బంగ్లాదేశ్‌తో టెస్ట్‌ సిరీస్‌.. అశ్విన్‌ ముందు ప్రపంచ రికార్డు | Ravichandran Ashwin 14 Wickets Away From Becoming The Highest Wicket Taker In WTC History | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్‌తో టెస్ట్‌ సిరీస్‌.. అశ్విన్‌ ముందు ప్రపంచ రికార్డు

Published Mon, Sep 16 2024 12:42 PM | Last Updated on Mon, Sep 16 2024 1:31 PM

Ravichandran Ashwin 14 Wickets Away From Becoming The Highest Wicket Taker In WTC History

త్వరలో బంగ్లాదేశ్‌తో జరుగబోయే టెస్ట్‌ సిరీస్‌కు ముందు టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ను ఓ ప్రపంచ రికార్డు ఊరిస్తుంది. రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో అశ్విన్‌ 14 వికెట్లు పడగొడితే.. వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక వికెట్ల వీరుడిగా అవతరిస్తాడు. 

ప్రస్తుతం డబ్ల్యూటీసీలో ఆసీస్‌ స్పిన్నర్‌ నాథన్‌ లియోన్‌ అత్యధిక వికెట్ల వీరుడిగా ఉన్నాడు. లియోన్‌ డబ్ల్యూటీసీలో 43 మ్యాచ్‌లు ఆడి 187 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్‌.. 35 మ్యాచ్‌ల్లో 174 వికెట్లు తీసి మూడో హైయ్యెస్ట్‌ వికెట్‌ టేకర్‌గా ఉన్నాడు. ఆసీస్‌ పేసర్‌ పాట్‌ కమిన్స్‌ ఈ జాబితాలో రెండో స్థానంలో (42 మ్యాచ్‌ల్లో 175 వికెట్లు) ఉన్నాడు. 

బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో అశ్విన్‌ 26 వికెట్లు సాధిస్తే.. డబ్ల్యూటీసీలో 200 వికెట్ల మార్కును తాకిన తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. బంగ్లాతో టెస్ట్‌ సిరీస్‌లో అశ్విన్‌ 14 వికెట్లు తీస్తే అత్యధిక వికెట్లు సాధించిన టెస్ట్‌ బౌలర్ల జాబితాలో లియోన్‌తో సమానంగా ఏడో స్థానంలో నిలుస్తాడు. 

టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో లంక స్పిన్‌ దిగ్గజం ముత్తయ్య మురళీథరన్‌ (800) అగ్రస్థానంలో ఉండగా.. షేన్‌ వార్న్‌ (708), ఆండర్సన్‌ (704), కుంబ్లే (619), స్టువర్ట్‌ బ్రాడ్‌ (604), మెక్‌గ్రాత్‌ (563) టాప్‌-6లో ఉన్నారు. ఈ జాబితాలో అశ్విన్‌ (516) ప్రస్తుతం తొమ్మిదో స్థానంలో ఉన్నాడు.

కాగా, బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ సెప్టెంబర్‌ 19న ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌ చెన్నై వేదికగా.. రెండో మ్యాచ్‌ కాన్పూర్‌ వేదికగా (సెప్టెంబర్‌ 27 నుంచి) జరుగనున్నాయి. టెస్ట్‌ సిరీస్‌ అనంతరం భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కూడా జరుగనుంది. మూడు టీ20లు గ్వాలియర్‌, ఢిల్లీ, హైదరాబాద్‌ వేదికలుగా అక్టోబర్‌ 6, 9, 12 తేదీల్లో జరుగనున్నాయి.

తొలి టెస్ట్‌కు భారత జట్టు..
రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి, సర్ఫరాజ్‌ ఖాన్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, కేఎల్‌ రాహుల్‌, ధృవ్‌ జురెల్‌, రిషబ్‌ పంత్‌, మొహమ్మద్‌ సిరాజ్‌, కుల్దీప్‌ యాదవ్‌, ఆకాశ్‌దీప్‌, యశ్‌ దయాల్‌, జస్ప్రీత్‌ బుమ్రా

చదవండి: ట్రిపుల్‌ సెంచరీకి చేరువలో కుల్దీప్‌

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement