడు"
ఐపీఎల్-2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ ఘన విజయం సాధించింది. ఎస్ఆర్హెచ్ విజయంలో ఆ జట్టు యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ముఖ్యంగా పంజాబ్ ఇన్నింగ్స్ అఖరి ఓవర్ వేసిన ఉమ్రాన్ పరుగులేమి ఇవ్వకుండా మూడు వికెట్లు సాధించాడు. ఈ క్రమంలో ఉమ్రాన్ మాలిక్‌పై భారత మాజీ క్రికెటర్ నిఖిల్ చోప్రా ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ మ్యాచ్‌లో మాలిక్ అద్భుతమైన ప్రదర్శన చేశాడని అతడు కొనియాడాడు. అఖరి ఓవర్లో మెయిడిన్ ఓవర్ చేసి వికెట్లు సాధించడం అరుదైన సందర్భమని చోప్రా అభిప్రాయపడ్డాడు. "ఈ మ్యాచ్‌లో ఉమ్రాన్ మాలిక్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఈ సీజన్లో గంటకు 145 కి.మీ స్పీడ్పైగా మాలిక్ బౌలింగ్ చేస్తున్నాడు. బుమ్రా, ఫెర్గూసన్, షమీ వంటి ఫాస్ట్ బౌలర్లతో మాలిక్ పోటీ పడుతున్నాడు. ఇక అఖరి ఓవర్లో మెయిడిన్‌తో పాటు మూడు వికెట్లు సాధించండం అరుదైన సందర్భం. గతంలో వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లు తీసి టీమిండియా క్యాప్‌ను అందుకున్నట్లుగా, ఈ ప్రదర్శనతో ఉమ్రాన్ కూడా భారత్ తరపున అరంగేట్రం చేస్తాడాని నేను భావిస్తున్నాను. అదే విధంగా ఈ ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో కూడా ఇటువంటి ఫాస్ట్ బౌలర్ అవసనమని నేను అనుకుంటున్నాను అని నిఖిల్ చోప్రా పేర్కొన్నాడు. చదవండి: IPL 2022: ఐపీఎల్లో భువనేశ్వర్ కుమార్ అరుదైన రికార్డు.. తొలి భారత పేసర్‌గా..! -
నటరాజన్ సూపర్ డెలివరీ.. గైక్వాడ్‌కు ఫ్యూజ్‌లు ఔట్.. వీడియో వైరల్!
ఐపీఎల్-2022లో భాగంగా సీఎస్కేతో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ పేసర్ నటరాజన్ సూపర్ బంతితో మెరిశాడు. చెన్నై ఇన్నింగ్స్ 5 ఓవర్ వేసిన నటరాజన్ తొలి బంతికే అద్భుతమైన ఇన్‌స్వింగర్‌తో రుత్‌రాజ్ గైక్వాడ్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. నటరాజన్ వేసిన బంతిని గైక్వాడ్ అంచనా వేసే లోపే బంతి మిడిల్ స్టంప్‌ను గిరాటేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదే విధంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లోను కృనాల్ పాండ్యాను అద్భుతమైన యార్కర్‌తో నటరాజన్ పెవిలియన్‌కు పంపిన సంగతి తెలిసిందే. చదవండి: IPL 2022: తెవాటియా సిక్సర్ కొట్టగానే ఎగిరి గంతేసిన అమ్మాయి.. ఇంతకీ ఎవరామె?! https://t.co/MQpI4R5Uoj — Ranga swamy - SEO Analyst Internet (@RangaSeo) April 9, 2022 -
కీలక పోరుకు సిద్దమైన సీఎస్కే, ఎస్ఆర్హెచ్.. తొలి విజయం ఎవరిది!
ఐపీఎల్-2022లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్దమైంది. డివై పాటెల్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక ఇరు జట్లు ఇప్పటివరకు ఈ సీజన్లో బోణీ కొట్టలేదు. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ఐపీఎల్-2022లో తొలి విజయాన్ని నమోదు చేయాలని ఇరు జట్లు భావిస్తోన్నాయి. ఈ క్రమంలో ఇరు జట్ల బలాబలాలు ఏంటో పరిశీలిద్దాం. ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే.. బ్యాటింగ్‌లో ఆ జట్టు కాస్త తడబడుతోంది. ముఖ్యంగా ఎస్ఆర్హెచ్కు ఘనమైన ఆరంభం లభించడంలేదు. కెప్టెన్ విలియమ్సన్ రాణించాల్సిన అవసరం ఆ జట్టుకు ఎంతో ఉంది. అదే విధంగా మిడిలార్డర్లో రాహుల్ త్రిపాఠి, మాక్రమ్, పూరన్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్‌లో త్రిపాఠి, పూరన్ అద్భుతంగా రాణించారు. ఇక బౌలింగ్‌లో మాత్రం సన్‌రైజర్స్ పటిష్టంగా కన్పిస్తోంది. రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో పరుగులు భారీగా సమర్పించుకున్న ఎస్ఆర్హెచ్ బౌలర్లు.. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌తో తిరిగి గాడిలో పడ్డారు. టి.నటరాజన్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్ వంటి అద్భుతమైన బౌలర్లు ఉన్నారు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ విషయానికి వస్తే.. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ చెన్నై ఓటమి పాలైంది. బ్యాటింగ్ పరంగా సీఎస్కే పటిష్టంగా కన్పిస్తోంది. ఓపెనర్ రుత్‌రాజ్ గైక్వాడ్ ఫామ్‌లో లేకపోవడం ఆ జట్టును కాస్త ఇబ్బంది పెట్టే విషయం. రాబిన్ ఊతప్ప, మెయిన్ అలీ, రాయుడు, దోని అద్భుతమైన ఫామ్‌లో ఉండడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. ఇక చెన్నై బౌలర్లు అతంగా రాణించలేకపోతున్నారు. దీపక్ చహార్ లేని లోటు సీఎస్కేలో సృష్టంగా కన్పిస్తోంది. కాగా డ్వేన్ బ్రావో, క్రిస్ జోర్డాన్, డ్వేన్ ప్రిటోరియస్ వంటి అంతర్జాతీయ బౌలర్లు ఉన్నారు. ఈ మ్యాచ్‌లో ఓ మార్పుతో చెన్నై బరిలోకి దిగే అవకాశం ఉంది. తుషార్ దేశ్ పాండే స్థానంలో రాజ్‌వర్దన్ హాంగేర్కార్కు చోటు దక్కే అవకాశం ఉంది. ఇక ఇరు జట్లు ఐపీఎల్లో ఇప్పటి వరకు 17 సార్లు తలపడగా.. చెన్నై 13 మ్యాచ్‌ల్లో గెలవగా, ఎస్ఆర్హెచ్ కేవలం 4 సార్లు మాత్రమే విజయం సాధించింది. తుది జట్లు (అంచనా): సన్‌రైజర్స్ హైదరాబాద్: రాహుల్ త్రిపాఠి, అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్, ఐడెన్ మార్క్రామ్, అబ్దుల్ సమద్, రొమారియో షెపర్డ్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్, ఉమ్రాన్ మాలిక్. చెన్నై సూపర్ కింగ్స్: రాబిన్ ఉతప్ప, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, ఎంఎస్ ధోనీ, మహేష్ తీక్షణ, క్రిస్ జోర్డాన్, డ్వైన్ ప్రిటోరియస్, రాజ్ హంగర్గేకర్. -
బెట్లో ఓడిపోయిన సన్‌రైజర్స్ బౌలర్.. బదులుగా ఏమి ఇచ్చాడంటే!
ఐపీఎల్-2022లో భాగంగా మార్చి 29న రాజస్థాన్ రాయల్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్‌కు సిద్దమవుతోంది. ఈ క్రమంలో నెట్స్‌లో హైదరాబాద్ ఆటగాళ్లు చెమటోడుస్తున్నారు. ఇది ఇలా ఉంటే.. వెస్టిండీస్ బ్యాటర్ నికోలస్ పూరన్ భారత యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్‌కు ఓపెన్ ఛాలెంజ్ చేశాడు. ప్రాక్టీస్ సెషన్లో భాగంగా.. ఉమ్రాన్ మాలిక్ యార్కర్ వేస్తే ఫ్రీ ఢిన్నర్ ఇప్పిస్తానని పూరన్ ఛాలెంజ్ చేశాడు. "నీవు తరువాతి బంతిని యార్కర్ వేస్తే నీకు డిన్నర్ ఇప్పిస్తాను. ఒక వేళ నీవు యార్కర్ వేయకపోతే నీవు నాకు ఇప్పించాలి" అని పేర్కొన్నాడు. పూరన్ ఛాలెంజ్‌కు ఉమ్రాన్ మాలిక్ కూడా అంగీకరించాడు. అయితే దురదృష్టవశాత్తూ, ఉమ్రాన్ యార్కర్‌ను వేయలేకపోయాడు. దీంతో ఛాలెంజ్‌లో ఓడిపోయిన ఉమ్రాన్ మాలిక్.. పూరన్‌కు ఫ్రీ డిన్నర్ ఇప్పించాడు. దీనికి సంబంధించిన వీడియోను సన్‌రైజర్స్ హైదరాబాద్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు ఎస్ఆర్హెచ్ రూ.4కోట్లకు రీటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: కేన్ విలియమ్సన్, అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్, వాషింగ్టన్ సుందర్, నికోలస్ పూరన్, టి నటరాజన్, భువనేశ్వర్ కుమార్, ప్రియమ్ గార్గ్, రాహుల్ త్రిపాఠి, అభిషేక్ శర్మ, కరిక్ త్యాగి, శ్రేయాస్ గోపాల్, జగదీశ సుచిత్, ఐడెన్ మార్క్రామ్, మార్కో జాన్సెన్, రొమారియో అబ్బోట్, రొమారియో అబ్బోట్ , ఆర్ సమర్థ్, సౌరభ్ దూబే, శశాంక్ సింగ్, విష్ణు వినోద్, గ్లెన్ ఫిలిప్స్, ఫజల్హాక్ ఫరూకీ చదవండి: IPL2022: విజయానందంలో ఉన్న పంత్ సేనకు సాడ్ న్యూస్ Did Umran buy you dinner as promised, @nicholas_47? 🤣#OrangeArmy #ReadyToRise #TATAIPL pic.twitter.com/LvDlzFwUMc — SunRisers Hyderabad (@SunRisers) March 28, 2022 -
బౌన్సర్లతో భయపెట్టిన సన్‌రైజర్స్ బౌలర్.. పాపం పూరన్!
ఐపీఎల్-2021 సెకెండ్ ఫేజ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున అరంగేట్రం చేసిన జమ్మూ యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ తనదైన ముద్ర వేసుకున్నాడు. గత సీజన్లో ఆ జట్టు బౌలర్ టి.నటరాజన్ కరోనా బారిన పడడంతో ఉమ్రాన్‌కు అవకాశం దక్కింది. దీంతో అతడికి వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. గతేడాది కేవలం మూడు మ్యాచ్‌లే ఆడిన ఉమ్రాన్ తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ఇది ఇలా ఉంటే ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు రూ. 4 కోట్లకు ఎస్ఆర్హెచ్ ఉమ్రాన్ మాలిక్‌ను రీటైన్ చేసుకుంది. ఇక ఐపీఎల్-2022 కు సమయం దగ్గర పడడంతో ఎస్ఆర్హెచ్ ఇంట్రా-స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో ఉమ్రాన్ మాలిక్ తన బౌలింగ్‌తో ‘ప్రత్యర్ధి’ జట్టు బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ముఖ్యంగా ఆ జట్టు స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్‌ను తన బౌన్సర్లతో ఉమ్రాన్ ఇబ్బంది పెట్టాడు. ఉమ్రాన్ వేసిన ఓ బౌన్సర్‌కు పూరన్ లెగ్‌సైడ్ ఈజీ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతోంది. ఇక మార్చి 26 నుంచి ఐపీఎల్-2022 ప్రారంభం కానుంది. అదే విధంగా ఎస్ఆర్హెచ్ మార్చి 29న తమ తొలి మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌ను ఢీకొట్టనుంది. చదవండి: World Cup 2022: భారత్‌కు బ్యాడ్ న్యూస్.. దక్షిణాఫ్రికాపై తప్పక గెలవాల్సిందే.. లేదంటే! Umran Malik to Nicholas Pooran: Ball 1: A SCARY bouncer Ball 2: Another bouncer and OUT 📹: @SunRisers #IPL #IPL2022 #SunrisersHyderabad pic.twitter.com/yoVrItcA42 — Kashmir Sports Watch (@Ksportswatch) March 23, 2022 -
IPL 2022- SRH: మొన్ననే సంతోషంగా ఉందన్నాడు.. ఇంతలోనే ఏమైందో!
IPL 2022 SRH- Simon Katich:- సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఐపీఎల్-2021 సీజన్లో దారుణ ప్రదర్శన... 2016లో జట్టుకు టైటిల్ అందించిన కెప్టెన్ డేవిడ్ వార్నర్‌కు ఉద్వాసన.. తుది జట్టులో కూడా చోటు కల్పించలేదు... మెగా వేలం నేపథ్యంలో వార్నర్ సహా స్టార్ ప్లేయర్ రషీద్ ఖాన్‌ను రిటైన్ చేసుకోలేదు.. ఇక కోచ్‌ల విషయానికొస్తే... అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత విజయవంతమైన కోచ్‌గా పేరున్న ట్రెవర్ బేలిస్... అసిస్టెంట్ కోచ్ పనిచేసిన బ్రాడ్ హాడిన్ సైతం గత సీజన్లో తమ పదవుల నుంచి తప్పుకొన్నారు. పేలవ ప్రదర్శనకు తోడు వార్నర్, రషీద్ లాంటి స్టార్ ప్లేయర్లను వదులుకున్న క్రమంలో ఐపీఎల్-2022 సీజన్ నేపథ్యంలో సన్‌రైజర్స్ కొత్త సిబ్బందితో ముందుకు వచ్చింది. టామ్ మూడీ తిరిగి హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టగా... రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు హెడ్ కోచ్‌గా పనిచేసిన సైమన్ కటిచ్‌ను అసిస్టెంట్ కోచ్‌గా నియమించింది. ఇక విండీస్ దిగ్గజం బ్రియన్ లారా, డేల్ స్టెయిన్, ముత్తయ్య మురళీధరన్, హేమంగ్ బదానీని తమ సిబ్బందిలో చేర్చుకుంది. అయితే, ఐపీఎల్ మెగా వేలానికి ముందుగా రచించిన ప్రణాళికలను అమలు చేయకుండా భిన్నంగా వ్యవహరించారంటూ అసిస్టెంట్ కోచ్ సైమన్ కటిచ్ రాజీనామా చేశారన్న వార్త సంచలనంగా మారింది. సన్‌రైజర్స్ యాజమాన్యం తన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదన్న ఆరోపణలతో ఆయన పదవి నుంచి వైదొలిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో.. వేలం నేపథ్యంలో సన్‌రైజర్స్ విడుదల చేసిన సైమన్ కటిచ్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో కటిచ్.. దక్షిణాఫ్రికా క్రికెటర్లు ఎయిడెన్ మార్కరమ్, మార్కో జాన్సెన్ను ఎంపిక చేయడం వెనుక కారణాలు వివరించాడు. ‘‘గత సీజన్లో పంజాబ్‌కు ఆడిన ఎయిడెన్ మార్కరమ్.. రెండేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్లోనూ మెరుగ్గా రాణిస్తున్నాడు. అందుకే అతడిని తీసుకున్నాం. తను మంచి ఆల్‌రౌండ్ ఆప్షన్. ఆఫ్ స్పిన్ బౌలింగ్ కూడా చేయగలడు. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగలడు. అదే విధంగా మార్కో జాన్సెన్.. గతంలో ముంబైకి ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్లో తన ప్రదర్శన బాగుంది. వీళ్లిద్దరినీ జట్టులోకి తీసుకోవడం పట్ల సంతోషంగా ఉంది’’ అని చెప్పుకొచ్చాడు. ఇంతలోనే ఇలా ఫ్రాంఛైజీని వీడుతున్నట్లు వార్తలు రావడం గమనార్హం. ఈ నేపథ్యంలో... ‘‘కొత్త తెలుగు ఆటగాడు కూడా లేడు. పైగా ఒకరిద్దరు తప్ప మిగిలిన వారంతా నామ్ కే వాస్తే అన్నట్లుగానే ఆడేవాళ్లు... అసలు ఓపెనింగ్ జోడీ ఎలా సెట్ చేస్తారో తెలియదు. బహుశా కావ్య సెలక్షన్ నచ్చలేదేమో! అందుకే కటిచ్ రాజీనామా చేసి ఉంటాడు’’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ అయిన సైమన్ కటిచ్ దేశం తరఫున 56 టెస్టులు, 45 వన్డేలు, మూడు టీ20లు ఆడాడు. It's time for South Africa. 🇿🇦 Listen to Simon Katich speak about what Aiden Markram and Marco Jansen bring to the table. 🗣️#OrangeArmy #ReadyToRise #IPLAuction pic.twitter.com/Ob6pEjVvx4 — SunRisers Hyderabad (@SunRisers) February 13, 2022 ఎస్ఆర్హెచ్- మెగా వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు: నికోలస్ పూరన్(10.75 కోట్లు) వాషింగ్టన్ సుందర్(8.75 కోట్లు) రాహుల్ త్రిపాఠి(8.5 కోట్లు) రొమారియో షెపర్డ్(7.7 కోట్లు) అభిషేక్ శర్మ(6.5 కోట్లు) భువనేశ్వర్ కుమార్(4.2 కోట్లు) మార్కో జన్సెన్(4.2 కోట్లు) టి నటరాజన్(4 కోట్లు) కార్తీక్ త్యాగి(4 కోట్లు) ఎయిడెన్ మార్క్రమ్(2.6 కోట్లు) సీన్ అబాట్(2.4 కోట్లు) గ్లెన్ ఫిలిప్(1.5 కోట్లు) శ్రేయస్ గోపాల్(75 లక్షలు) విష్ణు వినోద్(50 లక్షలు) ఫజల్ హక్ ఫారుఖి(50 లక్షలు) జె సుచిత్(20 లక్షలు) ప్రియమ్ గార్గ్(20 లక్షలు) ఆర్ సమర్థ్(20 లక్షలు) శశాంక్ సింగ్(20 లక్షలు) సౌరభ్ దూబే(20 లక్షలు) -
మెగా వేలంలో అతడి కోసం మూడు జట్లు పోటీ..
టీమిండియా వెటరన్ బౌలర్ ఉమేష్ యాదవ్‌ని ఐపీఎల్-2021సీజన్‌కు గాను ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సీజన్లో ఉమేష్ యాదవ్ కేవలం బెంచ్‌కు మాత్రమే పరిమితమయ్యాడు. కాగా ఐపీఎల్-2022 సీజన్ మెగా వేలం ముందు ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని రీటైన్ చేసుకోలేదు. ఈ క్రమంలో మెగా వేలంలోకి వెళ్లనున్నాడు. కాగా రానున్న మెగా వేలంలో అతడికోసం మూడు ఫ్రాంఛైజీలు పోటీ పడే అవకాశం ఉంది. మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ అతడిని దక్కించుకోనేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. అతడు గత ఐపీఎల్ సీజన్లలో ఢిల్లీ, ఆర్సీబీ, కేకేఆర్ జట్లకు ప్రాతనిథ్యం వహించాడు. 121 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన ఉమేష్ యాదవ్ 121 వికెట్లు పడగొట్టాడు. ఇక మెగా వేలం బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బీసీసీఐ నిర్వహించనున్నట్లు సమాచారం. చదవండి: Ashes 2021: 13 సార్లు 200లోపూ.. 20 మంది ఆటగాళ్లు డకౌట్; ఇంగ్లండ్ చెత్త రికార్డు -
IPL 2022- SRH: సన్‌రైజర్స్ బ్యాటింగ్ కోచ్‌గా బ్రియన్ లారా.. కొత్త సిబ్బంది వీళ్లే
ఐపీఎల్-2022 నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక నిర్ణయం తీసుకుంది. వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారాను బ్యాటింగ్ కోచ్‌గా నియమించుకుంది. అదే విధంగా ఆర్సీబీ మాజీ హెడ్ కోచ్ సైమన్ కటిచ్‌ను అసిస్టెంట్ కోచ్‌గా ఎంపిక చేసినట్లు వెల్లడించింది. ఈ మేరకు తమ ఫ్రాంఛైజీకి సంబంధించిన కొత్త సిబ్బంది వివరాలను ట్విటర్ వేదికగా వీడియో రూపంలో వెల్లడించింది. ఇక ఎస్ఆర్హెచ్కు తొలి టైటిల్ అందించిన హెడ్‌కోచ్ టామ్ మూడీని కొనసాగిస్తున్నట్లు తెలిపింది. అదే విధంగా శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ కూడా తమతో ప్రయాణం కొనసాగిస్తారని పేర్కొంది. అదే విధంగా ప్రొటిస్ లెజండ్ డేల్ స్టెయిన్‌ను ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా నియమించుకున్నట్లు సన్‌రైజర్స్ యాజమాన్యం తెలిపింది. ఐపీఎల్ -2022: సన్‌రైజర్స్ సిబ్బంది హెడ్‌కోచ్- టామ్ మూడీ అసిస్టెంట్ కోచ్- సైమన్ కటిచ్ బ్యాటింగ్ కోచ్- బ్రియన్ లారా ఫాస్ట్ బౌలింగ్ కోచ్- డేల్ స్టెయిన్ స్పిన్ బౌలింగ్ కోచ్- ముత్తయ్య మురళీధరన్ ఫీల్డింగ్ కోచ్, స్కౌట్- హేమంగ్ బదాని Introducing the new management/support staff of SRH for #IPL2022! Orange Army, we are #ReadyToRise! 🧡@BrianLara #MuttiahMuralitharan @TomMoodyCricket @DaleSteyn62 #SimonKatich @hemangkbadani pic.twitter.com/Yhk17v5tb5 — SunRisers Hyderabad (@SunRisers) December 23, 2021 -
IPL 2022 Auction: రాహుల్, రషీద్‌ను ప్రలోభాలకు గురిచేశారు.. సంచలన ఆరోపణలు!
IPL 2022 Auction: PBKS SRH Complaint To BCCI About Lucknow Franchise Reports: ఐపీఎల్-2022 మెగా వేలానికి సమయం దగ్గరపడుతున్న కొద్దీ క్రీడాభిమానుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. ఏ జట్టు ఎవరిని రీటైన్ చేసుకుంటుంది, వేలంలో ఏ ఆటగాడు ఎంత ధర పలుకుతాడు అన్న అంశాలు ఆసక్తికరంగా మారాయి. ఇదిలా ఉంటే... రీటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను సమర్పించే తరుణం ఆసన్నమైన వేళ.. వచ్చే ఏడాది ఎంట్రీ ఇవ్వనున్న లక్నో ఫ్రాంఛైజీపై ఆరోపణలు వెలుగుచూశాయి. కేఎల్ రాహుల్, రషీద్ ఖాన్‌ను ప్రలోభాలకు గురిచేసి తమ జట్లను వీడేలా ఒప్పందాలు జరుగుతున్నాయంటూ పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ భారత క్రికెట్ నియంత్రణ మండలికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కాగా పంజాబ్ కింగ్స్ కెప్టెన్, టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు ఐపీఎల్లో ఉన్న రికార్డుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావన అక్కర్లేదు. ఇప్పటి వరకు నాలుగు సార్లు ఆరెంజ్ క్యాప్(అత్యధిక పరుగులు) అందుకున్న ఘనత అతడి సొంతం. అయితే, బ్యాటర్‌గా రాణిస్తున్నా కెప్టెన్‌గా మాత్రం అతడు పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. అయినప్పటికీ రాహుల్ వంటి స్టార్ ప్లేయర్‌ను వదులుకునేందుకు పంజాబ్ సిద్ధంగా లేదు. అయితే, లక్నో మాత్రం పెద్ద మొత్తమైనా చెల్లించి రాహుల్‌ను దక్కించుకునేందుకు ఇప్పటికే బేరసారాలు మొదలుపెట్టిందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంతేగాక ఇప్పటికే ఒప్పందం కూడా జరిగిపోయిందనే వదంతులు వ్యాపిస్తున్నాయి. ఇక సన్‌రైజర్స్‌ది కూడా ఇలాంటి పరిస్థితే. అఫ్గనిస్తాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ జట్టును వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అతడిని కూడా సొంతం చేసుకునేందుకు లక్నో ఆసక్తి చూపిస్తోందట. ఈ నేపథ్యంలో పంజాబ్, హైదరాబాద్ యాజమాన్యాలు లక్నో ఫ్రాంఛైజీ వ్యవహారశైలిపై ఇప్పటికే బీసీసీఐకి మౌఖికంగా ఫిర్యాదు చేసినట్లు ఇన్‌సైడ్‌స్పోర్ట్ కథనం ప్రచురించింది. ‘‘ఇప్పటివరకైతే లేఖా పూర్వకంగా మాకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. అయితే... లక్నో టీమ్ కొంతమంది ఆటగాళ్లను ప్రలోభాలకు గురిచేస్తోందని రెండు ఫ్రాంఛైజీలు మౌఖికంగా ఫిర్యాదు చేశాయి. ఈ అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాం. ఒకవేళ ఆరోపణలు నిజమని తేలితే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఆరోగ్యకరమైన పోటీ ఉంటే ఫర్వాలేదు. కానీ.. ప్రలోభాలకు గురిచేస్తే మాత్రం సహించబోము. జట్టును సమతుల్యం చేసుకునేందుకు ఇప్పటికే లీగ్‌లో పాల్గొంటున్న జట్లు ప్రయత్నిస్తుంటే.. ఇలా చేయడం మంచి పద్ధతి కాదు’’ అని బీసీసీఐ సీనియర్ అధికారి వ్యాఖ్యానించినట్లు పేర్కొంది. కాగా రాజీవ్ ప్రతాప్ సంజీవ్ గోయెంకా (ఆర్పీఎస్జీ) వెంచర్స్ లిమిటెడ్ రూ.7,090 కోట్లు (సుమారు బిలియన్ డాలర్లు) వెచ్చించి లక్నో జట్టును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. చదవండి: IPL 2022 Auction: అప్పుడు 8 కోట్లు... ఇప్పుడు 14 కోట్లకు ఓకే అన్నాడట.. కెప్టెన్‌గానే! -
వార్నర్‌ను పక్కకు పెట్టడానికి క్రికెటేతర కారణాలు ఉన్నాయి..!
Dropping David Warner Has Non Cricketing Reasons Says Sanjay Manjrekar: సన్‌రైజర్స్ యాజమాన్యం డేవిడ్ వార్నర్‌ను పక్కకు పెట్టడంపై వివాదాస్పద వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ సంచలన కామెంట్స్ చేశాడు. వార్నర్‌ను జట్టు నుంచి తప్పించడానికి ఎస్ఆర్హెచ్ యాజమాన్యం వద్ద క్రికెటేతర కారణాలు ఉన్నాయని ఆరోపించాడు. వార్నర్‌పై వేటు వేయడానికి ఫామ్ లేమి ఒక్కటే కారణం కాదని.. ఒకవేళ అదే కారణంగా చూపడానికి ఎస్ఆర్హెచ్ యాజమాన్యం వద్ద సరైన ఆధారాల్లేవని అన్నాడు. వార్నర్ పేలవమైన ఫామ్ చాలాకాలంగా కొనసాగలేదన్న విషయాన్ని గట్టిగా ప్రస్తావించిన ఆయన.. వేటుకు కారణాలు అంతుచిక్కడంలేదని అన్నాడు. కానీ ఎక్కడో ఏదో తప్పు జరుగుతుందని చెప్పుకొచ్చాడు. కాగా, సెప్టెంబర్ 27న రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌కు ముందు ఎస్ఆర్హెచ్ యాజమాన్యం వార్నర్‌ను జట్టు నుంచి తప్పించిన విషయం తెలిసిందే. ఆ తరువాత వార్నర్ కనీసం డగౌట్లో కూడా కనిపించలేదు. హోటల్ రూమ్‌కు మాత్రమే పరిమితమయ్యాడు. ఈ మధ్యలో అతను ఇన్‌స్టా వేదికగా సంచలన మెసేజ్‌ను షేర్ చేశాడు. తాను ఎస్ఆర్హెచ్ తరఫున మరో మ్యాచ్‌ను ఆడలేనని, తన చివరి మ్యాచ్‌ను ఆడేశానని పెద్ద బాంబు పేల్చాడు. అయితే అనూహ్యంగా నిన్న కేకేఆర్‌తో మ్యాచ్ సందర్భంగా ప్రేక్షకుల గ్యాలరీలో కనిపించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఇదిలా ఉంటే, 2013 సీజన్ నుంచి వరుసగా ప్రతి సీజన్లో 500 పరుగుల మార్కును క్రాస్ చేస్తూ వస్తున్న వార్నర్.. ప్రస్తుత సీజన్లో పేలవ ప్రదర్శనను కనబర్చాడు. 8 మ్యాచ్‌ల్లో కేవలం 195 పరుగులు మాత్రమే సాధించి తీవ్రంగా నిరుత్సాహపరిచాడు. 2016లో సన్‌రైజర్స్‌ను ఛాంపియన్‌గా నిలిపిన ఈ ఆసీస్ స్టార్ ఆటగాడు.. ప్రస్తుత సీజన్ తొలి దశలో ఎస్ఆర్హెచ్ సారధ్య బాధ్యతల నుంచి తప్పించబడ్డాడు. ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ వార్నర్ పట్ల అమర్యాదగా వ్యవహరించి.. కేన్ విలియమ్సన్‌ను కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పింది. చదవండి: టీ20ల్లో చరిత్ర సృష్టించిన బాబర్ ఆజమ్.. గేల్, కోహ్లి రికార్డులు బద్దలు -
హోల్డర్ మెరిసినా... సన్‌రైజర్స్ అవుట్
ఐపీఎల్ సీజన్లో మీది చెత్త జట్టా...లేక మాదా! శనివారం ఒకదశలో పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆట చూస్తే ఇరు జట్లు ఈ విషయంలో ఒకరితో మరొకరు పోటీ పడినట్లు అనిపించాయి. పట్టికలో చివరి రెండు స్థానాలతో బరిలోకి దిగిన ఈ టీమ్‌ల పేలవ ఆటతో మూడొంతుల మ్యాచ్ చప్పగా సాగింది. అయితే జేసన్ హోల్డర్ బ్యాటింగ్ సీన్‌ను ఒక్కసారిగా ఆసక్తికరంగా మార్చేసింది. రైజర్స్ విజయం కోసం 42 బంతుల్లో 66 పరుగులు చేయాల్సిన స్థితిలో బరిలోకి దిగిన హోల్డర్ సిక్సర్లతో విరుచుకు పడ్డాడు. తనొక్కడే 29 బంతుల్లో 47 పరుగులు చేసి విజయానికి చేరువగా తెచి్చనా గెలుపు గీత దాటించలేకపోయాడు. ఉత్కంఠ క్షణాలను దాటి చివరకు పంజాబ్ ఊపిరి పీల్చుకోగా... హైదరాబాద్ జట్టు అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి ని్రష్కమించింది. షార్జా: గత మ్యాచ్‌లో అనూహ్యంగా ఓడిన పంజాబ్ కింగ్స్ ఈసారి 125 పరుగుల స్కోరును కూడా కాపాడుకోగలిగింది. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి ఓవర్లో సన్ విజయానికి 17 పరుగులు అవసరం కాగా, 11 పరుగులే వచ్చాయి. ఆఖరి బంతికి 7 పరుగులు కావాల్సి ఉండగా... ఐపీఎల్లో అరంగేట్రం చేసిన పేసర్ ఎలిస్ సింగిల్ మాత్రమే ఇచ్చాడు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. మార్క్రమ్ (32 బంతుల్లో 27; 2 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా, హోల్డర్ (3/19) ప్రత్యరి్థని కట్టడి చేశాడు. అనంతరం సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 120 పరుగులే చేయగలిగింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జేసన్ హోల్డర్ (29 బంతుల్లో 47 నాటౌట్; 5 సిక్సర్లు) చెలరేగగా, వృద్ధిమాన్ సాహా (37 బంతుల్లో 31; 1 ఫోర్) రాణించాడు. రవి బిష్ణోయ్‌కు 3 వికెట్లు దక్కాయి. హోల్డర్ బ్యాటింగ్‌ను మినహాయిస్తే సన్ మొత్తం ఇన్నింగ్స్‌లో రెండంటే రెండే ఫోర్లు ఉన్నాయి! గేల్ విఫలం... పంజాబ్ ఇన్నింగ్స్‌లో ఏ దశలోనూ దూకుడు కనిపించలేదు. నెమ్మదిగా ఉన్న పిచ్‌పై షాట్లు ఆడటం కొంత ఇబ్బందిగా ఉండటంతో పాటు హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో పరుగులు రావడం కష్టంగా మారిపోయింది. టాప్–4లో ఒక్కరి స్ట్రయిక్‌రేట్ కూడా వందకంటే ఎక్కువగా లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఓపెనర్లు రాహుల్ (21 బంతుల్లో 21; 3 ఫోర్లు), మయాంక్ (5) తొలి నాలుగు ఓవర్లలో 26 పరుగులు జోడించగలిగారు. అయితే ఐదో ఓవర్ వేసిన హోల్డర్ మ్యాచ్‌ను సన్‌రైజర్స్ వైపు తిప్పాడు. తొలి బంతికి, ఐదో బంతికి అతను ఓపెనర్లను అవుట్ చేశాడు. ఆ తర్వాత ఒక్క బ్యాట్స్‌మన్ కూడా కింగ్స్‌కు కావాల్సిన పరుగులు అందించలేకపోయాడు. గత మ్యాచ్‌లో అవకాశం దక్కని క్రిస్ గేల్ (17 బంతుల్లో 14; 1 ఫోర్) ఈసారి తుది జట్టులోకి వచి్చనా అతని బ్యాటింగ్‌లో జోరు కనిపించలేదు. రషీద్ తొలి ఓవర్లోనే అతను వికెట్ల ముందు దొరికిపోగా, రివ్యూ చేసినా ఫలితం లేకపోయింది. 3 పరుగుల వద్ద వార్నర్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన మార్క్రమ్ ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలిచినా ఆ ‘లైఫ్’ వల్ల పెద్దగా ప్రయోజనం కలగలేదు. కీలకమైన నాలుగు ఓవర్లలో (16–19) పంజాబ్ కనీసం ఒక్క ఫోర్ కూడా కొట్టలేకపోయింది! చివరకు భువనేశ్వర్ వేసిన ఆఖరి ఓవర్లో ఒక ఫోర్, ఒక సిక్స్‌తో మొత్తం 14 పరుగులు రావడంతో స్కోరు 120 దాటింది. టపటపా... సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్ కూడా పేలవ ప్రదర్శనలో పంజాబ్‌తో పోటీ పడ్డారు. ఆ జట్టు ఛేదన కూడా పేలవంగా ప్రారంభమైంది. షమీ దెబ్బకు జట్టు 10 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్లోనే వార్నర్ (2) అవుట్ కాగా, మూడో ఓవర్లో విలియమ్సన్ (1) వికెట్లపైకి ఆడుకున్నాడు. ఆరు ఓవర్లు ముగిసేసరికి జట్టు ఒకే ఒక ఫోర్‌తో 20 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలో సన్‌రైజర్స్ జట్టుకు ‘పవర్‌ప్లే’లో ఇదే అత్యల్ప స్కోరు కావడం విశేషం! మనీశ్ పాండే (13), కేదార్ జాదవ్ (12) మళ్లీ విఫలమై జట్టును కష్టాల్లో పడేశారు. ఒక ఎండ్‌లో నిలబడి సాహా పట్టుదలగా ఆడినా, చివర్లో హోల్డర్ ప్రదర్శనతో ఆశలు రేగినా...ఇవి హైదరాబాద్‌కు విజయాన్ని అందించలేకపోయాయి. స్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) (సబ్) సుచిత్ (బి) హోల్డర్ 21; మయాంక్ (సి) విలియమ్సన్ (బి) హోల్డర్ 5; గేల్ (ఎల్బీ) (బి) రషీద్ 14; మార్క్రమ్ (సి) పాండే (బి) సమద్ 27; పూరన్ (సి అండ్ బి) సందీప్ 8; హుడా (సి) (సబ్) సుచిత్ (బి) హోల్డర్ 13; హర్‌ప్రీత్ (నాటౌట్) 18; ఎలిస్ (సి) పాండే (బి) భువనేశ్వర్ 12; షమీ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 125. వికెట్ల పతనం: 1–26, 2–27, 3–57, 4–66, 5–88, 6–96, 7–118. బౌలింగ్: సందీప్ 4–0–20–1, భువనేశ్వర్ 4–0–34–1, హోల్డర్ 4–0–19–3, ఖలీల్ 3–0–22–0, రషీద్ ఖాన్ 4–0–17–1, సమద్ 1–0–9–1. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) రాహుల్ (బి) షమీ 2; సాహా (రనౌట్) 31; విలియమ్సన్ (బి) షమీ 1; పాండే (బి) బిష్ణోయ్ 13; జాదవ్ (బి) బిష్ణోయ్ 12; సమద్ (సి) గేల్ (బి) బిష్ణోయ్ 1; హోల్డర్ (నాటౌట్) 47; రషీద్ ఖాన్ (సి అండ్ బి) అర్‡్షదీప్ 3; భువనేశ్వర్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 120. వికెట్ల పతనం: 1–2, 2–10, 3–32, 4–56, 5–60, 6–92, 7–105. బౌలింగ్: షమీ 4–1–14–2, అర్‡్షదీప్ 4–0–22–1, ఎలిస్ 4–0–32–0, హర్‌ప్రీత్ 4–0–25–0, రవి బిష్ణోయ్ 4–0–24–3. -
వార్నర్ ఔట్ నన్ను ఏ మాత్రం ఆశ్చర్యపరచలేదు: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్
Kevin Pietersen Comments On David Warner: ఐపీఎల్ ఫేజ్2లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘోర ఓటమి మూట కట్టుకుంది. అయితే ముఖ్యంగా గంపెడు ఆశలు పెట్టెకున్న డేవిడ్ వార్నర్ ఆభిమానులను నిరాశపరిచాడు. నోర్జే వేసిన తొలి ఓవర్ మూడో బంతిని అంచనా వేయలేకపోయిన వార్నర్... అక్షర్ పటేల్‌కు సింపుల్ క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో డెవిడ్ వార్నర్ ఔటైన తీరుపై ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ స్పందించాడు. వార్నర్ ఔటైన తీరు తనను ఏ మాత్రం ఆశ్చర్యపరచలేదని అతడు తెలిపాడు. ఢిల్లీ క్యాపిటల్స్ పేస్ బౌలింగ్ ద్వయం అన్రిచ్ నార్ట్జే, కగిసో రబాడాకు డేవిడ్ వార్నర్‌కు ఎలా బౌలింగ్ చేయాలో తెలుసు అని పీటర్సన్ పేర్కొన్నాడు. రబాడా ఇప్పటికే చాలా మ్యాచ్‌ల్లో వార్నర్ వికెట్‌ని పడగొట్టాడని, వార్నర్‌కు ఢిల్లీ జట్టుతో మ్యాచ్ చాలా కష్టమైనదని కెవిన్ పీటర్సన్ చెప్పాడు. "డేవిడ్ వార్నర్‌కు బౌలింగ్ ఎలా చేయాలో నార్ట్జే , రబాడాలకు తెలుసు. రబాడా అతన్ని ఇప్పటికే 4-5 సార్లు ఔట్ చేశాడని నేను అనుకుంటున్నాను. కాబట్టి వార్నర్‌కు ఎలా బౌలింగ్ చేయాలో వారికి తెలుసు . నిజానికి నాకు వార్నర్ ఔటైన తీరు ఏమాత్రం ఆశ్చర్యం లేదు. వార్నర్‌కు ఇది నిజంగా కఠినమైన సవాల్ అని నేను భావించాను”అని పీటర్సన్ స్టార్ స్పోర్ట్స్ ఇంటర్వ్యలో భాగంగా వెల్లడించాడు. డేవిడ్ వార్నర్ కూడా అన్రిచ్ నార్ట్జే , కగిసో రబాడా వంటి బౌలర్లను ఎలా ఎదర్కొవాలని మ్యాచ్ ముందు రోజు ఆలోచించి ఉంటాడని పీటర్సన్ అభిప్రాయపడ్డాడు. డేవిడ్ వార్నర్‌ని పెవిలియన్‌కు పంపడంలో నార్ట్జే విజయవంతం అయ్యాడని అతడు పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 8 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. చదవండి: IPL 2021 2nd Phase SRH Vs DC: ఎస్ఆర్హెచ్పై 8 వికెట్ల తేడాతో ఢిల్లీ ఘనవిజయం -
ఐపీఎల్ 2021: బెయిర్ స్టో స్థానంలో విండీస్ స్టార్ ఆటగాడు
దుబాయ్: ఐపీఎల్ 2021 సీజన్ రెండో అంచె పోటీలకు ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు దూరమవుతున్న సంగతి తెలిసిందే. జానీ బెయిర్ స్టో, క్రిస్ వోక్స్, డేవిడ్ మలాన్‌లు ఐపీఎల్ 14వ సీజన్‌కు దూరంగా ఉండనున్నారు. రానున్న టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇంగ్లీష్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో బెయిర్ స్టో స్థానంలో వెస్టిండీస్ వికెట్ కీపర్ షెర్పెన్ రూథర్‌ఫోర్డ్‌ను తీసుకున్నట్లు సన్‌రైజర్స్ హైదరాబాద్ ట్విటర్ ద్వారా తెలిపింది. ఈ మేరకు ప్రస్తుతం సీపీఎల్‌లో ఆడుతున్న రూథర్‌ఫోర్ట్ త్వరలోనే దుబాయ్‌కు చేరుకోనున్నాడు. జానీ బెయిర్ స్టో స్థానంలో కరీబియన్ రైసర్ వస్తున్నాడు. ఆల్ ది బెస్ట్ టూ షెర్పెన్ రూథర్‌ఫోర్ట్ అంటూ కామెంట్ చేసింది. చదవండి: Viral Video: రనౌట్ అవకాశం; ఊహించని ట్విస్ట్.. ఫీల్డర్ల పరుగులు ఇక 2018లో వెస్టిండీస్ తరపున అరంగేట్రం చేసిన రూథర్‌ఫోర్ట్ 6 టీ20 మ్యాచ్‌లాడి 43 పరగులు చేయడంతో పాటు ఒక వికెట్ తీశాడు. ఓవరాల్‌గా ఇప్పటివరకు 43 టీ20 మ్యాచ్‌లాడి 624 పరుగులు చేశాడు. కాగా ఇంతకముందు రూథర్‌ఫోర్డ్ 2018లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇక ఈ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ నిరాశజనక ప్రదర్శన కనబరిచింది. వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. కరోనాతో లీగ్ వాయిదా పడడానికి ముందు డేవిడ్ వార్నర్ స్థానంలో కేన్ విలియమ్సన్కు బాధ్యతలు అప్పగించడంపై విమర్శలు కూడా వెల్లువెత్తాయి. చదవండి: IPL 2021: కళ తప్పనున్న మలిదశ ఐపీఎల్.. ముగ్గురు స్టార్ ఆటగాళ్లు దూరం -
ఇంటివాడైన సన్‌రైజర్స్ బౌలర్ సందీప్ శర్మ
Sandeep Sharma Marriage.. టీమిండియా ఆటగాడు.. సన్‌రైజర్స్ హైదరబాద్ బౌలర్ సందీప్ శర్మ ఒక ఇంటివాడయ్యాడు. తన చిన్ననాటి స్నేహితురాలు తాషా సాత్విక్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ సందర్భంగా సన్‌రైజర్స్ యాజమాన్యం సందీప్‌కు ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపింది. సందీప్.. అతని భార్య తాషా సాత్విక్ పెళ్లి ఫోటోను షేర్ చేస్తూ.. ''ఎస్ఆర్హెచ్ ఫ్యామిలీకి పెళ్లి కళ వచ్చింది. కంగ్రాట్స్ మిస్టర్ అండ్ మిసెస్ సందీప్ శర్మ.. మీ దాంపత్య జీవితం సంతోషంగా సాగాలని కోరుకుంటున్నాం'' అంటూ ట్వీట్ చేసింది. కాగా తాషా సాత్విక్ వృత్తిరిత్యా ఫ్యాషన్,నగల డిజైనర్‌గా పనిచేస్తున్నారు. 2018లోనే వీరిద్దరికి ఎంగేజ్మెంట్ అయినప్పటికీ.. కరోనా కారణంగా వీరి పెళ్లిని వాయిదా వేసుకున్నారు. ఈ సందర్భంగా సందీప్ శర్మకు అభిమానులు ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఇక సందీప్ శర్మ 2013 నుంచి ఐపీఎల్లో ఆడుతున్నాడు. ఇప్పటివరకు 95 ఐపీఎల్ మ్యాచ్‌లాడిన సందీప్ శర్మ 110 వికెట్లు తీశాడు. 2013 నుంచి 2017 వరకు కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌కు ఆడిన సందీప్ ఆ తర్వాత 2018 నుంచి సన్‌రైజర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చాడు. ఇక జూలై 17, 2015లో జింబాబ్వేతో జరిగిన T20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. చదవండి: రనౌట్ కోసం థర్డ్ అంపైర్‌కు అప్పీల్; స్క్రీన్‌పై మ్యూజిక్ ఆల్బమ్ (ఫోటో గేలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) A special addition to the #SRHFamily.😍 Congratulations to Mr and Mrs Sharma 🙌🏽 🥂 to a lifelong partnership!#OrangeOrNothing #OrangeArmy pic.twitter.com/gQcLsX9nIL — SunRisers Hyderabad (@SunRisers) August 20, 2021 -
రషీద్ ఖాన్, నబీ ఇద్దరూ అందుబాటులో ఉంటారు: సన్‌రైజర్స్
హైదరాబాద్: ఆఫ్ఘనిస్తాన్‌లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశ క్రికెటర్లు ఐపీఎల్ సెకెండ్ లెగ్‌కు అందుబాటులో ఉంటారో లేదో అన్న సందిగ్ధత నెలకొంది. అయితే యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభంకానున్న లీగ్‌లో తమ జట్టుకు ఆడాల్సిన రషీద్ ఖాన్, మహ్మద్ నబీలు అందుబాటులో ఉంటారని సన్‌రైజర్స్ హైదరాబాద్ సోమవారం ప్రకటించింది. ఓ ప్రముఖ న్యూస్ ఏజన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎస్ఆర్హెచ్ ఫ్రాంఛైజీ సీఈవో షణ్ముగం మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌లో ఏం జరుగుతుందన్న దానిపై మేము మాట్లాడదలుచుకోలేదు. అయితే, తమ జట్టుకు ప్రాతినిధ్యం వహించే ఆ దేశ క్రికెటర్లు మాత్రం లీగ్‌కు అందుబాటులో ఉంటారని చెప్పగలనని పేర్కొన్నారు. ఈ నెల 31న ఎస్ఆర్హెచ్ జట్టు యూఏఈకి బయలుదేరబోతుందని షణ్ముగం వెల్లడించారు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం రషీద్ ఖాన్, నబీ ఇద్దరూ హండ్రెడ్ టోర్నీ కోసం యూకేలో ఉన్నారు. అయితే, ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తన కుటుంబాన్ని అక్కడి నుంచి ఎలా బయటకు తీసుకురావాలన్న దానిపై రషీద్ ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ పేర్కొన్నాడు. కాబూల్ ఎయిర్‌స్పేస్ మూసేయడంతో అక్కడి నుంచి వివిధ దేశాలకు విమాన రాకపోకలు నిలిచిపోయాయి. ఇదిలా ఉంటే, కొద్ది రోజుల కిందే తమ దేశాన్ని అనిశ్చితి నుంచి బయటపడేయాలని రషీద్ ఖాన్ ప్రపంచ దేశాల నేతలకు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. చదవండి: అవును.. లార్డ్స్ ఆండర్సన్ అడ్డానే.. కోహ్లికి కౌంటరిచ్చిన బ్రాడ్ -
IPL 2021: సెకండ్ ఫేజ్ ఆడడంపై డేవిడ్ వార్నర్ క్లారిటీ
సిడ్నీ: సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు ఆసీస్ విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ శుభవార్త అందించాడు. సెప్టెంబర్19 నుంచి మొదలుకానున్న ఐపీఎల్ 14వ సీజన్ రెండో అంచె పోటీలకు తాను అందుబాటులోకి వస్తున్నట్లు ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించాడు. యూఏఈ వేదికగా జరగనున్న ఐపీఎల్ సెకండ్ ఫేజ్‌లో తాను ఆడబోతున్నట్లు స్పష్టం చేశాడు. '' ఐ విల్ బి బ్యాక్.. అక్కడే మీ అందరిని కలుస్తా'' అంటూ కామెంట్ జత చేశాడు. కాగా ఐపీఎల్ 2021 సీజన్ వాయిదా పడడానికి ముందు ఎస్ఆర్హెచ్ యాజమాన్యం వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించి కేన్ విలియమ్స్‌న్‌కు పగ్గాలు అప్పగించింది. కెప్టెన్‌గా విలియమ్సన్ ఎంపికపై నెటిజన్లు ఎస్ఆర్హెచ్ యాజమాన్యంను తప్పుబడుతూ ట్విటర్ వేదికగా విమర్శలు సంధించారు. దీనికి తోడూ కెప్టెన్ పదవి నుంచి తొలగించడమేగాక తర్వాతి మ్యాచ్‌కు వార్నర్‌ను పక్కనపెట్టారు. ఆ మ్యాచ్‌కు వార్నర్ ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లకు డ్రింక్స్ అందించడంపై పెద్ద వివాదమే చెలరేగింది. ఈ నేపథ్యంలో వార్నర్ ఎస్ఆర్హెచ్కు ఆడడం ఇదే చివరిసారని వార్తలు వచ్చాయి. కరోనాతో వాయిదా పడిన ఐపీఎల్ రెండో అంచె పోటీలకు కూడా వార్నర్ దూరంగా ఉంటాడని అంతా భావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ వార్నర్ తాను ఐపీఎల్ 14వ సీజన్ రెండో అంచె పోటీలు ఆడడంపై క్లారిటీ ఇచ్చేశాడు. ఏది ఏమైనా వార్నర్ ఐపీఎల్ ఆడడంపై క్లారిటీ ఇవ్వడంతో అభిమానుల్లో జోష్ పెరిగింది. కరోనాతో వాయిదా పడిన మిగతా లీగ్ మ్యాచ్‌లు సెప్టెంబర్ 19 నుంచి ఆరంభం కానున్నాయి. అక్టోబర్ 15న ఐపీఎల్ 14వ సీజన్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. View this post on Instagram A post shared by David Warner (@davidwarner31) ఇక 2012లో డెక్కన్ చార్జర్స్ నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్‌గా పేరు మార్చుకొని బరిలోకి దిగిన ఆ జట్టుకు డారెన్ సామి, శిఖర్ ధావన్, కామెరున్ వైట్ లాంటి ఎంతో మంది ఆటగాళ్లు కెప్టెన్లుగా పనిచేశారు. అయితే 2015లో డేవిడ్ వార్నర్ ఆ జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక చేసిన తర్వాత ఆ జట్టు తలరాత మారిపోయింది. 2016లో వార్నర్ కెప్టెన్సీలోనే ఐపీఎల్ టైటిల్‌ను కొల్లగొట్టింది. ఆ సీజన్లో వార్నర్ బ్యాటింగ్‌లో అసాధారణ ఆటతీరుతో అదరగొట్టి ఒంటిచేత్తో జట్టుకు టైటిల్‌ను అందించాడు. అప్పటినుంచి 2018 సీజన్ మినహా మిగతా అన్ని సీజన్లకు కెప్టెన్‌గా పనిచేసిన వార్నర్ ప్రతీసారి ఫ్లేఆఫ్‌కు తీసుకురావడం విశేషం. ఇక బాల్ టాంపరింగ్ వివాదంతో ఏడాది నిషేదం ఎదుర్కొన్న వార్నర్ 2018 ఐపీఎల్ సీజన్‌కు దూరం కావడంతో అతని స్థానంలో విలియమ్సన్ కెప్టెన్‌గా పనిచేశాడు. అయితే ఆ ఏడాది విలియమ్సన్ అద్బుత కెప్టెన్సీకి తోడూ ఆటగాళ్లు కూడా విశేషంగా రాణించడంతో ఫైనల్‌కు వచ్చింది. అయితే ఫైనల్లో సీఎస్కే చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. అయితే ఈ సీజన్ ఆరంభంలో విలియమ్సన్ నాలుగు మ్యాచ్‌లకు దూరంగా ఉండడం.. వార్నర్ కెప్టెన్సీలో విఫలమవడంతో పాటు బ్యాటింగ్‌లోనూ అంతంత ప్రదర్శన నమోదు చేయడంతో ఎస్ఆర్హెచ్ కెప్టెన్సీ మార్పును పరిశీలించి ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ వరుస ఓటములతో నిరాశ పరిచింది. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క విజయం నమోదు చేసి.. ఐదు పరాజయాలతో పాయింట్ల పట్టికలో ఆఖరిస్థానంలో నిలిచింది. -
వార్నర్ భాయ్... మా గుండెల్ని పిండేశావ్ !
హైదరాబాద్: అతను బ్యాట్ పట్టి మైదానంలో అడుగుపెడితే బౌండరీలు చిన్నబోతాయి. కెమెరా ముందుకు వస్తే ఇన్స్టాగ్రామ్ లైకుల లెక్కలు మిలియన్లను దాటేస్తాయి. ఆసీస్ క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్‌గా, సన్‌రైజర్స్ కెప్టెన్‌గా పరుగుల వరద పారించాడు. బహుబలి ప్రభాస్‌గా కత్తి పట్టినా పోకిరి మహేశ్‌లా కర్చీఫ్ చేతికి చుట్టినా అంతా డేవిడ్ వార్నర్‌కే చెల్లింది. తెలుగు పోస్ట్ సన్‌రైజర్స్ కెప్టెన్‌గానే కాకుండా ఇన్స్టాగ్రామ్ వీడియోలతో తెలుగు వారికి ఎంతో దగ్గరయ్యాడు డేవిడ్ వార్నర్. తాజాగా తన రెండో ఇళ్లు ఇండియా అని, తనకు ఎంతో ఇష్టమైన నగరం హైదరాబాద్ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. మెసేజ్ అంతా ఇంగ్లీస్ ఆల్ఫాబెట్స్‌లో తెలుగులోనే రాశాడు. అందులో ప్రత్యేకించి భారతదేశం, హైదరాబాద్ పేర్లను మాత్రం అచ్చ తెలుగులో రాశాడు డేవిడ్ వార్నర్ గుండెల్ని పిండేశావ్ హైదరాబాద్ హార్ట్ బీట్ డేవిడ్ అంటూ ఓ అభిమాని సంతోశం వ్యక్తం చేయగా, మరొకరు గుండెల్ని పిండేశావన్నా అంటూ మురిసిపోయారు. చాలా మంది మాత్రం.... వార్నర్ అన్నా .. లవ్ యూ అంటూ కామెంట్లు పోస్ట్ చేశారు. మరికొందరు వార్నర్ భాయ్ బిర్యానీ గుర్తుకువచ్చిందా అంటూ డేవిడ్ భాయ్‌ని అడిగారు. View this post on Instagram A post shared by David Warner (@davidwarner31) చదవండి : అతని కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీలన్నీ ఎగబడతాయి.. -
IPL 2021 సీజన్ రద్దు: బీసీసీఐ
-
IPL 2021 నిరవధిక వాయిదా: బీసీసీఐ
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ సెకండ్‌వేవ్ విజృంభణ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఆటగాళ్లు వరుసగా కరోనా బారిన పడుతుండటంతో ఐపీఎల్-2021 సీజన్‌ను రద్దు చేసే యోచనలో ఉన్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మంగళవారం ప్రకటన విడుదల చేశారు. కాగా వేర్వేరు జట్లలో ఇప్పటికే 9 మంది ఆటగాళ్లకు కోవిడ్-19 సోకింది. బయో బబుల్‌లో ఉన్నప్పటికీ క్రికెటర్లు, ఇతర సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో తొలుత టోర్నీని నిరవధికంగా వాయిదా వేయాలని భావించిన బీసీసీఐ.. 31 మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ఈ సీజన్‌ను రద్దు చేస్తున్నట్లు తాజాగా వెల్లడించింది. ఇక ఈ సీజన్లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆరింటిలో గెలుపొంది పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా, 7 మ్యాచ్‌లు ఆడి ఐదింటిలో విజయం సాధించిన సీఎస్కే రెండో స్థానంలో ఉంది. వాయిదా వేస్తాం ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్-2021)కు కరోనా సెగ తగిలింది. తాజాగా మరో ఇద్దరు క్రికెటర్లు కోవిడ్ బారిన పడటంతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. క్యాష్ రిచ్ లీగ్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ధ్రువీకరించారు. కాగా, ఇప్పటికే కోల్‌కతా ఆటగాళ్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్లకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. దీంతో సోమవారం జరగాల్సిన కేకేఆర్- ఆర్సీబీ మ్యాచ్‌ను వాయిదా వేశారు. ఈ క్రమంలో తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు వృద్ధిమాన్ సాహా, ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అమిత్ మిశ్రాకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. దీంతో బయో బబుల్‌లో ఉన్నప్పటికీ ఆటగాళ్లు వరుసగా కరోనా బారిన పడుతుండటంతో టోర్నీ నిర్వహణపై సందిగ్దత నెలకొనగా.. నిరవధికంగా వాయిదా వేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. 8 ఫ్రాంఛైజీలు ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నాయి. కాగా ఐపీఎల్ వాయిదా పడటంతో క్రికెట్ ప్రేమికులు నిరాశకు గురైనప్పటికీ ఆటగాళ్ల క్షేమం దృష్ట్యా సరైన నిర్ణయమే తీసుకున్నారని పలువురు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. బాంబే హైకోర్టులో పిటిషన్ కోవిడ్ తీవ్రత దృష్ట్యా ఐపీఎల్‌ను రద్దు చేయాలని పిటిషన్ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఐపీఎల్‌కు కేటాయించిన వనరులను కోవిడ్ రోగులకు ఉపయోగించవచ్చని పిటిషనర్ కోర్టుకు విన్నవించారు. రద్దు చేస్తేనే మంచిది.. భారత్‌లో రోజూవారీ కేసులు మూడున్నర లక్షలకు పైగా నమోదవుతున్న నేపథ్యంలో ఐపీఎల్‌ను రద్దు చేయాలంటూ మెజార్టీ ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఐపీఎల్ నిర్వహణ రద్దు అంశంపై sakshi.com నిర్వహించిన పోల్‌లోనూ ఈ విషయం నిరూపితమైంది. ఐపీఎల్‌ను ఆపేస్తేనే మంచిదని చాలా మంది అభిప్రాయపడ్డారు. చదవండి: వైరల్: డ్రింక్స్ మోసుకెళ్లినా.. వి లవ్ యూ వార్నర్ అన్నా! IPL suspended for this season: Vice-President BCCI Rajeev Shukla to ANI#COVID19 pic.twitter.com/K6VBK0W0WA — ANI (@ANI) May 4, 2021 -
వైరల్: అందుకే వార్నర్ అన్నా.. నువ్వంటే మాకిష్టం!
న్యూఢిల్లీ: డేవిడ్ వార్నర్... సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఐపీఎల్ కప్ సాధించి పెట్టిన కెప్టెన్. 2016లో అతడి సారథ్యంలోని జట్టు ఆర్సీబీపై గెలుపొంది తొలి టైటిల్ నెగ్గింది. కెప్టెన్‌గానే కాదు, బ్యాట్స్‌మెన్‌గా కూడా వార్నర్‌కు ఐపీఎల్లో మంచి రికార్డు ఉంది. ఇక కేవలం ఆటకే పరిమితం కాకుండా, లాక్డౌన్ కాలంలో టాలీవుడ్ పాటలకు స్టెప్పులేస్తూ తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు ఈ ఆసీస్ క్రికెటర్. ఇలా ఆటపాటలతో హైదరాబాదీల మనసు దోచుకుని, వార్నర్ అన్నగా అభిమానుల గుండెల్లో గూడుకట్టుకున్న డేవిడ్‌కు సన్‌రైజర్స్ గట్టి షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఐపీఎల్-2021 సీజన్లో హైదరాబాద్ వరుస వైఫల్యాల నేపథ్యంలో తనను కెప్టెన్సీ నుంచి తొలగించడమే గాకుండా, ఆదివారం నాటి మ్యాచ్‌లో తుదిజట్టులో కూడా స్థానం కల్పించలేదు. దీంతో, 12వ ఆటగాడిగా డ్రింక్స్ మోయడానికే పరిమితమయ్యాడు వార్నర్. అయినప్పటికీ, అతడిలో ఏ మాత్రం అసహనం, కోపం కనిపించలేదు. తన అవసరం ఉందనిపించినప్పుడల్లా కెప్టెన్ విలియమ్సన్కు విలువైన సలహాలు, సూచనలు ఇచ్చాడు. బెంచ్ మీద కూర్చోవాల్సి వచ్చినా ‘తన’ జట్టుకు పూర్తి మద్దతుగా నిలిచాడు. మ్యాచ్ ఆసాంతం ఆటగాళ్లను ఉత్సాహపరిచాడు. ఈ క్రమంలో వార్నర్ సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. డగౌట్లో ఉన్న వార్నర్.. సహచరులకు డ్రింక్స్ మోసుకువెళ్లే విషయంలో ఇతరులతో పోటీ పడుతూ పరుగులు పెట్టాడు. తానే ముందు డ్రింక్స్ తీసుకువెళ్లాలన్నట్లుగా సరదా ఫైట్‌కి దిగాడు. ఇక వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అంటే ఇదే. అందుకే వార్నర్ భాయ్ నువ్వంటే మాకు అంత ఇష్టం. నువ్వు తుదిజట్టులో లేకపోతే మ్యాచ్ చూడాలనే అనిపించదు. లవ్ యూ అన్నా. నువ్వు ఎక్కడ ఉన్నా రాజువే. మరోసారి మా మనసులు గెల్చుకున్నావ్’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా రాజస్తాన్ రాయల్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 55 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇంతవరకు ఒక్క మ్యాచ్‌లోనూ నెగ్గలేక.. ఈ సీజన్లో ఆరో ఓటమిని నమోదు చేసింది. చదవండి: ‘వార్నర్‌ను సన్‌రైజర్స్ జెర్సీలో చూడటం ఇదే ఆఖరు’ David warner having a race for drinks 😂😂🥺#IPL2020 #SRHvRR #srh #DavidWarner pic.twitter.com/jEQPs0kbpD — Trollmama_ (@Trollmama3) May 2, 2021 -
‘వార్నర్‌ను సన్‌రైజర్స్ జెర్సీలో చూడటం ఇదే ఆఖరు’
న్యూఢిల్లీ: ‘‘యాజమాన్య నిర్ణయాన్ని డేవిడ్ ప్రశ్నించాడో లేదో నాకు తెలియదు. అయితే, మనీష్ పాండే విషయంలో మాత్రం తాను ఎలాంటి డెసిషన్ తీసుకోలేదని చెప్పాడు. కొన్నిసార్లు మేనేజ్మెంట్కు ఇలాంటి మాటలు రుచించకపోవచ్చు. ఒక కెప్టెన్‌గా కొన్ని తప్పనిసరి బాధ్యతలు ఉంటాయి. ఎవరు తుదిజట్టులో ఉంటారు, ఎవరిని పక్కన పెట్టాలి అన్న అంశాలపై స్పష్టత ఉండాలి. అయితే, ఒక్కోసారి పరిస్థితులు మన ఆధీనంలో ఉండవు. మొత్తానికి తెరవెనుక ఏదో జరుగుతోంది’’ అంటూ సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ బౌలర్ డెయిల్ స్టెయిన్ సందేహం వ్యక్తం చేశాడు. ఎస్ఆర్హెచ్ యాజమాన్యం వ్యవహారశైలి చూస్తుంటే డేవిడ్ వార్నర్ ఇక ఆ జట్టుకు ఆడే పరిస్థితి కనబడటం లేదని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్లో మంచి రికార్డు ఉన్న డేవిడ్ వార్నర్‌ను తొలుత కెప్టెన్సీ నుంచి తొలగించిన సన్‌రైజర్స్, ఆదివారం నాటి మ్యాచ్‌లో అతడికి తుది జట్టులో కూడా చోటు ఇవ్వలేదు. దీంతో, వార్నర్ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. జట్టుకు తొలి టైటిల్ అందించిన కెప్టెన్‌ను ఇంతలా అవమానించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. క్రీడా వర్గాల్లోనూ ఈ విషయంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో డెయిల్ స్టెయిన్ మాట్లాడుతూ ఈ మేరకు తన అభిప్రాయాలు పంచుకున్నాడు. 2013-15 సీజన్లలో హైదారాబాద్‌కు ప్రాతినిథ్యం వహించిన అతడు.. ‘‘నాకు తెలిసి డేవిడ్ వార్నర్‌ను ఇకపై సన్‌రైజర్స్ జెర్సీలో చూడలేమేమో’’ అని పేర్కొన్నాడు. కాగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. 55 పరుగుల తేడాతో ఓటమి చెంది ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో వార్నర్‌ను కాదని నబీని జట్టులోకి తీసుకున్నందుకు తగిన మూల్యం చెల్లించుకున్నారంటూ మరోసారి ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. చదవండి: వార్నర్ హ్యాపీగా లేడు.. ఉండడు కూడా -
బెయిర్‌స్టో అప్పుడు టాయిలెట్లో ఉంటే తప్ప..
చెన్నై: ఐపీఎల్-2021లో భాగంగా ఆదివారం నాటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అనుసరించిన వ్యూహాలపై క్రీడా విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. ఆఖరి దాకా పోరాడి కూడా స్వీయ తప్పిదాల వల్ల మ్యాచ్‌ను చేజార్చుకుందంటూ విమర్శిస్తున్నారు. చెన్నై వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్- సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈ సీజన్లో తొలి సూపర్ ఓవర్ నమోదైన సంగతి తెలిసిందే. తొలుత పంత్ సేన 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయగా, కేన్ విలియమ్సన్, జానీ బెయిర్‌స్టో రాణించడంతో సన్‌రైజర్స్ సైతం 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయ్యింది. దీంతో సూపర్ నిర్వహించగా, హైదరాబాద్ 7 పరుగులు చేయగా... ఢిల్లీ 8 పరుగులు చేసి గెలుపొందింది. ఈ నేపథ్యంలో సూపర్ ఓవర్లో ఓపెనర్ జానీ బెయిర్ స్టోను ఆడించకపోవడంపై టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఈ విషయంపై ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘‘ఈ మ్యాచ్‌లో మెయిన్ ఇన్నింగ్స్‌లో బెయిర్ స్టో 18 బంతుల్లో 38 పరుగులు చేశాడు. హిట్టింగ్తో ఆకట్టుకున్నాడు. సూపర్ ఓవర్ జరుగుతున్న సమయంలో, ఒకవేళ బెయిర్ స్టో గనుక టాయిలెట్లో ఉండి ఉంటే తప్ప, అతడిని ఎందుకు ఆడించలేదో అర్థం కావడం లేదు. హైదరాబాద్ పోరాట పటిమ కనబరిచింది. కానీ, వింతైన, అనూహ్య నిర్ణయాల కారణంగా వారిని వారు నిందించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది’’ అని వీరూ భాయ్ వార్నర్ కెప్టెన్సీపై ఘాటుగా స్పందించాడు. అదే విధంగా, ఇంగ్లండ్మాజీ ఓపెనర్ నిక్ కాంప్టన్ సైతం ఎస్ఆర్హెచ్ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. ప్రపంచంలోని ప్రస్తుత బెస్ట్ టాపార్డర్ బ్యాట్స్మెన్లలో ఒకడైన బెయిర్‌స్టో సూపర్ ఓవర్లో ఎందుకు బ్యాటింగ్ చేయలేదు? అని ప్రశ్నించాడు. ఈ నేపథ్యంలో నెటిజన్లు సైతం సెహ్వాగ్ అభిప్రాయాన్ని సమర్థిస్తూ కామెంట్లు చేస్తున్నారు. అప్పటికే అలసిపోయిన విలియమ్సన్ బదులు బెయిర్‌స్టోను పంపించి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని అభిప్రాయపడుతున్నారు. Unless Bairstow was in toilet, can't get why would he not be your first choice in a #SuperOver when he scored 38 of 18 in the main innings and looked the cleanest hitter. Baffling, Hyderabad fought well but have only themselves to blame for strange decisions. #SRHvsDC — Virender Sehwag (@virendersehwag) April 25, 2021 చదవండి: SRH vs DC: ‘సూపర్’లో రైజర్స్ విఫలం -
ముత్తయ్య మురళీధరన్‌కు ఛాతీ నొప్పి..
చెన్నై: శ్రీలంక క్రికెట్ దిగ్గజం, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీధరన్‌కు ఆదివారం యాంజియోప్లాస్టీ నిర్వహించారు. వైద్యులు అతనికి ఒక స్టెంట్‌ను అమర్చారు. ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం చెన్నైలో ఉన్న మురళీధరన్‌కు ఛాతీలో నొప్పి రావడంతో స్థానిక అపోలో ఆసుపత్రిలో చేరాడు. శనివారమే 49 ఏళ్లు పూర్తి చేసుకున్న మురళీధరన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక మళ్లీ సన్‌రైజర్స్ జట్టుతో చేరతాడు. చదవండి: అపురూపమైన కానుకతో స్టోక్స్‌కు వీడ్కోలు.. సిరాజ్ మొత్తం మారిపోయాడు: కోహ్లి -
ముంబై ఇండియన్స్ కాకపోతే సన్‌రైజర్స్‌కే ఆ ఛాన్స్..
లండన్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 14వ ఎడిషన్ మరో రెండు రోజుల్లో ప్రారంభంకానున్న నేపథ్యంలో టైటిల్ విజేత ఎవరనే అంశంపై మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు తమతమ అంచనాలను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ కూడా ట్విటర్ వేదికగా తన అంచనాలను పంచుకున్నాడు. సీజన్ ప్రారంభానికి ముందే టైటిల్ గెలిచే జట్టేదో చెప్పేశాడు. వాన్ అంచనాల ప్రకారం.. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్సే ఈసారి కూడా టైటిల్ గెలిచి సిక్సర్ కొడుతుందని జోస్యం చెప్పాడు. ఏదో అద్భుతం జరిగితే తప్పా ఆ జట్టు వట్టి చేతులతో వెళ్లదన్నాడు. ముంబై కానీ పక్షంలో టైటిల్ గెలిచే అవకాశం సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మాత్రమే ఉందన్నాడు. Early #IPL2021 prediction ... @mipaltan will win it ... if by some bizarre loss of form then @SunRisers will win it ... #OnOn #India — Michael Vaughan (@MichaelVaughan) April 7, 2021 ఐపీఎల్ విజేతపై అంచనాలను ఆయన ట్విటర్ వేదికగా పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట హల్చల్ చేస్తోంది. అయితే, వాన్ ప్రిడిక్షన్‌పై మిగతా ఐపీఎల్ జట్ల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్నీ నువ్వే డిసైడ్ చేస్తే, ఇన్ని జట్లు ఆడటం ఎందుకని చురకలంటిస్తున్నారు. ఏప్రిల్ 9న ప్రారంభంకానున్న ఈ క్యాష్ రిచ్ లీగ్ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. సన్‌రైజర్స్ తన తొలి మ్యాచ్‌ను ఏప్రిల్ 11న చెన్నై వేదికగా కోల్‌కతాతో ఆడనుంది. ముంబై, హైదరాబాద్ జట్లు ఫేస్ టు ఫేస్ మ్యాచ్‌లను ఏప్రిల్ 17న, మే 4న ఆడనున్నాయి. చదవండి: క్వారంటైన్ పూర్తయిన ఆనందంలో గేల్ ఏం చేశాడో తెలుసా.. -
IPL 2021: రైజింగ్‌కు రె‘ఢీ’..!
గత ఐదు సీజన్లలో ఒకసారి చాంపియన్, ఒకసారి రన్నరప్, మరో మూడుసార్లు కూడా ప్లే ఆఫ్స్‌కు అర్హత... ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నమెంట్లో అత్యంత నిలకడైన ప్రదర్శన కనబర్చిన జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్. స్టార్ ఆటగాళ్లతో భారీ హంగామాలాంటివి కనిపించకపోయినా ప్రతీ సీజన్లో ఆటపరంగా అందరి దృష్టినీ ఆకర్షించే టీమ్ ఇది. ముఖ్యంగా వార్నర్ బ్యాటింగ్ మెరుపులు... ఒంటిచేత్తో మ్యాచ్ దిశను మార్చే భువనేశ్వర్, రషీద్‌ల బౌలింగ్ ప్రదర్శనలు సగటు ‘సన్’ అభిమానికి గుర్తుకు వస్తూనే ఉంటాయి. ఎనిమిదేళ్ల లీగ్ ప్రస్థానంలో ఒకసారి చాంపియన్‌గా నిలిచిన హైదరాబాద్ రెండో టైటిల్ వేటలో పట్టుదలగా తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉంది. గత సీజన్లో మూడో స్థానం తర్వాత ఈసారి మరో మెట్టు ఎక్కేందుకు రైజర్స్ సిద్ధమైంది. అందుబాటులో ఉన్న అన్ని వనరులతో సత్తా చాటి వార్నర్ సేన మళ్లీ విజయ ఢంకా మోగిస్తుందో లేదో వేచి చూడాలి! కొత్తగా వచ్చినవారు... ఐపీఎల్ వేలంలో ఏమాత్రం చురుకుదనం చూపించని టీమ్ సన్‌రైజర్స్. కేవలం ముగ్గురిని మాత్రమే వేలంలో కొనుగోలు చేసింది. ఇప్పటికే కుదురుకున్న ‘కోర్ గ్రూప్’ ఉండటంతో కొత్త ఆటగాళ్లపై పెద్దగా ఆసక్తి పెట్టలేదు. భారత్‌కే చెందిన నాణ్యమైన పేస్ బౌలర్లు ఉండటంతో వేలానికి ముందు ఒక విదేశీ పేస్ బౌలర్, భారత దేశవాళీ ఆల్‌రౌండర్ అవసరం జట్టుకు కనిపించింది. అందుకే వేలంలో శివమ్ దూబే, కృష్ణప్ప గౌతమ్‌లను తీసుకునేందుకు పోటీ పడింది. అయితే చివరకు వీరిద్దరు దక్కలేదు. మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌గా కేదార్ జాదవ్ (రూ. 2 కోట్లు), అఫ్గానిస్తాన్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రహమాన్ (రూ.1.5 కోట్లు), జగదీశ సుచిత్ (రూ. 30 లక్షలు)లు మాత్రమే జట్టులోకి వచ్చారు. సరైన ఆల్‌రౌండర్ మాత్రం లభించలేదు. చివరకు రూ.6.95 కోట్లు జట్టు ఖాతాలో మిగిలాయి. టీమ్‌లో హైదరాబాద్‌కు చెందిన ఒక్క ఆటగాడికి కూడా అవకాశం దక్కకపోవడం గమనార్హం. తుది జట్టు అంచనా/ఫామ్ తుది ఫలితంతో సంబంధం లేకుండా గత కొన్నేళ్లుగా సన్‌రైజర్స్ జట్టుకు మూలస్థంభంలా నిలిచిన విదేశీ ఆటగాళ్లు వార్నర్, రషీద్. గత రెండు సీజన్లుగా వార్నర్‌తో కలిసి ఓపెనర్‌గా చెలరేగుతున్న బెయిర్‌స్టోకు కూడా చోటు ఖాయం. నాలుగో ఆటగాడిగా జట్టుకు కావాల్సినన్ని ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. మూడో స్థానంలో ఆడిన విలియమ్సన్ మొదటి ప్రాధాన్యత కావచ్చు కానీ... ఆల్‌రౌండర్ కావాలనుకుంటే గత లీగ్‌లో ‘సన్’ రాత మార్చిన జేసన్ హోల్డర్ జట్టులోకి వస్తాడు. వార్నర్ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోతే జేసన్ రాయ్‌కు కొన్ని మ్యాచ్‌లలో అవకాశం దక్కవచ్చు. గత సీజన్లో ఒకే ఒక మ్యాచ్ ఆడిన నబీకి కూడా కష్టమే కాగా... ముజీబ్‌కు కూడా చోటు అంత సులువు కాదు. సాహాను మరోసారి ఓపెనర్‌గా ప్రయత్నించే అవకాశం ఉంది. జట్టులో ఆరుగురు రెగ్యులర్ పేస్ బౌలర్లు ఉన్నారు కాబట్టి ఆ విషయంలో సమస్య లేదు. పైగా భువీ, నటరాజన్ అంతర్జాతీయ క్రికెట్లో చక్కటి ఫామ్‌లో ఉండటం సానుకూలాంశం. మిడిలార్డర్ వైఫల్యమే గత కొన్ని సీజన్లుగా రైజర్స్‌ను ఇబ్బంది పెడుతోంది. 2020 సీజన్లో కూడా అదే సమస్య కనిపించింది. గార్గ్ ప్రభావం చూపలేకపోగా, పాండే, విజయ్శంకర్లలో దూకుడు కనిపించలేదు. ఈ విషయంలో జాదవ్‌ను జట్టు నమ్ముకుంది. ఓవరాల్‌గా టాపార్డర్ బ్యాటింగ్, పేస్ బౌలింగ్‌పైనే మరోసారి హైదరాబాద్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. జట్టు వివరాలు భారత ఆటగాళ్లు: సాహా, ఖలీల్ అహ్మద్, అబ్దుల్ సమద్, సందీప్ శర్మ, శ్రీవత్స్ గోస్వామి, కేదార్ జాదవ్, అభిషేక్ శర్మ, బాసిల్ థంపి, భువనేశ్వర్, సుచిత్, విరాట్ సింగ్, నటరాజన్, షాబాజ్ నదీమ్, మనీశ్ పాండే, విజయ్ శంకర్, సిద్ధార్థ్ కౌల్, ప్రియమ్ గార్గ్. విదేశీ ఆటగాళ్లు: వార్నర్ (కెప్టెన్), రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహమాన్, నబీ, జేసన్ రాయ్, హోల్డర్, విలియమ్సన్, బెయిర్‌స్టో. సహాయక సిబ్బంది: టామ్ మూడీ (డైరెక్టర్ ఆఫ్ క్రికెట్), బేలిస్ (హెడ్ కోచ్), బ్రాడ్ హాడిన్ (అసిస్టెంట్ కోచ్), బిజూ జార్జ్ (ఫీల్డింగ్ కోచ్), వీవీఎస్ లక్ష్మణ్ (బ్యాటింగ్ మెంటార్), మురళీధరన్ (బౌలింగ్ మెంటార్). లీగ్‌లో అత్యుత్తమ ప్రదర్శన ►2016లో చాంపియన్ 2020లో ప్రదర్శన: మరో రెండు జట్లతో పాటు సమానంగా 7 మ్యాచ్‌లే గెలిచినా... మెరుగైన రన్‌రేట్ కారణంగా పట్టికలో మూడో స్థానంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఎలిమినేటర్‌లో నెగ్గి రెండో క్వాలిఫయర్‌లో ఓడిన జట్టు, టోర్నీని మూడో స్థానంతో ముగించింది. తొలి తొమ్మిది మ్యాచ్‌లలో ఆరు ఓడిన రైజర్స్... హోల్డర్, నటరాజన్, సందీప్ శర్మ, వృద్ధిమాన్ సాహా చలవతో తర్వాతి 5 మ్యాచ్‌లలో 4 విజయాలు సాధించింది. మరోసారి కెప్టెన్ డేవిడ్ వార్నర్ టాప్ స్కోరర్ గా (548) నిలిచాడు. -
నా డార్లింగ్‌తో చివరి పెగ్: వార్నర్
హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఐపీఎల్-2021 సీజన్ కోసం భారత్‌కు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. దీనికి సంబంధించి ఓ ఫొటోను గురువారం తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఆ ఫొటోలో వార్నర్.. తన భార్య క్యాండిస్‌తో కలిసి వైన్ తాగుతూ కనిపిస్తాడు. భారత్‌కు వెళ్లే సమయం ఆసన్నమైంది, అదృష్టవశాత్తు కొన్ని నెలలు కుటుంబంతో గడిపే సమయం దొరికింది, నా డార్లింగ్(క్యాండిస్)తో ఇదే చివరి పెగ్, లవ్ యూ.. మిస్ యూ అంటూ క్యాప్షన్ జోడించి ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా, వార్నర్ కొద్ది రోజుల కిందటే ఐపీఎల్ కోసం భారత్‌కు బయలుదేరుతున్నాని, తన కూతుళ్లతో లాస్ట్ డిన్నర్ చేశానని ఇన్‌స్టాలో ఫోటోలు పోస్ట్ చేశాడు. దీంతో సన్‌రైజర్స్ అభిమానులు అతను భారత్‌కు బయలుదేరాడని తెగ సంబర పడిపోయారు. View this post on Instagram A post shared by David Warner (@davidwarner31) అయితే తాజా పోస్ట్‌ను బట్టి చూస్తే వార్నర్ ఇంకా ఆస్ట్రేలియాలోనే ఉన్నట్లు స్పష్టమవుతుంది. ఇదిలా ఉండగా, ఇటీవల భారత్‌తో జరిగిన సిరీస్‌లో గజ్జ గాయానికి గురై కొంతకాలం విశ్రాంతి తీసుకున్న వార్నర్.. ఇటీవలే దేశవాళీ క్రికెట్లో రీఎంట్రీ ఇచ్చి, సత్తా చాటాడు. దీంతో సన్‌రైజర్స్ అభిమానులు అతనిపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. కాగా, ఏప్రిల్ 9న ప్రారంభంకానున్న సీజన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. సన్‌రైజర్స్ తన మొదటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఢీకొంటుంది. ఏప్రిల్ 11న జరిగే ఈ మ్యాచ్‌కు చెన్నై వేదిక కానుంది. చదవండి: కేకేఆర్‌కు భారీ షాక్.. స్టార్ ఆటగాడికి కరోనా -
కేదార్ జాదవ్‌ని పెట్టుకొని ఏం చేస్తారు!
చెన్నై: సన్‌రైజర్స్ హైదరాబాద్ వేలంలో మరోసారి పొదుపు మంత్రాన్ని పాటించింది. గురువారం జరిగిన మినీ వేలంలో ఎస్ఆర్హెచ్ తమ పర్స్‌లో ఉన్న రూ. 10.75 కోట్లలో కేవలం రూ.3.80 కోట్లు మాత్రమే ఖర్చు చేసి ముగ్గురు ఆటగాళ్లను కొనుగోలు చేసింది. వారిలో సీఎస్కే వద్దనుకొని వదిలేసిన కేదార్ జాదవ్‌కు రూ.2 కోట్లు, బౌలర్ ముజీబ్ ఉర్ రెహమాన్‌కు రూ.1.5 కోట్లు, జగదీశా సుచిత్‌కు రూ. 30లక్షలు వెచ్చించింది. అయితే వేలంలో ఎస్ఆర్హెచ్ వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. ముఖ్యంగా కేదార్ జాదవ్ విషయంలో సన్‌రైజర్స్ అభిమానులు పెట్టిన మీమ్స్ వైరల్ అయ్యాయి.'ఫామ్‌లో లేని ఆటగాడిని తీసుకొని ఏం చేస్తుంది.. అసలు సన్‌రైజర్స్ వ్యూహం ఏంటో ఎవరికి అంతుపట్టదు.. సీఎస్కే వద్దనుకుంది.. సన్‌రైజర్స్ కావాలనుకుంటుంది.' అంటూ కామెంట్స్ చేశారు. కాగా కేదార్ జాదవ్ గత సీజన్లో సీఎస్కే తరపున 8 మ్యాచ్‌లాడి 62 పరుగులు మాత్రమే చేసి దారుణంగా విఫలమయ్యాడు. అందుకే కేదార్ జాదవ్ మొదటిసారి వేలంలోకి వచ్చినప్పుడు కనీసం అతన్ని పరిగణలోకి కూడా తీసుకోలేదు. కానీ రెండోసారి వేలంలోకి వచ్చిన జాదవ్‌ను అనూహ్యంగా సన్‌రైజర్స్ రూ. 2కోట్ల కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసింది. స్వదేశీ ఆటగాళ్లను తీసుకోవాలని భావించినప్పుడు ఫామ్‌లో ఉన్నకృష్ణప్ప గౌతమ్, కెఎస్ భరత్ లాంటి ఆటగాళ్లవైపు ఎస్ఆర్హెచ్ చూస్తే బాగుండేది అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కాగా 2016లో వార్నర్ సారథ్యంలో టైటిల్ గెలిచిన సన్‌రైజర్స్ 2018లో విలియమ్సన్ కెప్టెన్సీలో చివరి మెట్టుపై బోల్తా కొట్టింది. ఇక గత సీజన్లో వార్నర్ నాయకత్వంలో ప్లేఆఫ్‌కు చేరుకున్నా క్వాలిఫయర్ 2లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. చదవండి: 'ఆర్యన్.. మీ నాన్నను కొనుగోలు చేశాం' Hyderabadis reaction after SRH bought Kedar Jadhav for 2 Cr!👇👇👇 #IPLAuction2021 #IPLAuction pic.twitter.com/WEsJV52pGj — ʀᴀɢʜᴀᴠᴀ🇮🇳 (@raghava216) February 18, 2021 Kedar Jadhav sold to Sunrisers Hyderabad at 2cr... *Meanwhile, Sunrisers Hyderabad fans to the tram management after getting the out of form batsman at this prize : pic.twitter.com/vxehvrf7Yy — 𝘏𝘪𝘮𝘢𝘯𝘴𝘩𝘶 𝘚𝘦𝘵𝘩 (@tereMaalKaYaar) February 18, 2021 SRH and CSK after that Kedar Jadhav trade:#IPLAuction2021 pic.twitter.com/TCSHh9fA1d — Manya (@CSKian716) February 18, 2021 -
ఫ్యాన్స్‌కి సారీ చెప్పిన డివిలియర్స్
అబుదాబి: అద్భుత బ్యాటింగ్ లైనప్ కలిగిన రాయల్ చాలెంజర్స్ జట్టు అనూహ్యంగా ఐపీఎల్ 2020 నుంచి వైదొలిగింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో శుక్రవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓటమిపాలై ఇంటిదారి పట్టింది. ఐపీఎల్ తాజా సీజన్లో ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఏబీ డివిలియర్స్ నిన్నటి మ్యాచ్‌లోనూ సత్తా చాటాడు. ఆరోన్ ఫించ్ (30 బంతుల్లో 32, 3 ఫోర్లు, ఒక సిక్స్) సాయంతో డివిలియర్స్ (43 బంతుల్లో 56, ఐదు ఫోర్లు) జట్టును ఆదుకున్నాడు. అయితే, మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమవడంతో ఆర్సీబీ 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 131 పరుగులు మాత్రమే చేసింది. ఎస్ఆర్హెచ్ బౌలర్ల దెబ్బకు మంచి ఫామ్‌లో ఉన్న కెప్టెన్ కోహ్లి, ఓపెనర్ దేవదత్ పడిక్కల్‌తో సహా మొయిన అలీ, శివం దుబే, వాషింగ్టన్ సుందర్, నవదీప్ సైనీ సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేరారు. పేసర్ మహ్మద్ సిరాట్ 10 పరుగులు చేశాడు. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ డేవిడ్ వార్నర్, మనీష్ పాండే తక్కువ పరుగులకే ఔటైనా.. కేన్ విలియమ్సన్ (44 బంతుల్లో 50 పరుగులు, 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), జేసన్ హోల్డర్ (20 బంతుల్లో 24 పరులు, మూడు ఫోర్లు) బాధ్యాయుత ఆటతో విజయం సాధించింది. ఇక కీలకమైన మ్యాచ్‌లో ఆర్సీబీ బోల్తా పడటంతో అటు ఆటగాళ్లు, ఇటలు అభిమానులు నిరాశలో మునిగిపోయారు. (చదవండి: కన్ఫ్యూజ్ చేసిన డివిలియర్స్!) ఇప్పటివరకు ఐపీఎల్ ట్రోఫీ కలగానే మిగిలిపోవడం పట్ల భారమైన హృదయంతో టోర్నీకి గుడ్‌బై చెప్పారు. ఈ సందర్భంగా ఏబీ డివిలియర్స్ అభిమానుల ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపాడు. అదే సమయంలో బాగా ఆడి అభిమానులను అలరించినప్పటికీ.. అంచనాలు అందుకోలేకపోయామని క్షమాపణలు కూడా కోరాడు. చిరస్మరణీయ పోటీ నుంచి నిరాశగా తప్పుకుంటున్నామని ఆర్సీబీ యాజమాన్యం ట్వీట్ చేసింది. ఆటగాళ్ల ఫేర్వెల్ వీడియోను షేర్ చేసింది. ఇదిలాఉండగా.. తాజా సీజన్లో 454 పరుగులు చేసి ఏబీ డివిలియర్స్ అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడు. 15 మ్యాచ్‌లో మూడు అర్ధ సెంచరీలు చేసిన ఏబీ 158.7 స్ట్రయిక్‌రేట్‌తో ఈ ఘనత సాధించాడు. (చదవండి: ఆర్సీబీ ఔట్.. కోహ్లి ఎమోషనల్ ట్వీట్!) -
ఆర్సీబీ ఔట్.. కోహ్లి ఎమోషనల్ ట్వీట్!
అబుదాబి: ఐపీఎల్ 13 వ సీజన్లో తొలి అర్ధభాగం అద్భుత విజయాలు సాధించిన రాయల్ చాలెంజర్స్ జట్టు ఇంటిదారిపట్టింది. శుక్రవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ సందర్భంగా ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి.. ట్విటర్ వేదికగా ఎమోషనల్ వీడ్కోలు సందేశం ఇచ్చాడు. ఐపీఎల్ 2020 లో జట్టు సభ్యులమంతా ఒడిదుడుకులను తట్టుకుని మెరుగైన ప్రదర్శన చేశామని పేర్కొన్నాడు. జట్టుగా తమకు ఇది గొప్ప అనుభూతి అని చెప్పుకొచ్చాడు. (చదవండి: విన్‌రైజర్స్...) అయితే, ఆర్సీబీకి కొన్ని పరిస్థితులు అనుకూలించలేదని కోహ్లి వాపోయాడు. ఏదేమైనా టీమ్ సభ్యులు, సిబ్బంది సహకారం మరువలేనిదని అన్నాడు. తమకు మద్దతుగా నిలిచిన అభిమానులకు కోహ్లి కృతజ్ఞతలు చెప్పాడు. అభిమానుల ఆదరణతో మరింత బలం పుంజుకుని మళ్లీ కలుస్తానని సెలవు ప్రకటించాడు. టీమ్ సభ్యులు, సహాయక సిబ్బందితో కూడిన ఫొటోను కోహ్లి ట్విటర్లో షేర్ చేశాడు. కాగా, మేటీ ఆటగాళ్లతో పటిష్టంగా ఉన్న ఆర్సీబీ జట్టు ఇప్పటివరకు ఒక్క ఐపీఎల్ సీజన్లోనూ విజేతగా నిలవలేదు. (చదవండి: సుదీర్ఘ కాలం ‘బయో బబుల్’లో కష్టమే) Together through the highs and lows. It's been a great journey for us as a unit. Yes things did not go our way but proud of the whole group. Thank you to all our fans for your support. Your love makes us stronger. See you all soon. #PlayBold @RCBTweets ❤️ pic.twitter.com/jIULXT0DLz — Virat Kohli (@imVkohli) November 6, 2020 -
విన్‌రైజర్స్...
ఐపీఎల్–2020లో సన్‌రైజర్స్ మరో అడ్డంకిని విజయవంతంగా అధిగమించింది. ఓడితే టోర్నీ నుంచి నిష్క్రమించే అవకాశం ఉన్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో చక్కటి ప్రదర్శనతో విజయాన్ని అందుకొని ముందంజ వేసింది. ఫైనల్లో చోటు కోసం రెండో క్వాలిఫయర్ ఆడే అర్హత సాధించింది. లీగ్ చివరి దశలో వరుసగా మూడు విజయాలు సాధించి జోరు ప్రదర్శించిన హైదరాబాద్ దానిని కొనసాగిస్తూ సత్తా చాటింది. ముందుగా అద్భుతమైన బౌలింగ్‌తో రాయల్ చాలెంజర్స్ కట్టడి చేసిన జట్టు తర్వాత లక్ష్యాన్ని ఛేదించడంలో సఫలమైంది. కొంత తడబడినా... అనుభవజ్ఞులైన విలియమ్సన్, హోల్డర్ కలిసి ఎలాంటి ప్రమాదం లేకుండా హైదరాబాద్‌కు గట్టిక్కించారు. మరోవైపు ఐపీఎల్ మొదలైన నాటినుంచి ‘ఈ సాలా కప్ నామ్దే...’ అంటూ చకోర పక్షుల్లా బెంగళూరు విజయంపై అభిమానులు పెట్టుకుంటున్న ఆశలు మరోసారి ఆవిరయ్యాయి. ప్రతీ ఏడాది టైటిల్ గెలుస్తామనే నమ్మకం ప్రదర్శిస్తూ వచ్చిన కోహ్లి కల మళ్లీ భగ్నమైంది. వరుసగా ఐదో పరాజయంతో ఆ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. అబుదాబి: సన్‌రైజర్స్ హైదరాబాద్ క్వాలిఫయర్–2కు అర్హత పొందింది. ముందుకు వెళ్లాలంటే కచ్చితంగా గెలవాల్సిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 6 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన వార్నర్ ఫీల్డింగ్ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. ఏబీ డివిలియర్స్ (43 బంతుల్లో 56; 5 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. ఫించ్ (30 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. హోల్డర్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం హైదరాబాద్ 19.4 ఓవర్లలో 4 వికెట్లకు 132 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కేన్ విలియమ్సన్ (44 బంతుల్లో 50 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), జేసన్ హోల్డర్ (20 బంతుల్లో 24 నాటౌట్; 3 ఫోర్లు) కలిసి జట్టును విజయతీరం చేర్చారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు అభేద్యంగా 47 బంతుల్లో 65 పరుగులు జోడించడం విశేషం. ఆదివారం జరిగే రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో హైదరాబాద్ తలపడుతుంది. ఒకే ఒక్కడు... బెంగళూరు ఇన్నింగ్స్‌లో మొత్తం 10 ఫోర్లు, 1 సిక్స్ మాత్రమే ఉండటం చూస్తే జట్టు బ్యాటింగ్ ఎలా సాగిందో అర్థమవుతుంది. పేలవ స్ట్రయిక్‌రేట్‌తో ఫించ్ పరుగులు చేయగా... డివిలియర్స్ మినహా అంతా విఫలమయ్యారు. ఓపెనర్‌గా వచ్చిన కోహ్లి (6) మరోసారి తక్కువ స్కోరుకే వెనుదిరగ్గా, దేవ్‌దత్ పడిక్కల్ (1) కూడా విఫలమయ్యాడు. ఈ దశలో కొద్దిసేపు ఫించ్, డివిలియర్స్ కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే రైజర్స్ కట్టుదిట్టమైన బౌలింగ్ కారణంగా వేగంగా పరుగులు చేయలేకపోయారు. నదీమ్ బౌలింగ్‌లో ఫించ్ అవుట్ కావడంతో ఈ భాగస్వామ్యానికి తెర పడింది. అదే ఓవర్లో ‘ఫ్రీ హిట్’ షాట్ ఆడి సింగిల్ కోసం ప్రయత్నించిన మొయిన్ అలీ (0) రనౌటయ్యాడు. మరోవైపు డివిలియర్స్ మాత్రం కొన్ని చక్కటి షాట్లతో స్కోరును నడిపించాడు. అయితే అతను కూడా తనదైన శైలిలో విధ్వంసక ఇన్నింగ్స్ ఆడలేకపోవడం హైదరాబాద్ బౌలింగ్ పదునును చూపిస్తోంది. 39 బంతుల్లో అతని అర్ధ సెంచరీ పూర్తి కాగా... శివమ్ దూబే (8), సుందర్ (5) కూడా తొందరగా డగౌట్ చేరారు. ఇన్నింగ్స్‌లో మరో 14 బంతులు మిగిలి ఉండగా... డివిలియర్స్ చెలరేగితే భారీ స్కోరుకు అవకాశం కనిపించింది. అయితే నటరాజన్ వేసిన అద్భుత యార్కర్ డివిలియర్స్ మిడిల్ స్టంప్‌ను గిరాటేయడంతో బెంగళూరు సాధారణ స్కోరుకు పరిమితమైంది. ఉత్కంఠను అధిగమించి... గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమైన సాహా స్థానంలో జట్టులోకి వచ్చిన శ్రీవత్స్ గోస్వామి (0)తో కలిసి డేవిడ్ వార్నర్ (17) ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. అయితే తొలి ఓవర్లోనే రైజర్స్ మొదటి వికెట్ కోల్పోయింది. మనీశ్ పాండే (21 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్), వార్నర్ కలిసి జాగ్రత్తగా ఆడుతున్న దశలో అంపైర్ వివాదస్పద నిర్ణయంతో వార్నర్ వెనుదిరిగాడు. సిరాజ్ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్ పట్టగా, అంపైర్ తిరస్కరించాడు. అయితే ఆర్సీబీ రివ్యూ కోరింది. సుదీర్ఘ సమయం పాటు పలు రీప్లేల తర్వాత వార్నర్‌ను మూడో అంపైర్ అవుట్‌గా ప్రకటించాడు. వీడియోలో బంతి వార్నర్ బ్యాట్‌కు లేదా గ్లవ్‌కు తగిలినట్లుగా ఎక్కడా స్పష్టంగా కనిపించలే?దు. ఆ తర్వాత తక్కువ వ్యవధిలో పాండే, గార్గ్ (7) కూడా అవుట్ కావడంతో రైజర్స్ ఛేదనపై సందేహాలు రేగాయి. బెంగళూరు బౌలర్లు కూడా ఎలాంటి భారీ షాట్లకు అవకాశం ఇవ్వలేదు. అయితే ఇద్దరు అంతర్జాతీయ జట్ల కెప్టెన్లు కలిసి చక్కటి సమన్వయంతో, పరిస్థితికి తగినట్లుగా ఆడుతూ ముందుకు వెళ్లారు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆర్సీబీ బౌలర్లు ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసినా... విలియమ్సన్, హోల్డర్ ఎక్కడా అత్యుత్సాహం ప్రదర్శించలేదు. సైనీ వేసిన చివరి ఓవర్లో విజయానికి 9 పరుగులు అవసరం కాగా... తొలి బంతికే విలియమ్సన్ అర్ధ సెంచరీ (39 బంతుల్లో) పూర్తయింది. రెండో బంతిపై పరుగు తీయని హోల్డర్ మూడో, నాలుగో బంతులను బౌండరీ దాటించి హైదరాబాద్‌కు విజయం ఖాయం చేశాడు. బ్యాటింగ్‌లో తగినన్ని పరుగులు చేయలేకపోవడమే ఓటమికి కారణం. బౌలింగ్ చేస్తున్నప్పుడు మాత్రం ఒక దశలో మ్యాచ్‌ను శాసించే స్థితిలో నిలవగలిగాం. మా ప్రణాళికలు సరిగ్గా పని చేశాయి. సీజన్లో భారీ స్కోర్లు చేయలేకపోవడానికి బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి కారణం కావచ్చు. ఎలా ఆడినా ఫీల్డర్ల చేతుల్లోకే బంతులు వెళ్లాయి. బౌలర్లు మాత్రం స్వేచ్ఛగా బౌలింగ్ చేశారు. సీజన్లో దేవ్‌దత్, సిరాజ్ బాగా ఆడటం చెప్పుకోదగ్గ విషయం. ఏబీ, చహల్ ఎప్పటిలాగే తమ సత్తా చాటారు. ఈ ఏడాది మాకు కఠినంగా గడిచింది. మిగిలిన జట్లు ఎంత బలంగా ఉన్నాయో తెలిసింది. పైగా సొంత మైదానాల అనుకూలత లేకపోవడం వల్ల అన్ని జట్లకు సమానావకాశాలు కనిపించాయి. అలా చూస్తే అత్యంత హోరాహోరీగా సాగిన లీగ్ ఇది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మేమందరం మైదానంలోకి దిగి ఆడగలగడమే సంతోషించాల్సిన విషయం. అభిమానులకు ఇలాంటి వినోదం అందించినందుకు గర్వపడుతున్నాం. –కోహ్లి, బెంగళూరు జట్టు కెప్టెన్ ► ఈ ఐపీఎల్లో వార్నర్ టాస్ గెలిచిన మ్యాచ్‌ల సంఖ్య. ఎనిమిది జట్లు పాల్గొన్న ఐపీఎల్ టోర్నీలలో గతంలో రోహిత్ (ముంబై–2017), ధోని (చెనై–2016) మాత్రమే ఈ ఘనత సాధించారు. ఆ రెండు సార్లూ రోహిత్, ధోని జట్లు ఐపీఎల్ ట్రోఫీని నెగ్గాయి. ► ఈ ఐపీఎల్ టోర్నీలో సన్‌రైజర్స్ గెలిచిన మొత్తం 8 మ్యాచ్‌ల్లో 8 వేర్వేరు ఆటగాళ్లకు (రషీద్ ఖాన్, ప్రియమ్ గార్గ్, బెయిర్‌స్టో, మనీశ్ పాండే, సాహా, సందీప్ శర్మ, నదీమ్, విలియమ్సన్) ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డులు రావడం విశేషం. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) గోస్వామి (బి) హోల్డర్ 6; దేవ్‌దత్ (సి) గార్గ్ (బి) హోల్డర్ 1; ఫించ్ (సి) సమద్ (బి) నదీమ్ 32; డివిలియర్స్ (బి) నటరాజన్ 56; మొయిన్ అలీ (రనౌట్) 0; దూబే (సి) వార్నర్ (బి) హోల్డర్ 8; సుందర్ (సి) సమద్ (బి) నటరాజన్ 5; సైనీ (నాటౌట్) 9; సిరాజ్ (నాటౌట్) 10; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 131. వికెట్ల పతనం: 1–7; 2–15; 3–56; 4–62; 5–99; 6–111; 7–113. బౌలింగ్: సందీప్ శర్మ 4–0–21–0; హోల్డర్ 4–0–25–3; నటరాజన్ 4–0–33–2; నదీమ్ 4–0–30–1; రషీద్ ఖాన్ 4–0–22–0. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) డివిలియర్స్ (బి) సిరాజ్ 17; గోస్వామి (సి) డివిలియర్స్ (బి) సిరాజ్ 0; పాండే (సి) డివిలియర్స్ (బి) జంపా 24; విలియమ్సన్ (నాటౌట్) 50; గార్గ్ (సి) జంపా (బి) చహల్ 7; హోల్డర్ (నాటౌట్) 24; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (19.4 ఓవర్లలో 4 వికెట్లకు) 132. వికెట్ల పతనం: 1–2; 2–43; 3–55; 4–67. బౌలింగ్: సిరాజ్ 4–0–28–2; సైనీ 3.4–0–31–0; సుందర్ 2–0–21–0; జంపా 4–0–12–1; చహల్ 4–0–24–1; మొయిన్ అలీ 1–0–4–0; దూబే 1–0–7–0. -
సన్‌రైజర్స్ చేతిలో కోల్‘కథ’
షార్జా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నమెంట్ లీగ్ దశ మ్యాచ్‌లకు నేటితో తెర పడనుంది. కొన్నేళ్ల నుంచి కొనసాగుతున్నట్టే ఈసారీ ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌కు అర్హత పొందే చివరి జట్టేదో లీగ్ ఆఖరి మ్యాచ్‌తోనే తేలనుండటం విశేషం. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ 18 పాయింట్లతో ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకోవడంతోపాటు పాయింట్ల పట్టికలో ‘టాప్’ పొజిషన్‌నూ ఖాయం చేసుకుంది. ► సోమవారం జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుపై ఢిల్లీ క్యాపిటల్స్ నెగ్గడంతో 16 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్‌కు చేరింది. 14 పాయింట్లతో బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ సమఉజ్జీగా నిలిచాయి. అయితే మెరుగైన రన్‌రేట్ (–0.172) కారణంగా నైట్‌రైడర్స్ (–0.214)ను వెనక్కి నెట్టిన బెంగళూరు మూడో జట్టుగా ప్లే ఆఫ్స్ బెర్త్‌ను దక్కించుకుంది. ► నాలుగో బెర్త్ రేసులో కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ నిలిచాయి. 12 పాయింట్లతో ఉన్న హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్స్‌కు అర్హత పొందాలంటే డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌తో నేడు జరిగే మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. కోల్‌కతాకంటే మెరుగైన రన్‌రేట్ ఉండటంతో డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలోని హైదరాబాద్ జట్టు గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా నేరుగా ప్లే ఆఫ్స్‌కు చేరుతుంది. ► ఒకవేళ కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే ఒక్కటే మార్గం ఉంది. ముంబై చేతిలో సన్‌రైజర్స్ ఓడిపోవాలి. లేదంటే మ్యాచ్ అయినా రద్దు కావాలి. మ్యాచ్ రద్దయిన పక్షంలో హైదరాబాద్‌కు ఒక్క పాయింట్ వస్తుంది. ఆ జట్టు 13 పాయింట్లతో ఐదో స్థానానికి పరిమితమవుతుంది. 14 పాయింట్లతో కోల్‌కతా ముందంజ వేస్తుంది. అయితే యూఏఈలో మ్యాచ్ రద్దయ్యే వాతావరణ పరిస్థితులు ఏమాత్రం లేవు కాబట్టి కోల్‌కతా జట్టు హైదరాబాద్ ఓడిపోవాలని కోరుకోవాలి. -
ఏం జరిగిందో మీరే చూడండి: సన్‌రైజర్స్
అబుదాబి: ఢిల్లీ క్యాపిటల్స్‌పై అద్భుత విజయం సాధించిన సన్‌రైజర్స్ జట్టు ఫుల్ జోష్‌లో ఉంది. ఐపీఎల్-2020 టోర్నీలో నిలవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో 88 పరుగులతో ఢిల్లీని ఓడించి సత్తా చాటిన సంగతి తెలిసిందే. కెప్టెన్ డేవిడ్ వార్నర్(66), వృద్ధిమాన్ సాహా(87) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో లీగ్‌లో తమ రెండో అత్యధిక స్కోరును నమోదు చేసింది. మంగళవారం నాటి ఈ అపూర్వ విజయంతో హైదరాబాద్ జట్టు సంబరాల్లో మునిగిపోయింది. అంతేగాకుండా విక్టరీతో పాటు తమ కెప్టెన్ వార్నర్ బర్త్‌డేను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. ఈ డబుల్ ధమాకా కారణంగా డ్రెస్సింగ్‌రూంలో సందడి వాతావరణం నెలకొంది. (చదవండి: సాహా... వార్నర్... వహ్వా! ) ఇందుకు సంబంధించిన వీడియోను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘‘గత రాత్రి కీలక మ్యాచ్‌లో గెలిచిన తర్వాత డ్రెస్సింగ్‌రూంలో ఏం జరిగిందో చూడండి. కేక్ ఫైట్‌ను కూడా అస్సలు మిస్పవకండి’’అంటూ ఆరెంజ్ కలర్లో ఉన్న హార్ట్ ఎమోజీని జతచేసింది. ఇక ప్రియంగార్గ్, మనీష్ పాండే సహా ఇతర ఆటగాళ్లు వార్నర్ ముఖాన్ని కేక్‌తో నింపేశారు. ఆ తర్వాత వార్నర్ అందరి మీదకు కేక్ విసురుతూ, బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీధరన్ వద్దకు పరుగెత్తుకువెళ్లి అతడి ముఖానికి కేక్ పూశాడు. మిగతా ఆటగాళ్లంతా ఈ సంతోష క్షణాలను సెల్ఫోన్లో బంధిస్తూ సందడి చేశారు. ఈ వీడియో ఆరెంజ్ ఆర్మీ అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. కాగా మంగళవారం నాటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేయగా.. సమిష్టి వైఫల్యంతో ఢిల్లీ జట్టు భారీ ఓటమిని మూటగట్టుకుంది.(చదవండి: ధోని ఫ్యాన్స్‌కు సీఎస్కే సీఈవో గుడ్‌న్యూస్!) -
బారెడు జట్టుతో అంపైర్, మీమ్స్ హోరు
దుబాయ్: సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసి ఉత్కంఠ రేకెత్తించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జట్టు 163 పరుగులు చేయగా.. సన్‌రైజర్స్ కూడా 20 ఓవర్లలో 163 పరుగులే చేయగలిగింది. టై గా ముగిసిన మ్యాచ్‌లో కేకేఆర్ సూపర్ విజయం సాధించింది. ఆద్యంతం అభిమానులను అలరించిన ఈ మ్యాచ్‌లో అంపైర్ పశ్చిమ్ పాఠక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆట మొదలైనప్పటి నుంచి ఆయన అంపైరింగ్‌పై సోషల్ మీడియాలో మీమ్స్ వరద కొనసాగింది. పాఠక్ అంపైరింగ్ విధానం, హెయిర్ స్టైయిల్ దీనికి కారణం. ఆయన జుట్టు మహిళల మాదిరిగా బారెడు పొడుగు ఉండటంతో.. ‘మహిళా అంపైర్ ఎవరబ్బా?’అంటూ కొందరు అభిమానులు ప్రశ్నలు సంధించారు. (చదవండి: సూపర్: 3 బంతులు, 2 పరుగులు, 2 వికెట్లు) ‘ఐపీఎల్లో మొట్ట మొదటిసారి అంపైరింగ్ చేస్తున్న ఈ మహిళను చూడండి.. ఎంత అందంగా ఉందో’ అంటూ మీమ్స్ కూడా వేశారు కొందరు. బౌలర్ బంతిని విసిరే సమయంలో ఒకప్పటి అంపైర్ల మాదిరిగా ముందుకు వంగి ఉండటం పాఠక్ స్పెషాలిటీ. ఆయన అంపైరింగ్ స్టాండర్డ్స్ కూడా బాగుంటాయని పేరుంది. విజయ్ హజారే టోర్నీలో మొట్ట మొదటిసారిగా హెల్మెట్ ధరించి అంపైరింగ్ చేసింది కూడా పాఠకే. వికెట్ కీపర్ అంపైర్లాగా నిలబడితే.. అంపైర్ వికెట్ కీపర్ లా నిలుచున్నాడని కొందరు ట్రోల్ చేశారు. మరికొందరు మాత్రం పాఠక్ సంప్రదాయక పద్ధతిలో అంపైరింగ్ బాగుందంటూ.. ఆయన్ని రాక్‌స్టార్ అంటూ పొగిడేస్తున్నారు. కాగా, 2014లో తొలిసారి ఆయన ఐపీఎల్లో అంపైరింగ్ చేశాడు. మళ్లీ తాజా సీజన్లో ఫీల్డులోకి దిగాడు. (చదవండి: షమీ నిర్ణయంపై ఆశ్చర్యపోయాం: రాహుల్) -
ఏందిది.. ధోనికి అంపైర్ భయపడ్డాడా?
దుబాయ్: చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లో అంపైర్ పాల్ రీఫెల్ వ్యవహరించిన తీరు చర్చకు దారి తీసింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 167 పరుగులు చేసింది. 168 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ విలియమ్సన్ (39 బంతుల్లో 57; 7 ఫోర్లు) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో ఓటమి మూటగట్టుకుంది. అయితే, ఇన్నింగ్స్ 19వ ఓవర్ అంపైర్ రీఫెల్ నిర్ణయం క్రీడా విశ్లేషకులను సైతం విస్మయానికి గురిచేసింది. ఆ ఓవర్లో శార్దుల్ వేసిన రెండో బంతి క్రీజ్‌కు చాలా దూరంగా వెళ్లింది. [ చదవండి : మీ లవర్ మీ మొబైల్ వాట్సాప్ చెక్ చేస్తున్నారా? ఈ ట్రిక్ తో సేఫ్ గా ఉండండి ] దీనిని వైడ్‌గా ప్రకటించేందుకు కొంత వరకు అంపైర్ పాల్ రీఫెల్ చేతులు కూడా ఎత్తేశాడు. అయితే అటు ధోని, ఇటు శార్దుల్ తమ అసహనాన్ని ప్రదర్శించడంతో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఎలా చూసినా అది స్పష్టంగా ‘వైడ్’ అని తెలిసిపోతోంది. టీవీ రీప్లేలో కూడా అది స్పష్టంగా కనిపించింది. అయితే 127 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన మాజీ క్రికెటర్ రీఫెల్ ఆటగాళ్ల ఒత్తిడితో ఇలా చేయడం ఆశ్చర్యం కలిగించింది. రైజర్స్ కెప్టెన్ వార్నర్ కూడా తన అసంతృప్తిని వ్యక్తం చేయడం కనిపించింది. సన్‌రైజర్స్ అభిమానులు రీఫెల్‌కు అంపైరింగ్ నేర్పించాలని సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. అంపైర్ ధోనికి భయపడి నిర్ణయాన్ని మార్చుకోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. (చదవండి: ‘సన్’కు చెన్నై చెక్... ) -
ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టారు
షార్జా: సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తమ జట్టు ఆల్‌రౌండ్ షో కనబర్చిందని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు. పిచ్ నెమ్మదిగా ఉండడంతో అంత స్కోర్ చేయడం సులువుకాదని, ముగ్గురు 'హార్డ్ హిట్టర్స్' తమ జట్టులో ఉండడం అనుకూల అంశమన్నారు. లక్ష్య ఛేదనలో ఆ జట్టును కట్టడి చేయడంలో బౌలర్లు సఫలమయ్యారని మ్యాచ్ ముగిసిన తర్వాత అన్నారు. ముంబై ఇండియన్స్ మరోసారి ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 34 పరుగుల తేడాతో గెలిచి పాయింట్స్ పట్టికలో మొదటి స్థానానికి చేరుకుంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ జట్టుకు క్వింటన్ డీకాక్ అర్ధ సెంచరీతో మంచి ఆరంభానిచ్చాడు. చివర్లో వచ్చిన పోలార్డ్ 25(13), హర్దిక్ పాండ్యా 28(19), కృణల్ పాండ్యా 20(5) చెలరేగిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 208 పరుగులు సాధించారు. (చదవండి: ముంబై విజయనాదం) లక్ష్యఛేదనలో విఫలం: వార్నర్ 209 భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు మంచి ఆరంభమే లభించింది. వార్నర్ ఉన్నంతసేపు ఆ జట్టుకు విజయావకాశాలు కనిపించినా అతడు అవుటయ్యాక ఛేదనలో మిగతా ఆటగాళ్లు విఫలమయ్యారు. లక్ష్య ఛేదనలో మంచి పార్టన్‌షిప్ లభించలేదని... ముంబైయ ఇండియన్స్ బౌలర్లు సమష్టిగా రాణించారని వార్నర్ అన్నారు. ఈ మ్యాచ్‌లో తమ బౌలర్ల ప్రదర్శన పేలవంగా ఉందని చివర్లో ఎక్కువగా ఫుల్‌టాస్ బంతులు వేశారని వార్నర్ అన్నాడు. భువనేశ్వర్ గాయంతో ఈ మ్యాచ్‌లో ఆడకపోవడంతో అతడు లేని లోటు మ్యాచ్‌లో కనిపించింది. (చదవండి: చెన్నై చిందేసింది) -
ఐపీఎల్ 2020: అయ్యర్‌కు భారీ జరిమానా
న్యూఢిల్లీ: తొలి రెండు మ్యాచుల్లో అద్భుత ఆటతీరుతో విజయాలు సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో చేతులెత్తేసింది. కెప్టెన్ వార్నర్ (33 బంతుల్లో 45; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), బెయిర్ స్టో (48 బంతుల్లో 53; 2 ఫోర్లు, 1 సిక్స్), విలియమ్సన్ (26 బంతుల్లో 41; 5 ఫోర్లు) రాణించడంతో ఎస్ఆర్హెచ్ 162 పరుగులు చేసింది. 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి ఢిల్లీ జట్టు ఏ దశలోనూ గెలుపు దిశగా పయనించలేదు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రషీద్ ఖాన్ (3/14), భువనేశ్వర్ (25/2), నటరాజన్ (29/1) మెరుగైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని 147 పరుగులకు కట్టడి చేశారు. (చదవండి: ‘నటరాజన్.. నిప్పులు చెరిగే బంతులవి’) ఇక గెలిచే మ్యాచ్‌లో ఓటమిపాలైన ఢిల్లీ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌కు స్లో ఓవర్ రేటు కారణంగా భారీ జరిమానా పడింది. స్లో ఓవర్ రేటు కారణంగా అయ్యర్‌కు రూ.12 లక్షలు జరిమానా విధించినట్టు ఐపీఎల్ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. అంతకుముందు రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు కెప్టెన్ విరాట్ కోహ్లికి ఇదే మొత్తంలో జరిమానా పడింది. కింగ్స్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు కారణంగా విరాట్‌కు ఫైన్ తప్పలేదు. గత గురువారం కింగ్స్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి సేన ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. కింగ్స్ పంజాబ్ విసిరిన 207 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేక్రమంలో బెంగుళూరు109 పరుగులకు ఆలౌట్ అయింది. (చదవండి: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మొదటి విజయం) -
కేన్ విలియమ్సన్ అందుకే ఆడలేదా..
దుబాయ్ : 2018, 2019లో డేవిడ్ వార్నర్ స్థానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా పనిచేసిన కేన్ విలియమ్సన్ ఆ రెండు సీజన్లలో తన ఆటతో పాటు కెప్టెన్సీలోనూ ఆకట్టుకున్నాడు. విలియమ్సన్ 2018లో సన్‌రైజర్స్ జట్టును ఫైనల్ వరకు తీసుకొచ్చినా చెన్నైతో జరిగిన ఫైనల్లో ఆఖరి మెట్టుపై బోల్తా పడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. కాగా విలిమయ్సన్ 2018లో మొత్తం 17 మ్యాచ్‌ల్లో 735 పరుగులు చేసి లీగ్ టాప్ స్కోరర్‌గా ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. కాగా ఐపీఎల్ 13వ సీజన్‌కు వచ్చేసరికి సన్‌రైజర్స్ యాజమాన్యం డేవిడ్ వార్నర్‌పై మరోసారి నమ్మకం ఉంచి అతన్ని తిరిగి కెప్టెన్‌గా నియమించింది. కేన్ విలియమ్సన్ ఆటగాడిగా మంచి రికార్డు ఉండడంతో జట్టులో తుది స్థానం తప్పకుండా ఉంటుందని అందరూ భావించారు. అయితే నిన్న(సోమవారం) ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో విలియమ్సన్ ఆడకపోవడంపై పలు సందేహాలు రేకెత్తాయి. జట్టులో నలుగురు విదేశీ ఆటగాళ్లే ఆడాలనే నిబంధన ఉండడం దీనికి కారణమై ఉంటుందని అంతా అనుకున్నారు. అయితే ఆర్సీబీతో మ్యాచ్ ముగిసిన తర్వాత సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ విలియమ్సన్ ఆడకపోవడంపై క్లారిటీ ఇచ్చాడు. (చదవండి : 'ఆర్చర్ రెడీగా ఉండు .. తేల్చుకుందాం') 'మ్యాచ్‌కు ముందురోజు మహ్మద్ నబీతో కలిసి ప్రాక్టీస్ చేస్తుండగా కేన్ విలియమ్సన్కు కండరాలు పట్టేశాయి. దాంతో చివరి నిమిషంలో ఆర్సీబీతో జరిగిన మొదటి మ్యాచ్‌కు అతను దూరమవ్వాల్సి వచ్చింది. దీంతో అతని స్థానంలో బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా మిచెల్ మార్ష్‌కు అవకాశం లభించింది. అయితే అనూహ్యంగా మార్ష్ కూడా గాయపడడం మాకు కష్టంగా మారింది. మార్ష్ తన నొప్పిని భరిస్తూనే మ్యాచ్ గెలిపించాలనే ఉద్దేశంతో 10వ నెంబర్ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. ఎక్స్‌రే రిపోర్ట్‌లో మార్ష్ గాయం మరీ పెద్దది కాదని తేలింది. కానీ కుడికాలు చీలమండ గాయంతో అతని పాదాన్ని సరిగా నిలుపలేకపోతున్నాడు .. దీంతో టోర్నికి దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. అయినా సరే మేం ఒత్తిడికి తలొగ్గకుండా ధైర్యంగా ముందుకు సాగుతాం అంటూ తెలిపాడు. కాగా కేన్ విలియమ్సన్ సెప్టెంబర్ 26న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగే మ్యాచ్‌లో బరిలోకి దిగే అవకాశం ఉంది.(చదవండి : 'చహల్ కీలకమని ముందే అనుకున్నాం') -
'చహల్ కీలకమని ముందే అనుకున్నాం'
దుబాయ్ : ఐపీఎల్ 13వ సీజన్లో భాగంగా సోమవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఆర్సీబీ భోణీ కొట్టిన సంగతి తెలిసిందే. సన్‌రైజర్స్‌ను విజయం దిశగా నడిపిస్తున్న జానీ బెయిర్ స్టోను 16వ ఓవర్లో బౌలింగ్ వచ్చిన యజువేంద్ర చహల్ తన మ్యాజిక్ బౌలింగ్‌తో బోల్తా కొట్టించాడు. ఒకే ఓవర్లో వరుస బంతుల్లో బెయిర్ స్టో(61) ను బౌల్డ్ చేసిన చహల్.. ఆ తర్వాత బంతికి విజయ్ శంకర్(0) బౌల్డ్ చేశాడు. ఇదే మ్యాచ్‌లో టర్నింగ్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. ఇక ఇక్కడి నుంచి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్ ఓటమి పాలయింది. మ్యాచ్ అనంతరం ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి చాహల్‌తో పాటు యువ బ్యాట్స్‌మన్ దేవదూత్ పడిక్కల్‌ను ప్రశంసలతో ముంచెత్తాడు. (చదవండి : కోహ్లి, డివిలియర్స్ ఫేవరెట్ కాదు) 'ఈ విజయం వెనుక ఇద్దరు కీలకపాత్ర పోషించారు. ఒకరు స్పిన్నర్ యజువేంద్ర చహల్, మరొకరు యువ బ్యాట్స్‌మన్ దేవదూత్ పడిక్కల్. చాహల్ దుబాయ్‌లో జరగనున్న ఐపీఎల్లో చాలా కీలకమవుతాడని ముందే అనుకున్నాం.. తన లెగ్ స్పిన్ మాయాజాలంతో మ్యాజిక్ చేశాడు. పిచ్ తనకు అనుకూలంగా మారితే ఎంత ప్రమాదకారే తెలిసేలా చేశాడు. అంతవరకు మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నబెయిర్ స్టోను తెలివైన బంతితో బోల్తా కొట్టించి మంచి బ్రేక్ అందించాడు. ఆ తర్వాత అదే ఓవర్లో విజయ్‌శంకర్‌ను క్లీన్‌బౌల్డ్ చేసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు.(చదవండి : ఖతర్నాక్ కుర్రాడు.. పడిక్కల్) తన మణికట్టు మాయాజాలంతో రానున్న రోజుల్లో చహల్ చాలా కీలకంగా మారనున్నాడు. ఇక బ్యాటింగ్‌లో యువ కెరటం దేవదూత్ పడిక్కల్ మొదటి మ్యాచ్‌తోనే ఒక మొమొరబుల్ ఇన్నింగ్స్‌ను ఆడాడు. అతని గురించి ఎంత మాట్లాడినా తక్కువే అవుతుంది. మ్యాచ్‌లో 20 పరుగులు ఎక్కువ చేశామంటే దానికి పడిక్కల్ కృషి చాలా ఉంది. అతనికి మంచి భవిష్యత్తు ఉంది. డివిలియర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మిస్టర్ 360 అనే పేరును మరోసారి సార్థకం చేసుకున్నాడు.' అంటూ తెలిపాడు. కాగా ఆర్సీబీ తర్వాతి మ్యాచ్ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో దుబాయ్ వేదికగా 24న తలపడనుంది. -
'ఆర్చర్ రెడీగా ఉండు .. తేల్చుకుందాం'
దుబాయ్ : డేవిడ్ వార్నర్.. విధ్వంసానికి పెట్టింది పేరు. అతను ఫామ్‌లో ఉన్నాడంటే ప్రత్యర్థి బౌలర్లకు ఇక చుక్కలే. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో విదేశీ ఆటగాళ్లలో అత్యంత విజయవంతమైన ఆటగాడిగా వార్నర్ రికార్డు నెలకొల్పాడు. 2018లో ఏడాది నిషేదంతో క్రికెట్ దూరంగా ఉన్న వార్నర్ 2019లో కేన్ విలియమ్సన్ కెప్టెన్సీలో అద్భుత ప్రదర్శనతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఐపీఎల్ 2020 సీజన్‌కు గానూ మళ్లీ కెప్టెన్‌గా ఎంపికైన వార్నర్ 2016ను పునరావృతం చేస్తాడేమో చూడాలి. ఇప్పటికే ఐపీఎల్ 13వ సీజన్ ఆడేందుకు దుబాయ్‌కు చేరుకున్న వార్నర్ సన్‌రైజర్స్ జట్టుతో కలిశాడు. ఇంగ్లండ్‌తో సిరీస్ ముగిసిన తర్వాత నేరుగా దుబాయ్‌లో అడుగుపెట్టిన వార్నర్ పలు ఆసక్తికర విషయాలు పేర్కొన్నాడు. (చదవండి : 'ధోని.. నిజంగా నువ్వు అద్భుతం') 'రెండేళ్ల తర్వాత సన్‌రైజర్స్‌కు కెప్టెన్‌గా పనిచేయబోతున్నా. గత ఐదేళ్లుగా జట్టుతో పాటే కొనసాగుతున్నా కాబట్టి జట్టులోని ఆటగాళ్ల గురించి మాట్లాడేందుకు ఏం లేదు. కెప్టెన్‌గా నా విధులను సక్రమంగా నిర్వహిస్తూనే బ్యాట్స్‌మన్‌గా అన్నిఅస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నా. ఇంగ్లండ్‌తో సిరీస్ ముగిసిన తర్వాత నేరుగా ఇక్కడికే చేరుకోవడం.. మంచి ప్రాక్టీస్ కూడా లభించడం జరిగింది. ఇక మొదటి మ్యాచ్‌కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. ఇంగ్లండ్‌తో జరిగిన టీ20, వన్డే సిరీస్‌లో జోఫ్రా ఆర్చర్ నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. అతని బౌలింగ్‌లో ఐదు సార్లు ఔటయ్యాను. ఆర్చర్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా. ఈ సందర్భంగా ఆర్చర్ రెడీగా ఉండు తేల్చుకుందాం' అంటూ వార్నింగ్ ఇచ్చాడు. కాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ మొదటి మ్యాచ్ ఆర్సీబీతో సెప్టెంబర్ 21న తలపడనుంది. డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, బెయిర్ స్టో, బిల్లీ స్టాన్లేక్, రషీద్ ఖాన్ వంటి విదేశీ ఆటగాళ్లు బలంగా కనిపిస్తున్న సన్‌రైజర్స్ స్వదేశీ ఆటగాళ్లో ఒక్క భూవీ తప్ప పెద్ద పేరున్న ఆటగాళ్లు లేకపోవడం పెద్ద లోటుగా చెప్పొచ్చు. 2014లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన వార్నర్‌కు ఆ జట్టు తరపున అద్భుతమైన రికార్డు ఉంది. అంతేగాక 2015లో సన్‌రైజర్స్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన వార్నర్.. మరుసటి ఏడాది 2016లో జట్టుకు టైటిల్ అందించాడు. ఇక బ్యాట్స్‌మెన్‌గా లెక్కలేనన్ని రికార్డులు సాధించాడు. 2014లో సన్‌రైజర్స్ తరపున మొదటిసారి ఆడిన వార్నర్.. 528 పరుగులతో టాప్ 4లో స్థానం సంపాదించాడు. తర్వాత వరుసగా 2015లో 562 పరుగులు, 2016లో 848 పరుగులు, 2017లో 641 పరుగులు, 2019లో 692 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఐపీఎల్ సీజన్లలో అత్యధిక పరుగులు మూడు సార్లు సాధించి ఆరెంజ్ క్యాప్ అందుకున్న ఏకైక విదేశీ ఆటగాడిగా వార్నర్ రికార్డు నెలకొల్పాడు. -
సన్‌రైజర్స్ జట్టులో హైదరాబాదీ
సాక్షి, ముషీరాబాద్: లక్షలాది మంది హైదరాబాద్ క్రికెట్ అభిమానుల ఆకాంక్షలను మూటగట్టుకొని ఐపీఎల్లోఆడేందుకు శుక్రవారం (ఈ నెల 21న)బయలుదేరి వెళ్తున్నాడు రాంనగర్ కుర్రోడు భావనక సందీప్. ఐపీఎల్ మ్యాచ్‌లు సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇటీవల జరిగిన వేలంపాటలో సందీప్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు దక్కించుకుంది. హైదరాబాద్ నుంచి మొదట ముంబై వెళ్లి ఈ నెల 23న మిగతా సన్‌రైజర్స్ జట్టుసభ్యులతో కలిసి యూఏఈకి ప్రత్యేక చాపర్‌లో వెళ్లనున్నాడు. యూఏఈలో ఆరు రోజుల పాటు క్వారంటైన్లో ఉన్న అనంతరం జట్టు సభ్యులు నెట్ ప్రాక్టీస్ ప్రారంభించనున్నారు. సన్‌రైజర్స్ జట్టులో హైదరాబాద్ నుంచిప్రాతినిధ్యం వహిస్తోంది భావనక సందీప్ ఒక్కడే కావడం గమనార్హం. ఈ సందర్భంగా సందీప్ ఏం చెప్పారంటే.. ‘సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో నేనొక్కడినే హైదరాబాద్‌కు చెందినవాడిని ఉండడంతో సహజంగానే తనపై హైదరాబాద్ క్రికెట్ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. వారి ఆశలను, ఆకాంక్షలను నేనుతప్పకుండా హైదరాబాద్ క్రికెట్ అభిమానుల మద్దతుతో నెరవేర్చడానికి కృషి చేస్తా. ఇప్పటివరకు రంజీ, దేశవాలీ క్రికెట్ మాత్రమే ఆడాను. ప్రస్తుతం ప్రపంచ మేటి ఆటగాళ్లతో ఐపీఎల్లో ఆడబోతున్నాను. ఈ అవకాశం మూడేళ్లుగా ఎదురుచూస్తున్నా. ముఖ్యంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏబీ డివిల్లియర్స్కు బౌలింగ్ చేయడం నా చిరకాల వాంఛ. భారత జట్టులో స్థానం సంపాదించేందుకు ఇక్కడే పునాదులు వేసుకుంటాను. అవకాశం కల్పించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీకి, వీవీఎస్ లక్ష్మణ్‌కు, అంబటి రాయుడుకి, కోచ్‌లు జాన్, శ్రీధర్‌లకు, ఫిట్నెస్ సాధించేందుకు గంటల తరబడి నాకు బౌలింగ్ చేసిన మణితేజ, మధుసూదన్‌రెడ్డిలకు, చిన్నప్పటి నుంచే నాలోని క్రికెట్‌ను తట్టిలేపిన నా తల్లిదండ్రులకు రుణపడి ఉంటాను’. సందీప్ రికార్డులివీ.. 2010లో 18 ఏళ్ల వయసులో రంజీతో రంగప్రవేశం చేసిన సందీప్ మొదటి మ్యాచ్‌లోనే ఝార్ఖండ్‌పై సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. 75 ఏళ్ల హైదరాబాద్ రంజీ చరిత్రలో మొదటి మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన 5వ బ్యాట్స్‌మన్‌గా సందీప్ నిలిచాడు. ఇప్పటి వరకు 54 రంజీ మ్యాచ్‌లు ఆడి 48.5 సగటుతో తన ప్రతిభను అజేయంగా కొనసాగిస్తున్నాడు. మొత్తం 7 సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ, 21 హాఫ్ సెంచరీలు తన ఖాతాలో జమ చేసుకున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ రంజీ టీమ్‌కు వైస్ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. అంతేకాకుండా ఇతను లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ కూడా. విజయ్ హజారే 50 ఓవర్ల టోర్నమెంట్లో హైదరాబాద్ నుంచి 14 వికెట్లు తీసి ఆల్‌రౌండర్ ప్రతిభను చాటాడు. బీటెక్ పూర్తిచేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో స్పోర్ట్స్ కోటాలో ఇన్స్పెక్టర్గా ఉద్యోగం సంపాదించిన సందీప్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లలో తన నైపుణ్యాన్ని చాటుతూ తన చిరకాల స్వప్నమైన ఐపీఎల్లో స్థానం దక్కించుకున్నాడు. -
సంచలన క్రికెటర్ ఇంట విషాదం
కాబూల్: అఫ్గానిస్తాన్ యువ సంచలనం, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు రషీద్ ఖాన్ ఇంట విషాదం చోటుచేసుకుంది. గతకొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న అతని తల్లి గురువారం తుదిశ్వాస విడిచారు. ఈ విషాదకర వార్తను తన అభిమానులతో పంచుకుంటూ ట్విటర్లో రషీద్ భావోద్వేగ పోస్ట్ పెట్టాడు. 'అమ్మా.. నువ్వే నా సర్వసం. నువ్వు లేకుండా నేను లేను. ఇక నాతో ఉండవనే విషయాన్ని జీర్ణీంచుకోలేకపోతున్నా. నిన్ను చాలా మిస్సవుతానమ్మా. నీ ఆత్మకు శాంతికలగాలి'అంటూ రషీద్ ఉద్వేగభరిత ట్వీట్ చేశాడు. (అచ్చం స్మిత్‌ను దింపేశావ్‌గా..) ఇటీవల తన తల్లి ఆరోగ్యపరిస్థితి పూర్తిగా క్షీణించిందని.. ఆమె కోసం ప్రార్థనలు చేయాలని అభిమానులకు, సన్నిహితులకు విజ్ఞప్తి చేస్తూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. రషీద్ తల్లి మరణవార్త తెలుసుకున్న పలువురు క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా తమ సంతాపం తెలుపుతున్నారు. ఇక ఈ ఆఫ్గాన్ సంచలనం తన ఆటతీరుతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు. పొట్టిక్రికెట్లో ఇప్పటికే ఎన్నో రికార్డులను నెలకొల్పాడు. ఇక ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ప్రాతినిథ్యం వహిస్తున్న రషీద్ జట్టు విజయాల్లో ముఖ్య పాత్ర పోషిస్తూ అనతికాలంలోనే స్టార్ ఆటగాడిగా ఎదిగిపోయాడు. (‘నీకు అబ్బాయిలు ఇష్టమా’ వివాదం ముగిసింది!) إِنَّا لِلَّهِ وَإِنَّا إِلَيْهِ رَاجِعُوْنَ You were my home my mother I had no home but you . i can’t believe you are no more with me you will missed forever . Rest In Peace #MOTHER 😢😢 — Rashid Khan (@rashidkhan_19) June 18, 2020 -
వీడియో వైరల్: రషీద్ ఖాన్.. స్మిత్ అయ్యాడు
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి అన్ని దేశాలు లాక్డౌన్ ప్రకటించాయి. దీంతో క్రికెట్ టోర్నీ, లీగ్‌లు లేకపోవడంతో ఆటగాళ్లు ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్డౌన్ సమయాన్ని కుటుంబంతో కలిసి ఆస్వాదిస్తూనే సోషల్ మీడియా వేదికగా అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. ఈ క్రమంలో అఫ్గానిస్తాన్ సంచలనం రషీద్ ఖాన్ తన ఇంట్లోనే ఓ చిలిపి ప్రయత్నం చేశాడు. ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్‌ను అనుకరిస్తూ బ్యాటింగ్ చేశాడు. ఫన్నీగా ఉన్న ఆ వీడియోను సన్‌రైజర్స్ హైదరాబాద్ తన అధికారిక ట్విటర్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. సన్‌రైజర్స్ పోస్ట్ చేసిన వీడియోపై రాజస్తాన్ రాయల్స్ సైతం స్పందించింది. తమ సారథి స్మిత్ ఆ విధంగా ఒక్కసారే కాదని అనేకమార్లు ఆడాడని పేర్కొంటూ మరో వీడియోను పోస్ట్ చేసింది. స్టీవ్ స్మిత్ రాజస్తాన్ రాయల్స్ సారథి అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రెండు ఫ్రాంచైజీల మధ్య జరిగిన సంభాషణ, స్మిత్‌ను అనుకరిస్తూ రషీద్ చేసిన బ్యాటింగ్‌పై నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు. ‘అచ్చం స్మిత్ లానే బ్యాటింగ్ చేస్తున్నావ్.. చూడముచ్చటగా ఉంది’అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఇక తన సంచలన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను గడగడలాడించే రషీద్ వీలుచిక్కినప్పుడల్లా బ్యాట్‌తోనూ మెరుస్తాడు. ఐపీఎల్లో అనేక మ్యాచ్‌ల్లో బంతితో పాటు బ్యాట్‌తో కూడా సన్‌రైజర్స్‌కు అనేక విజయాలను అందించాడు. Who wants to join @rashidkhan_19 for a game of indoor cricket? 🤔 Imitations only! 😁#OrangeArmy #SRH #StayAtHome #StaySafe pic.twitter.com/OpzfUZrAI6 — SunRisers Hyderabad (@SunRisers) April 3, 2020 So we're not the only ones missing @stevesmith49? 😉 pic.twitter.com/VtgU1MXkjt — Rajasthan Royals (@rajasthanroyals) April 3, 2020 చదవండి: యువీ, భజ్జీ.. సాయం చేయండి: మాజీ క్రికెటర్ ఏంటి నీ వేషాలు.. కోహ్లితో చెప్పాలా? -
కోహ్లి కాల్ కోసం ఎదురుచూస్తున్నా: వార్నర్
భారత్‌లో క్రికెట్ ఆడటం తనకు ఎల్లప్పుడూ ప్రత్యేకమేనని ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ అన్నాడు. టీమిండియాతో మ్యాచ్ అంటే గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ముంబైలో జరిగిన తొలి వన్డేలో ఆసీస్ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ సూపర్ ఇన్నింగ్స్‌తో భారత్‌ను మట్టికరిపించారు. అయితే ఈ మ్యాచ్ కంటే ముందు డేవిడ్ వార్నర్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ టీంతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా వార్నర్ మాట్లాడుతూ.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా తనకు ప్రేక్షకుల నుంచి లభించిన మద్దతు మర్చిపోలేనిదని హర్షం వ్యక్తం చేశాడు. (కలవరపాటుకు గురైన డేవిడ్ వార్నర్..! ) అదే విధంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఫోన్ కాల్ కోసం ఆతురతగా ఎదురుచూస్తున్నానని పేర్కొన్నాడు. ‘ విరాట్ నన్ను డిన్నర్‌కు పిలుస్తాడని వేచి చూస్తున్నాను. ఇదిగో నా ఫోన్ అతడి కాల్ కోసం ఎదురుచూస్తోంది’ అని వార్నర్ సరదాగా వ్యాఖ్యానించాడు. ఇక టీమిండియాతో మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని... విరాట్, రాహుల్, రోహిత్ వంటి ఆటగాళ్లతో జట్టు పరిపూర్ణంగా ఉందని.. బుమ్రా జట్టులోకి రావడం కూడా టీమిండియాకు కలిసి వస్తుందని అభిప్రాయపడ్డాడు. ఇక ఐపీఎల్లో వార్నర్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ సీజన్ 12లో తన ప్రదర్శనతో అభిమానులను ఆకట్టుకున్నాడు ఈ స్టార్ బ్యాట్స్‌మెన్. అయితే ఇంగ్లండ్‌లో జరిగిన ప్రపంచకప్ కోసం సన్నద్ధం కావడానికి... ఐపీఎల్ జరుగుతున్న సమయంలోనే వార్నర్ స్వదేశానికి పయనం కావడం అభిమానులను కాస్త నిరాశకు గురిచేసింది. కాగా మంగళవారం నాటి మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 49.1 ఓవర్లలో 255 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. ఓపెనర్ శిఖర్ ధావన్ (91 బంతుల్లో 74; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేయగా, కేఎల్ రాహుల్ (61 బంతుల్లో 47; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 37.4 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 258 పరుగులు చేసి విజయ ఢంకా మోగించింది. ఇక 112 బంతులు ఎదుర్కొని 128 పరుగులు చేసి(నాటౌట్; 17 ఫోర్లు, 3 సిక్సర్లు) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన డేవిడ్ వార్నర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. కాగా మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్ ఈ నెల 17న రాజ్‌కోట్‌లో జరుగనుంది. పది వికెట్ల పరాభవం.. ఆసీస్ ఏకపక్ష విజయం Guess who's waiting for @imVkohli's call 📲 for dinner? 😉 Watch this exclusive chat with @davidwarner31 ahead of the #INDvAUS ODI series!#OrangeArmy pic.twitter.com/oU5cqkA9T9 — SunRisers Hyderabad (@SunRisers) January 13, 2020 -
అతను అలా ఆడుతుంటే ఏం చేయలేకపోయాం.!
చెన్నై : షేన్ వాట్సన్ దాటికి తాము ఏం చేయలేకపోయామని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ తెలిపాడు. మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం భువనేశ్వర్ కుమార్ స్పందిస్తూ..‘ఈ వికెట్‌పై మరిన్ని పరుగులు చేయాల్సింది. మా బౌలింగ్ సమయంలో మైదానంలో మంచు కురిసింది. కానీ మాకేం ఇబ్బంది కలుగలేదు. వాట్సన్ దాటికి తాము ఏం చేయలేకపోయాం. ఈ మ్యాచ్ క్రెడిట్ మొత్తం అతనిదే. ఇక ప్రతి బౌలర్‌కు ఎదో ఒకరోజు దుర్దినం వస్తుంది. అఫ్గాన్ సంచలనం రషీద్‌ఖాన్‌కు ఈ రోజు వచ్చింది. అతను గత మూడేళ్లలో ఎన్నడు లేని విధంగా ఓవర్‌కు 10 పరుగులు సమర్పించుకున్నాడు. మేం బెయిర్‌స్టో సేవలు కోల్పోతున్నాం. కానీ మా జట్టులో అతన్ని భర్తీ చేసే ఆటగాళ్లున్నారు. ఇంకా మాకు మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు ఇతర మైదానాల్లోనే ఉన్నాయి. ప్లే ఆఫ్‌కు అర్హత సాధించాలంటే ఆ మ్యాచ్‌లు గెలవాల్సిందే. రాజస్తాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌లో గెలుపు కోసం సాయశక్తులా పోరాడుతాం. ఇక కెప్టెన్సీతో నేను చాలా నేర్చుకున్నాను.’ అని భువీ చెప్పుకొచ్చాడు. తొలుత బ్యాటింగ్ చేపట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 175 పరుగులు చేసింది. మనీశ్ పాండే (49 బంతుల్లో 83 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), వార్నర్ (45 బంతుల్లో 57; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన చెన్నై సూపర్‌కింగ్స్ 19.5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసి గెలిచింది. వాట్సన్ (53 బంతుల్లో 96; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగాడు. రైనా (24 బంతుల్లో 38; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. వాట్సన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. రైజర్స్ కెప్టెన్ విలియమ్సన్ స్వదేశం వెళ్లడంతో షకీబుల్ హసన్ ఈ మ్యాచ్ బరిలోకి దిగగా.. భువనేశ్వర్ సారథ్యం వహించాడు. -
సన్ ధనాధన్
సన్‌రైజర్స్ పుంజుకుంది. సొంతగడ్డపై మరో గెలుపు అందుకుంది. వార్నర్, బెయిర్‌స్టో మెరుపులకు... యువ పేసర్ ఖలీల్ అహ్మద్ నిప్పులు చెలరేగే బంతులు తోడవ్వడంతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై రైజర్స్ పైచేయి సాధించింది. బాదడమే లక్ష్యమన్నట్లుగా బరిలోకి దిగుతోన్న వార్నర్–బెయిర్‌స్టో జోడీ మరో సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన వేళ కోల్‌కతా నైట్‌రైడర్స్ చిన్నబోయింది. సాక్షి, హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్ మళ్లీ జోరు కనబరుస్తోంది. ఓ దశలో హ్యాట్రిక్ ఓటములతో డీలా పడిన రైజర్స్... మళ్లీ విజయాల బాట పట్టింది. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి హైదరాబాద్ ఐదో విజయాన్ని నమోదు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 159 పరుగులు చేసింది. క్రిస్ లిన్ (47 బంతుల్లో 51; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ చేశాడు. సునీల్ నరైన్ (8 బంతుల్లో 25; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), రింకూ సింగ్ (25 బంతుల్లో 30; 1 ఫోర్, 2 సిక్స్‌లు) రాణించారు. యువ పేసర్ ఖలీల్ అహ్మద్ 3 వికెట్లు దక్కించుకున్నాడు. అనంతరం హైదరాబాద్ కేవలం 15 ఓవర్లలో వికెట్ నష్టానికి 161 పరుగులు చేసి ఘన విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (38 బంతుల్లో 67; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు), బెయిర్‌స్టో (43 బంతుల్లో 80 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. కోల్‌కతాకు ప్రాతినిధ్యం వహిస్తోన్న ఆంధ్ర పేసర్ పృథ్వీరాజ్ ఒక వికెట్ పడగొట్టాడు. ఖలీల్ అహ్మద్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారాన్ని అందుకున్నాడు. అదిరిపోయిన ఆరంభం... తొలి ఓవర్లోనే రెండు బౌండరీలతో కోల్‌కతా ఇన్నింగ్స్ ప్రారంభమైంది. నదీమ్ వేసిన రెండో ఓవర్లో లిన్ 4, 6... నరైన్ 6 బాదడంతో నైట్‌రైడర్స్ 18 పరుగులు రాబట్టింది. ఖలీల్ వేసిన మూడో ఓవర్లో మరింతగా చెలరేగిన నరైన్ చివరికి అతనికే చిక్కి పెవిలియన్ చేరాడు. తొలి మూడు బంతుల్లో 6, 4, 4 బాది నాలుగో బంతికి ఔటయ్యాడు. దీంతో 16 బంతుల్లోనే నైట్‌రైడర్స్ తొలి వికెట్‌కు 42 పరుగుల్ని జోడించింది. ఆదుకున్న లిన్... నరైన్ ఔటయ్యాక హైదరాబాద్ బౌలర్లు కోల్‌కతాపై ఒత్తిడి పెంచారు. క్రీజులోకి వచ్చిన శుబ్‌మన్ గిల్ (3)ను ఖలీల్ ఔట్ చేయగా... నితీశ్ రాణా (11) భువీ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. కొద్దిసేపటికే కెప్టెన్ దినేశ్ కార్తీక్ (6) రనౌటయ్యాడు. దీంతో 73 పరుగులకే 4 కీలక వికెట్లను కోల్పోయి కోల్‌కతా ఇన్నింగ్స్ గాడి తప్పింది. ఈ దశలో లిన్, రింకూ సింగ్ బాధ్యతాయుతంగా ఆడుతూ స్కోరును పెంచారు. సందీప్ ఓవర్లో లిన్ బౌండరీ బాదగా... రింకూ సిక్సర్‌తో అలరించాడు. దీంతో 15 ఓవర్లకు కోల్‌కతా స్కోరు 116/4. తర్వాత వేగంగా ఆడేందుకు ప్రయత్నించిన రింకూ సింగ్ సందీప్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టి మరుసటి బంతికే ఔటయ్యాడు. అప్పటి వరకు సింగిల్స్‌కే మొగ్గుచూపుతూ 45 బంతుల్లో బౌండరీతో అర్ధశతకాన్ని అందుకున్న లిన్ కూడా విలియమ్సన్ అద్భుత క్యాచ్‌కు పెవిలియన్ చేరాడు. 18వ ఓవర్ వేసిన రషీద్ కేవలం ఒకే పరుగు ఇచ్చి స్కోరును కట్టడి చేశాడు. 19వ ఓవర్లో రెండు భారీ సిక్సర్లతో స్కోరు పెంచే ప్రయత్నం చేసిన రసెల్ (9 బంతుల్లో 15; 2 సిక్సర్లు)ను భువీ ఔట్ చేశాడు. చివరి ఓవర్లో కరియప్ప (3 బంతుల్లో 9; 1 సిక్స్) సిక్స్ బాదడంతో కోల్‌కతా 150 పరుగులు దాటగలిగింది. మళ్లీ వారిద్దరే.. అరంగేట్ర బౌలర్ పృథ్వీరాజ్ వేసిన రెండో ఓవర్లో వార్నర్ సిక్సర్‌తో రైజర్స్ మెరుపులు మొదలయ్యాయి. అదే ఓవర్లో బెయిర్‌స్టో రెండు బౌండరీలతో చెలరేగాడు. చావ్లా ఓవర్లో 4, 6తో అతను 11 పరుగులు రాబట్టాడు. ఇక తనవంతు అన్నట్లుగా నరైన్ ఓవర్లో భారీ సిక్సర్‌గా బాదిన వార్నర్... కరియప్పకు 6, 4, 6తో చుక్కలు చూపించాడు. దీంతో పవర్‌ప్లేలో రైజర్స్ 72 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓవర్‌కు కనీసం ఒక బౌండరీ, లేదా సిక్సర్ అన్నట్లుగా వీరిద్దరూ బ్యాట్ ఝళిపించారు. పాపం కరియప్ప ఈసారి బెయిర్‌స్టోకు దొరికిపోయాడు. అతను వేసిన తొమ్మిదో ఓవర్ తొలి రెండు బంతుల్లో సిక్స్, ఫోర్ బాదిన బెయిర్‌స్టో నాలుగో బంతికి సింగిల్ తీశాడు. దీంతో ఈ సీజన్లో వార్నర్–బెయిర్‌స్టో జోడీ నాలుగో సెంచరీ భాగస్వామ్యం పూర్తయింది. ఈ క్రమంలో వార్నర్, బెయిర్స్టోలిద్దరూ 28 బంతుల్లోనే అర్ధశతకాల్ని అందుకున్నారు. దీంతో 10 ఓవర్లలో జట్టు స్కోరు 109కి చేరింది. తర్వాత నరైన్ బౌలింగ్‌లో వార్నర్ వరుసగా 4, 6తో జోరు కనబరిచాడు. కానీ మరుసటి ఓవర్లోనే పృథ్వీరాజ్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ఈ దశలో జట్టు విజయానికి 46 బంతుల్లో 29 పరుగులు అవసరం. మరోవైపు 12, 13 ఓవర్లలో రెండుసార్లు ఔటయ్యే ప్రమాదాన్ని తప్పించుకున్న బెయిర్‌స్టో... విలియమ్సన్ (8) అండతో 15వ ఓవర్లో చెలరేగిపోయాడు. చావ్లా బౌలింగ్‌లో వరుసగా మూడు బంతుల్లో 4, 6, 6 బాది మరో 30 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను ముగించాడు. -
అదే మా కొంపముంచింది : రైనా
హైదరాబాద్ : సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఊహించని ఓటమి తమకు ఓ మేలుకొలుపని చెన్నైసూపర్ కింగ్స్ తాత్కాలిక కెప్టెన్ సురేశ్ రైనా అభిప్రాయపడ్డాడు. మంచి ఆరంభం లభించినా.. దాన్ని కొనసాగించలేక తడబడ్డామని, స్పల్ప లక్ష్యం నిర్దేశించడంతో ఓటమి తప్పలేదన్నాడు. బుధవారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో గెలిచిన విషయం తెలిసింది. ఇక ఈ మ్యాచ్‌కు వెన్నునొప్పితో ఇబ్బంది పడిన ధోనికి ముందస్తు జాగ్రత్తగా విశ్రాంతి ఇచ్చారు. దీంతో సురేశ్ రైనా సారథ్య బాధ్యతలు చేపట్టాడు. వరుస విజయాలతో ఊపు మీదున్న చెన్నైని.. వరుస పరాజయాలతో సతమతమైన సన్‌రైజర్స్ ఓడించింది. మ్యాచ్ అనంతరం సురేశ్ రైనా ఓటమిపై స్పందిస్తూ.. ‘ నాకు తెలిసి ఇది మాకు మంచి మేలుకొలుపు వంటిది. మేం మంచి లక్ష్యాన్ని నిర్ధేశించలేదు. త్వరత్వరగా వికెట్లు కోల్పోయాం. ఫాఫ్, వాట్సన్ అద్భుత ఆరంభాన్ని ఇచ్చారు. కానీ మేం దాన్ని అందిపుచ్చుకోలేకపోయాం. మేం త్వరగా వికెట్ల కోల్పోవడం మా విజయవకాశాలను దెబ్బతీసింది. మేం భాగస్వామ్యాలపై దృష్టిసారించాల్సింది. స్ట్రైక్‌రేట్ గొప్పగా రొటేట్ చేయాల్సింది. మేం 30 పరుగులు తక్కువగా చేశాం. ఇక ధోని కెప్టెన్‌గా ఉంటేనే బాగుంటుంది. అతను గాయం నుంచి కోలుకున్నాడు. మరసటి మ్యాచ్‌కు అందుబాటులోకి వస్తాడు.’ అని రైనా చెప్పుకొచ్చాడు. మొదట బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్‌కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. డు ప్లెసిస్ (31 బంతుల్లో 45; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), వాట్సన్ (29 బంతుల్లో 31; 4 ఫోర్లు) రాణించారు. రషీద్ ఖాన్ 2 వికెట్లు తీశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 16.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది. -
సన్‌రైజర్స్ గెలుపు బాట పట్టేనా?
మొహాలి: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్ 12లో భాగంగా సోమవారం స్థానిక ఐఎస్ బింద్రా మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్- కింగ్ప్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ సారథి రవిచంద్రన్ అశ్విన్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. విలియమ్సన్ గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో ఈ మ్యాచ్‌కు కూడా దూరమయ్యాడు. దీంతో భువనేశ్వర్ కుమార్ సన్‌రైజర్స్‌కు సారథిగా వ్యవహరించనున్నాడు. పంజాబ్‌తో మ్యాచ్‌కు ఎలాంటి మార్పులు లేకుండానే సన్‌రైజర్స్ బరిలోకి దిగుతోంది. కాగా పంజాబ్ టీమ్‌లో రెండు మార్పులు చోటుచేసుకున్నాయి. ఆండ్రూ టై, మురుగన్ అశ్విన్‌లను తప్పించి అంకిత్ రాజ్‌పుత్, ముజీబ్‌లను తుదిజట్టులోకి తీసుకుంది. ఈ సీజన్లో ఇప్పటివరకు ఇరుజట్లు చెరో ఐదు మ్యాచ్‌లు ఆడగా చెరో మూడు మ్యాచ్‌లు గెలిచాయి. అయితే ముంబై ఇండియన్స్ చేతిలో ఘోర ఓటమి అనంతరం జరుగుతున్న మ్యాచ్ కావడంతో ఆ ప్రభావం సన్‌రైజర్స్‌పై పడే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్‌లో తప్పకుండా గెలిచి విజయాల బాట పట్టాలని సన్‌రైజర్స్ ఆరాటపడుతోంది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, బెయిర్‌స్టోలపైనే సన్‌రైజర్స్ ఎక్కువగా ఆధారపడుతోంది. మిడిలార్డర్ కూడా రాణించాలని టీమ్ మేనేజ్మెంట్ కోరుకుంటోంది. అలాగే సొంతగడ్డపై పరిస్థితులను సద్వినియోగం చేసుకొని మరో విజయాన్ని ఖాతాలో వేసుకోవాలని అశ్విన్‌సేన భావిస్తోంది. తుదిజట్లు: సన్‌రైజర్స్: భువనేశ్వర్ కుమార్(కెప్టెన్), డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో, విజయ్ శంకర్, మనీష్ పాండే, దీపక్ హుడా, యుసుఫ్ పఠాన్, మహ్మద్ నబి, రషీద్ ఖాన్, సిద్దార్థ్ కౌల్, సందీప్ శర్మ కింగ్స్ పంజాబ్: రవిచంద్రన్ అశ్విన్(కెప్టెన్), కేఎల్ రాహుల్, క్రిస్ గేల్, మయాంక్ అగర్వాల్, సర్ఫరాజ్ ఖాన్, డేవిడ్ మిల్లర్, మన్దీప్ సింగ్, స్యామ్ కరన్, అంకిత్ రాజ్‌పుత్, మహ్మద్ షమీ, ముజీబ్ -
విన్ రైజర్స్
సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ పదును పెరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ను సమష్టిగా దెబ్బకొట్టింది. బ్యాటింగ్‌లోనూ సత్తాచాటడంతో లీగ్‌లో హైదరాబాద్ మూడో విజయం సాధించింది. సన్‌రైజర్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శన ఢిల్లీని సొంత గడ్డపై ఉక్కిరిబిక్కిరి చేసింది. న్యూఢిల్లీ: సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్లో మూడోసారి ‘విన్’ రైజర్స్ అయింది. గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో రైజర్స్ 5 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 129 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (41 బంతుల్లో 43; 3 ఫోర్లు, 1 సిక్స్) ఒక్కడే మెరుగ్గా ఆడాడు. రైజర్స్ బౌలర్లు అందరూ వికెట్లు పడగొట్టారు. మొహమ్మద్ నబీ (2/21) కీలక వికెట్లను తీశాడు. తర్వాత సునాయాస లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 18.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసి గెలిచింది. బెయిర్‌స్టో (28 బంతుల్లో 48; 9 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు బెయిర్‌స్టోకు దక్కింది. రైజర్స్ మార్పుల్లేని జట్టుతో బరిలోకి దిగగా... ఢిల్లీ మూడు మార్పులు చేసింది. వరుసగా విఫలమవుతున్న హనుమ విహారితో పాటు హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్‌లను తప్పించి ఇషాంత్ శర్మ, అక్షర్ పటేల్, రాహుల్ తేవటియాలను తుదిజట్టులోకి తీసుకుంది. రాణించిన శ్రేయస్ టాస్ నెగ్గిన హైదరాబాద్ ఫీల్డింగ్‌కే మొగ్గుచూపడంతో ముందుగా ఢిల్లీ బ్యాటింగ్ చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఒక్కడే నిలబడ్డాడు. మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ తమకు పట్టనట్లే బ్యాటింగ్‌కు దిగారు. మిడిలార్డర్ పూర్తిగా చేతులెత్తేసింది. రిషభ్ పంత్ (5), రాహుల్ తేవటియా (5), ఇంగ్రామ్ (5) ఇలా వచ్చి అలా వెళ్లారు. ఓ సిక్స్, ఫోర్‌తో టచ్‌లోకి వచ్చి మోరిస్ (15 బంతుల్లో (17)కు భువీ చెక్ పెట్టాడు. టెయిలెండర్లలో అక్షర్ (13 బంతుల్లో 23 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు) మెరుపులతో మూడంకెల స్కోరు దాటింది. లేదంటే వందలోపు స్కోరుకే పరిమితమయ్యేది. రాణించిన బౌలర్లు ఆడుతున్నది సొంతగడ్డపైనే అయినా... ప్రేక్షకుల మద్దతు తమకే ఉన్నా క్యాపిటల్స్ మాత్రం నిరాశపరిచింది. మూడో ఓవర్లో మొదలైన వికెట్ల పతనం 20 ఓవర్ దాకా క్రమం తప్పకుండా సాగింది. మొదట పృథ్వీ షా (11)ను భువనేశ్వర్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఆరో ఓవర్ వేసిన మొహమ్మద్ నబీ మరో ఓపెనర్ ధావన్ (12) పనిపట్టాడు. మళ్లీ ఇన్నింగ్స్ పదో ఓవర్ తొలి బంతికే హిట్టర్ రిషభ్ పంత్‌ను కూడా నబీ ఔట్ చేయడంతో ఢిల్లీకి పరుగులు, మెరుపులు కరువయ్యాయి. ఇదీ చాలదన్నట్లు రెండు మూడు ఓవర్లకు ఓ వికెట్ కూలడం ఢిల్లీని కట్టేసింది. నబీతో పాటు భువనేశ్వర్, సిద్ధార్థ్ కౌల్ తలా 2 వికెట్లు తీశారు. రషీద్ ఖాన్, సందీప్ శర్మలకు చెరో వికెట్ దక్కింది. వార్నర్ విఫలం అనంతరం లక్ష్యఛేదనకు దిగిన సన్‌రైజర్స్‌కు ఓపెనర్లు బెయిర్ స్టో, వార్నర్ (10) శుభారంభాన్నిచ్చారు. తన సహజ శైలికి భిన్నంగా వార్నర్ ఆడాడు. ధాటిగా ఆడుతున్న బెయిర్ స్టోకు అండగా నిలిచాడు. స్ట్రోక్ ప్లేతో ఆకట్టుకున్న బెయిర్ స్టో బౌండరీలతో వేగం పెంచాడు. దీంతో హైదరాబాద్ పవర్ ప్లేలోనే లక్ష్యానికి అవసరమైన సగం (62) పరుగుల్ని వికెట్ కోల్పోకుండానే చేసింది. పవర్ ప్లే ముగిసిన వెంటనే బెయిర్ స్టో ఆటకు తెరపడింది. కాసేపటికే వార్నర్ కూడా ఔటైనప్పటికీ విజయ్ శంకర్ (16; 1 ఫోర్), మనీశ్ పాండే (10) పదుల పరుగులతోనే సన్‌రైజర్స్ వంద పరుగులకు చేరుకుంది. వాళ్లిద్దరితో పాటు దీపక్ హుడా (10) ఔటయ్యాక మిగతా లాంఛనాన్ని నబీ (9 బంతుల్లో 17 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్), యూసుఫ్ పఠాన్ (9 నాటౌట్) పూర్తి చేశారు. క్యాపిటల్స్ బౌలర్లలో రబడ, లమిచానే, అక్షర్, తేవటియా, ఇషాంత్ తలా ఒక వికెట్ తీశారు. బెయిర్‌స్టో క్యాచ్ పట్టి ఉంటే... స్వల్ప లక్ష్యమే అయినా బ్యాటింగ్‌లో సన్‌రైజర్స్ తడబాటు కనిపించింది. పిచ్ మరీ మందకొడిగా ఉండటంతో పాటు అక్షర్, తేవటియా కట్టుదిట్టమైన బౌలింగ్‌తో రైజర్స్ ఇబ్బంది పడింది. వార్నర్లాంటి హిట్టర్ కూడా ఒక్క బౌండరీ లేకుండా 18 బంతుల్లో 10 పరుగులు చేశాడంటే పరిస్థితి అర్థమవుతోంది. అలాంటి చోట బెయిర్‌స్టో ఇన్నింగ్స్ విలువేంటో అర్థమవుతుంది. అతని దూకుడైన ఆరంభం వల్లే హైదరాబాద్ విజయం సాధించగలిగిందనడంలో సందేహం లేదు. అయితే అతను 5 పరుగుల వద్ద ఉన్నప్పుడు అక్షర్ పటేల్ తన తొలి ఓవర్లోనే రిటర్న్ క్యాచ్‌ను వదిలేశాడు. బెయిర్‌స్టో ముందుకొచ్చి షాట్ ఆడగా చురుగ్గానే స్పందించిన అక్షర్ రెండు చేతులతో బంతిని పట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే చేతుల్లోకి వచ్చిన బంతి దురదృష్టవశాత్తూ జారిపోయింది. దాంతో అక్షర్ తీవ్రంగా నిరాశ చెందాడు. అక్కడే బెయిర్‌స్టో ఔటై ఉంటే ఫలితం భిన్నంగా ఉండేదేమో! -
‘నాదైన రోజును నువ్వు నాశనం చేశావు!’
‘నాదైన రోజును నువ్వు నాశనం చేశావు డేవిడ్. నీ బ్యాటింగ్ ముందు నా సెంచరీ పనికిరాకుండా పోయింది. మీ ఇన్నింగ్స్ మొదలెట్టగానే పవర్‌ప్లేలోనే మ్యాచ్ మా నుంచి చేజారిపోయింది. అయినా ప్రత్యర్థులుగా సన్‌రైజర్స్ వంటి పటిష్ట జట్టు ఉన్నపుడు మేము కనీసం 250 పరుగులు స్కోరు బోర్డు మీద ఉంచాల్సింది. అయినా నాకు ఇదొక ప్రత్యేకమైన రోజు’ అంటూ రాజస్తాన్ రాయల్స్ బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్ సన్‌రైజర్స్ ఆటగాడు డేవిడ్ వార్నర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. కాగా శుక్రవారం రాజస్తాన్ రాయల్స్‌పై సన్‌రైజర్స్ జట్టు గెలుపొందిన సంగతి తెలిసిందే. ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టు విధించిన 198 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి 5 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ విజయం సాధించింది. ఇక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్తాన్ దూకుడుగా ఆడటంలో విఫలమైంది. అటువంటి సమయంలో సంజూ శాంసన్ కెప్టెన్ రహానేతో కలిసి మెరుపులు మెరిపించాడు. 58 పరుగుల వద్ద ఇచ్చిన క్యాచ్‌ను బెయిర్‌స్టో వదిలివేయడంతో లైఫ్ పొందిన సంజు.. 54 బంతుల్లో సెంచరీ(55 బంతుల్లో 102 నాటౌట్) పూర్తి చేసి ఔరా అనిపించాడు. అయితే సన్‌రైజర్స్ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్(37 బంతుల్లో 69), బెయిర్ స్టో(45) విజృంభించడంతో సంజూ సెంచరీ వృథా అయింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం వార్నర్.. సంజును సరదాగా ఇంటర్వ్యూ చేయగా అతడు పైవిధంగా స్పందించాడు. ఇక ఓవరాల్‌గా ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు 53 సెంచరీలు నమోదు కాగా సంజూ శాంసన్‌కిది రెండో సెంచరీ. -
దృష్టంతా ఐపీఎల్‌పైనే.. వేరే ద్యాసే లేదు
కోల్‌కతా: ప్రస్తుతం తన దృష్టంతా కేవలం ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)పై మాత్రమే ఉందని సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తెలిపాడు. ప్రపంచకప్ గురించి ఆలోచనే లేదని.. ఐపీఎల్లో తన జట్టుకు ఎంతవరకు ఉపయోగపడగలననేది మాత్రమే ఆలోచిస్తున్నానని పేర్కొన్నాడు. పాకిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు ఎంపిక కాలేదని.. ప్రపంచకప్‌కు సెలెక్ట్ అయ్యేది కానిది తన చేతుల్లో లేదన్నాడు. దీంతో వేరే వాటిపై దృష్టి పెట్టకుండా కేవలం సన్‌రైజర్స్ కోసం ఎంత వరకు కష్టపడగలనో అంతవరకు కష్టపడతానన్నాడు. దాదాపు చాలా వరకు క్రికెట్ లీగ్‌లు ఆడానని.. అన్నింటిలోకెల్లా ఐపీఎల్ మాత్రమే అత్యుత్తమని పేర్కొన్నాడు. ఇక 2016లో డేవిడ్ వార్నర్ సారథ్యంలోని సన్‌రైజర్స్ జట్టు ఐపీఎల్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. బాల్ ట్యాంపరింగ్ ఉదంతంతో వార్నర్, స్టీవ్ స్మిత్‌లకు గతేడాది ఐపీఎల్లో ఆడే అవకాశాన్ని బీసీసీఐ ఇవ్వలేదు. క్రికెట్ ఆస్ట్రేలియా విధించిన ఏడాది నిషేధం పూర్తయింది. దీంతో ఈ ఇద్దరు ఆసీస్ ఆటగాళ్లు ఐపీఎల్లో తమ సత్తా చాటేందుకు ఉత్సాహంగా ఉన్నారు. ఈ నెల 24న(ఆదివారం) సన్‌రైజర్స్ తన తొలి పోరులో దినేశ్ కార్తీక్ సారథ్యంలోని కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది. -
‘రైజింగ్’కు రెడీ
డేవిడ్ వార్నర్... ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయప్రస్థానంలో సింహభాగం అతనిదే. వరుసగా ప్రతీ ఏటా టాప్‌స్కోరర్‌గా నిలవడంతో పాటు 2016లో కెప్టెన్‌గా కూడా జట్టుకు టైటిల్ అందించాడు. అనూహ్య పరిణామాల నేపథ్యంలో గత ఏడాది లీగ్‌కు దూరమైన అతను ఇప్పుడు మళ్లీ బరిలోకి దిగుతుండటంతో సహజంగానే జట్టు బలం పెరిగింది. వార్నర్ గైర్హాజరీలో టీమ్‌ను అటు ఆటగాడిగా, ఇటు నాయకుడిగా అద్భుతంగా నడిపించి రన్నరప్‌గా నిలిపిన విలియమ్సన్ కెప్టెన్‌గా కొనసాగనుండగా... ఇతర ప్రధాన ఆటగాళ్లు టీమ్‌లోనే ఉండటం రైజర్స్ అవకాశాలను మరింత పెంచుతోంది. అటు బ్యాటింగ్, ఇటు పేస్, స్పిన్ బౌలింగ్, ఆల్‌రౌండర్ నైపుణ్యం... ఇలా అన్ని రంగాల్లో సరైన ఆటగాళ్లు అందుబాటులో ఉన్న హైదరాబాద్ రెండోసారి విజేతగా నిలుస్తుందా చూడాలి. బలాలు: సన్‌రైజర్స్ మొదటినుంచి తుది జట్టు విషయంలో పెద్దగా ప్రయోగాలు చేయలేదు. ఇదే ఆ జట్టుకు బాగా కలిసొచ్చింది. స్థిరమైన ఓపెనర్లు, పేస్ బౌలింగ్ బృందం, స్పిన్ వ్యూహాలు అన్నీ పక్కాగా జరిగాయి. ధావన్ దూరమయ్యాడు కాబట్టి వార్నర్, విలియమ్సన్ ఓపెనింగ్ చేయడం ఖాయం. 2018లో విలియమ్సన్ ఏకంగా 8 అర్ధసెంచరీలతో 735 పరుగులు చేసి లీగ్ టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. అతనికి వార్నర్లాంటి విధ్వంసకారుడు తోడైతే ఇక అద్భుత ఆరంభం ఖాయం. ఆ తర్వాత మనీశ్ పాండే, విజయ్ శంకర్, యూసుఫ్ పఠాన్, దీపక్ హుడా, రికీ భుయ్లాంటి వారు బ్యాటింగ్ భారం మోస్తారు. రైజర్స్‌కు గుర్తుంచుకోదగ్గ విజయాలు అందించిన భువనేశ్వర్ మరోసారి పేస్ భారం మోయనుండగా, ఇటీవలే భారత జట్టుకు ఆడిన ఖలీల్ అహ్మద్, సిద్ధార్థ్ అండగా నిలుస్తారు. ఇక రషీద్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సన్‌రైజర్స్‌కు ఆడిన రెండు సీజన్లలో కలిపి కేవలం 6.68 ఎకానమీతో 38 వికెట్లు తీసిన రషీద్ వేసే 4 ఓవర్లను ఎదుర్కోవడం ఏ ప్రత్యర్థి జట్టుకైనా కష్టమే. తొలిసారి ఐపీఎల్లో అడుగు పెట్టిన బెయిర్ స్టో ఇటీవల అంతర్జాతీయ క్రికెట్లో అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. అయితే నలుగురు విదేశీ కోటాలో వార్నర్, విలియమ్సన్, రషీద్ ఖాయం కాగా... నాలుగో స్థానం కోసం చాలా పోటీ ఉంది. బలహీనతలు: ఐపీఎల్లో సన్‌రైజర్స్ విజయాలన్నీ ప్రధానంగా బౌలింగ్ ప్రదర్శన వల్లే వచ్చాయి. అతి తక్కువ స్కోర్లు చేసి కూడా జట్టు మ్యాచ్‌లను కాపాడుకోగలిగింది. గత ఏడాదిలాగే ఈ సారి కూడా జట్టుకు మిడిలార్డర్ బ్యాటింగ్ సమస్య ఉంది. భారత ఆటగాళ్లే ఆడాల్సిన ఈ స్థానాల్లో ఎక్కువ ప్రత్యామ్నాయాలు అందుబాటులో లేవు. మనీశ్ పాండే, హుడా పెద్దగా ఫామ్‌లో లేకపోగా యూసుఫ్ పఠాన్‌లో నాటి పదును తగ్గింది. విలియమ్సన్ భుజం గాయంనుంచి ఇంకా కోలుకోవాల్సి ఉంది. అయితే గతంలో కూడా ఇలాంటి లోపాలున్నా తమ వ్యూహాలతో వాటిని అధిగమించిన సన్‌రైజర్స్‌కు మళ్లీ ప్లే ఆఫ్ చేరగలిగే సత్తా ఉంది. జట్టు వివరాలు: విలియమ్సన్ (కెప్టెన్), వార్నర్, రషీద్, షకీబ్, నబీ, గప్టిల్, స్టాన్లేక్, బెయిర్‌స్టో (విదేశీ ఆటగాళ్లు), యూసుఫ్ పఠాన్, అభిషేక్ శర్మ, సాహా, థంపి, రికీ భుయ్, ఖలీల్ అహ్మద్, హుడా, భువనేశ్వర్, నటరాజన్, సందీప్ శర్మ, షాబాజ్ నదీమ్, మనీశ్ పాండే, విజయ్ శంకర్, సిద్ధార్థ్ కౌల్, శ్రీవత్స గోస్వామి. ►హైదరాబాద్ మొదటి జట్టు దక్కన్ చార్జర్స్‌తో పోలిస్తే సన్‌రైజర్స్ రికార్డు ఐపీఎల్లో ఘనంగానే ఉంది. 2013నుంచి ఆరు సార్లు బరిలోకి దిగిన జట్టు ఒక సారి టైటిల్ గెలుచుకోగా, మరోసారి రన్నరప్‌గా నిలిచి మరో రెండు సార్లు కనీసం ప్లే ఆఫ్స్‌కు చేరి నాలుగో స్థానంలో నిలిచింది. 2018లో సమష్టితత్వంతో నిలకడగా రాణించిన టీమ్ చివరకు ఫైనల్లో ఓడింది. -
డబ్బులపై అసంతృప్తితోనే...
హైదరాబాద్: భారత ఓపెనర్ శిఖర్ ధావన్‌కు ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో ఉన్న అనుబంధం ముగిసింది. ధావన్ తమ ఫ్రాంచైజీని వీడినట్లు సన్‌రైజర్స్ యాజమాన్యం సోమవారం అధికారికంగా ప్రకటించింది. అయితే సాధారణంగా పరస్పర కృతజ్ఞతలతో జరిగే ఇలాంటి మార్పుపై ‘సన్’ చేసిన బహిరంగ ప్రకటన ఆశ్చర్యం కలిగించింది. ధావన్ తాము ఇస్తున్న డబ్బులపై అసంతృప్తి కారణంగానే వెళ్లిపోయాడని సన్‌రైజర్స్ మేనేజ్మెంట్ కుండబద్దలు కొట్టింది. 2018 ఐపీఎల్లో ధావన్‌ను కొనసాగించేందుకు ఇష్టపడని హైదరాబాద్ టీమ్ అతడిని వేలానికి ముందు విడుదల చేసింది. మళ్లీ వేలంలో ‘రైట్ టు మ్యాచ్ కార్డ్’తో రూ. 5.2 కోట్లకే తిరిగి సొంతం చేసుకుంది. 2017లో ధావన్‌కు ఇచ్చిన రూ. 12.5 కోట్లతో పోలిస్తే ఈ మొత్తం చాలా తక్కువ కావడం గమనార్హం! ఈ అసంతృప్తి ధావన్‌లో ఉండిపోయింది. ‘రైట్ టు మ్యాచ్ కార్డు ద్వారా ఈ ఏడాది ధావన్‌ను తిరిగి సొంతం చేసుకున్నాం. దురదృష్టవశాత్తూ అతనికి ఇస్తున్న మొత్తంపై సంతృప్తిగా లేడని మాకు కనిపిస్తూనే ఉంది. కానీ ఐపీఎల్ నిబంధనల ప్రకారం మేం అందులో మార్పులు చేయడానికి వీలులేదు. ధావన్ సన్‌రైజర్స్‌కు చేసిన సేవలను మేం గుర్తిస్తున్నాం. అయితే ఆర్థికపరమైన కారణాలతో అతను జట్టును వీడాలని నిర్ణయించుకోవడం బాధాకరం’ అని సన్‌రైజర్స్ తమ ప్రకటనలో పేర్కొంది. ధావన్ తమ జట్టులోకి రావడాన్ని ఢిల్లీ డేర్‌డెవిల్స్ డైరెక్టర్ పార్థ్ జిందాల్ స్వాగతించగా... అతనికి బదులుగా సన్‌రైజర్స్ ముగ్గురు ఆటగాళ్లు విజయ్ శంకర్, షాబాజ్ నదీమ్, అభిషేక్ శర్మలను తీసుకుంది. 2013 నుంచి ఆరు సీజన్ల పాటు సన్‌రైజర్స్‌కు ఆడిన ధావన్ 85 మ్యాచ్‌లలో 124.28 స్ట్రయిక్ రేట్‌తో 2,518 పరుగులు చేశాడు. ఇందులో 19 అర్ధ సెంచరీలు ఉన్నాయి. -
ఓటమిపై స్పందించిన వార్నర్
ముంబై : చెన్నైసూపర్ కింగ్స్‌తో జరిగిన ఫైనల్ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమి చెంది తృటిలో టైటిల్ చేజార్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ పరాజయంపై సన్‌రైజర్స్ మాజీ కెప్టెన్, ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ స్పందించాడు. మ్యాచ్ అనంతరం ట్విటర్ వేదికగా తన సహచర ఆటగాడు షేన్ వాట్సన్ ప్రదర్శనను కొనియాడిన వార్నర్.. సన్‌రైజర్స్ ఆటగాళ్ల పోరాటాన్ని ప్రశంసించాడు. ‘నా సహచర ఆటగాడు షేన్‌వాట్సన్ విజృంభణను చూడటం అద్బుతంగా ఉంది. ఫలితాన్ని పక్కన పెడితే.. టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శనతో ఫైనల్ చేరడం గొప్ప విషయం.’ అని ట్వీట్ చేశాడు. అయితే ఈ ట్వీట్‌కు అభిమానులు ముగ్దులయ్యారు. ఈ సీజన్లో నీవు లేవు వార్నర్.. వచ్చే సీజన్లో కప్ సన్రైజర్స్దేనని, ఫైనల్లో నీవిలువేంటో తెలిసిందని, నీవు ఉంటే కనీసం 200 లక్ష్యాన్నైనా నిర్ధేశించేవారని కామెంట్ చేస్తున్నారు. ఇక బాల్ ట్యాంపరింగ్‌తో ఏడాది నిషేదం ఎదుర్కొంటున్న వార్నర్‌ను బీసీసీఐ ఐపీఎల్‌కు అనుమతించని విషయం తెలిసిందే. ఆదివారం జరిగిన ఫైనల్లో షేన్ వాట్సన్ అద్భుత సెంచరీతో సీఎస్కే టైటిల్ నెగ్గిన విషయం తెలిసిందే. Seriously good knock by @ShaneRWatson33 well done mate simply amazing to watch. Not the result @SunRisers wanted but you have to pat yourselves on the back and say well done for the way you played throughout the tournament 👍 — David Warner (@davidwarner31) May 27, 2018 Welcome Back @davidwarner31 pic.twitter.com/Tj3W9SthLC — Faiyaz kaif (@Faiyazkaif1) May 28, 2018 -
తక్కువ స్కోరుతోనే సత్తా చాటిన సన్‌రైజర్స్
-
రైజర్స్ పవర్...
లీగ్‌లో... సన్‌రైజర్స్ ఎంతచేసినా గెలిచేలా ఉంది...! రాయల్ చాలెంజర్స్ ఏం చేసినా గెలిచేలా లేదు..! పరుగుల వరద పారే ఐపీఎల్లో తక్కువ స్కోర్లతో తమకు ఉన్న బంధాన్ని సన్‌రైజర్స్ మళ్లీ ప్రదర్శించింది. 146 పరుగులు చేసి కూడా ఆ జట్టు విజయాన్ని సొంతం చేసుకుంది. తమకు అలవాటైన రీతిలో మరోసారి సాధారణ లక్ష్యాన్ని కాపాడుకొని వరుసగా ఐదో విజయంతో హైదరాబాద్ ప్లే ఆఫ్ దిశగా అడుగులు వేయగా... బ్యాటింగ్ బలగం మళ్లీ ముంచడంతో ఓటమి పాలైన బెంగళూరు దాదాపుగా ప్లే ఆఫ్ నుంచి తప్పుకున్నట్లే. 18 బంతుల్లో 25 పరుగులు, చేతిలో 5 వికెట్లు... ఐపీఎల్ ప్రమాణాలపరంగా చూస్తే ఇది సునాయాసంగా చేయాల్సిన స్కోరు. కానీ బెంగళూరు చేతులెత్తేసింది. ఒకే బౌండరీతో 19 పరుగులు మాత్రమే చేయగలిగింది. భువనేశ్వర్, సిద్ధార్థ్ కౌల్ కలిసి ప్రత్యర్థిని కట్టిపడేయడంతో ఆర్సీబీకి మరో ఓటమి తప్పలేదు. సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్లో సన్‌రైజర్స్ వరుసగా ఐదో విజయాన్ని సాధించింది. సోమవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 5 పరుగుల తేడాతో బెంగళూరుపై గెలిచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (39 బంతుల్లో 56; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించగా, షకీబ్ (32 బంతుల్లో 35; 5 ఫోర్లు) రాణించాడు. సిరాజ్, సౌతీ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం బెంగళూరు 20 ఓవర్లలో 141 పరుగులే చేసి ఓడిపోయింది. కోహ్లి (30 బంతుల్లో 39; 5 ఫోర్లు, 1 సిక్స్), గ్రాండ్‌హోమ్ (29 బంతుల్లో 33; 1 ఫోర్, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించారు. విలియమ్సన్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. కీలక భాగస్వామ్యం... తొలి రెండు ఓవర్లలో 10 పరుగులు రాబట్టిన సన్‌రైజర్స్‌ను మూడో ఓవర్లో సౌతీ దెబ్బ తీశాడు. అతను వేసిన చక్కటి బంతికి హేల్స్ (5)ను క్లీన్‌బౌల్డ్ చేయడంతో సన్ తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం సిరాజ్ కూడా తొలి ఓవర్లోనే ధావన్ (13)ను వెనక్కి పంపాడు. మనీశ్ పాండే (5) తన వైఫల్యాన్ని కొనసాగించడంతో హైదరాబాద్ స్కోరు 3 వికెట్లకు 48 పరుగుల వద్ద నిలిచింది. ఈ దశలో విలియమ్సన్, షకీబ్ కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీరిద్దరు చక్కటి సమన్వయంతో బ్యాటింగ్ చేసినా... బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో పరుగుల వేగం మందగించింది. ఎట్టకేలకు ఐదు బంతుల వ్యవధిలో 2 సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టి విలియమ్సన్ దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో 35 బంతుల్లో అతని అర్ధసెంచరీ పూర్తయింది. ఉమేశ్ బౌలింగ్‌లో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి విలియమ్సన్ అవుట్ కావడంతో మూడో వికెట్ భాగస్వామ్యం ముగిసింది. కేన్, షకీబ్ 47 బంతుల్లో 64 పరుగులు జోడించారు. మరికొద్ది సేపటికే షకీబ్‌ను సౌతీ వెనక్కి పంపించాడు. ఇక ఆ తర్వాతి బ్యాట్స్‌మెన్ అంతా వరుస పెట్టి విఫలం కావడంతో రైజర్స్ భారీ స్కోరు సాధించలేకపోయింది. 22 పరుగుల వ్యవధిలో హైదరాబాద్ చివరి 6 వికెట్లు పడ్డాయి. 19వ ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్ 20వ ఓవర్లో మూడు వికెట్లు చేజార్చుకుంది. ఇందులో కోహ్లి చేసిన రెండు రనౌట్లు ఉన్నాయి. తొలి 10 ఓవర్లలో 61 పరుగులు చేసిన హైదరాబాద్, తర్వాతి పది ఓవర్లలో 85 పరుగులు రాబట్టింది. సీజన్లో రైజర్స్ ఆలౌట్ కావడం ఇదే రెండో సారి. కోహ్లి మినహా... సాధారణ లక్ష్య ఛేదనలో కోహ్లి ఉన్నంత సేపు మినహా బెంగళూరు ఆట తడబడుతూనే సాగింది. భువనేశ్వర్ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన పార్థివ్ పటేల్ (13 బంతుల్లో 20; 4 ఫోర్లు), షకీబ్ వేసిన ఓవర్లోనూ వరుసగా మరో రెండు ఫోర్లు బాదాడు. ఆ తర్వాతి బంతికే అతను ఎల్బీగా వెనుదిరిగాడు. షకీబ్ ఓవర్లో కోహ్లి వరుసగా 4, 6, 4 కొట్టడంతో బెంగళూరు ఇన్నింగ్స్‌కు ఊపు వచ్చింది. అయితే రైజర్స్ అద్భుతమైన బౌలింగ్ ముందు ఇది ఎంతో సేపు సాగలేదు. 28 బంతుల వ్యవధిలో 24 పరుగులు మాత్రమే చేసిన ఆర్సీబీ 4 ప్రధాన వికెట్లు కోల్పోయింది. వోహ్రా (8)ను సందీప్ శర్మ బౌల్డ్ చేయగా, యూసుఫ్ పఠాన్ గాల్లో ఎగిరి ఒంటి చేత్తో పట్టిన అద్భుత క్యాచ్‌కు కోహ్లి వెనుదిరిగాడు. రషీద్ గుగ్లీని డివిలియర్స్ (5) వికెట్ల పైకి ఆడుకోగా... తొలిసారి ఐపీఎల్ మ్యాచ్‌లో బరిలోకి దిగిన మొయిన్ అలీ (10)ని కౌల్ అవుట్ చేశాడు. ఈ దశలో మన్దీప్, గ్రాండ్‌హోమ్ జట్టును విజయం దిశగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. వీరు 50 బంతుల్లో 57 పరుగులు జోడించినా లాభం లేకపోయింది. సిరాజ్ జోరు... హైదరాబాదీ మొహమ్మద్ సిరాజ్ సొంతగడ్డపై సత్తా చాటాడు. గత ఏడాది ఐపీఎల్లో సన్‌రైజర్స్‌కు ప్రాతినిధ్యం వహించిన అతను... ఈసారి బెంగళూరు తరఫున రైజర్స్పై చక్కటి ప్రదర్శన కనబర్చాడు. 25 పరుగులకే 3 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ఈ సీజన్లో ఆడిన తొలి మూడు మ్యాచ్‌లలో సిరాజ్ భారీగా పరుగులు ఇచ్చేశాడు. వికెట్ కనుచూపు మేరలో కూడా కనిపించలేదు. నాలుగో మ్యాచ్‌లో 2 వికెట్లు తీసినా, అది జట్టు విజయానికి పనికి రాలేదు. అయినా సరే సిరాజ్‌పై కెప్టెన్ కోహ్లి నమ్మకముంచాడు. ముంబైతో మ్యాచ్‌లో 19వ ఓవర్లో 5 పరుగులు మాత్రమే ఇచ్చి విజయంలో కీలక పాత్ర పోషించడంతో అతనికి మళ్లీ అవకాశాలు దక్కాయి. సోమవారం మ్యాచ్‌లో తొలి ఓవర్లో 2 పరుగులు మాత్రమే ఇచ్చిన సిరాజ్ చక్కటి బంతితో ధావన్‌ను అవుట్ చేశాడు. అతని రెండో ఓవర్లో కూడా 4 పరుగులే వచ్చాయి. మూడో ఓవర్లో షకీబ్ రెండు ఫోర్లు కొట్టినా... ఆఖరి ఓవర్లో రెండు వికెట్లతో అతను సత్తా చాటాడు. తొలి బంతికి యూసుఫ్ పఠాన్, చివరి బంతికి వృద్ధిమాన్ సాహాలను సిరాజ్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఇందులో సాహాకు వేసిన బంతి ఏకంగా 146 కిలోమీటర్ల వేగంతో దూసుకు రావడం సిరాజ్ సత్తాకు నిదర్శనం. 2017లో 6 మ్యాచ్‌లలో 10 వికెట్లు తీసిన సిరాజ్‌కు ఈసారి ఎక్కువ మ్యాచ్‌లలో అవకాశం లభించింది. మిగిలిన నాలుగు మ్యాచ్‌లలో కూడా అతడిని ఆర్సీబీ ఆడిస్తే అతను మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వగలడు. దాదాపు ప్లే ఆఫ్ అవకాశాలు సన్నగిల్లడంతో బెంగళూరు మిగతా మ్యాచ్‌ల్లో ఎక్కువ ప్రయోగాలు చేసే అవకాశముంది. ఫలితంగా సిరాజ్‌కు మరిన్ని అవకాశాలు లభించే చాన్స్ ఉంది. -
సొంతగడ్డపై సన్‌రైజర్స్ గర్జించింది
-
ఎప్పుడు ఆడిస్తారో!
సాక్షి క్రీడా విభాగం : జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, యజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్... ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ద్వారా వెలుగులోకి వచ్చి తదనంతరం భారత జట్టుకు ఎంపికైన ఆటగాళ్లలో కొందరు. మరికాస్త వెనక్కి వెళ్తే మనీశ్ పాండే, మోహిత్ శర్మ, సంజు శామ్సన్ తదితరులతో ఈ జాబితా ఇంకా పెద్దదే. రంజీ ట్రోఫీ సహా దేశవాళీ క్రికెట్లో ప్రదర్శనే భారత జట్టులో చోటుకు ప్రామాణికమని సెలెక్టర్లు చెబుతున్నా... ఐపీఎల్ ‘ఇన్స్టంట్’ గుర్తింపు తెస్తుందనడంలో సందేహం లేదు. ఇందుకు తగ్గట్లే లీగ్ ద్వారా ఎంతోమంది యువ ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు. తాజా సీజన్లోనూ కొందరు కుర్రాళ్లు అవకాశం దక్కితే ఆకట్టుకోగలరని భావించినా... కృష్ణప్ప గౌతమ్, శుబ్‌మన్ గిల్ మినహా మిగతా వారంతా అవకాశం కోసం చూస్తునే ఉన్నారు. మరి వారెవరో చూద్దాం... ఖలీల్ అహ్మద్ (సన్‌రైజర్స్ హైదరాబాద్) 2016లో భారత అండర్–19 జట్టు సభ్యుడిగా ప్రదర్శన చూసి రాజస్తాన్‌కు చెందిన ఈ పేస్ బౌలర్‌ను ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టులోకి తీసుకుంది. కానీ, రెండు సీజన్లలోనూ మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. అద్భుత ప్రతిభావంతుడిగా రాహుల్ దవ్రిడ్ నుంచి ప్రశంసలు అందుకున్న ఖలీల్‌కు ఈ సారీ ఎదురుచూపులు తప్పడం లేదు. ప్రస్తుత సన్‌రైజర్స్ లైనప్ ప్రకారం ఎడమ చేతివాటం ఖలీల్ తుది జట్టులో ఉంటాడని అంతా భావించారు. గాయంతో ప్రధాన పేసర్ భువనేశ్వర్ దూరమైనా... సిద్ధార్థ్ కౌల్, సందీప్‌శర్మ, బాసిల్ థంపి వంటి బౌలర్లపైనే జట్టు నమ్మకం ఉంచడంతో ఖలీల్ అరంగేట్రానికి మరికొంత కాలం వేచి ఉండాల్సి రావొచ్చు. రికార్డు: 11 టి20 మ్యాచ్‌ల్లో 17.41 సగటు, 6.88 ఎకానమీతో 17 వికెట్లు నవ్‌దీప్ సైని (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు) దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన రికార్డు ఉన్న నవదీప్ సైనికి ఇది మొదటి ఐపీఎల్ కాదు. గతంలో డేర్‌డెవిల్స్ తరఫున ఆడాడు. ఆ సమయంలో పెద్దగా గుర్తింపు దక్కలేదు. ఆట తీరు ఎంతో మెరుగుపర్చుకున్న తర్వాత కోహ్లి దృష్టిలో పడిన ఈ ఢిల్లీ కుర్రాడిని అతడి నాయకత్వంలోని బెంగళూరు ఫ్రాంచైజీ దక్కించుకుంది. టీమిండియా ప్రాక్టీస్ సెషన్ బౌలర్లలో క్రమం తప్పకుండా ఉండే సైని పేరు ఒక దశలో జట్టు ఎంపికలోనూ వినిపించింది. కానీ, అనూహ్యంగా ఆర్సీబీ అతడిని ఇంతవరకు ఆడించనే లేదు. బెంగళూరు బౌలింగ్ పరిమితుల రీత్యా చూసినా సైనిని పరీక్షించి చూడొచ్చు. అయితే... హైదరాబాదీ సిరాజ్‌పై కోహ్లి నమ్మకం ఉంచడం, అతడు కుదురుకుంటుండటంతో మరో ఆలోచన చేస్తున్నట్లు లేదు. రికార్డు: 14 టి20 మ్యాచ్‌లలో 25.30 సగటు, 6.03 ఎకానమీతో 13 వికెట్లు మన్జోత్ కల్రా (ఢిల్లీ డేర్ డెవిల్స్) ఇటీవలి అండర్–19 ప్రపంచకప్ విజయంతో కల్రా పేరు వెలుగులోకి వచ్చింది. ఫైనల్లో ఆస్ట్రేలియాపై సెంచరీ అతడిని ప్రత్యేకంగా నిలిపింది. ఎడమ చేతివాటం ఓపెనర్ కావడం, జాతీయ జట్టుకు ఇలాంటి శైలి ఆటగాడు అవసరం ఉండటంతో తనపై అంచనాలు పెరిగాయి. ఢిల్లీకే చెందిన ఈ కుర్రాడిపై ఎంపిక సమయంలో నాటి కెప్టెన్ గంభీర్ అపార నమ్మకం ఉంచాడు. దేశవాళీ ఆటగాడిగా తుది జట్టులో ఉంటాడని కూడా అనుకున్నారు. కానీ, ఢిల్లీ జట్టులో తన పేరే కనిపించడం లేదు. వైఫల్యాలతో సతమతం అవుతున్న ఢిల్లీ... కల్రా కంటే మరో యువ సంచలనం పృథ్వీ షాకే అవకాశం ఇచ్చింది. దీంతో కల్రా బెంచ్‌కే పరిమితం అవుతున్నాడు. సందీప్ లమ్చానే (ఢిల్లీ డేర్‌డెవిల్స్) లెగ్ స్పిన్ నైపుణ్యంతో ఆసీస్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్‌ను అమితంగా ఆకట్టుకున్నాడు లమ్చానే. అతడి సిఫార్సుతోనే ఢిల్లీ మెంటార్ పాంటింగ్... లమ్చానేను జట్టులోకి తీసుకున్నాడు. దీంతో ఐపీఎల్ ఆడనున్న తొలి నేపాలీగా రికార్డుల్లోకి ఎక్కుతాడని అనుకున్నారు. అయితే, జట్టులో అమిత్ మిశ్రా, తేవటియా రూపంలో ఇద్దరు లెగ్ స్పిన్నర్లు ఉండటంతో సందీప్‌కు చోటివ్వడం కష్టమవుతోంది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వైవిధ్యం కోసం ప్రయత్నిస్తే... లమ్చానే అరంగేట్రం ఎంతో దూరంలో ఉండకపోవచ్చు. మంజూర్ దార్ (పంజాబ్ కింగ్స్ ఎలెవెన్) భారీ హిట్టర్, టి20 స్ట్రైక్ రేట్ 140, కష్టాలకోర్చి ఎదిగిన నేపథ్యం... ఇలాంటి ప్రత్యేకతలు కలిగిన కశ్మీరీ మంజూర్ దార్‌ను పంజాబ్ ఎప్పుడు బరిలోకి దింపినా అది ఆసక్తికర అంశమే. మంజూర్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్. దీంతో కరుణ్నాయర్, యువరాజ్ సింగ్, మనోజ్ తివారిలలో ఏ ఇద్దరినైనా పక్కకుపెడితే తప్ప... జట్టు ఇప్పుడున్న విజయాల ఊపులో అతడికి చోటు ఆశించడం కష్టమే. రసూల్ తర్వాత ఐపీఎల్ ఆడిన రెండో ఆటగాడిగా గుర్తింపు పొందాలని భావిస్తున్న మంజూర్ తన అవకాశం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాడు. -
రోహిత్ శర్మ బాగా ఆడితేనే...
ఐపీఎల్లో సన్‌రైజర్స్ మ్యాచ్‌లు గెలుస్తున్న తీరును వర్ణించేందుకు అత్యద్భుతం అనే ఒక్క పదమే సరైంది. ప్రత్యర్థి జట్టు చేయాల్సిన రన్‌రేట్ 7 పరుగులకంటే తక్కువగా ఉన్న రెండు మ్యాచ్‌లను కూడా ఆ జట్టు కాపాడుకోగలిగింది. దాదాపు అసాధ్యం లా అనిపించే ఇలాంటి ఆటను వరుసగా రెండు సార్లు ప్రదర్శించడం చూస్తే వారి బౌలింగ్ ఎంత బాగా ఉందో అర్థమవుతుంది. ఆ జట్టుకు వెరీ వెరీ స్పెషల్ లక్ష్మణ్ మెంటార్‌గా ఉండటం ఎంతో మేలు చేస్తోంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ కూడా బెంగళూరుతో 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించగలగడం మరో విశేషం. ఆఖరి ఓవర్లలో అండర్సన్‌తో బౌలింగ్ చేయించిన కోహ్లి నిర్ణయం ఏ మాత్రం అర్థం కాలేదు. టైటిల్ నిలబెట్టుకోవాలంటే ఇక నుంచి ప్రతీ మ్యాచ్ తాము గెలవాల్సి ఉంటుందని ముంబై ఇండియన్స్‌కు బాగా తెలుసు. కెప్టెన్ రోహిత్ శర్మ బాధ్యత తీసుకొని బాగా ఆడాలి. ఎందుకంటే అతను బాగా ఆడిన ఒకే ఒక్క మ్యాచ్‌లోనే ముంబై గెలిచింది. -
సన్‌రైజర్స్ సంచలన విజయం
-
అంపైర్లు అప్రమత్తంగా ఉండాలి: ఐపీఎల్ చైర్మన్
న్యూఢిల్లీ : మైదానంలో అంపైర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా సూచించారు. రాజస్తాన్ రాయల్స్, సన్‌రైజర్స్ మ్యాచ్‌లో ఓవర్లో 7 బంతులు వేయించడం.. ఉప్పల్‌లో చెన్నై-సన్‌రైజర్స్ మ్యాచ్‌లో స్పష్టమైన నోబాల్‌ను ఇవ్వకపోవడంతో అంపైర్ల విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఢిల్లీ డేర్ డెవిల్స్, కింగ్స్ పంజాబ్ మ్యాచ్‌కు హజరైన శుక్లా.. అంపైర్ల తప్పిదాలపై స్పందించారు. ‘ఇలాంటి తప్పిదాలు కొన్ని సార్లు జరుగుతుంటాయి. అంపైర్లు అప్రమత్తంగా వ్యవహరించేలా మ్యాచ్ రిఫరీలు వారితో చర్చించాలని’ పేర్కొన్నారు. ఇలాంటి చిన్న తప్పిదాలు జరగకుండా అంపైర్లు అవసరమైతే టెక్నాలజీ సాయం తీసుకోవాలని మరో ఐపీఎల్ అధికారి అభిప్రాయపడ్డారు. ఎవరు కావాలని తప్పిదాలు చేయరని ఆయన పేర్కొన్నారు. ఇక చెన్నై మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఓటమికి అంపైర్ నిర్ణయమే కారణమని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సన్‌రైజర్స్-రాజస్తాన్ మ్యాచ్‌లో ఘోర తప్పిదం పాండ్యా నాటౌట్..! చిర్రెత్తిన కోహ్లీ ‘అంపైర్ వల్లే సన్‌రైజర్స్ ఓటమి’ -
సెహ్వాగ్ మాటను నిజం చేసిన గేల్..!
మొహాలీ: ఐపీఎల్-2018లో సంచలనాల నమోదుకు సమయం ఆసన్నమైంది. సిక్స్‌లు, పోర్ల వేడుకకు వేళయింది. పరుగుల పండగకు తెర లేచింది. సన్‌రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య గురువారం మొహాలిలో జరిగిన మ్యాచ్‌లో గేల్ తన అద్భుత సెంచరీతో క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించాడు. పటిష్టమైన ఎస్ఆర్హెచ్ బౌలింగ్‌ను చీల్చిచెండాడాడు. 63 బంతుల్లో 104 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి.. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సెంచరీల రికార్డుని (6 సెంచరీలు) తన పేర లిఖించుకున్నాడు. ఐపీఎల్ వేలంలో గేల్ కొనుగోలుపై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించక పోవడంతో నామమాత్రపు ధరకు పంజాబ్ అతన్ని కొనుగోలు చేసింది. అయితే 11 సిక్స్‌లు, ఒక ఫోర్‌తో గేల్ సాగించిన పరుగుల వరద తాను ఎంత విలువైన ఆటగాడినో అని మిగతా ఫ్రాంచైజీలకు తెలియజేసినట్లయింది. గేల్ ధనాధన్ సిక్స్‌లతో ఐఎస్ బింద్రా క్రికెట్ స్టేడియం చిన్నపాటి క్లబ్ గ్రౌండ్లా మారిపోయింది. నేనే రక్షించా.. సెహ్వాగ్ ట్వీట్ మొన్న చెన్నైతో జరిగిన మ్యాచ్‌లోనూ రెచ్చిపోయిన గేల్ 33 బంతుల్లో 4 సిక్స్‌లు, 7 ఫోర్లతో 63 పరుగులు చేసి పంజాబ్‌కు విజయాన్నందించాడు. ఐపీఎల్ వేలంలో చివరగా.. గేల్‌ను నామమాత్రపు ధరకు ప్రీతి జింటా సహ యజమానిగా గల పంజాబ్ జట్టు కొనుగోలు చేసిన అనంతరం ఒక సందర్భంలో ఆ జట్టు కోచ్ వీరేంద్ర సెహ్వాగ్ ‘గేల్ పంజాబ్‌కు రెండు విజయాలు అందించినా చాలు.. అతనిపై పెట్టిన పెట్టుబడికి న్యాయం జరిగినట్లే’ అని వ్యాఖ్యానించడం గమనార్హం. గురువారం ఎస్ఆర్హెచ్పై విజయానంతరం గేల్‌ను వెళ్లిపోకుండా చేసి ఐపీఎల్‌ను తానే రక్షించినట్లు సెహ్వాగ్ ఓ సరదా ట్వీట్ చేయగా.. అవునంటూ గేల్ బదులిచ్చాడు. ఐపీఎల్లో అత్యధిక సెంచరీల రికార్డుతో పాటు ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగుల రికార్డూ గేల్ పేరునే ఉంది. 2013 ఐపీఎల్ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు తరపున బరిలోకి దిగిన గేల్ పూణె వారియర్స్‌పై జరిగిన మ్యాచ్‌లో 175 పరుగుల సునామీని సృష్టించాడు. I saved the IPL by picking - @henrygayle 🤣🤣. — Virender Sehwag (@virendersehwag) 19 April 2018 Yes! https://t.co/avqfCTHfEY — Chris Gayle (@henrygayle) 19 April 2018 -
సన్‌రైజర్స్ ‘హ్యాట్రిక్’
-
సన్‌రైజర్స్ ‘హ్యాట్రిక్’
కోల్‌కతా: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ ఐపీఎల్ సీజన్లో హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళ్తోంది. శనివారం ఇక్కడ జరిగిన లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. క్రిస్ లిన్ (34 బంతుల్లో 49; 7 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేశాడు. భువనేశ్వర్‌కు 3 వికెట్లు దక్కాయి. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 19 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసి గెలిచింది. విలియమ్సన్ (44 బంతుల్లో 50; 4 ఫోర్లు, ఒక సిక్స్) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. కోల్‌కతా బ్యాటింగ్ సమయంలో 7 ఓవర్ల వద్ద వర్షం కురవడంతో ఆటకు అంతరాయం తప్పలేదు. ఒకే ఒక్కడు... లిన్ మొదట బ్యాటింగ్ చేపట్టిన కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాట్స్‌మెన్‌ను హైదరాబాద్ పేసర్లు సమష్టిగా దెబ్బతీశారు. దీంతో ఆరంభం నుంచి ఇన్నింగ్స్ తడబడుతూనే సాగింది. ఓపెనర్ క్రిస్ లిన్ ఒక్కడే బాధ్యతగా ఆడాడు. రాబిన్ ఉతప్ప (3), నరైన్ (9), శుభ్‌మన్ గిల్ (3), శివమ్ మావి (7) ఇలా క్రీజ్‌లోకి ఎవరొచ్చినా... కుదురుగా ఆడేవారే కరువయ్యారు. లిన్‌తో కలిసి కాసేపు నితీశ్ రాణా (16 బంతుల్లో 18; 2 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ దినేశ్ కార్తీక్ (27 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్) కాస్త మెరుగ్గా ఆడారు. ఈ ముగ్గురు మినహా ఇంకెవరూ రెండంకెల స్కోర్లు చేయలేకపోయారు. పేసర్లు భువనేశ్వర్ (3/26), స్టాన్లేక్ (2/21)లతో పాటు ఆల్‌రౌండర్ షకీబుల్ హసన్ (2/21) తన స్పిన్‌తో ప్రత్యర్థి ఇన్నింగ్స్‌ను కట్టడి చేశాడు. విలియమ్సన్ కెప్టెన్ ఇన్నింగ్స్... కష్టసాధ్యం కాని లక్ష్యమే అయినా... ధాటిగా ఆడిన సాహా (15 బంతుల్లో 24; 5 ఫోర్లు)తో పాటు కీలక ఓపెనర్ ధావన్ (7), కుదురుగా ఆడే మనీశ్ పాండే (4)లు తక్కువ స్కోరుకే నిష్క్రమించారు. దీంతో బ్యాటింగ్ భారం పూర్తిగా కెప్టెన్ విలియమ్సన్పైనే పడింది. 55 పరుగులకే టాపార్డర్ వికెట్లను కోల్పోయిన ఈ దశలో విలియమ్సన్, షకీబుల్ హసన్ (21 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్) నాలుగో వికెట్‌కు 59 పరుగులు జోడించి ఇన్నింగ్స్ చక్కదిద్దారు. జట్టు స్కోరు 114 పరుగుల వద్ద షకీబ్, 5 పరుగుల వ్యవధిలో విలియమ్సన్ ఔటైనప్పటికీ మిగతా లాంఛనాన్ని యూసుఫ్ పఠాన్ (7 బంతుల్లో 17 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్), దీపక్ హుడా (5 నాటౌట్) పూర్తి చేశారు. -
సన్‌రైజర్స్ హైదరాబాద్ లక్ష్యం 139
కోల్‌కతా : సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 139 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. సన్‌రైజర్స్ అద్భుత బౌలింగ్‌కు మైమరిపించే ఫీల్డింగ్ తోడవ్వడంతో కోల్‌కతా బ్యాట్స్‌మన్ చతికిలపడ్డారు. క్రిస్‌లిన్, దినేశ్ కార్తీక్,రానా తప్ప అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమవ్వడంతో కోల్‌కతా స్పల్ప స్కోర్‌కే పరిమితమైంది. ఇక టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాకు రాబిన్ ఊతప్ప (3) వికెట్ తీసి భువనేశ్వర్ షాకిచ్చాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన నితీష్ రాణాతో క్రిస్‌లిన్ రెచ్చిపోయాడు. దీంతో 7 ఓవర్లకు కోల్‌కతా 52 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం మ్యాచ్‌కు అంతరాయం కలిగించింది. పాండే ఫీల్డింగ్ అదుర్స్.. వర్షం తగ్గిన అనంతరం ఎలాంటి ఓవర్లు కుదించకుండా అంపైర్లు మ్యాచ్‌ను కొనసాగించారు. మ్యాచ్ పునఃప్రారంభమైన నాలుగు బంతులకే కోల్‌కతా స్టార్ బ్యాట్స్‌మన్ నితీష్ రాణాను పాండే అద్భుత క్యాచ్‌తో పెవిలియన్ చేర్చాడు. ఈ మ్యాచ్‌లో అనూహ్యంగా సెకండ్ డౌన్లో బ్యాటింగ్‌కు దిగిన సునీల్ నరైన్(9) నిరాశ పరిచాడు. ఆ వెంటనే క్రిస్‌లిన్49( 34 బంతులు,7 ఫోర్లు,1 సిక్సు) క్యాచ్ ఔటవ్వగా.. ఆండ్రూ రస్సెల్‌ను పాండే మరోమారు మైమరిపించే ఫీల్డింగ్‌తో పెవిలియన్‌కు పంపించాడు. నిరాశ పరిచిన అండర్-19 స్టార్స్ ఇక దినేశ్ కార్తీక్ ఆచితూచి ఆడే ప్రయత్నం చేయగా.. యువ ఆటగాడు అండర్-19 సూపర్ హీరో శుభ్‌మన్ గిల్(3) తీవ్రంగా నిరాశపరిచాడు. చివర్లో దినేశ్ కార్తీక్ 29(27 బంతుల్లో 2 ఫోర్లు,1 సిక్సు) క్యాచ్ ఔట్‌గా వెనుదిరగగా.. చివరి బంతికి మరో అండర్-19 ఆటగాడు శివం మావి (7) క్యాచ్ ఔటవ్వడంతో కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 138 పరుగులు మాత్రమే చేయగలిగింది. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్‌కు మూడు, స్టాన్లేక్, షకీబ్ అల్ హసన్‌లకు రెండు, సిద్దార్థ్ కౌల్‌కు ఒక వికెట్ దక్కింది. -
చాలా కష్టంగా ఉంది: రోహిత్ శర్మ
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11 సీజన్లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమి చెందడం పట్ల ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు. ప్రధానంగా ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలుపు దగ్గరగా వచ్చి పరాజయం చెందడాన్ని జీర్ణించుకోవడం చాలా కఠినంగా ఉందన్నాడు. ఈ క్రమంలోనే తమ బ్యాటింగ్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన రోహిత్.. కనీసం పోరాడే స్కోరును ఉంచలేకపోయామన్నాడు. ‘వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ మమ్మల్ని గెలుపు ఊరించినట్లే ఊరించి దూరమైంది. ఇది చాలా నిరాశపరిచింది. మేము మంచి స్కోరు సాధించలేకపోయాం. దాంతోనే పోరాడి ఓడిపోయాం. ఇంకొన్ని పరుగులు చేసి ఉంటే ఫలితం మరొకలా ఉండేది. మా బ్యాట్స్‌మెన్ ఇంకా బాగా ఆడాల్సింది. బ్యాట్స్‌మెన్ వైఫల్యమే మా కొంప ముంచింది. ఇక బౌలర్లు ఆద్యంత ఆకట్టుకున్నారు. సాధారణ స్కోరును కూడా రక్షించడానికి తీవ్రంగా శ్రమించారు. ఒక దశలో గేమ్‌ను మా చేతుల్లోకి తీసుకొచ్చారు. కానీ అదృష్టం కలిసిరాలేదు. చివరి వరకూ పోరాడినా ఓటమితోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పరాజయం బాధించినా.. యువ క్రికెటర్లు ఆకట్టుకున్న తీరు బాగుంది’అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. గురువారం సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌వికెట్ తేడాతో ఓటమి పాలైంది. ఆఖరి బంతికి సన్‌రైజర్స్ విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది. దాంతో సన్‌రైజర్స్ వరుసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకోగా, ముంబై ఇండియన్స్ రెండో ఓటమిని ఎదుర్కొంది. ఐపీఎల్ ఆరంభపు మ్యాచ్‌లో చెన్నైపై ముంబై పరాజయం పాలైంది. -
క్రికెటర్ రషీద్.. పెద్ద మనసు
సాక్షి, హైదరాబాద్ : ఐపీఎల్ 11లో భాగంగా గురువారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠపోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ వికెట్ తేడాతో విజయం సాధించింది. అత్యుత్తమంగా బౌలింగ్ చేసిన సన్‌రైజర్స్ బౌలర్ రషీద్ ఖాన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన రషీద్ 13 పరుగులు మాత్ర మే ఇచ్చి ఒక వికెట్ తీయడం విశేషం. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సందర్భంగా రషీద్ మాట్లాడుతూ.. అఫ్గానిస్తాన్ ఆటగాళ్లు ఐపీఎల్లో ఆడుతున్నారు. వారు ఏ లీగ్‌లో ఆడినా మద్దతిస్తున్న అందరికీ ధన్యవాదాలు. నా ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ను ఆస్పత్రిలో ఉన్న స్నేహితుడికి, అతడి కుమారుడికి అంకితం ఇస్తున్నాను. ఆస్పత్రి ఖర్చుల నిమిత్తం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ నగదు ఇచ్చేస్తాను. అఫ్గాన్ క్రికెటర్లం నబీ, ముజీబ్, నేను శక్తివంచన లేకుండా జట్టు విజయాల కోసం పోరాటం చేస్తాం. ఎంతగానో ఇష్టపడే ఆటలో విజయం కోసం పోరాడటం మాకు ఎంతో ఆనందంగా ఉంటుందని’ వివరించాడు. రషీద్ మంచి క్రికెటరే కాదు.. మంచి మనసున్న వ్యక్తి అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. -
హైదరాబాద్‌కు వరుసగా రెండో విజయం
-
రైజర్స్ ఆఖరి బంతికి...
పరుగులు కావాలి... చేతిలో వికెట్ మాత్రమే ఉంది. బెన్ కటింగ్ వేసిన ఓవర్ తొలి బంతికే హుడా సిక్సర్ బాది సులువుగా ముగించేలా కనిపించినా... తర్వాతి నాలుగు బంతుల్లో నాలుగు పరుగులే వచ్చాయి. స్కోర్లు సమమైన దశలో ఆఖరి బంతిని స్టాన్లేక్ ఫోర్ కొట్టడంతో హైదరాబాద్ ఊపిరి పీల్చుకుంది. సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్‌ను పీకల మీదకు తెచ్చుకొని చివరకు గట్టెక్కింది. సాధారణ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఒక దశలో సన్‌రైజర్స్ స్కోరు 62/0... అయితే కొత్త లెగ్‌స్పిన్ సంచలనం మయాంక్ మార్కండే అద్భుత బౌలింగ్‌తో సీన్ మారిపోయింది. ఫలితంగా తర్వాతి 38 బంతుల్లో వచ్చింది 39 పరుగులే... కోల్పోయింది 5 వికెట్లు. ఈ స్థితిలో సన్‌రైజర్స్ తీవ్ర ఒత్తిడికి లోనై మరో నాలుగు వికెట్లు కోల్పోయింది. ఎట్టకేలకు అతి కష్టమ్మీద హైదరాబాద్ విజయతీరం చేరింది. అంతకుముందు రషీద్ సహా ఇతర సన్ బౌలర్ల దెబ్బకు ముంబై బ్యాట్స్‌మెన్ చేతులెత్తేసి వరుసగా రెండో ఓటమికి బాటలు వేశారు. సాక్షి, హైదరాబాద్: సొంతగడ్డపై సన్‌రైజర్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. గురువారం ఉప్పల్ స్టేడియంలో చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో రైజర్స్ వికెట్ తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఎవిన్ లూయీస్ (17 బంతుల్లో 29; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), పొలార్డ్ (23 బంతుల్లో 28; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (31 బంతుల్లో 28; 2 ఫోర్లు, 1 సిక్స్) జట్టు స్కోరులో తలో చేయి వేశారు. సందీప్, కౌల్, స్టాన్లేక్ తలా 2 వికెట్లు పడగొట్టగా... ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రషీద్ ఖాన్ 4 ఓవర్లలో 13 పరుగులు మాత్ర మే ఇచ్చి ఒక వికెట్ తీయడం విశేషం. అనం è రం సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. ధావన్ (28 బంతుల్లో 45; 8 ఫోర్లు) మరోసారి టాప్ స్కోరర్‌గా నిలవగా... దీపక్ హుడా (25 బంతుల్లో 32 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. మయాంక్ మార్కండే 23 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. శనివారం కోల్‌కతాలో జరిగే తమ తర్వాతి మ్యాచ్‌లో నైట్‌రైడర్స్‌తో సన్‌రైజర్స్ తలపడుతుంది. రషీద్ సూపర్... స్టార్ బౌలర్ భువనేశ్వర్ లేకపోయినా సన్‌రైజర్స్ బౌలింగ్‌లో పదును తగ్గలేదు. ఆరంభ ఓవర్లలోనే ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసి పరుగులు ఇవ్వకుండా నిరోధించడంలో వారు సఫలమయ్యారు. ఫలితంగా పవర్‌ప్లే ముగిసేసరికి ముంబై 54 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది. సున్నా వద్ద హుడా క్యాచ్ వదిలేసిన తర్వాత ఒక సిక్స్, ఫోర్ కొట్టి రోహిత్ శర్మ (11) అవుటవ్వగా... లూయీస్ మాత్రం ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. సందీప్ బౌలింగ్‌లో సిక్సర్‌తో ఐపీఎల్లో ఖాతా తెరిచిన అతను స్టాన్లేక్ ఓవర్లో 2 ఫోర్లు, 1 సిక్సర్‌తో చెలరేగాడు. అయితే ఒకే ఓవర్లో ఇషాన్, లూయిస్‌లను అవుట్ చేసి కౌల్ ముంబైని దెబ్బకొట్టాడు. పొలార్డ్, సూర్య కుమార్ ఐదో వికెట్‌కు 38 పరుగులు జోడిం చినా అందుకు 36 బంతులు తీసుకున్నారు. స్టాన్లేక్ ఓవర్లో సిక్స్, ఫోర్ కొట్టి అదే ఓవర్లో పొలార్డ్ వికెట్ చేజార్చుకోగా, సూర్యకుమార్ ఆటను సందీప్ ముగించాడు. చివరి ఐదు ఓవర్లలో ముంబై 36 పరుగులే చేసింది. జట్టు ఇన్నింగ్స్‌లో ఏకంగా 62 డాట్ బాల్స్ ఉండగా... రషీద్ ఒక్కడే 18 డాట్ బాల్స్ వేయడం విశేషం. ధనాధన్‌గా... స్వల్ప లక్ష్య ఛేదనను సన్‌రైజర్స్ జోరుగా ప్రారంభించింది. ధావన్ దూకుడు ప్రదర్శించగా... గత మ్యాచ్ లో విఫలమైన సాహా (20 బంతుల్లో 22; 3 ఫోర్లు) ఈసారి కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. పవర్‌ప్లే ముగిసే సరికి స్కోరు 56 పరుగులకు చేరింది. అయి తే మార్కండే చక్కటి గుగ్లీతో సాహాను బోల్తా కొట్టిం చడంతో సన్ తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం ముస్తఫిజుర్ తన తొలి ఓవర్లోనే విలియమ్సన్ (6)ను వెనక్కి పంపాడు. ఆ వెంటనే ధావన్‌ను కూడా అవుట్ చేసి మర్కండే ముంబై జట్టులో ఆశలు రేపాడు. తన తర్వాతి ఓవర్లో మనీశ్ పాండే (11)ను కూడా అతను అవుట్ చేయడంతో రైజర్స్ కష్టాల్లో పడింది. మర్కండే తన ఆఖరి ఓవర్లో షకీబ్ (12)ను బౌల్డ్ చేసి హైదరాబాద్‌ను దెబ్బ తీశాడు. ఆ తర్వాత హుడా, యూసుఫ్ పఠాన్ (14) భాగస్వామ్యం చివరకు జట్టును గెలుపునకు చేరువ చేసినా గెలుపు కోసం కొన్ని ఉత్కంఠ క్షణాలను అధిగమించక తప్పలేదు. -
సన్‌రైజర్స్ జెర్సీ... విడుదల...
-
ఎంపైర్ కునుకు.. మ్యాచ్‌లో పెద్ద పొరపాటు!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో తరచూగా ఎంపైరింగ్ పొరపాట్లు, తప్పిదాలు దర్శనమిస్తున్నాయి. కానీ, తాజాగా బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్- ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఎంపైర్లు కునుకుపాట్లు పడుతూ.. పెద్ద తప్పిదానికే కారణమయ్యారు. మ్యాచ్ ఆరో ఓవర్లో ఎంపైర్లు కునుకుతీస్తూ నిబంధనలను గాలికి వదిలేశారు. దీంతో సన్‌రైజర్స్ కెప్టెన్, ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ ఆరో ఓవర్ చివరి బంతిని ఎదుర్కోవడమే కాకుండా.. ఏడో ఓవర్ మొదటి బంతిని సైతం ఆడాడు. క్రికెట్ నిబంధనల ప్రకారం ఓవర్ ముగిస్తే స్ట్రైకింగ్ మారాల్సి ఉంటుంది. కానీ ఎంపైర్ల అలసత్వం వల్ల ఈ తప్పిదం జరిగింది. శిఖర్ ధావన్‌తో కలిసి వార్నర్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో జస్ప్రీత్ బుమ్రా ఆరో ఓవర్ వేశాడు. ఆరో ఓవర్ చివరి బంతిని వార్నర్ ఫోర్‌గా మలిచాడు. దీంతో నిబంధనల ప్రకారం నాన్ స్ట్రైకింగ్‌లో ఉన్న ధావన్ స్థానం మార్చుకొని ఏడో ఓవర్ తొలి బంతిని ఎదుర్కోవాలి. కానీ, ఎంపైర్లు ఆ విషయాన్ని పట్టించుకోకపోవడంతో వార్నరే ముంబై బౌలర్ మెక్లీనగన్ వేసిన ఏడో ఓవర్ తొలి బంతిని ఎదుర్కొని ఒక సింగిల్ కూడా తీశాడు. అయినా, ఎంపైర్లు ఈ విషయాన్ని పట్టించుకోకపోవడంతో మ్యాచ్ అలా సాగిపోయింది. నిజానికి క్రికెట్ మ్యాచ్‌లలో ఎంపైర్లు తప్పిదాలు సాధారణంగా జరుగుతూ ఉంటాయి. బౌలర్ వేసిన బంతులను తప్పుగా లెక్కబెట్టడం, ఒక్కోసారి బౌలర్‌తో అధిక బంతులు వేయించడం లాంటి పొరపాట్లు ఎంపైర్లు చేస్తుంటారు. కానీ ఓవర్ ముగిసిన తర్వాత నిబంధనల ప్రకారం జరగాల్సిన లీగల్ క్రాసింగ్ ఓవర్‌ను పట్టించుకోకపోవడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది. సరే! ఈ వ్యవహారంలో ఎంపైర్లు ఒకవేళ కునుకు తీశారే అనుకుందా.. కానీ వార్నర్, ఆయన బ్యాటింగ్ సహచరుడు ధావన్‌లు ఏం చేస్తున్నారు? వారు సైతం ఓవర్ ముగిసిన విషయాన్ని పట్టించుకోకుండా ఆటలో లీనమయ్యారా? లేక అలసత్వమా? అన్నది విస్మయం కలిగిస్తోంది. -
నేటి నుంచి చాంపియన్స్ లీగ్
-
నేటి నుంచి చాంపియన్స్ లీగ్
మొహాలీ: చాలా కాలంగా అసలు సిసలు క్రికెట్ మజా లేక మొహం వాచిపోయి ఉన్న అభిమానులను అలరించేందుకు ఇప్పుడు టి20 పండగొచ్చింది. స్టార్ క్రికెటర్లు అనేక మంది పాల్గొంటున్న చాంపియన్స్ లీగ్ టోర్నీ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్లో భాగంగా మంగళ, బుధ, శుక్రవారాల్లో ఆరు క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ నెల 21 నుంచి ప్రధాన మ్యాచ్‌లు ప్రారంభం అవుతాయి. తొలి మ్యాచ్‌లో ఐపీఎల్-6 చాంపియన్ ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్‌తో తలపడుతుంది. 6 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 38 కోట్లు) ప్రైజ్‌మనీ గల ఈ టోర్నీలో మొత్తం 29 మ్యాచ్‌లు జరుగుతాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పాటు ఫైసలాబాద్ వోల్వ్స్, ఒటాగో ఓల్ట్స్, కందురతా మారూన్స్ అర్హత మ్యాచుల్లో తలపడుతున్నాయి. ఇందులో అగ్ర స్థానంలో నిలిచిన రెండు జట్లు మెయిన్ డ్రాకు క్వాలిఫై అవుతాయి. క్వాలిఫయింగ్ జట్ల బలాబలాలు హైదరాబాద్ సన్‌రైజర్స్: టెస్టు క్రికెట్లో తుఫాన్ సెంచరీతో అరంగేట్రం చేసిన మైదానంలోనే ఇప్పుడు శిఖర్ ధావన్ కెప్టెన్‌గా తన సత్తా నిరూపించుకునేందుకు సిద్ధమయ్యాడు. కెప్టెన్ ధావన్‌తో పాటు కామెరాన్ వైట్, జేపీ డుమిని రైజర్స్ బ్యాటింగ్‌కు మూలస్థంభాలు. కీపర్ పార్థివ్, విహారి కూడా బ్యాటింగ్‌లో కీలకం. బౌలింగ్‌లో మాత్రం రైజర్స్ ఎప్పటిలాగే పటిష్టంగా కనిపిస్తోంది. స్టెయిన్, ఇషాంత్‌ల వేగంతో పాటు అమిత్ మిశ్రా, కరణ్ శర్మలు ప్రత్యర్థిని నిలువరించగలరు. ఆల్‌రౌండర్లు తిసార పెరీరా, స్యామీ, ఆశిష్ రెడ్డి రెండు విభాగాల్లోనూ అండగా నిలిస్తే రైజర్స్‌కు తిరుగుండదు. ఫైసలాబాద్ వోల్వ్స్: సరిహద్దు వివాదం, వీసా సమస్యల కారణంగా ఆఖరి నిమిషం వరకు కూడా లీగ్‌లో పాల్గొనడం ఖరారు కాని ఈ జట్టుకు ఎట్టకేలకు భారత్‌లో ఆడే అవకాశం దక్కింది. పటిష్టమైన జట్టు కాకపోయినా, సంచలనాలు సృష్టించే సత్తా ఉంది. అక్కడి బలమైన జట్లపై గెలుపుతో పాక్ దేశవాళీ టోర్నీ సూపర్ ఎయిట్ టి20 టోర్నీ విజేతగా నిలిచి ఈ లీగ్‌లో పాల్గొనే అవకాశం దక్కించుకుంది. మిస్బావుల్ నాయకత్వంతో పాటు సయీద్ అజ్మల్ జట్టుకు ప్రధాన బలం. ఆసిఫ్ అలీ జట్టులో కీలక బ్యాట్స్‌మన్. గత ఏడాదినుంచి పాక్‌నుంచి సీఎల్‌టి20 ఆడిన సియాల్కోట్ కంటే మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని ఫైసలాబాద్ పట్టుదలగా ఉంది. ఒటాగో వోల్ట్స్: కివీస్ దేశవాళీ హెచ్ఆర్వీ కప్ విజేత. అక్కడి టోర్నీలో భారీ స్కోర్లతో వరుసగా 10 మ్యాచ్‌లు నెగ్గి టైటిల్ సొంతం చేసుకుంది. తొలి చాంపియన్స్ లీగ్‌లో ఆడిన అనుభవం ఉంది. అయితే అప్పుడు ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడింది. ఇటీవలే శ్రీలంకలో నాలుగు టి20 మ్యాచ్‌లు ఆడి ఈ టోర్నీకి సిద్ధమైంది. రెండు రోజుల క్రితం మొహాలీలో ఆడిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఏకంగా 258 పరుగులు చేసింది. స్టార్ బ్యాట్స్‌మన్ బ్రెండన్ మెకల్లమ్ ప్రధాన బలం కాగా, అద్భుత ఫామ్‌లో ఉన్న ర్యాన్ టెన్ డస్కటే మరో కీలక ఆటగాడు. కందురతా మారూన్స్: చాంపియన్స్ లీగ్‌లో తొలిసారి బరిలోకి దిగుతోంది. శ్రీలంక ప్రీమియర్ లీగ్ రద్దు కావడంతో అక్కడి బోర్డు హడావిడిగా సూపర్ ఫోర్స్ టోర్నీ నిర్వహించగా...అందులో మారూన్స్ విజేతగా నిలిచింది. జట్టులో సగం మంది ఆటగాళ్లు అంతర్జాతీయ స్థాయిలో శ్రీలంకకు ప్రాతినిధ్యం వహించినవారు ఉన్నారు. టి20ల్లో జట్టు సభ్యుల ఇటీవలి ప్రదర్శన చూస్తే ఈ టీమ్‌ను పటిష్టమైనదిగానే చెప్పవచ్చు. సీనియర్ ప్లేయర్ సంగక్కర రైజర్స్‌ను కాదని సొంత దేశపు జట్టుకు ఆడుతుండటం కందురతా బలాన్ని పెంచింది. బౌలింగ్‌లో మెండిస్ కీలక ఆటగాడు. చాంపియన్స్ లీగ్‌లో నేడు క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు ఫైసలాబాద్ వోల్వ్స్ ్ఠ ఒటాగో వోల్ట్స్ సాయంత్రం గం. 4.00 నుంచి హైదరాబాద్ సన్‌రైజర్స్ ్ఠ కందురతా మారూన్స్ రాత్రి గం. 8.00 నుంచి స్టార్ క్రికెట్, స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం