న్యూజిలాండ్‌తో మిగిలిన రెండు టెస్టులకు టీమిండియా క్రికెటర్ వాషింగ్టన్ సుందర్ అందుబాటులోకి వచ్చాడు. కివీస్‌తో పుణె, ముంబై మ్యాచ్‌లకు అతడిని ఎంపిక చేసినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఆదివారం ప్రకటన విడుదల చేసింది.
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25లో భాగంగా రోహిత్ సేన స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌లు ఆడుతోంది. ఈ క్రమంలో బెంగళూరులో జరిగిన తొలి టెస్టులో ఎనిమిది వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. తొలి ఇన్నింగ్స్‌లో మరీ దారుణంగా 46 పరుగులకే ఆలౌట్ అయిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు(462) చేసినా ఫలితం లేకుండా పోయింది.
ఈ క్రమంలో డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే మిగిలిన రెండు టెస్టులు కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ వాషింగ్టన్ సుందర్‌ను తిరిగి పిలిపించడం ఆసక్తికరంగా మారింది. బెంగళూరు టెస్టులో విఫలమైన రవీంద్ర జడేజా నేపథ్యంలో ఈ తమిళనాడు క్రికెటర్‌పై సెలక్టర్లు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
భారీ సెంచరీతో మెరిసిన వాషీ
కాగా రంజీ ట్రోఫీ 2024-25లో భాగంగా తమిళనాడు తరఫున వాషింగ్టన్ సుందర్ ఢిల్లీతో మ్యాచ్ సందర్భంగా బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్‌లో భారీ సెంచరీ(269 బంతుల్లో 152; 19 ఫోర్లు, ఒక సిక్సర్)తో సత్తా చాటాడు.
తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు(674/6 డిక్లేర్డ్) సాధించడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే అతడు మూడేళ్ల తర్వాత టెస్టులో రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా వాషింగ్టన్ సుందర్ 2021లో చివరగా టెస్టు మ్యాచ్ ఆడాడు.
‘పెద్దోడి’కి తోడుగా చిన్నోడు!
ఇదిలా ఉంటే.. న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో రవీంద్ర జడేజా తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఐదు పరుగులకే వెనుదిరిగాడు. అయితే, ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు తీయగలిగాడు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే కివీస్‌తో సిరీస్‌లో చెన్నై దిగ్గజ స్పిన్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ‘పెద్దోడి’కి చిన్నోడు జతకావడం విశేషం.
కాగా టీమిండియా- న్యూజిలాండ్ మధ్య అక్టోబరు 24- 28 వరకు పుణె వేదికగా రెండో టెస్టు, నవంబరు 1-5 వరకు మూడో టెస్టు నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.
న్యూజిలాండ్‌తో రెండు, మూడో టెస్టులకు భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, వాషింగ్టన్ సుందర్.
చదవండి: సర్ఫరాజ్ కాదు!.. మిడిలార్డర్‌లో అతడిని ఆడించాలి: మాజీ క్రికెటర్
🚨 News 🚨
Squad Update: Washington Sundar added to squad for the second and third Test#INDvNZ | @IDFCFIRSTBank
Details 🔽— BCCI (@BCCI) October 20, 2024
Comments
Please login to add a commentAdd a comment