IPL 2022: Washington Sundar Injured His Right Hand Against CSK, Likely To Miss IPL Season - Sakshi
Sakshi News home page

IPL 2022: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ షాక్‌.. కీలక ఆటగాడు దూరం..!

Published Mon, May 2 2022 2:07 PM | Last Updated on Mon, May 2 2022 4:14 PM

Washington Sundar injured his right hand again against CSK - Sakshi

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు(PC: IPL/BCCI)

వరుస ఓటముల బాధలో ఉన్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు భారీ షాక్‌ తగిలింది. సన్‌రైజర్స్‌ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ గాయం కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వాషింగ్టన్‌ సుందర్‌ కుడి చేతికి గాయమైంది. దీంతో ఈ మ్యాచ్‌లో సుందర్‌ ఒక్క ఓవర్‌ కూడా బౌలింగ్‌ చేయకుండా ఫీల్డ్‌ను విడిచి వెళ్లాడు. ఇక ఇదే విషయాన్ని ఎస్‌ఆర్‌హెచ్‌ హెడ్‌కోచ్‌ టామ్‌ మూడీ ధృవీకరించాడు.

కాగా అంతకుముందు ఈ సీజన్‌లో చేతి వేలు గాయం కారణంగా సుందర్‌ మూడు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. మళ్లీ గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సుందర్‌ తిరిగి వచ్చాడు. "దురదృష్టవశాత్తూ.. మళ్లీ సుందర్‌ కుడి చేతికి గాయమైంది. అతడు ప్రస్తుతం బౌలింగ్‌ చేసే స్థితిలో లేడు. అయితే అతడికి బ్యాండేజ్‌ వేసే అంత గాయం కాలేదు. మా తదపరి మ్యాచ్‌కు అతడు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒక వేళ అతడు దూరమైతే.. అది మా జట్టుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎందుకంటే అతడు మా జట్టులో కీలక బౌలర్‌లలో ఒకడని" టామ్‌ మూడీ పేర్కొన్నాడు.

చదవండి: MS Dhoni: జడేజాకు ముందే తెలుసు.. అయినా ప్రతీదీ విడమరిచి చెప్పలేం కదా! ధోని ఘాటు వ్యాఖ్యలు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement