ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. రెండో రోజు ఆటముగిసే సమయానికి కివీస్ తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ప్రస్తుతం కేవలం 143 పరుగుల ఆధిక్యంలో మాత్రమే ఉంది. కాగా తొలి ఇన్నింగ్స్‌లో సత్తాచాటిన భారత స్పిన్నర్లు.. ఇప్పుడు రెండో ఇన్నింగ్స్‌లో కూడా అదరగొట్టారు.
అశ్విన్, రవీంద్ర జడేజా స్పిన్ మయాజాలానికి బ్లాక్‌క్యాప్స్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. భారత బౌలర్లలో ఇప్పటివరకు జడేజా 4 వికెట్లు పడగొట్టగా, అశ్విన్ చెరో మూడు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. వీరిద్దరితో పాటు పేసర్ ఆకాష్ దీప్, వాషింగ్టన్ సుందర్ తలా వికెట్ సాధించారు. ప్రస్తుతం క్రీజులో మాట్ హెన్రీ(10), ఓ రూర్కే ఉన్నారు. కివీస్ బ్యాటర్లలో విల్ యంగ్(51) హాఫ్ సెంచరీ సాధించాడు.
263కు భారత్ ఆలౌట్..
అంతకుముందు టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్(90), రిషబ్ పంత్(60) హాఫ్ సెంచరీలతో మెరిశాడు. కివీస్ బౌలర్లలో స్పిన్నర్ అజాజ్ పటేల్ 5 వికెట్ల ఘనత సాధించాడు. అతడితో పాటు హెన్రీ, ఫిలిప్స్, సోధీ ఒక్క వికెట్ సాధించారు. కాగా కివీస్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే.
చదవండి: IND vs UAE: టీమిండియాకు హార్ట్ బ్రేక్.. ఒక్క పరుగు తేడాతో ఓటమి
Comments
Please login to add a commentAdd a comment