IND VS BAN 1st Test: జడేజా ఖాతాలో అరుదైన రికార్డు | Ravindra Jadeja Created History By Scoring A Half Century And Take More Than Five Wickets In A Match For Most Number Of Times | Sakshi
Sakshi News home page

IND VS BAN 1st Test: జడేజా ఖాతాలో అరుదైన రికార్డు

Published Mon, Sep 23 2024 1:52 PM | Last Updated on Mon, Sep 23 2024 6:12 PM

Ravindra Jadeja Created History By Scoring A Half Century And Take More Than Five Wickets In A Match For Most Number Of Times

టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా టెస్ట్‌ల్లో ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్ట్‌ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్‌ సెంచరీ (86) చేసిన జడేజా.. మ్యాచ్‌ మొత్తంలో ఐదు వికెట్లు తీశాడు. ఇలా ఓ టెస్ట్‌ మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీ, ఐదు వికెట్లు తీయడం​ జడేజాకు ఇది 12వ సారి. భారత క్రికెటర్లలో ఈ ఘనతను ఇన్ని సార్లు ఎవ్వరూ సాధించలేదు. జడ్డూ తర్వాతి స్థానంలో అశ్విన్‌ (11) ఉన్నాడు. వీరిద్దరి తర్వాత కపిల్‌ దేవ్‌ (7), హర్భజన్‌ సింగ్‌ (6) ఉన్నారు. వీరి మినహా ఏ భారత క్రికెటర్‌ రెండు కంటే ఎక్కువ సార్లు ఈ ఘనత సాధించలేదు.

చెన్నై టెస్ట్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో టీమిండియా బంగ్లాదేశ్‌పై 280 పరుగుల తేడాతో గెలుపొందింది. ఫలితంగా రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో వెళ్లింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ అన్ని విభాగాల్లో సత్తా చాటి పర్యాటక జట్టుపై సంపూర్ణ ఆధిపత్యం చలాయింది. అశ్విన్‌ (113, 6/88), జడేజా (86, 2/19, 3/58) ఆల్‌రౌండ్‌ షోతో ఇరగదీయగా.. గిల్‌ (119 నాటౌట్‌), పంత్‌ (109) అదిరిపోయే శతకాలతో ఆకట్టుకున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ, సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసిన అశ్విన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచాడు.

చదవండి: ఇరగదీస్తున్న ఆసియా దేశాలు.. ఒక్క పాక్‌ మినహా..!
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement