Ind vs Ban: రెండో రోజు ముగిసిన ఆట.. 308 పరుగుల ఆధిక్యంలో టీమిండియా | Ind vs Ban 1st Test Chennai Day2: Live Updates And Highlights | Sakshi
Sakshi News home page

IND vs BAN 1st Test Day2: రెండో రోజు ముగిసిన ఆట.. 308 పరుగుల ఆధిక్యంలో టీమిండియా

Published Fri, Sep 20 2024 9:34 AM | Last Updated on Fri, Sep 20 2024 5:13 PM

Ind vs Ban 1st Test Chennai Day2: Live Updates And Highlights

India vs Bangladesh, 1st Test Chennai Day 2 Updates:

రెండో రోజు ముగిసిన ఆట.. 308 పరుగుల ఆధిక్యంలో టీమిండియా
బంగ్లాతో తొలి టెస్ట్‌ మ్యాచ్‌ రెండో రోజు ఆట ముగిసింది. టీమిండియా సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో మూడు వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్‌ (10), రోహిత్‌ శర్మ (5), విరాట్‌ కోహ్లి (17) ఔట్‌ కాగా.. శుభ్‌మన్‌ గిల్‌ (33), రిషబ్‌ పంత్‌ (12) క్రీజ్‌లో ఉన్నారు. బంగ్లా బౌలర్లలో తస్కిన్‌, నహిద్‌ రాణా, మెహిది హసన్‌ మీరజ్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

ప్రస్తుతం భారత్‌ 308 పరుగుల ఆధిక్యంలో (తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో కలుపుకుని) కొనసాగుతుంది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 149 పరుగులకు ఆలౌట్‌ కాగా.. భారత్‌కు 227 పరుగుల ఆధిక్యం లభించింది. దీనికి ముందు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులకు ఆలౌటైంది. 

19.2:మూడో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లి(17) రూపంలో టీమిండియా మూడో వికెట్‌ కోల్పోయింది. మెహదీ హసన్‌ మిరాజ్‌ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. పంత్‌ క్రీజులోకి వచ్చాడు. గిల్‌ 31 పరుగులతో ఆడుతున్నాడు. టీమిండియా స్కోరు: 67/3 (19.2) . బంగ్లాపై 294 పరుగుల ఆధిక్యం. 

రెండో వికెట్‌ కోల్పోయిన భారత్‌.. యశస్వి ఔట్‌
6.4వ ఓవర్‌: 28 పరుగులకే భారత్‌ ఇద్దరు ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. రోహిత్‌ 5, యశస్వి జైస్వాల్‌ 10 పరుగులు చేసి ఔటయ్యారు. రోహిత్‌ను తస్కిన్‌.. జైస్వాల్‌ను నహిద్‌ రాణా పెవిలియన్‌కు పంపారు. 

తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌
2.3: తస్కిన్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో రోహిత్‌ జకీర్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. ఐదు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. గిల్‌ క్రీజులోకి వచ్చాడు. మూడు ఓవర్లు పూర్తయ్యే సరికి టీమిండియా స్కోరు: 16-1 . కాగా తొలి ఇన్నింగ్స్‌లోనూ రోహిత్‌ ఆరు పరుగులకే అవుటైన విషయం తెలిసిందే.

149 పరుగులకు ఆలౌటైన బంగ్లాదేశ్‌
47.1వ ఓవర్‌: భారత్‌తో తొలి టెస్ట్‌లో బంగ్లా తొలి ఇన్నింగ్స్‌ 149 పరుగుల వద్ద ముగిసింది. సిరాజ్‌ నహిద్‌ రాణాను క్లీన్‌ బౌల్డ్‌ చేసి బంగ్లా ఇన్నింగ్స్‌కు తెరదించాడు. మెహిది హసన్‌ మీరజ్‌ 27 పరుగులతో అజేయంగా నిలిచాడు. బంగ్లా ఇన్నింగ్స్‌లో నజ్ముల్‌ షాంటో (20), షకీబ్‌ అల్‌ హసన్‌ (32), లిట్టన్‌ దాస్‌ (22), తస్కిన్‌ అహ్మద్‌ (11), నహిద్‌ రాణా (11), మిరాజ్‌ రెండంకెల స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో బుమ్రా 4, సిరాజ్‌, ఆకాశ్‌దీప్‌, జడేజా తలో రెండు వికెట్లు తీశారు. 

తొమ్మిదో వికెట్‌ కోల్పోయిన బంగ్లాదేశ్‌
42.5వ ఓవర్‌: 130 పరుగుల వద్ద బంగ్లాదేశ్‌ తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. బుమ్రా అద్భుతమైన యార్కర్‌తో తస్కిన్‌ అహ్మద్‌ను (11) క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. 

ఎనిమిదో వికెట్‌ డౌన్‌.. టీ బ్రేక్‌ సమయానికి స్కోరెంతంటే?
36.5: బుమ్రా బౌలింగ్‌లో హసన్‌ మహమూద్‌ కోహ్లికి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఈ వికెట్ల వీరుడు అవుటయ్యాడు. టీ బ్రేక్‌ సమయానికి బంగ్లాదేశ్‌ స్కోరు: 112/8 (36.5).

ఏడో వికెట్‌ కోల్పోయిన బంగ్లాదేశ్‌
30.3: షకీబ్‌ అల్‌ హసన్‌ రూపంలో బంగ్లాదేశ్‌ ఏడో వికెట్‌ కోల్పోయింది. జడేజా బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి షకీబ్‌ నిష్క్రమించాడు. మొత్తంగా 64 బంతులు ఎదుర్కొన్న ఈ ఆల్‌రౌండర్‌.. 5 ఫోర్ల సాయంతో 32 పరుగులు చేశాడు. హసన్‌ మహమూద్‌ క్రీజులోకి వచ్చాడు. బంగ్లా స్కోరు:  92/7 (30.5)

ఆరో వికెట్‌ డౌన్‌.. లిట్టన్‌ దాస్‌ ఔట్‌
లిట్టన్‌ దాస్‌ రూపంలో బంగ్లాదేశ్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. 22 పరుగులు చేసిన దాస్‌.. జడేజా బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. 29 ఓవర్లకు బంగ్లాదేశ్‌ స్కోర్‌: 91/6. క్రీజులో షకీబ్‌(32), మెహదీ హసన్‌(0) ఉన్నారు.

నిలకడగా ఆడుతున్న షకీబ్‌, లిట్టన్‌
40 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డిన బంగ్లాదేశ్‌ను స్టార్ ప్లేయ‌ర్లు ష‌కీబ్ అల్‌హ‌స‌న్‌(22), లిట్ట‌న్ దాస్‌(18)  ఆదుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. 24 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్‌ 5 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది.

కష్టాల్లో బంగ్లాదేశ్‌.. 40 పరుగులకే 5 వికెట్లు
చెపాక్‌ టెస్టులో బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 40 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ముష్ఫికర్‌ రహీం రూపంలో బంగ్లాదేశ్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. 8 పరుగులు చేసిన రహీం.. బుమ్రా బౌలింగ్‌లో రాహుల్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. 14 ఓవర్లకు బంగ్లా స్కోర్‌: 44/5. క్రీజులో షకీబ్‌(8), లిట్టన్‌దాస్‌(0) పరుగులతో ఉన్నారు.

కష్టా​ల్లో బంగ్లా.. నాలుగో వికెట్‌ డౌన్‌
కెప్టెన్‌ శాంటో రూపంలో బంగ్లాదేశ్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. 20 పరుగులు చేసిన శాంటో.. మహ్మద్‌ సిరాజ్‌ బౌలింగ్‌లో కోహ్లికి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. 12 ఓవర్లకు బంగ్లా స్కోర్‌: 40/4. క్రీజులో షకీబ్‌(4), ముష్పికర్‌ రహీం(8) పరుగులతో ఉన్నారు.

ఆకాష్‌ ఆన్‌ ఫైర్‌.. 
భారత పేసర్‌ ఆకాష్‌ దీప్‌ నిప్పులు చేరుగుతున్నాడు. బంగ్లా ఇన్నింగ్స్‌ 9వ ఓవర్‌లో తొలి బంతికి జకీర్‌ హసన్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేసిన ఆ​కాష్‌.. రెండో బంతికి మోమినుల్ హక్ అదే తరహాలో ఔట్‌ చేశాడు. 9 ఓవర్లు ముగిసే సరికి బంగ్లా 3 వికెట్లు కోల్పోయి 26 పరుగులు చేసింది.

బంగ్లా తొలి వికెట్‌ డౌన్‌.. 
తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన బంగ్లాదేశ్‌కు భారత పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా ఆరంభంలోనే షాకిచ్చాడు. బంగ్లా ఓపెనర్‌ షాద్‌మన్‌ ఇస్లాం(2)ను బుమ్రా ​‍క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. 4 ఓవర్లకు బంగ్లా స్కోర్‌: 8/1. క్రీజులో జకీర్‌ హసన్(2), షాంటో(4) పరుగులతో ఉన్నారు.



376 పరుగులకు భారత్‌ ఆలౌట్‌
చెపాక్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ ​ముగిసింది. తమ తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 376 పరుగులకు ఆలౌటైంది.  339/9 ఓవర్‌ నైట్‌ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా అదనంగా కేవలం 37 పరుగులు మాత్రమే తమ ఇన్నింగ్స్‌ను మగించింది.

రెండో రోజు ఆటలో పేసర్‌ టాస్కిన్‌ ఆహ్మద్‌ 3 వికెట్ల పడగొట్టి దెబ్బతీశాడు. భారత బ్యాటర్లలో రవిచంద్రన్‌ అశ్విన్‌(113) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. రవీంద్ర జడేజా(86), జైశ్వాల్‌(56) రాణించారు. బంగ్లా బౌలర్లలో యువ సేసర్‌ హసన్‌ మహమూద్‌ 5 వికెట్లు సాధించగా.. టాస్కిన్‌ మూడు, మెహది హసన్‌, నహిద్‌ రానా తలా వికెట్‌ పడగొట్టారు.



తొమ్మిదో వికెట్‌ డౌన్‌..అశ్విన్‌ ఔట్‌
భారత్ తొలి ఇన్నింగ్స్ మగింపునకు చేరుకుంది. రవిచంద్రన్ అశ్విన్ రూపంలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 113 పరుగులు చేసిన అశ్విన్‌.. టాస్కిన్ ఆహ్మద్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 91 ఓవ్లకు భారత్ స్కోర్‌

ఎనిమిదో వికెట్‌ డౌన్‌.. 
ఆకాష్‌ దీప్‌ రూపంలో టీమిండియా ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. 17 పరుగులు చేసిన దీప్‌.. టాస్కిన్‌ ఆహ్మద్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 90 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 373/8

ఏడో వికెట్‌ డౌన్‌.. జడేజా ఔట్‌
339-6 ఓవ‌ర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆట‌ను ప్రారంభించిన భార‌త్‌కు ఆదిలోనే బిగ్ షాక్ త‌గిలింది. టాస్కిన్ ఆహ్మ‌ద్ బౌలింగ్‌లో రవీంద్ర జ‌డేజా(86) ఔట‌య్యాడు. దీంతో 199 ప‌రుగుల భారీ భాగ‌స్వామ్యానికి తెర‌ప‌డింది. క్రీజులోకి ఆకాష్ దీప్ వ‌చ్చాడు.

రెండో రోజు ఆట ఆరంభం..
చెపాక్ వేదిక‌గా భార‌త్‌-బంగ్లాదేశ్ తొలి టెస్టు రెండో రోజు ఆట ప్రారంభ‌మైంది. మొద‌టి రోజు ఆట‌లో టీమిండియా 6 వికెట్ల న‌ష్టానికి 339 ప‌రుగులు చేసింది.

క్రీజులో ర‌విచంద్ర‌న్ అశ్విన్‌(102), ర‌వీంద్ర జ‌డేజా(86) ప‌రుగుల‌తో ఉన్నారు. రెండో రోజు బంగ్లా బౌలింగ్ ఎటాక్‌ను టాస్కిన్‌ ఆహ్మద్‌ ప్రారంభించాడు.

తుదిజట్లు:
టీమిండియా
రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్‌ పంత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్.

బంగ్లాదేశ్‌
షాద్మాన్ ఇస్లాం, జకీర్ హసన్, నజ్ముల్ హుస్సేన్ శాంటో(కెప్టెన్), మొమినుల్ హక్, ముష్ఫికర్ రహీం, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్(వికెట్ కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, తస్కిన్ అహ్మద్, హసన్ మహమూద్, నహీద్ రాణా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement