Washington Sundar
-
కొత్తింట్లో అడుగుపెట్టిన వాషింగ్టన్ సుందర్.. గృహ ప్రవేశం (ఫొటోలు)
-
Ind vs Ban: ‘నీకు తుదిజట్టులో చోటు లేదు.. అతడినే ఆడిస్తాం’
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో టీమిండియా ప్రయాణం గురువారం మొదలుకానుంది. ఈ ఐసీసీ టోర్నమెంట్ ఆరంభ మ్యాచ్‌లో రోహిత్ సేన తొలుత దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో తలపడనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఆరంభమయ్యే ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్, జియోహాట్‌స్టార్‌లో వీక్షించవచ్చు.గంభీర్‌తో జడ్డూ వాదన!ఇక తొలి మ్యాచ్‌లో భారత తుదిజట్టు ఎలా ఉంటుందన్న అంశంపై క్రికెట్ వర్గాల్లో ఆసక్తినెలకొంది. ఏకంగా ఐదుగురు స్పిన్నర్లను సెలక్ట్ చేసిన భారత జట్టు యాజమాన్యం ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎవరికి చోటు ఇస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రాక్టీస్ సెషన్లో భాగంగా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) హెడ్‌కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir)తో చర్చిస్తున్నట్లు కనిపించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.ఈ క్రమంలో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో జడ్డూకు గౌతీ తుదిజట్టులో స్థానం ఇవ్వడం లేదని.. తనకు ఇష్టమైన వాషింగ్టన్ సుందర్‌ను ఆడిస్తాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మాజీ కోచ్ మైక్ హసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.నీకు తుదిజట్టులో చోటు లేదు.. అతడినే ఆడిస్తాం‘‘జడేజా ఈరోజు మ్యాచ్ ఆడటం లేదు. అతడి బాడీలాంగ్వేజ్ చూస్తే ఇలాగే అనిపిస్తోంది. ‘నా నిర్ణయం ఇదే. నేను ఫిక్సైపోయాను. నువ్వు నా నిర్ణయంతో అంగీకరించకపోవచ్చు. అయినా మరేం పర్లేదు. థాంక్స్.. తదుపరి మ్యాచ్‌లో నువ్వే ఆడతావు. కానీ ఇప్పుడు మాత్రం మేము ఆఫ్ స్పిన్నర్‌తో బరిలోకి దిగుతాం’ అని గంభీర్ జడేజాకు చెప్పి ఉంటాడు’’ అని మైక్ హసన్ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.వాళ్లిద్దరికి జట్టులో చోటుఅయితే, టీమిండియా మాజీ క్రికెటర్ పీయూశ్ చావ్లా మాత్రం.. ‘‘బంగ్లాదేశ్ తుదిజట్టులో ఎక్కువ మంది ఎడమచేతి వాటం బ్యాటర్లు ఉన్నారు. గత కొద్ది రోజులుగా జడేజా, అక్షర్ మంచి ఫామ్‌లో ఉన్నారు. కాబట్టి వాళ్లిద్దరికి జట్టులో చోటు ఉంటుంది’’ అని అభిప్రాయపడ్డాడు. కాగా బంగ్లా జట్టులో తాంజిద్ హసన్, సౌమ్య సర్కార్‌తో కెప్టెన్ నజ్ముల్ హుసేన్ షాంటో కూడా లెఫ్టాండర్ బ్యాటర్లేనన్న విషయం తెలిసిందే.ఇక చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌కు ఎంపిక చేసిన జట్టులో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఐదుగురు స్పిన్నర్లకు చోటిచ్చింది. ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్(ఇద్దరూ లెఫ్టార్మ్ స్పిన్నర్లే), వాషింగ్టన్ సుందర్(రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్)లతో పాటు చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్(లెఫ్టార్మ్ రిస్ట్ స్పిన్), మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి(రైటార్మ్ లెగ్ బ్రేక్)లను ఎంపిక చేసింది. చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొనే భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.చదవండి: CT 2025: అదొక చెత్త నిర్ణయం.. అతడి వల్లే ఇదంతా: మాజీ క్రికెటర్ ఫైర్ -
మా జట్టులో ఇద్దరు స్పిన్నర్లే ఉన్నారు: రోహిత్ శర్మ కౌంటర్
మెగా క్రికెట్ పోరుకు టీమిండియా సిద్ధమైంది. దుబాయ్ వేదికగా గురువారం చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) బరిలో దిగనుంది. తొలి పోరులో రోహిత్ సేన బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఈ క్రమంలో శనివారమే దుబాయ్(Dubai)కు చేరుకున్న భారత జట్టు నెట్స్‌లో తీవ్రంగా శ్రమించింది. లీగ్ దశలో మూడు మ్యాచ్‌లు కీలకమే కాబట్టి విజయంతో టోర్నమెంట్‌ను మొదలుపెట్టాలనే పట్టుదలతో ఉంది.మా జట్టులో ఇద్దరు స్పిన్నర్లే ఉన్నారుఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) జట్టు ఎంపిక తీరుపై వస్తున్న విమర్శలపై స్పందించాడు. ‘‘చాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టులో ఐదుగురు స్పిన్నర్లను ఎంపిక చేయడంపై తీవ్ర చర్చ సాగుతోంది. అయితే మా జట్టులో ఇద్దరు స్పిన్నర్లను మాత్రమే ఎంపిక చేశాం. మరో ముగ్గురు బ్యాటింగ్ చేయగల ఆల్‌రౌండర్లు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ చేయగల ప్లేయర్లు జట్టుకు అవసరం. ఈ ముగ్గురు జట్టుకు వైవిధ్యాన్ని అందిస్తారు. అయినా మేం మా బలాన్ని బట్టి ఆటగాళ్లను ఎంచుకుంటాం. జడేజా, అక్షర్, వాషీ జట్టులో ఉంటే మాకు భిన్న రకాల ప్రణాళికలతో ముందుకు వెళ్లేందుకు ఆస్కారం ఉంటుంది. మాకు బ్యాటింగ్, బౌలింగ్ చేయగల ఆటగాళ్ల అవసరం ఉంది.టీమిండియా గురించి మాట్లాడేవారు ఇతర జట్లలో ముగ్గురు పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు ఉంటే.. వారి వద్ద ఆరుగురు పేసర్లు ఉన్నారేంటి అని అడగరు’’ అంటూ రోహిత్ శర్మ విమర్శకులకు కౌంటర్ ఇచ్చాడు. ఈ సందర్భంగా చాంపియన్స్ ట్రోఫీ గెలవడమే తమ ప్రధాన లక్ష్యం అని పేర్కొన్న హిట్‌మ్యాన్.. ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌పైనే తమ దృష్టి మొత్తం కేంద్రీకృతమై ఉందని తెలిపాడు.కొత్తగా వరుణ్ చక్రవర్తికాగా చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఎంపిక చేసిన పదిహేను మంది సభ్యుల భారత జట్టులో స్పిన్ దళానికి ప్రాధాన్యం దక్కింది. ప్రాథమిక జట్టులో ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌తో పాటు చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మాత్రమే ఉన్నాడు. అయితే, ఫైనల్ టీమ్‌ను ఖరారు చేసే సమయంలో బీసీసీఐ సెలక్టర్లు ఓపెనింగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్‌పై వేటు వేసి అతడి స్థానంలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని తీసుకువచ్చారు. ఫలితంగా జట్టులో ఏకంగా ఐదుగురు స్పిన్నర్లకు చోటు దక్కినట్లయింది.ఈ నేపథ్యంలో భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్, మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ సహా పలువురు మాజీ క్రికెటర్లు సెలక్టర్ల తీరును విమర్శించారు. మెగా టోర్నీకి ఏకంగా ఐదుగురు స్పిన్నర్లను ఎంపిక చేయడం వల్ల తుదిజట్టు కూర్పు దెబ్బతినే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో రోహిత్ శర్మ పైవిధంగా స్పందించాడు.ఇదిలా ఉంటే.. గ్రూప్-‘ఎ’ పోటీలో భాగంగా గురువారం తమ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనున్న టీమిండియా.. తదుపరి ఫిబ్రవరి 23న దాయాది పాకిస్తాన్‌ను ఢీకొట్టనుంది. అనంతరం లీగ్ దశలో ఆఖరిగా న్యూజిలాండ్‌తో మార్చి 2న మ్యాచ్ ఆడనుంది. ఇక ఈ టోర్నీలో గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ పోటీపడుతున్నాయి. కాగా మెగా ఈవెంట్లో తొలి మ్యాచ్‌లో ఆతిథ్య పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడింది.చాంపియన్స్ ట్రోఫీ-2025కి భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.చదవండి: CT 2025: షెడ్యూల్, జట్లు, మ్యాచ్ ఆరంభ సమయం.. లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు -
వన్డే జట్టులోకి వచ్చేశాడు.. కానీ ఆ విషయంలో కష్టమే!
ఇంగ్లండ్‌తో గురువారం నాగ్‌పూర్‌లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్(India vs England) కోసం సంసిద్ధమవుతున్న భారత జట్టుతో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి(Varun Chakravarthy) కూడా చేరడం ఆశించిన పరిణామమే. చక్రవర్తి వన్డే జట్టులోకి చేరడంపై భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తాజాగా అధికారిక ప్రకటన చేసింది. ఈ క్రమంలో.. మరి కొద్దీ రోజుల్లో పాకిస్తాన్-దుబాయ్‌లలో ప్రారంభం కానున్న చాంపియన్స్ ట్రోఫీ తుది జట్టులో 33 ఏళ్ల వరుణ్ చక్రవర్తిని కూడా చేర్చే అవకాశం ఉన్నట్టు స్పష్టం అవుతోంది. అరంగేట్రం ఖాయమేఇక ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో వరుణ్ రాణించిన విషయం తెలిసిందే. వరుణ్ వన్డే టోర్నమెంట్లో కూడా అరంగేట్రం చేయడం ఖాయమనిపిస్తోంది. మంగళవారం విదర్భ క్రికెట్ స్టేడియం లో వరుణ్ ఒక గంటకు పైగా బౌలింగ్ చేస్తూ కనిపించాడు.ఇంగ్లండ్‌పై 4-1 తేడాతో గెలిచిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో చక్రవర్తి భారత బౌలర్లలో ప్రధాన ఆకర్షణ అయ్యాడు. కర్ణాటకకు చెందిన ఈ స్పిన్నర్ ఏకంగా 14 వికెట్లు పడగొట్టాడు. ఇటీవల ముగిసిన దేశవాళీ 50 ఓవర్ల విజయ్ హజారే ట్రోఫీ టోర్నమెంట్లో కూడా బాగా రాణించిన స్పిన్నర్లలో చక్రవర్తి మొదటి స్థానాన్ని ఆక్రమించాడు. వరుణ్ ఈ టోర్నమెంట్లో 12.16 సగటుతో మొత్తం 18 వికెట్లు పడగొట్టాడు.అయితే వరుణ్ ఎవరి స్థానంలో భారత్ జట్టులో వస్తాడన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రకటించిన ముందస్తు జట్టులో రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్‌లతో కలిపి నలుగురు స్పిన్నర్లు ఉన్నారు. అయితే వీరిలో ఎవరి స్థానంలో వరుణ్ జట్టులోకి వస్తాడన్నది ఆసక్తికర అంశం. ఫిబ్రవరి 12లోగా ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ తన తుది జట్టు ని ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఇక వరుణ్‌కి ఇప్పటికే తమిళనాడుకు చెందిన భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన మద్దతు ప్రకటించాడు. చాంపియన్స్ ట్రోఫీ ఆడే భారత జట్టులో అతనిని చేర్చాలని కూడా విజ్ఞప్తి చేశాడు.ఇంగ్లండ్‌తో జరగబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో వరుణ్ చక్రవర్తిని ఆడించే అవకాశం ఉందని అశ్విన్ ముందే ప్రకటించాడు. "ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో వరుణ్‌కు ఆడే అవకాశం లభిస్తుందని నేను భావిస్తున్నాను. పేలవమైన బ్యాటింగ్ రికార్డ్ఈ టోర్నమెంట్ లో అతని ప్రదర్శన ఆధారంగా ఛాంపియన్స్ ట్రోఫీ జట్టుకి ఎంపిక చేసే అవంకాశముందని" అశ్విన్ వ్యాఖ్యానించాడు. అయితే వరుణ్ పేలవమైన బ్యాటింగ్ రికార్డ్ అతనికి అడ్డంకిగా పరిణమించే అవకాశం ఉంది. కొద్దో గొప్పో బ్యాటింగ్ వచ్చిన వారికే భారత్ జట్టు ఎంపికలో ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటె అవసరమైన పక్షంలో వారు తమ బ్యాటింగ్ తో జట్టు ని ఆదుకునే అవకాశం ఉండటమే ఇందుకు కారణం.ఇప్పటికే జట్టులో ఉన్న రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ మరియు వాషింగ్టన్ సుందర్ లు లోయర్ మిడిల్ ఆర్డర్లో సమర్థులైన బ్యాటర్లుగా గుర్తింపు పొందారు. మరో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా ఒక మోస్తరుగా బ్యాటింగ్ లో రాణించగలనని ఇప్పటికే నిరూపించుకున్నాడు. ఈ నేపథ్యంలో తన బౌలింగ్ ప్రతిభతో నిలకడ గా రాణించగలిగితేనే వరుణ్ చక్రవర్తికి ఛాంపియన్స్ ట్రోఫీ తుది జట్టులో చోటు లభించే అవకాశం ఉంది. ఇందుకు గురువారం నుంచి ప్రారంభం కానున్న ఇంగ్లండ్ వన్డే సిరీస్ కీలకం కానుంది.అయితే భారత్ బౌలింగ్ మార్పులు చేర్పులు అంతా జట్టు ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్ నెస్ పైనే ఆధారపడి ఉంటుంది. బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీ లో ఆడే విషయం పై స్పష్టం వచ్చినట్లయితే జట్టులో మరో స్పిన్నర్ కి స్థానం లభించే అవకాశం ఉంది. బుమ్రా తన వెన్ను సమస్యల నుండి సకాలంలో కోలుకో లేకపోతే, భారత్ తన బౌలింగ్ ని పునః పరిశీలించాల్సిన ఆవరసం ఉంది. -
Ind vs Eng: వాళ్లిద్దరిపై వేటు.. తుదిజట్టులో రెండు మార్పులు! ఎందుకంటే
ఇంగ్లండ్‌తో నాలుగో టీ20(India vs England)కి టీమిండియా సిద్ధమైంది. పుణెలో గెలిచి.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. గత మ్యాచ్ తాలూకు తప్పులు సరిదిద్దుకుని.. పరుగుల వరదకు ఆస్కారమిచ్చే పిచ్‌పై బ్యాట్ ఝులిపించడమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది.పక్కనపెడితేనే బెటర్‌ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా(Aakash Chopra) కీలక సూచనలు చేశాడు. పుణె టీ20లో భారత జట్టు రెండు మార్పులతో రంగంలోకి దిగాలని సూచించాడు. ధ్రువ్ జురెల్(Dhruv Jurel), వాషింగ్టన్ సుందర్(Washington Sundar) సేవలను మేనేజ్మెంట్ పూర్తి స్థాయిలో వాడుకోవడం లేదన్న ఆకాశ్ చోప్రా.. వారిద్దరిని పక్కనపెడితేనే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘వాషింగ్టన్ సుందర్‌ను బౌలర్‌గా వాడుకోవడం లేదని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అతడిని రెండు మ్యాచ్‌లలో ఆడించారు. తన మొదటి మ్యాచ్‌లో అతడు తొలి బంతికే వికెట్ తీశాడు. బెన్ డకెట్‌ను అవుట్ చేశాడు.అంతేకాదు.. తన తొలి ఓవర్లో ఎక్కువగా పరుగులు కూడా ఇవ్వలేదు. అయినా సరే.. అతడికి రెండో ఓవర్ వేసే అవకాశం ఇవ్వలేదు. ఇక తన రెండో మ్యాచ్‌లో వాషీ తొలి ఓవర్లోనే పరుగులు ఇచ్చుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ అతడి చేతికి బంతిని ఇవ్వలేదు.ఒకవేళ ఒకే ఒక్క ఓవర్ వేయించాలనుకుంటే అతడిని జట్టులోకి తీసుకోవడం ఎందుకు?.. వేరే వాళ్లకు అవకాశం ఇవ్వవచ్చు కదా! .. ఇక ధ్రువ్ జురెల్ సేవలను కూడా సరిగ్గా వాడుకోవడం లేదు. అలాంటప్పుడు అతడు కూడా జట్టులో ఉండటం వల్ల పెద్దగా ఉపయోగం లేదు’’ అని ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.నలుగురు బౌలర్లుఇక ఇంగ్లండ్‌తో నాలుగో టీ20లో భారత తుదిజట్టు కూర్పు గురించి మాట్లాడుతూ.. ‘‘నా అభిప్రాయం ప్రకారం... అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ఓపెనర్లుగానే ఉండాలి. తిలక్ వర్మ వన్‌డౌన్‌లో.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాలుగు, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఐదో స్థానంలో ఆడాలి.ఇక ఆరోస్థానంలో శివం దూబేను ఆడిస్తే బాగుంటుంది’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. లోయర్- మిడిల్ ఆర్డర్లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌గా అతడు చక్కటి ఆప్షన్ అని తెలిపాడు. రాజ్‌కోట్‌లో మూడో టీ20లో ఎడమచేతి వాటం బ్యాటర్ కోసమే వాషీని పంపినప్పుడు.. ఈసారి దూబే సేవలు వినియోగించుకోవడంలో తప్పులేదని పేర్కొన్నాడు.అదే విధంగా... ‘‘ఏడో స్థానంలో వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ ఉండాలి. ఈ మ్యాచ్‌లో నలుగురు బౌలర్లు ఉండాలి. అందుకే.. మరో బ్యాటర్ లేదంటే.. ఆల్‌రౌండర్ గురించి నేను ఆలోచించడం లేదు. స్పిన్నర్లు రవి బిష్ణోయి, వరుణ్ చక్రవర్తిలతో పాటు.. అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీలను ఆడించాలి’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.నలుగురు స్పెషలిస్టు బౌలర్లతో పాటు.. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ కూడా బౌల్ చేయగలరన్న ఆకాశ్ చోప్రా.. తిలక్ వర్మ, అభిషేక్ శర్మ కూడా బంతితో రాణించగలరని పేర్కొన్నాడు. ఏదేమైనా ఇంగ్లండ్‌తో నాలుగో టీ20లో వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్‌ల బదులు.. అర్ష్‌దీప్ సింగ్, శివం దూబేలను ఆడించాలని సూచించాడు.ఇంగ్లండ్‌తో నాలుగో టీ20కి ఆకాశ్ చోప్రా ఎంచుకున్న భారత తుది జట్టుఅభిషేక్ శర్మ, సంజూ శాంసన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ.చదవండి: చరిత్ర సృష్టించిన సౌరాష్ట్ర బ్యాటర్.. రంజీల్లో ఆల్‌టైమ్ రికార్డు -
CT 2025: గంభీర్‌కు అతడంటే ఇష్టం.. తుదిజట్టులో చోటు పక్కా: అశ్విన్
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఐసీసీ టోర్నీలో ఆడే భారత తుదిజట్టులో వాషింగ్టన్ సుందర్‌కు తప్పక స్థానం లభిస్తుందని అభిప్రాయపడ్డాడు. అయితే, ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌ను లోయర్ ఆర్డర్లో కాకుండా.. టాప్-5లో బ్యాటింగ్‌కు పంపించాలని అశూ మేనేజ్మెంట్కు సూచించాడు.పాకిస్తాన్- యూఏఈ వేదికలుగా చాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి మొదలుకానుంది. ఈ మెగా ఈవెంట్లో టీమిండియా ఫిబ్రవరి 20 నుంచి తమ వేట మొదలుపెట్టనుంది. లీగ్ దశలో భాగంగా తొలుత బంగ్లాదేశ్‌తో తలపడనున్న రోహిత్ సేన.. ఫిబ్రవరి 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్(India vs Pakistan)తో మ్యాచ్ ఆడుతుంది. ఆ నలుగురుఆ తర్వాత న్యూజిలాండ్‌ను ఢీకొట్టనుంది. ఇక టీమిండియా ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లోనే జరుగుతాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించిన జట్టులో స్పిన్ విభాగంలో ముగ్గురు ఆల్‌రౌండర్లు, ఒక స్పెషలిస్టు బౌలర్‌కు చోటు దక్కింది. ఆ నాలుగు ఎవరంటే.. రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్.. కుల్దీప్ యాదవ్.వీరిలో కుల్దీప్ లెఫ్టార్మ్ రిస్ట్ స్పిన్నర్ కాగా.. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ కూడా ఎడమచేతి వాటం బౌలర్లే. అయితే, ఇందులో రైటార్మ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ ఒక్కడే. అందునా అతడు ఆఫ్ స్పిన్నర్. ఈ ప్రత్యేకతే అతడికి చాంపియన్స్ ట్రోఫీ తుదిజట్టులో చోటు దక్కేలా చేస్తుందని స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు.అంతేకాదు.. టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌కు వాషీ అంటే ఎంతో ఇష్టమని.. అది కూడా అతడికి ప్లస్ పాయింట్‌గా మారుతుందని అశూ పేర్కొన్నాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్లో మాట్లాడుతూ.. ‘‘ఈరోజుల్లో రైట్- లెఫ్ట్ కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యం దక్కుతోంది.గంభీర్‌కు అతడంటే చాలా ఇష్టం.కానీ మనకు ఎక్కువ మంది ఆఫ్ స్పిన్నర్లు లేరు. లెఫ్టార్మ్ స్పిన్నర్లే ఎక్కువ ఉన్నారు. చాంపియన్స్ ట్రోఫీ జట్టులో వాషింగ్టన్ సుందర్ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకు రెండు కారణాలున్నాయి.. నాకు తెలిసినంత వరకు గంభీర్‌కు అతడంటే చాలా ఇష్టం.అతడి ఆటతీరును దగ్గరగా గమనించడంతో పాటు.. కచ్చితంగా అండగా నిలబడతాడు. ఇక వాషీ ఆఫ్ స్పిన్నర్ కావడం కూడా కలిసి వస్తుంది. అయితే, అతడు ఎనిమిదో నంబర్లో బ్యాటింగ్ చేస్తే మాత్రం జట్టు సమతూకంగా ఉండకపోవచ్చు. బ్యాటింగ్ ఆర్డర్లో అతడిని ముందుకు పంపాలి.టాప్ 5లో ఉంటేసమర్థవంతంగా బౌలింగ్ చేయడంతో పాటు నాలుగు లేదంటే ఐదో స్థానంలో ఆడే ఆల్‌రౌండర్ ఉంటే జట్టుకు ఎంతో ఉపయోగకరం. అదీ ఆఫ్ స్పిన్నర్ టాప్ 5లో ఉంటే ఇంకా బాగుంటుంది’’ అని అశ్విన్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.కాగా అశ్విన్ మాదిరే వాషీ కూడా తమిళనాడుకు చెందినవాడే. ఈ ఇద్దరూ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లే కావడం మరో విశేషం. ఇదిలా ఉంటే.. ఇటీవల ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో ఆడిన భారత జట్టులో అశూ- వాషీ ఇద్దరికీ చోటు దక్కింది. అయితే, పెర్త్ టెస్టులో అనుభవజ్ఞుడైన అశూను కాదని.. మేనేజ్మెంట్ వాషీని ఆడించింది. అందుకు తగ్గట్లుగానే అతడు రాణించాడు కూడా!అశూ ఆకస్మిక రిటైర్మెంట్అయితే, ఆ తర్వాత మరో రెండు టెస్టుల్లోనూ అశూకు అవకాశం రాలేదు. ఈ నేపథ్యంలో బ్రిస్బేన్‌లో మూడో టెస్టు డ్రా అయిన తర్వాత అతడు సంచలన ప్రకటన చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. మేనేజ్మెంట్ తీరు నచ్చకే అశూ రిటైర్మెంట్ ప్రకటించాడనే ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో గంభీర్‌కు వాషీ ఆట అంటే ఇష్టమంటూ అశూ చేసిన వ్యాఖ్యలు సందేహాలకు తావిస్తున్నాయి.కాగా రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్, ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన వాషింగ్టన్ సుందర్.. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 9 టెస్టులు, 22 వన్డేలు, 52 టీ20లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో 468, 315, 161 పరుగులు చేయడంతో పాటు.. 25, 23, 47 వికెట్లు తీశాడు.చదవండి: ‘నా కుమారుడిపై పగబట్టారు.. కావాలనే తొక్కేస్తున్నారు’ -
ఇంగ్లండ్‌తో సిరీస్.. దేశీ టోర్నీలో టీమిండియా స్టార్లు! అతడికి రెస్ట్!
ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా అనుకున్న ఫలితాన్ని రాబట్టలేకపోయింది. దాదాపు పదేళ్ల తర్వాత బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)ని ఆతిథ్య జట్టుకు కోల్పోయింది. ఇందుకు ప్రధాన కారణంగా భారత బ్యాటర్ల వైఫల్యమే అని చెప్పవచ్చు. ఇక ఆటలో గెలుపోటములు సహజం కాబట్టి.. టీమిండియా తదుపరి ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లపై దృష్టి సారించనుంది.ఇప్పటికే ఆస్ట్రేలియాను వీడిన టీమిండియా స్టార్లలో కొందరు.. స్వదేశంలో అడుగుపెట్టగానే దేశీ టోర్నీలో పాల్గొనేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ప్రసిద్ కృష్ణ, దేవ్‌దత్ పడిక్కల్, వాషింగ్టన్ సుందర్ దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ నాకౌట్ మ్యాచ్‌లలో భాగం కానున్నట్లు సమాచారం. కేఎల్ రాహుల్‌కు విశ్రాంతిఅయితే, కేఎల్ రాహుల్‌ను కూడా ఈ టోర్నీలో ఆడాలని యాజమాన్యం సూచించగా.. అతడు తనకు విశ్రాంతి కావాలని అభ్యర్థించినట్లు తెలుస్తోంది. కాగా ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా.. దేవ్‌దత్ పడిక్కల్ పెర్త్ మ్యాచ్ తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. నిరాశపరిచిన పడిక్కల్అయితే, తొలి ఇన్నింగ్స్‌లో డకౌటై పూర్తిగా నిరాశపరిచిన ఈ కర్ణాటక బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్‌లో 25 పరుగులు చేయగలిగాడు. ఆ తర్వాత మళ్లీ అతడు టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో స్థానం సంపాదించలేకపోయాడు.వాషీకే పెద్దపీటఇక స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు మాత్రం ఈ సిరీస్‌లో ప్రాధాన్యం దక్కింది. రవిచంద్రన్ అశ్విన్‌ను కాదని మరీ.. టీమిండియా మేనేజ్మెంట్ వాషీ వైపు మొగ్గుచూపింది. అందుకు తగ్గట్లుగానే వాషీ రాణించాడు. అవసరమైన వేళ బ్యాట్ ఝులిపించడంతో పాటు వికెట్లు తీయడంలోనూ తన వంతు పాత్ర పోషించాడు ఈ చెన్నై చిన్నోడు.ప్రసిద్ హిట్అయితే, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌లతో పాటు పేస్ దళంలో ఆకాశ్ దీప్తో పోటీలో వెనుకబడ్డ ప్రసిద్ కృష్ణకు ఆఖరి టెస్టులో అవకాశం వచ్చింది. సిడ్నీ టెస్టుకు ముందు ఆకాశ్ దీప్ గాయపడిన కారణంగా.. ప్రసిద్‌కు తుదిజట్టులో చోటు దక్కింది. ఈ మ్యాచ్‌లో మొత్తంగా ఆరు వికెట్లు తీసి.. వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు ఈ కర్ణాటక యువ పేసర్.నాకౌట్ మ్యాచ్‌ల బరిలోఇక పడిక్కల్, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ కృష్ణ తదుపరి ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లపై కూడా కన్నేశారు. సీనియర్లు విశ్రాంతి పేరిట దూరమయ్యే పరిస్థితుల నేపథ్యంలో అవకాశాన్ని ఒడిసిపట్టాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో విజయ్ హజారే ట్రోఫీ నాకౌట్ మ్యాచ్‌లలో ఆడేందుకు వీరు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.కాగా గురువారం (జనవరి 9) నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రి క్వార్టర్ పైనల్ మ్యాచ్‌లు ఆరంభం కానున్నాయి. తమిళనాడు, రాజస్తాన్, హర్యానా, బెంగాల్ ప్రిక్వార్టర్స్‌కు అర్హత సాధించాయి. మరోవైపు.. అద్భుత ప్రదర్శనతో టాప్-6లో నిలిచిన గుజరాత్, విదర్భ, కర్ణాటక, బరోడా, మహారాష్ట్ర, పంజాబ్ నేరుగా క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టాయి. ఇంగ్లండ్‌తో ఐదు టీ20లు, మూడు వన్డేలుఈ నేపథ్యంలో తమిళనాడు తరఫున వాషీ, కర్ణాటక తరఫున ప్రసిద్ కృష్ణ, దేవ్‌దత్ పడిక్కల్ బరిలో దిగనున్నారు. ఇదిలా ఉంటే.. జనవరి 22 నుంచి భారత్- ఇంగ్లండ్ మధ్య సిరీస్ ఆరంభం కానుంది. తొలుత ఐదు టీ20లు.. అనంతరం మూడు వన్డేల సిరీస్‌లు జరుగుతాయి.చదవండి: ‘బవుమా అలాంటి వాడు కాదు.. డబ్ల్యూటీసీ ఫైనల్లో విజయం మాదే’ -
టెస్టు క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. నితీశ్ రెడ్డి- వాషీ ప్రపంచ రికార్డు
ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో భారత ఆల్‌రౌండర్లు నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy), వాషింగ్టన్ సుందర్(Washington Sundar) తమ బ్యాటింగ్ పవరేంటో చూపించారు. ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ... కొరకరాని కొయ్యగా మారి వారి సహనాన్ని పరీక్షించారు. ఈ క్రమంలో 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని ఘనతను రెడ్డి- వాషీ జోడీ సాధించింది.బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడుతోంది. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో భారీ విజయం సాధించిన భారత జట్టు.. అడిలైడ్ పింక్ బాల్ టెస్టులో మాత్రం ఓడిపోయింది. అనంతరం బ్రిస్బేన్ టెస్టును డ్రా చేసుకోగలిగింది. తద్వారా 1-1తో సిరీస్‌లో సమంగా ఉన్న రోహిత్ సేన.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్ చేరాలంటే.. మిగిలిన రెండు మ్యాచ్‌లు తప్పక గెలవాలి.పటిష్ట స్థితిలో ఆసీస్అయితే, మెల్బోర్న్ వేదికగా గురువారం మొదలైన బాక్సింగ్ డే టెస్టులో ఆదిలోనే టీమిండియాకు షాకులు తగిలాయి. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య కంగారూ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగుల మేర భారీ స్కోరు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్లు సామ్ కొన్‌స్టాస్(60), ఉస్మాన్ ఖవాజా(57), మార్నస్ లబుషేన్(72) అర్ధ శతకాలతో మెరవగా.. స్టీవ్ స్మిత్ శతక్కొట్టాడు(140).స్వీయ తప్పిదాలతోమిగతా వాళ్లలో అలెక్స్ క్యారీ(31), కెప్టెన్ ప్యాట్ కమిన్స్(49) కూడా రాణించారు. ఫలితంగా ఆసీస్ పటిష్ట స్థితిలో నిలవగా.. మొదటి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియాకు మళ్లీ ఎదురుదెబ్బలే తగిలాయి. ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ(3), కేఎల్ రాహుల్(24), విరాట్ కోహ్లి(36), ఆకాశ్ దీప్(0), రిషభ్ పంత్(28), రవీంద్ర జడేజా(17) విఫలమయ్యారు.ఇరగదీసిన రెడ్డి, వాషీమరో ఓపెనర్ యశస్వి జైస్వాల్(82) శతకం దిశగా పయనించినా.. అనవసరంగా సింగిల్‌కు యత్నించి రనౌట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో ఎనిమిది, తొమ్మిదో స్థానాల్లో బ్యాటింగ్ చేసిన నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ పట్టుదలగా క్రీజులో నిలబడ్డారు.ఇద్దరూ కలిసి ఎనిమిదో వికెట్‌కు 127 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో నితీశ్ రెడ్డి తన అంతర్జాతీ కెరీర్లో తొలి శతకం నమోదు చేయగా.. వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీతో అలరించాడు. ఇక ఈ జోడీని విడదీసేందుకు ఆసీస్ బ్యాటర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.ఎట్టకేలకు కంగారూ జట్టు స్పిన్నర్ నాథన్ లియాన్ ఆ పని చేయగలిగాడు. అతడి బౌలింగ్‌లో వాషీ(50) స్టీవ్ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో శతక భాగస్వామ్యానికి తెరపడ్డప్పటికీ నితీశ్ రెడ్డి- వాషింగ్టన్ సుందర్ అరుదైన రికార్డును తమ ఖాతాలో వేసుకున్నారు.ప్రపంచ రికార్డుటెస్టు క్రికెట్ చరిత్రలో ఎనిమిది, తొమ్మిది స్థానాలో బ్యాటింగ్ చేసి.. ఒకే ఇన్నింగ్స్‌లో 150కి పైగా బంతులు ఎదుర్కొన్న మొట్టమొదటి జోడీ రెడ్డి- వాషీ. మెల్బోర్న్లో మూడో రోజు ఆట ముగిసేసరికి వాషీ 162 బంతుల్లో 50 పరుగులు చేసి అవుట్ కాగా.. నితీశ్ రెడ్డి 176 బంతుల్లో 105(10 ఫోర్లు, 1 సిక్సర్) పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక భారత్ స్కోరు: 358/9 (116). ఆస్ట్రేలియా కంటే తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 116 పరుగులు వెనుకబడి ఉంది. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, స్కాట్ బోలాండ్ మూడేసి వికెట్లు పడగొట్టగా.. నాథన్ లియాన్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. చదవండి: Nitish Reddy: కొడుకంటే ఇలా ఉండాలి!.. భావోద్వేగంతో తండ్రి కన్నీళ్లు! వీడియో A fantastic effort from Washington Sundar to bring up his 50! #AUSvIND | #MilestoneMoment | @nrmainsurance pic.twitter.com/xIIJ3go51r— cricket.com.au (@cricketcomau) December 28, 2024 -
వారెవ్వా నితీశ్ రెడ్డి!.. ‘విధ్వంసం’ కాదు.. విలువైన సెంచరీ
ఆస్ట్రేలియాతో బాక్సింగ్ డే టెస్టులో భారత యువ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy) విలువైన శతకం సాధించాడు. ఆసీస్ బౌలర్ల ధాటికి ‘స్టార్’ బ్యాటర్లంతా విఫలమైన వేళ.. అతడు మాత్రం పట్టుదలగా క్రీజులో నిలబడ్డాడు. కంగారూల పేస్ పదునుకు తన బ్యాట్‌తో విరుగుడు మంత్రం రచించి.. దూకుడుగా ఆడుతూ వారిని ఇరకాటంలో పడేశాడు.తొట్ట తొలి శతకంమరో ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్(50)తో కలిసి నిలకడగా ఆడుతూ.. భారత్ స్కోరును మూడు వందల మార్కును దాటించాడు. ఎనిమిదో వికెట్‌కు వాషీతో కలిసి విలువైన 127 పరుగుల భాగస్వామ్యం జోడించాడు. ఈ క్రమంలోనే తన అంతర్జాతీయ కెరీర్లో మొట్టమొదటి శతకాన్ని(Maiden Century) నమోదు చేశాడు విశాఖపట్నం కుర్రాడు నితీశ్ రెడ్డి.ఫోర్ బాది.. శతకం పూర్తి చేసుకునిటీమిండియా తరఫున ఆడుతున్న నాలుగో టెస్టులోనే 21 ఏళ్ల నితీశ్ రెడ్డి ఈ అద్భుతం చేశాడు. వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూ.. ఆచితూచి ఆడుతూనే అదును చూసి బంతిని బౌండరీకి తరలించాడు. ఈ క్రమంలో స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో ఫోర్ బాది సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 171 బంతుల్లో వంద పరుగుల మార్కు అందుకున్నాడు.తద్వారా ఆస్ట్రేలియాలో టీమిండియా తరఫున అత్యంత పిన్న వయసులో టెస్టు సెంచరీ సాధించిన మూడో క్రికెటర్‌గా నితీశ్ రెడ్డి రికార్డులకెక్కాడు. కాగా మెల్బోర్న్లో గురువారం మొదలైన బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగులకు ఆలౌట్ అయింది.వాళ్లంతా విఫలంఈ క్రమంలో శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్, కెప్టెన రోహిత్ శర్మ(3), వన్‌డౌన్ బ్యాటర్ కేఎల్ రాహుల్(24) విఫలం కాగా.. హాఫ్ సెంచరీ వీరుడు యశస్వి జైస్వాల్(82) స్వీయ తప్పిదం వల్ల రనౌట్ అయ్యాడు.ఇక విరాట్ కోహ్లి 36 పరుగులకే నిష్క్రమించగా.. ఆకాశ్ దీప్ డకౌట్ అయ్యాడు. ఈ క్రమంలో 164/5 ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం నాటి ఆట మొదలుపెట్టిన టీమిండియా.. కాసేపటికే రిషభ్ పంత్(28), రవీంద్ర జడేజా(17) వికెట్లు కోల్పోయింది.ఆల్‌రౌండర్ల మెరుపులుఈ క్రమంలో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి- స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ వందకు పైగా పరుగుల భాగస్వామ్యంతో దుమ్ములేపారు. వాషీ సరిగ్గా 50 పరుగులు చేసి అవుట్ కాగా.. నితీశ్ రెడ్డి శతకంతో మెరిశాడు.ఇక వెలుతులేమి కారణంగా మూడో రోజు ఉదయం 11.55 నిమిషాలకు ఆట నిలిపివేసే సమయానికి నితీశ్ రెడ్డి.. 176 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో.. 105 పరుగులు చేశాడు. అప్పటికి టీమిండియా 116 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. ఆసీస్ కంటే తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 116 పరుగులు వెనుకబడి ఉంది. ఇదిలా ఉంటే.. బోర్డర్- గావస్కర్ట్రోఫీలో భాగంగా ఆసీస్‌తో మూడు టెస్టులు పూర్తి చేసుకున్న టీమిండియా 1-1తో సమంగా ఉంది.చదవండి: ఆసీస్ గడ్డపై చరిత్ర సృష్టించిన నితీశ్ రెడ్డిNitish Kumar Reddy hits his maiden Test century and receives a standing ovation from the MCG crowd ❤️ #AUSvIND | #PlayOfTheDay | @nrmainsurance pic.twitter.com/Vbqq5C26gz— cricket.com.au (@cricketcomau) December 28, 2024 -
అశ్విన్ ‘వారసుడు’ ఎవరు?.. అతడికే అవకాశం ఎక్కువ
గింగిరాలు తిరిగే బంతులతో... ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టిన స్టార్ ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకగా... భారత జట్టులో అతడి స్థానాన్ని భర్తీ చేసేవారెవరు అనే చర్చ జోరుగా సాగుతోంది. విదేశీ పిచ్‌లపై ప్రదర్శనను పక్కన పెడితే... స్వదేశంలో టీమిండియా జైత్రయాత్ర వెనక అశ్విన్ పాత్ర ఎంతో ఉందనేది కాదనలేని సత్యం. అశ్విన్ అరంగేట్రం చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు సొంతగడ్డపై టీమిండియా 65 టెస్టులు ఆడగా... వీటన్నింటిలో అశ్విన్ బరిలోకి దిగాడు. ఈ మధ్య కాలంలో అశ్విన్ విఫలమైన రెండు సిరీస్‌లలో (2012 ఇంగ్లండ్‌తో, 2024 న్యూజిలాండ్‌తో) తప్ప అన్నీట్లో టీమిండియా జయకేతనం ఎగరవేసింది. ఈ గణాంకాలు చాలు అతడేంటో చెప్పేందుకు. 106 టెస్టుల్లో 537 వికెట్లు పడగొట్టి... భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచిన 38 ఏళ్ల అశ్విన్... ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ మూడో టెస్టు అనంతరం బుధవారం అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలకగా... సహచరులు, సీనియర్లు అశ్విన్ ఘనతలను కొనియాడారు.అయితే ఇకపై అశ్విన్ సేవలు అందుబాటులో లేకపోవడంతో... స్పిన్ మాంత్రికుడి స్థానాన్ని భర్తీ చేసేది ఎవరనే చర్చ ప్రధానంగా సాగుతోంది. ఇందులో వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, తనుశ్ కొటియాన్, అక్షర్ పటేల్ పేర్లు గట్టిగా వినిపిస్తున్న నేపథ్యంలో వారి ప్రదర్శనలను ఓసారి పరిశీలిస్తే... –సాక్షి క్రీడావిభాగంసుందర్కే చాన్స్ ఎక్కువ...ఇప్పుడున్న పరిస్థితుల్లో అశ్విన్ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు ఎవరా అనే ప్రశ్నకు వాషింగ్టన్ సుందర్ అనే సమాధానమే వినిపిస్తోంది. ఈ ఇద్దరూ తమిళనాడుకు చెందిన వాళ్లే కాగా... సుందర్ కూడా అశ్విన్ బాటలోనే అటు బంతితో మాయ చేయడంతో పాటు ఇటు బ్యాటింగ్‌లోనూ సత్తా చాటగల సమర్థుడు. తాజా ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ తొలి టెస్టులో అశ్విన్‌ను కాదని టీమ్ మేనేజ్మెంట్ సుందర్‌కే అవకాశమిచ్చింది. సమీప భవిష్యత్తులో ఇలాగే జరిగే సూచనలు కనిపించడంతోనే అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికిన అశ్విన్... కొత్త తరానికి మార్గం సుగమం చేశాడు. అశ్విన్ తరహాలోనే టి20 ఫార్మాట్లో సత్తాచాటి అటు నుంచి జాతీయ జట్టు తలుపు తట్టిన 25 ఏళ్ల సుందర్... ఇప్పటి వరకు టీమిండియా తరఫున 7 టెస్టులు ఆడి 24 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లో 48.37 సగటుతో 387 పరుగులు సాధించాడు. విదేశీ పిచ్‌లపై అశ్విన్ కంటే మెరుగైన బ్యాటింగ్ నైపుణ్యం సుందర్ సొంతం కాగా... ఇదే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని జట్టు యాజమాన్యం సుందర్‌ను ప్రోత్సహిస్తోంది. కెపె్టన్, కోచ్ నమ్మకాన్ని సంపాదించిన సుందర్... ఎప్పటికప్పుడు బౌలింగ్‌లో వైవిధ్యం చూపగల నేర్పరి కావడంతో అతడు ఈ జాబితాలో ముందు వరుసలో కనిపిస్తున్నాడు. రేసులో కుల్దీప్ యాదవ్ ఒకదశలో విదేశాల్లో భారత ప్రధాన స్పిన్నర్ అని హెడ్ కోచ్‌తో మన్ననలు అందుకున్న మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఆ తర్వాత పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. చైనామన్ స్పిన్నర్‌గా జట్టులోకి వచి్చన కుల్దీప్ ప్రధానంగా పరిమిత ఓవర్ల ఫార్మాట్లోనే ఆకట్టుకున్నాడు. ఇప్పటి వరకు జాతీయ జట్టు తరఫున 106 వన్డేల్లో 172 వికెట్లు... 40 టి20ల్లో 69 వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో టెస్టు ఫార్మాట్లో 13 మ్యాచ్‌లాడిన 30 ఏళ్ల కుల్దీప్ యాదవ్ 22.16 సగటుతో 56 వికెట్లు పడగొట్టాడు. అయితే ప్రస్తుతం అశ్విన్ స్థానం కోసం పోటీపడుతున్న వారిలో బ్యాటింగ్ పరంగా కుల్దీప్ యాదవ్ కాస్త వెనుకబడి ఉండటం అతడికి ప్రతిబంధకంగా మారింది. ఆంధ్ర ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి పేస్ ఆల్‌రౌండర్‌గా టెస్టు జట్టులో స్థానం సుస్థిరం చేసుకోవడం ఖాయంగానే కనిపిస్తున్న నేపథ్యంలో కుల్దీప్కు బ్యాటింగ్ ప్రతిభతో సంబంధం లేకుండా స్వదేశీ పిచ్‌లపై ప్రధాన స్పిన్నర్‌గా ఎంపిక చేసుకునే అవకాశాలు లేకపోలేదు. వయసురీత్యా చూసుకుంటూ ఇప్పటికే 30వ పడిలో ఉన్న కుల్దీప్... అశ్విన్ వారసుడిగా పేరు తెచ్చుకుంటాడా అనేది కాలమే నిర్ణయించాలి. అక్షర్‌కు అవకాశం లేనట్టే! గత కొంతకాలంగా పరిశీలిస్తే... సొంతగడ్డపై భారత జట్టు ఆడిన టెస్టుల్లో అక్షర్ పటేల్ మూడో స్పిన్నర్‌గా బరిలోకి దిగాడు. తన ఎత్తును వినియోగించుకుంటూ ఎడమ చేత్తో బంతిని స్పిన్ చేయడంతో పాటు బ్యాటింగ్‌లోనూ ప్రభావం చూపాడు. 30 ఏళ్ల అక్షర్ ఇప్పటి వరకు జాతీయ జట్టు తరఫున 14 టెస్టులు ఆడి 19.34 సగటుతో 55 వికెట్లు పడగొట్టడంతో పాటు 35.88 సగటుతో 646 పరుగులు చేశాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లలోనూ స్పిన్ ఆల్‌రౌండర్‌గా తనదైన పాత్ర పోషిస్తున్న అక్షర్ పటేల్‌కు తన బౌలింగ్ శైలే ప్రధాన సమస్యగా మారింది. ప్రస్తుతం టీమిండియాలో సీనియర్ స్పిన్నర్‌గా ఉన్న రవీంద్ర జడేజా కూడా ఎడమచేతి వాటం బౌలరే కాగా... అక్షర్ మాదిరే బ్యాటింగ్‌లోనూ సత్తా చాటగల సమర్థుడు. దీంతో బౌలింగ్‌లో వైవిధ్యం ఉండాలి అంటే వీరిద్దరిలో ఒక్కరినే ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.తనుశ్పై దృష్టి...ముంబైకి చెందిన కుడిచేతి వాటం ఆఫ్‌స్పిన్నర్ తనుశ్ కొటియాన్‌కు కూడా అశ్విన్ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దేశవాళీల్లో అపార అనుభవం ఉన్నా... ఇప్పటి వరకు జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేయని 26 ఏళ్ల తనుశ్... ఇటీవల ఆ్రస్టేలియా పర్యటనలో భాగంగా భారత్ ‘ఎ’ జట్టు తరఫున ఆకట్టుకున్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 33 మ్యాచ్‌లు ఆడి 25.70 సగటుతో 101 వికెట్లు పడగొట్టిన కొటియాన్... బ్యాట్‌తో 41.21 సగటుతో 1525 పరుగులు సాధించాడు. బౌలింగ్‌లో చక్కటి ప్రతిభతో పాటు అవసరమైతే లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న తనుశ్... జాతీయ జట్టులో చోటు దక్కించుకుంటే సుదీర్ఘ కాలం కొనసాగే అవకాశాలున్నాయి. అయితే ప్రస్తుతానికి టీమిండియాలో ఉన్న పోటీని తట్టుకోవడం అంత సులభం అయితే కాదు. -
అశ్విన్ అద్భుత స్పిన్నరే కానీ...
ముంబై: సీనియర్ ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అద్భుత స్పిన్నరే అయినా... భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాషింగ్టన్ సుందర్‌ను సిద్ధం చేయాలని భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. టెస్టు క్రికెట్లో 536 వికెట్లు పడగొట్టిన అశ్విన్... భారత్ నుంచి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అనిల్ కుంబ్లే (619) తర్వాత రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియాతో ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ తొలి టెస్టులో అశ్విన్‌ను కాదని టీమ్ మేనేజ్మెంట్ సుందర్‌ను తుది జట్టులోకి ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో భజ్జీ మాట్లాడుతూ... ‘అశ్విన్ జాతీయ జట్టు తరఫున అద్భుత ప్రదర్శన కనబర్చాడు. అయితే ఇప్పుడతడి వయసు 38. అతడు ఆటకు వీడ్కోలు పలికే సమయానికి జట్టు సుందర్‌ను సిద్ధం చేసుకోవాలనుకుంటుండోచ్చు. అందుకే విదేశీ పిచ్‌లపై అనుభవజు్ఞడైన అశ్విన్ కంటే సుందర్‌కు అవకాశం ఇచ్చారు. పెర్త్‌లో ఆ్రస్టేలియాపై టీమిండియా విజయం సాధించడం చాలా ఆనందంగా ఉంది. అక్కడ ఆసీస్ అజేయమైన జట్టుగా కనిపించేది. అలాంటి చోట చక్కటి ఆటతీరుతో భారత జట్టు కంగారూలను కట్టడి చేసింది. ఇదే జోరు కొనసాగిస్తూ టీమిండియా 4–1తో సిరీస్ కైవసం చేసుకుంటుందనుకుంటున్నా’అని అన్నాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు చేరడం భారత్‌కు కొత్త కాదని... అయితే ఈసారి గెలవడం ముఖ్యమని భజ్జీ వ్యాఖ్యానించాడు. తొలి టెస్టులో రెగ్యులర్ కెపె్టన్ రోహిత్ శర్మ అందుబాటులో లేకున్నా... జస్ప్రీత్ బుమ్రా జట్టును అద్భుతంగా నడిపించాడని హర్భజన్ కొనియాడాడు. కోహ్లిని చూసి లబుషేన్ నేర్చుకోవాలి: పాంటింగ్ ఫామ్‌లేమితో సతమతమవుతున్న ఆ్రస్టేలియా ఆటగాళ్లు మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్‌కు... మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కీలక సూచనలు చేశాడు. ఈ ఇద్దరూ భారత స్టార్ విరాట్ కోహ్లిని చూసి నేర్చుకోవాలన్నాడు. ‘పెర్త్ టెస్టులో లబుõÙన్ తీవ్రంగా తడబడ్డాడు. విభిన్నమైన వికెట్‌పై నాణ్యమైన బౌలింగ్‌ను ఎదుర్కోవడం ఎప్పుడూ కష్టమే. కానీ పరిస్థితులను మనకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నించడం ముఖ్యం. పెర్త్ రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లి ఇదే చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయిన విరాట్ రెండో ఇన్నింగ్స్‌లో పరిస్థితులపై పైచేయి సాధించాడు. కోహ్లి తన బలాలపై దృష్టి పెడతాడు. లబుషేన్, స్మిత్ అదే చేయాలి. వారి సామర్థ్యాన్ని నమ్మాలి’అని పాంటింగ్ వ్యాఖ్యానించాడు. బుమ్రా వంటి బౌలర్‌ను ఎదుర్కొనేందుకు మెరుగైన ప్రణాళికలతో బరిలోకి దిగాలని... లేకుంటే ఫలితాలు అనుకూలంగా రావని పాంటింగ్ అన్నాడు.మరోవైపు ఆసీస్ మాజీ పేసర్ జాన్సన్ భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈ నెల 6 నుంచి అడిలైడ్ వేదికగా ప్రారంభం కానున్న రెండో టెస్టు నుంచి లబుషేన్‌ను తప్పించాలని అన్నాడు. గత కొన్నాళ్లుగా ఫామ్లోలేక ఇబ్బంది పడుతున్న లబుషేన్ దేశవాళీల్లో ఆడితే తిరిగి లయ అందిపుచ్చుకోవచ్చని సూచించాడు. -
వాషింగ్టన్ సుందర్‌పై ఆసక్తి చూపని ఫ్రాంఛైజీలు.. ఆఖరికి!
టీమిండియా యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు ఐపీఎల్ మెగా వేలం-2025లో షాక్ తగిలింది. కనీస ధర రూ. 2 కోట్లతో ఆక్షన్‌లోకి వచ్చిన వాషీ కోసం తొలుత ఏ ఫ్రాంఛైజీ పెద్దగా ఆసక్తి చూపలేదు. కాసేపటికి.. గుజరాత్ టైటాన్స్ తొలుత బిడ్ వేసేందుకు ముందుకు వచ్చింది. కనీస ధరకు అతడిని దక్కించుకోవాలని చూసింది.ఈ క్రమంలో లక్నో సూపర్ జెయింట్స్ రంగంలోకి దిగగా.. గుజరాత్ కూడా వెనక్కి తగ్గలేదు. అయితే, ధర రూ. 3 కోట్లు దాటిన తర్వాత లక్నో తప్పుకోగా.. టైటాన్స్ ఆఖరికి రూ. 3.20 కోట్లకు వాషింగ్టన్ సుందర్‌ను దక్కించుకుంది. కాగా తమిళనాడుకు చెందిన వాషీ.. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్.మూడు జట్లకుక్యాష్ రిచ్ లీగ్‌లో 2017లో రైజింగ్ పుణె సూపర్‌జెయింట్ తరఫున అడుగుపెట్టిన వాషీ.. ఆ ఏడాది ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. అనంతరం 2018లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వాషీని రూ. 3.2 కోట్లకు కొనుక్కుంది. ఆర్సీబీ తరఫున అతడు మొత్తంగా 31 మ్యాచ్‌లు ఆడి 19 వికెట్లు తీశాడు.ఈ క్రమంలో 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వాషీని రూ. 8.75 కోట్లకు కొనుగోలు చేసి 2024 వరకు కొనసాగించింది. అయితే, ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు హైదరాబాద్ ఫ్రాంఛైజీ అతడిని వదిలేసింది. కాగా ఎస్ఆర్హెచ్ తరఫున వాషీకి పెద్దగా ఆడే అవకాశం రాలేదు. సన్‌రైజర్స్‌కు మొత్తంగా 18 మ్యాచ్‌లు ఆడిన వాషీ 10 వికెట్లు తీయడంతో పాటు 161 పరుగులు చేశాడు. ఇక వచ్చే ఏడాది అతడు గుజరాత్ టైటాన్స్‌కు ఆడబోతున్నాడు. ఇదిలా ఉంటే.. ఓవరాల్‌గా ఐపీఎల్లో వాషింగ్టన్ సుందర్ ఇప్పటి వరకు 60 మ్యాచ్‌లు ఆడి 378 రన్స్ చేయడంతో పాటు.. 37 వికెట్లు తీశాడు. -
వాషింగ్టన్ సుందర్‌కు భారీ ధర.. ఏకంగా రూ. 15.5 కోట్లు!
ఐపీఎల్-2025 మెగా వేలానికి సర్వం సిద్దమైంది. నవంబర్ 24-25 తేదీలలో జెడ్డా వేదికగా ఈ క్యాష్ రిచ్ లీగ్ మెగా ఆక్షన్ జరగనుంది. ఈ మెగా వేలంలో అందరి కళ్లు టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌పైనే ఉన్నాయి. అద్బుత ఫామ్‌లో ఉన్న సుందర్ ఎంత ధరకు అమ్ముడు పోతాడని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ క్రమంలో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నిర్వహించిన మాక్ వేలంలో వాషింగ్టన్కు కళ్లు చెదిరే ధర దక్కింది. కాగా మెగా వేలంలో వాషింగ్టన్ రూ. 2 కోట్ల కనీస ధరతో పేరును నమోదు చేసుకున్నాడు. శ్విన్ ఆన్లైన్లో కండక్ట్ చేసిన ఈ మాక్ వేలంలో సుందర్ కోసం తొలుత ఆర్సీబీ రూ. 2 కోట్లకు బిడ్ వేసింది. ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ పోటీలోకి వచ్చింది. ఎస్ఆర్హెచ్ క్రమక్రమంగా వాషింగ్టన్ ధరను రూ. 8 కోట్లకు పెంచింది. దీంతో ఆర్సీబీ పోటీ నుంచి తప్పుకొని గుజరాత్ జెయింట్స్ ఎంట్రీ ఇచ్చింది. ఆఖరికి గుజరాత్ జెయింట్స్ సుందర్ కోసం ఏకంగా రూ. 15.5 కోట్లు వెచ్చించి దక్కించుకుంది. కాగా సుందర్ గత కొన్ని సీజన్లగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే ఈ మెగా వేలానికి ముందు అతడిని ఎస్ఆర్హెచ్ రిటైన్ చేసుకోలేదు.న్యూజిలాండ్‌పై అదుర్స్..కాగా ఐపీఎల్-2024లో సుందర్ నిరాశపరిచాడు. ఈ ఏడాది సీజన్లో కేవలం రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. కానీ టీఎన్‌పీఎల్‌లో మాత్రం ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సుందర్ దుమ్ములేపాడు. ఆ తర్వాత అనుహ్యంగా భారత టెస్టు జట్టులోకి వచ్చిన వాషింగ్టన్.. న్యూజిలాండ్‌పై సంచలన ప్రదర్శన కనబరిచాడు. కేవలం రెండు మ్యాచ్‌ల్లో 16 వికెట్లు పడగొట్టి ఓవర్‌నైట్ హీరోగా మారిపోయాడు. ఈ క్రమంలోనే సుందర్‌కు ఐపీఎల్ మెగా వేలంలో భారీ ధర దక్కనుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో తొలి టెస్టు.. తెలుగోడి అరంగేట్రం ఫిక్స్!? -
IPL 2025: ఇషాన్ కాదు.. వాళ్లిద్దరికోసం ముంబై పోటీ.. వాషీ కూడా రేసులోనే..
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2025 మెగా వేలానికి ముహూర్తం ఖరారైంది. సౌదీ అరేబియాలోని జిద్దా నగరంలో నవంబరు 24, 25 తేదీల్లో వేలంపాట నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అందరి కళ్లు టీమిండియా స్టార్లపైనే ఉన్నాయి.రేసులో భారత స్టార్లురిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్ సహా రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్ తదితర సీనియర్ ప్లేయర్లు కూడా రేసులో ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈసారి ముంబై ఇండియన్స్ భారత స్పిన్నర్లను దక్కించుకునేందుకు ఇతర ఫ్రాంఛైజీలతో కచ్చితంగా పోటీపడుతుందని అభిప్రాయపడ్డాడు.పాలసీ పరిపూర్ణంగా ఉపయోగించుకునికాగా ఈసారి రిటెన్షన్ విధానాన్ని పరిపూర్ణంగా ఉపయోగించుకున్న జట్టు ముంబై ఇండియన్స్ అని చెప్పవచ్చు. నిబంధనలకు అనుగుణంగా ఐదుగురు క్యాప్డ్ ప్లేయర్లను అట్టిపెట్టుకుంది. జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, తిలక్ వర్మలను కొనసాగించాలని నిర్ణయించుకుంది.ఇక వీళ్లందరికి ఖర్చు పెట్టింది పోనూ.. ముంబై పర్సులో ఇంకా రూ. 45 కోట్లు మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘ముంబై బ్యాటింగ్ ఆర్డర్ మరోసారి పటిష్టంగానే కనిపిస్తోంది. అయితే, వాళ్ల రిటెన్షన్ లిస్టులో బుమ్రా రూపంలో ఒకే ఒక స్పెషలిస్టు బౌలర్ ఉన్నాడు.కాబట్టి వారికి ఇప్పుడు బౌలింగ్ విభాగాన్ని బలోపేతం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. నిజానికి ముంబై 225- 250 పరుగులు స్కోరు చేయగల సామర్థ్యం కలిగిన జట్టు. అయితే, అదే స్థాయిలో పరుగులు కూడా సమర్పించుకున్న సందర్భాలు ఉన్నాయి.బ్యాటింగ్ పైనే ఎక్కువగా ఏదేమైనా వాళ్లు బ్యాటింగ్ పైనే ఎక్కువగా ఆధారపడతారన్నది వాస్తవం. కానీ ప్రతిసారీ ఇదే టెక్నిక్ పనికిరాదు. వాళ్ల జట్టులో ఉంటే ఇండియన్ బ్యాటింగ్ లైనప్.. విదేశీ బౌలింగ్ లైనప్ ఉంటుంది. ఇప్పుడు వారికి ఇద్దరు స్పిన్నర్ల అవసరం కూడా ఉంది. అందుకే కచ్చితంగా వాళ్లు యుజీ చహల్ వెనుకపడటం ఖాయం.ఇషాన్ కాదుఒకవేళ అతడిని దక్కించుకోలేకపోతే.. ముంబై ఇండియన్స్ వాషింగ్టన్ సుందర్నైనా సొంతం చేసుకుంటుంది’’ అని చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా ఇషాన్ కిషన్ పేరును కూడా ప్రస్తావించిన ఆకాశ్ చోప్రా.. అతడిని ముంబై కొనుగోలు చేసే అవకాశం లేదని అభిప్రాయపడ్డాడు. వికెట్ కీపర్ కోటాలో ఇషాన్‌ను పరిగణించినా.. క్వింటన్ డికాక్ లేదంటే జితేశ్ శర్మ వైపు మొగ్గు చూపుతుందని అంచనా వేశాడు. చదవండి: Aus vs Pak: ఆసీస్‌కు కొత్త కెప్టెన్ -
జడేజా సూపర్ డెలివరీ.. కివీస్ బ్యాటర్ మైండ్ బ్లాంక్! వీడియో వైరల్
టీమిండియా స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా నిలకడైన ఆట తీరుతో ఆకట్టుకుంటున్నాడు. న్యూజిలాండ్‌తో తొలి రెండు టెస్టుల్లో కలిపి ఆరు వికెట్లే తీసిన జడ్డూ.. మూడో టెస్టులో మాత్రం అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. ముంబై మ్యాచ్‌లో కివీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించిన ఈ స్పిన్ బౌలర్.. ఏకంగా ఐదు వికెట్లు కూల్చాడు.క్రీజులో పాతుకుపోయిన న్యూజిలాండ్ బ్యాటర్ విల్ యంగ్(71)ను అవుట్ చేసి భారత శిబిరంలో జోష్ నింపిన జడ్డూ.. టామ్ బ్లండెల్(0), గ్లెన్ ఫిలిప్స్(17)ల వికెట్లు కూడా తానే దక్కించుకున్నాడు. అదే విధంగా టెయిలెండర్లు ఇష్ సోధి(7), మ్యాట్ హెన్రీ(0)లను అవుట్ చేసి ఐదు వికెట్ల హాల్‌ను పూర్తి చేసుకున్నాడు.అయితే, వీరందరిలోకెల్లా బ్లండెల్‌ను జడేజా అవుట్ చేసిన తీరు హైలైట్‌గా నిలిచింది. శుక్రవారం నాటి తొలిరోజు ఆటలో భాగంగా కివీస్ ఇన్నింగ్స్‌లో 45వ ఓవర్‌ను జడ్డూ వేశాడు. ఆ ఓవర్లో రెండో బంతికి విల్ యంగ్‌ను పెవిలియన్‌కు పంపిన ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్.. ఐదో బంతిని అద్భుత రీతిలో సంధించాడు.ఆ సమయంలో క్రీజులో ఉన్న బ్లండెల్ జడేజా సూపర్ డెలివరీకి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. సరైన లైన్ అండ్ లెంగ్త్‌తో జడ్డూ వేసిన బంతిని బ్యాక్‌ఫుట్‌తో డిఫెన్స్ చేసేందుకు ప్రయత్నించి బ్లండెల్ విఫలమయ్యాడు. రెప్పపాటులో బంతి స్టంప్‌ను ఎగురగొట్టడంతో బిక్కముఖం వేశాడు. నిజానికి బ్లండెల్ స్థానంలో ఏ బ్యాటర్ ఉన్నా ఇలాగే జరిగేది.. జడ్డూ వేసిన బంతి అలాంటిది మరి! ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా కివీస్‌తో బెంగళూరు, పుణెలలో జరిగిన టెస్టుల్లో జడ్డూ మూడేసి వికెట్లు తీశాడు. ఇక ఈ రెండు మ్యాచ్‌లలోనూ ఓటమిపాలైన టీమిండియా సిరీస్‌ను 0-2తో కోల్పోయింది. ముంబైలో జరుగుతున్న తాజా టెస్టులో గెలిస్తేనే క్లీన్‌స్వీప్ పరాభవం నుంచి తప్పించుకోవడంతో పాటు.. రోహిత్ సేనకు డబ్ల్యూటీసీ ఫైనల్ లైన్ ఈజీగా క్లియర్ అవుతుంది.ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా కివీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకు కట్టడి చేసింది. తొలిరోజే న్యూజిలాండ్‌ను ఆలౌట్ చేసింది. భారత బౌలర్లలో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు జడేజాకు ఐదు, వాషింగ్టన్ సుందర్‌కు నాలుగు వికెట్లు దక్కగా.. పేసర్ ఆకాశ్ దీప్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.అయితే, బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియాకు శుభారంభం లభించలేదు. ఓపెనర్లు రోహిత్ శర్మ(18), యశస్వి జైస్వాల్(30) త్వరత్వరగా పెవిలియన్‌కు చేరగా.. నాలుగో స్థానంలో వచ్చిన పేసర్ మహ్మద్ సిరాజ్ డకౌట్ అయ్యాడు. ఇక విరాట్ కోహ్లి(4) రనౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో 19 ఓవర్లలో 86 పరుగులు చేసిన టీమిండియా.. నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.చదవండి: IND A vs AUS A: సెంచరీకి చేరువైన సాయి సుదర్శన్Jadeja stuns the Kiwis with a double strike 💥 Catch LIVE action from the 3rd #INDvNZ Test, on #JioCinema, #Sports18 and #ColorsCineplex!#IDFCFirstBankTestTrophy #JioCinemaSports pic.twitter.com/Gyy3vZgTz2— JioCinema (@JioCinema) November 1, 2024 -
టీమిండియా స్పిన్నర్ల ప్రతాపం.. తొలిరోజే కివీస్ ఆలౌట్
న్యూజిలాండ్‌తో మూడో టెస్టును టీమిండియా మెరుగ్గా ఆరంభించింది. ముంబైలో శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్‌లో తొలిరోజే కివీస్‌ను ఆలౌట్ చేసింది. స్పిన్‌కు అనుకూలిస్తున్న వాంఖడే పిచ్‌పై రవీంద్ర జడేజా ఐదు వికెట్లతో చెలరేగగా.. వాషింగ్టన్ సుందర్ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు.ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25లో భాగంగా భారత జట్టు స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది. అయితే, బెంగళూరులో జరిగిన తొలి టెస్టులో ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయిన రోహిత్ సేన.. పుణె మ్యాచ్‌లోనూ ఘోర పరాభవం పాలైంది. కివీస్ చేతిలో ఏకంగా 113 పరుగుల తేడాతో భారీ ఓటమిని చవిచూసింది. పన్నెండేళ్ల తర్వాత టెస్టు సిరీస్ కోల్పోయితద్వారా సొంతగడ్డపై పన్నెండేళ్ల తర్వాత టెస్టు సిరీస్ కోల్పోయిన తొలి భారత జట్టుగా నిలిచింది. ఈ క్రమంలో ముంబైలో జరుగుతున్న మూడో టెస్టు టీమిండియాకు కీలకంగా మారింది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు సాఫీగా చేరాలన్నా.. వైట్‌వాష్ గండం నుంచి తప్పించుకోవాలన్నా ఈ మ్యాచ్‌లో గెలవడం రోహిత్ సేనకు అత్యంత ముఖ్యం. లంచ్‌కు ముందు ఇలాఈ నేపథ్యంలో శుక్రవారం మొదలైన మ్యాచ్‌లో టాస్ ఓడిన టీమిండియా తొలుత బౌలింగ్ చేసింది. కివీస్ బ్యాటింగ్ మొదలుపెట్టిన కాసేపటికే ప్రమాదకర ఓపెనర్ డెవాన్ కాన్వే(4)ను అవుట్ చేసి పేసర్ ఆకాశ్ దీప్ శుభారంభం అందించగా.. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కెప్టెన్, ఓపెనర్ టామ్ లాథమ్(28), రచిన్ రవీంద్ర(5) రూపంలో బిగ్ వికెట్లు దక్కించుకున్నాడు.జడేజా విశ్వరూపంలంచ్ బ్రేక్‌కు ముందు వీరిద్దరు కలిసి మూడు వికెట్లు తీయగా.. భోజన విరామం సమయం తర్వాత మరో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా విశ్వరూపం ప్రదర్శించాడు. విల్ యంగ్(71) రూపంలో తొలి వికెట్ దక్కించుకన్న జడ్డూ.. ఆ తర్వాత టామ్ బ్లండెల్(0)ను డకౌట్ చేశాడు. ఆ తర్వాత గ్లెన్ ఫిలిప్స్(17)ల పనిపట్టాడు.Jadeja stuns the Kiwis with a double strike 💥 Catch LIVE action from the 3rd #INDvNZ Test, on #JioCinema, #Sports18 and #ColorsCineplex!#IDFCFirstBankTestTrophy #JioCinemaSports pic.twitter.com/Gyy3vZgTz2— JioCinema (@JioCinema) November 1, 2024 అదే విధంగా ఇష్ సోధి(7), మ్యాట్ హెన్రీ(0) వికెట్లను కూడా జడ్డూ తన ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు.. వాషీ డారిల్ మిచెల్(82), అజాజ్ పటేల్(7)లను కూడా అవుట్ చేసి మొత్తంగా తన వికెట్ల సంఖ్యను నాలుగుకు పెంచుకున్నాడు. కివీస్ బ్యాటర్లలో విల్ యంగ్(71), డారిల్ మిచెల్(82) మినహా భారత స్పిన్నర్ల ప్రతాపం ముందు కివీస్ బ్యాటర్లంతా తలవంచారు. దీంతో 65.4 ఓవర్లలో న్యూజిలాండ్ 235 పరుగులు(తొలి ఇన్నింగ్స్) చేసి తొలిరోజే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో జడ్డూ ఐదు, వాషీ నాలుగు, ఆకాశ్ దీప్ ఒక వికెట్ దక్కించుకున్నారు.టీమిండియాకూ ఆదిలోనే ఎదురుదెబ్బఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కివీస్ పేసర్ మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో భారత కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ టామ్ లాథమ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దూకుడుగా ఆడిన రోహిత్ 18 బంతులు ఎదుర్కొని 18 పరుగులు చేశాడు.టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మూడో టెస్టు(నవంబరు 1- 5)👉వేదిక: వాంఖడే స్టేడియం, ముంబై👉టాస్: న్యూజిలాండ్.. తొలుత బ్యాటింగ్👉న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 235 రన్స్.. ఆలౌట్.చదవండి: చరిత్రకెక్కిన జడేజా.. జహీర్ రికార్డు బ్రేక్.. అరుదైన జాబితాలో చోటు -
IND Vs NZ: రెచ్చిపోయిన సుందర్.. లంచ్ విరామం సమయానికి కివీస్ స్కోర్ ఎంతంటే..?
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య ఇవాళ (నవంబర్ 1) మూడో టెస్ట్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి సెషన్లో టీమిండియా ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ రెచ్చిపోయాడు. కివీస్ స్టార్ బ్యాటర్లు టామ్ లాథమ్ (28), రచిన్ రవీంద్రను (5) క్లీన్ బౌల్డ్ చేశాడు. డెవాన్ కాన్వేను (4) ఆకాశ్‌దీప్ ఎల్బీడబ్ల్యూ చేశాడు. లంచ్ విరామం సమయానికి న్యూజిలాండ్ 3 వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది. విల్ యంగ్ (38), డారిల్ మిచెల్ (11) క్రీజ్‌లో ఉన్నారు.WASHINGTON SUNDAR WITH TWO ABSOLUTE JAFFAS..!!!- First Latham, now Rachin. 🤯👌pic.twitter.com/JBz5P04YwP— Mufaddal Vohra (@mufaddal_vohra) November 1, 2024రెండో టెస్ట్‌లో 11 వికెట్లు పడగొట్టి సత్తా చాటిన సుందర్ ఈ మ్యాచ్‌లోనూ ఇరగదీస్తున్నాడు. కాగా, ఈ మ్యాచ్ కోసం న్యూజిలాండ్ రెండు మార్పులు చేసింది. మిచెల్ సాంట్నర్ గాయపడటంతో అతని స్థానంలో ఐష్ సోధి.. టిమ్ సౌథీ స్థానంలో మ్యాట్ హెన్రీ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు భారత్ సైతం ఓ మార్పు చేసింది. బుమ్రా స్థానంలో సిరాజ్ తుది జట్టులోకి వచ్చాడు. బుమ్రా అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది.Akash Deep traps Conway. 🔥 pic.twitter.com/tuTjqKupDf— Mufaddal Vohra (@mufaddal_vohra) November 1, 2024తుది జట్లు..భారత్: రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్‌దీప్, మొహమ్మద్ సిరాజ్న్యూజిలాండ్: టామ్ లాథమ్, డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్, గ్లెన్ ఫిలిప్స్, ఐష్ సోధి, మ్యాట్ హెన్రీ, అజాజ్ పటేల్, విలియమ్ ఓరూర్కీఇదిలా ఉంటే, మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన న్యూజిలాండ్ ఇదివరకే సిరీస్‌ను కైవసం చేసుకుంది. -
Ind vs NZ: అతడిపై వేటు.. హర్షిత్ రాణా అరంగేట్రం ఫిక్స్!?
హర్షిత్ రాణా త్వరలోనే టీమిండియా అరంగేట్రం చేయనున్నాడా? ఆస్ట్రేలియాతో సిరీస్ కంటే ముందే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టనున్నాడా? అంటే అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. ఈ ఏడాది ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను చాంపియన్‌గా నిలపడంలో తనవంతు పాత్ర పోషించిన ఈ పేస్ బౌలర్.. టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిఈ క్రమంలో జింబాబ్వేతో టీ20 సిరీస్ సందర్భంగా తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికైనా ఇంత వరకు అరంగేట్రం చేయలేదు. అయితే, బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు ఆస్ట్రేలియా వెళ్లనున్న టెస్టు జట్టులో రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపికయ్యాడు హర్షిత్ రాణా. భారత-ఎ జట్టులో భాగమైన యువ క్రికెట్లరు ఇప్పటికే ఆస్ట్రేలియాకు వెళ్లగా హర్షిత్ మాత్రం రంజీ మ్యాచ్ కోసం భారత్‌లోనే ఉన్నాడు. అసోంతో మ్యాచ్ సందర్భంగా ఢిల్లీ తరఫున బరిలోకి దిగిన హర్షిత్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. మొత్తంగా ఏడు వికెట్లు తీయడంతో పాటు ధనాధన్ హాఫ్ సెంచరీ(4 ఫోర్లు, 3 సిక్స్‌లు- 59 రన్స్)తో ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో హర్షిత్ రాణాను కివీస్‌తో మూడో టెస్టులో బరిలోకి దించాలని హెడ్‌కోచ్ గౌతం గంభీర్ భావిస్తున్నట్లు సమాచారం.ఆకాశ్ దీప్‌పై వేటు?ఆస్ట్రేలియా పర్యటన నేపథ్యంలో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినివ్వడం సహా ఫామ్‌లేమితో సతమతమవుతున్న మహ్మద్ సిరాజ్‌ను పక్కనపెట్టాలనే యోచనలో కోచ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆకాశ్ దీప్‌ను తప్పించి హర్షిత్ రాణాను ఆడించాలని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ప్రత్యర్థి బ్యాటర్ ఎంతటి ఘనుడైనా తనదైన శైలిలో బంతులు విసురుతూ వికెట్లు పడగొట్టగల సత్తా ఈ స్పీడ్‌స్టర్ సొంతం.అప్పుడు వాషీ.. ఇప్పుడు రాణాఇక కేకేఆర్ మెంటార్‌గా హర్షిత్‌ను దగ్గరగా గమనించిన గంభీర్.. ఈ ఢిల్లీ పేసర్‌కు కివీస్‌తో మూడో టెస్టులో అవకాశం ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాగా న్యూజిలాండ్‌తో స్వదేశంలో మూడు టెస్టుల సిరీస్‌లో రోహిత్ సేన ఇప్పటికే రెండు ఓడిపోయింది. సిరీస్ కోల్పోయినా పరువు నిలబెట్టుకోవాలంటే నవంబరు 1 నుంచి ముంబైలో జరిగే ఆఖరి టెస్టులో గెలుపు తప్పనిసరి!ఇదిలా ఉంటే.. మొదటి టెస్టులో టీమిండియా ఓటమి తర్వాత రెండో టెస్టుకు వాషింగ్టన్ సుందర్‌ను ఎంపిక చేసిన చేసిన విషయం తెలిసిందే. పుణె టెస్టులో ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ పదకొండు వికెట్లతో సత్తా చాటాడు. ఇప్పుడిక హర్షిత్ రాణా వంతు వచ్చిందేమో?!చదవండి: గంభీర్ సర్ వల్లే ఆరోజు అలా.. టెస్టుల్లోనూ రాణిస్తా: నితీశ్ రెడ్డి -
IPL 2025: వాషింగ్టన్ సుందర్ కోసం ఎగబడుతున్న ఫ్రాంఛైజీలు
న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో 11 వికెట్లు పడగొట్టి టెస్ట్ క్రికెట్లోకి ఘనంగా రీఎంట్రీ ఇచ్చిన టీమిండియా స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ద క్రికెట్ సర్కిల్స్‌గా మారాడు. ఐపీఎల్ 2025 మెగా వేలం నేపథ్యంలో ఈ చెన్నై చిన్నోడిని దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు ఎగబడుతున్నట్లు తెలుస్తుంది. సుందర్ కోసం మూడు ఫ్రాంచైజీలు పక్కా ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీలు సుందర్‌పై ఎంత ధర అయినా వెచ్చించేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తుంది. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కావడం, అందులోనూ ఇటీవల సూపర్ ఫామ్‌లో ఉండటం సుందర్‌కు ప్లస్ పాయింట్‌గా పరిగణించబడుతుంది. ఐపీఎల్ వర్గాల సమాచారాం మేరకు సుందర్‌కు 10 కోట్లకు పైనే శాలరీ లభించవచ్చని అంచనా. సుందర్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ సైతం వదులుకునే పరిస్థితి లేదు. ఎస్ఆర్హెచ్ సుందర్‌ను డైరెక్ట్‌గా రిటైన్ చేసుకోలేకపోయినా ఆర్టీఎమ్ కార్డు ద్వారా సొంతం చేసుకునే అవకాశం ఉంది.కాగా, అన్ని ఫ్రాంచైజీలు తమతమ రిటెన్షన్ జాబితాలను సమర్పించడానికి అక్టోబర్ 31 చివరి తేదీ అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతమున్న సమాచారం మేరకు ఒక్కో ఫ్రాంచైజీ ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవచ్చు. ఇందులో గరిష్టంగా అయిదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్లకు అవకాశం ఉంటుంది. రిటైన్ చేసుకునే క్యాప్డ్ ప్లేయర్లకు ఛాయిస్ ప్రకారం వరుసగా 18, 14, 11 కోట్ల శాలరీ ఇవ్వాల్సి ఉంటుంది. రిటైన్ చేసుకునే అన్క్యాప్డ్ ప్లేయర్‌కు 4 కోట్లు పారితోషికం చెల్లించాల్సి ఉంటుంది. ఐపీఎల్-2025 వేలం నవంబర్ 25 లేదా 26 తేదీల్లో రియాద్‌లో జరగవచ్చు. -
వావ్! సుందర్ స్పిన్ మ్యాజిక్.. దెబ్బకు రవీంద్ర మైండ్ బ్లాంక్( వీడియో)
పుణే వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ తన స్పిన్ మయాజాలాన్ని కొనసాగిస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ బ్యాటర్ రచిన్ రవీంద్రను అద్బుతమైన బంతితో బోల్తా కొట్టించిన సుందర్.. ఇప్పుడు రెండో ఇన్నింగ్స్‌లో కూడా అదే తీరులో ఔట్ చేశాడు.సుందర్ సంధించిన డెలివరీకి రవీంద్ర దగ్గర సమాధానమే లేకుండా పోయింది. సంచలన బంతితో వాషింగ్టన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. కివీస్ సెకెండ్ ఇన్నింగ్స్ 22 ఓవర్ వేసిన వాషీ ఐదో బంతిని కొంచెం వేగంతో లెంగ్త్ డెలివరీగా రచిన్‌కు సంధించాడు. అయితే ఆ డెలివరీని రచిన్ కట్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి మాత్రం అతడి బ్యాట్‌కు మిస్ అయ్యి ఆఫ్ స్టంప్‌ను గిరాటేసింది. ఇది చూసిన రచిన్ ఒక్కసారిగా బిత్తర పోయాడు. దీంతో కేవలం 9 పరుగులు మాత్రమే చేసి రచిన్ మైదానాన్ని వీడాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా ఈ మ్యాచ్‌లో కివీస్ పట్టు బిగిస్తోంది. రెండో ఇన్నింగ్స్‌లో 35 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ 4 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది.ప్రస్తుతం బ్లాక్ క్యాప్స్ 250 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. అంతకుముందు టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 156 పరుగులకే కుప్పకూలింది. కివీ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ 7 వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించాడు. pic.twitter.com/A4ogHu0XbW— Drizzyat12Kennyat8 (@45kennyat7PM) October 25, 2024 -
Ind vs NZ: వాషీకి సలహా.. బెడిసికొట్టగానే పంత్ రియాక్షన్ వైరల్
టీమిండియా స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్‌కు వికెట్ కీపర్ బ్యాటర్ క్రికెటర్ రిషభ్ పంత్ ఇచ్చిన సలహా బెడిసికొట్టింది. ఫలితంగా.. వికెట్ తీయాలనుకున్న వాషీకి.. బ్యాటర్ బౌండరీ బాది షాకిచ్చాడు. దీంతో మాట మార్చిన పంత్.. తనదేమీ తప్పులేదన్నట్లుగా సమర్థించుకోవడంతో వాషీ బిక్కముఖం వేశాడు. ఇంతకీ సంగతి ఏమిటంటే..!న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో ఓడిన టీమిండియా.. పుణె వేదికగా గురువారం రెండో టెస్టు మొదలుపెట్టింది. టాస్ గెలిచిన కివీస్ తొలుత బ్యాటింగ్ చేయగా.. రోహిత్ సేన బౌలింగ్‌కు దిగింది.ఈ క్రమంలో రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్ మూడు వికెట్లు తీయగా.. వాషింగ్టన్ సుందర్ ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టాడు. ఈ ఇద్దరు చెన్నై బౌలర్లు కలిసి కివీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులకు ఆలౌట్ చేశారు. ఇదిలా ఉంటే.. గురువారం నాటి తొలి రోజు ఆటలో భాగంగా కివీస్ ఇన్నింగ్స్‌లో 78వ ఓవర్ వాషీ వేశాడు.పంత్ సలహాను పాటించిన వాషీఅప్పుడు.. న్యూజిలాండ్ టెయిలెండర్ అజాజ్ పటేల్ క్రీజులో ఉన్నాడు. ఈ క్రమంలో అతడి కాళ్ల ముందు కాస్త ఎడంగా బాల్ వేయాలని వికెట్ కీపర్ రిషభ్ పంత్ వాషింగ్టన్కు సూచించాడు. అందుకు సానుకూలంగా స్పందించిన వాషీ.. పంత్ సలహాను పాటించాడు.PC: Jio Cinema Xఫోర్ కొట్టిన అజాజ్ పటేల్అయితే, వీరి సంభాషణను అర్థం చేసుకున్న అజాజ్ పటేల్ కాస్త ముందుకు వచ్చి ఆడి బంతిని బౌండరీకి తరలించాడు. దీంతో వాషీ నిరాశకు గురికాగా.. పంత్ మాత్రం.. ‘‘అతడికి హిందీ వచ్చని నాకేం తెలుసు?’’ అంటూ తన సలహాను సమర్థించుకున్నాడు.ఇక పంత్ కామెంట్స్ స్టంప్ మైక్‌లో రికార్డయ్యాయి. కాగా భారత సంతతికి చెందిన అజాజ్ పటేల్ ముంబైలో జన్మించాడు. తనకు ఎనిమిదేళ్ల వయసు ఉన్నపుడు అజాజ్ కుటుంబం న్యూజిలాండ్‌కు వెళ్లింది. మరి పంత్ హిందీలో వాషీతో మాట్లాడుతుంటే అజాజ్ పటేల్‌కు అర్థం కాకుండా ఉంటుందా?! అదీ సంగతి!156 పరుగులకే ఆలౌట్‌కాగా శుక్రవారం 16-1తో రెండో రోజు బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియా 156 పరుగులకు ఆలౌట్ అయింది. కివీస్ స్పిన్నర్లు మిచెల్ సాంట్నర్ ఏడు, గ్లెన్ ఫిలిప్స్ రెండు వికెట్లు తీయగా.. పేసర్ టిమ్ సౌతీ ఒక వికెట్ పడగొట్టాడు.చదవండి: ఒక్క పరుగు.. 8 వికెట్లు.. 53 పరుగులకే కుప్పకూలిన డిఫెండింగ్ చాంపియన్In today's episode of 𝘒𝘦𝘦𝘱𝘪𝘯𝘨 𝘸𝘪𝘵𝘩 𝘙𝘪𝘴𝘩𝘢𝘣𝘩 𝘗𝘢𝘯𝘵! 👀😂#INDvNZ #IDFCFirstBankTestTrophy #JioCinemaSports #TeamIndia pic.twitter.com/LoUC31wADr— JioCinema (@JioCinema) October 24, 2024 -
‘సప్త’ సుందర్
వాషింగ్టన్ సుందర్ టెస్టు మ్యాచ్ ఆడి మూడున్నరేళ్లు దాటింది. ఈ సిరీస్ తొలి టెస్టులో అతనికి చోటే లేదు. అయితే రంజీ ట్రోఫీలో ప్రదర్శన కారణంగా జట్టులో నలుగురు రెగ్యులర్ స్పిన్నర్లు ఉన్నా రెండో టెస్టు కోసం 16వ సభ్యుడిగా అతడిని అదనంగా ఎంపిక చేశారు. ఆఫ్ స్పిన్‌తో పాటు బ్యాటింగ్ చేయగల సామర్థ్యం అతనికి ఈ అవకాశం కల్పించింది. తొలి రోజు సుందర్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఏకంగా ఏడు వికెట్లతో న్యూజిలాండ్‌ను పడగొట్టాడు. సహచర తమిళనాడు సీనియర్ అశ్విన్ తొలి మూడు వికెట్లతో మొదలు పెడితే సుందర్ దానిని కొనసాగించాడు. కివీస్‌ను 259 పరుగులకే పరిమితం చేసిన టీమిండియా... రోహిత్ శర్మ వికెట్ చేజార్చుకొని రోజును కాస్త నిరాశగా ముగించింది. పుణే: భారత్, న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టులో ఊహించినట్లుగానే తొలి రోజు నుంచే స్పిన్నర్ల జోరు మొదలైంది. ఆఫ్‌స్పిన్నర్లు వాషింగ్టన్ సుందర్ (7/59), రవిచంద్రన్ అశ్విన్ (3/64) ధాటికి న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 79.1 ఓవర్లలో 259 పరుగులకే ఆలౌటైంది. డెవాన్ కాన్వే (141 బంతుల్లో 76; 11 ఫోర్లు), రచిన్ రవీంద్ర (105 బంతుల్లో 65; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలు చేశారు. అనంతరం ఆట ముగిసేసరికి భారత్ 11 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 16 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (0) డకౌట్ కాగా... యశస్వి జైస్వాల్ (6 బ్యాటింగ్), శుబ్‌మన్ గిల్ (10 బ్యాటింగ్) తమ దూకుడును కట్టిపెట్టి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. ఈ మ్యాచ్ కోసం భారత్ మూడు మార్పులు చేసింది. కేఎల్ రాహుల్, సిరాజ్, కుల్దీప్ యాదవ్ స్థానాల్లో గిల్, ఆకాశ్‌దీప్, సుందర్ జట్టులోకి వచ్చారు. ఈసారీ వారిద్దరే... గత టెస్టు తరహాలోనే ఈ సారి కూడా కివీస్ టాప్–7లో కాన్వే, రచిన్ మాత్రమే చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌లు ఆడగా... మిగతా వారంతా విఫలమయ్యారు. పేసర్లు వేసిన తొలి 7 ఓవర్లలో కివీస్ 5 ఫోర్లతో చకచకా 30 పరుగులు రాబట్టింది. అయితే ఇన్నింగ్స్ 8వ ఓవర్లోనే అశ్విన్‌ను బౌలింగ్‌కు దించడం ఫలితాన్ని అందించింది. తన ఐదో బంతికే టామ్ లాథమ్ (15)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న అతను కొద్ది సేపటికే విల్ యంగ్ (18)ను పెవిలియన్ పంపించాడు. ఈ దశలో కాన్వే, రచిన్ కలిసి జట్టును ఆదుకున్నారు. లంచ్ తర్వాత బుమ్రా వేసిన తొలి ఓవర్లో 3 ఫోర్లు కొట్టిన కాన్వే 109 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఎట్టకేలకు 62 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యం తర్వాత కాన్వేను అవుట్ చేసి అశ్విన్ ఈ జోడీని విడగొట్టాడు. అయితే రచిన్ మాత్రం చక్కటి షాట్లతో ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఆకాశ్‌దీప్ ఓవర్లో రెండు వరుస ఫోర్లతో అతను 93 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకోగా... ఒకదశలో కివీస్ 197/3 స్కోరుతో పటిష్ట స్థితిలో నిలిచింది. టపటపా... స్పిన్నర్ సుందర్ కొత్త స్పెల్‌తో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. చక్కటి బంతితో రచిన్‌ను క్లీన్»ౌల్డ్ చేసి కివీస్ పతనానికి శ్రీకారం చుట్టిన అతను తర్వాతి ఓవర్లో బ్లన్‌డెల్ (3) పని పట్టాడు. టీ విరామం తర్వాత చివరి సెషన్లో మిగిలిన ఐదు వికెట్లు తీసేందుకు సుందర్‌కు ఎక్కువ సమయం పట్టలేదు. అతని బంతులను ఆడలేక బ్యాటర్లంతా వికెట్లు సమర్పించుకున్నారు. ఒక్క మిచెల్ సాన్‌ట్నర్ (51 బంతుల్లో 33; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మాత్రమే కొద్దిసేపు పోరాడగలిగాడు. తన తొలి 13 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా తీయని సుందర్ తర్వాత 61 బంతుల వ్యవధిలో 7 వికెట్లు పడగొట్టడం విశేషం. ప్రత్యర్థి 10 వికెట్లను ఇద్దరు ఆఫ్ స్పిన్నర్లే కలిసి పడగొట్టడం భారత్ తరఫున ఇదే తొలిసారి. 62 పరుగుల వ్యవధిలో కివీస్ చివరి 7 వికెట్లు కోల్పోయింది. స్కోరు వివరాలు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: లాథమ్ (ఎల్బీ) (బి) అశ్విన్ 15; కాన్వే (సి) పంత్ (బి) అశ్విన్ 76; యంగ్ (సి) పంత్ (బి) అశ్విన్ 18; రచిన్ (బి) సుందర్ 65; మిచెల్ (ఎల్బీ) (బి) సుందర్ 18; బ్లన్‌డెల్ (బి) సుందర్ 3; ఫిలిప్స్ (సి) అశ్విన్ (బి) సుందర్ 9; సాన్‌ట్నర్ (బి) సుందర్ 33; సౌతీ (బి) సుందర్ 5; ఎజాజ్ (బి) సుందర్ 4; రూర్కే (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (79.1 ఓవర్లలో ఆలౌట్) 259. వికెట్ల పతనం: 1–32, 2–76, 3–138, 4–197, 5–201, 6–204, 7–236, 8–242, 9–252, 10–259. బౌలింగ్: బుమ్రా 8–2–32–0, ఆకాశ్‌దీప్ 6–0–41–0, అశ్విన్ 24–2–64–3, వాషింగ్టన్ సుందర్ 23.1–4–59–7, జడేజా 18–0–53–0. భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (బ్యాటింగ్) 6; రోహిత్ (బి) సౌతీ 0; గిల్ (బ్యాటింగ్) 10; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం (11 ఓవర్లలో వికెట్ నష్టానికి) 16. వికెట్ల పతనం: 1–1. బౌలింగ్: సౌతీ 3–1–4–1, రూర్కే 3–2–5–0, ఎజాజ్ 3–1–5–0, సాన్‌ట్నర్ 2–0–2–0. -
వరల్డ్ రికార్డు.. 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలోనే
పుణే వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత స్పిన్నర్లు సత్తాచాటారు. ఆఫ్ స్పిన్నర్లు వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్‌లు బంతితో మ్యాజిక్ చేశారు. తమ స్పిన్ మయాజాలంతో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించారు.ఈ ఇద్దరు తమిళ తంబీల దాటికి కివీస్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. అయితే తొలుత అశ్విన్ వికెట్ల వేటను మొదలు పెట్టగా.. సుందర్ ముగించాడు. కివీస్ మొత్తం పది వికెట్లను ఈ ఇద్దరే పడగొట్టారు.వాషింగ్టన్ ఏకంగా 7 వికెట్లు పడగొట్టగా.. అశ్విన్ 3 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక న్యూజిలాండ్ 10 వికెట్లు పడగొట్టిన అశ్విన్-సుందర్ జోడీ పలు అరుదైన ఘనతలను తన పేరిట లిఖించుకున్నారు.వరల్డ్ రికార్డు..→టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో మొత్తం పది వికెట్లు పడగొట్టిన ఆఫ్-స్పిన్ జోడీగా అశ్విన్-సుందర్ నిలిచారు. 147 ఏళ్ల టెస్టు క్రికెట్ హిస్టరీలో ఈ ఘనత ఎవరికి సాధ్యం కాలేదు.→అదే విధంగా టెస్టుల్లో ఓ ఇన్నింగ్స్‌లో మొత్తం 10 వికెట్లు పడగొట్టిన భారత ఆఫ్ స్పిన్ జోడీ కూడా వీరిద్దరే కావడం విశేషం.వీరికంటే ముందు ఏ భారత కుడిచేతి వాటం స్పిన్నర్లు కూడా ఈ ఫీట్ సాధించలేకపోయారు.→మరోవైపు భారత్ గడ్డపై టెస్టుల్లో తొలి రోజు మొదటి ఇన్నింగ్స్‌లో పది వికెట్లు స్పిన్నర్లే తీయడం ఇది ఆరోసారి. ఈ ఘనతను అంతకంటే ముందు భారత్ నాలుగు సార్లు సాధించగా, ఇంగ్లండ్ ఒక్కసారి సాధించింది. -
అతడెందుకు దండగ అన్నారు.. కట్ చేస్తే! 7 వికెట్లతో
అతడిని ఎందుకు ఎంపిక చేశారు? కుల్దీప్ యాదవ్ కన్న తోపు స్పిన్నరా? అసలు రోహిత్ శర్మ, గంభీర్‌కు ఏమైంది? ఇవన్నీ న్యూజిలాండ్‌తో రెండో టెస్టుకు వాషింగ్టన్ సుందర్‌ను ఎంపిక చేయడంపై మాజీలు సంధించిన విమర్శల బాణాలు. అయితే మ్యాచ్ ఆరంభం తర్వాత మొత్తం సీన్ మారిపోయింది. సుందర్‌ను విమర్శించిన నోళ్లే ఇప్పుడు శెభాష్ అంటున్నాయి.45 నెలల తర్వాత..కివీస్ తొలి టెస్టు ఓటమి అనంతరం మిగిలిన రెండు టెస్టులకు అనూహ్యంగా వాషింగ్టన్ సుందర్‌ను భారత జట్టులోకి బీసీసీఐ చేర్చింది. రంజీ ట్రోఫీలో తమిళనాడుకు ప్రాతినిథ్యం వహిస్తున్న సుందర్ అర్ధాంతరంగా పుణేలో టీమిండియాతో చేరాడు. అయితే అతడిని కేవలం బ్యాకప్‌గానే తీసుకున్నారని అంతా భావించారు.కానీ రెండో టెస్టుకు టీమిండియా మెనెజ్‌మెంట్ తుది జట్టులో వాషీకి చోటిచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది. కుల్దీప్ యాదవ్ వంటి స్టార్ స్పిన్నర్‌ను తీసుకురావడాన్ని పలువురు మాజీలు తప్పుబట్టారు. అయితే 45 నెలల తర్వాత భారత టెస్టు జట్టులోకి వచ్చిన సుందర్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచి అందరి అంచనాలను తలకిందలు చేశాడు. ఏకంగా 7 వికెట్లు పడగొట్టి కివీస్‌ను నామమాత్రపు స్కోర్‌కే పరిమితం చేశాడు. బంతిని గింగరాలు తిప్పుతూ న్యూజిలాండ్ బ్యాటర్లను బోల్తా కొట్టించాడు. తొలి స్పెల్‌లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన సుందర్.. రెండో స్పెల్‌లో రవీంద్రను ఔట్ చేసి తన వికెట్ల వేటను మొదలు పెట్టాడు. ఓవరాల్‌గా తొలి ఇన్నింగ్స్‌లో 23.1 ఓవర్లు బౌలింగ్ చేసిన వాషింగ్టన్.. 59 పరుగులు ఇచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. సుందర్ ఈ ఇన్నింగ్స్‌లో ఐదుగురు బ్యాటర్లను క్లీన్‌బౌల్డ్ చేయడం విశేషం. అంతేకాకుండా టెస్టుల్లో ఈ తమిళ తంబీ ఐదు వికెట్ల కంటే ఎక్కువ పడగొట్టడం ఇదే తొలిసారి.కివీస్@259ఇక ఈ మ్యాచ్‌లో పర్యాటక కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులకు ఆలౌటైంది. కివీస్ బ్యాటర్లలో డెవాన్ కాన్వే(76) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రచిన్ రవీంద్ర(65) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో సుందర్‌తో పాటు మరో తమిళనాడు స్పిన్నర్ అశ్విన్ 3 వికెట్లు పడగొట్టాడు. ఇక మొదటి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. 🚨 WASHINGTON SUNDAR PRODUCE THE BALL OF THE SERIES 🚨 pic.twitter.com/vLvo4ipYAY— Johns. (@CricCrazyJohns) October 24, 2024 -
IND vs NZ: ముగిసిన తొలి రోజు ఆట.. రోహిత్ శర్మ డకౌట్
పుణే వేదికగా న్యూజిలాండ్-భారత్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. మొదటి రోజు ఆటముగిసే సమయానికి టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. క్రీజులో యువ ఆటగాళ్లు శుబ్‌మన్ గిల్(10), యశస్వీ జైశ్వాల్(6) పరుగులతో ఆజేయంగా ఉన్నారు.అయితే కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం నిరాశపరిచాడు. 9 బంతులు ఎదుర్కొని ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. కివీస్ స్టార్ పేసర్ టిమ్ సౌథీ బౌలింగ్‌లో రోహిత్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.ఏడేసిన సుందర్..ఇక ఈ మ్యాచ్‌లో భారత ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. 7 వికెట్లతో సుందర్ సత్తాచాటాడు. కివీస్ నామమాత్రపు స్కోర్‌కే పరిమితం కావడంలో వాషింగ్టన్ కీలక పాత్ర పోషించాడు. అతడితో పాటు అశ్విన్ 3 వికెట్లు పడగొట్టాడు. న్యూజిలాండ్ బ్యాటర్లలో ఓపెనర్ డేవాన్ కాన్వే (76; 141 బంతుల్లో 11 ఫోర్లు) హాఫ్ సెంచరీతో మెరవగా.. రచిన్ రవీంద్ర (65; 105 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. -
ఏడేసిన వాషింగ్టన్.. 259 పరుగులకు న్యూజిలాండ్ ఆలౌట్
పుణే వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత స్పిన్నర్లు అదరగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా స్పిన్నర్ల దాటికి కివీస్ 259 పరుగులకు ఆలౌటైంది. అనుహ్యంగా పుణే టెస్టుకు భారత జట్టులో చోటు దక్కించుకున్న ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ సంచలన ప్రదర్శన కనబరిచాడు.తొలి ఇన్నింగ్స్‌లో సుందర్ ఏకంగా 7 వికెట్లతో చెలరేగాడు. తన స్పిన్ మయాజాలంతో ప్రత్యర్ధి బ్యాటర్లను సుందర్ ముప్పు తిప్పలు పెట్టాడు. ముఖ్యంగా వాషీ తన సెకెండ్ స్పెల్‌లో అయితే అద్భుతమైన బంతులతో కివీస్ బ్యాటర్లను బోల్తా కొట్టించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 23.1 ఓవర్లు బౌలింగ్ చేసిన వాషింగ్టన్.. 59 పరుగులు ఇచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో 5 వికెట్లు పైగా సుందర్ పడగొట్టడం తన కెరీర్లో ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక అతడితో పాటు మరో స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు సాధించి తనవంతు పాత్ర పోషించాడు.మరోసారి కాన్వే, రచిన్..ఇక కివీస్ బ్యాటర్లలో రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కాన్వే 76 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రవీంద్ర(65) హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఆఖరిలో శాంట్నర్(33) కాసేపు అలరించాడు. ఇక మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. క్రీజులో యువ ఆటగాళ్లు శుబ్‌మన్ గిల్(10), యశస్వీ జైశ్వాల్(6) పరుగులతో ఆజేయంగా ఉన్నారు. అయితే ఆదిలోనే భారత్‌కు బిగ్ షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్‌గా వెనుదిరిగాడు. -
వారెవ్వా వాషింగ్టన్.. దెబ్బకు కివీస్ ప్లేయర్ల ఫ్యూజ్‌లు ఔట్! వీడియో
పుణే వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ తన స్పిన్ మయాజాలాన్ని ప్రదర్శించాడు. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ బ్యాటర్లు రచిన్ రవీంద్ర, టామ్ బ్లండెల్, డార్లీ మిచెల్‌ను అద్బుతమైన బంతులతో సుందర్ బోల్తా కొట్టించాడు.ముఖ్యంగా రవీంద్ర, బ్లండెల్‌ను వాషీ ఔట్ చేసిన తీరు ఇన్నింగ్స్ మొత్తానికే హైలెట్‌గా నిలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. కుల్దీప్ యాదవ్ స్ధానంలో జట్టులోకి వచ్చిన సుందర్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ వచ్చాడు.తొలి స్పెల్‌లో అద్బుతంగా బౌలింగ్ చేసిన సుందర్‌ను కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ 59 ఓవర్ల తర్వాత ఎటాక్‌లో తీసుకువచ్చాడు. అప్పటికే క్రీజులో పాతుకుపోయిన రచిన్ రవీంద్రను పెవిలియన్‌కు పంపేందుకు హిట్‌మ్యాన్ సుందర్‌కు బంతి ఇచ్చాడు. అయితే కెప్టెన్ నమ్మకాన్ని సుందర్ వమ్ము చేయలేదు.రచిన్ షాక్..కివీస్ ఇన్నింగ్స్ 60వ ఓవర్ వేసిన వాషింగ్టన్ తొలి బంతిని రచిన్‌కు రౌండ్ ది వికెట్ నుంచి మిడిల్ స్టంప్ దిశగా సంధించాడు. అయితే ఆ డెలివరీని రచిన్ ఫ్రంట్ ఫుట్ మీద డిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ మిడిల్ స్టంప్ దిశగా పడిన బంతి ఎవరూ ఊహించని విధంగా టర్న్ అవుతూ ఆఫ్ స్టంప్‌ను గిరాటేసింది.ఇది చూసిన రచిన్ ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. చేసేదేమి లేక 65 పరుగులతో రచిన్ మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. మరోవైపు బ్లండెల్‌ను కూడా సుందర్ ఈ తరహాలోనే క్లీన్ బౌల్డ్ చేశాడు.62 ఓవర్లో ఆఖరి బంతిని సుందర్ బ్లండెల్‌కు ఔట్ సైడ్ ఆఫ్ దిశగా సంధించాడు. కానీ బంతి మాత్రం ఒక్క సారిగా లోపలకు టర్న్ అవుతూ స్టంప్స్‌ను తాకింది. దెబ్బకు 3 పరుగులు చేసిన బ్లండెల్ బిత్తర పోయాడు. 76 ఓవర్ల ముగిసే సరికి న్యూజిలాండ్ 8 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. కాగా ఈ మ్యాచ్‌లో సుందర్ ఫైవ్ వికెట్ల హాల్ సాధించాడు. ఇప్పటివరకు 22 ఓవర్లు బౌలింగ్ చేసిన సుందర్ 54 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. టెస్టు క్రికెట్లో సుందర్‌కు ఇదే తొలి ఫైవ్ వికెట్ల హాల్ కావడం విశేషం.T. I. M. B. E. R! 🎯Cracker of a ball! 👌 👌Washington Sundar with a breakthrough 🙌 🙌Live ▶️ https://t.co/YVjSnKCtlI #TeamIndia | #INDvNZ | @Sundarwashi5 | @IDFCFIRSTBank pic.twitter.com/OC8VS7fnwT— BCCI (@BCCI) October 24, 2024చదవండి: WTC: చరిత్ర సృష్టించిన అశ్విన్ -
Ind vs NZ: టీమిండియాలోకి చెన్నై చిన్నోడు.. బీసీసీఐ ప్రకటన
న్యూజిలాండ్‌తో మిగిలిన రెండు టెస్టులకు టీమిండియా క్రికెటర్ వాషింగ్టన్ సుందర్ అందుబాటులోకి వచ్చాడు. కివీస్‌తో పుణె, ముంబై మ్యాచ్‌లకు అతడిని ఎంపిక చేసినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఆదివారం ప్రకటన విడుదల చేసింది.ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25లో భాగంగా రోహిత్ సేన స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌లు ఆడుతోంది. ఈ క్రమంలో బెంగళూరులో జరిగిన తొలి టెస్టులో ఎనిమిది వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. తొలి ఇన్నింగ్స్‌లో మరీ దారుణంగా 46 పరుగులకే ఆలౌట్ అయిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు(462) చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే మిగిలిన రెండు టెస్టులు కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ వాషింగ్టన్ సుందర్‌ను తిరిగి పిలిపించడం ఆసక్తికరంగా మారింది. బెంగళూరు టెస్టులో విఫలమైన రవీంద్ర జడేజా నేపథ్యంలో ఈ తమిళనాడు క్రికెటర్‌పై సెలక్టర్లు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. భారీ సెంచరీతో మెరిసిన వాషీకాగా రంజీ ట్రోఫీ 2024-25లో భాగంగా తమిళనాడు తరఫున వాషింగ్టన్ సుందర్ ఢిల్లీతో మ్యాచ్ సందర్భంగా బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్‌లో భారీ సెంచరీ(269 బంతుల్లో 152; 19 ఫోర్లు, ఒక సిక్సర్)తో సత్తా చాటాడు.తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు(674/6 డిక్లేర్డ్) సాధించడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే అతడు మూడేళ్ల తర్వాత టెస్టులో రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా వాషింగ్టన్ సుందర్ 2021లో చివరగా టెస్టు మ్యాచ్ ఆడాడు.‘పెద్దోడి’కి తోడుగా చిన్నోడు!ఇదిలా ఉంటే.. న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో రవీంద్ర జడేజా తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఐదు పరుగులకే వెనుదిరిగాడు. అయితే, ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు తీయగలిగాడు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే కివీస్‌తో సిరీస్‌లో చెన్నై దిగ్గజ స్పిన్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ‘పెద్దోడి’కి చిన్నోడు జతకావడం విశేషం. కాగా టీమిండియా- న్యూజిలాండ్ మధ్య అక్టోబరు 24- 28 వరకు పుణె వేదికగా రెండో టెస్టు, నవంబరు 1-5 వరకు మూడో టెస్టు నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.న్యూజిలాండ్‌తో రెండు, మూడో టెస్టులకు భారత జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, వాషింగ్టన్ సుందర్.చదవండి: సర్ఫరాజ్ కాదు!.. మిడిలార్డర్లో అతడిని ఆడించాలి: మాజీ క్రికెటర్ 🚨 News 🚨Squad Update: Washington Sundar added to squad for the second and third Test#INDvNZ | @IDFCFIRSTBankDetails 🔽— BCCI (@BCCI) October 20, 2024 -
తమిళనాడు 674/6 డిక్లేర్డ్
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో భాగంగా ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో తమిళనాడు భారీ స్కోరు చేసింది. గ్రూప్ ‘డి’లో భాగంగా జరిగిన పోరులో తమిళనాడు 674/6 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. టీమిండియా ప్లేయర్ వాషింగ్టన్ సుందర్ (269 బంతుల్లో 152; 19 ఫోర్లు, ఒక సిక్సర్) భారీ సెంచరీతో కదం తొక్కగా... ప్రదోష్ రంజన్ పాల్ (117; 13 ఫోర్లు) శతకం చేశాడు. అంతకుముందు ఓపెనర్ సాయి సుదర్శన్ (213; 25 ఫోర్లు, ఒక సిక్సర్) కూడా ద్విశతకం నమోదు చేసుకోవడంతో తమిళనాడు భారీ స్కోరు చేయగలిగింది. నారాయన్ జగదీశన్ (65), సిద్ధార్థ్ (66 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించారు. ఢిల్లీ బౌలర్లలో నవ్‌దీప్ సైనీ, హిమాన్షు చౌహాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఓవర్‌నైట్ స్కోరు 379/1తో శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన తమిళనాడు జట్టు ఆడుతూ పాడుతూ పరుగులు రాబట్టింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఢిల్లీ... రెండో రోజు ఆట ముగిసే సమయానికి 16 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేసింది. సనత్ సాంగ్వాన్ (23 బ్యాటింగ్), హర్‡్ష త్యాగీ (15 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. చేతిలో 10 వికెట్లు ఉన్న ఢిల్లీ... ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 631 పరుగులు వెనుకబడి ఉంది. -
టీమిండియా స్టార్ అక్క.. ఈమె కూడా క్రికెటరే! (ఫొటోలు)
-
కుల్దీప్ కాదు!.. టీమిండియాలో అశ్విన్ వారసుడు ఇతడే: డీకే
ప్రపంచంలోని అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్. ఇప్పటివరకు 100 టెస్టులు ఆడిన ఈ చెన్నై స్టార్ 516 వికెట్లు తన ఖతాలో వేసుకున్నాడు. తద్వారా అనిల్ కుంబ్లే తర్వాత భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన స్పిన్ బౌలర్‌గా అశూ కొనసాగుతున్నాడు.ఇక అశ్విన్ తదుపరి సొంతగడ్డ వేదికగా బంగ్లాదేశ్ టెస్టు సిరీస్‌కు సన్నద్ధమవుతున్నాడు. ఇదిలా ఉంటే.. 37 ఏళ్ల ఈ రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్‌కు సరైన వారసుడు ఇతడేనంటూ టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాలో అశ్విన్ స్థానాన్ని భర్తీ చేయగల సత్తా మరో చెన్నై స్టార్కే ఉందని అభిప్రాయపడ్డాడు.కుల్దీప్ కాదు!ఇప్పటికే జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకున్న చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను కాదని.. వాషింగ్టన్ సుందర్ పేరును చెప్పాడు డీకే. ఈ మేరకు క్రిక్‌బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘కొత్త తరం ఆఫ్ స్పిన్నర్ కోసం టీమిండియా వెదుకుతోంది. ఇంగ్లండ్ లయన్స్‌తో ఇండియా-ఏ సిరీస్ సందర్భంగా మూడు మ్యాచ్‌లలో ముగ్గురు వేర్వేరు స్పిన్నర్లను బరిలోకి దించడమే ఇందుకు నిదర్శనం.పుల్కిత్ నారంగ్, వాషింగ్టన్ సుందర్, సారాంశ్ జైన్లను ఈ సిరీస్ సందర్భంగా పరీక్షించింది. వీరిలో రవిచంద్రన్ అశ్విన్ స్థానాన్ని భర్తీ చేయగల నైపుణ్యం వాషింగ్టన్ సుందర్‌కే ఉంది. అశూ వారసుల పోటీలో అతడే ముందుంటానడంలో సందేహం లేదు. తనకు లభించిన కొద్దిపాటి అవకాశాలను కూడా వాషీ సద్వినియోగం చేసుకున్నాడు.అతడే సరైన వాడు.. ఎందుకంటే?అందుకే.. అశూ స్థానంలో అతడే సరైన వాడని చెప్పగలను’’ అంటూ దినేశ్ కార్తిక్ వాషీ పేరు చెప్పడానికి గల కారణాన్ని వెల్లడించాడు. కాగా 2017లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన వాషింగ్టన్ సుందర్ లెఫ్టాండ్ బ్యాటర్.. అదే విధంగా రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్. 24 ఏళ్ల ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్లో 4 టెస్టులు, 22 వన్డేలు, 49 టీ20లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 6, 23, 44 వికెట్లు తీశాడు. చివరగా శ్రీలంకతో వన్డే సిరీస్‌లో పాల్గొన్నాడు వాషీ. -
ఐసీసీ అవార్డుకు నామినేట్ అయిన టీమిండియా ప్లేయర్
టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. జులై నెలలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన మరో ఇద్దరితో కలిసి సుందర్ ఈ అవార్డు రేసులో నిలిచాడు. సుందర్‌తో పాటు ఇంగ్లండ్ పేసర్ గస్ అట్కిన్సన్, స్కాట్లాండ్ బౌలర్ చార్లీ కాస్సెల్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినేట్ అయ్యారు. మహిళల విభాగంలో శ్రీలంక కెప్టెన్ చమారీ ఆటపట్టు, టీమిండియా ప్లేయర్లు స్మృతి మంధన, షఫాలీ వర్మ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు రేసులో నిలిచారు. వీరందరు జులై నెలలో వివిధ ఫార్మాట్లలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చారు.Presenting the nominees for the Men's and Women's ICC Player of the Month for July 2024.Whom would you cast your vote for? pic.twitter.com/nAqqtwOBok— CricTracker (@Cricketracker) August 5, 2024గస్ అట్కిన్సన్: 26 ఏళ్ల అట్కిన్సన్ జులై నెలలో స్వదేశంలో విండీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో అరంగేట్రం చేశాడు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో అట్కిన్సన్ ఏకంగా 22 వికెట్లు పడగొట్టాడు.చార్లీ కాస్సెల్: 25 ఏళ్ల కాస్సెల్ స్కాట్లాండ్ తరఫున వన్డే అరంగేట్రంలో రికార్డు గణాంకాలు నమోదు చేశాడు. ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో కాస్సెల్ 5.4 ఓవర్లలో 21 పరుగులిచ్చి ఏడు వికెట్లు పడగొట్టాడు. వన్డే అరంగేట్రంలో ఇవే అత్యుత్తమ గణాంకాలు.వాషింగ్టన్ సుందర్: జులైలో జింబాబ్వేతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో సుందర్ ఎనిమిది వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ సిరీస్‌గా నిలిచాడు. ఈ సిరీస్ మూడో టీ20లో సుందర్ సూపర్ ఓవర్లో కేవలం రెండు పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.చమారీ అటపట్టు: చమారీ జులైలో జరిగిన ఆసియా కప్‌లో 101.33 సగటున 204 పరుగులు చేసింది. ఈ టోర్నీ ఫైనల్లో శ్రీలంక భారత్‌పై విజయం సాధించి టైటిల్ ఎగరేసుకుపోయింది.స్మృతి మంధన: మంధన జులైలో సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 149 పరుగులు చేసింది. ఆతర్వాత సౌతాఫ్రికాతోనే జరిగిన టీ20 సిరీస్‌లోనూ (47, 54 నాటౌట్) రాణించింది. ఆసియా కప్‌లోనూ స్మృతి రెండు అర్ద సెంచరీలతో సత్తా చాటింది.షఫాలీ వర్మ: షఫాలీ జులై నెలలో సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో చెలరేగింది. అనంతరం ఆసియా కప్‌లోనూ సత్తా చాటింది. షఫాలీ నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 48 బంతుల్లో 81 పరుగులు చేసింది. -
వాషీని కొట్టడానికి వచ్చిన రోహిత్ శర్మ!?.. వీడియో వైరల్
కొలంబో వేదికగా భారత్-శ్రీలంక మధ్య జరిగిన రెండో వన్డేలో ఓ ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన చర్యతో నవ్వులు పూయించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.అసలేం జరిగిందంటే?శ్రీలంక ఇన్నింగ్స్ 32వ ఓవర్ వేసేందుకు భారత స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ ఎటాక్‌లో వచ్చాడు. అయితే తొలి బంతిని డెలివరీ చేసే క్రమంలో వాషింగ్టన్ తన రన్ఆప్ను కోల్పోయి వికెట్ల దగ్గరకి వచ్చి ఆగిపోయాడు. ఈ క్రమంలో స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ ఇది చూసి నవ్వుకున్నాడు. కాగా రెండో సారి కూడా సుందర్ బంతిని డెలివరీ చేసే క్రమంలో వికెట్ల వద్దకి వచ్చి ఆగిపోయాడు. అయితే ఈసారి మాత్రం హిట్‌మ్యాన్ తనదైన స్టైల్లో స్పందించాడు. స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ.. వాషింగ్టన్ సుందర్‌ను కొట్టేందుకు పరిగెత్తుకుంటా ముందుకు వచ్చాడు. నిన్ను కొట్టేస్తా అన్నట్లు సరదగా రోహిత్ సైగలు చేశాడు. ఇదంతా స్టంప్ మైక్‌లో రికార్డు అయింది. దీంతో వాషీతో పాటు సహచర ఆటగాళ్లంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో 32 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. Rohit Sharma is a complete entertainer in the field. 💥👌 pic.twitter.com/cqjlkFxGP3— Johns. (@CricCrazyJohns) August 4, 2024 -
నేనేం చేయాలి.. నన్నెందుకు చూస్తున్నావు?: వాషీపై రోహిత్ ‘ఫైర్’!
దాదాపు నెల రోజుల విశ్రాంతి తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పునరాగమనం చేశాడు. శ్రీలంకతో వన్డే సిరీస్‌లో భాగంగా శుక్రవారం నాటి తొలి మ్యాచ్ సందర్భంగా మైదానంలో దిగాడు. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరుగుతున్న ఈ వన్డేలో ఆతిథ్య శ్రీలంక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.ఈ క్రమంలో భారత జట్టు బౌలింగ్‌కు దిగగా.. పేసర్ మహ్మద్ సిరాజ్ ఆదిలోనే వికెట్ తీశాడు. లంక ఓపెనర్ అవిష్క ఫెర్నాండో(1) రూపంలో టీమిండియాకు తొలి వికెట్ అందించాడు. అనంతరం.. శివం దూబే కుశాల్ మెండిస్(14), అక్షర్ పటేల్ సమరవిక్రమ(8) వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్ చరిత్ అసలంక(14)ను పెవిలియన్‌కు పంపాడు.ఇక స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ 27వ ఓవర్ మూడో బంతికి.. హాఫ్ సెంచరీ వీరుడు పాతుమ్ నిసాంక(56)ను అవుట్ చేసి మంచి బ్రేక్ ఇచ్చాడు. అయితే, 29వ ఓవర్లో వాషింగ్టన్ సుందర్ చేసిన పనికి.. కెప్టెన్ రోహిత్ శర్మ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ హైలైట్‌గా నిలిచింది. దునిత్ వెల్లలగే క్రీజులో ఉన్న సమయంలో(28.5) సుందర్ గంటకు 91 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరాడు.ఈ క్రమంలో షాట్ ఆడేందుకు ప్రయత్నించిన వెల్లలగే విఫలమయ్యాడు. అయితే, బాల్ బ్యాట్ కంటే ప్యాడ్‌కు ముందు తాకిందని భావించిన వాషీ.. లెగ్ బిఫోర్ వికెట్(ఎల్బీడబ్ల్యూ) కోసం అప్పీలు చేశాడు. అయితే, అంపైర్ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.దీంతో..స్లిప్‌లో ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ వైపు చూసిన వాషీ.. అతడి గైడెన్స్ కావాలన్నట్లుగా సైగ చేశాడు. ఇందుకు బదులుగా.. ‘‘ఏంటి? నువ్వే చెప్పాలి కదా!... అయినా నాకేం కనిపిస్తుందని నన్ను అడుగుతున్నావు? నువ్వు చేయాల్సిన పని కూడా నేనే చేయాలా? ’’ అంటూ సరదాగా కసురుకున్నాడు. స్టంప్ మైకులో ఈ వ్యాఖ్యలు రికార్డు అయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో శ్రీలంక.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 230 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు తీయగా.. శివం దూబే, సిరాజ్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. Vintage stump mic banter from @ImRo45 😆 Watch the action from #SLvIND LIVE now on Sony Sports Ten 1, Sony Sports Ten 3, Sony Sports Ten 4 & Sony Sports Ten 5 🤩 📺#SonySportsNetwork #SLvIND #TeamIndia #RohitSharma pic.twitter.com/HYEM5LxVus— Sony Sports Network (@SonySportsNetwk) August 2, 2024 -
టీ20 సిరీస్ క్లీన్‌స్వీప్: ఇది చాలదు.. ఇంకా కావాలి: గంభీర్
టీమిండియా హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్‌కు ఘనమైన ఆరంభం లభించింది. అతడి మార్గదర్శనంలోని టీమిండియా శ్రీలంకతో టీ20 సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. లంక పర్యటనలో భాగంగా మూడు టీ20లలోనూ గెలుపొంది మరోసారి తమ స్థాయిని చాటుకుంది. ఈ నేపథ్యంలో జట్టును ఉద్దేశించి గంభీర్ ప్రసంగించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది.‘‘అద్భుతమైన విజయం ఇది. సిరీస్ గెలిచినందుకు మీ అందరికీ అభినందనలు. అత్యద్భుతమైన కెప్టెన్సీతో జట్టుకు విజయం అందించిన సూర్యకు శుభాకాంక్షలు. బ్యాటర్‌గానూ అతడు అద్భుత ప్రదర్శన కనబరిచాడు. సిరీస్ ఆరంభానికి ముందు నేను ఏం కోరుకుంటున్నానో మీకు చెప్పాను.అయితే, మీరు అంతకంటే ఎక్కువే సాధించారు. అయితే, ఇలాంటి వికెట్లపై రాణించాలంటే మన నైపుణ్యాలకు మరింత పదును పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది. పిచ్ స్వభావం, ఎంత మేర స్కోరు చేయవచ్చో ముందుగానే అంచనా వేస్తున్నాం. అయితే, కొన్నిసార్లు అంచనాలు తప్పవచ్చు. ఈ మ్యాచ్ ద్వారా మనమెన్నో కొత్త పాఠాలు నేర్చుకున్నాం. సిరీస్ గెలుపు కంటే కూడా ఇదే గొప్ప విషయం’’ అని గౌతం గంభీర్ టీమిండియాను ఉద్దేశించి స్ఫూర్తిదాయక వ్యాఖ్యలు చేశాడు. కాగా మంగళవారం నాటి మూడో టీ20లో భారత జట్టు బ్యాటింగ్ చెత్తగా సాగింది.నిర్ణీత 20 ఓవర్లలో 137 పరుగుల నామమాత్రపు స్కోరుకు పరిమితమైంది. ఈ క్రమంలో ఆతిథ్య లంక గట్టిపోటీనివ్వడంతో టీమిండియా ఓటమి దాదాపుగా ఖరారైంది. అయితే, భారత బౌలర్ల కారణంగా మ్యాచ్ టై అవడంతో సూపర్ ఓవర్ నిర్వహించారు. ఈ క్రమంలో టీమిండియా స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ సూపర్ ఓవర్ వేయగా.. శ్రీలంక 3 బంతులాడి 2 వికెట్లు కోల్పోయి 2 పరుగులే చేసింది. ఇక 3 పరుగుల లక్ష్యాన్ని భారత్ తొలి బంతికే బౌండరీ బాది ఛేదించింది.𝗧𝗵𝗶𝘀 𝗧𝗲𝗮𝗺 💙 Head Coach Gautam Gambhir 🤝 Hardik Pandya address the dressing room as the action now shifts to the ODIs in Colombo #TeamIndia | #SLvIND | @GautamGambhir | @hardikpandya7 pic.twitter.com/PFrTEVzdvd— BCCI (@BCCI) July 31, 2024 -
అరుదైన ఘనత సాధించిన వాషింగ్టన్ సుందర్.. తొలి భారత ప్లేయర్‌గా రికార్డు
టీమిండియా స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ తాజాగా ముగిసిన జింబాబ్వే టీ20 సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో అతను 5 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. అలాగే రెండు సార్లు బ్యాటింగ్‌కు దిగి 28 పరుగులు చేశాడు. మూడో టీ20లో సుందర్ పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు మూడు వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.సిరీస్ ఆధ్యాంతం బంతితో అద్బుతమైన ప్రదర్శన చేసినందుకు సుందర్‌ను ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు వరించింది. ఈ అవార్డు లభించడం సుందర్‌కు ఇది రెండో సారి. కెరీర్లో రెండో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించిన అనంతరం సుందర్ ఓ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుల కంటే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు ఎక్కువగా గెలుచుకున్న తొలి భారత క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు.సుందర్ టీ20ల్లో ఒక్క ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును.. అదీ ఇదే జింబాబ్వే సిరీస్‌లో గెలుచుకున్నాడు. ఈ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డుకు ముందు సుందర్ ఓసారి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు.అంతర్జాతీయ టీ20ల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుల కంటే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు ఎక్కువగా గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో సుందర్ నాలుగో స్థానంలో నిలిచాడు. సుందర్‌కు ముందు ముగ్గురు ఆటగాళ్లు ఈ ఘనత సాధించారు.రీజా హెండ్రిక్స్ (సౌతాఫ్రికా)- 3 ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు, 1 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుటిమ్ సీఫర్ట్ (న్యూజిలాండ్)- 3 ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు, 2 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుఅలెక్స్ కుసక్ (ఐర్లాండ్)- 2 ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు, 1 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుఇదిలా ఉంటే, జింబాబ్వేతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా 4-1 తేడాతో కైవసం చేసుకుంది. -
‘జడ్డూ వారసుడు’.. వాషింగ్టన్ సుందర్ రియాక్షన్ ఇదే
జింబాబ్వేతో టీ20 సిరీస్‌లో టీమిండియా యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ నిలకడగా రాణిస్తున్నాడు. మొదటి మ్యాచ్‌లో 27 పరుగులు చేయడంతో పాటు.. కీలక సమయంలో రెండు వికెట్లు తీశాడు.ఆ మ్యాచ్ల్ భారత్ ఓడినా వాషీ మాత్రం ఆకట్టుకున్నాడు. ఇక రెండో టీ20లో టాపార్డర్ అదరగొట్టడంతో సుందర్‌కు బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు. ఈ మ్యాచ్‌లో టీమిండియా 234 భారీ స్కోరు నెలకొల్పగా.. జింబాబ్వే 134 పరుగులకే కుప్పకూలింది.ఇందులో వాషింగ్టన్ సుందర్ కూడా తన వంతు పాత్ర పోషించాడు. జొనాథన్ కాంప్‌బెల్ వికెట్ దక్కించుకోవడంతో పాటు లోయర్ ఆర్డర్లో నిలదొక్కుకున్న ల్యూక్ జోంగ్వే ఇచ్చిన క్యాచ్ పట్టాడు.ఈ మ్యాచ్‌లో శుబ్‌మన్ గిల్ సేన 100 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇక కీలకమైన మూడో టీ20లోనూ 23 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ఇందులో వాషింగ్టన్ సుందర్‌దే కీలక పాత్ర.హరారే వేదికగా బుధవారం నాటి మ్యాచ్‌లో టీమిండియా విధించిన 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జింబాబ్వే తడబడింది. భారత బౌలర్ల దెబ్బకు నిర్ణీత 20 ఓవర్లలో 159 పరుగులకే పరిమితమైంది.వాషింగ్టన్ సుందర్ అద్భుత బౌలింగ్(3/15)తో రాణించి టీమిండియాను గెలిపించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.ఈ నేపథ్యంలో విజయానంతరం వాషింగ్టన్ సుందర్ మాత్రం మాట్లాడుతూ.. దేశానికి ఆడటం తనకు ఎల్లప్పుడూ అద్భుతంగా అనిపిస్తుందని పేర్కొన్నాడు. తీవ్ర ఒత్తిడి నెలకొన్నా ప్రణాళికలను పక్కా అమలు చేసి గెలుపొందామని హర్షం వ్యక్తం చేశాడు.ఈ సందర్భంగా.. టీ20లలో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా స్థానాన్ని భర్తీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారా అంటూ వాషీకి ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘జట్టు కోసం నేనేం చేయగలనో అన్నీ చేస్తాను.ప్రతీ మ్యాచ్ కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతాను. ప్రతీసారి నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు కృషి చేస్తాను. ఆ విషయంలో మాత్రం అస్సలు రాజీ పడను’’ అని వాషింగ్టన్ సుందర్ పేర్కొన్నాడు. తనకు అప్పజెప్పిన బాధ్యతలను పూర్తి చేయడంపై మాత్ర దృష్టి సారిస్తానని స్పష్టం చేశాడు.కాగా చెన్నైకి చెందిన వాషింగ్టన్ సుందర్ 2021లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. లెఫ్టాండ్ బ్యాటర్ అయిన వాషీ.. రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్.ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్లో 4 టెస్టులు, 19వన్డేలు, 46 టీ20లు ఆడి 265, 265, 134 పరుగులు చేశాడు. అదే విధంగా ఆయా ఫార్మాట్లలో ఆరు, 18, 40 వికెట్లు తీశాడు వాషింగ్టన్ సుందర్. కాగా టీ20 ప్రపంచకప్-2024 ముగిసిన తర్వాత రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20లకు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. -
సత్తా చాటిన శుభ్‌మన్, సుందర్.. మూడో టీ20లో టీమిండియా గెలుపు
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా జింబాబ్వేతో ఇవాళ (జులై 10) జరిగిన మూడో టీ20 టీమిండియా 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. శుభ్‌మన్ గిల్ (49 బంతుల్లో 66; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్ (28 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), యశస్వి జైస్వాల్(27 బంతుల్లో 26; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తా చాటడంతో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. రెండో మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన అభిషేక్ శర్మ ఈ మ్యాచ్‌లో 10 పరుగులకే ఔటయ్యాడు. సంజూ శాంసన్ (12), రింకూ సింగ్ (1) అజేయంగా నిలిచారు. శుభ్‌మన్ గిల్ ఆరు ఇన్నింగ్స్‌ల తర్వాత టీ20ల్లో హాఫ్ సెంచరీ చేశాడు. జింబాబ్వే బౌలర్లలో సికందర్ రజా, ముజరబాని తలో రెండు వికెట్లు పడగొట్టారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే.. 39 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఘోర ఓటమి దిశగా సాగింది. అయితే డియాన్ మైర్స్ (65 నాటౌట్), మదండే (37) జింబాబ్వేను దారుణ పరాభవం బారిన పడకుండా తప్పించారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 77 పరుగులు జోడించారు. ఓ దశలో (మైర్స్, మదండే క్రీజ్‌లో ఉండగా) జింబాబ్వే టీమిండియాకు షాకిచ్చేలా కనిపించింది. అయితే ఇన్నింగ్స్ ఆఖర్లో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో జింబాబ్వేకు ఓటమి తప్పలేదు. ఆ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ (4-0-15-3), ఆవేశ్ ఖాన్ (4-0-39-2), ఖలీల్ అహ్మద్ (4-0-15-1) అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఈ మ్యాచ్‌లో గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. నాలుగో టీ20 జులై 13న జరుగనుంది. కాగా, తొలి మ్యాచ్‌లో జింబాబ్వే, రెండో మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. -
ఆ రూల్ వల్ల భారత ఆల్రౌండర్లకు చాలా నష్టపోతున్నారు: రోహిత్ శర్మ
ఐపీఎల్లో అమల్లో ఉన్న ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ నిబంధన వల్ల భారత ఆల్‌రౌండర్లు చాలా నష్టపోతున్నారని వాపోయాడు. వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే లాంటి వారు తమ బౌలింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించుకోవడానికి వీలు లేకుండా పోయిందని అన్నాడు. ఓవరాల్‌గా ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనకు తాను అభిమానిని కాదని పేర్కొన్నాడు. వినోదం కోసం నిబంధనలను ఇంతలా సడలించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. తాజాగా జరిగిన ఓ పోడ్కాస్ట్లో హిట్‌మ్యాన్ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఈ పోడ్కాస్ట్లో రోహిత్ క్రికెటర్లకు సంబంధించిన చాలా విషయాలను షేర్ చేసుకున్నాడు. కాగా, ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను 2023 సీజన్లో ప్రవేశపెట్టారు. ఈ రూల్ వల్ల అన్ని జట్లు అవసరానికి అనుగుణంగా ఓ అదనపు ప్లేయర్ సేవలను వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు తొలుత బ్యాటింగ్ చేసే జట్టు అదనంగా ఓ బ్యాటర్‌ను వినియోగించుకుంటుంది. అలాగే తొలుత బౌలింగ్ చేసే జట్టుకు అదనంగా ఓ బౌలర్ సేవలు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. మొత్తంగా చూస్తే 11 మంది ఆడాల్సిన క్రికెట్ ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల 12 మంది క్రికెట్‌గా మారింది. శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్ లాంటి ఆల్‌రౌండర్లు కేవలం బ్యాటింగ్‌కే పరిమితమవుతున్నారు. దీని వల్ల వారిని ఆల్రౌండర్లుగా పరిగణించలేని పరిస్థితి ఏర్పడింది. దేశానికి ప్రాతినిథ్యం వహించే సమయంలో ఆల్రౌండర్లకు డిమాండ్ ఉంటుంది. అలాంటప్పుడు వీరు ఏదో ఒక విభాగానికే పరిమితమైతే వారి కెరీర్లు ఇరుకున పడే ప్రమాదం ఉంది. -
Ind vs Eng: అతడు జడేజా కాదు కదా.. టీమిండియాకు కష్టమే
India vs England 2nd Test: ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు రవీంద్ర జడేజా దూరం కావడం టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బేనని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆల్‌రౌండర్ జడ్డూ అని.. అతడు లేని లోటును ప్రస్తుత జట్టులోని ఏ ఆటగాడూ తీర్చలేడని పేర్కొన్నాడు. కాగా స్టోక్స్ బృందంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో రోహిత్ సేన 28 పరుగుల తేడాతో పరాజయం పాలైన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత మ్యాచ్ టీమిండియా చేతిలో ఉందనిపించినప్పటికీ.. అనూహ్య రీతిలో పుంజుకున్న ఇంగ్లండ్ గెలిచి సత్తా చాటింది. మొదటి టెస్టులో అదరగొట్టాడు అయితే, ఈ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన టీమిండియా ఆటగాళ్లలో స్పిన్ ఆల్‌రౌండర్ జడేజా పేరు ముందు వరుసలో ఉంటుందనడంలో సందేహం లేదు. ఉప్పల్ టెస్టులో మొత్తంగా ఐదు వికెట్లు తీయడంతో పాటు.. 89 పరుగులు సాధించాడు. అయితే, ఈ మ్యాచ్ సందర్భంగా తొడ కండరాలు పట్టేయడంతో జడ్డూ వైజాగ్‌లో జరుగనున్న రెండో టెస్టుకు దూరమయ్యాడు. అతడితో పాటు కేఎల్ రాహుల్ కూడా గాయం బారిన పడటంతో వీరి స్థానాల్లో వాషింగ్టన్ సుందర్, సర్ఫరాజ్ ఖాన్, సౌరభ్ కుమార్‌లకు పిలుపునిచ్చారు బీసీసీఐ సెలక్టర్లు. టీమిండియాకు కష్టమే ఈ విషయంపై స్పందించిన మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా.. ‘‘జడ్డూ ఉంటేనే టీమిండియాకు బలం. బ్యాటర్‌గా.. బౌలర్‌గా.. గన్ ఫీల్డర్‌గా అతడి సేవలను జట్టు కచ్చితంగా మిస్సవుతుంది. ప్రస్తుతం ప్రపంచం మొత్తంలో అతడే నంబర్ వన్ టెస్టు ఆల్‌రౌండర్ అనడంలో సందేహం లేదు. ఇంగ్లండ్‌తో తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆధిక్యంలో నిలిచిందంటే అందుకు కారణం జడేజానే. అతడు ఉన్నా.. మరో జడ్డూ కాలేడు కదా జట్టులో ఉంటే అతడు కనీసం రెండు నుంచి మూడు వికెట్లు తీయడం కూడా గ్యారెంటీ. జడ్డూ స్థానంలో బ్యాటింగ్ కూడా చేయగల బ్యాటర్‌ను తీసుకోవాలని మేనేజ్మెంట్ భావించడం సహజం. కాబట్టి వాషింగ్టన్ సుందర్‌కే ఆ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే, అతడు పరుగులు ఇవ్వకుండా పొదుపుగా బౌలింగ్ చేయగలడేమో గానీ వికెట్లు మాత్రం తీయలేడు. బ్యాటింగ్ పరంగా అతడు మెరుగైన ఆటగాడే. అయితే, వాషీ జడ్డూ మాత్రం కాలేడు కదా’’ అని వ్యాఖ్యానించాడు. ఏదేమైనా వాషింగ్టన్ సుందర్‌ను తుదిజట్టులో ఆడించినా జడ్డూ లేని లోటును మాత్రం పూడ్చలేడని ఆకాశ్ చోప్రా ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. కాగా టీమిండియా - ఇంగ్లండ్ మధ్య ఫిబ్రవరి 2 నుంచి వైజాగ్‌లో రెండో టెస్టు ఆరంభం కానుంది. చదవండి: Rishabh Pant: చచ్చిపోయానేమో అనుకున్నా.. -
టీమిండియాకు బిగ్ షాక్! రాహుల్, జడేజా దూరం: బీసీసీఐ ప్రకటన
ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు ముందు టీమిండియా భారీ షాక్ తగిలింది. ఈ మ్యాచ్‌కు భారత స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా గాయాల కారణంగా దూరమయ్యారు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ధృవీకరించింది. "వైజాగ్‌లో ఇంగ్లండ్‌తో జరగనున్న రెండో టెస్టుకు రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ దూరమయ్యారు. జడేజా తొడకండరాల గాయంతో బాధపడుతున్నాడు. అదేవిధంగా రాహుల్ సైతం కుడి కాలి కండరాల నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. వీరిద్దరూ ప్రస్తుతం జట్టు వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నారని" బీసీసీఐ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టు నాలుగో రోజు ఆటలో వేగంగా పరిగెత్తిన జడేజాకు తొడకండరాలు పట్టేశాయి. అనంతరం మైదానాన్ని ఇబ్బంది పడుతూ వీడాడు. అయితే జడేజా గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో రెండో టెస్టుకు దూరమయ్యాడు. మరోవైపు రాహుల్ కూడా ఫీల్డింగ్‌లో కండరాల నొప్పితో బాధపడినట్లు తెలుస్తోంది. ఇక రెండో టెస్టుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ ముగ్గురి ఆటగాళ్లను ప్రధాన జట్టులో చేర్చింది. ఎప్పటినుంచో జట్టులో ఛాన్స్‌కు ఎదురుచూస్తున్న ముంబై బ్యాటర్ సర్ఫారాజ్ ఖాన్‌కు ఎట్టకేలకు సెలక్టర్లు పిలుపునిచ్చారు. రెండో టెస్టుకు రాహుల్, జడ్డూ దూరం కావడంతో సర్ఫారాజ్‌కు సెలక్టర్లు ఛాన్స్ ఇచ్చారు. అతడితో పాటు యూపీ ఆల్‌రౌండర్ సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఫిబ్రవరి 2 నుంచి వైజాగ్ వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది. కాగా తొలి టెస్టులో 28 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. The Men's Selection Committee have added Sarfaraz Khan, Sourabh Kumar and Washington Sundar to India's squad.#INDvENG https://t.co/xgxI8NsxpV — BCCI (@BCCI) January 29, 2024 -
‘ఫీల్డర్ ఆఫ్ ది సిరీస్’ మెడల్ కోహ్లిదే.. రోహిత్ రియాక్షన్ వైరల్
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి మేటి బ్యాటర్ మాత్రమే కాదు.. అద్భుతమైన ఫీల్డర్ కూడా! ఈ విషయాన్ని ఇప్పటికే ఎన్నోసార్లు నిరూపించిన ఈ రన్‌మెషీన్.. అఫ్గనిస్తాన్‌తో మూడో టీ20 సందర్భంగా.. మరోసారి అసాధారణ ఫీల్డింగ్ నైపుణ్యాలతో ఆకట్టుకున్నాడు. బెంగళూరు వేదికగా నువ్వా-నేనా అన్నట్లుగా టీమిండియాతో సాగిన మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్ అసాధారణ పోరాటం చేసిన విషయం తెలిసిందే. రెండు సూపర్ ఓవర్ల తర్వాత గానీ జద్రాన్ బృందం రోహిత్ సేన ముందు తలవంచలేదు. ఆద్యంతం అత్యంత ఆసక్తి రేకెత్తించిన ఈ మ్యాచ్ నిజానికి సూపర్ ఓవర్ దాకా వచ్చేదే కాదు. టీమిండియా విధించిన 213 లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అఫ్గన్ ఇన్నింగ్స్ పదిహేడో ఓవర్లో కోహ్లి ఓ అద్భుతం చేశాడు. వాషింగ్టన్ సుందర్ వేసిన బంతిని.. కరీం జనత్ లాంగాన్ దిశగా సిక్సర్‌గా మలిచేందుకు భారీ షాట్ ఆడాడు. అయితే.. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లి గాల్లోకి ఎగిరి బంతిని ఒడిసిపట్టి.. బౌండరీ రోప్ దాటకుండా లోపలికి విసిరాడు. Excellent effort near the ropes! How's that for a save from Virat Kohli 👌👌 Follow the Match ▶️ https://t.co/oJkETwOHlL#TeamIndia | #INDvAFG | @imVkohli | @IDFCFIRSTBank pic.twitter.com/0AdFb1pnL4 — BCCI (@BCCI) January 17, 2024 అప్పటికి కరీం ఒక్క పరుగు మాత్రమే తీయగా.. కోహ్లి ఎఫర్ట్ వల్ల టీమిండియాకు ఐదు పరుగులు సేవ్ అయ్యాయి. అప్పటికి అఫ్గనిస్తాన్ స్కోరు 165-4. ఒకవేళ ఆ ఐదు పరుగులు వచ్చి అఫ్గన్‌కు వచ్చి ఉంటే మ్యాచ్ టై అయ్యేదీ కాదూ.. సూపర్ ఓవర్ల దాకా వచ్చేది కాదు! అలా కోహ్లి ప్రత్యర్థి జట్టును దెబ్బకొట్టాడన్న మాట!! ఈ నేపథ్యంలో టీమిండియా ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్ విరాట్ కోహ్లిపై ప్రశంసల జల్లు కురిపించాడు. యువ ఆటగాళ్లకు సవాల్ విసిరేలా.. మైదానంలో పాదరసంలా కదులుతున్న కోహ్లి.. అందరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడాడు. ఈ క్రమంలో ‘ఫీల్డర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు విజేతగా కోహ్లిని ప్రకటించిన దిలీప్.. అతడికి మెడల్ అందజేశాడు. ఆ సమయంలో డ్రెస్సింగ్ రూంలో ఉన్న టీమిండియా క్రికెటర్లంతా చప్పట్లతో కోహ్లిని అభినందించారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ అమితానందం వ్యక్తం చేస్తూ సహచర ఆటగాడి నైపుణ్యాలను మెచ్చుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్ ద్వారా అంతర్జాతీయ టీ20లలో రీఎంట్రీ ఇచ్చిన విరాట్ కోహ్లి.. వ్యక్తిగత కారణాలతో తొలి మ్యాచ్‌కు దూరమయ్యాడు. రెండో టీ20లో 16 బంతుల్లో 29 పరుగులు చేసిన అతడు.. బుధవారం నాటి మూడో మ్యాచ్‌లో మాత్రం గోల్డెన్ డకౌట్ అయ్యాడు. అయితే, ఫీల్డర్‌గా మాత్రం సూపర్ సక్సెస్ అయి టీమిండియా విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. 𝗗𝗿𝗲𝘀𝘀𝗶𝗻𝗴 𝗥𝗼𝗼𝗺 𝗕𝗧𝗦 | 𝗙𝗶𝗲𝗹𝗱𝗲𝗿 𝗼𝗳 𝘁𝗵𝗲 𝗦𝗲𝗿𝗶𝗲𝘀 After a fantastic 3⃣-0⃣ win over Afghanistan, it's time to find out who won the much-awaited Fielder of the Series Medal 🏅😎 Check it out 🎥🔽 #TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/N30kVdndzB — BCCI (@BCCI) January 18, 2024 చదవండి: #IndvsAus2021: మళ్లీ గోల్డెన్ డక్.. రీఎంట్రీ మర్చిపోవ్సాలిందే? -
Ind vs Afg: కావాలనే అలా చేశాం: రోహిత్ శర్మ
India vs Afghanistan, 1st T20I- Rohit Sharma Comments: టీ20 ప్రపంచకప్-2024కు సన్నద్ధమయ్యే క్రమంలో టీమిండియా యువ క్రికెటర్లు కఠిన సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ఇందుకోసం ఉద్దేశపూర్వకంగానే వాళ్లను కొన్నిసార్లు ఒత్తిడిలోకి నెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. మెగా టోర్నీకి సిద్ధమయ్యే క్రమంలో ప్రయోగాలకు వెనుకాడబోవద్దని మేనేజ్మెంట్ స్పష్టంగా చెప్పినట్లు పేర్కొన్నాడు. 14 నెలల తర్వాత రీఎంట్రీ కాగా వరల్డ్‌కప్‌నకు ముందు భారత జట్టు అఫ్గనిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు షెడ్యూల్ ఖరారైన విషయం తెలిసిందే. సీనియర్, స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఈ సిరీస్ ద్వారా దాదాపు 14 నెలల విరామం తర్వాత రీఎంట్రీకి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా మొహాలీ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌తో రోహిత్ పునరాగమనం చేయగా.. రెండో టీ20 నుంచి కోహ్లి అందుబాటులోకి రానున్నాడు. ఇదిలా ఉంటే.. అఫ్గన్‌తో గురువారం మొదటి మ్యాచ్‌లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. రోహిత్, అక్షర్ పటేల్ మినహా మిగతా అంతా కుర్రాళ్లే ఆడిన ఈ టీ20లో తాము అమలు చేసిన ప్రణాళికల గురించి హిట్‌మ్యాన్ వివరించాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘‘ఆటలో వైవిధ్యం చూపేందుకు ప్రయోగాలు చేయాలని నిర్ణయించుకున్నాం. ముఖ్యంగా మా బౌలర్లను అన్ని రకాల పరిస్థితుల్లో మెరుగ్గా బౌలింగ్ చేసేందుకు సంసిద్ధులను చేయాలని భావించాం. అందుకే 19వ ఓవర్లో అతడి చేతికి బంతి అందులో భాగంగానే.. ఈరోజు వాషీ(వాషింగ్టన్ సుందర్) చేత 19వ ఓవర్ వేయించడం మీరంతా చూసే ఉంటారు. ఎక్కడైతే మా యంగ్ ప్లేయర్లు కాస్త వెనుకబడి ఉన్నారు?.. ఒత్తిడిలో ఉన్నపుడు నేర్పుతో అధిగమించగలరా లేదా అని పరీక్షించాలనుకున్నాం. అందుకు అనుగుణంగానే ఈరోజు మా వ్యూహాలు అమలు చేశాం. అయితే, మ్యాచ్‌ను మూల్యంగా చెల్లించే పరిస్థితులు మాత్రం రాకూడదని జాగ్రత్తపడ్డాం. ఏదేమైనా ఈరోజు సానుకూలంగా ముగిసింది’’ అని రోహిత్ శర్మ హర్షం వ్యక్తం చేశాడు. శివాలెత్తిన శివం దూబే కాగా మొహాలీ మ్యాచ్‌లో స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కట్టుదిట్టంగా బౌలింగ్(2/23).. మరో స్పిన్నర్ రవి బిష్ణోయి మూడు ఓవర్ల బౌలింగ్‌లో ఏకంగా 35 పరుగులు ఇచ్చుకున్నాడు. ఇక వాషింగ్టన్ సుందర్ 3 ఓవర్లలో 23 పరుగులు ఇచ్చాడు. అయితే, 19వ ఓవర్లోనే ఏకంగా అతడు 13 పరుగులు సమర్పించుకోవడం విశేషం. ఇదిలా ఉంటే.. అఫ్గన్ విధించిన 159 పరుగుల లక్ష్య ఛేదనలో ఆల్‌రౌండర్ శివం దూబే 40 బంతుల్లో 60 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. కాగా అఫ్గనిస్తాన్ సిరీస్ ముగిసిన తర్వాత ఐపీఎల్-2024లో ఆటగాళ్లు పాల్గొననున్నారు. ఆ తర్వాత జూన్ 4 నుంచి టీ20 ప్రపంచప్ టోర్నీ ఆరంభం కానుంది. చదవండి: Rohit Sharma: రీఎంట్రీలో రోహిత్ డకౌట్.. మరీ ఘోరంగా..! తప్పు ఎవరిది? Acing the chase 😎 Conversations with Captain @ImRo45 👌 Message for a special bunch 🤗 Hear from the all-rounder & Player of the Match of the #INDvAFG T20I opener - @IamShivamDube 👌👌 - By @ameyatilak WATCH 🎥🔽 #TeamIndia | @IDFCFIRSTBank pic.twitter.com/edEH8H3O5f — BCCI (@BCCI) January 12, 2024 -
కెప్టెన్‌గా వాషింగ్టన్ సుందర్.. జట్టులో ఐపీఎల్ స్టార్లు!
Syed Mushtaq Ali Trophy 2023-24: టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ దేశవాళీ టీ20 క్రికెట్ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023-24 సీజన్‌కు గానూ తమిళనాడు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇందుకు సంబంధించి తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ప్రకటన చేసింది. వాషీకి సాయి సుదర్శన్ డిప్యూటీగా వ్యవహరిస్తాడని పేర్కొంది. ఈ మేరకు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగమయ్యే 15 మంది ఆటగాళ్ల పేర్లను బుధవారం వెల్లడించింది. కాగా అక్టోబరు 16 నుంచి ఈ దేశవాళీ టీ20 టోర్నమెంట్ ఆరంభం కానుంది. ఈ పొట్టి ఫార్మాట్లో ఈవెంట్ చరిత్రలో తమిళనాడుకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పటి వరకు మూడుసార్లు ట్రోఫీ గెలిచిన ఘనత తమిళనాడు సొంతం. తాజా సీజన్లో వాషింగ్టన్ సుందర్ సారథ్యంలో సాయి సుదర్శన్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ సేన్, నారాయణ్ జగదీశన్, విజయ్ శంకర్, షారుఖ్ ఖాన్, టి.నటరాజన్ తదితర ఐపీఎల్ స్టార్లు ఆడనున్నారు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023 జట్టులో సుందర్‌కు స్థానం దక్కలేదన్న విషయం తెలిసిందే. స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ గాయం కారణంగా అతడి స్థానంలో చెన్నై వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో పోటీ పడ్డ వాషీకి మొండిచేయి ఎదురైంది. అనుభవానికి పెద్దపీట వేసిన బీసీసీఐ సెలక్టర్లు అశూ వైపే మొగ్గుచూపారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023 తమిళనాడు జట్టు: వాషింగ్టన్ సుందర్ (కెప్టెన్), సాయి సుదర్శన్ (వైస్ కెప్టెన్), నారాయణ్ జగదీశన్, విజయ్ శంకర్, సి హరి నిశాంత్, జి.అజితేష్, బాబా అపరాజిత్, ఆర్. సంజయ్ యాదవ్, ఎం. మహ్మద్, ఆర్.సాయి కిషోర్, వరుణ్ చక్రవర్తి, టి. నటరాజన్, కుల్దీప్ సేన్, సందీప్ వారియర్. -
WC 2023: బహుశా నాకు ఇదే చివరి వరల్డ్‌కప్ కావొచ్చు: టీమిండియా స్టార్
ICC ODI World Cup 2023: అనుకోకుండా కొన్ని కొన్ని.. అలా జరిగిపోతూ ఉంటాయంతే! టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ విషయంలో ఒకటి కాదు ఏకంగా రెండుసార్లు ఇలాగే జరిగింది. అనూహ్యరీతిలో టీ20 వరల్డ్‌కప్-2022 జట్టులో చోటు దక్కించుకున్న ఈ చెన్నై బౌలర్.. వన్డే ప్రపంచకప్-2023 టీమ్‌లోనూ ఊహించని రీతిలో స్థానం సంపాదించాడు. గత ఆరేళ్లలో కేవలం ఐదు వన్డేలు మాత్రమే ఈ స్పిన్ ఆల్‌రౌండర్‌కు అక్షర్ పటేల్ గాయం రూపంలో ఐసీసీ ఈవెంట్ ఆడే అవకాశం దక్కింది. అది కూడా సొంతగడ్డపై మెగా టోర్నీలో భాగమయ్యే అదృష్టం వరించింది. అక్షర్ గాయం.. అశ్విన్ పాలిట వరంగా.. ఆసియా వన్డే కప్-2023లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా అక్షర్ గాయపడటంతో తొలుత ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ఎంపికయ్యాడు అశ్విన్. అయితే, ఈ గుజరాతీ బౌలర్ ఇంకా కోలుకోకపోవడంతో అతడి స్థానాన్ని భర్తీ చేసే క్రమంలో ఆఫ్ స్పిన్నర్ అశ్విన్‌కు మేనేజ్మెంట్ పిలుపునిచ్చింది. ఇలా అనుకోకుండా సువర్ణావకాశం లభించడంపై స్పందించిన అశ్విన్ హర్షం వ్యక్తం చేశాడు. విధి, పరిస్థితుల ప్రభావం వల్లే తాను ప్రపంచకప్ ఈవెంట్లో భాగం అవుతున్నానని పేర్కొన్నాడు. అయితే, తనకు ఇదే ఆఖరి వరల్డ్‌కప్ కూడా కావొచ్చని అశ్విన్ పరిమిత ఓవర్ల క్రికెట్‌కు గుడ్ బై చెప్పనున్నాడనే సంకేతాలు ఇచ్చాడు. ప్రపంచకప్-2023 వార్మప్ మ్యాచ్‌లో భాగంగా గువాహటి వేదికగా టీమిండియా- ఇంగ్లండ్ శనివారం తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో జట్టుతో పాటు అక్కడికి చేరుకున్న అశ్విన్.. దినేశ్ కార్తిక్‌తో మాట్లాడుతూ.. ‘‘జీవితంలో ఎన్నో ఆశ్చర్యకర సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అదొక్కటే ధ్యేయం నిజానికి నువ్వు జోక్ చేస్తున్నావే అనుకున్నా. అస్సలు ఇక్కడ ఈరోజు నేనిలా ఉంటానని ఊహించలేదు. మేనేజ్మెంట్ నాపై నమ్మకం ఉంచింది. ఇలాంటి టోర్నీల్లో ఒత్తిడిని జయిస్తేనే మనం ముందుకు సాగగలం. ఆటను ఆస్వాదిస్తూ సానుకూల దృక్పథంతో ముందడుగు వేయాల్సి ఉంటుంది. బహుశా టీమిండియా తరఫున నాకిదే చివరి ప్రపంచకప్ టోర్నీ కావొచ్చు. కాబట్టి టోర్నమెంట్‌ను నేను ఎంతగా ఎంజాయ్ చేస్తాననేదే ముఖ్యం’’ అని చెప్పుకొచ్చాడు. కాగా 37 ఏళ్ల అశ్విన్‌కు పరిమిత ఓవర్ల క్రికెట్లో వాషింగ్టన్ సుందర్ రూపంలో యువ ఆఫ్ స్పిన్నర్ నుంచి పోటీ ఉంది. టీమిండియా యంగ్ గన్ తిలక్ వర్మ కూడా బ్యాటర్‌గా రాణించడంతో పాటు ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేయగలడు. అశూ రిటైర్ అయ్యే అవకాశం కాబట్టి వచ్చే ఏడాది జరుగనున్న టీ20 ప్రపంచకప్‌లో అతడు ఆడే అవకాశాలు తక్కువే. మరోవైపు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి స్టార్లు సైతం పొట్టి ఫార్మాట్లో యువకులకు అవకాశం ఇచ్చే క్రమంలో తమ స్థానాలను త్యాగం చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. కాబట్టి అశూకు ఇదే ఆఖరి వరల్డ్‌కప్ కావొచ్చు. అదృష్టం వెంటపడితే మాత్రం మళ్లీ ఏదో మ్యాజిక్ జరిగి జట్టులోకి వచ్చినా రావొచ్చు!! లేదంటే వన్డే వరల్డ్‌కప్ తర్వాత అంతర్జాతీయ వన్డే, టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికే అవకాశాలను కూడా కొట్టిపడేయలేం!! చదవండి: వరల్డ్‌కప్ జట్టు సెలక్షన్‌పై యువరాజ్ అసహనం.. అతడిని ఎందుకు ఎంపిక చేశారు? -
టాస్ గెలిచిన ఆసీస్.. తుది జట్లు ఇవే.. అశ్విన్, ఇషాన్ అవుట్..
India vs Australia, 3rd ODI: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ను 2-0తో గెలిచిన టీమిండియా నామమాత్రపు మూడో వన్డేకు సిద్ధమైంది. ప్రస్తుతం మూడు ఫార్మాట్లలోనూ నంబర్ 1గా ఉన్న రోహిత్ సేన ఆసీస్‌ను వైట్‌వాష్ చేసి రెట్టించిన ఉత్సాహంతో ప్రపంచకప్-2023 బరిలో నిలవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు.. కనీసం ఒక్క వన్డేలోనైనా గెలిచి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఆస్ట్రేలియా భావిస్తోంది. అశ్విన్, ఇషాన్ అవుట్.. సుందర్ ఎంట్రీ గుజరాత్‌లోని రాజ్‌కోట్ వేదికగా బుధవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌తో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సహా విరాట్ కోహ్లి, కుల్దీప్ యాదవ్ తదితరులు తిరిగి జట్టుతో కలిశారు. ఇక గత రెండు వన్డేల్లో భాగమైన టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ మూడో వన్డేతో ఎంట్రీ ఇచ్చాడు. మరోవైపు.. వైరల్ ఫీవర్ కారణంగా ఇషాన్ కిషన్ జట్టుకు దూరమయ్యాడు. తుది జట్లు ఇవే టీమిండియా: రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ ఆస్ట్రేలియా మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, అలెక్స్ క్యారీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, తన్వీర్ సింగ్, జోష్ హేజిల్‌వుడ్. చదవండి: 314 పరుగులు.. టీ20 చరిత్రలో నేపాల్ సంచలనం! ప్రపంచ రికార్డులు బద్దలు 🚨 Toss Update 🚨 Australia elect to bat in the third and final #INDvAUS ODI. Follow the Match ▶️ https://t.co/H0AW9UXI5Y#TeamIndia | @IDFCFIRSTBank pic.twitter.com/16zilN2M5b — BCCI (@BCCI) September 27, 2023 -
ఆసియా కప్ ఫైనల్లో అశూ ఆడాల్సింది.. అతడికి వీలు కాలేదనే సుందర్‌కు ఛాన్స్
India vs Australia, 1st ODI: ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో వాషింగ్టన్ సుందర్‌ను కాదని.. రవిచంద్రన్ అశ్విన్‌కు చోటు ఇవ్వడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆసియా కప్-2023 ఫైనల్లో మైదానంలో దిగిన వాషీకి ఆసీస్‌తో తుదిజట్టులో చోటు దక్కుతుందని అంతా అనుకున్నారు. దాదాపు ఏడాదిన్నర తర్వాత జట్టులోకి అశూ రీఎంట్రీ ఇస్తున్న తరుణంలో సుందర్ వైపే మొగ్గుచూపుతారని హర్భజన్ సింగ్ వంటి మాజీలు కూడా అభిప్రాయపడ్డారు. ఆసియా కప్ ఫైనల్లో ఆడించారు కాబట్టి తొలి వన్డేలో అతడికి ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. అక్షర్ పటేల్ గాయం కారణంగా ఆశల పల్లకిలో కాగా అక్షర్ పటేల్ గాయం కారణంగా చెన్నై ఆఫ్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్ వరల్డ్‌కప్-2023 ఆశలు సజీవంగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆసీస్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో రాణిస్తే ఐసీసీ ఈవెంట్లో అడుగుపెట్టే అవకాశం ముంగిట నిలిచారు. ఈ నేపథ్యంలో మొహాలీ వేదికగా శుక్రవారం మొదలైన తొలి మ్యాచ్‌లో అశూకు చోటు దక్కగా.. వాషీకి మొండిచేయి ఎదురైంది. దీంతో మేనేజ్మెంట్ తీరుపై అభిమానులు ఫైర్ అవుతున్నారు. వాషీని పరిగణనలోకి తీసుకోనపుడు ఎందుకు శ్రీలంకకు పంపించారని ప్రశ్నిస్తున్నారు. ఆసియా కప్ ఫైనల్‌కు ఫస్ట్ ఛాయిస్ అశూనే ఈ క్రమంలో.. దినేశ్ కార్తిక్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. అక్షర్ పటేల్ స్థానంలో ఆసియా కప్-2023 శ్రీలంకతో ఫైనల్‌కు తొలి ఛాయిస్ అశ్వినే అని పేర్కొన్నాడు. అశూ కుదరదన్నాడు కాబట్టే వాషీని ఫ్లైట్ ఎక్కించారని తనకు తెలిసిందన్నాడు. ఈ మేరకు క్రిక్‌బజ్ షోలో డీకే మాట్లాడుతూ.. ‘‘నాకు తెలిసిన అంతర్గత సమాచారం ప్రకారం.. ఈ విషయంలో రోహిత్, అజిత్, రాహుల్ ద్రవిడ్‌లను నేను సమర్థిస్తాను. ఆసియా కప్ ఫైనల్‌కు ముందుగా వాళ్లు అశ్విన్‌కే పిలుపునిచ్చారు. ఆ తర్వాతే అశూను ఎంపిక చేశారు అయితే, తాను మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా లేనని అశ్విన్ చెప్పాడు. అంతేకాదు.. తనకు బదులు లోకల్ మ్యాచ్‌లు ఆడి రిథమ్‌లో ఉన్న వాషింగ్టన్ సుందర్‌ను పంపిస్తే బాగుంటుందని సూచించాడు. దీంతో ఎన్సీఏలోనే ఉన్న సుందర్‌ను శ్రీలంకకు పంపించారు. ఆ తర్వాత అశ్విన్ రెండు క్లబ్ మ్యాచ్‌లు ఆడాడు. ఆ తర్వాతే ఆసీస్‌తో సిరీస్‌కు అతడిని ఎంపిక చేశారు. అసలు విషయం ఇదే. వాళ్ల మొదటి ప్రాధాన్యం అశ్విన్‌కే. వాషింగ్టన్ ఈ విషయంలో కాస్త నిరాశకు గురికావొచ్చు. అయితే, వాళ్లు మాత్రం అశ్విన్ వైపే మొగ్గుచూపారు’’ అని చెప్పుకొచ్చాడు. వరల్డ్‌కప్ జట్టులోనూ.. కాగా గత ఆరేళ్ల వ్యవధిలో అశ్విన్ రెండే రెండు వన్డేలు ఆడిన విషయం తెలిసిందే. ఇక అక్షర్ గనుక కోలుకోకపోతే అక్టోబరు 5 నుంచి మొదలయ్యే వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో ఈ 2011 ప్రపంచకప్ విజేతకు చోటు ఖాయమే అనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఆసీస్‌తో తొలి వన్డేలో అశూ ఒక వికెట్ తీశాడు. మార్నస్ లబుషేన్ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. చదవండి: అవును.. నాకు ధోనితో విభేదాలున్నాయి.. కానీ! గంభీర్‌కు స్ట్రాంగ్ కౌంటర్? WC: అలాంటి వాళ్లకు నో ఛాన్స్! అందుకే అతడిని ఎంపిక చేయలేదు: చీఫ్ సెలక్టర్ -
అశ్విన్‌కు నో ఛాన్స్.. తుది జట్టులో అతడే! భజ్జీ అంచనా తలకిందులు
Ind vs Aus 1st ODI: వన్డే వరల్డ్‌కప్-2023కి ముందు టీమిండియా ఆస్ట్రేలియాతో సిరీస్‌కు సిద్దమైంది. కంగారూ జట్టుతో మూడు వన్డేల సిరీస్‌ను శుక్రవారం ఆరంభించనుంది. పంజాబ్‌లోని మొహాలీలో గల పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియంలో తొలి మ్యాచ్ ఆడేందుకు సన్నద్ధమైంది. ఈ క్రమంలో ఇప్పటికే దాదాపు ఏడాదిన్నర తర్వాత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వన్డే జట్టుకు ఎంపికయ్యాడు. ఆసియా కప్-2023 సూపర్-4లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా గాయపడ్డ అక్షర్ పటేల్ స్థానంలో ఆసీస్‌తో ఆడే జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే, తుది జట్టులో అశూకు స్థానం ఉంటుందా? లేదంటే వాషింగ్టన్ సుందర్ వైపు మొగ్గు చూపుతారా అనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆసీస్‌తో తొలి వన్డేలో సుందర్ ఆడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నాడు. భజ్జీ అంచనా తలకిందులు ‘‘బ్యాటింగ్ ఆర్డర్లో ఎనిమిదో స్థానంలో వాషింగ్టన్ సుందర్ లేదంటే రవిచంద్రన్ అశ్విన్ ఆడతారు. అయితే ఇద్దరిలో ఎవరికి ఆ ఛాన్స్ వస్తుందనేదే ప్రశ్న. నా అభిప్రాయం ప్రకారం.. వాషింగ్టన్ సుందర్‌కే అవకాశం వస్తుంది. ఎందుకంటే.. ఆసియా కప్ ఫైనల్ ఆడేందుకు అతడిని పిలిపించారు. కానీ అక్కడ అతడికి ఆడే ఛాన్స్ రాలేదు. కాబట్టి ఈసారి పరీక్షించే అవకాశం ఉంది’’ అని భజ్జీ అభిప్రాయపడ్డాడు. కాగా అక్షర్ పటేల్ గాయం నేపథ్యంలో ప్రపంచకప్ జట్టులో ఆఫ్ స్పిన్నర్ అశ్విన్‌కు చోటు దక్కే అవకాశాలున్న నేపథ్యంలో హర్భజన్ సింగ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే, భజ్జీ అంచనా తలకిందులైంది. తుది జట్టులో అశ్విన్‌కు స్థానం దక్కగా.. వాషింగ్టన్ సుందర్‌కు మొండిచేయి ఎదురైంది. ఇక సెప్టెంబరు 24, 27 తేదీల్లో టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య మలి రెండు వన్డేలు జరుగనున్నాయి. తొలి రెండు మ్యాచ్‌లకు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాలకు విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో కేఎల్ రాహుల్ జట్టును ముందుండి నడిపించనున్నాడు. ఇదిలా ఉంటే.. అక్టోబరు 5 నుంచి ప్రపంచకప్-2023 టోర్నీ ఆరంభం కానుంది. ఆసీస్‌తో తొలి వన్డేకు భారత తుది జట్టు శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, లోకేష్ రాహుల్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ. -
అదేంటో.. వరల్డ్‌కప్‌కి ముందే గుర్తుకొస్తాడు! తుదిజట్టులో ఉండాలి: మాజీ ఓపెనర్
India vs Australia ODI Series 2023: ‘‘అదేంటో.. ప్రతిసారి ప్రపంచకప్ టోర్నీ ఆరంభానికి ముందే ఇలా జరుగుతూ ఉంటుంది. గత రెండు.. మూడు ఐసీసీ ఈవెంట్లను గమనిస్తే.. అది టీ20 లేదంటే వన్డే.. ఏదైనా కావొచ్చు.. అప్పటికప్పుడు అతడిని ఎంపిక చేస్తారు. సరిగ్గా మెగా టోర్నీకి ముందే.. భారత క్రికెట్ మేనేజ్మెంట్కు అశ్విన్ గుర్తుకు వస్తాడు’’ అని టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ నేపథ్యంలో భారత జట్టులో వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు చోటు దక్కడంపై ఈ విధంగా స్పందించాడు. వాషింగ్టన్ సుందర్‌తో పాటు సొంతగడ్డపై... వన్డే వరల్డ్‌కప్-2023 ఆరంభానికి ముందు టీమిండియా ఆస్ట్రేలియాతో మూడు వన్డేలు ఆడనుంది. ఈ క్రమంలో అనూహ్యంగా సెలక్టర్ల నుంచి అశ్విన్‌కు పిలుపు వచ్చింది. ఆసియా కప్-2023 సందర్భంగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో అక్షర్ పటేల్ గాయపడిన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే శ్రీలంకతో ఫైనల్లో అక్షర్ స్థానాన్ని భర్తీ చేసిన వాషింగ్టన్ సుందర్‌తో పాటు ఈ వెటరన్ ఆఫ్ స్పిన్నర్‌కు కూడా చోటిచ్చారు. ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా.. అశ్విన్ రీఎంట్రీ గురించి మాట్లాడుతూ.. తుదిజట్టులో ఉండాలి ‘‘ప్రపంచకప్‌నకు ఎంపిక చేసిన జట్టులో ఆఫ్ స్పిన్నర్ లేడు. ఇప్పుడు అక్షర్ పటేల్ గాయం కారణంగా అకస్మాత్తుగా ఖాళీ ఏర్పడింది. వాషింగ్టన్ సుందర్‌తో పాటు అశ్విన్ కూడా రేసులోకి దూసుకొచ్చాడు. అయినా.. ప్రతిసారి అశ్విన్‌కు ఇలా హఠాత్తుగా పిలుపు రావడం చూస్తూనే ఉన్నాం. ఏదేమైనా ఆస్ట్రేలియాతో తుది జట్టులో అతడికి స్థానం ఇవ్వాలి. వాషీ కంటే ఎంతో అనుభవజ్ఞుడైన అశ్విన్‌కే పెద్దపీట వేస్తారని భావిస్తున్నా’’ అని పేర్కొన్నాడు. అప్పుడు కూడా అలాగే.. 2017 తర్వాత ఆరేళ్ల వ్యవధిలో కేవలం రెండు వన్డేలు ఆడిన అశ్విన్.. అక్షర్ గాయం కారణంగా ఆసీస్‌తో సిరీస్ సందర్భంగా జట్టులోకి వచ్చాడు. ఫార్మాట్లకు అతీతంగా వికెట్లు తీయగల నైపుణ్యం ఉన్న అశూకు.. ఒకవేళ ఈవెంట్ ఆరంభం నాటికి అక్షర్ కోలుకోకపోతే ఆఫ్ స్పిన్నర్‌గా వరల్డ్‌కప్ జట్టులో చోటు ఖాయం కావొచ్చు కూడా! కాగా అంతర్జాతీయ టీ20 కెరీర్ ముగిసిందనుకున్న తరుణంలో గతేడాది ఆస్ట్రేలియాలో వరల్డ్‌కప్ ఆడిన జట్టులో ఈ చెన్నై స్పిన్ ఆల్‌రౌండర్‌కు చోటు దక్కిన విషయం తెలిసిందే. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాటల్ని బట్టి.. ఈసారి కూడా అదే రిపీట్ అయ్యే అవకాశాలను కొట్టిపారేయలేం! కాగా ఎన్సీఏలో ఇటీవల వైట్‌బాల్‌తో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను అశూ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ‘వరల్డ్‌కప్ నాటికి జట్టులోకి అన్న రావడం ఫిక్స్’ అంటూ అభిమానులు అప్పటి నుంచే కామెంట్లు చేస్తున్నారు. చదవండి: వరల్డ్‌కప్‌కు ముందు మహ్మద్ షమీకి బిగ్ రిలీఫ్.. బెయిల్ మంజూరు My kinda day 🤩🤩. The capacity to learn is a gift. The ability to learn is a skill. However, the willingness to learn is a CHOICE. #cricketlife Thank you for the help @SairajBahutule @VVSLaxman281 pic.twitter.com/4nK7V5IthS — Ashwin 🇮🇳 (@ashwinravi99) September 15, 2023 -
ప్రపంచకప్ జట్టులో అశ్విన్..!
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు ప్రపంచకప్-2023 జట్టుకు ఎంపికయ్యేందుకు ఇంకా దారులు మూసుకుపోలేదు. అతనితో పాటు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు వరల్డ్‌కప్‌కు ఎంపికయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ విషయంపై జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఆసియా కప్ -2023 ముగిసిన అనంతరం క్లూ ఇచ్చాడు. ముందుగా ప్రకటించిన ప్రొవిజనల్ జట్టులోని సభ్యుడు, స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఆసియా కప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన సూపర్-4 మ్యాచ్ సందర్భంగా గాయపడిన విషయం తెలిసిందే. అక్షర్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ హుటాహుటిన జట్టులో చేరి ఆసియా కప్ ఫైనల్ ఆడాడు. అక్షర్ గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతను వరల్డ్‌కప్ ఫస్ట్ హాఫ్ మ్యాచ్‌లకు దూరమవుతాడని తెలుస్తుంది. ఒకవేళ ఇదే జరిగితే అక్షర్ స్థానాన్ని వాషింగ్టన్ సుందర్ లేదా అశ్విన్‌లలో ఎవరో ఒకరితో భర్తీ చేసే అవకాశం ఉంది. సుందర్‌తో పోలిస్తే అశ్విన్ అనుభవజ్ఞుడు కావడంతో అతనికే అవకాశాలు ఉంటాయి. మరోవైపు అక్షర్ త్వరలో ఆస్ట్రేలియాతో జరుగనున్న వన్డే సిరీస్‌కు కూడా అందుబాటులో ఉండడని సమాచారం. భారత సెలెక్టర్లు ఒకవేళ అశ్విన్‌ను ప్రపంచకప్ జట్టులో చేర్చుకోవాలని భావిస్తే, ఆసీస్ సిరీస్ కోసం ఇవాళ ప్రకటించే భారత జట్టులో అతని చోటు ఇస్తారు. కాగా, ముందుగా ప్రకటించిన భారత ప్రొవిజనల్ వరల్డ్‌కప్ స్క్వాడ్‌లో స్పిన్ బౌలర్లుగా అక్షర్ పటేల్‌తో పాటు రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్‌లను ప్రకటించిన విషయం తెలిసిందే. చివరి నిమిషంలో ఈ ప్రొవిజనల్ జట్టులో మార్పులు జరిగే అవకాశాలు లేకపోలేదు. ఎవరైనా ఆటగాడు గాయం బారిన పడితే, అతని స్థానాన్ని ఇంకొకరితో భర్తీ చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, ఆసీస్‌తో ఈ నెల 22, 24, 27 తేదీల్లో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం భారత జట్టును ఇవాళ ప్రకటిస్తారు. ఈ జట్టుకు ఎంపికైన ఆటగాళ్లు దాదాపుగా ప్రపంచకప్ జట్టులో ఉంటారు. ఆసియా కప్ సందర్భంగా గాయపడిన అక్షర్ స్థానంలో సెలెక్టర్లు ఎవరిని తీసుకుంటారోనన్నది ఆసక్తికరంగా మారింది. ఈ సిరీస్ ముగిశాక అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచకప్ ప్రారంభమవుతుంది. అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌తో టీమిండియా వరల్డ్‌కప్ జర్నీ స్టార్ట్ అవుతుంది. అక్టోబర్ 14న భారత్.. చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌ను ఢీకొంటుంది. -
#lndVsSL: టాస్ గెలిచిన శ్రీలంక.. అక్షర్ అవుట్.. వాషీ ఇన్! తుదిజట్లు ఇవే
Asia Cup Final 2023- ndia vs Sri Lanka Playing XI: ఆసియా కప్-2023 ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. కొలంబో వేదికగా ఆర్. ప్రేమదాస స్టేడియంలో టీమిండియా- శ్రీలంక టైటిల్ పోరులో తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అక్షర్ పటేల్ అవుట్.. వాషీ ఇన్ ఇక ఆదివారం నాటి మ్యాచ్‌లో టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ ఎంట్రీ ఇచ్చారు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా అక్షర్ పటేల్ గాయం కారణంగా దూరంకాగా యువ స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు తుదిజట్టులో చోటు దక్కింది. తీక్షణ స్థానంలో అతడే మరోవైపు.. స్టార్ స్పిన్నర్ మహీశ్ తీక్షణ గాయంతో వైదొలగడంతో దుషాన్ హేమంతను జట్టులోకి తీసుకున్నట్లు లంక సారథి దసున్ షనక వెల్లడించాడు. ఆరంభంలో పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించే విధంగా ఉన్న నేపథ్యంలో తొలుత బ్యాటింగ్ చేయాలనుకున్నట్లువెల్లడించాడు. కాగా రోహిత్ శర్మ సైతం.. తాము టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకునే వాళ్లమని పేర్కొన్నాడు. కాగా ఆసియా వన్డే కప్-2023లో కొలంబో వేదికగా ఇప్పటి వరకు జరిగిన ఆరు మ్యాచ్‌ల్లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన జట్టు ఐదుసార్లు గెలవడం విశేషం. తుదిజట్లు ఇవే టీమిండియా: రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్. శ్రీలంక: కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్(వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డిసిల్వా, దసున్ షనక(కెప్టెన్), దునిత్ వెల్లలగే, దుషన్ హేమంత, ప్రమోద్ మదుషన్, మతీషా పతిరానా. చదవండి: బంగ్లా చేతిలో ఓడిపోయారు.. శ్రీలంకపై గెలవాలంటే: పాక్ మాజీ క్రికెటర్ The stage is set! It's the FINAL battle for Asian supremacy! 💥 Who'll come out on top - #India or #SriLanka? Tune-in to the final, #INDvSL in #AsiaCupOnStar Today | 2 PM | Star Sports Network #Cricket pic.twitter.com/k2FJk5egJz — Star Sports (@StarSportsIndia) September 17, 2023 -
టీమిండియాకు షాక్.. ఫైనల్‌కు ఆల్‌రౌండర్ దూరం! లంకకు యువ క్రికెటర్..
Asia Cup 2023 Final: ఆసియా కప్-2023 ఫైనల్‌కు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ గాయం కారణంగా జట్టుకు దూరమైనట్లు తెలుస్తోంది. యువ క్రికెటర్ వాషింగ్టన్ సుందర్‌తో ఈ స్పిన్ ఆల్‌రౌండర్ స్థానాన్ని భర్తీ చేసేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్ణయించినట్లు సమాచారం. లంకకు బయల్దేరిన యువ క్రికెటర్ ఈ క్రమంలో చెన్నై ఆటగాడు సుందర్ ఇప్పటికే శ్రీలంకు బయల్దేరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు పీటీఐతో మాట్లాడుతూ.. ‘‘అక్షర్‌ను గాయాలు వేధిస్తున్నాయి. చిటికిన వేలికి గాయమైంది. ముంజేయికి కూడా దెబ్బతగిలింది. వాషీని ఎయిర్‌పోర్టులో చూశానన్న డీకే అంతేకాదు.. తొడ కండరాలు పట్టేశాయి కూడా. అందుకే వాషింగ్టన్‌ను శ్రీలంకకు పిలిపిస్తున్నారు’’ అని పేర్కొన్నాయి. ఇదిలా ఉంటే.. టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ సైతం సుందర్ ప్రయాణం గురించి హింట్ ఇచ్చాడు. ‘‘ఎయిర్‌పోర్టులో అనుకోకుండా.. నాకు వాషింగ్టన్ సుందర్ తారసపడ్డాడు. అతడికి ఎక్కడికి వెళ్తున్నాడో గెస్ చేయండి’’ అని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ తర్వాత విలేకరులతో మాట్లాడిన టీమిండియా ఓపెనర్ శుబ్‌మన్ గిల్.. అక్షర్ గాయాలు అంత తీవ్రమైనవి కావని పేర్కొనడం గమనార్హం. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో అక్షర్ పోరాటం కాగా ఆసియా కప్-2023 సూపర్-4లో ఆఖరి మ్యాచ్‌లో భారత జట్టు ఓడిపోయిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో చివరి బంతి వరకు ఉత్కంఠ రేపిన శుక్రవారం నాటి మ్యాచ్‌లో అక్షర్ పటేల్ 34 బంతుల్లో 42 పరుగులతో రాణించాడు. అంతకుముందు బంగ్లా ఇన్నింగ్స్‌లో 9 ఓవర్ల బౌలింగ్‌లో 47 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ఇదిలా ఉంటే.. గాయాల తీవ్రత ఎక్కువైతే మాత్రం వన్డే వరల్డ్‌కప్-2023కి కూడా అక్షర్ పటేల్ దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. వన్డేల్లో సుందర్ గణాంకాలు ఇక యువ స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ టీమిండియా తరఫున ఇప్పటి వరకు 16 వన్డేలు ఆడాడు. 16 వికెట్లు తీయడంతో పాటు 233 పరుగులు సాధించాడు. ఈ ఏడాది జనవరిలో న్యూజిలాండ్‌తో చివరిగా వన్డే ఆడాడు. కాగా ఆదివారం (సెప్టెంబరు 17) టీమిండియా- శ్రీలంక మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. చదవండి: అతడిని కాదని నీకు ఛాన్స్.. ‘రాక రాక’ వచ్చిన అవకాశం! ఇకనైనా మారు.. -
ఆసియా కప్ జట్టులో చోటు దక్కకున్నా.. వరల్డ్‌కప్ టోర్నీలో ఎంట్రీ ఖాయం!
Asia Cup- ICC ODI World Cup 2023: ‘‘వాషింగ్టన్ సుందర్.. అతడి పేరునే పరిగణనలోకి తీసుకోలేదు. ఆసియా కప్ జట్టులో అతడికి చోటు ఇవ్వలేదు. నిజానికి జట్టులో ఆఫ్ స్పిన్నర్ లేడు. కాబట్టి సుందర్ గురించి చర్చ జరగడం సబబే. జట్టులో ఒకటీ అరా మార్పులు ఉండవచ్చు’’ అని టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. యువ స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు వన్డే వరల్డ్‌కప్-2023 జట్టులో వైల్డ్‌కార్డ్ ఎంట్రీ లభించవచ్చని జోస్యం చెప్పాడు. ఆఫ్ స్పిన్నర్ అవసరం ఉన్న వేళ మెగా ఈవెంట్ సమయానికి సుందర్‌కు పిలుపు రావొచ్చని అభిప్రాయపడ్డాడు. వరల్డ్‌కప్ టోర్నీలో ఎంట్రీ ఖాయం.. ఎందుకంటే ప్రత్యర్థి జట్టులో లెఫ్టాండర్లను ఎదుర్కొనేందుకు టీమిండియాకు తప్పక ఆఫ్ స్పిన్నర్ల అవసరం ఉంటుందని తన వ్యాఖ్యలను సమర్థించుకున్నాడు. కాగా 2017లో టీమిండియా తరఫున టీ20 మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన తమిళనాడు క్రికెటర్ వాషింగ్టన్ సుందర్. రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్ అయిన వాషీ.. ఇప్పటి వరకు అంతర్జాతీయ స్థాయిలో 4 టెస్టులు(6 వికెట్లు), 16 వన్డేలు(16 వికెట్లు), 37 టీ20 మ్యాచ్‌లు(29 వికెట్లు) ఆడాడు. బౌలింగ్‌తో పాటు లోయర్ ఆర్డర్లో రాణించడం అతడికి ఉన్న అదనపు అర్హత. వాళ్లంతా ఆసియా కప్ జట్టులో అయితే, ఇటీవలి కాలంలో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్న వాషింగ్టన్ సుందర్‌కు ఆసియా కప్-2023 జట్టులో చోటు దక్కలేదు. 17 మంది సభ్యుల జట్టులో స్పిన్ విభాగంలో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాతో పాటు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్‌లను ఎంపిక చేశారు. రోహిత్ శర్మ చెప్పాడు కదా! ఇక ఆసియా కప్ జాబితా నుంచే వరల్డ్‌కప్ జట్టును ఎంపిక చేస్తామని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే, అదే సమయంలో రవిచంద్రన్ అశ్విన్, యుజువేంద్ర చహల్, వాషింగ్టన్ సుందర్‌లకు దారులు మూసుకుపోలేదని కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. వాషింగ్టన్ సుందర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఆఫ్ స్పిన్ బౌలింగ్‌తో వికెట్లు తీయడంతో పాటు జట్టుకు అవసరమైన సమయంలో పరుగులు రాబట్టడం అతడికి ఉన్న ప్లస్ పాయింట్. ఒకవేళ సుందర్ గనుక మెగా ఈవెంట్‌కు ముందు ఆడే మ్యాచ్‌లలో ఆల్‌రౌండర్‌గా తనను తాను నిరూపించుకుంటే తప్పక వైల్డ్ కార్డ్ ఎంట్రీ దక్కుతుంది. ప్రస్తుతం జట్టులో ఉన్న టెంప్టింగ్ ఆప్షన్ తనే’’ అని పేర్కొన్నాడు. ఐర్లాండ్ పర్యటనలో కాగా ప్రస్తుతం ఐర్లాండ్ పర్యటనలో ఉన్న 23 ఏళ్ల వాషింగ్టన్ సుందర్.. తొలి రెండు మ్యాచ్‌లలో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. డబ్లిన్‌లో బుధవారం జరిగే ఆఖరి టీ20లో గనుక సత్తా చాటితేనే అతడి పేరును సెలక్టర్లు పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. అంతేకాదు.. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో చోటు దక్కించుకుని మెరుగ్గా రాణిస్తేనే సుందర్ వరల్డ్‌కప్ ఆశలు సజీవంగా ఉంటాయి. చదవండి: హీత్ స్ట్రీక్ అరుదైన రికార్డులు.. తొలి మ్యాచ్‌లో నో వికెట్! నాడు టీమిండియాను ఓడించి.. కోహ్లి తానే బెస్ట్ బౌలర్ అనుకుంటాడు.. అతడి బౌలింగ్ అంటే మాకు భయం: భువీ -
Asia Cup: వరల్డ్‌కప్‌లో వాళ్లకు చోటు! ఆ ముగ్గురికి రోహిత్ శర్మ గుడ్‌న్యూస్..
Asia Cup Squad- Chahal Dropped- Rohit Sharma Reveals BIG reason: ఆసియా కప్-2023 టోర్నీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి సోమవారం జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ సారథ్యంలో 17 మంది సభ్యులతో కూడిన జట్టు శ్రీలంకకు వెళ్లనున్నట్లు తెలిపింది. ఈ మెగా ఈవెంట్‌తో కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీ ఇస్తుండగా.. హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మకు కూడా చోటు దక్కింది. వరల్డ్‌కప్ ప్రొవిజినల్ టీమ్! ఇక ఆసియా వన్డే కప్ నేపథ్యంలో ప్రకటించిన జట్టునే వన్డే వరల్డ్‌కప్ టోర్నీకి ప్రొవిజినల్ టీమ్‌గా భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్, వాషింగ్టన్ సుందర్‌ల గురించి క్రీడా వర్గాల్లో చర్చ మొదలైంది. ఆసియా కప్ జట్టులో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాతో పాటు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్‌లకు చోటు దక్కగా.. అశ్విన్, చహల్, సుందర్‌లకు మొండిచేయి ఎదురైంది. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురి ప్రపంచకప్ అవకాశాలు కూడా గల్లంతయినట్లేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ ముగ్గురికి గుడ్‌న్యూస్! అయితే, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం ఈ ముగ్గురికి ఓ శుభవార్త చెప్పాడు. జట్టు ప్రకటన సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ... ‘‘17 మందికి మాత్రమే జట్టులో చోటు ఉంది. అందుకే చహల్‌ను తీసుకోలేకపోయాం. రవి అశ్విన్, చహల్, సుందర్‌లతో పాటు వరల్డ్‌కప్ ఆడే క్రమంలో ఎవరికీ దారులు మూసుకుపోలేదు’’ అని హిట్‌మ్యాన్ చెప్పుకొచ్చాడు. చైనామన్ స్పిన్నర్‌కు ప్రాధాన్యం కాగా ఇటీవలి కాలంలో ఆల్రౌండర్లుగా జడ్డూ, అక్షర్ దూసుకుపోతుండగా.. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వెస్టిండీస్ పర్యటనలో అద్భుతంగా రాణించాడు. విండీస్‌తో మూడు వన్డేల్లో కలిపి ఏడు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఈ క్రమంలో ఆసియా కప్ జట్టులో అతడికి చోటు దక్కడం గమనార్హం. అయితే, చహల్‌ను పరిగణనలోకి తీసుకోకపోవడంతో ‘కుల్చా’ ద్వయాన్ని చూడాలనుకున్న అభిమానులకు నిరాశే ఎదురైంది. ఇదిలా ఉంటే.. అక్షర్ పటేల్ ఇప్పటి వరకు ఆరు వన్డేల్లో మూడు వికెట్లు తీశాడు. అయితే, చహల్ అనుభవజ్ఞుడైనప్పటికీ లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయగల అక్షర్ వైపే మేనేజ్మెంట్ మొగ్గు చూపింది. కాగా ఆగష్టు 30 నుంచి ఆసియా కప్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. చదవండి: Asia Cup: అయ్యర్, రాహుల్ వచ్చేశారు.. తిలక్ వర్మకు ఛాన్స్.. పాపం సంజూ! -
హైపర్ ఆదితో పెళ్లి? క్లారిటీ ఇచ్చేసిన వర్షిణి!
నటి, యాంకర్ వర్షిణి గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే సినిమాల్లో చిన్న చితకా పాత్రలు చేస్తున్న రానీ గుర్తింపు టీవీ షోలతో సంపాదించింది. ఢీ డ్యాన్స్ షోతో పాటు పలు కామెడీ ప్రోగ్రామ్స్‌కి యాంకరింగ్ చేస్తూ పేరు తెచ్చుకుంది. అయితే ఈమె ప్రేమ గురించి ఎప్పటికప్పుడు ఏదో ఓ న్యూస్ వస్తూనే ఉంది. ఇప్పుడు అలానే ప్రశ్న ఎదురవగా దానిపై క్లారిటీ ఇచ్చేసింది. హైపర్ ఆదితో పెళ్లి? గతంలో కమెడియన్ హైపర్ ఆదితో కలిసి వర్షిణి.. డ్యాన్స్ షోలో యాంకరింగ్ చేసింది. అలా వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ కావడంతో నిజంగానే రిలేషన్లో ఉన్నారని అంతా అనుకున్నారు. కానీ గతంలో ఓ ఇంటర్వ్యూలో వర్షిణి మాట్లాడుతూ అలాంటిదేం లేదని క్లారిటీ ఇచ్చింది. కానీ మొన్నీ మధ్య మరోసారి వర్షిణిని హైపర్ ఆది పెళ్లి చేసుకోబోతున్నాడనే టాక్ వచ్చింది. దీనిపై తాజాగా ఇన్‌స్టా వేదికగా స్పందించిన వర్షిణి.. ఎమోజీలు పోస్ట్ చేసి అలాంటిదేం లేదని చెప్పకనే చెప్పేసింది. (ఇదీ చదవండి: అమలా పాల్ ఒక చెత్త హీరోయిన్: యంగ్ హీరో) అమ్మతో మాట్లాడు..! ఇకపోతే ఇదే చాట్ డిస్కషన్లో భాగంగా ఓ నెటిజన్.. పెళ్లి చేసుకుందామని వర్షిణితో అన్నాడు. దీనిపై ఫన్నీగా స్పందించిన ఈభామ.. తన అమ్మతో మాట్లాడమని చెప్పింది. ఇదంతా పక్కనబెడితే గతంలో ఎన్నడూ లేనంతగా ఈ మధ్య వర్షిణి పెళ్లి ఎక్కువగా డిస్కషన్‌లోకి వస్తుంది. ఎందుకంటే ఐపీఎల్ టైంలో హైదరాబాద్ జట్టుకు ఆడుతున్న వాషింగ్టన్ సుందర్‌తో షికార్లు చేసిందని మాట్లాడుకున్నారు. ఇక ఇప్పుడేమో పలు ఎంటర్ టైన్మెంట్ షోలు చేసే డైరెక్టర్‌తో యాంకర్ వర్షిణి ప్రేమలో ఉందని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. త్వరలో వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని అందుకే ఈ మధ్య కాలంలో వర్షిణి పెళ్లి గురించి తెగ రూమర్స్ వస్తున్నాయని అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై క్లారిటీ రావాలంటే కొన్నాళ్లు ఆగితే గానీ అసలు విషయం ఏంటో తెలీదు. (ఇదీ చదవండి: మెగాస్టార్‌కు సర్జరీ.. సినిమాలకు బ్రేక్?!) -
క్రికెటర్‌తో ప్రేమలో యాంకర్ వర్షిణి? బహుత్ 'సుందర్' హై!
బుల్లితెర యాంకర్ వర్షిణి ఈ మధ్య వార్తల్లో బాగా హైలైట్ అవుతోంది. కారణం తను ఉప్పల్ స్టేడియంకు వెళ్లడం.. వెళ్లిన ప్రతిసారి ఎస్ఆర్హెచ్ ఓడిపోవడం. దీంతో ఎస్ఆర్హెచ్ అభిమానులు ఇదివరకే ఆమెను ఓ ఆటాడేసుకున్నారనుకోండి అది వేరే విషయం. అయితే ఆమె అలా పదేపదే మ్యాచ్‌కు వెళ్లడానికి ఓ బలమైన కారణం ఉందట. సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కోసమే తను పదేపదే స్టేడియంకు వెళ్లిందంటూ ఓ వార్త వైరల్ అవుతోంది. వీరిద్దరూ ప్రేమలో పడ్డారని, ఛాన్స్ దొరికితే చాలు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనిపై అటు సుందర్, ఇటు వర్షిణి ఎవరూ ఇంతవరకు స్పందించలేదు. అయితే వర్షిణిని మాత్రం మళ్లీ చెడుగుడు ఆడేసుకుంటున్నారు నెటిజన్లు. సోషల్ మీడియాలో ఏ ఫోటో పోస్ట్ చేసినా క్రికెటర్ గురించే గుచ్చి గుచ్చి అడుగుతున్నారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో వర్షిణి గ్లామర్ ఫోటోలు షేర్ చేయగా దాని కింద అందరూ వాషింగ్టన్ సుందర్ గురించే ఆరా తీస్తున్నారు. 'ఏంటి, సుందర్‌తో డేటింగ్ అంటగా..', 'బహుత్ సుందర్ హై', 'నీ డ్రెస్ చాలా బాగా వాషింగ్ చేసుకున్నావ్.. బహుత్ సుందర్ హై' అంటూ కామెంట్లతో చెలరేగిపోతున్నారు. కొందరైతే ఏకంగా క్రికెటర్‌ను పెళ్లి చేసుకోమని సలహా ఇస్తున్నారు. బుల్లితెరపై ఎంత అందాలు ఆరబోసినా రాని గుర్తింపు క్రికెటర్ భార్య అయితే వస్తుందని సలహా ఇస్తున్నారు. క్రికెటర్లను పెళ్లి చేసుకున్న సినీతారల జాబితాలో చేరిపోమని సూచిస్తున్నారు. View this post on Instagram A post shared by Varshini Sounderajan (@varshini_sounderajan) View this post on Instagram A post shared by Varshini Sounderajan (@varshini_sounderajan) చదవండి: గ్రాండ్‌గా ఆర్ఆర్ఆర్ నిర్మాత దానయ్య ఇంట పెళ్లి -
సన్‌రైజర్స్‌కు బిగ్ షాక్.. స్టార్ ఆటగాడు టోర్నీ మొత్తానికి దూరం!
ఐపీఎల్-2023లో ఓటుముల బాధలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ మోకాలి గాయం కారణంగా మిగిలిన టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఎస్ఆర్హెచ్ ట్విటర్ వేదికగా వెల్లడించింది. "మోకాలి గాయం కారణంగా ఐపీఎల్-2023 సీజన్ నుంచి తప్పుకున్నాడు" అని ఎస్ఆర్హెచ్ ట్విటర్లో పేర్కొంది. కాగా ఢిల్లీ క్యాపిటల్స్‌లో జరిగిన మ్యాచ్‌లో వాషింగ్టన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. బౌలింగ్‌లో మూడు వికెట్లు పడగొట్టిన సుందర్.. బ్యాటింగ్‌లో 24 పరుగులు చేశాడు. అయితే ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడిన సుందర్ మూడు వికెట్లతో పాటు 60 పరుగులు సాధించాడు. కాగా తొలి ఆరు మ్యాచ్‌ల్లో పేలవ ప్రదర్శన కనబరిచిన సుందర్.. ఢిల్లీ మ్యాచ్‌తో అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చాడు. అయితే అంతలోనే అతడు గాయం కారణంగా దూరం కావడం ఎస్ఆర్హెచ్కు గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పుకోవాలి. 🚨 INJURY UPDATE 🚨 Washington Sundar has been ruled out of the IPL 2023 due to a hamstring injury. Speedy recovery, Washi 🧡 pic.twitter.com/P82b0d2uY3 — SunRisers Hyderabad (@SunRisers) April 27, 2023 చదవండి: Ind Vs Aus WTC 2023: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు టీమిండియాకు గుడ్‌న్యూస్! -
హమ్మయ్య.. ఎట్టకేలకు సాధించాడు! సన్‌రైజర్స్‌కు ఇక చాలు
ఐపీఎల్-2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఎట్టకేలకు అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఉప్పల్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన సుందర్..28 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఆ మూడు వికెట్లు కూడా ఒకే ఓవర్లో పడగొట్టడం విశేషం. ఢిల్లీ ఇన్నింగ్స్ 8 ఓవర్ వేసిన సుందర్.. డేవిడ్ వార్నర్, సర్పరాజ్ ఖాన్ అమాన్ ఖాన్‌ను పెవిలియన్‌కు పంపాడు. తన తొలి ఓవర్లో 13 పరుగులిచ్చిన సుందర్.. ఆతర్వాత అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చాడు. కాగా ఈ ఏడాది సీజన్లో సుందర్ వికెట్లు పడగొట్టడం ఇదే తొలి సారి కావడం గమానార్హం. తొలి ఆరు మ్యాచ్‌ల్లో సుందర్ ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయాడు. ఇక వరుసగా విఫలమకావడంతో సుందర్‌పై సన్‌రైజర్స్ అభిమానులు తీవ్ర విమర్శల వర్షం కురిపించారు. అయితే ఇప్పుడు సుందర్ తన స్థాయికి తగ్గట్టు ప్రదర్శన చేయడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. దీంతో # వాషింగ్టన్ సుందర్ అనే కీవర్డ్ ట్విటర్లో ట్రెండ్ అవుతోంది. చదవండి: IPL 2023: ఐపీఎల్లో భువనేశ్వర్ అరుదైన రికార్డు.. రెండో బౌలర్‌గా 3 gifts in a single over for Washington Sundarpic.twitter.com/Bk4nuPPAs8 — Gappa Cricket (@GappaCricket) April 24, 2023 -
IPL 2023: సన్‌రైజర్స్ ఆల్‌రౌండర్ చెత్త రికార్డు
ఐపీఎల్-2023లో భాగంగా చెన్నై సూపర్‌కింగ్స్‌తో నిన్న (ఏప్రిల్ 21) జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అన్ని విభాగాల్లో దారుణంగా విఫలమై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఓ చెత్త రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుత ఎడిషన్‌లో వికెట్ పడగొట్టకుండా అత్యధిక ఓవర్లు వేసిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. సుందర్.. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 13.4 ఓవర్లు వేసి ఒక్క వికెట్ కూడా పడగొట్టకుండా 118 పరుగులు సమర్పించుకున్నాడు. సుందర్ తర్వాత సీఎస్కే బౌలర్ దీపక్ చాహర్ (9 ఓవర్లలో 94), లక్నో బౌలర్ జయదేవ్ ఉనద్కత్ (8 ఓవర్లలో 92), రాజస్థాన్ రాయల్స్ పేసర్ కేఎం ఆసిఫ్ (7 ఓవర్లలో 69), గుజరాత్ బౌలర్ యశ్ దయాల్ (6 ఓవర్లలో 95)లు వికెట్ లేకుండా (కనీసం 6 ఓవర్లు వేసి) చెత్త గణాంకాలతో లీగ్‌లో కొనసాగుతున్నారు. కాగా, సన్‌రైజర్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో రవీంద్ర జడేజా (4-0-22-3), డెవాన్ కాన్వే (77 నాటౌట్) సత్తా చాటడంతో సీఎస్కే 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో సీఎస్కే 8 పాయింట్లు (0.355) సాధించి, పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. రాజస్థాన్ రాయల్స్ (1.043), లక్నో సూపర్ జెయింట్స్ (0.709) సైతం ఎనిమిదే పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. సన్‌రైజర్స్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో కేవలం 2 విజయాలు మాత్రమే సాధించి, పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. -
పేరుకే ఆల్‌రౌండర్.. జట్టులో ఎందుకు ఉన్నాడో తెలియదు! తీసి పడేయండి
ఐపీఎల్-2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరోసారి తీవ్ర నిరాశ పరిచింది. చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ ఓటమిపాలైంది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో దారుణంగా విఫలమైన ఎస్ఆర్హెచ్ ఘోర ఓటమిని మూటకట్టుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల కోల్పోయి కేవలం 134 పరుగులు మాత్రమే చేసింది. సన్‌రైజర్స్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ(34) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సీఎస్కే బౌలర్లలో జడేజా మూడు వికెట్లతో చెలరేగగా.. దేశ్‌పాండే, ఆకాష్ సింగ్, పతిరానా తలా వికెట్ సాధించారు. అనంతరం 135 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే కేవలం మూడు వికెట్లు కోల్పోయి 18.4 ఓవర్లలో ఛేదించింది. చెన్నై ఓపెనర్ డెవాన్ కాన్వే 77 పరుగులతో ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. వాషింగ్టన్‌పై విమర్శల వర్షం.. ఇక ఇది ఇలా ఉండగా.. ఎస్ఆర్హెచ్ జట్టులో కీలక ఆల్‌రౌండర్‌గా ఉన్న వాషింగ్టన్ సుందర్ దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లోనూ కేవలం 9 పరుగులు మాత్రమే చేసిన సుందర్.. బౌలింగ్‌లో కూడా ఒక్క వికెట్ పడగొట్టలేకపోయాడు. తన హోం గ్రౌండ్ అయిన చెపాక్‌లో కూడా అతడు పేలవ ప్రదర్శన కనబరచడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక ఈ ఏడాది సీజన్లో ఇప్పటి వరకు 6 మ్యాచ్‌లు ఆడిన సుందర్ కేవలం 36 పరుగులు మాత్రమే చేశాడు. అదే విధంగా బౌలింగ్‌లో అయితే అస్సలు రాణించలేకపోతున్నాడు. 6 మ్యాచ్‌ల్లో అతడు ఒక్క వికెట్ కూడా పడగొట్టకపోవడం గమనార్హం. ఈ క్రమంలో వాషింగ్టన్ సుందర్‌పై నెటిజన్లు తీవ్ర విమర్శల వర్షం కురిపిస్తున్నారు. పేరుకే ఆల్‌రౌండర్ తప్ప పొడిచింది ఏమి లేదని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. సుందర్ స్థానంలో మరో ఆటగాడికి అవకాశం ఇస్తే బాగుంటుంది అని పలువురు మాజీ క్రికెటర్లు కూడా అభిప్రాయపడుతున్నారు. చదవండి: NEP vs OMN: చరిత్ర సృష్టించిన నేపాల్ క్రికెటర్.. ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా Fourth #IPL2023 win in the 🎒 & #CSK are back to winning ways at 🏡 Which player's performance did you enjoy the most in #CSKvSRH? 💬#IPLonJioCinema #TATAIPL | @ChennaiIPL pic.twitter.com/HPgBxeFHf7 — JioCinema (@JioCinema) April 21, 2023 -
సుందరానికి తొందరెక్కువ.. తప్పించుకోవడం కష్టం!
సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని తన కీపింగ్ స్మార్ట్‌నెస్ మరోసారి చూపించాడు. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో మొదట సూపర్ స్టంపింగ్‌తో మెరిసిన ధోని ఆఖర్లో సుందర్‌ను రనౌట్ చేసిన తీరు హైలెట్‌గా మారింది. ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ ఆఖరి బంతిని మార్కో జాన్సెన్ మిస్ చేశాడు. ఒక్క పరుగుతో వచ్చేది ఏం లేదని అక్కడే ఆగిపోయే ఉంటే బాగుండేది. ఎదురుగా ఉన్నది ధోని అని తెలిసి కూడా జాన్సెన్ రిస్క్ చేశారు. ఫలితం నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న సుందర్ క్రీజులోకి వచ్చేలోపే ధోని బంతితో డైరెక్ట్ హిట్ వేయడంతో వికెట్లు ఎగిరిపడ్డాయి. "సుందరానికి బాగా తొందరెక్కువ.. బంతి ధోని చేతుల్లోకి వెళితే తప్పించుకోవడం కష్టమని తెలిసి కూడా రిస్క్ అవసరమా'' అంటూ అభిమానులు కామెంట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. \ | / Dhoni 𝚠̶𝚊̶𝚜̶ is here! 💥#CSKvSRH #TATAIPL #IPLonJioCInema #IPL2023 pic.twitter.com/9r21Ay7PIS — JioCinema (@JioCinema) April 21, 2023 చదవండి: క్లాసెన్ అడ్డుకున్నా.. ఈసారి ధోని వదల్లేదు! -
పరుగెత్తడంలో అలసత్వం.. కర్మ ఫలితం అనుభవించాల్సిందే
ఎస్ఆర్హెచ్ ఆటగాడు వాషింగ్టన్ సుందర్ బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్లా తయారయ్యాడు. కనీసం పరిగెత్తడంలోనూ అలసత్వం ప్రదర్శించడంతో మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. విషయంలోకి వెళితే.. ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ 18వ ఓవర్ జాసన్ బెహండార్ఫ్ వేశాడు. అప్పటికే రెండు ఫోర్లతో సుందర్ టచ్‌లో కనిపించాడు. Photo: IPL Twitter ఓవర్ ఐదో బంతిని ఫుల్‌టాస్ వేయగా సుందర్ మిడాఫ్ దిశగా డ్రిల్ చేశాడు. సింగిల్‌కు ప్రయత్నించిన సుందర్ మొదట్లో వేగంగానే పరిగెత్తుకు వచ్చాడు. బంతిని అందుకున్న ఫీల్డర్ టిమ్ డేవిడ్ నేరుగా బంతిని డైరెక్ట్ త్రో వేశాడు. మరి డేవిడ్ వేసిన బంతి వికెట్లకు తాకదనుకున్నాడో.. తాను ఔట్ కానని నమ్మకమో తెలియదు కానీ క్రీజుకు అడుగు దూరంలో నిర్లక్ష్యం ప్రదర్శించాడు. ఆ నిర్లక్ష్యమే సుందర్‌ను దెబ్బకొట్టింది. రిప్లేలో సుందర్ క్రీజులోకి వచ్చేలోపే టిమ్ డేవిడ్ వేసిన త్రో డైరెక్ట్‌గా వికెట్లను తాకింది. పరిగెత్తడంలో అలసత్వం ప్రదర్శించిన సుందర్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్ గుప్పుమన్నాయి. బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్లా ఉన్నావు.. పరిగెత్తడంలో ఇంత నిర్లక్ష్యమా.. కర్మ ఫలితం అనుభవించాల్సిందే. అంటూ ద్వజమెత్తారు. Extreme sloppy and lazy running from Washington Sundar! When you are hitting the ball so well, why to get run out like that!!#RohitSharma𓃵 #ViratKohli𓃵 #MSDhoni𓃵 #washingtonsundar #Sundar #SRHvsMI #TATAIPL2023 #Rohit #IPLOnStar #IPL2O23 #kavyamaran pic.twitter.com/H0LtWKJcPV — Cricket Fanatic (@CricketFanati20) April 18, 2023 చదవండి: #Tilak Varma: ఉన్నది కాసేపే.. కానీ దడదడలాడించాడు -
చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే.. ఆ పని ముందే చేయాల్సింది!
ఐపీఎల్-2023లో సన్‌రైజర్స్ తమ పరాజయాల పరంపర కొనసాగిస్తోంది. ఈ ఏడాది సీజన్లో వరుసగా రెండో ఓటమి చవిచూసింది. లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ ఓటమి పాలైంది. తొలుత టాస్ గెలిచిన బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్హెచ్ ఆరంభం నుంచే తడబడింది. పిచ్‌పై బంతి అద్భుతంగా టర్న్ అవ్వడం గమనించిన లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను పవర్‌ప్లే లోపే స్పిన్నర్లను రంగంలోకి దించాడు. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన కృనాల్ పాండ్యా.. అగర్వాల్ వికెట్ పడగొట్టి అద్భుతమైన ఆరంభం ఇచ్చారు. అనంతరం ఏ దశలోనూ హైదరాబాద్ బ్యాటర్లు లక్నోకు పోటీఇవ్వలేకపోయారు. ఆ పని ముందే చేయాల్సింది.. 9 ఓవర్లు ముగిసే సమయానికి ఎస్ఆర్హెచ్ కేవలం 55 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇటువంటి సమయంలో ఎస్ఆర్హెచ్ మెనెజ్‌మెంట్ పెద్ద తప్పు చేసింది. బ్యాటింగ్ లైనప్‌లో ముందు ఉన్న అబ్ధుల్ సమద్‌ను కాదని వాషింగ్టన్ సుందర్‌ను పంపింది. ఇదే సన్‌రైజర్స్ కొంపముంచింది. కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన సుందర్ టెస్టు మ్యాచ్‌ను తలపించేలా తన ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. 28 బంతులు ఎదుర్కొన్న సుందర్ 16 పరుగులు మాత్రమే చేసి తీవ్ర నిరాశపరిచాడు. ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ 17 ఓవర్లో రాహుల్ త్రిపాఠి ఔటైన వెంటనే అబ్దుల్ సమద్ క్రీజులోకి వచ్చాడు. అతడు తన ఎదుర్కొన్న తొలి బంతినే బౌండరీగా మలిచాడు. కేవలం 10 బంతులు మాత్రమే ఎదుర్కొన్న సమద్ 2 సిక్స్‌లు, ఒక ఫోర్‌తో 21 పరుగులు చేశాడు. అయితే సమద్ క్రీజులోకి వచ్చినప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సమద్ సంచలన ఇన్నింగ్స్ ఆడడంతో ఎస్ఆర్హెచ్ 121 పరుగులైనా చేయగల్గింది. ఇక సుందర్ స్థానంలో సమద్ బ్యాటింగ్ వచ్చే పరిస్ధితి మరోవిధంగా ఉండేదని ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు. అదే విధంగా రాజస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో కూడా ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన సమద్ 32 పరుగులు చేసి అందరని అకట్టుకున్నాడు. చదవండి: IPL 2023 SRH vs LSG: ఎవరు బాబు నీవు.. వెళ్లి టెస్టులు ఆడుకో పో! అక్కడ కూడా పనికి రాడు -
ఎవరు బాబు నీవు.. వెళ్లి టెస్టులు ఆడుకో పో! అక్కడ కూడా పనికి రాడు
ఐపీఎల్-2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తీరు మారలేదు. ఈ మెగా ఈవెంట్లో వరుసగా రెండో ఓటమిని ఎస్ఆర్హెచ్ చవి చూసింది. శుక్రవారం వాజ్‌పేయి స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఎస్ఆర్హెచ్ అందుకు తగ్గట్టు ఏ దశలోను ప్రదర్శన చేయలేకపోయింది. ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ టెస్టు మ్యాచ్ కంటే దారుణంగా కొనసాగింది. ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్ ఆడిన ఆట తీరు అయితే అభిమానులకు చిరాకు తెప్పించింది. 9 ఓవర్లలో ఎస్ఆర్హెచ్ స్కోర్ 55/4 ఉన్న సమయంలో సుందర్ క్రీజులోకి వచ్చాడు. అయితే క్రీజులోకి వచ్చిన సుందర్ టెస్టు మ్యాచ్‌ను తలపించేలా తన ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. కనీసం ఒక పెద్ద షాట్ ఆడే ప్రయత్నం కూడా చేయలేదు. ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా 28 బంతులు ఎదుర్కొన్న సుందర్ 16 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. ఇక కీలక సమయంలో వచ్చి జిడ్డు బ్యాటింగ్ చేసిన సుందర్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. సుందర్ టీ20లకు పనికిరాడని, టెస్టు మ్యాచ్‌లు ఆడుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. మరి కొంతమంది సుందర్ స్థానంలో సమద్‌ను బ్యాటింగ్ పంపింటే పరిస్థితి మరో విధంగా ఉండేది అని కామెంట్లు చేస్తున్నారు. ఇక కెప్టెన్‌గా తొలి మ్యాచ్ ఆడిన ఐడైన్ మార్క్రమ్ కూడా గోల్డన్ డక్‌గా వెనుదిరిగాడు. చదవండి: IPL 2023: అదే మా కొంపముంచింది.. వారు మాత్రం అద్భుతం! పిచ్ కూడా! ఆ మాట చెప్పడానికి సిగ్గు లేదు Boundary kottu Washington Sundar - pic.twitter.com/KWahPRxHng — Rolex (@Marshall_Jim12) April 7, 2023 Wow 😲 what a player man 🔥#washingtonsundar #SRHvsLSG Legend player 😂 pic.twitter.com/YKompQ3fSQ — Hidden_Star (@blackblue8855) April 7, 2023 An all-round @krunalpandya24 performance and a clinical @LucknowIPL chase at home to move to the 🔝 of the table 👌🏻👌🏻 #TATAIPL We have got the #LSGvSRH clash summed up for you 🔽 pic.twitter.com/d0m9foUkqf — IndianPremierLeague (@IPL) April 8, 2023 -
Ind Vs Aus: అతడికి విశ్రాంతి? సుందర్, ఉమ్రాన్ మాలిక్‌కు ఛాన్స్!
India vs Australia, 3rd ODI: వన్డే సిరీస్‌లో నిర్ణయాత్మక మ్యాచ్‌కు టీమిండియా- ఆస్ట్రేలియా సిద్ధమయ్యాయి. చెన్నై వేదికగా ఇరు జట్ల మధ్య బుధవారం(మార్చి 22) ఆఖరి వన్డే జరుగనుంది. సిరీస్ విజేతను తేల్చే ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలుపొందాలని టీమిండియా పట్టుదలగా ఉండగా.. ఇప్పటికే బోర్డర్- గావస్కర్ ట్రోఫీ కోల్పోయిన ఆసీస్ వన్డేల్లోనైనా పైచేయి సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. చెపాక్ మైదానంలో.. కాగా భారత్- ఆసీస్ ఆఖరి మ్యాచ్ జరిగే చెపాక్ మైదానం చాలా కాలంగా స్పిన్‌కు అనుకూలం. ఇక్కడ భారీ స్కోర్లు ఎక్కువగా నమోదు కాలేదు. ఈసారీ అలాగే కనిపిస్తోంది. ఇదిలా ఉంటే వరుసగా రెండు వన్డేల్లో విఫలమైన సూర్యకుమార్ యాదవ్‌కు తుదిజట్టులో చోటు ఖాయమని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటికే సంకేతాలు ఇచ్చాడు. దీంతో భారత బ్యాటింగ్ ఆర్డర్లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. అయితే, వైజాగ్ వన్డేలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ స్థానంలో స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ చోటు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్-2023 నేపథ్యంలో మహ్మద్ షమీపై పనిభారం తగ్గించాలని భావిస్తే ఉమ్రాన్ మాలిక్ ఆఖరి వన్డేలో ఆడే ఛాన్స్ ఉంది. ఇక.. ఆసీస్ విషయానికొస్తే స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తిరిగి జట్టులోకి రానుండగా.. రెండు వన్డేల్లో దుమ్ములేపిన మార్ష్ మిడిలార్డర్లో ఆడే అవకాశం ఉంది. కాగా బుధవారం నాటి మ్యాచ్‌కు వర్షసూచన లేదు. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ షమీ/ఉమ్రాన్ మాలిక్, మహ్మద్ సిరాజ్. ఆస్ట్రేలియా: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ , అలెక్స్ క్యారీ, కామెరాన్ గ్రీన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టొయినిస్, అష్టన్ అగర్, మిచెల్ స్టార్క్, ఆడం జంపా. చదవండి: NED Vs ZIM: శతకంతో అదరగొట్టిన తెలుగు క్రికెటర్; జింబాబ్వేపై నెదర్లాండ్స్ విజయం -
త్రీడీ ప్లేయర్ విజయ్ శంకర్‌కు భారీ ధర.. వాషింగ్టన్ సుందర్‌కు నామమాత్రపు రేట్
TNPL 2023 Auction: ప్రాంతీయ క్రికెట్ టోర్నీ అయిన తమిళనాడు ప్రీమియర్ లీగ్ సక్సెస్‌ఫుల్‌గా ఆరు ఎడిషన్లు పూర్తి చేసుకుని ఏడవ ఎడిషన్‌ను సిద్ధమవుతుంది. సీజన్ ప్రారంభానికి ముందు నిర్వహకులు తొలిసారి ఆటగాళ్ల వేలాన్ని నిర్వహిస్తున్నారు. ఇవాళ (ఫిబ్రవరి 23), రేపు జరుగబోయే ఈ వేలంలో మొత్తం 942 మంది ఆటగాళ్లు (తమిళనాడుకు చెందిన వారు) తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ వేలంలో టీమిండియా స్టార్ క్రికెటర్లు దినేశ్ కార్తీక్, వాషింగ్టన్ సుందర్, టి నటరాజన్, వరుణ్ చక్రవర్తి, విజయ్ శంకర్ తదతరులు పాల్గొంటుండగా.. పెద్ద పేర్లలో రిటెన్షన్ చేసుకున్న ఏకైక ఆటగాడిగా రవిచంద్రన్ అశ్విన్ నిలిచాడు. దిండిగుల్ డ్రాగన్స్ ఫ్రాంచైజీ యాశ్ను 60 లక్షలకు రిటైన్ చేసుకుంది. వేలం ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే ఐ డ్రీమ్ తిరుపూర్ తమిజాన్స్.. టీమిండియా ఆల్‌రౌండర్, త్రీడీ ప్లేయర్ విజయ్ శంకర్‌ను 10.25 లక్షల రికార్డు ధరకు సొంతం చేసుకోగా.. ప్రస్తుత భారత పరిమిత ఓవర్ల జట్టు సభ్యుడు వాషింగ్టన్ సుందర్‌ను మధురై పాంథర్స్ 6.75 లక్షలకు , మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని దిండిగుల్ డ్రాగన్స్ 6.75 లక్షలకు సొంతం చేసుకుంది. వేలంలో పై పేర్కొన్న ఆటగాళ్లు మాత్రమే కాకుండా ఇంకా చాలా మంది పేరున్న ఆటగాళ్లు ఉన్నారు. సాయ్ కిషోర్, సాయ్ సుదర్శన్, బాబా అపరాజిత్, బాబా ఇంద్రజిత్, మురుగన్ అశ్విన్.. ఇలా దేశవాలీ స్టార్లు చాలా మంది వేలంలో పాల్గొంటున్నారు. కాగా, ఈ వేలంలో ప్రతి జట్టు కనిష్టంగా 16 మందిని, గరిష్ఠంగా 20 మంది ఆటగాళ్లను ఎంపిక చేసుకోవాల్సి ఉంది. లీగ్‌లో పాల్గొనే 8 జట్లు ఇద్దరు ఇద్దరు ఆటగాళ్లను రిటైన్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఫ్రాంచైజీల గరిష్ఠ పర్సు విలువ 70 లక్షలుగా నిర్ధారించారు. వేలంలో పాల్గొనే ఆటగాళ్లను నాలుగు కేటగిరీలు విభజించిన నిర్వహకులు.. ఏ కేటగిరి (అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన వారు) ఆటగాళ్లకు 10 లక్షలు, బి కేటగిరి (సీనియర్ బీసీసీఐ దేశవాలీ మ్యాచ్‌లు ఆడిన వారు) ఆటగాళ్లకు 6 లక్షలు, సి కేటగిరి (పై రెండు కేటగిరిల్లో లేకుండా, కనీసం 30 TNPL మ్యాచ్‌లు ఆడిన వారు) ఆటగాళ్లకు 3 లక్షలు, డి కేటగిరి (ఇతర ఆటగాళ్లు) ఆటగాళ్లకు 1.5 లక్షల చొప్పున బేస్ ప్రైస్ ఫిక్స్ చేశారు. ఆయా ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల వివరాలు.. చేపక్ సూపర్ గిల్లీస్ (ఎన్ జగదీశన్) నెల్లై రాయల్ కింగ్స్ (అజితేశ్, కార్తీక్ మణకందన్) ఐ డ్రీమ్ తిరుపూర్ తమిజాన్స్ (తుషార్ రహేజా) లైకా రోవై కింగ్స్ (షారుక్ ఖాన్, సురేశ్ కుమార్) దిండిగుల్ డ్రాగన్స్ (రవిచంద్రన్ అశ్విన్) రూబీ త్రిచీ వారియర్స్ (ఆంటోనీ దాస్) సేలం స్పార్టన్స్ (గణేశ్ మూర్తి) మధురై పాంథర్స్ (గౌతమ్) -
యువరక్తం ఉరకలేస్తుంది.. కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
శత్రుదుర్బేధ్యంగా తయారైంది భారత క్రికెట్ జట్టు బ్యాటింగ్ లైనప్. ఒకరి తర్వాత ఒకరు. ప్రతీ ఒక్కరూ క్రికెట్ కు కొత్త నిర్వచనం చెబుతున్నారు. పాత షాట్లు పక్కన పెట్టి కొత్త షాట్లతో అలరిస్తున్నారు. ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించి మ్యాచులు గెలిచేస్తున్నారు. ఇక బౌలర్లు అయితే ప్రత్యర్ధి బ్యాటర్లను కుదురుకోనివ్వడం లేదు. నిర్దాక్షిణ్యంగా అవుట్ చేసి పెవిలియన్ పంపేస్తున్నారు. ఇక ఫీల్డర్లు అయితే జిమ్నాస్టిక్ విన్యాసాలతో కళ్లు చెదిరే క్యాచులు పట్టుకుని మ్యాచులు సొంతం చేసుకుంటున్నారు. నవ భారత యువ ఆటగాళ్లు మామూలోళ్లు కారని ప్రపంచ దేశాలు కంగారు పడుతున్నాయి. భారత క్రికెట్ జట్టులో యువరక్తం ఉరకలు వేస్తోంది. కొత్త కుర్రాళ్లు కదం తొక్కుతున్నారు. అసాధ్యమన్నదే తమ డిక్షనరీలే లేదన్నట్లు దూసుకుపోతున్నారు. వచ్చిన ప్రతీ కుర్రాడు ప్రత్యర్ధులను భయపెట్టేస్తున్నారు. ఇలాంటి ఆటగాడు మా దగ్గర ఒక్కడుంటే చాలునని ప్రత్యర్ధి జట్ల సారధులు అసూయపడేంతగా మనోళ్లు సత్తా చాటుతున్నారు. ఈ ఏడాది కొన్ని మ్యాచుల్లో ఓపెనింగ్ జోడీగా బరిలో దిగిన శుభమన్ గిల్ , ఇషాన్ కిషన్ లు ఇద్దరూ తమకి ఎవరూ సాటి రారని బ్యాట్ తో చాటి చెబుతున్నారు. ఈ ఇద్దరూ కొద్ది రోజుల వ్యవధిలోనే వన్డేల్లో చెరో డబులు సెంచరీ చేసి ప్రపంచాన్ని తమవైపు తిప్పుకున్నారు. ప్రస్తుతం భారత్ లో న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో శుభమన్ గిల్ డబుల్ సెంచరీతో మెరిశాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా గిల్ చరిత్ర సృష్టించాడు. సరిగ్గా నెల రోజుల క్రితం బంగ్లాదేశ్ తో జరిగిన వన్డే సిరీస్ లో ఇషాన్ కిషన్ కేవలం 126 బంతుల్లోనే డబుల్ సెంచరీ చేసి వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టాడు. మొత్తం మీద ఆ మ్యాచ్ లో కిషన్ 210 పరుగులు చేశాడు. మరి కొద్ది సేపు ఆడి ఉంటే ట్రిపుల్ సెంచరీ చేసేవాడినని మ్యాచ్ అనంతరం కిషన్ అన్నాడు. ఈ ఇన్నింగ్స్ లో కిషన్ విశ్వరూపం చూసి అంతర్జాతీయ క్రికెటర్లు శెభాష్ అని మెచ్చుకున్నారు. ఇక భారత మిడిల్ ఆర్డర్ లో ఎంట్రీ ఇచ్చి యావత్ ప్రపంచాన్నీ వణికిస్తోన్న ఆటగాడు సూర్య కుమార్ యాదవ్. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతోన్న సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ చేస్తోంటే ఎలాంటి బౌలర్ కి అయినా ముచ్చెమటలు పట్టడం ఖాయం. ఎలాంటి బాల్ వేసినా దాన్ని స్కూప్ షాట్ తో సిక్సర్ కొట్టడం సూర్యకుమార్ కు మంచినీళ్లు తాగినంత తేలిక. గ్రౌండ్లో అన్ని వైపులా షాట్లు ఆడగల అరుదైన క్రికెటర్ కాబట్టే సూర్య కుమార్‌ను మిస్టర్ 360 డిగ్రీస్ అని పిలుస్తున్నారు. సూర్య కుమార్ కు ముందు దక్షిణాఫ్రికా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ డివిలియర్స్ కు ఆ పేరు ఉండేది. ఇప్పుడు దాన్ని సూర్య సొంతం చేసుకున్నారు. సూర్య ఆడే షాట్లు అలా ఉంటాయి మరి. కొన్నాళ్లు పోతే ప్రత్యర్ది జట్ల బౌలర్లు అంతా కలిసి సూర్య అలాంటి షాట్లు ఆడితే మేం బౌలింగ్ చేయం అని మొరాయించినా ఆశ్చర్యపోనవసరం లేదని చమత్కరిస్తున్నారు సీనియర్లు. ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో సూర్య కుమార్ యాదవ్‌కు ఉన్న టాలెంట్ ఎవ్వరిలోనూ చూడలేదని ఆస్ట్రేలియా వెటరన్ క్రికెటర్ రికీ పాంటింగ్ కితాబు నిచ్చాడు. ట్వంటీల్లో ఇప్పటికే మూడు సెంచరీలు చేసిన సూర్య కుమార్ యాదవ్ ప్రస్తుతం టీ ట్వంటీ బ్యాటర్స్ ర్యాంకింగ్ లో నంబర్ వన్ గా ఉన్నాడు. సూర్య కుమార్ యాదవ్ క్రీజులో ఉన్నంత సేపు భారత విజయావకాశాలు సజీవంగా ఉన్నట్లే ధీమాగా ఉండచ్చు. అంత పవర్ ఫుల్ క్రికెట్ తో చెలరేగుతున్నారు సూర్య. ఇక ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా. టి 20 జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తోన్న హార్దిక్ పాండ్యాను వెటరన్ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ తో పోలుస్తున్నారు. బ్యాటింగ్ లో తిరుగులేని ఫినిషర్ గా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు పాండ్యా. ఇటు బౌలర్ గానూ సత్తా చాటి కీలక దశలో వికెట్లు తీస్తూ జట్టు విజయంలో కీలక పాత్రపోషిస్తున్నాడు పాండ్యా. బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు అద్భుతమైన ఫీల్డర్ కూడా. వీటిని మించి చక్కటి వ్యూహాలు అమలుచేసే సారధిగానూ పాండ్యా రాణిస్తున్నాడు. మరో ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ అయితే బ్యాట్ తోనూ బాల్ తోనూ వండర్స్ చేస్తున్నాడు.తిరుగులేని ఫీల్డర్ గా రెచ్చిపోతున్నాడు. దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠీ, అక్షర్ పటేల్ వంటి యువ కెరటాలు భవిష్యత్ మాదేనని చాటుకుంటున్నారు. బౌలింగ్ లో అర్షదీప్ సింగ్, మావి, దీపక్ చాహర్, ఉమ్రాన్ మాలిక్ , చాహల్ , కుల్ దీప్ యాదవ్ లు ఎప్పుడు అవకాశం ఇచ్చినా వికెట్లు తీసి మెరుస్తున్నారు. మొత్తానికి కొత్త మొహాలన్నీ కూడా స్టార్ క్రికెటర్లను తలపిస్తూ భారత జట్టును విజయాల బాటలో పరుగులు పెట్టిస్తున్నారు. ఇన్నోవేటివ్ షాట్స్ తో బ్యాటర్లు యాగ్రెసివ్ బౌలింగ్ తో బౌలర్లు క్రికెట్ ఆటను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. కొత్త ఆటగాళ్లకు భారత జట్టులో కొత్త ఉత్సాహం ఉరకలు వేస్తోంది. కొత్త రక్తంతో కుర్రాళ్లు కదం తొక్కుతున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు. -
ఆసీస్‌తో తొలి టెస్ట్.. టీమిండియాతో చేరనున్న వాషింగ్టన్ సుందర్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫిబ్రవరి 9 నుంచి నాగ్‌పూర్ వేదికగా మొదలుకానున్న మొదటి టెస్ట్ కోసం టీమిండియా సెలెక్టర్లు నలుగురు నెట్ బౌలర్లను ఎంపిక చేశారు. ఆశ్చర్యకరంగా ఈ నలుగురు స్పిన్ బౌలర్లే కావడం విశేషం. సెలెక్టర్లు ఎంపిక చేసిన నలుగురిలో టీమిండియా పరిమిత ఓవర్ల ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్, ఉత్తర్‌ప్రదేశ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ సౌరభ్ కుమార్, రాజస్థాన్ లెగ్ స్పిన్నర్, టీమిండియా బౌలర్ రాహుల్ చాహర్, తమిళనాడు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ బౌలర్ సాయి కిషోర్ ఉన్నారు. ఈ నలుగురు స్పిన్నర్లు నాగ్‌పూర్‌లో జరుగుతున్న ప్రాక్టీస్ సెషన్లో టీమిండియాతో రేపటి నుంచి కలుస్తారిన సెలెక్టర్లు శుక్రవారం (ఫిబ్రవరి 3) ప్రకటించారు. ఆసీస్ బౌలర్లను, ముఖ్యంగా స్పిన్నర్లను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు వైవిధ్యమైన స్పిన్నర్లు అవసరమనే ఉద్దేశంతో వీరిని ఎంపిక చేసినట్లు సెలెక్టర్లు తెలిపారు. ఇప్పటికే తొలి రెండు టెస్ట్‌లకు ఎంపిక జట్టులో నలుగురు స్పిన్నర్లు (కుల్దీప్, అశ్విన్, అక్షర్, జడేజా) ఉన్నప్పటికీ.. సెలెక్టర్లు అదనంగా మరో నలుగురు స్పిన్నర్లను (నెట్ బౌలర్లు) ఎంపిక చేశారు. ఎందుకంటే ఆసీస్ స్పిన్ విభాగంలో (నాథన్ లయోన్ (ఆఫ్ స్పిన్నర్), మిచెల్ స్వెప్సన్ (లెగ్ స్పిన్నర్), టాడ్ మర్ఫీ (ఆఫ్ స్పిన్నర్), ట్రవిస్ హెడ్ (ఆఫ్ స్పిన్నర్), అస్టన్ అగర్ (లెఫ్ ఆర్మ్ ఆర్థోడాక్స్)) ముగ్గురు ఆఫ్ స్పిన్నర్లు, ఓ లెగ్ స్పిన్నర్, ఓ లెఫ్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్ ఉన్నారు. వీరిని ఎదుర్కోవాలంటే అదే వాటం ఉన్న బౌలర్లయితే ప్రయోజనకరంగా ఉంటుందని సెలెక్టర్లు ఈ ఎత్తుగడ వేశారు. భారత స్పిన్ విభాగంలో ఒక్క అశ్విన్ మినహా మిగతా ముగ్గురు లెఫ్ ఆర్మ్ బౌలర్లే కావడంతో ఆఫ్ స్పిన్నర్, లెగ్ స్పిన్నర్లతో నెట్స్‌లో ప్రాక్టీస్ చేయిస్తే బాగుంటుందని జట్టు కోచ్ సెలక్టర్లను కోరినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఆసీస్ బౌలింగ్ విభాగంలో స్పిన్నర్ల కంటే పేసర్ల (కమిన్స్, స్టార్క్, హేజిల్‌వుడ్, బోలాండ్) డామినేషనే అధికంగా ఉంది. ఈ పరిస్థితుల్లో నెట్స్‌లో స్పిన్నర్లతో సమానంగా పేసర్లతో బౌలింగ్ చేయిస్తే, టీమిండియాకు ప్రయోజనకరంగా ఉంటుంది. -
WC 2023: చహల్ కంటే అతడు బెటర్.. కుల్దీప్ కూడా..: టీమిండియా మాజీ సెలక్టర్
ICC ODI World Cup 2023- Kul-Cha Spin Duo: ‘‘సుదీర్ఘ కెరీర్లో ప్రతి బౌలర్ కెరీర్లో ఇలాంటి దశను ఎదుర్కోవడం సహజం. ప్రస్తుతం చహల్ అదే స్థితిలో ఉన్నాడు. మేనేజ్మెంట్ను రిక్వెస్ట్ చేసి తను దేశవాళీ క్రికెట్ ఆడితే బాగుంటుంది. పూర్తిస్థాయిలో తిరిగి ఫామ్‌లోకి రావాలంటే తను వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడాలి. ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా చహల్ ఈ మేరకు సన్నద్ధం కావాల్సి ఉంది’’ అని టీమిండియా మాజీ సెలక్టర్ సునిల్ జోషి అన్నాడు. ఇక వన్డే ప్రపంచకప్-2023 నేపథ్యంలో తానైతే ‘కుల్-చా’ స్పిన్ ద్వయంలో కుల్దీప్ యాదవ్‌కే ఓటు వేస్తానని పేర్కొన్నాడు. చహల్ ఇప్పటి వరకు ఇలా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రెండు వన్డేల్లో మూడు వికెట్లు పడగొట్టాడు లెగ్‌బ్రేక్ స్పిన్నర్ యజువేంద్ర చహల్. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో 2/43, శ్రీలంకతో వన్డేలో 1/58 గణాంకాలు నమోదు చేశాడు. ఇక టీ20ల విషయానికొస్తే.. ఇప్పటి వరకు నాలుగు వికెట్లు చహల్ ఖాతాలో ఉన్నాయి. జడ్డూ ఉంటాడు.. బ్యాకప్‌గా అతడే ఈ నేపథ్యంలో ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో ముచ్చటించిన సునిల్ జోషి.. తన ప్రపంచకప్ జట్టులో చహల్‌కు చోటు ఇవ్వలేనంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు.. ‘‘15 మంది సభ్యులతో కూడిన జట్టు గురించి మాట్లాడినట్లయితే.. నా టీమ్‌లో జడేజా ఉంటాడు. ఒకవేళ తను ఫిట్‌గా లేనట్లయితే బ్యాకప్‌గా అక్షర్ పటేల్ ఉండాలి. ఆ తర్వాత వాషీ(వాషింగ్టన్ సుందర్). ఒకవేళ మరో లెగ్‌బ్రేక్ స్పిన్నర్ కావాలనుకుంటే రవి బిష్ణోయి జట్టులో ఉండాలి. ఎందుకంటే రవి నిలకడైన ప్రదర్శన కనబరచగలడు. వరుస విరామాల్లో వికెట్లు తీయగల సత్తా అతడికి ఉంది. అంతేకాదు.. రవి బిష్ణోయి.. చహల్ కంటే మెరుగ్గా ఫీల్డింగ్ చేయగలడు’’ అని సునిల్ జోషి తన అభిప్రాయాలు పంచుకున్నాడు. భిన్న పరిస్థితుల నడుమ ఇక చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ గురించి చెబుతూ.. ‘‘కుల్దీప్ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. అయితే, మరింత నిలకడగా రాణించాల్సి ఉంది. భారత్‌లో ప్రపంచకప్ జరుగబోతోంది. ఇక్కడ విభిన్న తరహా మైదానాలు ఉన్నాయి. పిచ్, వాతావరణ పరిస్థితులు ఎక్కడిక్కడ భిన్నంగా ఉంటాయి. కాబట్టి వరల్డ్‌కప్‌లో ఒక్కో జట్టును ఒక్కో మైదానంలో ఎదుర్కొనేందుకు ఏ మేర సంసిద్ధమవుతాడనే అంశం మీదే తన ప్రదర్శన ఆధారపడి ఉంటుంది’’ అని సునిల్ జోషి చెప్పుకొచ్చాడు. అంతేకాదు.. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో కూడా కుల్దీప్ పాత్ర కీలకం కానుందని సునిల్ అంచనా వేశాడు. అదరగొడుతున్న కుల్దీప్ ఇటీవల స్వదేశంలో శ్రీలంకతో రెండు వన్డేల్లో ఐదు వికెట్లు కూల్చిన కుల్దీప్.. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో మూడు మ్యాచ్‌లలో కలిపి ఆరు వికెట్లు పడగొట్టాడు. కివీస్‌తో టీ20 సిరీస్‌లో రెండు మ్యాచ్‌లలో రెండు వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే.. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ తర్వాత ఫిబ్రవరి 9 నుంచి టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. చదవండి: న్యూజిలాండ్‌లా కాదు.. పాక్ ప్రధాన బలం అదే! అందుకే టీమిండియా బ్యాటర్లు..: పాక్ మాజీ బౌలర్ Savitri Devi: నిందలు పడి కూతుర్ని విజేతను చేసింది -
ఒక చెవితో మాత్రమే వినగలడు.. అయితేనేం.. వాషింగ్టన్ సుందర్ గురించిన ఆసక్తికర విషయాలు
టీమిండియా యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గురించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలిస్తే నోరెళ్లబెట్టక తప్పదు. 17 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన ఈ టాలెంటెడ్ యంగ్ క్రికెటర్.. 2021 ఆస్ట్రేలియా పర్యటన తర్వాత రాత్రికిరాత్రి హీరో అయిపోయాడు. ఆ సిరీస్‌లోని బ్రిస్బేన్ టెస్ట్‌లో నాటకీయ పరిణామాల మధ్య జట్టులో చోటు దక్కించుకున్న సుందర్.. సంచలన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయాడు. ఆ మ్యాచ్‌లో సుందర్ చేసిన హాఫ్ సెంచరీ.. ఆ మ్యాచ్‌లో సుందర్ తీసిన స్టీవ్ స్మిత్ వికెట్ అతని జీవితాన్ని ఒక్కసారిగా మార్చేసాయి. తాజాగా న్యూజిలాండ్ సిరీస్-2023లో భాగంగా జరిగిన తొలి టీ20లో బౌలింగ్‌లో 2 వికెట్లు, బ్యాటింగ్‌లో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న సుందర్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈ మ్యాచ్‌లో సుందర్.. అబ్బురపడే ప్రదర్శనతో రాణించినా జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. అయినప్పటికీ ఈ యువ ఆల్‌రౌండర్ అభిమానుల మనసులను కొల్లగొట్టాడు. ఈ మ్యాచ్ తర్వాత సుందర్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అదేంటంటే.. సుందర్ కేవలం ఒక్క చెవితో మాత్రమే వినగలడట. ఈ విషయాన్ని సుందరే ఓ ఇంటర్వ్యూ సందర్భంగా బహిర్గతం చేశాడు. వినికిడి లోపం ఉన్నప్పటికీ.. ఏమాత్రం కుంగిపోని ఈ యువ కెరటం, సంచలన ప్రదర్శనలతో ఆకట్టుకుంటూ టీమిండియాలో స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. సుందర్‌కు సంబంధించిన మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. వాషింగ్టన్ సుందర్ పేరు వినగానే, అతను క్రిస్టియన్ ఏమోనని అందరూ అనుకుంటారు. అయితే అతను సంప్రదాయ తమిళ హిందు కుటుంబానికి చెందిన వాడని సుందర్ తండ్రి వివరణ ఇచ్చాడు. మరి సుందర్‌కు వాషింగ్టన్ పేరును ఎందుకు జోడించాల్సి వచ్చిందన్న విషయంపై అతని తండ్రి ఓ సందర్భంగా క్లారిటీ ఇచ్చాడు. సుందర్ చిన్నతనంలో కుటుంబం ఆర్ధిక సమస్యలతో సతమతమవుతున్నప్పుడు పీడీ వాషింగ్టన్ అనే ఓ సైనికుడు తమను అన్ని విధాల ఆదుకున్నాడని, ఆ కృతజ్ఞతతోనే తమ అబ్బాయికి వాషింగ్టన్ పేరును జోడించానని సుందర్ తండ్రి వివరణ ఇచ్చాడు. -
'బిర్యానీ నచ్చలేదని రెస్టారెంట్‌కు వెళ్లడం మానేస్తామా'
టీమిండియా స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ రాంచీ వేదికగా జరిగిన తొలి టి20లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ముందు బౌలింగ్‌లో రెండు కీలక వికెట్లతో పాటు స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిసిన సుందర్.. ఆ తర్వాత బ్యాటింగ్‌లో అర్థసెంచరీతో రాణించాడు. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 151 పరుగులు చేయగలిగిదంటే అదంతా సుందర్ చలవే. మధ్యలో సూర్యకుమార్, పాండ్యాలు ఇన్నింగ్స్‌ను గాడిన పెట్టినప్పటికి స్వల్ప వ్యవధిలో ఇద్దరు ఔటవ్వడం టీమిండియాను దెబ్బతీసింది. ఆ తర్వాత టీమిండియాను నడిపించే బాధ్యతను భుజానికెత్తుకున్న సుందర్ 28 బంతుల్లోనే అర్థశతకం సాధించాడు. కానీ చివర్లో రన్‌రేట్ పెరిగిపోవడం.. చేయాల్సిన పరుగులు ఎక్కువగా ఉండడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. భారత్ ఓడినా సుందర్ మాత్రం తన ప్రదర్శనతో అభిమానులను ఆకట్టుకున్నాడు. మ్యాచ్ అనంతరం సుందర్ మీడియాతో మాట్లాడాడు. '' నా ప్రదర్శనపై సంతృప్తిగా ఉన్నా జట్టు ఓటమి బాధ కలిగించింది. అయినా ఇది ఒక మ్యాచ్ మాత్రమే. ఓడినప్పుడు భావోద్వేగాలు తారాస్థాయిలో ఉండడం సహజం. ఐపీఎల్ సమయంలో జట్టులో ఉన్న ఆటగాళ్లు చాలా వికెట్లు తీశారు.. బ్యాటర్లు పరుగులు రాబట్టారు. కానీ కివీస్‌తో టి20 మ్యాచ్‌లో రాణించలేకపోయాం'' అని చెప్పుకొచ్చాడు. రాహుల్ త్రిపాఠి అయితే సుందర్ సమాధానంతో ఏకీభవించని ఒక జర్నలిస్ట్ తిక్క ప్రశ్న వేశాడు. ''మ్యాచ్‌లో ఓడిపోయారు.. టాపార్డర్ ఏమైనా మార్చాల్సిన అవసరం ఉంటుందా'' అని ప్రశ్నించాడు. అయితే సుందర్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. ''నిజంగా టాపార్డర్ మార్చాల్సిన అవసరం ఉందంటారా.. ఒక్క విషయం చెబతున్నా.. రెస్టారెంట్ నుంచి మనకు కావాల్సిన ఫెవరెట్ బిర్యానీ రాకపోతే.. మళ్లీ సదరు రెస్టారెంట్‌కు పూర్తిగా వెళ్లడం మానేస్తారా చెప్పండి. ఇది అలాంటిదే.. ఇది కేవలం ఒక మ్యాచ్. రోజులో ముగిసేపోయే మ్యాచ్‌లో ఏదో ఒక జట్టు మాత్రమే నెగ్గుతుంది. ఇరుజట్లు కలిపి ఒకేసారి 22 మంది ఆటగాళ్లు ఒకే రకమైన ప్రదర్శన కనబరచలేరు. రాయ్‌పూర్‌లో జరిగిన వన్డేలో న్యూజిలాండ్ 108 పరుగులకే ఆలౌట్ కావడం గమనించండి. ఒక్క మ్యాచ్‌కే టాపార్డర్ మార్చాలనడం కరెక్ట్ కాదు'' అని పేర్కొన్నాడు. ఇక అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్‌లకు సుందర్ మద్దతు తెలిపాడు. ''అర్ష్‌దీప్ సింగ్ టీమిండియాతో పాటు ఐపీఎల్‌లోనూ చాలా వికెట్లు తీశాడు. మేం కూడా మనుషులమే. మాకు ఆడాలని ఉంటుంది. ప్రత్యర్థి జట్టు బలంగా ఉన్నప్పుడు ఆరోజు వాళ్లదే ఆట అయినప్పుడు ఎవరు ఏం చేయలేరు. 4 ఓవర్లలో 51 పరుగులిచ్చినప్పటికి వికెట్ తీశాడు. వచ్చే మ్యాచ్‌లో అర్ష్‌దీప్ నుంచి మంచి ప్రదర్శన వచ్చే అవకాశం ఉంది.'' అంటూ వెల్లడించాడు. ''గంటకు 150 కిమీ వేగంతో బంతులు విసరడం ఉమ్రాన్ మాలిక్ ప్రత్యకం. అతనిలో ఉన్న నైపుణ్యం అదే.. ఏదైనా ఎక్స్ ఫ్యాక్టర్ కావొచ్చు.. అతన్ని ప్రోత్సహించాల్సిందే . భారత్ లాంటి పిచ్‌లపై ఉమ్రాన్ మాలిక్ లాంటి బౌలర్ సేవలు అవసరం. ఒక్క మ్యాచ్‌లో విఫలమైనంత మాత్రానా తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. కొంత సహనం, ఓర్పు వహించాల్సిందే. మ్యాచ్ ఓడిపోయాం.. దానినే పట్టుకొని వేళాడితే కుదరదు.. ముందుకు వెళ్లాల్సిందే.'' అంటూ వివరించాడు. ''డారిల్ మిచెల్ ప్రదర్శన మా నుంచి మ్యాచ్‌ను లాగేసుకుంది. ఒక దశలో న్యూజిలాండ్‌ను కట్టడి చేసినట్లే అనిపించినా.. డారిల్ మిచెల్ అద్బుత బ్యాటింగ్‌తో మెరిశాడు. కఠినంగా ఉన్న పిచ్‌పై 30 బంతుల్లో 59 పరుగులు చేసి న్యూజిలాండ్ మంచి స్కోరు సాధించడానికి తోడ్పడ్డాడు.'' అంటూ పేర్కొన్నాడు. ఇక ఇరుజట్ల మధ్య రెండో టి20 లక్నో వేదికగా ఆదివారం(జనవరి 29న) జరగనుంది. చదవండి: ఆర్థిక సంక్షోభం.. పాక్ క్రికెటర్‌కు మంత్రి పదవి 'కోహ్లి స్థానాన్ని అప్పగించాం.. ఇలాగేనా ఔటయ్యేది' -
మా ఓటమికి ప్రధాన కారణం అదే.. అతడు మాత్రం సూపర్: హార్దిక్
India vs New Zealand, 1st T20I: టీమిండియాతో వన్డే సిరీస్‌లో ఘోర పరాభవం పాలైన న్యూజిలాండ్ టీ20 సిరీస్‌లో మాత్రం శుభారంభం చేసింది. రాంచి వేదికగా శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో 21 పరుగులతో జయకేతనం ఎగురవేసింది. తద్వారా మిచెల్ సాంట్నర్ బృందం మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. మా ఓటమికి కారణం అదే కివీస్ ఆలౌరౌండ్ ప్రతిభతో విజయం సాధించగా.. టీమిండియా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. తమ ఓటమికి గల కారణాలు విశ్లేషించాడు. ‘‘రాంచి వికెట్ ఇలా ఉంటుందని ఎవరూ ఊహించి ఉండరు. ఇరు జట్లకు ఇది ఆశ్చర్యం కలిగించే విషయమే. అయితే, న్యూజిలాండ్ మాకంటే మెరుగ్గా ఆడింది. అందుకే అనుకున్న ఫలితం రాబట్టగలిగింది. నిజానికి కొత్త బంతి అనుకోని రీతిలో టర్న్ అవడం మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. నేను, సూర్య బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వికెట్ కాస్త మెరుగైంది. ఏదేమైనా ఈ వికెట్‌పై ప్రత్యర్థిని 176- 177 వరకు పరుగులు చేయనివ్వడం సరికాదు. మా బౌలింగ్ వైఫల్యం కారణంగానే ఇలా జరిగింది. 20-25 పరుగులు ఎక్కువగానే ఇచ్చుకున్నాం. మా జట్టులో యువకులే ఎక్కువ. ఈ ఓటమి నుంచి కచ్చితంగా పాఠాలు నేర్చుకుంటాం’’ అని పాండ్యా చెప్పుకొచ్చాడు. సుందర్ సూపర్ ఇక వాషింగ్టన్ సుందర్ ఆట తీరు గురించి ప్రస్తావిస్తూ.. ‘‘ఈరోజు న్యూజిలాండ్‌పై తను బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ చేసిన విధానం అమోఘం. మాకు ఇలాంటి వాళ్లే కావాలి. వాషింగ్టన్ సుందర్ లాంటి ఆటగాడు జట్టులో ఉంటే మా ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది’’ అంటూ హార్దిక్ ప్రశంసలు కురిపించాడు. అదరగొట్టిన సుందర్ కాగా కివీస్‌తో తొలి టీ20లో 4 ఓవర్ల బౌలింగ్‌లో 22 పరుగులు మాత్రమే ఇచ్చిన వాషీ 2 వికెట్లు పడగొట్టాడు. లక్ష్య ఛేదనలో సూర్య(47), పాండ్యా(21) మినహా మిగతా వాళ్లంతా చేతులెత్తేసిన వేళ అర్ధ శతకంతో రాణించాడు. 28 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో వాషింగ్టన్ సుందర్ 50 పరుగులు సాధించాడు. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ స్కోర్లు ►న్యూజిలాండ్- 176/6 (20) ►ఇండియా- 155/9 (20) ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: డారిల్ మిచెల్30 బంతుల్లో 59 పరుగులు- నాటౌట్ చదవండి: T20 WC Ind Vs Eng: ఆసీస్‌పై ఇంగ్లండ్ విజయం.. ఫైనల్లో టీమిండియాతో పోరు! చరిత్రకు అడుగు దూరంలో భారత్.. Ranji Trophy: ముంబై- మహారాష్ట్ర మ్యాచ్ డ్రా.. క్వార్టర్ ఫైనల్లో ఆంధ్ర -
స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిసిన సుందర్..
రాంచీ వేదికగా కివీస్‌తో జరుగుతున్న తొలి టి20లో టీమిండియా బౌలర్ వాషింగ్టన్ సుందర్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో మార్క్ చాప్‌మన్‌ను సుందర్ కాట్ అండ్ బౌల్డ్ చేశాడు. ఓవర్ చివరి బంతిని సుందర్ ఔట్‌సైడ్ దిశగా వేయగా.. చాప్మన్ స్ట్రెయిట్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ సుందర్ ఒకవైపుగా డైవ్గా చేస్తూ ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. అయితే బంతి కింద తాకిందేమోనని థర్డ్ అంపైర్ పరిశీలించాడు. రిప్లేలో సుందర్ బంతిని అందుకున్నాకే కింద పడినట్లు చూపించింది. దీంతో చాప్మన్ ఔట్ అయినట్లు ప్రకటించారు. ప్రస్తుతం న్యూజిలాండ్ 2 వికెట్ల నష్టానికి 52 పరుగులు చేసింది. కాన్వే 7, గ్లెన్ పిలిప్స్ 2 పరుగులతో ఆడుతున్నారు. Washington Sundar catch.#INDvsNZ #INDvNZpic.twitter.com/Kr0JsJmNs4 — Abdullah Neaz (@Abdullah__Neaz) January 27, 2023 -
'పంత్ త్వరగా కోలుకోవాలి'.. టీమిండియా క్రికెటర్ల పూజలు
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ గతేడాది డిసెంబర్లో కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పంత్ ముంబైలోకి కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. పంత్‌కు పలు సర్జరీలు నిర్వహించిన వైద్యులు అతను కోలుకోవడానికి దాదాపు ఆరు నెలలు పట్టే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో పంత్ త్వరగా కోలుకోవాలంటూ టీమిండియా క్రికెటర్లు ఉజ్జయిని మహాకాళేశ్వర్ గుడిలో పూజలు నిర్వహించారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఉజ్జయిని మహాకాళేశ్వర్ గుడి ఒకటని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. న్యూజిలాండ్‌తో మూడో వన్డే మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో మంగళవారం జరగనుంది. మ్యాచ్ కోసం టీమిండియా, కివీస్ జట్లు ఇప్పటికే ఇండోర్‌కు చేరుకున్నాయి. కాగా సోమవారం ఉదయం భారత క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్‌లు ఉజ్జయిని మహాకాళేశ్వర్ గుడిని సందర్శించారు. ఈ సందర్భంగా పంత్ త్వరగా కోలుకోవాలంటూ మహాశివుడికి పూజలు నిర్వహించారు. అనంతరం శివ లింగానికి బాబా మహాకాల్ భస్మ హారతి అర్పించారు.దీనికి సంబంధించిన ఫోటోలు ఏఎన్ఐ ట్విటర్లో షేర్ చేయడంతో వైరల్‌గా మారాయి. సూర్యకుమార్ మాట్లాడుతూ.. ''కారు ప్రమాదానికి గురైన పంత్ త్వరగా కోలుకోవాలని పరమ శివుడిని ప్రార్థించాం. ఆయన దీవెనలతో పంత్ కోలుకొని టీమిండియా జట్టులోకి తిరిగి రావడం మాకు చాలా ముఖ్యం. ఇక ఇప్పటికే న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ను గెలిచాం.. ఇప్పుడు మూడో మ్యాచ్‌లో కూడా గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం'' అంటూ చెప్పుకొచ్చాడు. We prayed for the speedy recovery of Rishabh Pant. His comeback is very important to us. We have already won the series against New Zealand, looking forward to the final match against them: Cricketer Suryakumar Yadav pic.twitter.com/2yngbYZXfb — ANI (@ANI) January 23, 2023 చదవండి: 'కివీస్‌ను క్లీన్‌స్వీప్ చేస్తే టీమిండియాకు సువర్ణావకాశం' -
టీమిండియా బౌలర్ల విజృంభణ.. 108 పరుగులకే కుప్పకూలిన న్యూజిలాండ్
రాయ్‌పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా బౌలర్లు రెచ్చిపోయారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. మహ్మద్ షమీ (3/18), మహ్మద్ సిరాజ్ (1/10), శార్దూల్ ఠాకూర్ (1/26), హార్ధిక్ పాండ్యా (2/16), కుల్దీప్ యాదవ్ (1/29), వాషింగ్టన్ సుందర్ (2/7) విజృంభించడంతో 34.3 ఓవర్లలోనే కివీస్‌ను ఆలౌట్ చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో గ్లెన్ ఫిలిప్స్ (36), మైఖేల్ బ్రేస్‌వెల్ (22), మిచెల్ సాంట్నర్ (27) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. తొలి వన్డే సెంచరీ హీరో బ్రేస్‌వెల్ ఈ మ్యాచ్‌లోనూ చెలరేగేలా కనిపించినప్పటికీ.. అతన్ని షమీ బోల్తా కొట్టించాడు. కివీస్ ఇన్నింగ్స్‌లో ఫిన్ అలెన్ (0), డెవాన్ కాన్వే (7), హెన్రీ నికోల్స్ (2), డారిల్ మిచెల్ (1), టామ్ లాథమ్ (1), ఫెర్గూసన్ (1), బ్లెయిర్ టిక్నర్ (2) విఫలమయ్యారు. కాగా, హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ 12 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. 3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. -
తొలుత బ్యాటింగ్ చేయనున్న టీమిండియా.. 2 మార్పులు, తుది జట్టు ఎలా ఉందంటే..?
తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరుగుతున్న నామమాత్రపు మూడో వన్డేలో టీమిండియా టాస్ గెలిచి, తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ రెండు మార్పులు చేసింది. హార్ధిక్ పాండ్యా, ఉమ్రాన్ మాలిక్‌లకు రెస్ట్ ఇచ్చిన టీమ్ మేనేజ్మెంట్.. సూర్యకుమార్ యాదవ్, వాషింగ్టన్ సుందర్‌లకు అవకాశం కల్పించింది. మరోవైపు శ్రీలంక సైతం రెండు మార్పులతో బరిలోకి దిగింది. ఆషేన్ బండార, జెఫ్రీ వాండర్సే తుది జట్టులోకి వచ్చారు. కాగా, 3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్ 2-0 తేడాతో ఇదివరకే కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. తుది జట్లు.. భారత్: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ శ్రీలంక: కుశాల్ మెండిస్, అవిష్క ఫెర్నాండో, చరిత్ అసలంక, ఆషేన్ బండార, జెఫ్రీ వాండర్సే, నువనిదు ఫెర్నాండో, దసున శనక, వనిందు హసరంగ, చమిక కరుణరత్నే, లహిరు కుమార, కసున్ రజిత -
వాషింగ్టన్ సుందర్ పోరాటం వృథా.. ఆంధ్ర సంచలన విజయం
Ranji Trophy 2022-23 - Tamil Nadu vs Andhra- కోయంబత్తూరు: అద్భుత పోరాట పటిమ కనబరిచిన ఆంధ్ర జట్టు ఈ సీజన్ రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నీలో తొలి విజయం నమోదు చేసింది. తమిళనాడుతో శుక్రవారం ముగిసిన మ్యాచ్‌లో ఆంధ్ర ఎనిమిది పరుగుల ఆధిక్యంతో గెలిచి ఆరు పాయింట్లు సంపాదించింది. ఆంధ్ర నిర్దేశించిన 203 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన తమిళనాడు రెండో ఇన్నింగ్స్‌లో 56.2 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. పేస్ బౌలర్ కేవీ శశికాంత్ (4/47), ఆఫ్ స్పిన్నర్ షోయబ్ మొహమ్మద్ ఖాన్ (6/69) ఆంధ్ర విజయంలో కీలకపాత్ర పోషించారు. భారత క్రికెటర్ వాషింగ్టన్ సుందర్ (65; 5 ఫోర్లు) చివరిదాకా క్రీజులో ఉండటంతో తమిళనాడు విజయంపై ఆశలు పెంచుకుంది. అయితే సుందర్‌ను శశికాంత్ అవుట్ చేసి ఆంధ్రకు చిరస్మరణీయ విజయం అందించాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 162/5తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర మరో 88 పరుగులు జోడించి మిగతా ఐదు వికెట్లు కోల్పోయి 250 పరుగులవద్ద ఆలౌటైంది. రికీ భుయ్ (76; 7 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలువగా... చివర్లో శశికాంత్ (19; 1 సిక్స్), లలిత్ మోహన్ (16; 3 ఫోర్లు) దూకుడుగా ఆడటంతో ఆంధ్ర ప్రత్యర్థిముందు ఊరించే లక్ష్యాన్ని పెట్టింది. చదవండి: IPL 2023 Auction: ఆ ముగ్గురూ సూపర్... ఐపీఎల్ వేలం విశేషాలు ఒకరు 4, మరొకరు 2 పరుగులు.. రోహిత్‌తో పాటు మిగతా వాళ్లు సున్నా! మరీ చెత్తగా.. IPL 2023: ధోని జట్టులోకి గుంటూరు కుర్రాడు.. ఎవరీ షేక్ రషీద్? -
Ind VS Ban: కోహ్లిని ఓపెనర్‌గా ఎందుకు పంపారో! అతడికి బదులు సుందర్ వెళ్తే..
India tour of Bangladesh, 2022 - 2nd ODI: బంగ్లాదేశ్‌తో రెండో వన్డేలో విరాట్ కోహ్లిని ఓపెనర్‌గా పంపడం పట్ల టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ విస్మయం వ్యక్తం చేశాడు. శిఖర్ ధావన్‌కు జోడీగా కేఎల్ రాహుల్ లేదంటే వాషింగ్టన్ సుందర్‌ను ఆడించాల్సిందని ఈ మాజీ ఓపెనర్ అభిప్రాయపడ్డాడు. కాగా బంగ్లా పర్యటనలో వన్డే సిరీస్‌లో భాగంగా బుధవారం నాటి రెండో మ్యాచ్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డ విషయం తెలిసిందే. టాస్ ఓడి ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో రోహిత్ వేలికి గాయమైంది. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించి స్కానింగ్ చేయించారు. ఈ క్రమంలో లక్ష్య ఛేదనలో భాగంగా హిట్‌మ్యాన్ స్థానంలో విరాట్ కోహ్లి ఓపెనింగ్ చేశాడు. ధావన్‌కు జోడీగా బరిలోకి దిగిన ఈ మాజీ సారథి 5 పరుగులకే పెవిలియన్ చేరాడు. వన్‌డౌన్‌లో వచ్చిన శ్రేయస్ అయ్యర్(82) అద్భుత ఇన్నింగ్స్‌కు తోడు అక్షర్ పటేల్(56) అర్ధ శతకంతో రాణించినా.. గాయం నొప్పిని పంటిబిగువన భరిస్తూ తొమ్మిదో స్థానంలో వచ్చి రోహిత్ గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడినా ఫలితం లేకుండా పోయింది. 5 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలై సిరీస్‌ను 0-2తో చేజార్చుకుంది. ఆశ్చర్యపోయా.. ఈ నేపథ్యంలో భారత బ్యాటింగ్ ఆర్డర్ గురించి వసీం జాఫర్ ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లికి బదులు వాషింగ్టన్ సుందర్‌ను ఓపెనర్‌గా పంపాల్సిందని పేర్కొన్నాడు. ‘‘అంతర్జాతీయ టీ20 క్రికెట్లో.. లీగ్ మ్యాచ్‌లలో విరాట్ కోహ్లి అప్పుడప్పుడూ ఓపెనర్‌గా వచ్చినా.. ఈసారి బంగ్లాతో మ్యాచ్‌లో మాత్రం అతడు ఓపెనింగ్ స్థానంలో రావడం నన్ను ఆశ్చర్యపరిచింది. ఎప్పటిలాగే రాహుల్ వస్తాడనుకున్నా. కోహ్లి ఎందుకు? సుందర్‌ను పంపినా ఎందుకంటే తను రెగ్యులర్ ఓపెనర్. ఒకవేళ ఈసారి ఐదో స్థానంలో రావాలనుకుంటే సుందర్‌ను ధావన్‌కు జోడీ చేయాల్సింది. తద్వారా తనకు అనుకూలమైన మూడో స్థానంలో కోహ్లి, నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్, ఐదో స్థానంలో రాహుల్ బ్యాటింగ్ చేసే వీలుండేది. కానీ కోహ్లిని ప్రమోట్ చేయడం వల్ల బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చోటు చేసుకున్నాయి. గందరగోళం ఏర్పడింది. వాషింగ్టన్ సుందర్‌ను ఓపెనర్‌గా పంపితే మెరుగైన ఫలితం ఉండేది’’ అని వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్ నాలుగో స్థానంలో వచ్చి 11 పరుగులు చేశాడు. అయితే, బౌలింగ్‌లో మాత్రం 3 వికెట్ల(37/3)తో మెరిశాడు. చదవండి: Ind Vs Ban: అద్భుత ఇన్నింగ్స్.. అయినా రోహిత్ ‘చెత్త’ రికార్డు! రైనాకు సాధ్యమైంది.. హిట్‌మ్యాన్ మాత్రం.. Rohit Sharma: సగం సగం ఫిట్నెస్! ఓటమికి ప్రధాన కారణం వాళ్లే! ఇప్పటికైనా... Ind A Vs Ban A: సెంచరీతో చెలరేగిన అభిమన్యు ఈశ్వరన్.. బంగ్లా బౌలర్లకు చుక్కలు -
Ind Vs Ban: సగం సగం ఫిట్నెస్! ఓటమికి ప్రధాన కారణం వాళ్లే!
India tour of Bangladesh, 2022 - 2nd ODI- Rohit Sharma Comments: ‘‘అదృష్టవశాత్తూ నా చేతి వేలికి ఫ్రాక్చర్ కాలేదు. బ్యాటింగ్ చేయగలిగాను. కానీ... బంగ్లాదేశ్ 69 పరుగులకే 6 వికెట్లు నష్టపోయి కష్టాల్లో ఉన్న స్థితి నుంచి.. 270 వరకు స్కోరు చేయగలగడం కచ్చితంఆ మా బౌలర్ల వైఫ్యలమే. ఆరంభంలోనే మా వాళ్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. అయితే, మిడిల్ ఓవర్లలో.. ఆఖర్లో మా వాళ్ల ప్రదర్శన నిరాశపరిచింది. గత మ్యాచ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే పునరావృతమైంది. లోపాలు తెలుసుకుని వాటిని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా మోహదీ, మహ్మదుల్లా అద్భుత భాగస్వామ్యంతో జట్టును గెలిపించారు. వాళ్ల జోడీని విడదీయడం మాతరం కాలేదు. ఇలాంటి సమయాల్లో ఒత్తిడిని అధిగమించి ఎలా ముందుకు సాగాలో పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. వన్డే మ్యాచ్ అంటేనే భాగస్వామ్యాల మీద ఆధారపడి ఉంటుంది. ఒక్కసారి ఇద్దరు బ్యాటర్ల మధ్య సమన్వయం కుదిరి.. పట్టుదలగా నిలబడ్డారంటే జట్టును విజయతీరాలకు చేర్చగలరు. ఈరోజు మెహదీ, మహ్మదుల్లా అదే పని చేశారు. సగం సగం ఫిట్నెస్తో.. మా జట్టును గాయాల బెడద వేధిస్తోంది. టీమిండియాకు ఆడుతున్నారంటే వందకు వంద శాతం ఫిట్‌గా ఉండాలి. సగం సగం ఫిట్నెస్తో మ్యాచ్‌లు ఆడలేరు కదా! లోపాలన్నిటిని సవరించుకుంటేనే అనుకున్న ఫలితాలు రాబట్టగలం. ఆ దిశగా మా ప్రయత్నాలు ఉంటాయి’’ అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. బంగ్లా చేతిలో పరాజయం అనంతరం మాట్లాడుతూ.. ఈ మ్యాచ్‌లో బౌలర్ల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించిందని పేర్కొన్నాడు. బంగ్లాదేశ్‌తో బుధవారం నాటి రెండో వన్డేలో ఓటమి నేపథ్యంలో భారత్ 0-2తో సిరీస్ కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బౌలింగ్‌కు దిగిన రోహిత్ సేన ఆరంభంలో బాగానే ఆడినప్పటికీ మహ్మదుల్లా, మిరాజ్ జోడీ టీమిండియా బౌలర్లకు పీడకలను మిగిల్చింది. కెరీర్లో తొలి సెంచరీ! నిజానికి ఆరంభంలో సీమర్లు సిరాజ్, ఉమ్రాన్ మాలిక్.. స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌కు బంగ్లాదేశ్ 69/6తో కష్టాల్లో పడింది. ఈ దశలో మహ్ముదుల్లా, ఎనిమిదో స్థానంలో దిగిన మెహదీ హసన్ ఏడో వికెట్‌కు 148 పరుగులు జోడించి భారీస్కోరుకు బాట వేశారు. కడదాకా అజేయంగా నిలిచిన మిరాజ్ 83 బంతుల్లో (8 ఫోర్లు, 4 సిక్సర్లు) ఇన్నింగ్స్ ఆఖరి బంతికి పరుగు తీసి వన్డే కెరీర్లో తొలి సెంచరీ సాధించాడు. అయ్యర్, అక్షర్ భేష్ భారత ఇన్నింగ్స్ మొదలైన తొలి బంతికి కోహ్లి (4) బౌండరీ కొట్టాడు. కానీ ఇబాదత్ తర్వాతి ఓవర్లో క్లీన్‌బౌల్డయ్యాడు. మరుసటి ఓవర్లో ధావన్, కాసేపటికి సుందర్, రాహుల్ కూడా అవుటయ్యారు. ఈ దశలో శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ ఐదో వికెట్‌కు 107 పరుగులు జోడించారు. 172/4 స్కోరుతో జట్టు లక్ష్యం చేరే దారిలో కనిపించింది కానీ అదే స్కోరు వద్ద అయ్యర్‌ను మిరాజ్ అవుట్ చేసి భారత్‌ను కష్టాల్లో నెట్టాడు. రోహిత్ ధనాధన్... శార్దుల్ (7), చహర్ (11), బంతులు వృథా చేసి అవుటయ్యారు. 45.1 ఓవర్లలో భారత్ స్కోరు 213/8! ఇంకా 29 బంతుల్లో 59 పరుగుల సమీకరణం భారత్‌కు ఓటమిని ఖాయం చేసింది. ఈ దశలో ఫీల్డింగ్‌లో చేతి వేలికి గాయమైన రోహిత్ 9వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. ఇబాదత్ 45వ ఓవర్లో 2 సిక్సర్లు, ఒక బౌండరీ బాదాడు. కానీ అవతలివైపు సిరాజ్ బంతులు వృథా చేశాడు. 48వ ఓవర్‌నైతే మెయిడిన్ చేశాడు. 12 బంతుల్లో 40 పరుగులు చేయాల్సిన దశలో రోహిత్ రెండు సిక్సర్లు కొట్టాడు. రెండుసార్లు క్యాచ్‌లు నేలపాలై బతికి పోయాడు. మొత్తానికి ఈ ఓవర్లో 20 పరుగులొచ్చాయి. సిరాజ్ అఖరి బంతికి అవుటయ్యాడు. చివరి ఓవర్లో 20 పరుగులు చేయాల్సిన దశలో ముస్తఫిజుర్‌ను రోహిత్ ఎదుర్కొన్నాడు. 2, 3 బంతుల్లో బౌండరీలు కొట్టగా.. నాలుగో బంతికి పరుగు రాలేదు. 2 బంతుల్లో 12 పరుగుల సమీకరణం భారత్‌ను ఊరించింది. ఉత్కంఠ ఉన్నపళంగా పెరిగింది. ఐదో బంతిని రోహిత్ సిక్సర్ కొట్టాడు. ఆఖరి బంతి సిక్స్ కొడితే భారత్‌దే విక్టరీ! కానీ ముస్తఫిజుర్ యార్కర్ వేయడంతో రోహిత్ సిక్స్ కొట్టలేకపోయాడు. 5 పరుగలు తేడాతో భారత్ ఓటమి ఖరారైంది. చదవండి: Ind VS BAN: వారెవ్వా! రోహిత్ అరుదైన రికార్డ్.. ప్రపంచ క్రికెట్లో రెండో ఆటగాడిగా.. Ind Vs Ban: అద్భుత ఇన్నింగ్స్.. అయినా రోహిత్ ‘చెత్త’ రికార్డు! రైనాకు సాధ్యమైంది.. హిట్‌మ్యాన్ మాత్రం.. -
Ind Vs Ban: కచ్చితంగా గెలుస్తాం! అతడు గొప్ప ఆల్‌రౌండర్‌గా ఎదుగుతాడు!
India tour of Bangladesh, 2022- Bangladesh vs India, 2nd ODI: ‘‘సిరీస్‌లో మొదటి మ్యాచ్ ఓడటం మాకేమీ కొత్తకాదు. ఇదే తొలిసారి కూడా కాదు. కఠిన పరిస్థితులను అధిగమించి ఎలా ముందుకు సాగాలో మాకు తెలుసు’’ టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ అన్నాడు. బంగ్లాదేశ్‌తో తొలి వన్డేలో తక్కువ స్కోరుకు పరిమితం కావడం ప్రభావం చూపిందని.. అయితే, ప్రతిసారి ఇలాగే జరగదని వ్యాఖ్యానించాడు. రెండో మ్యాచ్‌లో కచ్చితంగా విజయం సాధించి సిరీస్‌ను సమం చేస్తామని గబ్బర్ ధీమా వ్యక్తం చేశాడు. బంగ్లా పర్యటనలో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రోహిత్ సేన మొదటి మ్యాచ్‌లో ఒక వికెట్ తేడాతో పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఢాకా వేదికగా బుధవారం రెండో వన్డేలో తలపడనుంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ధావన్.. తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకున్నామని, కచ్చితంగా తిరిగి పుంజుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశాడు. ఇక ఆదివారం నాటి మ్యాచ్‌లో కండరాల నొప్పితో బాధపడ్డ శార్దూల్ ఠాకూర్ ప్రస్తుతం పూర్తి ఫిట్‌గా ఉన్నాడని.. రెండో మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడని తెలిపాడు. న్యూజిలాండ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన వాషీ! బంగ్లాతో మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన సందర్భంగా ధావన్.. టీమిండియా యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌పై ప్రశంసలు కురిపించాడు. అతడు ప్రపంచంలోనే గొప్ప ఆల్‌రౌండర్‌గా ఎదుగుతాడని కితాబులిచ్చాడు. కాగా గాయాల బెడదతో కొన్నాళ్లపాటు జట్టుకు దూరమైన వాషింగ్టన్ సుందర్.. న్యూజిలాండ్ పర్యటనలో సత్తా చాటిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మొదటి వన్డేలో మెరుపు ఇన్నింగ్స్‌తో అర్ధ శతకం సాధించాడు. అతడు గొప్ప ఆల్‌రౌండర్‌గా ఎదుగుతాడు ఈ నేపథ్యంలో ధావన్ మాట్లాడుతూ.. ‘‘వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా ఆడుతున్నాడు. పునరాగమనంలో సత్తా చాటుతున్నాడు. న్యూజిలాండ్‌లో అతడి ప్రదర్శన మనమంతా చూశాం. తను మంచి ఆల్‌రౌండర్. ఆఫ్ స్పిన్నర్‌గా.. లోయర్ ఆర్డర్లో ఫినిషర్‌గా జట్టుకు ఉపయోగపడతాడు. అనుభవం గడిస్తున్న కొద్దీ తను మరింత రాటుదేలతాడు. ఒత్తిడిలోనూ రాణించగల సుందర్.. ప్రపంచంలో గొప్ప ఆల్‌రౌండర్‌గా ఎదుగుతాడని నమ్మకంగా చెప్పగలను’’ అని వాషీని ప్రశంసించాడు. కాగా బంగ్లాతో మొదటి వన్డేలో 10 పరుగులు చేసిన వాషింగ్టన్ సుందర్.. 2 వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే.. కివీస్ టూర్లో వన్డే సిరీస్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరించగా.. 1-0తో టీమిండియా ట్రోఫీని ఆతిథ్య జట్టుకు అప్పగించింది. ప్రస్తుతం రెండో వన్డేలో గెలిస్తేనే బంగ్లా చేతిలో సిరీస్ ఓటమి నుంచి తప్పించుకోగలదు. చదవండి: Ind A Vs Ban A: ఆరు వికెట్లతో చెలరేగిన ముకేశ్.. బంగ్లా 252 పరుగులకు ఆలౌట్ IPL 2023: విండీస్ విధ్వంసకర ఆల్‌రౌండర్‌పై కన్నేసిన రాజస్తాన్! 🗣️ 🗣️ We know how to bounce back from tough situations.#TeamIndia batter @SDhawan25 ahead of the second #BANvIND ODI. pic.twitter.com/YgHpfI7IeZ — BCCI (@BCCI) December 6, 2022 -
'మనోళ్ల ఫీల్డింగ్ చూసి కోపం నషాలానికి'
బంగ్లాదేశ్ చేతిలో దారుణంగా ఓటమి పాలవడంపై టీమిండియా వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. టీమిండియా ఇంత చెత్తగా ఫీల్డింగ్ చేస్తుందని తాను అనుకోలేదన్నాడు. కేఎల్ రాహుల్ వదిలేసిన క్యాచ్‌ను సుందర్ పట్టేందుకు ఎందుకు ప్రయత్నించలేదని ప్రశ్నించాడు. కేవలం ఫీల్డింగ్ వైఫల్యం వల్లే ఓడిందని దీనేష్ కార్తీక్ అన్నాడు. చివరి ఓవర్లో హసన్ ఇచ్చిన క్యాచ్‌ను రాహుల్ పట్టి ఉంటే బాగుండేదన్నాడు. అయితే అతను వదిలేసినా.. పక్కనే ఉన్న సుందర్ బంతిని పట్టుకునేందుకు ఎందుకు ముందుకు రాలేదని ప్రశ్నించాడు. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్ల ఫీల్డింగ్ వల్ల తాను అసహనానికి గురైనట్లు చెప్పాడు. బ్యాటింగ్‌లోనూ గొప్పగా ఆడలేదని తెలిపాడు. చివరి ఓవర్లో ఒత్తిడి కారణంగా కొన్ని బౌండరీలు వదిలేసి ఉండవచ్చని కార్తీక్ చెప్పుకొచ్చాడు. చదవండి: షకీబ్ బౌలింగ్ గురించి చిన్న పిల్లలకు తెలుసు! భారత బ్యాటర్లకు మాత్రం.. -
క్యాచ్‌కు కనీస ప్రయత్నం చేయని సుందర్.. బండ బూతులతో విరుచుకుపడిన కెప్టెన్
బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా వికెట్ తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. టీమిండియా నిర్ధేశించిన 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 136 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో నిలిచిన బంగ్లాదేశ్.. మెహిది హసన్ (38 నాటౌట్), ముస్తాఫిజుర్ (10 నాటౌట్) వీరోచితంగా పోరాడటంతో చారిత్రక విజయం సాధించింది. మెహిది హసన్, ముస్తాఫిజుర్ చివరి వికెట్‌కు అజేయమైన 51 పరుగులు జోడించి, టీమిండియా చేతుల్లో నుంచి గెలుపును లాగేసుకున్నారు. We lost here..#KLRahul #INDvsBANpic.twitter.com/Qfr5Os4PbM — Tanay Vasu (@tanayvasu) December 4, 2022 ఈ మ్యాచ్‌లో టీమిండియా ఫీల్డర్లు చేసిన ఘోర తప్పిదాలు బంగ్లాదేశ్ పాలిట వరాల్లా మారాయి. అంతవరకు అద్భుతంగా బౌలింగ్ చేసిన భారత బౌలర్లు సైతం ఫీల్డర్ల చెత్త ప్రదర్శనతో ఒక్కసారిగా ఢీలా పడిపోయి, ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. బంగ్లా విజయానికి 51 పరుగులు అవసరం కాగా.. టీమిండియా బౌలర్లు తమ విజయానికి అవసరమైన ఒక్క వికెట్‌ను పడగొట్టలేకపోయారు. భారత ఫీల్డర్లు.. లేని పరుగులు ఇచ్చి, బౌండరీ వెళ్లేందుకు బంతికి దారి చూపి బంగ్లాదేశ్ విజయానికి దోహదపడ్డారు. pic.twitter.com/ZJTDLWahM3 — Rahul Chauhan (@ImRahulCSK11) December 4, 2022 కీలక సమయంలో (42.3వ ఓవర్లో, అప్పటికి బంగ్లాదేశ్ విజయానికి ఇంకా 32 పరుగులు (155/9) అవసరం ఉండింది) కేఎల్ రాహుల్.. మెహిది హసన్ క్యాచ్ జారవిడిచి టీమిండియా ఓటమికి ప్రధాన కారణం కాగా, ఆతర్వాతి బంతికి క్యాచ్‌ను పట్టుకునేందుకు కనీస ప్రయత్నం కూడా చేయని సుందర్, కెప్టెన్ రోహిత్ శర్మ ఆగ్రహానికి గురయ్యాడు. అప్పటికే పలు బౌండరీలు వదిలేసిన సుందర్‌పై కోపంగా ఉన్న రోహిత్.. క్యాచ్‌కు కనీస ప్రయత్నం కూడా చేయకపోవడంతో సహనం కోల్పోయి, బండ బూతులతో విరుచుకుపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియా ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. కాగా.. రాహుల్, సుందర్ ఇచ్చిన లైఫ్‌ల తర్వాత చెలరేగిపోయిన మెహిది హసన్.. ముస్తాఫిజుర్ సహకారంతో ఫోర్లు, సిక్సర్లు బాది బంగ్లాదేశ్‌ను గెలిపించాడు. -
Ind Vs NZ: జడ్డూ నువ్వు రాజకీయాలు చూసుకో! ఇక నీ అవసరం ఉండకపోవచ్చు!
New Zealand vs India, 3rd ODI: టీమిండియా యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌పై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురుస్తున్నాయి. భారత జట్టుకు దొరికిన ఆణిముత్యం అతడని, వెలకట్టలేని ఆస్తి అంటూ టీమిండియా అభిమానులు వాషీని కొనియాడుతున్నారు. అన్ని ఫార్మాట్లలోనూ ఆడగల 23 ఏళ్ల సుందర్.. భవిష్యత్తులో మేటి ఆల్‌రౌండర్‌గా ఎదుగుతాడంటూ కితాబులిస్తున్నారు. వాళ్లిద్దరు మినహా అంతా విఫలం న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా టీమిండియా క్రైస్ట్‌చర్చ్ వేదికగా మూడో వన్డే ఆడింది. సిరీస్ విజేతను తేల్చే ఆఖరిదైన ఈ మ్యాచ్‌లో టాపార్డర్‌లో శ్రేయస్ అయ్యర్ మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. ఓపెనర్లు శిఖర్ ధావన్ 28, శుబ్‌మన్ గిల్ 13 పరుగులు చేయగా.. అయ్యర్ 49 పరుగులు సాధించాడు. ఇక రిషభ్ పంత్ మరోసారి విఫలం(10) కాగా.. సూర్యకుమార్ యాదవ్ వైఫల్యం(6) కొనసాగింది. వాషింగ్టన్ సుందర్ ఒత్తిడిని అధిగమించి ఈ క్రమంలో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన వాషింగ్టన్ సుందర్ 64 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 51 పరుగులు చేశాడు. ఒత్తిడిని అధిగమించి అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. దీంతో ధావన్ సేన గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. 47.3 ఓవర్లలో 219 పరుగులు చేసి ఆలౌట్ అయింది. రవీంద్ర జడేజా జడేజా నువ్వు రాజకీయాలు చూసుకో ఇక! ఈ నేపథ్యంలో వాషింగ్టన్ సుందర్ అద్భుత ఇన్నింగ్స్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆటను పట్టించుకోకుండా.. రాజకీయాలపై దృష్టి సారిస్తున్న టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా స్థానాన్ని భర్తీ చేయగల సమర్థుడని అభిప్రాయపడుతున్నారు. జట్టుకు అవసరమైన సమయంలో రాణిస్తున్న ఈ 23 ఏళ్ల స్పిన్ ఆల్‌రౌండర్.. ఫిట్నెస్ను కాపాడుకుంటే మేటి ఆల్‌రౌండర్‌గా ఎదగడం ఖాయమని పేర్కొంటున్నారు. అదే విధంగా పంత్ వైఫల్యాన్ని ప్రస్తావిస్తూ డౌన్ ఆర్డర్లో దంచికొట్టే సుందర్ ఉండగా.. రిషభ్‌తో పనేముంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఒత్తిడిని అధిగమిస్తూ.. అన్ని ఫార్మాట్లలోనూ సత్తా చాటగల ఈ తమిళనాడు ఆటగాడికి బీసీసీఐ ప్రోత్సాహం అందివ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. విలువైన ఇన్నింగ్స్ ఆడుతున్న సుందర్ మొదటి వన్డేలోనూ వాషీ 16 బంతుల్లో 37 పరుగులు చేసి ఆఖరి వరకు అజేయంగా నిలిచిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే త వన్డేలతొలి ఆతిథ్య జట్టు చేతిలో ఓటమి పాలైన భారత్.. ఆఖరి మ్యాచ్‌లోనైనా గెలిచి సిరీస్ సమం చేయాలని భావించగా తక్కువ స్కోరుకే పరిమితమైంది. మరోవైపు.. వరుణుడు మూడో వన్డేకు కూడా అంతరాయం కలిగించడంతో రద్దైంది. సిరీస్ కివీస్ సొంతమైంది. 2017లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన వాషింగ్టన్ సుందర్.. ఇప్పటి వరకు 32 టీ20 ఆడి 26 వికెట్లు పడగొట్టాడు. 10 వన్డేల్లో 196 పరుగులు సాధించాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రం చేసి.. ఇప్పటి వరకు నాలుగు టెస్టులాడిన వాషీ.. 265 పరుగులు చేయడం సహా.. 6 వికెట్లు పడగొట్టాడు. చదవండి: IND VS NZ 3rd ODI: చెత్త ఫామ్‌పై ప్రశ్న.. సహనం కోల్పోయిన పంత్ IND vs NZ: అప్పుడు రాయుడు.. ఇప్పుడు సంజూకు అన్యాయం: పాక్ మాజీ క్రికెటర్ Washington Sundar will be a priceless asset to the Indian team, across all formats, going forward. — Venkata Krishna B (@venkatatweets) November 30, 2022 Fifty for Washington Sundar, one of the biggest positives for India in this New Zealand tour — Johns. (@CricCrazyJohns) November 30, 2022 Please take care of Washington Sundar. He's just 23 years old, and can be an invaluable all-round asset for years to come. Immense potential. — Sparsh Telang (@_cricketsparsh) November 30, 2022 At this rate, Sundar might make Jadeja a permanent BJP member. — Akrabazzi Reloaded 👑 (@SHA3_256) November 30, 2022 -
వాషింగ్టన్ సుందర్ సరికొత్త చరిత్ర.. 12 ఏళ్ల రికార్డు బద్దలు
ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో 7 వికెట్ల తేడాతో భారత్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు అద్భుతంగా రాణించినప్పటికీ.. బౌలర్లు మాత్రం మరోసారి పూర్తిగా తేలిపోయారు. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. భారత ఇన్నింగ్స్ ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సుందర్ కేవలం 16 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37 పరుగులు సాధించాడు. తద్వారా సుందర్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. న్యూజిలాండ్ గడ్డపై అత్యంత వేగంగా 30కు పైగా పరుగులు సాధించిన తొలి భారత క్రికెటర్‌గా సుందర్ నిలిచాడు అంతకుముందు ఈ రికార్డు టీమిండియా మూజీ ఆటగాడు సురేష్ రైనా పేరిట ఉండేది. 2009లో బ్లాక్ క్యాప్స్‌పై 18 బంతుల్లో 38 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో సుందర్ రైనా రికార్డును బ్రేక్ చేశాడు. ఇక న్యూజిలాండ్, భారత్ మధ్య రెండో వన్డే హామిల్టన్ వేదికగా నవంబర్ 27న జరగనుంది. చదవండి: SL vs AFG: శ్రీలంకను చిత్తు చేసిన ఆఫ్గాన్.. 60 పరుగుల తేడాతో ఘన విజయం -
3 ఫిఫ్టీలు ఉన్నా అతడి ఇన్నింగ్సే అద్భుతం! వాషీని ప్రశంసిస్తూనే.. పంత్‌ను కూడా!
New Zealand vs India, 1st ODI- Washington Sundar- Rishabh Pant: ‘‘వాషింగ్టన్ సుందర్ ఆట తీరు అమోఘం. అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు’’ అంటూ టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా.. భారత యువ ఆల్‌రౌండర్‌పై ప్రశంసలు కురిపించాడు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో విలువైన ఇన్నింగ్స్ ఆడి తనదైన ముద్ర వేశాడని కొనియాడాడు. మెరుపు ఇన్నింగ్స్ కాగా కివీస్‌తో మొదటి వన్డేలో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన వాషింగ్టన్ సుందర్ 16 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 37 పరుగులు(స్ట్రైక్‌రేటు 231.25) సాధించాడు. టీమిండియా స్కోరు 300 మార్కు దాటడంలో తన వంతు పాత్ర పోషించి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఇక టాపార్డర్‌లో ఓపెనర్లు శిఖర్ ధావన్ 72, శుబ్‌మన్ గిల 50 పరుగులు చేయగా.. శ్రేయస్ అయ్యర్ 80 పరుగులతో అదరగొట్టాడు. వీరికి తోడు సంజూ శాంసన్ 36, వాషీ 37 పరుగులతో రాణించడంతో టీమిండియా నిర్ణీత 7 వికెట్ల నష్టానికి 306 పరుగుల భారీ స్కోరు సాధించింది. వారెవ్వా సుందర్ ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘టీమిండియా ఇన్నింగ్స్‌లో మూడు 50+ స్కోర్లు ఉన్నప్పటికీ సుందర్ మెరుపు ఇన్నింగ్సే ఎక్కువ ప్రభావంతమైనదని చెప్పవచ్చు. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు దిగిన ఆటగాళ్ల సగటును పరిగణనలోకి తీసుకోవడం సరికాదు. అతడు ఏ మేరకు స్కోరు చేశాడనేదే ముఖ్యం’’ అని వాషింగ్టన్ సుందర్ ఆట తీరుపై ప్రశంసలు కురిపించాడు. Well played, Washington Sundar. What an innings. This Indian innings has three 50+ scores but it’s Sundar’s innings that might have had the biggest impact. People who bat lower down the order mustn’t be judged with the usual parameters of ‘average’. Impact is what matters. — Aakash Chopra (@cricketaakash) November 25, 2022 పంత్‌పై సానూభూతి! ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో వికెట్ కీపర్ రిషభ్ పంత్ నాలుగో స్థానంలో వచ్చి 15 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఈ నేపథ్యంలో కివీస్‌తో ముగిసిన టీ20 సిరీస్‌లో ఈ యువ బ్యాటర్ వైఫల్యాన్ని ప్రస్తావిస్తూ.. నెటిజన్లు అతడిని మరోసారి ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆకాశ్ చోప్రా ఆసక్తికర ట్వీట్ చేశాడు. ‘‘రిషభ్ పంత్‌పై ఈ ప్లాట్ఫామ్లో ఈ స్థాయిలో విద్వేషం చిమ్మడాన్ని నమ్మలేకపోతున్నా’’ అని ఈ మాజీ బ్యాటర్ అన్నాడు. కాగా టీ20 ఫార్మాట్లో రిషభ్ పంత్ వరుసగా విఫలమవుతున్నప్పటికీ వన్డేల్లో మాత్రం అతడి ఆట తీరు మరీ అంత ఘోరంగా ఏమీ లేదు. పర్లేదు.. మరీ అంత చెత్తగా ఏమీ లేదు ఈ ఏడాది ఇంగ్లండ్ మీద 125(నాటౌట్), వెస్టిండీస్ మీద అర్ధ శతకం(56).. సౌతాఫ్రికాతో విలువైన 85 పరుగులతో జట్టు గెలుపులో పాలుపంచుకున్నాడు. ఇక ఇంగ్లండ్‌తో మాంచెస్టర్ వన్డేలో 125 పరుగులతో అజేయంగా నిలిచి ఒంటిచేత్తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ విషయాలను ప్రస్తావిస్తూ పంత్ హేటర్స్‌కు కౌంటర్ ఇస్తున్నారు అతడి అభిమానులు. The amount of hate Rishabh Pant gets on this platform is unreal… 🤷♂️ — Aakash Chopra (@cricketaakash) November 25, 2022 చదవండి: Ind Vs NZ 1st ODI: కివీస్ గడ్డపై శ్రేయస్ అరుదైన రికార్డు.. తొలి భారత ఆటగాడిగా! వరల్డ్‌కప్ జట్టులో చోటు ఖాయమంటూ.. IND vs NZ: శిఖర్ ధావన్ అరుదైన రికార్డు.. సచిన్, గంగూలీ వంటి దిగ్గజాల సరసన FIFA WC 2022: చరిత్ర సృష్టించిన రొనాల్డో.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా -
దీపక్ చాహర్‌కు గాయం.. వాషింగ్టన్ సుందర్‌కు ఛాన్స్
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు టీమిండియా పేసర్ దీపక్ చాహర్ గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. దీంతో చాహర్ స్థానంలో మిగిలిన రెండు వన్డేలకు ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ శనివారం ప్రకటించింది. కాగా సుందర్ కూడా గాయం కారణంగా గత కొంత కాలం నుంచి జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు. ఇప్పటి వరకు సుందర్ కేవలం నాలుగు వన్డేలు మాత్రమే ఆడాడు. అతడు చివరసారిగా ఈ ఏడాది ఫిబ్రవరిలో విండీస్‌తో జరిగిన వన్డేలో భారత్ తరపున ఆడాడు. కాగా ప్రోటీస్‌తో తొలి వన్డేకు ముందు గాయపడిన చాహర్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్నాడు. ఇక అఖరి రెండు వన్డేలకు సుందర్ భారత జట్టుతో కలవనున్నాడు. ఇక దక్షిణాఫ్రికాతో తొలి వన్డేలో ఓటమి చెందిన టీమిండియా.. రాంఛీ వేదికగా రెండో వన్డేలో ఆదివారం తలపడనుంది. ఈ మ్యాచ్‌కు భారత తుది జట్టులో బిష్నోయ్ స్థానంలో సుందర్‌కు చోటు దక్కే అవకాశం ఉంది. తుది జట్లు(అంచనా) టీమిండియా: శిఖర్ ధావన్(కెప్టెన్), శుభమన్ గిల్, రజిత్ పటిదార్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సంజు శాంసన్(వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, అవేష్ ఖాన్ దక్షిణాఫ్రికా: జన్నెమన్ మలన్, క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), టెంబా బావుమా(కెప్టెన్), ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎన్గిడి, తబ్రైజ్ షమ్సీ -
టీమ్ఇండియాలో మరో మార్పు !
-
గాయాలతోనే ఏడాది గడిచిపోయింది.. జట్టులోకి వచ్చేదెన్నడు?
వాషింగ్టన్ సుందర్.. టీమిండియా క్రికెటర్లలో అత్యంత దురదృష్టవంతుడిగా పేరు పొందాడు. ఈ పదం అతనికి అచ్చు గుద్దినట్లుగా సరిపోతుంది. బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా పేరున్న సుందర్ జట్టులో ఉన్నాడనడం కంటే బయటే ఎక్కువున్నాడని చెప్పొచ్చు. దాదాపు ఒక ఏడాది మొత్తం గాయాలతోనే గడపాల్సి వచ్చింది సుందర్.(2021 ఆగస్టు నుంచి మొదలుకొని 2022 ఆగస్టు వరకు). జట్టులోకి ఎంపికయ్యాడన్న ప్రతీసారి ఏదో ఒక గాయం కారణంగా మళ్లీ దూరమవడం.. ఇదే సుందర్‌కు తంతుగా మారిపోయింది. గాయాలను వెతుక్కుంటూ తను వెళ్తున్నాడో లేక అవే అతని దగ్గరికి వస్తున్నాయో అర్థం కావడం లేదు. - సాక్షి, వెబ్‌డెస్క్ తాజాగా ఇంగ్లండ్ వేదికగా జరిగిన రాయల్ లండన్ కప్‌లో ఒక మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో భుజానికి గాయమైంది. ఎక్స్‌రే తీయగా.. గాయం తీవ్రత ఎక్కువని తేలింది. దీంతో జింబాబ్వే పర్యటనకు దూరం కావాల్సి వచ్చింది. కాగా బీసీసీఐ సుందర్ స్థానంలో షాబాజ్ అహ్మద్‌ను ఎంపిక చేసింది. కేఎల్ రాహుల్ నేతృత్వంలోని టీమిండియా యువజట్టు ప్రస్తుతం జింబాబ్వే గడ్డపై వన్డే సిరీస్ ఆడనుంది. ఇలా 2022 ఏడాది ఆరంభం నుంచి సుందర్‌కు ఏది కలిసి రావడం రాలేదు. ఒక 2021 ఆగస్టు నుంచి సుందర్ ఏయే గాయాల బారీన పడ్డాడో తెలుసుకుందాం. జూలై 2021.. చేతి వేలికి గాయం ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా కౌంటీ ఎలెవెన్‌కు ప్రాతినిధ్యం వహించిన సుందర్ ఇండియాతో మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌లో చేతి వేలికి గాయమైంది. దీంతో ఇంగ్లండ్‌తో నాలుగు టెస్టుల సిరీస్‌తో పాటు ఐపీఎల్ 2021(రెండో అంచె పోటీలు), ఆ తర్వాత టి20 వరల్డ్‌కప్ 2021కు దూరమయ్యాడు. జనవరి 2022.. కోవిడ్-19 పాజిటివ్‌గా చేతివేలి గాయం అనంతరం దేశవాలీ టోర్నీ అయిన విజయ్‌హజారే ట్రోపీలో అద్బుత ప్రదర్శన కనబరిచాడు. ఈ ప్రదర్శను సుందర్‌ను సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు ఎంపికయ్యేలా చేసింది. కానీ కోవిడ్-19 రూపంలో సుందర్‌ను దురదృష్టం వెంటాడింది. ప్రొటిస్ పర్యటనకు బయలుదేరడానికి ముందు జనవరి 11న సుందర్ కరోనా పాజిటివ్‌గా తేలడంతో సౌతాఫ్రికా సిరీస్‌కు దూరం కావాల్సి వచ్చింది. ఫిబ్రవరి 2022.. తొడ కండరాల గాయంతో.. స్వదేశంలో విండీస్‌తో సిరీస్‌కు ఎంపికయిన సుందర్ ఒకే ఒక్క మ్యాచ్‌కు పరిమితమయ్యాడు. విండీస్‌తో మూడో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ తొడ కండరాలు పట్టేయడంతో మ్యాచ్ మధ్యలోనే వెళ్లిపోయాడు. అలా కండరాల గాయంతో విండీస్‌తో టి20 సిరీస్‌కు.. అటుపై శ్రీలంకతో టి20 సిరీస్‌కు సుందర్ దూరమయ్యాడు. ఏప్రిల్ 2022.. చేతికి గాయం.. విండీస్, లంకతో సిరీస్‌లకు దూరమైన సుందర్ ఆ తర్వాత ఐపీఎల్ 2022లో ఎస్ఆర్హెచ్కు ప్రాతినిధ్యం వహించాడు. ఏప్రిల్ 11న గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో బంతిని అందుకునే క్రమంలో చేయికి గాయమైంది. దీంతో మూడు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఆ తర్వాత కోలుకొని ఐపీఎల్ ఆడినప్పటికి.. టీమిండియాలోకి రాలేకపోయాడు. ఆగస్టు 2022.. భుజం గాయంతో.. ఐపీఎల్ ముగిసిన తర్వాత టీమిండియాలో చాన్స్ రాకపోవడంతో కౌంటీ క్రికెట్ ఆడేందుకు లండన్ వెళ్లాడు. అక్కడ లంకాషైర్ తరపున అద్భుత ప్రదర్శన కనబరిచి జింబాబ్వే టూర్‌కు ఎంపికయ్యాడు. ఈసారి కచ్చితంగా జట్టు తరపున బరిలోకి దిగుతాడని అనుకునేలోపే.. రాయల్ లండన్ కప్‌లో ఆడుతూ భుజం గాయంతో జింబాబ్వే సిరీస్‌కు ఆఖరి నిమిషంలో దూరమయ్యాడు. ఇలా ఏడాది మొత్తం గాయాలతోనే సహవాసం చేసిన సుందర్ ఇక జట్టులోకి వచ్చేదెన్నడు అని అభిమానులు కామెంట్స్ చేశారు. మరి రాబోయే రోజుల్లోనైనా సుందర్ ఎటువంటి గాయాల బారీన పడకుండా టీమిండియా జట్టులోకి రావాలని ఆశిద్దాం. చదవండి: సుందర్‌ను మరిచారా.. కావాలనే పక్కనబెట్టారా! సుందర్ 'నమ్మశక్యం కాని బౌలింగ్'.. నోరెళ్లబెట్టిన ప్రత్యర్థి బ్యాటర్ సుందర్ స్థానాన్ని భర్తీ చేయనున్న ఆర్సీబీ ఆల్‌రౌండర్ -
సుందర్ స్థానాన్ని భర్తీ చేయనున్న ఆర్సీబీ ఆల్‌రౌండర్
టీమిండియా.. జింబాబ్వే పర్యటనకు ఎంపికై, గాయం కారణంగా జట్టుకు దూరమైన స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ స్థానాన్ని భారత సెలెక్షన్ కమిటీ మరో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌తో భర్తీ చేసింది. సుందర్ స్థానంలో ఆర్సీబీ ఆల్‌రౌండర్, బెంగాల్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ షాబాజ్ నదీమ్ జింబాబ్వే పర్యటనకు బయల్దేరనున్నట్లు సెలెక్షన్ కమిటీ మంగళవారం ప్రకటించింది. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున ఓ మోస్తరు ప్రదర్శన చేస్తున్న షాబాజ్.. టీమిండియా తరఫున ఎంట్రీ కోసం ఎదురుచూస్తుంగా, ఊహించని అవకాశం అతని తలుపు తట్టింది. షాబాజ్.. ఐపీఎల్లో ఆర్సీబీ తరఫున 29 మ్యాచ్‌ల్లో 118 స్ట్రయిక్ రేట్‌తో 279 పరుగులు, 8.58 ఎకానమీతో 13 వికెట్లు పడగొట్టాడు. షాబాజ్‌కు ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో మంచి రికార్డే ఉంది. బ్యాటింగ్‌లో 3 శతకాలు, 10 అర్ధశతకాలు.. బౌలింగ్‌లో 7/57 అత్యుత్తమ ప్రదర్శనతో 100కు పైగా వికెట్లు సాధించాడు. ఇందులో 2 ఐదు వికెట్ల ఘనతలు కూడా ఉన్నాయి. కాగా, వాషింగ్టన్ సుందర్ ఇంగ్లండ్ దేశవాళీ క్రికెట్ ఆడుతూ గాయపడ్డ విషయం తెలిసిందే. రాయల్ లండన్ వన్డే కప్‌లో లాంకషైర్ తరఫున ఆడుతున్న సుందర్.. ఈ నెల 10న వోర్సస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో క్యాచ్ పట్టేందుకు డైవ్ చేసినప్పుడు ఎడమ భుజానికి తీవ్ర గాయమైంది. నొప్పితో అతను ఉన్నపళంగా మైదానాన్ని వీడాడు. చదవండి: అనుకున్నదే అయ్యింది.. జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు స్టార్ ఆల్‌రౌండర్ దూరం..! -
అనుకున్నదే అయ్యింది.. జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు స్టార్ ఆల్‌రౌండర్ దూరం..!
Washington Sundar Ruled Out Of Zimbabwe Tour: ఇంగ్లండ్‌లో దేశవాళీ మ్యాచ్‌లాడుతున్న భారత ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయపడ్డాడు. దీంతో అతను జింబాబ్వే పర్యటనకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ దేశవాళీ వన్డే టోర్నీ రాయల్ లండన్ కప్‌లో లాంకషైర్ తరఫున సుందర్ ఆడుతున్నాడు. ఈ నెల 10న వోర్సస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో క్యాచ్ పట్టేందుకు డైవ్ చేసినపుడు అతని ఎడమ భుజానికి గాయమైంది. నొప్పితో అతను ఉన్నపళంగా మైదానం వీడాడు. తర్వాత మళ్లీ గ్రౌండ్లోకి దిగలేదు. ఆదివారం హాంప్‌షైర్‌తో జరిగిన పోరులోనూ అతను బరిలోకి దిగలేదు. ఈ నేపథ్యంలో అతని గాయం తీవ్రమైంది అయితే జింబాబ్వే పర్యటనకు వెళ్లడు. అటునుంచి నేరుగా బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)కి వచ్చి పునరావాస శిబిరంలో పాల్గొనే అవకాశముంది. ఈనెల 18 నుంచి హరారే వేదికగా జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ పాల్గొంటుంది. -
Ind Vs Zim 2022: మరీ ఇంత బ్యాడ్ లక్ ఏంటి భయ్యా! రాకరాక వచ్చిన అవకాశం..!
Washington Sundar suffers shoulder injury : చాలా కాలం తర్వాత భారత జట్టులో చోటు దక్కించుకున్న యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను మరోసారి దురదృష్టం వెంటాడింది. ఇటీవలే జింబాబ్వే టూర్‌కు ఎంపికైన అతడు.. గాయం కారణంగా జట్టుకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో స్వదేశంలో వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో సుందర్ చివరి సారిగా టీమిండియా తరఫున బరిలోకి దిగాడు. ఆ తర్వాత గాయం కారణంగా జట్టులో స్థానం సంపాదించుకోలేకపోయాడు. ఐపీఎల్-2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించిన ఈ యువ ఆల్‌రౌండర్‌ను గాయాల బెడద వేధించింది. ఈ క్రమంలో బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో చికిత్స పొందిన అతడు.. లంకాషైర్ తరఫున కౌంటీ క్రికెట్ ఆడే అవకాశం దక్కించుకున్నాడు. అరంగేట్రంలోనే ఐదు వికెట్లు తీసి అదరగొట్టాడు. బ్యాడ్ లక్.. అదే జోష్‌లో రాయల్ లండన్ వన్డే కప్ టోర్నీలో ఆడే అవకాశం దక్కించుకున్న ఈ తమిళనాడు స్పిన్ బౌలర్.. వోర్సెస్టర్షైర్తో బుధవారం జరిగిన మ్యాచ్ సందర్భంగా గాయపడ్డాడు. ఎడమ భుజానికి తీవ్ర గాయమైంది. దీంతో వాషింగ్టన్ సుందర్ మైదానాన్ని వీడాడు. ఈ విషయాన్ని లంకాషైర్ మేనేజ్మెంట్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ నేపథ్యంలో సుందర్ ఫ్యాన్స్.. ‘‘మరీ ఇంత బ్యాడ్ లక్ ఏంటి భయ్యా.. రాకరాక వచ్చిన అవకాశం.. ఇదీ చేజారితే ఎలా?’’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆగష్టు 18 నుంచి టీమిండియా- జింబాబ్వేతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శిఖర్ ధావన్ సారథ్యంలోని జట్టుకు వాషింగ్టన్ ఎంపికయ్యాడు. కానీ.. గాయం కారణంగా జట్టుకు దూరమయ్యే ఛాన్స్ ఉంది. ఇక తరచుగా ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటున్న 22 ఏళ్ల సుందర్.. వేలికి గాయం కావడంతో గతేడాది టీ20 ప్రపంచకప్ టోర్నీ మిస్సయ్యాడు. ఇక ఆసియా కప్-2022 ఈవెంట్‌కు ఎంపిక చేసిన జట్టులో అతడికి చోటు దక్కలేదన్న సంగతి తెలిసిందే. చదవండి: Asia Cup Squad: సుందర్‌ను మరిచారా.. కావాలనే పక్కనబెట్టారా! Asia Cup 2022: టీమిండియా సెలక్టర్లు చేసిన అతి పెద్ద తప్పు అదే! టాప్ స్కోరర్లను వదిలేసి.. -
సుందర్‌ను మరిచారా.. కావాలనే పక్కనబెట్టారా!
టీమిండియా స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. 2020 చివర్లో ఆస్ట్రేలియా గడ్డపై సుందర్ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. గబ్బా వేదికగా జరిగిన నాలుగో టెస్టులో సుందర్(62 పరుగులు).. శార్దూల్ ఠాకూర్‌తో కలిసి ఆడిన ఇన్నింగ్స్ ఎవరు మరిచిపోలేరు. ఒక రకంగా నాలుగో టెస్టులో టీమిండియా గెలిచిందంటే సుందర్‌ది కీలకపాత్ర అని చెప్పొచ్చు. ఆ తర్వాత భారత జట్టులో చోటు దక్కించుకున్నప్పటికి గాయాల కారణంగా క్రమేపీ జట్టుకు దూరమయ్యాడు. అయితే జట్టులో సరైన అవకాశాలు లేక ప్రస్తుతం కౌంటీ క్రికెట్లో బిజీగా గడుపుతున్నాడు. రానున్న టి20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని ఆసియా కప్‌కు ఎంపిక చేసిన జట్టులో సుందర్ ఎంపిక కాలేదు. స్పిన్నర్లుగా రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, రవి బిష్ణోయి, యజ్వేంద్ర చహల్‌లు ఉన్నారు. కాగా ఆసియా కప్‌కు సుందర్‌ను ఎంపిక చేయకపోవడంపై బీసీసీఐ సెలెక్టర్లలో ఒకరు క్లారిటీ ఇచ్చారు.‘సుందర్ టీమిండియాకు చాలా గొప్ప ఆస్తి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అతను ఫిట్నెస్ను మెరుగుపర్చుకోవాలి. అవకాశం కోసం వెయిట్ చేయాల్సిందే. ఈ విషయాన్ని సుందర్‌తో చర్చించాం. ఆసీస్ పిచ్‌లకు అశ్విన్ సరిపోతాడని అనుకుంటున్నాం. ఒకవేళ ఎవరైనా గాయపడితే అప్పుడు సుందర్ బ్యాకప్‌గా వస్తాడు’ అని ఓ సెలెక్టర్ వ్యాఖ్యానించాడు. గాయం కారణంగా చాలా రోజులుగా ఇంటర్నేషనల్ క్రికెట్‌కు దూరంగా ఉన్న సుందర్.. ఇటీవలే కౌంటీల్లో సూపర్ ఎంట్రీ ఇచ్చాడు. లాంక్షైర్ తరఫున రెండు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 8 వికెట్లు తీశాడు. మొత్తానికి ఫిట్నెస్ లేకపోవడం, ఐపీఎల్ తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడకపోవడం, టీమ్‌లో పోటీ పెరగడం, ఆసీస్ పిచ్‌లు అతని బౌలింగ్‌కు సరిపోకపోవడం వంటి నాలుగు అంశాలతో సెలెక్టర్లు సుందర్‌ను పక్కనబెట్టారు. ఇక ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్‌కప్‌కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ.. టీమిండియాకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. మెగా ఈవెంట్‌కు బలమైన టీమ్‌ను బరిలోకి దించాలని భావిస్తున్నా.. యంగ్‌స్టర్స్ నుంచి సెలెక్టర్లకు పెద్ద సవాలే ఎదురవుతున్నది. ఈ మధ్య కాలంలో సీనియర్లు లేకపోయినా.. యంగ్‌స్టర్స్‌తో కూడిన టీమిండియా వరుసగా సిరీస్‌లు గెలిచింది. దీంతో ఆసీస్ ఫ్లైట్‌లో ఎవరికి బెర్త్ కేటాయించాలన్న దానిపై సెలెక్షన్ కమిటీ ఓ కొలిక్కి రాలేకపోతున్నది. తాజాగా ఆసియా కప్ పెర్ఫామెన్స్‌తో దీనిపై తుది నిర్ణయానికి రావాలని సెలెక్టర్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సెలెక్టర్ల నుంచి ఒకటి, రెండు స్పష్టమైన సంకేతాలు బయటకు వచ్చాయి. ముఖ్యంగా స్పిన్ ఆల్‌రౌండర్‌గా పనికి వస్తాడనుకున్న వాషింగ్టన్ సుందర్‌ను.. టీ20 వరల్డ్‌కప్ టీమ్ ప్రణాళికల నుంచి తప్పించాలని సెలెక్టర్లు నిర్ణయానికి వచ్చేశారు. అదే సమయంలో వెటరన్ స్పిన్నర్ అశ్విన్‌కు ఆసీస్ ఫ్లైట్‌లో చోటు కల్పించాలని భావిస్తున్నారు. టీమిండియాలో స్పిన్నర్‌గా అశ్విన్‌కు చాలా అనుభవం ఉంది. ఆసీస్ పిచ్‌లు ఎక్కువగా పేసర్లకు సహకరిస్తాయి. అదే సమయంలో అశ్విన్ స్పిన్ కూడా ప్రభావవంతంగా పని చేస్తుందని సెలెక్టర్లు నమ్ముతున్నారు. జడేజా, చహల్‌ను తీసుకున్నా.. అశ్విన్ టీమ్‌లో ఉండటం వల్ల స్పిన్‌లో వైవిధ్యం ఉంటుందని భావిస్తున్నారు. అనుభవం పక్కనబెడితే మ్యాచ్‌ను అవగాహన చేసుకోవడంలో అశ్విన్ దిట్ట. దీనికి తోడు డిఫరెంట్ బాల్స్ వేయడంలో స్పెషలిస్ట్. ఆసీస్ పిచ్‌లపై బాల్ టర్నింగ్ లేకపోయినా.. మంచి వేరియేషన్స్‌తో బ్యాటర్లను ఇబ్బందిపెడతాడని యోచిస్తున్నారు. అదే సమయంలో యంగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ నుంచి అశ్విన్‌కు పోటీ ఎదురయ్యే చాన్స్ కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో ఆసియా కప్‌లో ఈ ఇద్దరి ఆటను సెలెక్టర్లు నిశితంగా పరిశీలించనున్నారు. చదవండి: Ishan Kishan: ఎంపిక చేయలేదన్న కోపమా?.. పాట రూపంలో నిరసన Asia Cup 2022: టీమిండియా సెలక్టర్లు చేసిన అతి పెద్ద తప్పు అదే! టాప్ స్కోరర్లను వదిలేసి.. -
మ్యాచ్ గెలిచిన ఆనందం.. టీమిండియా క్రికెటర్ డ్యాన్స్
టీమిండియా స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ ప్రస్తుతం లంకాషైర్ తరపున ప్రాతినిధ్యం వహిస్తూ కౌంటీల్లో బిజీగా ఉన్నాడు. గాయంతో దూరమైన సుందర్ కౌంటీల్లో ఆడుతూ సూపర్ ప్రదర్శనతో రెచ్చిపోతున్నాడు. తాజాగా మ్యాచ్ గెలిచిన ఆనందంలో సుందర్ డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాయల్ లండన్ వన్డే-కప్‌లో భాగంగా లంకాషైర్, యార్క్‌షైర్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో లంకాషైర్ ఏడు వికెట్లతో విజయం సాధించింది. మ్యాచ్ గెలిచిన సంతోషాన్ని లంకాషైర్ జట్టు సభ్యులు డ్రెస్సింగ్‌రూమ్‌లో పెద్ద ఎత్తున్న సెలట్రేట్ చేసుకున్నారు. మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో ఒకరిని ఒకరు అభినందించుకుంటూ డ్యాన్స్ చేశారు. సుందర్ కూడా చిన్న పిల్లాడిలా మారిపోయి గెంతులేయడం కనిపించింది. మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన యార్క్‌షైర్ 48.3 ఓవర్లలో 224 పరుగులకు ఆలౌట్ అయింది. విల్ ప్రెయిన్ 41 పరుగులు చేయగా.. టాటెర్సల్ 34 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన లంకాషైర్ 41 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. లూక్ వెల్స్ 88 పరుగులతో ఆకట్టుకోగా.. జోష్ బొహానన్ 51 పరుగులు చేశాడు. చివర్లో వాషింగ్టన్ సుందర్ 30 నాటౌట్, స్టీవెన్ క్రాఫ్ట్ 31 నాటౌట్ జట్టును విజయతీరాలకు చేర్చారు. A roses 𝒔𝒑𝒆𝒄𝒊𝒂𝒍 🌹 🌹 #RedRoseTogether pic.twitter.com/cKIGlfCj8g — Lancashire Cricket (@lancscricket) August 4, 2022 చదవండి: Wayne Parnel: ఐదు వికెట్లతో చెలరేగిన బౌలర్.. అల్లాడిపోయిన ఐర్లాండ్ Senior RP Singh: భారత్‌ను కాదని ఇంగ్లండ్‌కు ఆడనున్న మాజీ క్రికెటర్ కుమారుడు -
Zimbabwe vs India ODI series: చహర్ పునరాగమనం
ముంబై: జింబాబ్వే గడ్డపై జరిగే 3 వన్డేల సిరీస్ కోసం భారత టీమ్‌ను బీసీసీఐ సెలక్షన్ కమిటీ శనివారం ప్రకటించింది. ఆగస్టు 18, 20, 22 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. గాయాల కారణంగా చాలా కాలంగా జట్టుకు దూరమైన దీపక్ చహర్, వాషింగ్టన్ సుందర్ కోలుకొని పునరాగమనం చేయగా, రాహుల్ త్రిపాఠిని తొలిసారి వన్డేలకు ఎంపిక చేశారు. రోహిత్, కోహ్లి, పంత్, షమీ, బుమ్రా, హార్దిక్ ఈ సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకోగా... రొటేషన్ పాలసీలో భాగంగా ఇతర కీలక ఆటగాళ్లు శ్రేయస్, సూర్యకుమార్, జడేజా, చహల్, అర్‡్షదీప్‌లను కూడా ఈ టూర్‌కు పంపరాదని సెలక్టర్లు నిర్ణయించారు. కరోనా బారిన పడిన కేఎల్ రాహుల్ కోలుకోకపోవడంతో ఎంపిక చేయలేదు. జట్టు వివరాలు: శిఖర్ ధావన్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుబ్‌మన్ గిల్, హుడా, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్, సామ్సన్, సుందర్, శార్దుల్, అక్షర్, కుల్దీప్, అవేశ్, ప్రసిధ్, సిరాజ్, దీపక్ చహర్. -
సుందర్ 'నమ్మశక్యం కాని బౌలింగ్'.. నోరెళ్లబెట్టిన ప్రత్యర్థి బ్యాటర్
టీమిండియా ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ ప్రస్తుతం కౌంటీ చాంపియన్‌షిప్ డివిజన్ 1లో బిజీగా ఉన్నాడు. లంకాషైర్ తరపున డెబ్యూ సీజన్ ఆడుతున్న సుందర్ సూపర్ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఇటీవలే ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన సుందర్ తాజాగా కెంట్‌తో మ్యాచ్‌లో తన ఆఫ్ స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శించాడు. సుందర్ వేసిన బంతి గింగిరాలు తిరుగుతూ ఆఫ్‌స్టంప్ మీదుగా వెళ్లింది. అయితే బంతిని డిఫెన్స్ చేద్దామని ప్రయత్నించిన కెంట్ బ్యాటర్ జోర్డాన్ కాక్స్ విఫలమయ్యాడు. బంతి ప్యాడ్ల సందులో నుంచి వెళ్లి వికెట్లను గిరాటేసింది. బంతి ఎలా వెళ్లిందో అర్థంగాక జోర్డాన్ కాక్స్ నోరెళ్లబెట్టాడు. దీంతో కేవలం ఒక్క పరుగుకు కాక్స్ పెవిలియన్ చేరాడు. దీనికి సంబంధించిన వీడియోనూ కౌంటీ చాంపియన్‌షిప్ షేర్ చేస్తూ.. ''సుందర్ నుంచి నమ్మశక్యం కాని డెలివరీ.. సూపర్'' అంటూ క్యాప్షన్ జత చేసింది. తెలివైన బంతితో బోల్తా కొట్టించిన సుందర్‌ను తోటి ఆటగాళ్లు అభినందించారు. కాగా సుందర్‌కు కాక్స్‌ది రెండో వికెట్.. అంతకముందు కెంట్ కెప్టెన్ జాక్ లీనింగ్ రూపంలో తొలి వికెట్ తీసుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. లంకాషైర్ 182 పరుగుల తేడాతో కెంట్‌పై విజయం అందుకుంది. లంకాషైర్ తొలి ఇన్నింగ్స్‌లో 145 పరుగులకే ఆలౌట్ కాగా.. కెంట్ తొలి ఇన్నింగ్స్‌లో 270 పరుగులకు ఆలౌట్ అయి 125 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించింది. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం లంకాషైర్ అద్బుత ఆటతీరు కనబరిచింది. 9 వికెట్ల నష్టానికి 436 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లెర్ చేసింది. 311 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కెంట్ అనూహ్యంగా 127 పరుగులకే కుప్పకూలింది. టామ్ బెయిలీ 5 వికెట్లతో చెలరేగగా.. వాషింగ్టన్ సుందర్ 3, విల్ విలియమ్స్ రెండు వికెట్లు తీశాడు. That is an incredible delivery from @Sundarwashi5 😲#LVCountyChamp pic.twitter.com/rLyMvMmI9l — LV= Insurance County Championship (@CountyChamp) July 28, 2022 చదవండి: Sanju Samson In T20I Squad: విండీస్‌తో తొలి టి20.. టీమిండియాకు గుడ్‌న్యూస్ ఆరేళ్ల తర్వాత జట్టులోకి.. కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్; ఇంగ్లండ్‌పై ప్రతీకారం -
కౌంటీల్లో వాషింగ్టన్ సుందర్ అదిరిపోయే అరంగేట్రం
టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కౌంటీ క్రికెట్లో అదిరిపోయే అరంగేట్రం ఇచ్చాడు. లంకాషైర్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న సుందర్ ఆడుతున్న తొలి మ్యాచ్‌లోనే ఐదు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. నార్తంప్టన్‌షైర్‌తో మ్యాచ్‌లో సుందర్ ఈ ఫీట్ నమోదు చేశాడు. తద్వారా కౌంటీ క్రికెట్లో సుందర్ ఒక అరుదైన ఫీట్ నమోదు చేశాడు. కౌంటీల్లో డెబ్యూ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన ఏడో బౌలర్‌గా సుందర్ రికార్డులకెక్కాడు. ఆటలో తొలిరోజే నాలుగు వికెట్లు తీసిన సుందర్.. రెండోరోజు ఆటలో ఒక వికెట్ తీసి ఓవరాల్‌గా 22 ఓవర్లలో 76 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. సుందర్‌కు తోడుగా లూక్ వుడ్ 3, విల్ విలియమ్స్ రెండు వికెట్లు తీయడంతో నార్తంప్టన్‌షైర్ తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత ఇన్నింగ్స్ ఆరంభించిన లంకాషైర్ లంచ్ విరామం సమయానికి రెండు వికెట్ల నష్టానికి 54 పరుగులు చేసింది. కాగా ఐపీఎల్-2022లో ఎస్ఆర్హెచ్ తరపున ఆడిన సుందర్ లీగ్ మధ్యలో గాయపడ్డాడు. అయితే టీ20 స్పెషలిస్టుగా పేరుందిన సుందర్‌కు గాయం నుంచి కోలుకున్న తర్వాత భారత జట్టులో చోటు దక్కలేదు. దక్షిణాఫ్రికా, ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లకు సెలక్టర్లు పక్కన పెట్టారు. ఈ క్రమంలో ఇంగ్లండ్ కౌంటీల్లో రాణించి తిరిగి భారత జట్టులోకి రావాలని సుందర్ భావిస్తున్నాడు. ఇక సుందర్ టీమిండియా తరపున 4 టెస్టులు, 4 వన్డేలు, 31 టి20లు ఆడాడు. WASHI HAS FIVE!! 🖐️🌟@Sundarwashi5 becomes just the seventh @lancscricket player to take a five-for on debut! 👏 McManus caught sweeping on the boundary for 61. 226-9 (75.2) 🌹 #RedRoseTogether pic.twitter.com/sQojvSTPLs — Lancashire Cricket (@lancscricket) July 20, 2022 చదవండి: తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టిన వాషింగ్టన్ సుందర్.. 4 వికెట్లతో..! -
తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టిన వాషింగ్టన్ సుందర్.. 4 వికెట్లతో..!
ఇంగ్లండ్ కౌంటీ ఛాంపియన్షిప్-2022లో లంకషైర్ తరపున ఆడుతోన్న భారత ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. నార్తాంప్టన్‌షైర్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో తొలి రోజు నాలగు వికెట్లు సుందర్ పడగొట్టి తన జట్టును పటిష్టస్థితిలో నిలిపాడు. నార్తాంప్టన్‌షైర్ ఓపెనర్ విల్ యంగ్‌ను ఔట్ చేయడంతో సుందర్ తొలి కౌంటీ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా ఐపీఎల్-2022లో ఎస్ఆర్హెచ్ తరపున ఆడిన సుందర్ లీగ్ మధ్యలో గాయపడ్డాడు. అయితే టీ20 స్పెషలిస్టుగా పేరుందిన సుందర్‌కు గాయం నుంచి కోలుకున్న తర్వాత భారత జట్టులో చోటు దక్కలేదు. దక్షిణాఫ్రికా, ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లకు సెలక్టర్లు పక్కన పెట్టారు. ఈ క్రమంలో ఇంగ్లండ్ కౌంటీల్లో రాణించి తిరిగి భారత జట్టులోకి రావాలని సుందర్ భావిస్తున్నాడు. మరోవైపు భారత వెటరన్ బ్యాటర్ ఛతేశ్వర్ పుజారా ఇంగ్లండ్ కౌంటీల్లో అదరగొట్టి తిరిగి జట్టులోకి వచ్చిన సంగతి తెలిసిందే. That is ridiculous, @luke_wells07! 🤯 A third for @Sundarwashi5 👏 🌹 #RedRoseTogether https://t.co/b8kJigt3ZI pic.twitter.com/vGVxeh86pe — Lancashire Cricket (@lancscricket) July 19, 2022 చదవండి: Ind W Vs Pak W: ఇండియా వర్సెస్ పాకిస్తాన్.. మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ? పూర్తి వివరాలు! -
వాషింగ్టన్ సుందర్‌కు బంపరాఫర్.. దిగ్గజాల తర్వాత తాను సైతం!
Washington Sundar: టీమిండియా యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ అరుదైన అవకాశం దక్కించుకున్నాడు. ఇంగ్లండ్ దేశవాళీ క్రికెట్ కౌంటీ మ్యాచ్‌లు ఆడే ఛాన్స్ కొట్టేశాడు. ఈ మేరకు భారత ఆటగాడు వాషింగ్టన్ సుందర్‌తో ఒప్పందం చేసుకున్నట్లు లంకషైర్ జట్టు బుధవారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. స్వాగత్ హై సుందర్.. ఈ సందర్భంగా స్వాగత్ హై అంటూ సుందర్‌కు ఆహ్వానం పలుకుతూ ఓ వీడియోను షేర్ చేసింది. ‘‘ఇండియన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌తో లంకషైర్ తరఫున ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాం. జూలై, ఆగష్టులో జరిగే కౌంటీ చాంపియన్‌షిప్ రాయల్ లండన్‌కప్‌లో అతడు భాగం కానున్నాడు’’ అని పేర్కొంది. థాంక్స్ అంటూ భావోద్వేగం ఈ విషయంపై స్పందించిన వాషింగ్టన్ సుందర్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. తనకు ఈ అవకాశం ఇచ్చిన లంకషైర్ మేనేజ్మెంట్, భారత క్రికెట్ నియంత్రణ మండలికి ధన్యవాదాలు తెలిపాడు. ‘‘లంకషైర్ జట్టుతో కలిసి ఆడటం కోసం ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నా. ఇంగ్లండ్ గడ్డ మీద ఆడటం నాకొక గొప్ప అనుభవాన్ని ఇస్తుంది. ఎమిరేట్స్ ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో ఆడాలని ఎంతో ఉత్సాహంగా ఉన్నాను’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. కాగా ఐపీఎల్-2022 సందర్భంగా గాయపడిన సుందర్ ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. అతడు పూర్తిగా కోలుకోగానే లంకషైర్ జట్టుతో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ యువ తమిళ ఆటగాడు భారత్ తరఫున 39 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 36 వికెట్లు పడగొట్టాడు. బౌలింగ్‌లో అతడు నమోదు చేసిన అత్యుత్తమ గణాంకాలు 6/87.టెస్ట్ ఎకానమీ 3.41. అదే విధంగా అతడు సాధించిన అత్యధిక స్కోరు 96 నాటౌట్. మొత్తం సాధించిన పరుగులు 369. ఇక లంకషైర్ విషయానికొస్తే ఆ జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. అప్పట్లో వాళ్లు.. ఇప్పుడు ఈ యువ ప్లేయర్లు గతంలో లంకషైర్ జట్టుకు ఫరూక్ ఇంజనీర్, వీవీఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ, దినేశ్ మోంగియా, మురళీ కార్తీక్ లాంటి భారత దిగ్గజ ఆటగాళ్లు ప్రాతినిధ్యం వహించారు. వారి తర్వాత శ్రేయస్ అయ్యర్‌కు ఈ అవకాశం రాగా.. ప్రస్తుతం వాషింగ్టన్ సుందర్ కూడా ఆ జాబితాలో చేరిపోయాడు. 🇮🇳 Swagat Hai, @Sundarwashi5! 👏 🌹 #RedRoseTogether pic.twitter.com/iOnsoQrL8H — Lancashire Lightning (@lancscricket) June 22, 2022 -
ఇంగ్లండ్‌కు బయల్దేరనున్న సుందర్.. గాయం నుంచి కోలుకోని చాహర్
టీమిండియా కీలక ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ త్వరలో ఇంగ్లండ్‌కు బయల్దేరనున్నాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది ఐపీఎల్ సందర్భంగా గాయపడ్డ (చేతికి గాయం) సుందర్ ఇటీవలే గాయం నుంచి కోలుకుని పూర్తి ఫిట్నెస్ సాధించడంతో ఇంగ్లండ్ కౌంటీ జట్టు లంకాషైర్ అతనితో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో రిహాబిలిటేషన్‌లో ఉన్న సుందర్.. త్వరలో ప్రారంభంకానున్న కౌంటీ సీజన్లో సత్తా చాటి టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇవ్వాలని ఆశిస్తున్నాడు. కాగా, గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో సత్తా చాటడం ద్వారా సుందర్ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభానికి ముందు శ్రీలంకతో జరిగిన సిరీస్ సందర్భంగా గాయపడిన మరో ఆల్‌రౌండర్ దీపక్ చాహర్ ఇంకా కోలుకోలేదని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. సుందర్‌తో పాటు ఎన్సీఏ రిహాబిలిటేషన్‌లో ఉన్న చాహర్.. పూర్తిగా కోలుకోవడానికి మరో ఐదు వారాల సమయం పడుతుందని మీడియాలో కధనాలు వినిపిస్తున్నాయి. దీంతో అతన్ని ఇంగ్లండ్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌కు పరిగణలోకి తీసుకోవడంలేదని ప్రచారం జరుగుతుంది. కాగా, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్‌లను గతేడాది ఐపీఎల్ మెగా వేలంలో ఆయా ఫ్రాంఛైజీలు భారీ మొత్తం వెచ్చించి సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. చదవండి: రోహిత్, కోహ్లిలకు బీసీసీఐ వార్నింగ్..! -
అతడు టీమిండియా లీడింగ్ ఆల్‌రౌండర్ అవుతాడు: రవిశాస్త్రి
IPL 2022- SRH Vs PBKS: సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ క్రికెటర్, టీమిండియా ఆటగాడు వాషింగ్టన్ సుందర్‌పై భారత జట్టు మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. టీమిండియాలో కీలక ఆల్‌రౌండర్‌గా ఎదుగుతాడని, అన్ని ఫార్మాట్లలోనూ సత్తా చాటుతాడని కొనియాడాడు. తను ఆటను తేలికగా తీసుకోడని, సీరియస్ క్రికెటర్ అని కితాబిచ్చాడు. ఐపీఎల్-2022లో ఆఖరి లీగ్ మ్యాచ్ సందర్భంగా రవిశాస్త్రి ఈ వ్యాఖ్యలు చేశాడు. లీగ్ ముగింపు దశలో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆదివారం(మే 22) పంజాబ్ కింగ్స్‌తో తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్ 19 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 25 పరుగులు చేశాడు. అదే విధంగా 2 ఓవర్లలో 19 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి మాట్లాడుతూ.. ‘‘వాషింగ్టన్ సుందర్ టీమిండియా లీడింగ్ ఆల్రౌండర్లలో ఒకడిగా ఎదుగుతాడు. భవిష్యత్తు ఆశాకిరణం అతడే. జడేజా ఫిట్‌గా ఉండి ఇంకొన్నేళ్లు ఆడగలిగినా.. అక్షర్ పటేల్ జట్టులో ఉన్నప్పటికీ.. వాషింగ్టన్ సుందర్ ప్రీమియర్ ఆల్‌రౌండర్ అవుతాడు. అన్ని ఫార్మాట్లలోనూ తన మార్కు చూపిస్తాడు. అతడు సీరియస్ క్రికెటర్. యువకుడే అయినప్పటికీ ఆట పట్ల అతడికి ఉన్న అవగాహన అమోఘం. ముఖ్యంగా షాట్ సెలక్షన్ విషయంలో తను తానే సాటి. అయితే, ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాలి. రానున్న మూడేళ్లలో టీమిండియాలో కీలక ఆల్‌రౌండర్ అవుతానని అద్దంలో చూసుకుంటూ తనను తాను చెప్పుకోగల అర్హత కలిగిన ఏకైక ఆటగాడు అతడు’’ అంటూ వాషింగ్టన్ సుందర్‌పై ప్రశంసలు కురిపించాడు. కాగా ఐపీఎల్-2022లో వాషింగ్టన్ సుందర్ సన్‌రైజర్స్ తరఫున ఏడు ఇన్నింగ్స్‌లో కలిపి 101 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 40. 8 ఇన్నింగ్స్‌లలో అతడు పడగొట్టిన వికెట్ల సంఖ్య 6. గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు సుందర్ దూరమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో స్వదేశంలో టీ20 సిరీస్ జట్టులో అతడు చోటు దక్కించుకోలేకపోయాడు. ఇదిలా ఉంటే ఆఖరి లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ పంజాబ్ చేతిలో 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. చదవండి👉🏾IND Vs SA: డీకేను సెలక్ట్ చేసినపుడు ధావన్‌ను ఎందుకు పక్కనపెట్టారు: టీమిండియా మాజీ ఆటగాడు చదవండి👉🏾Ind Vs SA: వాళ్లందరికీ అవకాశం.. మీరు పశ్చాత్తాపపడక తప్పదు: టీమిండియా మాజీ బ్యాటర్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); That's that from Match 70 as @PunjabKingsIPL end their campaign on a winning note. Win by 5 wickets in 15.1 overs. Scorecard - https://t.co/MmucFYpQoU #SRHvPBKS #TATAIPL pic.twitter.com/ujbQsZaUMz — IndianPremierLeague (@IPL) May 22, 2022 -
సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ షాక్.. కీలక ఆటగాడు దూరం..!
వరుస ఓటముల బాధలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ షాక్ తగిలింది. సన్‌రైజర్స్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్ కుడి చేతికి గాయమైంది. దీంతో ఈ మ్యాచ్‌లో సుందర్ ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయకుండా ఫీల్డ్‌ను విడిచి వెళ్లాడు. ఇక ఇదే విషయాన్ని ఎస్ఆర్హెచ్ హెడ్‌కోచ్ టామ్ మూడీ ధృవీకరించాడు. కాగా అంతకుముందు ఈ సీజన్లో చేతి వేలు గాయం కారణంగా సుందర్ మూడు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. మళ్లీ గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సుందర్ తిరిగి వచ్చాడు. "దురదృష్టవశాత్తూ.. మళ్లీ సుందర్ కుడి చేతికి గాయమైంది. అతడు ప్రస్తుతం బౌలింగ్ చేసే స్థితిలో లేడు. అయితే అతడికి బ్యాండేజ్ వేసే అంత గాయం కాలేదు. మా తదపరి మ్యాచ్‌కు అతడు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒక వేళ అతడు దూరమైతే.. అది మా జట్టుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎందుకంటే అతడు మా జట్టులో కీలక బౌలర్లలో ఒకడని" టామ్ మూడీ పేర్కొన్నాడు. చదవండి: MS Dhoni: జడేజాకు ముందే తెలుసు.. అయినా ప్రతీదీ విడమరిచి చెప్పలేం కదా! ధోని ఘాటు వ్యాఖ్యలు! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సన్‌రైజర్స్‌కు భారీ ఊరట.. సుందర్ స్థానాన్ని భర్తీ చేయనున్న స్టార్ ఆల్‌రౌండర్
ఐపీఎల్ 2022 సీజన్లో రెండు వరుస విజయాలతో గాడిలో పడిన సన్‌రైజర్స్‌కు వాషింగ్టన్ సుందర్ రూపంలో ఊహించని షాక్ తగిలింది. గుజరాత్‌తో మ్యాచ్ సందర్భంగా గాయపడిన సుందర్ ఎస్ఆర్హెచ్ ఆడబోయే తదుపరి మూడు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడని ఫ్రాంచైజీ యాజమాన్యం పరోక్షంగా ప్రకటించింది. Bowling ✅ Batting ✅ Catching ✅ Sean us how it's done on the 1️⃣st day of training itself. 💪🏾@seanabbott77#OrangeArmy #ReadyToRise #TATAIPL pic.twitter.com/fIaf4W3yEZ — SunRisers Hyderabad (@SunRisers) April 13, 2022 ఈ నేపథ్యంలో ఆరెంజ్ ఆర్మీకి ఓ బిగ్ రిలీఫ్ లభించింది. సుందర్ స్థానాన్ని ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ సీన్ అబాట్‌తో భర్తీ చేయనున్నట్లు ఎస్ఆర్హెచ్ యాజమాన్యం వెల్లడించింది. ఆసీస్ పరిమిత ఓవర్ల జట్టుతో పాటు పాక్‌లో పర్యటించిన అబాట్.. క్వారంటైన్ ముగించుకుని ఇటీవలే జట్టుతో చేరాడు. నెట్స్‌లో ముమ్మరంగా సాధన చేస్తూ కనిపించాడు. దీనికి సంబందించిన వీడియోను సన్‌రైజర్స్ తమ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఐపీఎల్ 2022 మెగా వేలంలో సీన్ అబాట్‌ను ఎస్ఆర్హెచ్ రూ. 2.4 కోట్లకు సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే, సన్‌రైజర్స్ శుక్రవారం (ఏప్రిల్ 15) జరుగబోయే తమ తదుపరి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడాల్సి ఉంది. ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌కు సుందర్ స్థానంలో సీన్ అబాట్ తుది జట్టులో ఉంటాడని తెలుస్తోంది. ఎస్ఆర్హెచ్ ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో చివరి 2 మ్యాచ్‌ల్లో (సీఎస్కే, గుజరాత్) ప్రత్యర్ధులను చిత్తు చేసి పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. చదవండి: పంజాబ్‌తో సమరం.. రెండు భారీ రికార్డులపై కన్నేసిన రోహిత్ శర్మ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2022: సన్‌రైజర్స్‌కు భారీ షాక్!
IPL 2022 Sunrisers Hyderabad: వరుస విజయాలతో ఆనందంలో ముగినిపోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్హెచ్)కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. సన్‌రైజర్స్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా తదుపరి రెండు మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు సమాచారం. కాగా ముంబైలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా సోమవారం గుజరాత్ టైటాన్స్‌తో ఎస్ఆర్హెచ్ తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో మూడు ఓవర్లు బౌలింగ్ చేసిన వాషింగ్టన్ సుందర్ కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చాడు. తద్వారా గుజరాత్ స్కోరును కట్టడి చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, అప్పటికే చేతికి గాయమైన కారణంగా సుందర్ తన బౌలింగ్ కోటా పూర్తిచేయలేకపోయాడు. ఇక ఈ రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్‌కు గాయం తీవ్రతరమైనందున జట్టుకు దూరం కానున్నాడు. ఈ విషయం గురించి.. సన్‌రైజర్స్ హెడ్‌కోచ్ టామ్ మూడీ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ... ‘‘వాషింగ్టన్ కుడి చేతి బ్రొటన వేలు, మొదటి వేలుకు మధ్య చీలిక వచ్చింది. రాబోయే రెండు మూడు రోజుల పాటు గాయం తీవ్రత ఎలా ఉంటుందో చూడాలి. అతడు కోలుకోవడానికి ఓ వారం రోజులు పట్టవచ్చు’’ అని తెలిపాడు. కాగా చెన్నై సూపర్‌కింగ్స్‌పై గెలుపుతో ఐపీఎల్-2022లో బోణీ కొట్టిన ఎస్ఆర్హెచ్.. గుజరాత్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపొంది రెండో విజయం అందుకుంది. సన్‌రైజర్స్ వర్సెస్ గుజరాత్ స్కోర్లు గుజరాత్ టైటాన్స్- 162/7 (20) సన్‌రైజర్స్ హైదాబాద్- 168/2 (19.1) చదవండి: IPL 2022: కెప్టెన్‌వి అని అహంకారమా? నీకసలు ఆ అర్హతే లేదు! మరీ ఇంత అతి పనికిరాదు! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సుందర్- ఎవిన్ లూయిస్ చిత్రమైన యుద్దం.. చివరికి
ఐపీఎల్ 2022లో భాగంగా ఎస్ఆర్హెచ్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఎస్ఆర్హెచ్ బౌలర్ వాషింగ్టన్ సుందర్, లక్నో బ్యాట్స్‌మన్ ఎవిన్ లూయిస్ మధ్య చిత్రమైన యుద్దం జరిగింది. టాస్ ఓడిన లక్నో బ్యాటింగ్‌కు దిగింది. ఎస్ఆర్హెచ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే స్పిన్నర్ సుందర్‌ను బరిలోకి దించాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ సుందర్ లక్నోకు ఆదిలోనే షాక్ ఇచ్చాడు. ఒక్క పరుగు చేసిన డికాక్‌ను క్యాచ్ ఔట్ చేశాడు. ఈ దశలో క్రీజులోకి ఎవిన్ లూయిస్ వచ్చాడు. స్పిన్‌ను సరిగా ఆడడనే అపవాదు లూయిస్‌కు ఉంది. దానికి అనుగుణంగానే సుందర్ లూయిస్‌ను ముప్పతిప్పలు పెట్టాడు. సుందర్ తన తొలి స్పెల్‌లో మూడు బంతులను ఒకే రకంగా వేశాడు. ఎవిన్ లూయిస్ స్వీప్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. తొలిసారి బంతి ప్యాడ్లను తాకడంతో సుందర్ అప్పీల్ చేశాడు. అంపైర్ నాటౌట్ ఇవ్వడంతో ఎస్ఆర్హెచ్ రివ్యూకు వెళ్లింది. కానీ అల్ట్రా ఎడ్జ్‌లో లూయిస్ తొలిసారి బతికిపోయాడు. ఇక రెండోసారి దాదాపు అదే రకమైన బంతి రావడం.. ఈసారి కూడా లూయిస్ స్వీప్ షాట్ ఆడేందుకు యత్నించాడు. కానీ బంతి ప్యాడ్లను తాకి వెళ్లింది. సుందర్ అప్పీల్ చేసినప్పటికీ ఎస్ఆర్హెచ్ రివ్యూకు వెళ్లలేదు. ముచ్చటగా మూడోసారి మాత్రం సుందర్ పైచేయి సాధించాడు. స్వీప్ షాట్ ఆడే ప్రయత్నంలో లూయిస్ ప్యాడ్లను బంతి తాకింది. ఈసారి మాత్రం ఔట్ అన్న కాన్ఫిడెంట్‌తో సుందర్ గట్టిగా అప్పీల్ చేశాడు. అంపైర్ కూడా తన వేలును పైకెత్తి ఔట్ సింబల్ చూపించాడు. అలా ఎట్టకేలకు సుందర్ మూడోసారి లూయిస్‌పై గెలిచాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: IPL 2022: ఆ ఆటగాడిని వెనక్కి పిలవండి.. లేదంటే సీఎస్కే పని అంతే! సుందర్-ఎవిన్ లూయిస్ వీడియో కోసం క్లిక్ చేయండి -
వికెట్ల కోసం కాకుండా నో బాల్స్‌కు పోటీ పడ్డారు.. ఎంతైనా ఎస్ఆర్హెచ్ కదా
ఐపీఎల్ 2022లో భాగంగా ఎస్ఆర్హెచ్, రాజస్తాన్ రాయల్స్ మధ్య మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ ఆరంభం నుంచి ఎస్ఆర్హెచ్ బౌలర్లు నో బాల్స్ కోసం పోటీ పడుతున్నారు. ఎక్కడైనా బౌలర్ వికెట్లు తీస్తే ఆనందిస్తారు.. కానీ ఎస్ఆర్హెచ్ తాము స్పెషల్‌గా ఉండాలని అనుకుందేమో. భువనేశ్వర్‌తో మొదలుపెడితే.. ఉమ్రాన్ మాలిక్, వాషింగ్టన్ సుందర్‌లు తమ మొదటి ఓవర్లోనే నో బాల్స్ వేశారు. ఇందులో భువనేశ్వర్ నోబాల్‌తో వికెట్ తీసే అవకాశాన్ని కోల్పోయాడు. దీంతో లైఫ్ పొందిన బట్లర్ బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించాడు. ఇక మిగతా ఇద్దరు దారాళంగా పరుగులు ఇచ్చుకున్నారు. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ చూసిన క్రికెట్ ఫ్యాన్స్.. ఎక్కడైనా బౌలర్స్ వికెట్ల కోసం పోటీ పడతారు.. కానీ ఇక్కడ మాత్రం నోబాల్స్ కోసం తపిస్తున్నారు.. ఎంతైనా ఎస్ఆర్హెచ్ కదా ఆ మాత్రం ఉంటుంది అని కామెంట్ చేశారు. దీంతో ఎస్ఆర్హెచ్ నో బాల్స్ గోల సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: IPL 2022: స్పెషల్ బంతితో మెరిశాడు.. ప్రతీసారి జరగాలని రాసిపెట్టి ఉండదు! -
IPL 2022: ‘కతౌట్ చూసి కొన్ని కొన్ని నమేయాలి దూడ్’.. ఇదే రా మావా అరాచకం అంటే!
SRH Players Delivers Mirchi Telugu Dialogue Video: ఐపీఎల్-2022 సమరానికి సమయం ఆసన్నమైంది. మార్చి 26 నుంచి క్యాష్ రిచ్‌లీగ్‌కు తెరలేవనుంది. ఈ క్రమంలో ఇప్పటికే 10 జట్ల ఆటగాళ్లు ప్రాక్టీసు మొదలుపెట్టాయి. ఇందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్రాంఛైజీలు అభిమానులతో టచ్‌లో ఉంటున్నాయి. అంతేగాక.. ఆటగాళ్ల మధ్య ఫన్నీ చాలెంజ్‌లు నిర్వహిస్తూ పోటీలు పెడుతున్నాయి. ఈ క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆరెంజ్ ఆర్మీని ఆకట్టుకునేందుకు తెలుగు సినిమాల డైలాగ్స్‌తో ముందుకు వచ్చింది. కాగా జట్టులో హైదరాబాదీ ఆటగాళ్లు లేకపోవడంతో ఇప్పటికే సన్‌రైజర్స్ విమర్శలు మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. రెండో చెన్నై జట్టు కొంతమంది ఘాటు కామెంట్లు చేశారూ కూడా! ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ టాలీవుడ్ టాప్ హీరోల సినిమాల్లోని పాటలకు తమ ఆటగాళ్లతో స్టెప్పులు వేయిస్తూ.. డైలాగ్స్ చెప్పిస్తూ వరుస పోస్టులు చేయడం గమనార్హం. ఇప్పటికే అభిషేక్ శర్మ సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘కళావతి’ పాటకు కాలుకదపగా.. కెప్టెన్ కేన్ మామ(కేన్ విలియమ్సన్) సహా పలువురు ఆటగాళ్లు ‘పుష్ప’ తగ్గేదేలే డైలాగ్ చెప్పి ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ మిర్చీ సినిమా డైలాగ్‌తో ముందుకు వచ్చారు మరికొంత మంది సన్‌రైజర్స్ ప్లేయర్లు. పంచ్ ఫలక్నామా చాలెంజ్‌లో భాగంగా ఈ మూవీలోని ఫేమస్ డైలాగ్ ‘కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్’ అంటూ అదరగొట్టారు. ఉమ్రాన్‌మాలిక్ , శ్రేయస్ గోపాల్, వాషింగ్టన్ సుందర్, సౌరభ్ దూబే, రొమారియో షెఫర్డ్, నికోలస్ పూరన్ ఈ చాలెంజ్‌లో పాల్గొన్నారు. ఇక ఆఖర్లో పూరన్.. ‘‘కతౌట్ చూసి కొన్ని కొన్ని నమేయాలి దూడ్..’’ అంటూ తనదైన శైలిలో డైలాగ్ చెప్పడం అభిమానులను ఆకట్టుకుంటోంది. ‘ఇదే రా మావా అరాచకం అంటే’ అంటూ సరదాగా మీమ్స్ షేర్ చేస్తున్నారు. చదవండి: IPL 2022: మంబై ఇండియన్స్ ఓపెనర్ ఎవరో చెప్పేసిన రోహిత్ శర్మ #OrangeArmy, which team had the most #Mirchi in their dialogue?#OrangeQuaralympics #ReadyToRise #TATAIPL pic.twitter.com/PLfGEeVUAz — SunRisers Hyderabad (@SunRisers) March 24, 2022 pic.twitter.com/FLHqUtg18A — RAJ (@Raj__Prabhas) March 24, 2022 -
IPL 2022: సన్‌రైజర్స్ ఆల్‌రౌండర్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పిన నేచురల్ స్టార్ నాని
ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభానికి మరో వారం రోజుల సమయం మాత్రమే మిగిలుండటంతో అన్ని జట్లలోని ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో బిజీ అయిపోగా, ఆయా ఫ్రాంచైజీలు సోషల్ మీడియా ప్రమోషన్స్‌తో హడావుడి షురూ చేశాయి. ఈ క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఫ్యాన్స్‌తో అనునిత్యం టచ్‌లోనే ఉంటుంది. తాజాగా ఎస్ఆర్హెచ్.. ప్రముఖ టాలీవుడ్ హీరో, నేచురల్ స్టార్ నానిని, తమ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌తో లింక్ చేస్తూ ట్విటర్లో ఓ పోస్ట్ చేసింది. Ante aa Sundaram June lo vastadu, ee Sundar training kuda start chesadu. 💪#OrangeArmy #ReadyToRise #TATAIPL pic.twitter.com/dxHrqIRswB — SunRisers Hyderabad (@SunRisers) March 18, 2022 నాని హీరోగా నటించిన ‘అంటే సుందరానికి’ సినిమా జూన్ 10న విడుదల కానున్నట్లు నిర్మాతలు ప్రకటించిన నేపథ్యంలో.. ‘అంటే ఆ సుందరం జూన్‌లో వస్తాడు, ఈ సుందర్ ఆల్రెడీ ట్రైనింగ్ స్టార్ట్ చేశాడు..’ అని సన్‌రైజర్స్ ట్వీట్ చేసింది. ఇందుకు నేచురల్ స్టార్ నాని స్పందించాడు. ‘ఆల్ ది బెస్ట్ సుందర్, ఫ్రం సుందర్..’ అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. వాషింగ్టన్ సుందర్ కూడా ఈ ట్వీట్‌కు స్పందిస్తూ ‘వచ్చాను గయ్స్’ అంటూ ట్వీటాడు. ఈ సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. All the best sundar 👍🏼 From Sundar :) https://t.co/ht6yD6qRup — Nani (@NameisNani) March 18, 2022 ఇదిలా ఉంటే, ఇటీవల ముగిసిన ఐపీఎల్ మెగా వేలంలో సన్‌రైజర్స్.. వాషింగ్టన్ సుందర్‌ను ఏకంగా రూ.8.75 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. గత సీజన్ వరకు ఆర్సీబీకి ఆడిన సుందర్‌ను ఎస్ఆర్హెచ్ యాజమాన్యం వేలంలో పట్టుబట్టి మరీ సొంతం చేసుకుంది. కాగా, మార్చి 26 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 15వ సీజన్లో సన్‌రైజర్స్.. తన తొలి మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ మార్చి 29వ తేదీన జరగనుంది. చెన్నై, కోల్‌కతా జట్ల మధ్య మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభంకానుంది. Vacchanu guys! 🧡 https://t.co/Bj6DA70NQV — Washington Sundar (@Sundarwashi5) March 18, 2022 చదవండి: కళావతి సాంగ్‌కు ఎస్ఆర్హెచ్ ఆటగాడి స్టెప్పులు.. నీకంత సీన్ లేదులే! అయినా -
సుందర్‌ది దురదృష్టమే.. కాకపోతే చెప్పండి
ఐదేళ్ల తర్వాత వెస్టిండీస్‌తో సిరీస్‌తో వన్డేల్లో రీ ఎంట్రీ ఇచ్చిన వాషింగ్టన్ సుందర్‌ను మరోసారి దురదృష్టం వెంటాడింది. కాకపోతే చెప్పండి.. వన్డే సిరీస్‌లో అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్‌లో మంచి ప్రదర్శన కనబరిచి అందరి దృష్టిని ఆకర్షించాడు. మూడు వన్డేల సిరీస్‌లో సుందర్ బ్యాటింగ్‌లో 67 పరుగులు.. బౌలింగ్‌లో 4 వికెట్లు తీశాడు. ముఖ్యంగా మూడో వన్డేలో 33 పరుగులు చేసిన సుందర్.. దీపక్ చహర్‌తో కలిసి ఏడో వికెట్‌కు 60 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడం విశేషం. సూపర్ రీ ఎంట్రీ మనం అనుకునే లోపు సుందర్ మరోసారి గాయం బారిన పడ్డాడు. చదవండి: Keegan Petersen: టీమిండియాపై దుమ్మురేపాడు.. ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’గా విషయంలోకి వెళితే.. కండరాల గాయంతో సుందర్వెస్టిండీస్తో టి20 సిరీస్‌కు దూరమయ్యాడు. విండీస్‌తో జరిగిన మూడో వన్డేలో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఎడమకాలు కండరాల గాయంతో బాధపడ్డాడు. రిపోర్ట్స్‌లో గాయం తీవ్రత గ్రేడ్-1 గా తేలడంతో సుందర్ టి20 సిరీస్‌కు దూరమయ్యాడు. ఫిబ్రవరి 15(మంగళవారం) సుందర్ ఎన్సీఏ అకాడమీలో రిపోర్ట్ చేయనున్నాడు. మూడువారాల పాటు సుందర్ రీహాబిటేషన్‌లో ఉండనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. కాగా సుందర్ స్థానంలో లెగ్స్పన్నర్ కుల్దీప్ యాదవ్‌ను ఎంపిక చేసినట్లు తెలిపింది. ఇప్పటికే గాయంతో కేఎల్ రాహుల్, రీహాబిటేషన్ పేరుతో అక్షర్ పటేల్‌లు టి20 సిరీస్‌కు దూరమవ్వగా.. తాజాగా సుందర్ కూడా ఆ జాబితాలో చేరాడు. కాగా కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ స్థానాల్లో దీపక్ హుడా, రుతురాజ్‌లను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఇక ఫిబ్రవరి 16,18,20వ తేదీల్లో విండీస్‌తో టీమిండియా మూడు టి20 మ్యాచ్‌లు ఆడనుంది. కాగా ఐపీఎల్ మెగావేలంలో వాష్టింగ్టన్ సుందర్‌ను రూ. 8.75 కోట్లకు ఎస్ఆర్హెచ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. చదవండి: IND vs WI: విరాట్ కోహ్లిని ఊరిస్తున్న ప్రపంచ రికార్డు.. తొలి ఆటగాడిగా! విండీస్‌తో టి20 సిరీస్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్య కుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్-కీపర్), వెంకటేష్ అయ్యర్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, యజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, హర్షల్ పటేల్, రుతురాజ్ గైక్వాడ్, దీపక్ హుడా -
IPL 2022 Auction Day 1: పూరన్, సుందర్‌కు జాక్‌పాట్.. హైదరాబాద్ ప్లేయర్స్ వీళ్లే!
ఐపీఎల్ మెగా వేలం- 2022 తొలి రోజు సన్‌రైజర్స్ హైదరాబాద్ 10 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. అత్యధికంగా వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్‌కు 10 కోట్ల 75 లక్షలు చెల్లించింది. అదే విధంగా టీమిండియా యువ ఆటగాడు వాషింగ్టన్ సుందర్‌ను సొంతం చేసుకుంది. అతడి కోసం రూ. 8 కోట్ల 75 లక్షలు ఖర్చు చేసింది. ఇంకా పర్సులో 20.15 కోట్లు మిగిలి ఉన్నాయి. 10 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. విదేశీ ఆటగాళ్ల కోటాలో 6 స్థానాలు మిగిలి ఉన్నాయి. కాగా సన్‌రైజర్స్ రిటెన్షన్‌లో భాగంగా కేన్ విలియమ్సన్ (రూ. 14 కోట్లు), అబ్దుల్ సమద్ (అన్క్యాప్డ్ – రూ. 4 కోట్లు), ఉమ్రాన్ మలిక్ (అన్క్యాప్డ్ – రూ. 4 కోట్లు)ను అట్టిపెట్టుకున్న సంగతి తెలిసిందే. తొలి రోజు వేలంలో ఎస్ఆర్హెచ్ కొన్న ఆటగాళ్లు ఎవరంటే... ►నికోలస్ పూరన్- రూ. 10 కోట్ల 75 లక్షలు ►వాషింగ్టన్ సుందర్- రూ. 8 కోట్ల 75 లక్షలు ►రాహుల్ త్రిపాఠి- రూ. 8 కోట్ల 50 లక్షలు ►అభిషేక్ శర్మ - రూ. 6 కోట్ల 50 లక్షలు ►భువనేశ్వర్ కుమార్ - రూ. 4 కోట్ల 20 లక్షలు ►టి. నటరాజన్ - రూ. 4 కోట్లు ►కార్తీక్ త్యాగి - రూ. 4 కోట్లు ►శ్రేయస్ గోపాల్- రూ. 75 లక్షలు ►ప్రియమ్ గార్గ్ - రూ. 20 లక్షలు ►జగదీశ్ సుచిత్- రూ. 20 లక్షలు చదవండి: IPL 2022 Auction: సురేశ్ రైనా, స్మిత్, షకీబ్‌కు భారీ షాక్.. ఎందుకిలా? Here's looking forward to more Garg-eous shots from @priyamg03149099 #OrangeArmy #ReadyToRise #IPLAuction pic.twitter.com/1lr8YZVuAd — SunRisers Hyderabad (@SunRisers) February 12, 2022 And we are glad to see you back in orange, @Suchithj27 🧡#OrangeArmy #ReadyToRise #IPLAuction pic.twitter.com/43XV5musHA — SunRisers Hyderabad (@SunRisers) February 12, 2022 #OrangeArmy, new #Riser @ShreyasGopal19 has a special message for you 🧡#ReadyToRise #IPLAuction pic.twitter.com/Nqsdki8HHL — SunRisers Hyderabad (@SunRisers) February 12, 2022 -
సుందర్‌కు ఎస్ఆర్హెచ్ జాక్‌పాట్
టీమిండియా యువ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్‌కు జాక్‌పాట్ తగిలింది. మెగావేలానికి ముందు మంచి ధర పలికే అవకాశం ఉన్న ఆటగాళ్లలో వాషింగ్టన్ సుందర్ కూడా ఒకడు. బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్న సుందర్‌ను ఎస్ఆర్హెచ్ రికార్డు స్థాయి ధరకు సొంతం చేసుకుంది. కనీస ధర రూ. 1.50 కోట్లతో సుందర్ వేలానికి రాగా.. రూ. 8.75 కోట్లకు అమ్ముడయ్యాడు. కాగా గత సీజన్లో సుందర్ ఆర్సీబీ తరపున ప్రాతినిధ్యం వహించాడు. ఆర్సీబీ తరపున రూ. 3.25 కోట్లతో ఉన్న సుందర్‌కు ఈసారి రూ. 5 కోట్లు ఎక్కువగా రావడం జాక్‌పాట్ అనే చెప్పొచ్చు. ఇప్పటివరకు సుందర్ ఐపీఎల్లో 42 మ్యాచ్‌లాడి 217 పరుగులతో పాటు 27 వికెట్లు తీశాడు. కాగా సుందర్ ఇటీవలే వెస్టిండీస్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో మంచి ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. Congratulations @SunRisers - Say hello to @Sundarwashi5 👌👏#TATAIPLAuction @TataCompanies pic.twitter.com/QQ2Y7uFqNA — IndianPremierLeague (@IPL) February 12, 2022 -
ఐదేళ్ల తర్వాత రీఎంట్రీ.. గోడకు కొట్టిన బంతిలా
ఒక క్రికెటర్ ఐదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్నాడంటే అతనిపై ఎంతో ఒత్తిడి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఆ క్రికెటర్ పేరు కూడా మరిచిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ ఐదేళ్లలో ఎన్నో మార్పులొచ్చి ఉంటాయి. అతని స్థానంలో ఎంతో మంది కొత్త క్రికెటర్లు వచ్చారు. కొందరు రాణిస్తే.. ఇంకొందరు కేవలం ఒక్క మ్యాచ్‌కే పరిమితమయిన వాళ్లుంటారు. అలాంటి స్థితిలో అతని ఎంట్రీ గొప్పగా జరిగితే అంతకుమంచి ఏం కావాలి చెప్పండి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న అతని పేరు వాషింగ్టన్ సుందర్. చదవండి: Mohammad Siraj: 'ఏంటో సిరాజ్.. నీ సెలబ్రేషన్స్‌తో భయపెడుతున్నావు' వెస్టిండీస్‌తో తొలి వన్డే ద్వారా సుందర్ ఐదేళ్ల తర్వాత మళ్లీ వన్డేల్లో రీఎంట్రీ ఇచ్చాడు. సుందర్ టీమిండియా తరపున 2017లోనే తొలి వన్డే ఆడాడు. అప్పుడు శ్రీలంకతో ఆడిన వన్డే అతనికి మొదటిది.. చివరిది కావడం విశేషం. ఈ ఐదేళ్లలో మళ్లీ వన్డే మ్యాచ్ ఆడని సుందర్‌కు వెస్టిండీస్‌తో వన్డే మ్యాచ్ రెండోది మాత్రమే. తరచూ గాయాలు బారిన పడడం.. ఫిట్నెస్ సమస్యలు సుందర్‌ను చుట్టు ముట్టాయి. అయితే తాజాగా రీఎంట్రీ ఇచ్చిన సుందర్ గోడకు కొట్టిన బంతిలా తయారయ్యాడు. తన బౌలింగ్ పవర్‌తోనే తానెంటో నిరూపించుకున్నాడు. సుందర్‌ను నమ్మిన రోహిత్ పవర్ ప్లేలో అతని చేతికి బంతిని ఇచ్చాడు. సుందర్ తన కెప్టెన్ నమ్మకాన్ని నిజం చేస్తే ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే వికెట్ తీశాడు. బ్రాండన్ కింగ్‌ను తెలివైన బంతితో బోల్తా కొట్టించాడు. అదే ఓవర్ చివరి బంతికి డారెన్ బ్రావోను ఎల్బీగా వెనక్కి పంపాడు. అయితే తొలుత అంపైర్ ఔట్ ఇవ్వకపోవడం.. రోహిత్ శర్మ రివ్య్వూకు వెళ్లడం.. ఫలితం సుందర్ ఖాతాలో రెండో వికెట్ పడింది. ఇక మ్యాచ్‌లో ఓవరాల్‌గా 9 ఓవర్లు వేసి 30 పరుగులిచ్చి 3 వికెట్లు తీసిన వాషింగ్టన్ సుందర్‌ది ఘనమైన పునరాగమనం అనే చెప్పొచ్చు. ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ భారత బౌలర్ల దాటికి 43.5 ఓవర్లలో 176 పరుగులకు ఆలౌటైంది. జాసన్ హోల్డర్ 57 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చదవండి: IPL 2022: ఆర్సీబీకి ఎంపికైన కొత్తలో జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకున్న కోహ్లి.. అయితే ఇదే వాషింగ్టన్ సుందర్‌కు టెస్టు అరంగేట్రం ఎవరు ఊహించని విధంగా జరిగింది. 2020-21 ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన టీమిండియాకు సుందర్ నెట్ బౌలర్‌గా ఎంపికయ్యాడు. ప్రధాన బౌలర్లంతా గాయపడడంతో గబ్బా వేదికగా జరిగిన చివరి టెస్టు ద్వారా సుందర్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్‌ను ఔట్ చేయడం ద్వారా తొలి వికెట్ సాధించాడు. అయితే బ్యాటింగ్ సందర్భంగా టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో టాపార్డర్, మిడిలార్డర్ విఫలమైనప్పుడు సుందర్.. శార్దూల్ ఠాకూర్‌తో కలిసి ఆడిన ఇన్నింగ్స్ చరిత్రలో నిలిచిపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో అర్థసెంచరీతో పాటు శార్దూల్‌తో కలసి ఏడో వికెట్‌కు 127 పరుగులు జోడించడం హైలెట్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా లక్ష్యచేధనలో విజృంభించి మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను కైవసం చేసుకుంది. అలా సుందర్.. గబ్బా మైదానంలో ఓటమి ఎరుగని ఆస్ట్రేలియాను చిత్తు చేసి టీమిండియా సాధించిన విజయం వెనుక సుందర్ పాత్ర మరువలేం. ఓవరాల్‌గా 4 టెస్టులు ఆడిన సుందర్ 265 పరుగులు చేయడంతో పాటు 6 వికెట్లు తీశాడు. చదవండి: మనోడు ఎన్నాళ్లకెన్నాళ్లకు..ఒకే ఒక్కడిగా రికార్డు! -
టీమిండియా ఆల్‌రౌండర్‌కు బంఫర్ ఆఫర్.. ఐదేళ్ల తర్వాత!
SA vs IND: టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలో దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్‌కు సుందర్ దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో మరో ఆల్‌రౌండర్ జయంత్ యాదవ్‌ను సుందర్‌కి బ్యాకప్‌గా ఉంచునున్నట్లు తెలుస్తోంది. కాగా దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు జయంత్ యాదవ్ ఎంపికైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడు భారత జట్టుతోనే ఉన్నాడు. కానీ ఇప్పటివరకు అతడు కేవలం బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఒకవేళ వన్డేలకు సుందర్ దూరమైతే మరోసారి జయంత్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. కాగా 2016లో న్యూజిలాండ్‌పై వన్డేల్లో అరంగేట్రం చేసిన జయంత్ యాదవ్.. ఇప్పటి వరకు ఒకే ఒక వన్డే మ్యాచ్ ఆడాడు. తన అరంగేట్ర మ్యాచ్‌లో ఒకే ఒక వికెట్ పడగొట్టాడు. టీమిండియా స్పిన్నర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ గాయం కారణంగా దక్షిణాఫ్రికా దూరం కావడంతో జయంత్‌కు తుది జట్టులో చోటు దక్కడం ఖాయం అనిపిస్తోంది. ఇక భారత్- దక్షిణాఫ్రికా మధ్య తొలి వన్డే జనవరి 19 న జరగనుంది. అదే విధంగా టీమిడియా పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా దూరం కావడంతో కేఎల్ రాహుల్ వన్డేలకు సారథ్యం వహించనున్నాడు. చదవండి: WTC 2021-23 Points Table: టాప్-3 లో పాకిస్తాన్.. టీమిండియా ఎన్నో స్థానంలో ఉందంటే! -
టీమిండియాకు భారీ షాక్.. జట్టు సభ్యుడికి కరోనా
Washington Sunder Tested Covid Positive: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మూడు వన్డేల సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టు సభ్యుడు వాషింగ్టన్ సుందర్ కరోనా బారిన పడ్డాడు. దీంతో అతను వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండడం అనుమానంగా మారింది. ఈ నెల 19 నుంచి ప్రారంభంకానున్న వన్డే సిరీస్ కోసం భారత వన్డే జట్టు రేపు కేప్‌టౌన్ విమానం ఎక్కాల్సి ఉండగా సుందర్ కోవిడ్ బారిన పడినట్లు తెలిసింది. గాయం కారణంగా గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉన్న సుందర్.. ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలో రాణించి వన్డే జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇదిలా ఉంటే, దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా జనవరి 19న తొలి వన్డే, 21న రెండోది, జనవరి 23న మూడో వన్డే ఆడనుంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీలో వన్డే సిరీస్‌కు కేఎల్ రాహుల్ సారధిగా వ్యవహరించనున్నాడు. చదవండి: ఐపీఎల్ 2022లో కీలక మార్పు.. టైటిల్ స్పాన్సర్ షిప్ నుంచి తప్పుకున్న వివో -
'సూపర్' వాషింగ్టన్ సుందర్.. ఫైనల్‌కు తమిళనాడు
Tamil Nadu Enters Final Beating Saurashtra In Semi Final-2.. విజయ్ హజారే ట్రోఫీ 2021లో తమిళనాడు ఫైనల్‌కు చేరింది. సౌరాష్ట్రతో జరిగిన సెమీఫైనల్-2 మ్యాచ్‌లో తమిళనాడు 2 వికెట్లతో విజయాన్ని అందుకుంది. 314 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన తమిళనాడు ఇన్నింగ్ ఆఖరి బంతికి 8 వికెట్లు కోల్పోయి చేధించింది. తమిళనాడు బ్యాటింగ్‌లో ఓపెనర్ బాబా అపరాజిత్(122 పరుగులు) సెంచరీతో మెరవగా.. ఆఖర్లో వాషింగ్టన్ సుందర్ (61 బంతుల్లో 70, 8 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడి విజయంలో కీలకపాత్ర పోషించాడు. సౌరాష్ట్ర బౌలర్లలో చేతన్ సకారియా 5 వికెట్లు తీశాడు. చదవండి: ఆరోన్ ఫించ్ సరికొత్త రికార్డు.. టి20 చరిత్రలో ఆరో బ్యాటర్‌గా ఆఖరివరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. వికెట్ కీపన్ షెల్డన్ జాక్సన్(125 బంతుల్లో 134 పరుగులు, 11 ఫోర్లు, సిక్సర్లు) చెలరేగగా.. వసవదా 57, ప్రేరక్ మన్కడ్ 37 పరుగులు చేశారు. తమిళనాడు బౌలర్లలో విజయ్ శంకర్ 4, సిలింబరాసన్ 3 వికెట్లు తీశారు. ఇక హిమాచల్ ప్రదేశ్, సర్వీసెస్ మధ్య జరిగిన మొదటి సెమీఫైనల్లో హిమాచల్ ప్రదేశ్ 77 పరుగులతో విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది. డిసెంబర్ 26న జరగనున్న ఫైనల్లో హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు అమీతుమీ తేల్చుకోనున్నాయి. చదవండి: Harbhajan Singh Retirement: రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా స్టార్ స్పిన్నర్ -
దక్షిణాఫ్రికా పర్యటనకు అతన్ని ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యపరిచింది..
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపికైన భారత టెస్ట్ జట్టును ఉద్ధేశించి మాజీ టీమిండియా ఓపెనర్, వివాదాస్పద వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మూడు టెస్ట్‌ల సిరీస్ నిమిత్తం సెలక్టర్లు ఎంపిక చేసిన 18 మంది సభ్యుల భారత బృందంలో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ పేరులో లేకపోవడం ఆశ్చర్యపరిచిందని పేర్కొన్నాడు. గాయాలపాలైన ఇద్దరు స్పిన్నర్లను(రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్) పక్కకు పెట్టిన సెలక్టర్లు.. వారిద్దరి స్థానాలను భర్తీ చేయాల్సి ఉన్నప్పటికీ.. కేవలం జయంత్ యాదవ్‌ను మాత్రమే ఎంపిక చేయడం సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డాడు. గాయం బారిన పడక ముందు సుందర్ టీమిండియా రెగ్యులర్ సభ్యుడని.. ప్రస్తుతం అతను గాయం నుంచి కోలుకుని ఫిట్‌గా ఉన్నప్పటికీ సెలక్టర్లు అతన్ని పరిగణలోకి తీసుకోకపోవడం విడ్డూరంగా అనిపించిందని అన్నాడు. ఈ విషయమై సెలక్టర్లు వివరణ ఇవ్వాల్సి ఉందని డిమాండ్ చేశాడు. దక్షిణాఫ్రికాలో పరిస్థితుల దృష్ట్యా లెగ్ స్పిన్నర్‌ను ఎంపిక చేసే అవకాశం లేదని.. అలాగని కుల్దీప్ యాదవ్‌ను జట్టులోకి తీసుకోలేరని.. ఇలాంటి పరిస్థితుల్లో సుందర్‌కు కచ్చితంగా జట్టులో చోటు కల్పించాల్సి ఉండిందని అభిప్రాయపడ్డాడు. జయంత్ యాదవ్‌తో పోలిస్తే సుందర్‌కు బ్యాటింగ్‌లోనూ రాణించే సత్తా ఉంది కాబట్టి అతన్ని ఎంపిక చేసి ఉండడమే సరైన నిర్ణయమని అన్నాడు. కేవలం ముంబై టెస్ట్‌లో పర్వాలేదనిపించాడని జయంత్ యాదవ్‌ను ఎంపిక చేయడం ఏ మాత్రం సబబో చెప్పాలని సెలెక్టర్లను నిలదీశాడు. దక్షిణాఫ్రికాలో పరిస్థితుల దృష్ట్యా టీమిండియా ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్ల ఫార్ములాతో బరిలోకి దిగే అవకాశం ఉంది కాబట్టి మూడో స్పిన్నర్‌గా సుందర్‌ను ఎంపిక చేయాల్సి ఉండిందని అన్నాడు. కాగా, గాయానికి ముందు సుందర్ ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే. చదవండి: చరిత్ర సృష్టించిన షోయబ్ మాలిక్ మేనల్లుడు.. అరుదైన రికార్డు -
మళ్లీ తిరిగి జట్టులోకి దినేష్ కార్తీక్, వాషింగ్టన్ సుందర్
Tamil Nadu announce squad for Vijay Hazare Trophy Dinesh Karthik Washington Sundar return: త్వరలో జరగనున్న విజయ్ హజారే ట్రోఫి కోసం తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ 20 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది. ఇక వెటరన్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్, ఆల్-రౌండర్ వాషింగ్టన్ సుందర్ తిరిగి జట్టులోకి పునరాగమనం చేశారు. కాగా జూన్‌లో ఇంగ్లండ్‌కు పర్యటనకు ఎంపికైన వాషింగ్టన్ సుందర్.. చేతి వేలి గాయంతో మొదటి టెస్టుకు ముందు జట్టునుంచి తప్పుకున్నాడు. చదవండి: IND-A Vs SA-A: తొలి రోజు భారత్‌పై చెలరేగి ఆడిన దక్షిణాఫ్రికా... ఇక ఇటీవల ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫిలో కూడా ఈ ఇద్దరు ఆటగాళ్లు పాల్గొనలేదు. అయినప్పటికీ కర్ణాటకపై ఫైనల్లో విజయం సాధించి ట్రోఫీను తమిళనాడు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా విజయ్ హజారే ట్రోఫి డిసెంబర్ 8 నుంచి ప్రారంభకానుంది. తమిళనాడు జట్టు: విజయ్ శంకర్ (కెప్టెన్), ఎన్ జగదీశన్, దినేష్ కార్తీక్, సి హరి నిశాంత్, ఎం షారుక్ ఖాన్, ఆర్ సాయి కిషోర్, ఎం అశ్విన్, సందీప్ వారియర్, ఎంఎస్ వాషింగ్టన్ సుందర్, ఎం సిద్ధార్థ్, బి సాయి సుదర్శన్, వి గంగా శ్రీధర్ రాజు, ఎం మహమ్మద్, జె కౌసిక్, పి శరవణ కుమార్, ఎల్ సూర్యప్రకాష్, బి ఇంద్రజిత్, ఆర్ సంజయ్ యాదవ్, ఎం కౌశిక్ గాంధీ, ఆర్ సిలంబరసన్. చదవండి: ఐపీఎల్-2022 షెడ్యూల్ ఫిక్స్.. ఆ రెండు జట్ల మధ్యే తొలి మ్యాచ్! -
అతని గాయమే అశ్విన్‌కు కలిసొచ్చింది: చీఫ్ సెలెక్టర్
ముంబై: ఐపీఎల్లో రాణించడంతో పాటు యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయపడటంతో వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కిందని భారత చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ తెలిపాడు. సుందర్ గాయపడటంతో ఆఫ్ స్పిన్నర్ కొరత ఏర్పడిందని, దాంతో అశ్విన్‌ను తీసుకోవడం అనివార్యమైందని పేర్కొన్నాడు. అశ్విన్ లాంటి అనుభవజ్ఞుడు జట్టుకు అవసరమని తెలిపిన చేతన్ శర్మ.. అతను జట్టుకు పెద్ద ఆస్తి అని పేర్కొన్నాడు. కాగా, అశ్విన్ 2017 జూలైలో వెస్టిండీస్‌తో తన చివరి టీ20 మ్యాచ్ ఆడాడు. గత నాలుగేళ్లుగా అతను పూర్తిగా టెస్టులకే పరిమితమయ్యాడు. అయితే ఐపీఎల్లో అతని నిలకడైన ప్రదర్శన సెలక్టర్లు టీ20ల విషయంలో పునరాలోచించేలా చేసింది. గతేడాది ఐపీఎల్లో 7.66 ఎకానమీతో 13 వికెట్లు తీసిన యాష్.. ఢిల్లీ తొలిసారి ఫైనల్‌కు చేరడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక ఈ ఏడాది తొలిదశ ఐపీఎల్లో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడిన యాష్.. కరోనా నేపథ్యంలో కుటుంబంతో కలిసుండాలని లీగ్ నుంచి తప్పుకున్నాడు. మరోవైపు అశ్విన్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ప్రస్తుత సీజన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ జట్టు 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 2 పరాజయాలతో 12 పాయింట్లు సాధించింది. ఇదిలా ఉంటే, అక్టోబర్ 17న ప్రారంభమయ్యే ఈ మెగాటోర్నీ కోసం భారత సెలెక్షన్ కమిటీ బుధవారం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జట్టుకు విరాట్ కోహ్లి కెప్టెన్‌గా ఎంపిక కాగా, రోహిత్ శర్మ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. 2007లో కెప్టెన్‌గా జట్టుకు తొలి టీ20 ప్రపంచకప్ అందించిన ధోనిని ఈ ప్రపంచకప్‌లో టీమిండియా మెంటర్‌గా బీసీసీఐ నియమించింది. భారత టీ20 ప్రపంచకప్ జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(వికెట్‌కీపర్), ఇషాన్ కిషన్(వికెట్‌కీపర్), హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ స్టాండ్ బై ప్లేయర్స్: శ్రేయస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చహార్ చదవండి: అదే జరిగితే చారిత్రక సిరీస్ రద్దు.. తాలిబన్లకు క్రికెట్ ఆస్ట్రేలియా బెదిరింపులు -
IPL 2021: ఆర్సీబీకి షాక్.. గాయంతో స్టార్ ఆల్‌రౌండర్ ఔట్
దుబాయ్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్.. చేతి వేలికి గాయం కారణంగా ఐపీఎల్-2021 మలి దశ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఆర్సీబీ కీలక ఆటగాళ్లలో ఒకడైన సుందర్ సీజన్ మొత్తానికి దూరం కావడంతో ఆ జట్టుపై ప్రభావం పడనుంది. సుందర్ స్థానంలో బెంగాల్ బౌలర్ అకాశ్‌దీప్‌కు ఆర్సీబీ యాజమాన్యం అవకాశం ఇచ్చింది. ప్రస్తుతం ఆకాశ్‌దీప్ ఆర్సీబీ క్యాంప్‌లో నెట్ బౌలర్‌గా ఉన్నాడు. కాగా, సుందర్ ఇదే చేతి వేలి గాయం కారణంగా ఇంగ్లండ్ పర్యటన నుంచి అర్ధంతరంగా వైదొలిగిన సంగతి తెలిసిందే. 🔊 ANNOUNCEMENT 🔊 Washington Sundar has been ruled out of the remainder of #IPL2021 as he hasn’t fully recovered from his finger injury. Akash Deep, a state cricketer from Bengal who until now was a net bowler with RCB, has been named as Washi’s replacement. #PlayBold pic.twitter.com/azaMgkaDZp — Royal Challengers Bangalore (@RCBTweets) August 30, 2021 ఇదిలా ఉంటే, యూఏఈ వేదికగా ఐపీఎల్ మలి దశ మ్యాచ్‌లు సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే కొన్ని జట్లు దుబయ్ చేరుకుని ప్రాక్టీస్‌లో నిమగ్నమై ఉన్నాయి. ఆర్సీబీ జట్టు యూఏఈకి ఇంకా బయల్దేరాల్సి ఉంది. ఆర్సీబీ రెండో దశ షెడ్యూల్లో సెప్టెంబర్ 20న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తమ తొలి మ్యాచ్ ఆడాల్సి ఉంది. చదవండి: చెలరేగిన యశస్వి జైస్వాల్.. ఓమన్‌పై ముంబై విజయం -
సెహ్వాగ్ టీ20 జట్టు.. ఆ యువ ఆల్‌రౌండర్‌కు అనూహ్యంగా చోటు
న్యూఢిల్లీ: యూఏఈ వేదికగా ఈ ఏడాది చివర్లో జరగబోయే టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని ఆయా జట్లు తుది జట్టు ఆటగాళ్ల ఎంపికపై కసరత్తు ప్రారంభించాయి. మరోవైపు విశ్లేషకులు, మాజీలు సైతం తుది జట్టులో ఉండబోయే ఆటగాళ్లపై తమతమ అంచనాలను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సైతం ప్రపంచకప్ బరిలో దిగే భారత తుది జట్టును అంచనా వేశాడు. శ్రీలంక పర్యటనలో దుమ్మురేపుతున్న సూర్యకుమార్ యాదవ్‌కు చోటు కల్పించిన వీరూ.. సీనియర్ పేసర్ మహమ్మద్ షమీతో పాటు స్టార్ ఓపెనర్ శిఖర్ ధవన్, శ్రేయస్ అయ్యర్‌లను విస్మరించాడు. తన జట్టులో ఓపెనర్లుగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను ఎంపిక చేసిన వీరేంద్రుడు.. వన్ డౌన్ బ్యాట్స్‌మెన్‌గా కేఎల్ రాహుల్‌కు అవకాశమిచ్చారు. నాలుగో స్థానంలో విధ్వంసకర వికెట్ కీపర్ రిషభ్ పంత్‌ను.. ఐదో స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌ను ఎంపిక చేశాడు. అయితే ఆల్‌రౌండర్ల ఎంపిక విషయంలో వీరూ తన వైవిధ్యాన్ని ప్రదర్శించాడు. ఈ కోటాలో హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలను స్థానం కల్పించిన ఆయన.. అనూహ్యంగా వాషింగ్టన్ సుందర్‌ను కూడా ఎంపిక చేశాడు. ఇటీవల కాలంలో హార్దిక్ పాండ్యా నిరాశపరుస్తున్నా.. అతని మ్యాచ్ విన్నింగ్ సామర్థ్యం కారణంగానే తుది జట్టులో చోటు దక్కించుకుంటాడని తెలిపాడు. ఇక జడ్డూ అసలుసిసలైన ఆల్‌రౌండరని, సుందర్ కారణంగా బౌలింగ్ డెప్త్ మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నాడు. కాగా, స్పెషెలిస్ట్ స్పిన్నర్ కోటాలో వీరూ.. కేవలం చహల్‌కు మాత్రమే చోటు దక్కుతుందన్నాడు. బుమ్రా, భువనేశ్వర్ కుమార్‌లు ప్రధాన పేసర్లుగా ఉంటారని అంచనా వేశాడు. ఇటీవలకాలంలో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్న దీపక్ చాహర్‌ను సైతం వీరేంద్రుడు విస్మరించడం విశేషం. సెహ్వాగ్ టీ20 ప్రపంచకప్ జట్టు: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ(కెప్టెన్), కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చహల్ -
కోహ్లీ సేనకు భారీ షాక్.. యువ ఆల్‌రౌండర్ దూరం..?
డర్హమ్: ఇంగ్లండ్ పర్యటనలో కోహ్లీ సేనను గాయాల బెడద వేధిస్తోంది. ఇప్పటికే ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కాలి గాయంతో సిరీస్ నుంచి అర్దంతరంగా వైదొలగగా, బుధవారం స్టాండ్ బై బౌలర్ ఆవేశ్ ఖాన్ తీవ్రంగా గాయపడ్డాడు. తాజాగా ఈ జాబితాలో యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా చేరాడు. టీమిండియాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో కౌంటీ సెలెక్ట్ ఎలెవెన్ తరఫున బరిలోకి దిగిన సుందర్.. గురువారం ఆటలో గాయపడినట్లు సమాచారం. అతని చేతి వేలికి గాయమైందని, అయితే గాయం తీవ్రతపై స్పష్టత లేదని, స్కానింగ్ తీసిన తర్వాతే గాయంపై క్లారిటీ వస్తుందని ప్రముఖ వార్తా సంస్థ పేర్కొంది. గాయంతో సుందర్ పడుతున్న ఇబ్బంది చూస్తే.. వేలు విరిగినట్లు అర్థమవుతుందని సదరు సంస్థ తెలిపింది. ఇదే జరిగితే ఇంగ్లండ్ టూర్ నుంచి ఈ యువ ఆల్‌రౌండర్ తప్పుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇదిలా ఉంటే, ఆగస్టు 4 నుంచి ఇంగ్లండ్‌తో ప్రారంభమయ్యే ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు సన్నాహకంగా కౌంటీ ఎలెవన్‌తో జరుగుతున్న మూడు రోజు వార్మప్ మ్యాచ్‌లో అవేశ్ ఖాన్‌తో పాటు వాషింగ్టన్ సుందర్ గాయపడ్డారు. ఈ మ్యాచ్‌లో కౌంటీ సెలెక్ట్ ఎలెవన్ తరఫున అవేశ్ ఖాన్, సందర్ బరిలోకి దిగారు. ఆ జట్టులోని ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడంతో ఈ ఇద్దరు బరిలోకి దిగాల్సి వచ్చింది. అయితే తొలి రోజు ఆటలో ఇన్నింగ్స్ 10వ ఓవర్‌ను అవేశ్ ఖాన్ బౌలింగ్ చేయగా.... విహారి కొట్టిన రిటర్న్ షాట్‌ను ఆపే ప్రయత్నంలో అతని ఎడమ చేతి బొటన వేలుకు గాయమైంది. స్కానింగ్‌లో అవేశ్ ఖాన్ వేలు విరిగినట్లు తేలింది. అతను కోలుకోవడానికి కనీసం నెల రోజులకు పైగా సమయం పడుతుందని బీసీసీఐ తెలిపింది. దీంతో అతని ఇంగ్లండ్ పర్యటన అర్థంతరంగా ముగిసింది. తాజాగా సుందర్ సైతం అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. కాగా, 24 మంది సభ్యుల జట్టులో ముగ్గురు ఆటగాళ్లు గాయాల బారిన పడటం కోహ్లీ సేనను కలవరపెడుతోంది. మరోవైపు శ్రీలంక పర్యటనలో ఉన్న పృథ్వీషా, దేవదత్ పడిక్కల్‌ను ఇంగ్లండ్‌కు పంపాలని కోహ్లీ సేన చేసిన విజ్ఞప్తిని సెలెక్టర్లు తిరస్కరించిన విషయం తెలిసిందే. -
వాషింగ్టన్ సుందర్‌తో గొడవకు దిగిన సిరాజ్
డర్హమ్: ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు ముందు కౌంటీ ఎలెవన్ జట్టుతో టీమిండియా వార్మప్ మ్యాచ్ ఆడుతున్న విషయం తెలిసిందే. మంగళవారం ప్రారంభం అయిన ఈ మూడు రోజుల మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. కేఎల్ రాహుల్(150 బంతుల్లో 101 రిటైర్డ్ ఔట్; 11 ఫోర్లు, సిక్స్), రవీంద్ర జడేజా (146 బంతుల్లో 75; 5 ఫోర్లు, సిక్స్) సెంచరీ, హాఫ్ సెంచరీలతో రాణించడంతో 311 పరుగల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. అనంతరం బుధవారం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన కౌంటీ ఎలెవన్ ఆది నుంచి తడబడుతూ ఉంది. ఈ మ్యాచ్‌లో ఇద్దరు భారత ఆటగాళ్లు(వాషింగ్టన్ సుందర్, ఆవేశ్ ఖాన్) ప్రత్యర్ధి జట్టు తరఫున బరిలోకి దిగారు. Mohammad Siraj exchanged a few words to Washington Sundar. pic.twitter.com/xC5EPuZeZI — Mufaddal Vohra (@mufaddal_vohra) July 21, 2021 ఈ క్రమంలో రెండో రోజు బ్యాటింగ్‌కు దిగిన వాషింగ్టన్ సుందర్(1)ను టీమిండియా బౌలర్ మహ్మద్ సిరాజ్ పెవిలియన్‌కు పంపాడు. అయితే అంతకు ముందు సిరాజ్.. సుందర్‌తో గొడవకు దిగాడు. వారి మధ్య చిన్నపాటి మాటల యుద్ధమే జరిగింది. అయితే సహచరులు సర్ధి చెప్పడంతో వారు మిన్నకుండిపోయారు. ఆ వెంటనే సిరాజ్ బౌలింగ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ క్యాచ్ అందుకోవడంతో సుందర్ మూడో వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు. అంతకుముందు ఓపెనర్ లిబ్బి (12)ని ఉమేశ్ యాదవ్, వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ రాబర్ట్ యేట్స్ (1)ను బుమ్రా పెవిలియన్‌కు పంపారు. అనంతరం కెప్టెన్ విల్ రోడ్స్(11) ఆచితూచి ఆడే ప్రయత్నం చేసినప్పటికీ ఉమేశ్ యాదవ్ అతన్ని క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీంతో కౌంటీ ఎలెవన్ జట్టు రెండో రోజు భోజన విరామ సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేసింది. క్రీజులో హసీబ్ హమీద్ (47), లిండన్ జేమ్స్(5) ఉన్నారు. టీమిండియా బౌలర్లు ఉమేశ్ యాదవ్ రెండు వికెట్లు తీయగా, బుమ్రా, సిరాజ్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, ఈ సన్నాహక మ్యాచ్‌కు కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్య రహానేతో పాటు సీనియర్ బౌలర్లు మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ దూరంగా ఉన్నారు. దాంతో రోహిత్ శర్మ సారథ్య బాధ్యతలు అందుకున్నాడు. ఆగష్టు 4 నుంచి భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య మొదటి టెస్ట్ ప్రారంభం కానుంది. -
WTC Final: అందుకే వాషింగ్టన్‌తో కలిసి ఉండటం లేదు!
చెన్నై: ప్రతిభ ఉన్నా ఆర్థిక ఇబ్బందుల కారణంగా గొప్ప క్రికెటర్‌గా ఎదగాలనే తన ఆశయాన్ని నెరవేర్చుకోలేకపోయాడు ఓ తండ్రి. అందుకే కొడుకు ద్వారానైనా తన కల తీర్చుకోవాలని భావించాడు. తండ్రి కోరికకు తగ్గట్టుగానే, ఆయన ప్రోత్సాహంతో చిన్ననాటి నుంచే క్రికెట్లో ఓనమాలు దిద్దిన ఆ యువకుడు టీమిండియాలో చోటు దక్కించుకుని ఆయనకు ఆనందాన్ని పంచాడు. ఆ మధ్యతరగతి తండ్రి పేరు సుందర్. ఆయన కుమారుడే భారత క్రికెటర్ వాషింగ్టన్ సుందర్. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌తో వన్డేల్లో ప్రవేశించిన వాషింగ్టన్... ఇటీవలి గబ్బా టెస్టుతో సంప్రదాయ క్రికెట్లో అరంగేట్రం చేసి ఆసీస్ టూర్‌ను సద్వినియోగం చేసుకున్నాడు. బ్యాట్‌తోనూ, బాల్‌తోనూ రాణించి సిరీస్ విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్‌లో న్యూజిలాండ్‌తో జరిగే వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ ఆడే భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. అదేవిధంగా, ఇంగ్లండ్‌తో జరుగనున్న 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు సైతం ఎంపికయ్యాడు. అలా అయితేనే.. ఐపీఎల్-2021లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించిన వాషింగ్టన్ సుందర్.. కరోనా కారణంగా టోర్నీ వాయిదా పడటంతో ఇంటికి చేరుకున్నాడు. అయితే, అతడు సాఫీగా ఇంగ్లండ్ విమానం ఎక్కాలంటే, మహమ్మారి కరోనా బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాదు, ముంబైలో ఏర్పాటు చేసిన బయో బబుల్‌లో 14 రోజుల కఠిన క్వారంటైన్‌ను పూర్తి చేయాల్సి ఉంది. అయితే అంతకంటే ముందు ఆటగాళ్లంతా తమ ఇంటి వద్దే మూడుసార్లు ఆర్టీ–పీసీఆర్ టెస్టులు చేయించుకోవాల్సిందిగా ఆదేశించిన బీసీసీఐ.. అందులో ప్రతీసారి నెగెటివ్ అని తేలితేనే ఈ నెల 19 నుంచి ఆరంభమయ్యే క్వారంటైన్‌కు అనుమతి లభిస్తుందని స్పష్టం చేసింది. క్రికెటర్లు ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలో, దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే, స్వీయ నిర్బంధంలో ఉండటం సంపన్న క్రికెటర్లకు ఇదేమీ పెద్ద సమస్య కాకపోవచ్చు. కానీ వాషింగ్టన్ సుందర్ వంటి మధ్యతరగతి కుటుంబాలకు కాస్త కష్టమైన విషయమే. అందుకే అతడి తండ్రి సుందర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కొడుకు ప్రయాణం సాఫీగా సాగేందుకు వీలుగా వేరే ఇంటికి ఫిష్ట్ అయిపోయారు. అందుకే వేరుగా ఉంటున్నా.. ఈ విషయం గురించి సుందర్ మాట్లాడుతూ.. ‘‘వాషింగ్టన్ ఐపీఎల్ నుంచి తిరిగివచ్చిన నాటి నుంచి నేను వేరే ఇంట్లో ఉంటున్నాను. పనుల కోసం నేను బయటకు వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి వైరస్ బారిన పడే ప్రమాదం ఉంది. అందుకే వేరుగా ఉంటున్నా. ఇక నా భార్య, కూతురు మాత్రం వాషింగ్టన్‌తోనే ఉంటున్నారు. వీడియో కాల్ ద్వారా వారితో మాట్లాడుతున్నా. నిజానికి కొన్ని రోజుల తర్వాత నేను ఆఫీస్‌కు వెళ్లాల్సి ఉంటుంది. నా వల్ల తను ఇబ్బంది పడాల్సి వస్తే తట్టుకోలేను. లార్డ్ మైదానంలో ఆడటం తన చిరకాల కోరిక. ఎట్టిపరిస్థితుల్లోనూ వాషింగ్టన్ ఈ టోర్నీ మిస్ కాకుండా చూసుకోవడమే నా లక్ష్యం’’ అని తండ్రి మనసు చాటుకున్నారు. ఇక తమిళనాడులో కరోనా విజృంభణ కొనసాగతున్న సంగతి తెలిసిందే. కాగా జూన్ 2న టీమిండియా ఇంగ్లండ్‌కు పయనం కానుంది. చదవండి: WTC Final: గెలుపే లక్ష్యం.. ఆ సిరీస్ కూడా గెలుస్తాం! -
వాషింగ్టన్, పడిక్కల్‌లకు బంపర్ ఆఫర్..
ముంబై: ఇటీవలి కాలంలో జరిగిన అన్ని క్రికెట్ ఫార్మాట్లలో విశేషంగా రాణించిన వాషింగ్టన్ సుందర్, దేవ్‌దత్ పడిక్కల్‌లు బంపర్ ఆఫర్ కొట్టేశారు. ప్రముఖ జర్మన్ స్పోర్ట్స్ బ్రాండ్ ప్యూమా.. ఈ యువ క్రికెటర్లతో దీర్ఘకాల ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ మంగళవారం అధికారికంగా వెల్లడించింది. కాగా, ప్యూమా ఇదివరకే టీమిండియా స్టార్ క్రికెటర్లను తమ సంస్థ ప్రచారకర్తలుగా నియమించుకుంది. భారత కెప్టెన్ విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, యువరాజ్‌సింగ్ లాంటి స్టార్ క్రికెటర్లతో పాటు మహిళా క్రికెటర్ సుష్మా వర్మతో ప్యూమా ఒప్పందం కుదుర్చుకుంది. 'ప్యూమా ఫరెవర్ ఫాస్టర్ స్పిరిట్' అనే నినాదానికి ఈ ఇద్దరు యువ ఆటగాళ్లు సరిగ్గా సరిపోతారని, అందుకే వారిని ఎంపిక చేసుకున్నట్లు ప్యూమా ఇండియా ఎండీ అభిషేక్ గంగూలీ వెల్లడించారు. స్టార్ ఆటగాళ్లనే కాకుండా యువ క్రికెటర్లను కూడా ప్రోత్సహించాలనే ఉద్ధేశంతో ఈ ఇద్దరు క్రికెటర్లతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన తెలిపారు. ప్యూమాతో ఒప్పందం కుదుర్చుకోవడంపై ఈ ఇద్దరు క్రికెటర్లు స్పందించారు. ప్యూమా లాంటి సంస్థతో డీల్ కుదుర్చుకోవడం తమ అదృష్టమని, ప్రపంచ అత్యుత్తమ అథ్లెట్ల సరసన చేరడం నిజంగా గొప్ప అనుభూతి అని ఇద్దరు క్రికెటర్లు తెలిపారు. కాగా, గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో విశేషంగా రాణించిన వాషింగ్టన్ సుందర్.. ఆతరువాత ఇంగ్లండ్‌తో జరిగిన సిరస్లోనూ ఆకట్టుకున్నాడు. సుందర్ ప్రస్తుతం ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మరోవైపు గత ఐపీఎల్ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచిన పడిక్కల్.. ఈ ఏడాది జరిగిన దేశవాళీ పరిమిత ఓవర్ల టోర్నీల్లో పరుగుల వరద పారించాడు. ప్యూమా ఎంచుకున్న ఈ ఇద్దరు క్రికెటర్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లే కావడం విశేషం. చదవండి: సీఎస్కే అసలుసిసలైన ఆల్‌రౌండర్ అతనే.. -
'ఆ టెస్టు నాకు ప్రత్యేకం.. అందుకే కుక్కకు ఆ పేరు'
చెన్నై: కెరీర్ తొలి టెస్టు అంటే ఏ క్రికెటర్‌కైనా ప్రత్యేకంగా నిలిచిపోతుంది. అదే ఆ మ్యాచ్‌లో చిరస్మరణీయ ప్రదర్శన చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషిస్తే ఇక ఆ మైదానం, వేదిక సహజంగానే చిరస్మరణీయంగా మారిపోతుంది. ఏదో రూపంలో దానిని రోజూ గుర్తు చేసుకునేవారు చాలా మంది. ఇప్పుడు భారత ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా అదే పని చేశాడు. తన తొలి టెస్టు ఆడిన బ్రిస్బేన్‌లోని ‘గాబా’ మైదానం పేరునే తన బుజ్జి కుక్క పిల్లకు పెట్టుకున్నాడు! మా ఇంట్లోకి కొత్త సభ్యుడి ఆగమనం అంటూ ‘గాబా’ను పరిచయం చేశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 62 పరుగులు చేసిన సుందర్... శార్దుల్‌తో కలిసి ఆరో వికెట్‌కు 123 పరుగులు జోడించాడు. భారత్ స్కోరు 186/6గా ఉన్న దశలో వచ్చిన ఈ భాగస్వామ్యం చివర్లో కీలకంగా మారి జట్టు గెలుపునకు కారణమైంది. అన్నట్లు... 1993లో ఆస్ట్రేలియాపై సిడ్నీ వేదికగా తన తొలి టెస్టు సెంచరీ (277) చేసిన దిగ్గజం బ్రియాన్ లారా తన కూతురుకు ‘సిడ్నీ’ అని పేరు పెట్టిన విషయాన్ని ఇది గుర్తు చేసింది! చదవండి: సుందర్, బెయిర్ స్టో గొడవ.. అంపైర్ జోక్యం ఇంకా రెండు, మూడేళ్లు ఆడతా: ఉమేశ్ యాదవ్ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌ను ఇంకో రెండు మూడేళ్లు కొనసాగిస్తానని భారత సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్ చెప్పాడు. జూన్‌లో న్యూజిలాండ్‌తో జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌పై దృష్టి పెట్టానని 33 ఏళ్ల ఉమేశ్ అన్నాడు. ఇప్పటివరకు 48 టెస్టులు ఆడిన ఉమేశ్‌ను గాయాలు వెంటాడుతున్నాయి. వన్డేలకు పూర్తిగా దూరమైన ఇతన్ని సెలక్టర్లు ఇప్పుడు కేవలం టెస్టు జట్టుకే పరిగణిస్తున్నారు. చదవండి: ఆ విషయంలో సుందర్ నాకంటే సమర్ధుడు -
సుందర్, బెయిర్ స్టో గొడవ.. అంపైర్ జోక్యం
అహ్మదాబాద్: టీమిండియా బౌలర్ వాషింగ్టన్ సుందర్, ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ జానీ బెయిర్ స్టోల మధ్య జరిగిన మాటల యుద్ధం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శుక్రవారం ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటింగ్ సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అసలు విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 13వ ఓవర్ ఆఖరి బంతిని క్రీజులో ఉన్న డేవిడ్ మలాన్ బెయిర్ స్టో ఉన్న వైపు షాట్ ఆడాడు. అయితే బెయిర్ స్టో అప్పటికే క్రీజు నుంచి బయటకు వచ్చేశాడు. కాట్ అండ్ బౌల్డ్‌కు అవకాశం ఉండడంతో సుందర్ కూడా బెయిర్ స్టో ఉన్న వైపు పరిగెత్తుకొచ్చాడు. బంతిని అందుకునే క్రమంలో సుందర్ బెయిర్ స్టోపైకి దూసుకొచ్చాడు. ఈ క్రమంలో బంతి బెయిర్ స్టో హెల్మెట్‌కు తాకి పక్కకు వెళ్లిపోయింది. దీంతో ఆగ్రహం చెందిన సుందర్ బెయిర్ స్టో వైపు కోపంగా చూశాడు. అదే సమయంలో నేనేం చేశానన్నట్టుగా బోయిర్ స్టో ఏదో అనడంతో సుందర్ కూడా కౌంటర్ ఇచ్చాడు. అలా కొద్దిసేపు ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగడంతో ఫీల్డ్ అంపైర్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. వారిద్దరిని విడదీసి పక్కకు పంపించడంతో గొడవ సద్దుమణిగింది. దీనికి సంబంధించిన వీడియోనూ ఒక వ్యక్తి ట్విటర్లో షేర్ చేశాడు. కాగా టీమిండియాతో జరిగిన తొలి టీ20లో ఇంగ్లండ్ జట్టు శుభారంభం చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. శ్రెయాస్ అయ్యర్ (67 పరుగులు) మినహా ఎవరు ఆకట్టుకోలేదు. 125 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 15.3 ఓవర్లలోనే చేధించింది. జేసన్ రాయ్ 49 పరుగులతో జట్టును గెలిపించడంలో కీలకపాత్ర పోషించాడు. ఇంగ్లండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ మూడు వికెట్లు తీసినందుకుగాను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. సిరీస్‌లో రెండో టీ20 ఆదివారం(మార్చి 14న) ఇదే వేదికలో జరగనుంది. చదవండి: ఐదేళ్ల తర్వాత క్రికెటర్ రీఎంట్రీ pic.twitter.com/N0pg73JXfX — pant shirt fc (@pant_fc) March 12, 2021 -
ఆ విషయంలో సుందర్ నాకంటే సమర్ధుడు: టీమిండియా కోచ్
అహ్మదాబాద్: ఇంగ్లండ్‌తో జరిగిన ఆఖరి టెస్టులో టీమిండియా ఆటగాడు వాషింగ్టన్ సుందర్ తొలి ఇన్నింగ్స్‌లో అజేయమైన 96 పరుగులు సాధించడంతో అతనిపై అభినందలు వెల్లువెత్తుతున్నాయి. జట్టు కష్ట సమయాల్లో ఉన్నప్పుడు అతను ప్రదర్శించిన పరిణితిని టీమిండియా మాజీలు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి అయితే సుందర్‌ను తనతోనే పోల్చుకుంటూ ఆకాశానికెత్తేశాడు. సుందర్ తనకంటే బాగా రాణించగల సమర్ధుడని, ఆ సత్తా సుందర్ వద్ద ఉందని ఇదివరకే నిరూపితమైందని పేర్కొన్నాడు. సుందర్ తన బౌలింగ్‌పై ఇంకా దృష్టి సారించాల్సి ఉందని ఆయన సూచించాడు. అతను బౌలర్‌గా కూడా రాణించగలిగితే ఆల్‌రౌండర్ ఖాతాలో జట్టులో స్థానానికి ఢోకా ఉండదని పేర్కొన్నాడు. జట్టు ఓ ఆల్‌రౌండర్ నుంచి కనీసం 50 పరుగులను, 20కు పైబడి ఓవర్లు వేయాలని ఆశిస్తుంది. ప్రస్తుత ఆల్రౌండర్లలో సుందర్ ఆ పాత్రను సమర్ధవంతంగా పోశిస్తున్నాడని కితాబునిచ్చాడు. ఎడమ చేతి బ్యాటింగ్, కుడి చేతి ఆఫ్ బ్రేక్ బౌలింగ్ వేసే సుందర్.. ఇటీవల జరిగిన నాలుగు టెస్ట్‌ల్లో మూడు అర్ధశతకాలు, 6 వికెట్లు పడగొట్టాడు. కీలకమైన ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతున్న సుందర్ అప్పట్లో రవిశాస్త్రి తరహాలోనే బంతితో పాటు బ్యాట్‌తోనూ రాణిస్తున్నాడు. కాగా, 80 దశకంలో భారత టెస్ట్ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న రవిశాస్త్రి.. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ అదరగొట్టేవాడు. భారత్ తరఫున 80 టెస్ట్‌లకు ప్రాతినిధ్యం వహించిన రవిశాస్త్రి.. 11 శతకాలు, 12 అర్ధ శతకాల సాయంతో 3830 పరుగులు, 151 వికెట్లు సాధించాడు. -
వారు సహకరిస్తే బాగుండు.. సుందర్ తండ్రి ఎమోషనల్
అహ్మదాబాద్: ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా ఆటగాడు వాషింగ్టన్ సుందర్ తొలి ఇన్నింగ్స్‌లో 96 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అక్షర్ పటేల్ 43 పరుగులతో మంచి సహకారం అందించడంతో సుందర్ కచ్చితంగా సెంచరీ చేస్తాడని అంతా భావించారు. అయితే అనూహ్యంగా అక్షర్ పటేల్ వెనుదిరగడం.. ఆ తర్వాత వచ్చిన ఇషాంత్, సిరాజ్‌లు కూడా డకౌట్లుగా వెనుదిరగడంతో సుందర్ సెంచరీ మార్క్‌ను అందుకోలేకపోయాడు. కానీ సుందర్ ఆడిన ఈ ఇన్నింగ్స్ మాత్రం చిరకాలం గుర్తుండిపోతుందనంలో సందేహం లేదు. సుందర్ సెంచరీ మార్క్‌ను అందుకోకపోవడంతో తాను నిరాశకు గురయ్యాయని తండ్రి ఎమ్. సుందర్ పేర్కొన్నాడు. 'నా కొడుకు బ్యాటింగ్ చూసి కొంతమంది ఆశ్చర్యపోతుండడం నాకు వింతగా అనిపించింది. వాస్తవానికి వాడిలో మంచి బ్యాట్స్‌మన్ దాగున్నాడు. కఠిన పరిస్థితుల్లో ఒక మంచి ఇన్నింగ్స్ ఆడినందుకు చాలా సంతోషంగా ఉంది. టీమిండియా ఎప్పుడు కష్టాల్లో ఉన్న సుందర్ ఇలానే జట్టును ఆదుకున్నాడు. ఆసీస్ పర్యటనలోనూ ఇది రుజువైంది. కానీ ఒక్క విషయం మాత్రం నన్ను తీవ్రంగా బాధిస్తుంది. 96 పరుగులకు చేరుకున్న తర్వాత నా కొడుకు సెంచరీ మార్క్‌ను అందుకుంటాడని భావించా. కానీ అక్షర్ పటేల్ అవుటైన తర్వాత వచ్చిన ఇషాంత్, సిరాజ్‌లు డకౌట్ అయ్యారు. వారిని తప్పుబట్టలేను కానీ వారు కాస్త సహకరించి ఉంటే బాగుండేది. అయితే టీమిండియా విజయం సాధించడం నా బాధను మరిచిపోయేలా చేసింది.' అంటూ తెలిపాడు. నాలుగో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా వరుసగా హ్యాట్రిక్ గెలుపును అందుకుంది. ఫలితంగా వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్(డబ్యూటీసీ) ఫైనల్లో సగర్వంగా అడుగుపెట్టింది. ఇప్పటికే న్యూజిలాండ్ ఫైనల్‌కు చేరగా, తాజాగా టీమిండియా తుది పోరుకు అర్హత సాధించింది. నాల్గో టెస్టులో 160 పరుగులు వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 135 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో టీమిండియాకు ఇన్నింగ్స్ విజయం లభించింది. అక్షర్ పటేల్, అశ్విన్ చెరో 5 వికెట్లతో ఇంగ్లండ్ నడ్డి విరిచి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. దీంతో నాలుగు టెస్టుల సిరీస్‌ను టీమిండియా 3-1తో కైవసం చేసుకుంది. జూన్‌లో లార్డ్స్ వేదికగా జరగనున్న ఫైనల్లో న్యూజిలాండ్‌తో టీమిండియా తలపడనుంది. చదవండి: టీమిండియా విజయం.. సగర్వంగా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు కమాన్ కోహ్లి.. ఎంత పని చేశావ్ : రూట్ -
పంత్ వీరవిహారం గిల్‌క్రిస్ట్ విధ్వంసాలను గుర్తు చేసింది..
అహ్మదాబాద్: తనదైన రోజున ప్రత్యర్ధి బౌలర్ల పాలిట సింహస్వప్నంలా నిలిచే టీమిండియా డాషింగ్ వికెట్‌కీపర్ రిషబ్ పంత్‌పై ట్విటర్ వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది. అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఫైటింగ్ సెంచరీతో అదరగొట్టిన పంత్.. 116 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో టెస్టుల్లో మూడో సెంచరీని నమోదు చేశాడు. రూట్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టి మరీ సెంచరీ పూర్తి చేసిన పంత్.. ఆ వెంటనే (101 పరుగుల వద్ద) అండర్సన్ బౌలింగలో ఔటయ్యాడు. క్లిష్ట సమయంలో క్రీజ్‌లోకి వచ్చిన పంత్.. మొదట్లో వికెట్ కాపాడుకునే ఉద్దేశంతో నెమ్మదిగా ఆడి హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. ఆతరువాతే పంత్ విధ్వంసం మొదలైంది. ఇంగ్లండ్ కొత్త బంతిని తీసుకున్న తర్వాత వరుస ఫోర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో టీమిండియా కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించింది. పంత్‌కు వాషింగ్టన్ సుందర్ నుంచి పూర్తి సహకారం లభించింది. సుందర్(117 బంతుల్లో 60 నాటౌట్, 8 ఫోర్లు), పంత్‌లు కలిసి ఏడో వికెట్‌కు 113 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి టీమిండియాకు 89 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందించారు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 7 వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది. కాగా, పంత్, సుందర్‌ల జోడీ ఇన్నింగ్స్‌ను నిర్మించిన తీరుపై ప్రముఖ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పంత్ దూకుడును, సుందర్ సంయమన్నాని వారు ఆకాశానికెత్తారు. ఒత్తిడిలో నమ్మశక్యంకాని రీతితో బౌలర్లపై విరుచుకుపడి అద్భుతమైన శతకం సాధించిన టీమిండియా డాషింగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు అభినందనలు. నీ విధ్వంసం మొదటిది కాదు.. అలాగని ఆఖరిది కూడా కాకూడదు.. భవిష్యత్తులో నీ బ్యాటింగ్ ఊచకోత కొనసాగించాలని ఆశిస్తున్నా.. అన్ని ఫార్మాట్లలో ఆల్ టైమ్ బెస్ట్ నువ్వే.. నువ్వు నిజమైన మ్యాచ్ విన్నర్ అంటూ టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పంత్‌ను ఆకాశానికెత్తాడు. జట్టుకు అవసరమైనప్పుడు అద్భుతమైన శతకాన్ని సాధించావు.. గతంలో గిల్‌క్రిస్ట్ చేసిన విధ్వంసాలను గుర్తు చేశావంటూ టీమిండియా మాజీ ఓపెనర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ప్రశంసించారు. యువ క్రికెటర్లు జట్టు బాధ్యతలను భుజానికెత్తుకోవడం సంతోషాన్ని కలిగిస్తోంది.. పంత్ ఊచకోత, సుందర్ నిలకడ ప్రదర్శనకు అభినందనలు.. సుందర్ అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నావు.. యువ క్రికెటర్లు భవిష్యత్తులో మరింత నిలకడగా ఆడాలని ఆశిస్తున్నా... వీవీఎస్ లక్ష్మణ్ ఆండర్సన్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ చేసి ఫోర్ కొట్టడం, సిక్సర్‌తో శతకాన్ని చేరుకోవడం అత్యద్భుతం..నువ్వే నా నిజమైన వారసుడివి.. సెహ్వాగ్ అసాధారణ ప్రతిభ కలిగిన పంత్.. అసాధారణ శతకాన్ని పూర్తి చేశాడు.. అభినందనలు.. టామ్ మూడీ -
రోహిత్, పంత్, సుందర్‌లకు విశ్రాంతి..!
న్యూఢిల్లీ: గతేడాది ఐపీఎల్ సీజన్ కోసం దుబాయ్ వెళ్లిన టీమిండియా ఆటగాళ్లు నిర్విరామంగా క్రికెట్ ఆడుతున్న నేపథ్యంలో కొందరు ఆటగాళ్లకు విశ్రాంతినివ్వాలని జట్టు యాజమాన్యం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్‌తో జరుగబోయే మూడు వన్డేల సిరీస్ కోసం టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మతో పాటు రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్‌లతో సహా మొత్తం 8 మంది ఆటగాళ్లకు విశ్రాంతినివ్వనున్నట్లు సమాచారం. కరోనా బ్రేక్ అనంతరం క్రికెట్ రిస్టార్ట్ అయినప్పటి నుంచి టీమిండియా ఆటగాళ్లు బయో బబుల్‌కే పరిమితం కావడం వల్ల తీవ్రమైన మానసిక సమస్యలు తలెత్తే ప్రమాదమున్నందున ఈమేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఐపీఎల్ 2020 సీజన్ కోసం దుబాయ్‌కు వెళ్లిన భారత ఆటగాళ్లు.. అక్కడి నుంచే నేరుగా ఆస్ట్రేలియాలో పర్యటించారు. అనంతరం స్వదేశానికి తిరిగి వచ్చాక స్వల్ప విరామం తీసుకున్నా.. ఆ వెంటనే ఇంగ్లండ్‌తో సిరీస్‌కు సన్నదమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ 2021 సీజన్‌కు ముందు స్టార్ ఆటగాళ్లకు విశ్రాంతినివ్వాలని భారత జట్టు యాజమాన్యం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. స్పెషల్ రిక్వెస్ట్ మీద పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఇదివరకే జట్టు నుంచి తప్పుకోగా తాజాగా మరికొందరు స్టార్ ఆటగాళ్లకు విశ్రాంతి కల్పించాలని టీం మేనేజ్మెంట్ యోచిస్తున్నట్లు సమాచారం. బుమ్రా నాలుగో టెస్టు సహా వన్డే, టీ20 సిరీస్‌లకు సైతం దూరం కానున్నాడు. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య వన్డే సిరీస్ మార్చి 23, 26, 28 తేదీల్లో జరగనున్న సంగతి తెలిసిందే. -
'ఇప్పటికైనా అతనికి అవకాశం ఇవ్వండి'
చెన్నై: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘోర పరాజయం తర్వాత లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ ఆసక్తికరవ్యాఖ్యలు చేశాడు. ఇప్పటికైనా తుది జట్టులో లెగ్‌స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు అవకాశం ఇవ్వాలని కోరాడు. ఫిబ్రవరి 13 నుంచి మొదలుకానున్న రెండో టెస్టులో షాబాజ్ నదీమ్ లేదా సుందర్‌లలో ఒకరిని తప్పించి కుల్దీప్కు చాన్స్ ఇవ్వాలని కోరాడు. 'అశ్విన్, సుందర్‌లు ఇద్దరు ఆఫ్ స్పిన్నర్లే.. అయితే బౌలింగ్‌లో ఎవరి శైలి వారిది. అయితే ఇప్పటికిప్పుడు సుందర్‌ను తీసేయాలనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే బ్రిస్బేన్ టెస్టులో బ్యాటింగ్‌లో అదరగొట్టిన సుందర్ అదే టెంపోను చెన్నైలోనూ కొనసాగించాడు. 85 నాటౌట్ ఇన్నింగ్స్‌తో బ్యాటింగ్ పరంగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. జడేజా జట్టులోకి వచ్చేంతవరకు సుందర్‌ను తీసే అవకాశం లేదు. దీంతో కుల్దీప్ను జట్టులోకి తీసుకోవాలంటే షాబాజ్ నదీమ్‌ను పక్కన పెట్టాల్సిందే. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో నదీమ్ కొంచెం ఒత్తిడిలో ఉన్నట్లు కనిపించాడు. అతను బౌలింగ్ చేసే విధానం, నో బాల్స్ వేసే తీరు చూస్తే అతను కాస్త ఇబ్బందికి గురైనట్లు కనిపించింది. కుల్దీప్ ఇప్పటికే చెన్నై వేదికగా మ్యాచ్ ఆడాడు కాబట్టి పిచ్ పరిస్థితి అతనికి సులువుగా అర్థం అవుతుంది. పైగా లెగ్ స్పిన్, ఆఫ్ స్పిన్ కాంబినేషన్ ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుందంటూ' చెప్పుకొచ్చాడు. కుల్దీప్ టీమిండియా తరపున 6 టెస్టుల్లో 24 వికెట్లు, 61 వన్డేల్లో 105 వికెట్లు, 21 టీ20ల్లో 39 వికెట్లు తీశాడు. కాగా తొలిటెస్టులో టీమిండియా 227 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. చదవండి: 5–3–6–3.. వాటే స్పెల్ అండర్సన్ ధోని తరహాలో జడ్డూ పోస్ట్.. ఫ్యాన్స్‌లో ఆందోళన -
బౌండరీతో హాఫ్ సెంచరీ.. వషీ రికార్డు
చెన్నై: ఇంగ్లండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో టీమిండియా బ్యాటింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ అరుదైన ఘనత సాధించాడు. స్వదేశంలో, విదేశంలో ఆడిన తొలి మ్యాచ్‌లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసిన ఎనిమిదో భారత ఆటగాడిగా నిలిచాడు. మాజీ ఆటగాళ్లు రుసీ మోదీ, సురీందర్ అమర్నాథ్, అరుణ్‌లాల్, టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ, సురేశ్ రైనా, హార్దిక్ పాండ్యా, మయాంక్ అగర్వాల్ ఇంతకు ముందు ఈ ఘనత సాధించారు. కాగా నాలుగో రోజు ఆటలో భాగంగా వాషింగ్టన్ సుందర్ 85 పరుగులతో అజేయంగా నిలిచాడు. 138 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు 2 సిక్సర్ల సాయంతో జట్టు స్కోరు 300 మార్కును దాటడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక 79.1వ ఓవర్లో జాక్ లీచ్ విసిరిన బంతిని బౌండరీకి తరలించిన వశీ.. సొంత గడ్డపై తొలి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాగా ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా బ్రిస్బేన్ మ్యాచ్‌తో టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఈ తమిళనాడు ఆటగాడు.. గబ్బా మైదానంలో తొలి అర్ధ శతకాన్ని నమోదు చేశాడు. 62 పరుగులతో రాణించాడు. ఇక ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్ విషయానికొస్తే.. 95.5 ఓవర్లలో 337 పరుగుల వద్ద టీమిండియా తొలి ఇన్నింగ్స్ ముగించింది. చదవండి: Ind Vs Eng Highlights: రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ -
Ind Vs Eng Highlights: అశ్విన్ విజృంభణ: ఇంగ్లండ్ ఆలౌట్
చెన్నై: టీమిండియాతో చెపాక్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 178 పరుగుల వద్ద ఆలౌటైంది. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ దెబ్బకు విలవిల్లాడిన ఇంగ్లండ్ వరుసగా వికెట్లను కోల్పోయింది. అశ్విన్ ఆరు వికెట్లతో చెలరేగిపోయాడు. వరుస విరామాల్లో వికెట్లు తీసి ఇంగ్లండ్ రెండొందల పరుగుల మార్కు చేరకుండా కట్టడి చేశాడు. అయినప్పటికీ ఇంగ్లండ్ 419 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. బర్న్స్, సిబ్లే, స్టోక్స్, డొమినిక్ బెస్, జోఫ్రా ఆర్చర్, అండర్సన్ వికెట్లను అశ్విన్ సాధించాడు. ఇక నదీమ్‌కు రెండు వికెట్లు లభించగా, ఇషాంత్, బుమ్రాలకు తలో వికెట్ దక్కింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 578 పరుగులు చేయగా, టీమిండియా 337 పరుగులకు ఆలౌటైంది. హైలెట్స్: ► తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీతో ఆకట్టుకున్న కెప్టెన్ జో రూట్ 40 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. బుమ్రా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో రూట్ చేసిన పరుగులే అత్యధిక స్కోరుగా నిలిచింది. ఆ తర్వాత ఓలీ పాప్(28), బెస్(25), బట్లర్(24)లు అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాళ్లు. ►అశ్విన్ బౌలింగ్‌లో ఇంగ్లీష్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అవుట్ అయ్యాడు. పంత్‌కు క్యాచ్ ఇచ్చి వికెట్ సమర్పించుకున్నాడు. ఇక అంతకు ముందు ఇషాంత్ లారెన్స్‌ను పెవిలియన్‌కు పంపగా, ఓపెనర్లు బర్న్స్, సిబ్లీ వికెట్లను అశ్విన్ తన ఖాతాలో వేసుకున్నాడు. ►వన్‌డౌన్‌లో క్రీజులోకి వచ్చిన డానియల్ లారెన్స్‌ను ఇషాంత్ శర్మ పెవిలియన్‌కు పంపాడు. 18 పరుగులు చేసి లారెన్స్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఇక లారెన్స్‌ను ఔట్ చేయడం ద్వారా, టెస్టుల్లో 300 వికెట్లు పూర్తి చేసుకున్న ఇషాంత్ శర్మ.. ఈ ఘనత సాధించిన భారత మూడో పేసర్‌గా నిలిచాడు. రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న ఇంగ్లండ్ ఆతిథ్య జట్టు కంటే ప్రస్తుతం 305 పరుగుల ఆధిక్యంలో ఉంది. ►ఆతిథ్య జట్టు కంటే 282 పరుగుల ఆధిక్యంలో జో రూట్ సేన.. రెండో ఇన్నింగ్స్‌లో రెండో వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ సిబ్లీ అవుట్ అయ్యాడు. అశ్విన్ బౌలింగ్‌లో, పుజారాకు క్యాచ్ ఇచ్చి 16 పరుగులు చేసి వెనుదిరిగాడు. కెప్టెన్ జో రూట్, లారెన్స్ బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు.బంతికే ఇంగ్లండ్ మొదటి వికెట్ కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ రోరీ బర్న్స్ డకౌట్‌గా వెనుదిరిగాడు. రహానేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు. . ►ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఆలౌట్ అయ్యింది. నాలుగో రోజు ఆటలో భాగంగా 95.5 ఓవర్లలో 337 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించింది. వాషింగ్టన్ సుందర్ 85 పరుగులతో అజేయంగా నిలిచాడు.138 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు 2 సిక్సర్ల సాయంతో మెరుగైన స్కోరు సాధించాడు. ఇక పర్యాటక జట్టు 578 పరుగులతో తొలి ఇన్నింగ్స్‌ను ముగించగా.. టీమిండియా ఇంకా 241 పరుగులు వెనుకబడి ఉంది. ►ఆండర్సన్ బౌలింగ్‌లో ఇషాంత్ శర్మ(4) తొమ్మిద్ వికెట్‌గా పెవిలియన్ చేరాడు. వాషింగ్టన్ సుందర్ (84), బుమ్రా క్రీజులో ఉన్నారు. భారత ప్రస్తుత స్కోరు 336/9. ఇక పర్యాటక జట్టు 578 పరుగులతో తొలి ఇన్నింగ్స్‌ను ముగించగా.. టీమిండియా ఇంకా 242 పరుగులు వెనుకబడి ఉంది. ►జాక్ లీచ్ బౌలింగ్‌లో నదీం డక్ అవుట్ అయ్యాడు. స్టోక్స్‌కు క్యాచ్ ఇచ్చి వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో భారత్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది.కాగా జాక్ లీచ్‌కు ఈ మ్యాచ్‌లో ఇది రెండో వికెట్. అంతకు ముందు అశ్విన్ వికెట్ కూల్చాడు. టీమిండియా తాజా స్కోరు 318/8. వాషింగ్టన్ సుందర్, ఇషాంత్ ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. ►అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న వాషింగ్టన్ సుందర్‌కు తోడుగా మరో ఎండ్‌లో సహకారం అందిస్తున్న అశ్విన్(31).. జాక్ లీచ్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 305 పరుగుల వద్ద టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. ►నాలుగో రోజు ఆటలో భాగంగా, బ్యాటింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 111 బంతుల్లో 59 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఫార్వర్డ్, కవర్ డ్రైవ్ షాట్లతో అలరిస్తూ 10 ఫోర్ల సాయంతో సొంత గడ్డపై తొలి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ►మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లకు 257 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఇక పర్యాటక జట్టు 578 పరుగులతో తొలి ఇన్నింగ్స్‌ను ముగించగా.. భారత్, 271 పరుగులు వెనుకబడి ఉంది. ప్రస్తుతం టీమిండియా స్కోరు 307/7. వశీ, నదీం క్రీజులో ఉన్నారు. ►భారత గడ్డపై వాషింగ్టన్ సుందర్ తొలి హాఫ్ సెంచరీ. చదవండి: చెన్నై టెస్టులో భారత్ ఎదురీత -
'నా పేరు వాషింగ్టన్.. డీసీకి వెళ్లాలనుకుంటున్నా'
చెన్నై: టీమిండియా యువ వికెట్‌కీపర్ రిషబ్ పంత్ ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఫుల్ జోష్‌లో కనిపిస్తున్నాడు.ఆసీస్‌తో జరిగిన చివరి టెస్టులో 89* పరుగుల ఇన్నింగ్స్‌తో పంత్ ఒక్కసారిగా హీరో అయిపోయాడు.గబ్బా టెస్టు తర్వాత పంత్‌ను సైడర్‌మ్యాన్ థీమ్ సాంగ్‌తో పోల్చుతూ వచ్చిన వీడియో బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా పంత్ తొలిరోజు ఆటలో సుందర్‌ను ట్రోల్ చేసిన వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాయి. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 70వ ఓవర్ వేయడానికి వచ్చిన వాషింగ్టన్ సుందర్‌ను ఉద్దేశించి పంత్ ట్రోల్ చేశాడు. నా పేరు వాషింగ్టన్.. నేను డీసీకీ వెళ్లాలనుకుంటున్నా అంటూ పేర్కొన్నాడు. పంత్ వ్యాఖ్యలు స్టంపింగ్ మైక్‌లో రికార్డు కావడంతో విషయం బయటికి వచ్చింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు పంత్‌పై తమదైన శైలిలో కామెంట్లు చేశారు. పంత్ ఉంటే ఆ కిక్కే వేరప్పా.. టీమిండియాలో ఎంటర్టైన్ చేయడానికి పంత్ ఒక్కడు చాలు.. సీరియస్‌గా కీపింగ్ చేస్తూనే పక్కనున్న వారిని నవ్వించడంలో పంత్ దిట్ట అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా ఆసీస్ పర్యటనలో దూకుడైన బ్యాటింగ్‌తో అదరగొట్టిన రిషబ్ పంత్ తుది జట్టులో ఉంటాడని కోహ్లి మ్యాచ్‌కు ముందురోజే చెప్పిన విషయం అందరికి తెలిసిందే. దీంతో వృద్ధిమాన్ సాహా మరోసారి బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. కాగా పంత్ టీమిండియా తరపున 16 టెస్టులు, 16 వన్డేలు, 28 టీ20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ పటిష్ట స్థితిలో నిలిచింది. 89.3 ఓవర్లు ఆడిన ఇంగ్లండ్ 3 వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసింది. కెప్టెన్ జో రూట్ 128 పరుగులతో క్రీజులో ఉన్నాడు. చదవండి: కోహ్లి ఫిజియో అవతారం.. చూసి తీరాల్సిందే "Mera naam hai Washington Mujhe jana hai DC" - Rishabh Pant behind the stumps in Washington Sundar's over 😂😂pic.twitter.com/tnPqe5utUT#INDvENG — Shubz 🇮🇳 (@ShubzRohitFan) February 5, 2021 -
'వారి ఇన్నింగ్స్ చూస్తున్నా.. అప్పుడే డాక్టర్ పిలిచారు'
చెన్నై: బ్రిస్బేన్ టెస్టులో టీమిండియా చారిత్రక విజయాన్ని అంత తొందరగా మరిచిపోలేం. సీనియర్ల గైర్హాజరీలో యువకులతో నిండిన జట్టు 32 ఏళ్ల ఆసీస్ జైత్రయాత్రకు చెక్ పెడుతూ టెస్టు విజయంతో పాటు సిరీస్ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే గబ్బా టెస్టులో టీమిండియా విజయానికి రిషబ్ పంత్, పుజారా పోరాటం ఎంతో కీలకమో.. సుందర్- శార్దూల్ ద్వయం తొలి ఇన్నింగ్స్‌లో నెలకొల్పిన 123 పరుగులు విలువైన భాగస్వామ్యానికి అంతే స్థానం ఉంది. వీరిద్దరే లేకుంటే గబ్బా టెస్టులో టీమిండియా పరిస్థితి వేరేలా ఉండేది. తాజాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి బ్రిస్బేన్ టెస్టుకు సంబంధించి మరోసారి గుర్తుచేసుకున్నాడు. ఇంగ్లండ్‌తో తొలిటెస్టుకు సన్నద్దమవుతున్న వేళ కోహ్లి మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. 'బ్రిస్బేన్ టెస్టులో టీమిండియా సాధించిన చారిత్రక విజయం గురించి ఇప్పటికే చాలాసార్లు చర్చించా. అయితే ఆరోజు జరిగిన మరో ఆసక్తికర విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నా. బ్రిస్బేన్ టెస్టు సమయంలో ఆసుపత్రిలో ఉన్న నేను సుందర్.. శార్దూల్ బ్యాటింగ్‌ను నా ఫోన్లో ఆస్వాదిస్తున్నా. వారిద్దరి సమన్వయంతో 127 పరుగుల కీలక భాగస్వామ్యం ఏర్పడింది. వారి ఇన్నింగ్స్ చూస్తున్న సమయంలోనే నాకు డాక్టర్ నుంచి పిలుపు వచ్చింది. ఒక బిడ్డకు తండ్రి అవడం అనేది నా జీవితంలో గొప్ప అనుభూతి. అదే సమయంలో టీమిండియా చారిత్రక టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకుంది. నేను చెప్పిన రెండు కారణాలు విభిన్న శైలిలో ఉన్నాయి.. యాదృశ్చికంగా నా జీవితంలో రెండు ఆనందాలు ఒకేసారి పొందడం ఆనందంగా ఉన్నా.. వాటిని ఒకదానితో మరొకటి ఎన్నటికీ పోల్చలేను. నేను లేకున్నా జట్టు విజయం సాధించడం.. ఆ మ్యాచ్‌ను నేను కళ్లారా వీక్షించడంతో టీమిండియాతో అనుబంధం మాత్రం ఎక్కడ ఉన్నా అలాగే ఉంటుందని మరోసారి రుజువైంది. చదవండి: ధోని గుర్తుగా కోహ్లి హెలికాప్టర్ షాట్ ఇక ఇంగ్లండ్‌తో సిరీస్‌కు మేం పూర్తి స్థాయిలో సన్నద్దమయ్యాం. పెటర్నిటీ సెలవుల అనంతరం జట్టుతో కలవడం ఆనందంగా అనిపిస్తుంది. ఆసీస్‌పై టెస్టు సిరీస్ విజయాన్ని ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ల్లోనూ కొనసాగిస్తాం. జూన్‌లో లార్డ్స్ వేదికగా జరగనున్న వరల్డ్ టెస్టు చాంపియన్‌పిప్ ఫైనల్‌కు అర్హత సాధించడమే మా కర్తవ్యంగా పెట్టుకున్నాం. ఇక రిషబ్ పంత్ వికెట్ కీపర్‌గా తుది జట్టులో కచ్చితంగా ఆడనున్నాడు.. అందులో ఎలాంటి సందేహం లేదు. బుమ్రా తిరిగి జట్టులోకి రావడంతో పేస్ విభాగం మరింత పటిష్టంగా తయారైంది. స్వదేశంలో బుమ్రాకు ఇదే తొలి టెస్టు అయినా.. ఇప్పటికే తనేంటో ప్రపంచానికి తెలియచేశాడు. అతని ఫామ్‌పై ఎలాంటి సందేహాలు లేవు.' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఇరుజట్ల మధ్య చెన్నై వేదికగా జరగనున్న తొలి టెస్టు మ్యాచ్ ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కానుంది. చదవండి: సిక్సర్ల హోరు.. యునివర్సల్ బాస్ విధ్వంసం -
ఏఆర్ రెహమాన్‌ను కలిసిన క్రికెటర్
చెన్నై: ఆస్కార్ అవార్డ్ గ్రహీత.. భారతీయ సినీ సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్‌ను టీమిండియా యువ క్రికెటర్ వాషింగ్టన్ సుందర్ కలిసిన ఫోటోలు వైరల్‌గా మారాయి. చిన్నప్పటి నుంచి ఏఆర్ రెహమాన్ పాటలు వింటూ పెరిగిన సుందర్‌కు అతనంటే విపరీతమైన అభిమానం. ఆసీస్‌తో సిరీస్ ముగిసిన తర్వాత స్వదేశానికి తిరిగివచ్చిన సుందర్ బుధవారం చెన్నైలోని రెహమాన్ స్వగృహంలో కలిసి అతనితో ఫోటోలు దిగాడు. 'నేను ఎంతో ఇష్టపడే రెహమాన్‌ను స్వయంగా కలిశాను.. ఇది నిజంగా ఆహ్లదకరమైన సాయంత్రం' అంటూ క్యాప్షన్ జత చేశాడు. కాగా ఈ ఫోటోలను సుందర్ తన ట్విటర్లో పంచుకున్నాడు. కాగా బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో భాగంగా గబ్బా వేదికగా జరిగిన నాలుగో టెస్టులో వాషింగ్టన్ సుందర్ ఆల్‌రౌండ్ ప్రతిభతో ఆకట్టుకున్నాడు. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో సుందర్ 62 పరుగులు .. రెండో ఇన్నింగ్స్‌లో 22 పరుగులు చేసి నాలుగో టెస్టులో టీమిండియా గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఆపై బౌలింగ్‌లోనూ 4 వికెట్లు తీసిన సుందర్ ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచాడు. సుందర్ టీమిండియా తరపున ఇప్పటివరకు ఒక వన్డే, ఒక టెస్టు మ్యాచ్‌తో పాటు 21 టీ20లు ఆడాడు. To a blissful evening! 😇 pic.twitter.com/wz9KFTEVUy — Washington Sundar (@Sundarwashi5) January 26, 2021 -
ఐసీసీ కీలక ప్రకటన.. ఇకపై ప్రతినెలా
దుబాయ్: అద్భుత ప్రదర్శన కనబరిచిన క్రికెటర్ల విజయాన్ని సెలబ్రేట్ చేసేందుకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) సరికొత్త పురస్కారాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై ప్రతి నెలా 'ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డు ఇవ్వనున్నట్లు బుధవారం ప్రకటించింది. ఐసీసీ ఓటింగ్ అకాడమీతో ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల ఓట్లను పరిగణనలోకి తీసుకుని విజేతను నిర్ణయించనున్నట్లు పేర్కొంది. ఓట్ల ఆధారంగా పురుష, మహిళా క్రికెటర్లకు అవార్డు ఇవ్వనున్నట్లు పేర్కొంది. (చదవండి: ఆసీస్ టూర్: అరంగేట్రంలోనే అదరగొట్టేశారు!) కాగా ఈ సరికొత్త అవార్డు కేటగిరీలో జనవరి నెలకుగానూ భారత్ నుంచి నలుగురు క్రికెటర్ల పేర్లు ఐసీసీ పరిశీలనలో ఉన్నాయి. ఆస్ట్రేలియాతో ఇటీవల జరిగిన టెస్టు సిరీస్‌లో ఆకట్టుకున్న యువ ఆటగాళ్లు.. రిషభ్ పంత్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, టి.నటరాజన్‌తో పాటు రవిచంద్ర అశ్విన్ పేర్లను పరిశీలిస్తోంది. వీరితో పాటు జోరూట్(ఇంగ్లండ్), స్టీవ్ స్మిత్(ఆస్ట్రేలియా), మరిజన్నే కాప్(దక్షిణాఫ్రికా) పేర్లు కూడా ఐసీసీ పరిశీలనలో ఉన్నాయి.(చదవండి: కెరీర్ అత్యుత్తమ స్థానంలో రిషభ్ పంత్) చెన్నైకి చేరుకున్న ఇంగ్లండ్ జట్టు న్యూఢిల్లీ: నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్ జట్టు చెన్నై చేరుకుంది. కరోనా నేపథ్యంలో నేటి నుంచి 6 రోజులపాటు క్రికెటర్లు క్వారంటైన్లో ఉండనున్నారు. కాగా ఫిబ్రవరి 5 నుంచి భారత్-ఇంగ్లండ్ తొలిటెస్టు ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. చెన్నైలో ప్రేక్షకులు లేకుండానే టెస్టు మ్యాచ్ నిర్వహించనున్నారు. (చదవండి: ఇండియా వర్సెస్ ఇంగ్లండ్: పూర్తి షెడ్యూల్ ఇదే!) -
ఆ అవకాశమిస్తే అదృష్టంగా భావిస్తా: వషీ
చెన్నై: డ్రెసింగ్ రూమ్‌లో టీమిండియా కోచ్ రవిశాస్త్రి ఇచ్చే విలువైన సలహాలు యువ ఆటగాళ్లలో ఎంతో స్పూర్తిని నింపుతాయని, మైదానంలో ఉత్తమ ప్రదర్శన చేసేందుకు అవి ఓ టానిక్‌లా ఉపయోగపడతాయని టీమిండియా యువ సంచలన ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ అన్నాడు. ఆటలో ఛాలెంజ్‌లు స్వీకరించేందుకు తానెప్పుడూ సిద్ధంగా ఉంటానని, టెస్టుల్లో ఓపెనింగ్ చేసే అవకాశం వస్తే అదృష్టంగా భావిస్తానని అతను పేర్కొన్నాడు. తన ఆటతీరును కోచ్ రవిశాస్త్రి ఏ మేరకు ప్రభావితం చేసాడనే అంశంపై సుందర్ మాట్లాడుతూ.. నాలాంటి యువ ఆటగాళ్లకు రవిశాస్త్రి లాంటి అనుభవజ్ఞుడైన కోచ్ లభించటం ఎంతో అదృష్టమని, మరీ ముఖ్యంగా ఆల్‌రౌండర్‌గా రాణించాలకున్న నాకు రవిశాస్త్రి సలహాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నాడు. రవిశాస్త్రి తన టెస్టు కెరీర్లో ఎడమచేతి స్పిన్ బౌలర్‌గా, కుడి చేతి ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా రాణించిన విషయాన్ని సుందర్ గుర్తుచేశాడు. ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్, కుడి చేతి ఆఫ్ బ్రేక్ బౌలర్ అయిన సుందర్.. కోచ్ రవిశాస్త్రే తనకు, స్పూర్తి, ఆదర్శమని పేర్కొన్నాడు. బ్యాటింగ్ ఒక్కటే సరిపోదని తమిళనాడుకు చెందిన 21 ఏళ్ల వాషింగ్టన్ సుందర్ అండర్-19 క్రికెట్లో స్పెషలిస్ట్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా రాణించాడు. టీమిండియాలో స్థానం సంపాదించాలంటే కేవలం బ్యాటింగ్‌పైనే ఆధారపడితే సరిపోదని, తనలోని స్పిన్ బౌలింగ్‌కు సాన పట్టాడు. చాలామంది యువ ఆటగాళ్లలాగే సుందర్ కూడా ఐపీఎల్లో లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని, టీమిండియా టీ20 జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. అంతటితో ఆగకుండా తనలోని ప్రతిభను మరింత మెరుగుపర్చుకుంటూ తన చిరకాల స్వప్నం అయిన టీమిండియా టెస్టు జట్టులో స్థానం సంపాదించాడు. తాజాగా ముగిసిన ఆస్ట్రేలియా సిరీస్‌లో తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, టీమిండియా భవిష్యత్తు ఆశాకిరణంలా మారాడు. బ్రిస్బేన్ టెస్టులో బంతితో పాటు బ్యాట్‌తోనూ రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 62 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 22 పరుగులు చేశాడు. మొత్తం 4 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. -
నా కొడుకు లెజెండ్‌గా ఎదుగుతాడు: క్రికెటర్ తండ్రి
న్యూఢిల్లీ: ‘‘ఈ ప్రదర్శన ఎంతో ప్రత్యేకం. వాషింగ్టన్ సుందర్ లెజెండ్‌గా ఎదుగుతాడు. తనకు ప్రతిభ, నైపుణ్యాలతో పాటు, ఆట పట్ల అంకితభావం, కఠిన శ్రమ, క్రమశిక్షణ కూడా ఉన్నాయి. భారత జట్టులో సుదీర్ఘ కాలంపాటు తన ఇన్నింగ్స్ కొనసాగించగలడని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా’’ అంటూ టీమిండియా క్రికెటర్ వాషింగ్టన్ సుందర్ తండ్రి సుందర్ పుత్రోత్సాహంతో పొంగిపోయారు. ఆస్ట్రేలియాలో భారత్ సాధించిన ఘన విజయంలో తన ప్రదర్శన సంతోషాన్నిచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. కాగా అశ్విన్, రవీంద్ర జడేజా వంటి కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడి నిర్ణయాత్మక నాలుగో టెస్టుకు దూరమైన తరుణంలో వాషింగ్టన్కు తుది జట్టులో చోటు దక్కిన విషయం తెలిసిందే. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఈ యువ స్పిన్నర్.. 4 వికెట్లు తీసి సత్తా చాటాడు. (చదవండి: ఆసీస్ టూర్: అరంగేట్రంలోనే అదరగొట్టేశారు!) అదే విధంగా కీలక సమయంలో రిషభ్‌పంత్, శార్దూల్ ఠాకూర్‌తో కలిసి మంచి భాగస్వామ్యం నమోదు చేసిన ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్.. జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించి ప్రశంసలు అందుకున్నాడు. ఇక ఆసీస్ పర్యటన ముగించుకుని టీమిండియా గురువారం స్వదేశానికి చేరుకున్న ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాషింగ్టన్ సుందర్ తండ్రి సుందర్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వాషింగ్టన్, అశ్విన్, టి. నటరాజన్ వీరితో పాటు టీమిండియా మొత్తాన్ని చూస్తుంటే గర్వంతో హృదయం ఉప్పొంగిపోతోంది. వాషింగ్టన్ తనకు వచ్చిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడు. తన ప్రదర్శన పట్ల నేను సంతృప్తిగా ఉన్నా’’అని చెప్పుకొచ్చారు. వద్దంటే రభస చేసేవాడు ‘‘రోజూ ఉదయాన్నే ఐదు గంటలకు నిద్రలేచి గ్రౌండుకు, అక్కడి నుంచి స్కూలు వెళ్లేవాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన వెంటనే హోం వర్ పూర్తి చేసి మళ్లీ ప్రాక్టీసుకు వెళ్లేవాడు. ఒకవేళ ఏదైనా కారణాల చేత అక్కడికి వెళ్లడం కుదరకపోతే ఇంట్లో రభస చేసేవాడు. వర్షం పడుతున్నా సరే ఆటను విడిచిపెట్టేవాడు కాదు’’ అని క్రికెట్ పట్ల కొడుకుకు ఉన్న అంకితభావం గురించి వాషింగ్టన్ తల్లి చెప్పారు. అదే విధంగా.. ‘‘చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకోవడం మా ఇద్దరికి అలవాటు. తన బౌలింగ్ కంటే బ్యాటింగే ఎక్కువగా ఆస్వాదిస్తాను. తనకు నేను వీరాభిమానిని’’ అని అతడి సోదరి జ్యోతి సుందర్ గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. ఇక ఆసీస్ టూర్లో తమిళ యువ ఆటగాళ్లు వాషింగ్టన్ సుందర్(టెస్టు), నటరాజన్(వన్డే, టీ20, టెస్టు) అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. -
ఆ ముగ్గురు ఇండియాను గెలిపించారు
జాత్యహంకారం. కించపరిచే మాటలు. ఒళ్లంతా గాయాలు. అంతిమంగా.. ఒక ఘన విజయం. ముప్పై రెండేళ్ల తర్వాత ఆస్ట్రేలియాలోని ‘గాబా గ్రౌండ్లో ఆస్ట్రేలియాపై ఇండియా గ్రౌండ్ బ్రేకింగ్ విక్టరీ సాధించింది. 2–1తో టెస్ట్ సిరీస్ గెలుచుకుంది. ముగ్గురు హీరోలు. మొహమ్మద్ సిరాజ్. అతడి వెనుక ఉన్న జీవ శక్తి అతడి తల్లి షబానా. ఇంకో హీరో రవిచంద్రన్ అశ్విన్. ఫస్ట్ సిరీస్‌లో రన్స్ కోసం ఒళ్లంతా హూనం చేసుకున్నాడు. భార్య ప్రీతి అతడికి ఊరడింపుగా నిలబడ్డారు. వన్ మోర్ హీరో వాషింగ్టన్ సుందర్. సిరీస్‌లో మూడో రోజు అతడు తీసిన పరుగులే టీమిండియాకు తక్షణ శక్తి! అతడి వెనుక ఉన్న శక్తి మాత్రం సోదరి శైలజ! ఈ ముగ్గురు హీరోలు ఇండియాను నిలబెడితే, వారిని ఈ ముగ్గురు మహిళలు నిలబెట్టినవారయ్యారు. అడిలైడ్‌లో ఓటమి. మెల్బోర్న్లో గెలుపు. సిడ్నీలో మ్యాచ్ డ్రా. గాబాలో గెలుపు. ఇండియా 2–1తో చరిత్రాత్మక విజయం సాధించింది. టీమిండియాలోని మొహమ్మద్ సిరాజ్ ఇండియన్ ఫాస్ట్ బౌలర్. హైదరాబాద్ కుర్రాడు. మెల్బోర్న్లో జరిగిన రెండో టెస్ట్‌లో ఐదు వికెట్లు తీసుకున్నాడు! హీరో అయ్యాడు. కానీ తన కొడుకు హీరో అవడం తండ్రి చూడలేకపోయాడు. టీమిండియా ఆస్ట్రేలియాలో ల్యాండ్ అవగానే ఇక్కడ ఇండియాలో సిరాజ్ తండ్రి చనిపోయారు. టెస్ట్ మ్యాచ్ లో కొడుకు హీరో అవాలని కాదు ఆ తండ్రి కలగంది. అసలంటూ టెస్ట్ మ్యాచ్‌లోకి అడుగుపెట్టాలని. సిరాజ్ తండ్రి ఆటో డ్రైవర్. తల్లి గృహిణి. ఆయన ఇంటిని నడిపాడు. ఆమె సిరాజ్‌ను క్రికెటర్‌గా నడిపించారు. గాబాలో మొన్న ఇండియా ఘన విజయం సాధించగానే.. ‘‘సిరాజ్ క్రికెటర్ కావాలన్న మా నాన్న కలను మా అమ్మ నిజం చేసింది. నాన్న చనిపోయినప్పుడు సిరాజ్ గుండెను దిటవు పరచింది అమ్మే. సిరాజ్ కెరీర్లో అమ్మది కీలకమైన పాత్ర’’ అని సిరాజ్ సోదరుడు (అన్న) మొహమ్మద్ ఇస్మాయిల్ అన్నారు. సిరాజ్ తల్లి షబానా బేగం. ఆస్ట్రేలియా లో ఉన్న సిరాజ్‌ను తండ్రి మరణం నుంచి తేరుకునేలా చేయడానికి అతడితో రోజూ కనీసం రెండు గంటలైనా మాట్లాడేవారు, ధైర్యం చెప్పేవారు. మనిషి రాటు తేలినట్లు ఉంటాడు కానీ సిరాజ్ వట్టి ఉద్వేగ ప్రాణి. మహా సున్నితం. సిడ్నీ మ్యాచ్ లో టీమిండియా జాతీయ గీతం ఆలపిస్తున్నప్పుడు తండ్రి గుర్తుకు రావడంతో సిరాజ్ కళ్లలో నీళ్లు ఉబికివచ్చాయి. ‘హి గాట్ ఎమోషనల్’ అని బీసీసీఐ ట్వీట్ చేసింది. ∙∙ ఆస్ట్రేలియా టూర్లో ఇంకో హీరో రవిచంద్రన్ అశ్విన్. ఆల్ రౌండర్. చెన్నై ప్లేయర్. సిడ్నీ మ్యాచ్ డ్రా అయి ఇండియా గట్టెక్కింది ఇతడి వల్లనే. ఆ మ్యాచ్‌లో ఏకధాటిగా మూడు గంటలపాటు బ్యాటింగ్ చేసి 128 బాల్స్‌కి 39 రన్స్ తీశాడు. ఆ మాత్రానికైనా అతడు చెల్లించవలసి వచ్చిన మూల్యం ఒళ్లు హూనం చేసుకోవడం. కష్టపడ్డాడు. ‘‘భరించలేనంత వెన్నునొప్పితో ఆయన నిద్రపోలేకపోయారు. నిలవడం, కూర్చోవడం కూడా కష్టమైపోయింది. వంగి షూ లేస్‌లను కూడా కట్టుకోలేకపోయారు. ఆ నొప్పితోనే అద్భుతంగా ఆడారు’’ అని అశ్విన్ భార్య ప్రీతి ట్వీట్ చేశారు. అందుకు అశ్విన్ ఒక కన్నీటి ఎమోజీ, చేతులు జోడించిన రెండు ఎమోజీలు పెట్టి ‘‘ఇన్స్టెంట్ టియర్స్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ మి త్రూ ఆల్ దిస్’’ అని రీ ట్వీట్ చేశారు. ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ తన భర్తను స్లెడ్జ్ చేసిన సంగతిని కూడా ఆమె బాగానే గుర్తుపెట్టుకుని ఇండియా గెలిచాక అంతకంతా తీర్చుకున్నారు. ‘‘గాబాలో చూసుకుందాం’ అని టిమ్ పెయిన్ తన భర్తను స్లెడ్జ్ (తక్కువ చేసి మాట్లాడ్డం) చేసినందుకు ప్రతీకారంగా ఆమె ‘గాబాలో చూసుకుందాం’ అనే మాటతో ట్విట్టర్ లో ప్రస్తావిస్తూ భారత విజయాన్ని సెలబ్రేట్ చేశారు. టీమిండియాను తన కూతురు ఉల్లాస పరుస్తున్న వీడియోను కూడా షేర్ చేశారు. ∙∙ టెస్ట్ సిరీస్‌లో టీమిండియా గెలుపునకు కారణం అయిన మరో ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్. ఇతడిది కూడా చెన్నై. తొలి ఇన్నింగ్స్‌లోనే స్మిత్ సహా మూడు వికెట్లు పడగొట్టాడు. సిరీస్‌లో మూడో రోజు 62 పరుగులు తీసి జట్టుకు తక్షణ శక్తిని అందించాడు. రెండో ఇన్నింగ్‌లో కూడా ఒక వికెట్ తీసుకున్నాడు. కీలక దశలో 22 పరుగులు తీశాడు. కెరీర్లో సుందర్ వెనుక ఉన్న శక్తి, స్ఫూర్తి అతడి అక్క శైలజ. ‘‘మా తమ్ముడిని చూసి ఆర్నెల్లు అయింది. వాడి రాక కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను’’ అని ఇండియా గెలిచిన సందర్భంలో తన కామెంట్ అడిగేందుకు వచ్చిన మీడియా ప్రతినిధులతో శైలజ అన్నారు. ఈ అక్కాతమ్ముడికి ‘సూపర్ సిబ్లింగ్స్’ అని పేరు. ఏ ఫొటోలో అయినా అక్క పక్కనే తమ్ముడు. అక్కే తమ్ముడి ప్రపంచం. ఆమె పుట్టిన రోజుకు ‘హ్యాపీ బర్త్‌డే మై వరల్డ్’ అని శుభాకాంక్షలు తెలిపే ఈ క్రికెటర్‌కు ఆట–అక్క సమాన ప్రపంచాలు. శైలజ కూడా క్రికెటరే. సిరాజ్ క్రికెటర్ కావాలన్న మా నాన్న కలను మా అమ్మ నిజం చేసింది. నాన్న చనిపోయినప్పుడు సిరాజ్ గుండెను దిటవుపరచింది అమ్మే. సిరాజ్ కెరీర్లో అమ్మది కీలకమైన పాత్ర. – సిరాజ్ సోదరుడు ఇస్మాయిల్ మొహమ్మద్ సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్ -
బ్రిస్బేన్ నాలుగో టెస్టులో భారత్ ఘన విజయం
-
బిర్యానీని బాగా తగ్గించాను: సిరాజ్
బ్రిస్బేన్ టెస్టు మూడో రోజు... వాషింగ్టన్ సుందర్ అవుటై పెవిలియన్‌కు తిరిగి వస్తున్నాడు. అప్పటికే డ్రెస్సింగ్ రూమ్ నుంచి కిందకు దిగి వచ్చి బౌండరీ వద్ద టాప్ స్పిన్నర్ అశ్విన్ నిలబడ్డాడు. సుందర్ రాగానే ఆత్మీయంగా దగ్గరకు తీసుకొని అభినందించాడు. తన స్థానంలో బరిలోకి దిగిన ఆటగాడి అద్భుత ప్రదర్శనకు అతను ఇచ్చిన కితాబు అది. మ్యాచ్ నాలుగో రోజు... పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా ఇలాగే ఒక్కడే ఎదురు చూస్తూ నిలబడ్డాడు. ఐదు వికెట్ల ప్రదర్శన అనంతరం సహచరుల అభినందనల మధ్య ముందుగా నడుస్తూ వచ్చిన సిరాజ్‌ను ఎంతో ఆప్యాయంగా హత్తుకొని తన ఆనందాన్ని ప్రదర్శించాడు. ఈ దృశ్యం సోమవారం హైలైట్‌గా నిలిచింది. తాను గాయంతో దూరం కావడంతో బౌలింగ్ భారం మోసిన ఆటగాడు అంచనాలకు మించి రాణించడం, ఐదు వికెట్లతో తిరిగి రావడం బుమ్రాలో కూడా సంతోషం నింపిందనడంలో సందేహం లేదు. క్యాచ్ పట్టి సిరాజ్ ఐదో వికెట్ ప్రదర్శనకు కారణమైన శార్దుల్ ఠాకూర్ చప్పట్లతో నవ్వుతూ అతడి వెంట నడవటం... ఐదో వికెట్ తీశాక ఆకాశం వైపు చూస్తూ సిరాజ్ తన తండ్రిని గుర్తు చేసుకున్న క్షణాన మయాంక్ అగర్వాల్ అదే తరహాలో అందులో భాగం కావడం... ఇవన్నీ సగటు భారత క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మరచిపోలేరు. ఈ సిరీస్ ఆసాంతం భారత క్రికెటర్లలో ఒక రకమైన ప్రత్యేక అనుబంధం కనిపించింది. సాధారణంగా ఆటలో వినిపించే ‘టీమ్ స్పిరిట్’ మాత్రమే కాదు... ఇది అంతకంటే ఎక్కువ. వీరంతా సుదీర్ఘ కాలంగా బయో బబుల్‌లో ఉంటూ వచ్చారు. సహచరులు తప్ప మరో ప్రపంచం లేకుండా పోయింది. సిరీస్‌లో వేర్వేరు దశల్లో ప్రతికూలతల నడుమ వారంతా గొప్ప పోరాటపటిమ కనబర్చారు. అందరి లక్ష్యం మాత్రం ఆసీస్‌ను మట్టికరిపించడమే. రెండేళ్ల క్రితం కూడా ఆస్ట్రేలియాలో మన జట్టు సిరీస్ గెలిచినా... ఇప్పటి పరిస్థితులు భిన్నం. ముఖ్యంగా టాప్–4 పేస్ దళంలో ఒక్కరు కూడా లేకుండా బ్రిస్బేన్ టెస్టుకు సిద్ధమైన వేళ జట్టు మరింత పట్టుదలగా నిలబడింది. ఈ జట్టులో ఇప్పుడు సీనియర్, జూనియర్ ఎవరూ లేరు. అంతా ఒక్కటే! ఒక్కో ఆసీస్ వికెట్ తీస్తున్న సమయంలో మన ఆటగాళ్ల సంబరాలు చూస్తే ఇది అర్థమవుతుంది. ముఖ్యంగా సిరాజ్‌కు కష్టకాలంలో జట్టు మొత్తం అండగా నిలబడింది. తండ్రి అంత్యక్రియలకు వెళ్లరాదని అతను తీసుకున్న నిర్ణయం నిజంగానే కెరీర్‌ను మార్చేసింది. మెల్బోర్న్ నుంచి బ్రిస్బేన్ చేరే వరకు అతని ఆట మరింత మెరుగైంది. తన మూడో టెస్టులోనే సహచర పేసర్లకు సూచనలిస్తూ కనిపించిన సిరాజ్ స్వయంగా ఐదు వికెట్లతో మార్గనిర్దేశనం చేశాడు. సిరాజ్ తండ్రి మరణ వార్త తెలిసిన రోజున ‘మీ నాన్న ఆశీస్సులు నీ వెంట ఉంటాయి. ఈ టూర్లో ఏదో ఒక దశలో మ్యాచ్ ఆడతావు. ఐదు వికెట్లు కూడా తీస్తావు’...అని హెడ్ కోచ్ రవిశాస్త్రి చెప్పిన మాట అక్షరసత్యమైంది. ఇప్పుడు సచిన్ మొదలు క్రికెట్ దిగ్గజాలంతా అతని అంకితభావంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ అభినందనలకు సిరాజ్ అర్హుడనడంలో ఎలాంటి సందేహం లేదు! బిర్యానీని బాగా తగ్గించాను సిరీస్‌లో తీసిన 13 వికెట్లలో ఈ రోజు తీసిన స్మిత్ వికెట్ నాకు అన్నింటికంటే ఎక్కువ ఆనందాన్నిచ్చింది. నాపై నమ్మకముంచి పదే పదే తన మాటలతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగేలా చేసిన రహానేకు కృతజ్ఞతలు. నాన్న దీవెనలతోనే ఐదు వికెట్ల ప్రదర్శన సాకారమైందని భావిస్తున్నా. నా స్పందనను మాటల్లో చెప్పలేను. లాక్డౌన్ సమయం నుంచి టెస్టు క్రికెట్‌కు కావాల్సిన ఫిట్నెస్ను సాధించడంలో ఫిట్నెస్ ట్రైనర్ సోహమ్ దేశాయ్ ఎంతో సహకరించారు. ఈ క్రమంలో నేను తినే బిర్యానీని బాగా తగ్గించారు. నన్ను నేను సీనియర్ బౌలర్‌గా భావించుకోలేదు. దేశవాళీలో, ‘ఎ’ జట్టు తరఫున ఆడటం నాకు మేలు చేసింది. బుమ్రా లేకపోవడంతో అదనపు బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది. మొహమ్మద్ సిరాజ్ -
సుందరం శార్దూలం...
ఒక్క తొలి టెస్టు తప్ప... ప్రతీ టెస్టుకు ముందు భారత్‌కు ప్రతికూలతలే. మ్యాచ్ మొదలయ్యాక కష్టాలే! అయినా సరే ప్రతికూలతలకు ఎదురీదుతోంది. కష్టాలన్నీ అధిగమిస్తోంది. మ్యాచ్ మ్యాచ్‌కూ అనుభవజ్ఞులు దూరమవుతున్నా... రిజర్వ్ బెంచ్ సత్తా చాటుతోంది. నిజం చెప్పాలంటే టీమిండియాది పోరాటం కాదు... అంతకుమించిన ఉక్కు సంకల్పం. అందుకేనేమో ప్రత్యర్థి పైచేయి సాధిస్తున్న ప్రతీసారి భారత్ పిడికిలి బిగిస్తోంది. ఆతిథ్య జట్టును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీంతో ఈ భారత్–ఆసీస్ సిరీస్ రసవత్తరంగా మారి యావత్ సంప్రదాయ క్రికెట్‌కు కొత్త జీవం పోస్తోంది. ఐదు రోజుల టెస్టు బోర్ కాదు బెస్ట్ అని చాటి చెబుతోంది. బ్రిస్బేన్: మెరుపుల టి20ల ముందు వెలవెల బోతున్న టెస్టులకు కాలం చెల్లలేదని భారత్, ఆస్ట్రేలియా సిరీస్ ప్రతీ మ్యాచ్‌లోనూ నిరూపిస్తోంది. కాదు కాదు చూపిస్తోంది. ఆఖరి టెస్టులో మూడో రోజు ఆటను భారత లోయర్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ శార్దుల్ ఠాకూర్ (115 బంతుల్లో 67; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), వాషింగ్టన్ సుందర్ (144 బంతుల్లో 62; 7 ఫోర్లు, 1 సిక్స్) మార్చేశారు. ఆతిథ్య బౌలర్లను వీళ్లిద్దరే శాసించారు. ఆదివారం తొమ్మిది మంది బ్యాటింగ్‌కు దిగితే ఈ జోడీ మాత్రమే ఆస్ట్రేలియాను చెమటలు కక్కించింది. భారత్‌ను కష్టాల నుంచి గట్టెక్కించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 111.4 ఓవర్లలో 336 పరుగుల వద్ద ఆలౌటైంది. ఆసీస్ బౌలర్లలో హాజల్‌వుడ్ (5/57) ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 33 పరుగుల ఆధిక్యమే పొందిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో ఆట నిలిచే సమయానికి వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. ఓపెనర్లు వార్నర్ (20 బ్యాటింగ్), హారిస్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఆసీస్ జట్టు ఓవరాల్ ఆధిక్యం 54 పరుగులు. నాలుగో రోజు రెండు జట్ల ఆటతీరే ఈ మ్యాచ్ ఫలితం ఎవరివైపు మొగ్గుతుందో తేల్చనుంది. భారత బౌలర్లు ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేస్తారా... భారత బౌలింగ్‌ను ధీమాగా ఎదుర్కొని భారీ స్కోరు చేసి ఆసీస్ నిలబడుతుందా వేచి చూడాలి. ‘వంద’ వరకే బాగుంది తొలి సెషన్ ఆరంభంలో బాగున్నట్లు కనిపించిన భారత ఇన్నింగ్స్ లంచ్‌లోపే కష్టాల్లోకి జారుకుంది. ఓవర్‌నైట్ స్కోరు 62/2తో మూడో రోజు ఆట కొనసాగించిన భారత్ 100 పరుగుల దాకా బాగానే ఉంది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ చతేశ్వర్ పుజారా (94 బంతుల్లో 25; 2 ఫోర్లు), కెప్టెన్ రహానే (93 బంతుల్లో 37; 3 ఫోర్లు) నిలదొక్కుకుంటున్న తరుణంలో హాజల్‌వుడ్ దెబ్బతీశాడు. 105 స్కోరు వద్ద పుజారాను ఔట్ చేశాడు. వేగంగా దూసుకొచ్చి న బంతిని డిఫెన్స్ చేయడానికి ప్రయత్నించగా... అది పుజారా బ్యాట్ అంచును తగిలి కీపర్ పైన్ చేతుల్లో పడింది. తర్వాత లంచ్ విరామానికి కాస్తముందుగా రహానే ఆటను స్టార్క్ ముగించాడు. బెంబేలెత్తించిన హాజల్‌వుడ్ భారత్ 161/4 స్కోరుతో లంచ్ బ్రేక్‌కు వెళ్లొచ్చిన వెంటనే హాజల్‌వుడ్ నిప్పులు చెరిగే బౌలింగ్‌తో కుర్రాళ్లను హడలెత్తించాడు. దీంతో రెండో సెషన్ మొదలైన రెండో బంతికే మయాంక్ అగర్వాల్ (75 బంతుల్లో 38; 3 ఫోర్లు, సిక్స్) పెవిలియన్ చేరాడు. షాట్‌కు ప్రయత్నించిన మయాంక్ రెండో స్లిప్‌లో ఉన్న స్మిత్ చేతికి చిక్కాడు. కాసేపటికే రిషభ్ పంత్ (23; 2 ఫోర్లు) కూడా హాజల్‌వుడ్ బౌలింగ్‌లోనే అవుటయ్యాడు. బౌన్సర్‌ను షాట్‌గా మలిచేందుకు చేసిన పంత్ ప్రయత్నం బెడిసింది. అక్కడే గాల్లోకి లేచిన బంతిని గల్లీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న గ్రీన్ అందుకోవడంతో పంత్ ఇన్నింగ్స్ ముగిసింది. అప్పటికి భారత్ స్కోరు 186/6. గత టెస్టులో తమతో ఓ ఆటాడుకున్న పంత్ పెవిలియన్ చేరడం, ఇకపై వచ్చే స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ ఎవరూ లేకపోవడంతో ఆసీస్ శిబిరంలో ఆనందం ఆకాశాన్నంటింది. ఫిఫ్టీ–ఫిఫ్టీలతో బాగుపడింది కెరీర్లో తొలి టెస్టు ఆడుతున్న వాషింగ్టన్ సుందర్ ... రెండో టెస్టు మాత్రమే ఆడుతున్న శార్దుల్ ఠాకూర్లు బౌలింగ్ కేటగిరీలోనే తుది జట్టులోకి వచ్చారు. ఇద్దరికీ బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ ఆసీస్ గడ్డపై... అది కూడా స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌నే గడగడలాడిస్తున్న ఆసీస్ పేస్ త్రయం హాజల్‌వుడ్, కమిన్స్, స్టార్క్‌ను ఎదుర్కోగలరని ఎవరూ ఊహించలేదు. కానీ వీరిద్దరి ఆట అరివీర పేసర్ల బంతుల్ని తుత్తునీయలు చేసింది. తర్వాత్తర్వాత పరుగులతో ఇన్నింగ్స్‌ను పేర్చేసింది. అటుపై కష్టాల నుంచి జట్టును గట్టెక్కించింది. ప్రత్యర్థి భారీ ఆధిక్యానికి లొంగాల్సిన చోట భారీ భాగస్వామ్యాన్ని నిర్మించింది. దీంతో పంత్ అవుటైనప్పటి ఆనందం ఆసీస్‌లో క్రమంగా ఆవిరైంది. ఓవర్లు గడిచేకొద్దీ... పరుగులు పెరిగేకొద్దీ... ఇద్దరు అర్ధశతకాలు బాదేసేదాకా సాగిపోయింది. ఇది భారత్ ఇన్నింగ్స్‌ను పటిష్టస్థితికి తీసుకెళ్లింది. ప్రత్యర్థి బౌలింగ్‌ను నీరుగార్చేసింది. కమిన్స్ ఓవర్లో బ్యాక్వర్డ్ స్క్వేర్‌లెగ్‌లో సిక్సర్ బాదిన శార్దుల్... బౌండరీలనైతే మంచినీళ్ల ప్రాయంగా బాదేశాడు. సుందర్ కూడా లయన్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ కొట్టాడు. ఇద్దరు చక్కని సమన్వయంతో ఫిఫ్టీలను పూర్తి చేసుకున్నారు. జట్టు స్కోరు 300 మార్క్‌ను దాటింది. గబ్బాలో ఏడో వికెట్‌కు అత్యధికంగా 123 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాక శార్దుల్ ఔటయ్యాడు. తర్వాత భారత్ ఇన్నింగ్స్ ఎంతో సేపు సాగలేదు. సైనీ (5), సిరాజ్ (13)లను హాజల్‌వుడ్ ... సుందర్‌ను స్టార్క్ అవుట్ చేయడంతో టీమిండియా ఇన్నింగ్స్ ముగిసింది. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 369; భారత్ తొలి ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) స్టార్క్ (బి) లయన్ 44; శుబ్‌మన్ గిల్ (సి) స్మిత్ (బి) కమిన్స్ 7; పుజారా (సి) పైన్ (బి) హాజల్‌వుడ్ 25; అజింక్య రహానే (సి) వేడ్ (బి) స్టార్క్ 37; మయాంక్ అగర్వాల్ (సి) స్మిత్ (బి) హాజల్‌వుడ్ 38; రిషభ్ పంత్ (సి) గ్రీన్ (బి) హాజల్‌వుడ్ 23; వాషింగ్టన్ సుందర్ (సి) గ్రీన్ (బి) స్టార్క్ 62; శార్దుల్ ఠాకూర్ (బి) కమిన్స్ 67; నవదీప్ సైనీ (సి) స్మిత్ (బి) హాజల్‌వుడ్ 5; సిరాజ్ (బి) హాజల్‌వుడ్ 13; నటరాజన్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (111.4 ఓవర్లలో ఆలౌట్) 336. వికెట్ల పతనం: 1–11, 2–60, 3–105, 4–144, 5–161, 6–186, 7–309, 8–320, 9–328, 10–336. బౌలింగ్: స్టార్క్ 23–3–88–2, హాజల్‌వుడ్ 24.4–6–57–5, కమిన్స్ 27–5–94–2, గ్రీన్ 8–1–20–0, లయన్ 28–9–65–1, లబ్‌షేన్ 1–1–0–0. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: హారిస్ (బ్యాటింగ్) 1; డేవిడ్ వార్నర్ (బ్యాటింగ్) 20; మొత్తం (6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 21. బౌలింగ్: సిరాజ్ 2–1–12–0, నటరాజన్ 3–0–6–0, వాషింగ్టన్ సుందర్ 1–0–3–0. ► అరంగేట్రం టెస్టులోనే మూడు వికెట్లు తీయడంతోపాటు 50 అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన పదో క్రికెటర్‌గా, భారత్ నుంచి మూడో క్రికెటర్‌గా వాషింగ్టన్ సుందర్ గుర్తింపు పొందాడు. భారత్ నుంచి సుందర్కంటే ముందు దత్తూ ఫాడ్కర్ (1947లో ఆస్ట్రేలియాపై సిడ్నీలో... 51 పరుగులు; 3/14), హనుమ విహారి (2018లో ఇంగ్లండ్‌పై ఓవల్‌లో... 56 పరుగులు; 3/37) ఈ ఘనత సాధించారు. ► భారత్‌పై టెస్టుల్లో 33 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కడం ఆస్ట్రేలియాకిది మూడోసారి. గతంలో 33 పరుగుల ఆధిక్యం పొందిన రెండుసార్లూ ఆస్ట్రేలియా (1979లో కాన్పూర్; అడిలైడ్ 2003) ఆ టెస్టుల్లో ఓడిపోవడం గమనార్హం. ► ఆస్ట్రేలియా గడ్డపై భారత బ్యాట్స్‌మన్ జోడీ ఏడో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పడం ఇది నాలుగోసారి. గతంలో రిషభ్ పంత్–రవీంద్ర జడేజా (204 పరుగులు; 2019లో సిడ్నీ)... విజయ్ హజారే–హేమూ అధికారి (132 పరుగులు; 1948లో అడిలైడ్)... అజహరుద్దీన్–మనోజ్ ప్రభాకర్ (101 పరుగులు; 1992లో అడిలైడ్) జోడీలు ఈ ఘనత సాధించాయి. -
శార్దూల్, వషీ జబర్దస్త్; గతం గుర్తు చేసుకున్న సెహ్వాగ్
బ్రిస్బేన్: కీలక ఆటగాళ్లు గాయాలతో జట్టుకు దూరమై తుది జట్టుకు సరిపడా 11 మంది ఉంటే చాలుననే పరిస్థితుల నడుమ టీమిండియా వారిపై నమ్మకముంచింది. బాగా ఆడండి అని బెస్టాఫ్ లక్ చెప్పింది. ఆ నమ్మకాన్ని నిజం చేశారు వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, నటరాజన్. ముగ్గురికీ పెద్దగా అనుభవం లేకపోయినా బౌలింగ్ విభాగంలో తలో మూడు వికెట్లు తీసి ఆకట్టుకోగా.. బ్యాటింగ్ లోనూ శార్దూల్, సుందర్ మేటి ఆట ఆడారు. పటిష్టమైన ఆసీస్ బౌలింగ్ దళాన్ని ఎదుర్కొని క్లిష్ట సమయంలో అర్ధ సెంచరీలతో జట్టును ఆదుకున్నారు. బ్రిస్బేన్‌లో జరుగుతున్న నిర్ణయాత్మక నాలుగో టెస్టులో ఈ ఇద్దరూ ఏడో వికెట్‌కు విలువైన 123 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఫలితంగా భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 336 పరుగులు చేసి ఆలౌట్ అయింది. (చదవండి: వీరాభిమాని నం.1) ఏడో వికెట్‌గా శార్దూల్ (115 బంతుల్లో 67; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఔటైన అనంతరం టీమిండియా బ్యాటింగ్ ఎంతోసేపు కొనసాగలేదు. ఆ వెంటనే నవదీప్ సైనీ (5), సుందర్ (144 బంతుల్లో 62; 7 ఫోర్లు, 1 సిక్స్), సిరాజ్ (13) పెవిలియన్ చేరారు. నటరాజన్ 1 పరుగుతో నాటౌట్‌గా నిలిచాడు. హేజిల్‌వుడ్ 5 వికెట్లతో టీమిండియాను దెబ్బ తీశాడు. స్టార్క్, కమినన్స్ చెరో రెండు వికెట్లు, లైయన్ ఒక వికెట్ దక్కించుకున్నారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆతిథ్య జట్టు వికెట్లేమీ కోల్పోకుండా 21 పరుగులు చేసింది. మార్కస్ హేరిస్ (1), డేవిడ్ వార్నర్ (20) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 33 పరుగుల ఆదిక్యంతో ఆసీస్ ప్రస్తుతం 54 పరుగుల లీడింగ్‌లో ఉంది. ఇక శార్దూల్, సుందర్ పోరాటపటిమపై అటు మాజీ క్రికెటర్లు, క్రీడా విశ్లేషకులు, ఇటు అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నమ్మకాన్ని నిలబెట్టుకున్న అసలైన ఆటగాళ్లు అని అభిమానులు సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. అడిలైడ్ టెస్టును గుర్తు చేసుకున్న వీరూ 186 పరుగులకు 6 వికెట్లు కోల్పోయిన దశలో శార్దూల్, వషీ గుర్తుండిపోయే భాగస్వామ్యాన్ని నెలకొల్పారని టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ ట్విటర్లో పేర్కొన్నాడు. 2003లో అడిలైడ్ వేదికగా జరిగిన టెస్టు గుర్తొస్తుందని చెప్పాడు. అప్పుడు కూడా భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 33 పరుగుల వెనుకబడి ఉందని, తాజా గబ్బా టెస్టులోనూ అదే జరిగిందని అన్నాడు. 133 పరుగుల ఆదిక్యం లభిస్తుందని భావించిన ఆసీస్‌కు శార్దూల్, వషీ పోరాటంతో 33 పరుగులు మాత్ర దక్కాయని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. ఆసీస్ నలుగురు బౌలర్లకు 1000 వికెట్లు తీసిన అనుభవం ఉండగా.. గబ్బా టెస్టులో టీమిండియా ఐదుగురు బౌలర్లకు 11 వికెట్లు తీసిన అనుభవమే ఉన్నా వారి అద్భుత ఆటతీరు జబర్దస్త్‌గా ఉందని పేర్కొన్నాడు. కాగా, 2003 నాటి అడిలైడ్ టెస్టులో భారత్ విజయం విజయం సాధించడం గమనార్హం. (చదవండి: నేను ఇలాగే ఆడతా : రోహిత్ శర్మ) Adelaide 2003 : India conceded a lead of 33. Today in Brisbane India concede 33 , when at one stage it looked like they may end up conceding 133. Great effort considering that Australia’s 4 bowlers had more than 1000 Test wickets to India’s 5 bowlers having 11. Shandar Zabardast — Virender Sehwag (@virendersehwag) January 17, 2021 -
అంతా ధోని వల్లే..: ఆర్సీబీ బౌలర్
దుబాయ్: ఈ ఐపీఎల్ సీజన్లో అత్యుత్తమ ఎకానమీతో నమోదు చేస్తూ ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్. తానొక ఆఫ్స్పిన్నర్ననే బెరుకు కానీ, బ్యాట్స్‌మెన్ విరుచుకుపడతారన్న భయం కానీ భారీగా పరుగులు ఇస్తాననే ఆందోళన కానీ సుందర్ కు లేవు. అతనికి ఉన్నదల్లా తనపై తనకు నమ్మకమే. ఇప్పటివరకూ ఐదు వికెట్లను మాత్రమే సుందర్ సాధించినా, పరుగుల ఇవ్వడంలో అత్యంత పొదుపుగా బౌలింగ్ చేస్తూ ఎకానమీ పరంగా టాప్ లేపుతున్నాడు. అతని ఎకానమీనే ఆర్సీబీకి కొన్ని అద్భుతమైన విజయాలను సాధించి పెట్టిందనేది అందరికీ తెలిసిన సత్యం. ఈ సీజన్లో అత్యుత్తమ ఎకానమీ జాబితాలో సుందర్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకూ 4.90 ఎకానమీ నమోదు చేశాడు సుందర్. అంటే ఓవర్‌కు ఐదు పరుగులు కంటే తక్కువ ఇస్తూ శభాష్ అనిపిస్తున్నాడు. ఐపీఎల్-2020లో సుందర్ ఇప్పటివరకూ 22 ఓవర్లు వేసి 108 పరుగులు మాత్రమే ఇచ్చాడు. (ఐపీఎల్ చరిత్రలోనే ‘ఫాస్టెస్ట్’ రికార్డు) ఇదిలా ఉంచితే, తన బౌలింగ్‌లో రాటుదేలడానికి టీమిండియా మాజీ కెప్టెన్, సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనినే కారణమంటున్నాడు సుందర్. ‘గతంలో రైజింగ్ పుణెకు ధోని నాయకత్వంలోనే ఆడాను. అప్పుడు నేను క్రికెటర్‌గా పరిపక్వత సాధించడానికి ధోని చేసిన సాయం మరువలేనిది. పుణెకు ఆడిన సమయంలోనే నేను బాగామెరుగయ్యా. అందుకు కారణం ధోనినే. ఒక బౌలర్‌గా ఎదిగింది ధోని నాయకత్వంలోనే. ఈ స్థాయిలో ఉండటానికి ధోనినే ప్రధాన కారణం’ అని సుందర్ తెలిపాడు. కింగ్స్ పంజాబ్‌తో గురువారం మ్యాచ్ జరుగనున్న తరుణంలో సుందర్ మాట్లాడాడు. ఇక బ్యాట్స్‌మన్‌ను ఎలా బోల్తా కొట్టిస్తున్నారు అనే విషయంపై కూడా సుందర్ పెదవి విప్పాడు. ‘ మనం బంతిని కొద్ది ఆలస్యంగా చేతి నుంచి రిలీజ్ చేయడమే ప్రధానమైనది. అక్కడ బ్యాట్స్‌మన్ ఫుట్‌వర్క్‌ను ఫాలో అయితే బంతిని వేయడం ఈజీగా ఉంటుంది. బ్యాట్స్‌మన్ ఏమీ చేయబోతున్నాడు అనేది మనం బంతిని ఆలస్యంగా విడుదల చేయడంపైనే ఉంటుంది. బంతిని వీలైనంత ఆలస్యంగా విడుదల చేయడం గురించి నాకు అవగాహన ఉంది. అదే నా టెక్నిక్’ అని సుందర్ పేర్కొన్నాడు. (ధోని కెప్టెన్సీ మ్యాజిక్) -
402 పరుగుల్లో 12 పరుగులే అంటే..
దుబాయ్: బ్యాట్స్‌మెన్ విరుచుకుపడతారన్న భయం లేదు. తానొక ఆఫ్ స్పిన్నర్‌నన్న బెరుకు లేదు. పరుగులు భారీగా ఇస్తానేమోనన్న ఆందోళన లేదు. పవర్ ప్లేలో బౌలింగ్ చేస్తున్నానన్న ఒత్తిడి లేదు. ఉన్నదల్లా తనపై తనకు నమ్మకమే... అతనే వాషింగ్టన్ సుందర్. ప్రస్తుతం ఆర్సీబీ తరఫున ఆడుతున్న వాషింగ్టన్ విశేషంగా రాణిస్తున్నాడు. మూడేళ్ల క్రితం అంటే 2017 ఐపీఎల్లో అరంగేట్రం చేసిన సుందర్.. అప్పుడే తనకో ప్రత్యేకతను చాటుకున్నాడు. ఐపీఎల్ పదో సీజన్లో క్వాలిఫయిర్-1 మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై పుణె సూపర్ జెయింట్ విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన సుందర్ 16 పరుగులిచ్చి మూడు కీలక వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన వాషింగ్టన్ సుందర్‌కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఆ సమయంలో ఐపీఎల్ ఆడుతున్న పిన్నవయస్కులో జాబితాలో సుందర్ మూడో స్థానాన్ని ఆక్రమించాడు.(చదవండి: కుంబ్లే సరసన వాషింగ్టన్ సుందర్) మళ్లీ ముంబైపైనే.. తాజాగా ముంబై ఇండియన్స్‌పైనే వాషింగ్టన్ సుందర్ అద్భుతమైన గణాంకాలు నమోదు చేశాడు. ఐపీఎల్ అంటే బ్యాట్స్‌మెన్ గేమ్ అని చెప్పుకునే మనం.. వాషింగ్టన్ బౌలింగ్‌తో ఇది బౌలర్ గేమ్ కూడా అని అనక తప్పదు. ఆద్యంతం బ్యాటింగ్ ప్రవాహంలా సాగిన ఈ మ్యాచ్‌లో వాషింగ్టన్ ఇచ్చిన పరుగులు 12. ఇరుజట్లు మొత్తంగా 402 పరుగులు చేస్తే సుందర్ 12 పరుగులే ఇచ్చాడంటే అతని ప్రతిభ అర్థమవుతోంది. ప్రధానంగా బ్యాట్స్‌మన్ ప్రతిదాడికి చిక్కకుండా బంతుల్ని విసిరి శభాష్ అనిపించుకుంటున్నాడు. చెన్నై నుంచి వచ్చిన సుందర్.. తన ఐపీఎల్ కెరీర్‌ను పుణెతో ఆరంభించాడు. ఇప్పుడు ఆర్సీబీ తరుఫున ఆడుతూ కీలక బౌలర్‌గా నిలుస్తున్నాడు. నిన్నటి మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్ అద్భుతమైన బౌలింగ్ గణాంకాలతో మెరిశాడు. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో భాగంగా తన నాలుగు ఓవర్ల స్పెల్‌లో వికెట్ తీసి 12 పరుగులిచ్చాడు. . ఫలింతగా ఎకానమీ రేటు 3.00గా నమోదైంది. ఇది ఆర్సీబీ తరఫున ఒక స్పిన్నర్ మూడో అత్యుత్తమ ఎకానమీ రేట్. ఫలితంగా అనిల్ కుంబ్లే సరసన చేరాడు వాషింగ్టన్ సుందర్. ఇక పవర్ ప్లేలో వాషింగ్టన్ సుందర్ 3 ఓవర్లలో 7 పరుగులిచ్చి వికెట్ తీశాడు. దాంతో అతని ఎకానమీ రేటు 2.33గా నమోదైంది. 2018 నిదహస్ ట్రోఫీలో కూడా.. రెండేళ్ల క్రితం జరిగిన నిదహస్ ట్రోఫీ ప్రారంభానికి ముందు సమీకరణాల ప్రకారం చూస్తే వాషింగ్టన్కు తుది జట్టులో చోటు కొంత అనుమానంగానే ఉండేది. అయితే, తొలి మ్యాచ్‌లోనే అవకాశం దక్కించుకున్న అతడు ఏకంగా పవర్ ప్లేలో బౌలింగ్‌కు దిగి చక్కటి గణాంకాలతో మెప్పించాడు. దీంతో తర్వాతి మ్యాచ్‌లకూ కొనసాగించక తప్పలేదు. ఈ నమ్మకాన్ని సుందర్ ఎక్కడా కోల్పోలేదు. టోర్నీలో ప్రధాన పేసర్లు శార్దుల్ ఠాకూర్, ఉనాద్కట్, సిరాజ్‌లు కంటే మెరుగైన బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు. అక్కడ వాషింగ్టన్ ఎకానమీ 5.7 మాత్రమే. దీన్నిబట్టి అతడెంత కట్టుదిట్టంగా బంతులేశాడో తెలుస్తోంది. ఆ ట్రోఫీని భారత్ గెలవగా వాషింగ్టన్ సుందర్ 8 వికెట్లు సాధించాడు. చహల్‌తో కలిసి ఆ టోర్నీలో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా నిలిచాడు. ‘ముని వేళ్ల’ మాయాజాలం బ్యాట్స్‌మెన్‌ను వైవిధ్యం, ఊహాతీత బంతులతో అవుట్ చేయడం లెగ్స్పిన్నర్లకి వెన్నతో పెట్టిన విద్య. కానీ... సుందర్ ఆఫ్ స్పిన్నర్. అతడి మాయాజాలం అంతా మునివేళ్ల మీదనే ఉంటుంది. బ్యాట్స్‌మన్ భారీ షాట్‌కు యత్నిస్తున్నాడని పసిగట్టి వెంటనే బంతి వేగం తగ్గించి, లైన్‌ను మార్చేస్తాడు. ఇదే పద్దతి పాటిస్తూ బ్యాట్స్‌మన్‌ను ఇరకాటంలో పడేస్తున్నాడు. ఇక్కడ బ్యాట్స్‌మన్ ఏమాత్రం గాడి తప్పినా వికెట్ సమర్పించుకోవాల్సిందే. -
తను అద్భుతం చేశాడు: కోహ్లి
లాడర్‌హిల్ : జట్టు సమిష్టి కృషి వల్లే వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌ను కైవసం చేసుకోగలిగామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అన్నాడు. సిరీస్ గెలవడం ద్వారా తదుపరి మ్యాచ్‌లో కొత్త ఆటగాళ్లకు అవకాశం దొరుకుతుందని పేర్కొన్నాడు. ఆదివారం అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం లాడర్‌హిల్ వేదికగా జరిగిన రెండో టీ20లో వెస్టిండీస్‌పై.. భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 22 పరుగుల తేడాతో కోహ్లి సేనను విజయం వరించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ 2-0 తేడాతో టీమిండియా సొంతమైంది. ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం కోహ్లి మాట్లాడుతూ... ‘జట్టు సభ్యులంతా ఆటలో ఎంతో పరిణతి కనబరిచారు. బ్యాట్స్‌మెన్ దూకుడు చూస్తే 180 పరుగులు సాధిస్తాం అనిపించింది. అయితే పిచ్ స్లోగా ఉన్న కారణంగా అనుకున్న మేర స్కోరు చేయలేకపోయాం. ఈ మ్యాచ్ గెలవడం ద్వారా సిరీస్ మా సొంతమైంది. కాబట్టి తదుపరి మ్యాచ్‌లో యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించే వీలు పెరిగింది. అయితే మా అంతిమ లక్ష్యం మాత్రం విజయం సాధించడమే’ అని చెప్పుకొచ్చాడు. ఇక విండీస్ రెండో ఓపెనర్ సునీల్ నరైన్‌ను పెవిలియన్‌కు చేర్చిన యువ బౌలర్ వాషింగ్టన్ సుందర్‌ని కోహ్లి ప్రశంసించాడు. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు తను చుక్కలు చూపించాడని.. కొత్త బంతితో అద్భుతం చేశాడని కొనియాడాడు. బంతి బంతికి ఉత్సుకతను రేకెత్తించే టీ20 మ్యాచ్‌కు ఎల్లప్పుడు ఆదరణ ఉంటుందని..గయనాలో ఆడేందుకు జట్టు సభ్యులంతా ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారని పేర్కొన్నాడు. కాగా ఆదివారం నాటి టీ20లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ (51 బంతుల్లో 67; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కెప్టెన్ కోహ్లి (23 బంతుల్లో 28; ఫోర్, సిక్స్), ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కృనాల్ పాండ్యా (13 బంతుల్లో 20 నాటౌట్; 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. మరోవైపు విండీస్ బౌలర్లలో థామస్ (2/27), కాట్రెల్ (2/25) రెండేసి వికెట్లు తీశారు. ఛేదనలో రావ్మన్ పావెల్ (34 బంతుల్లో 54; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపులు మినహా విండీస్ తరఫున పెద్దగా ప్రతిఘటన లేకపోయింది. ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ (1/12), పేసర్ భువనేశ్వర్ (1/7) ప్రత్యర్థిని మొదట్లోనే దెబ్బకొట్టారు. విజయానికి 27 బంతుల్లో 70 పరుగులు అవసరమైన దశలో విండీస్ 98/4తో ఉన్న స్థితిలో వర్షం కారణంగా మ్యాచ్‌ను నిలిపివేశారు. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి వర్తింపజేయగా... విండీస్ ఇంకా 22 పరుగులు వెనుకబడి ఉన్నట్లు తేలడంతో టీమిండియా విజయం ఖరారైంది. -
బుమ్రా, సుందర్ స్థానాల్లో..
మంబై : ఇంగ్లండ్‌తో మంగళవారం నుంచి ప్రారంభంకానున్న మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌కు భారత పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, యువ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్‌లు గాయాల కారణంగా వైదొలిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆటగాళ్ల స్థానంలో కొత్త వారిని బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ ఆదివారం ప్రకటించింది. వాషింగ్టన్ సుందర్ స్థానంలో కృనాల్ పాండ్యా, బుమ్రా స్థానంలో దీపక్ చాహర్‌లకు అవకాశమిచ్చారు. సుందర్ వన్డే సిరీస్‌కు సైతం దూరం కావడంతో అతని స్థానంలో వన్డేలకు అక్షర్ పటేల్‌ను ఎంపిక చేశారు. ఐర్లాండ్‌తో తొలి టి20 సందర్భంగా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో బుమ్రా ఎడమ వేలికి గాయం కాగా.. ప్రాక్టీస్ సెషన్లో ఫుట్‌బాల్ ఆడుతూ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ గాయపడ్డాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలోనే ఉన్న భారత్-ఏ జట్టులో చాహర్, కృనాల్, అక్షర్లున్నారు. ఇంగ్లండ్, వెస్టిండీస్-ఏ జట్లతో ట్రైసిరీస్‌లో భాగంగా మూడు మ్యాచ్‌ల్లో చాహర్ 7 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్లో చాహర్, కృనాల్‌లు ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ ముగ్గురిలో అక్షర్ అంతర్జాతీయ మ్యాచ్‌లో అరంగేట్రం చేయగా.. కృనాల్, చహర్‌లు ఈ సిరీస్‌తో అరంగేట్రం చేయనున్నారు. -
టి20 సిరీస్‌కు బుమ్రా, సుందర్ దూరం
ఇంగ్లండ్‌తో మంగళవారం నుంచి ప్రారంభంకానున్న మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌కు భారత పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. ఐర్లాండ్‌తో తొలి టి20 సందర్భంగా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అతని ఎడమ వేలికి గాయమైంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో బుమ్రాకు విశ్రాంతి కల్పించారు. జూలై 12 నుంచి ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌కు అతను అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. బుమ్రాతో పాటు యువ ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ కూడా గాయం కారణంగా ఈ సిరీస్ నుంచి వైదొలిగాడు. -
'సుందర'కాండ
బ్యాట్స్‌మెన్ విరుచుకుపడతారన్న భయం లేదు తానొక ఆఫ్ స్పిన్నర్‌నన్న బెరుకు లేదు పరుగులు భారీగా ఇస్తానేమోనన్న ఆందోళన లేదు పవర్ ప్లేలో బౌలింగ్ చేస్తున్నానన్న ఒత్తిడి లేదు ఉన్నదల్లా తనపై తనకు నమ్మకమే...! అదే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ (ఎంవీపీ)ను చేసింది నిదహస్ ట్రోఫీలో ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’గా నిలిపింది అతడే వాషింగ్టన్ సుందర్! సాక్షి క్రీడా విభాగం :టి20 మ్యాచ్‌లంటేనే తీవ్ర ఒత్తిడితో కూడుకున్నవి. ఒక్క ఓవర్‌తో ఫలితం తారుమారయ్యేవి. పూర్తిగా బ్యాట్స్‌మెన్ ఆధిపత్యం కనిపించే చోట, ఏమాత్రం లైన్ తప్పినా బౌలర్లకు మిగిలేది చేదు అనుభవమే. ఇక పవర్ ప్లేలో బౌలింగ్ చేయాలంటే ప్రతిభ కంటే... ఎదురుదాడిని తట్టుకునే మానసిక దృఢత్వం ముఖ్యం. ప్రత్యర్థి జట్లలో ఎడమ చేతివాటం బ్యాట్స్‌మెన్ ఎక్కువగా ఉంటే ఆఫ్ స్పిన్నర్‌కు మరింత పరీక్ష ఎదురైనట్లే. కానీ, 18 ఏళ్ల వాషింగ్టన్ సుందర్ వీటన్నింటినీ అధిగమించి విజయవంతమయ్యాడు. మిగతా ప్రధాన బౌలర్లు తమ కోటా పూర్తి చేయడానికే నానా కష్టాలు పడుతుంటే సుందర్ మాత్రం అటు పరుగుల కట్టడి, ఇటు వికెట్లూ తీస్తూ అలవోకగా అందరినీ ఆశ్చర్యపరిచాడు. అందుకే టోర్నీలో ‘ఎంవీపీ’గా నిలిచాడు. అనూహ్యంగానే.. నిదహస్ ట్రోఫీ ప్రారంభానికి ముందు సమీకరణాల ప్రకారం చూస్తే వాషింగ్టన్కు తుది జట్టులో చోటు కొంత అనుమానంగానే ఉండేది. అయితే, తొలి మ్యాచ్‌లోనే అవకాశం దక్కించుకున్న అతడు ఏకంగా పవర్ ప్లేలో బౌలింగ్‌కు దిగి చక్కటి గణాంకాలతో మెప్పించాడు. దీంతో తర్వాతి మ్యాచ్‌లకూ కొనసాగించక తప్పలేదు. ఈ నమ్మకాన్ని సుందర్ ఎక్కడా కోల్పోలేదు. టోర్నీలో ప్రధాన పేసర్లు శార్దుల్ ఠాకూర్, ఉనాద్కట్, సిరాజ్‌తో పాటు విజయ్ శంకర్ కూడా ఓవర్‌కు పది పరుగులిచ్చిన సందర్భాలున్నాయి. చహల్ సైతం ఓసారి గాడితప్పాడు. కానీ ఫైనల్ సహా అన్ని మ్యాచ్‌ల్లో ప్రారంభ ఓవర్లు వేసిన సుందర్ ఎకానమీ 5.7 మాత్రమే. దీన్నిబట్టి అతడెంత కట్టుదిట్టంగా బంతులేశాడో తెలుస్తోంది. ముఖ్యంగా కీలకమైన చివరి లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాపార్డర్‌ను పెవిలియన్‌కు పంపి టీమిండియా దర్జాగా ఫైనల్ చేరడంలో కీలకపాత్ర పోషించాడు. ‘ముని వేళ్ల’ మాయాజాలం ప్రస్తుతం టి20 ర్యాంకింగ్స్‌లో టాప్ 15 బౌలర్లలో ఏడుగురు మణికట్టు (లెగ్) స్పిన్నర్లే. బ్యాట్స్‌మెన్‌ను వైవిధ్యం, ఊహాతీత బంతులతో అవుట్ చేయడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. కానీ... సుందర్ ఆఫ్ స్పిన్నర్. అతడి మాయాజాలం అంతా మునివేళ్ల మీదనే ఉంటుంది. బ్యాట్స్‌మన్ భారీ షాట్‌కు యత్నిస్తున్నాడని పసిగట్టి వెంటనే బంతి వేగం తగ్గించి, లైన్‌ను మార్చేస్తాడు. నిదహస్లో పూర్తిగా ఇదే పద్ధతి పాటించి వికెట్లు పడగొట్టాడు. ఇప్పటికైతే భవిష్యత్ ఆఫ్ స్పిన్ ఆశాకిరణంగా సుందరే కనిపిస్తున్నాడు. దీనిని అతడెంత మేరకు నిలుపుకొంటాడో చూద్దాం. అవసరమైనవాడే... సీనియర్ అశ్విన్‌ను టెస్టులకే పరిమితం చేశారు. మరోవైపు చహల్ లెగ్ స్పిన్నర్ కాగా, కుల్దీప్ ఎడమ చేతివాటం చైనామన్ బౌలర్. దీంతో పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత్‌కు ప్రస్తుతం ఒక ఆఫ్ స్పిన్నర్ అవసరం చాలా ఉంది. దీనిప్రకారం వన్డేలు, టి20ల్లో సుందర్‌కు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎడమ చేతివాటం బ్యాట్స్‌మన్ కావడం, హిట్టింగూ చేయగలగడం ఇతడికి ఉన్న మరో సానుకూలాంశం. అసలు తాను క్రికెట్ ఆడటం మొదలుపెట్టింది కూడా బ్యాట్స్‌మన్‌గానే. ఈ నేపథ్యంలో లోయరార్డర్లో ఉపయుక్తంగానూ మారగలడు. ముందుంది అసలు కాలం కెరీర్ ప్రారంభంలో అద్భుతంగా బౌలింగ్ చేసినా ప్రత్యర్థులు చదివేశాక ఒక్కసారిగా తెరమరుగైన వారిని గతంలో చూశాం. తాను కూడా అలా కాకుండా ఉండాలంటే సుందర్ ఎప్పటికప్పుడు మెరుగుపడాలి. ఈ దిశగా ఐపీఎల్ అతడికి మంచి అవకాశం. ఎందుకంటే సుందర్ ఈసారి విరాట్ కోహ్లి సారథ్యంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడనున్నాడు. జట్టు కోచ్ కివీస్ దిగ్గజ స్పిన్నర్ వెటోరీ. ఆధునిక తరం కోచ్‌గా వెటోరీకి పేరుంది. ఆటగాడిగా మెరుగుపడేందుకు ఇంతకుమించిన చాన్స్ ఉండదు. కాబట్టి దీనిని రెండు చేతులా అందిపుచ్చుకోవాలి. పవర్ ప్లేలో బౌలింగ్ సవాలు లాంటిది. దీనిని గెలిస్తే చాలా సంతృప్తి దక్కుతుంది. క్రికెట్ ఆడేది ఇలాంటివాటి కోసమే కదా? బౌలింగ్ సందర్భంగా నన్ను నేను బ్యాట్స్‌మన్‌గానే భావించుకుంటా. ప్రత్యర్థి ఏం ఆలోచిస్తున్నాడో, ఎక్కడకు కొట్టబోతున్నాడో పసిగడతా. ఆరు బంతుల్లో కనీసం ఫోర్ లేదా సిక్స్ కొట్టాలని చూసే బ్యాట్స్‌మన్ తీరును అర్ధం చేసుకోవడం ముఖ్యం. కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్‌లు రవిశాస్త్రి, భరత్ అరుణ్ చాలా పోత్స్రహించారు. పరిమిత ఓవర్ల మ్యాచ్‌ల్లో మునివేళ్ల స్పిన్నర్లూ ప్రభావం చూపగలరు – వాషింగ్టన్ సుందర్ -
‘ఆ ఇద్దరితో ఆడాలనే నాకల నిజమైంది’
చెన్నై : గత ఐపీఎల్లో రైజింగ్ పుణే తరుపున ఆడి మహేంద్రసింగ్ ధోని, కెప్టెన్ స్టీవ్‌స్మిత్‌లను మెప్పించిన తమిళ యువకెరటం, స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ ఈ ఏడు వేలంలో రూ.3.3 కోట్లు పలికాడు. ఈ ధరకు రాయల్‌ఛాలెంజర్స్ బెంగళూరు సుంధర్‌ను సొంతం చేసుకుంది. ఈ తరుణంలో కెప్టెన్ విరాట్ కోహ్లి, దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలయర్స్‌తో కలిసి ఆడాలనే తన కల నేరవేరిందని ఈ యంగ్ క్రికెటర్ ఆనందం వ్యక్తం చేశాడు. ‘నన్ను ఆర్సీబీ ఎంచుకోవడం ఆనందం కలిగించింది. నేను విరాట్ కోహ్లికి, ఏబీ డివిలియర్స్‌కు పెద్ద అభిమానిని. గతేడాది రైజింగ్‌పుణే తరుపున ధోనితో కలిసి ఆడటం ఇప్పుడు ఈ లెజెండ్స్‌తో ఆడే అవకాశం రావడం వెలకట్టలేని అనుభవమని’ వాషింగ్టన్ సుందర్ తెలిపాడు. ధోని దగ్గర నేర్చుకున్న మెళుకువలు ఆర్సీబీ జట్టుకు ఎంపిక చేశాయని, ఈ జట్టులో సైతం సీనియర్ ప్లేయర్ల ఆటను దగ్గర నుంచి చూసి మరింత నేర్చుకుంటున్నాని ఈ 18 ఏళ్ల యువస్పిన్నర్ చెప్పుకొచ్చాడు. తన లక్ష్యం మాత్రం భారత జట్టులో చోటు సంపాదించుకోవడమేనని, ఇందుకోసం వచ్చిన ప్రతి అవకాశాన్నిసద్వినియోగం చేసుకుంటానన్నాడు. ఇక సుంధర్ అత్యధిక ధర పలకడంపై అతని తండ్రి ఆనందం వ్యక్తం చేశారు. యువక్రికెటర్లకు ఐపీఎల్ చక్కని వేదికని, సుంధర్లాంటి క్రికెటర్లకు తమ టాలెంట్ నిరూపించుకోవాడనికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.