పుణే వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత స్పిన్నర్లు అదరగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా స్పిన్నర్ల దాటికి కివీస్ 259 పరుగులకు ఆలౌటైంది. అనుహ్యంగా పుణే టెస్టుకు భారత జట్టులో చోటు దక్కించుకున్న ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ సంచలన ప్రదర్శన కనబరిచాడు.
తొలి ఇన్నింగ్స్‌లో సుందర్ ఏకంగా 7 వికెట్లతో చెలరేగాడు. తన స్పిన్ మయాజాలంతో ప్రత్యర్ధి బ్యాటర్లను సుందర్ ముప్పు తిప్పలు పెట్టాడు. ముఖ్యంగా వాషీ తన సెకెండ్ స్పెల్‌లో అయితే అద్భుతమైన బంతులతో కివీస్ బ్యాటర్లను బోల్తా కొట్టించాడు.
తొలి ఇన్నింగ్స్‌లో 23.1 ఓవర్లు బౌలింగ్ చేసిన వాషింగ్టన్.. 59 పరుగులు ఇచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో 5 వికెట్లు పైగా సుందర్ పడగొట్టడం తన కెరీర్‌లో ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక అతడితో పాటు మరో స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు సాధించి తనవంతు పాత్ర పోషించాడు.
మరోసారి కాన్వే, రచిన్..
ఇక కివీస్ బ్యాటర్లలో రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కాన్వే 76 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రవీంద్ర(65) హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఆఖరిలో శాంట్నర్(33) కాసేపు అలరించాడు. ఇక మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది.
క్రీజులో యువ ఆటగాళ్లు శుబ్‌మన్ గిల్(10), యశస్వీ జైశ్వాల్(6) పరుగులతో ఆజేయంగా ఉన్నారు. అయితే ఆదిలోనే భారత్‌కు బిగ్ షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్‌గా వెనుదిరిగాడు.
Comments
Please login to add a commentAdd a comment