IPL 2022: Sunrisers Hyderabad Announce New Coaching Staff - Sakshi
Sakshi News home page

IPL 2022- SRH: సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌ కోచ్‌గా బ్రియన్‌ లారా.. కొత్త సిబ్బంది వీళ్లే.. పరిచయం చేసిన ఫ్రాంఛైజీ

Published Thu, Dec 23 2021 1:36 PM | Last Updated on Thu, Dec 23 2021 6:00 PM

IPL 2022: SRH Appoint Brian Lara As Batting Coach Introduce New Staff Details - Sakshi

PC: SRH

ఐపీఎల్‌-2022 నేపథ్యంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కీలక నిర్ణయం తీసుకుంది. వెస్టిండీస్‌ దిగ్గజం బ్రియన్‌ లారాను బ్యాటింగ్‌ కోచ్‌గా నియమించుకుంది. అదే విధంగా ఆర్సీబీ మాజీ హెడ్‌ కోచ్‌ సైమన్‌ కటిచ్‌ను అసిస్టెంట్‌ కోచ్‌గా ఎంపిక చేసినట్లు వెల్లడించింది. ఈ మేరకు తమ ఫ్రాంఛైజీకి సంబంధించిన కొత్త సిబ్బంది వివరాలను ట్విటర్‌ వేదికగా వీడియో రూపంలో వెల్లడించింది. 

ఇక ఎస్‌ఆర్‌హెచ్‌కు తొలి టైటిల్‌ అందించిన హెడ్‌కోచ్‌ టామ్‌ మూడీని కొనసాగిస్తున్నట్లు తెలిపింది. అదే విధంగా శ్రీలంక స్పిన్‌ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌ కూడా తమతో ప్రయాణం కొనసాగిస్తారని పేర్కొంది. అదే విధంగా ప్రొటిస్‌ లెజండ్‌ డేల్‌ స్టెయిన్‌ను ఫాస్ట్‌ బౌలింగ్‌ కోచ్‌గా నియమించుకున్నట్లు సన్‌రైజర్స్‌ యాజమాన్యం తెలిపింది.

ఐపీఎల్‌ -2022: సన్‌రైజర్స్‌ సిబ్బంది


హెడ్‌కోచ్‌- టామ్‌ మూడీ


అసిస్టెంట్‌ కోచ్‌- సైమన్‌ కటిచ్‌


బ్యాటింగ్‌ కోచ్‌- బ్రియన్‌ లారా


ఫాస్ట్‌ బౌలింగ్‌ కోచ్‌- డేల్‌ స్టెయిన్‌


స్పిన్‌ బౌలింగ్‌ కోచ్‌- ముత్తయ్య మురళీధరన్‌


ఫీల్డింగ్‌ కోచ్‌, స్కౌట్‌- హేమంగ్‌ బదాని

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement