పుణే వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత స్పిన్నర్లు సత్తాచాటారు. ఆఫ్ స్పిన్నర్లు వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్‌లు బంతితో మ్యాజిక్ చేశారు. తమ స్పిన్ మయాజాలంతో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించారు.
ఈ ఇద్దరు తమిళ తంబీల దాటికి కివీస్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. అయితే తొలుత అశ్విన్ వికెట్ల వేటను మొదలు పెట్టగా.. సుందర్ ముగించాడు. కివీస్ మొత్తం పది వికెట్లను ఈ ఇద్దరే పడగొట్టారు.
వాషింగ్టన్ ఏకంగా 7 వికెట్లు పడగొట్టగా.. అశ్విన్ 3 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక న్యూజిలాండ్ 10 వికెట్లు పడగొట్టిన అశ్విన్-సుందర్ జోడీ పలు అరుదైన ఘనతలను తన పేరిట లిఖించుకున్నారు.
వరల్డ్ రికార్డు..
→టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో మొత్తం పది వికెట్లు పడగొట్టిన ఆఫ్-స్పిన్ జోడీగా అశ్విన్-సుందర్ నిలిచారు. 147 ఏళ్ల టెస్టు క్రికెట్ హిస్టరీలో ఈ ఘనత ఎవరికి సాధ్యం కాలేదు.
→అదే విధంగా టెస్టుల్లో ఓ ఇన్నింగ్స్‌లో మొత్తం 10 వికెట్లు పడగొట్టిన భారత ఆఫ్ స్పిన్ జోడీ కూడా వీరిద్దరే కావడం విశేషం.వీరికంటే ముందు ఏ భారత కుడిచేతి వాటం స్పిన్నర్లు కూడా ఈ ఫీట్ సాధించలేకపోయారు.
→మరోవైపు భారత్ గడ్డపై టెస్టుల్లో తొలి రోజు మొదటి ఇన్నింగ్స్‌లో పది వికెట్లు స్పిన్నర్లే తీయడం ఇది ఆరోసారి. ఈ ఘనతను అంతకంటే ముందు భారత్ నాలుగు సార్లు సాధించగా, ఇంగ్లండ్ ఒక్కసారి సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment