భారత్, బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్ట్ సెప్టెంబర్ 19 నుంచి చెన్నై వేదికగా ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు కఠోర సాధనలో నిమగ్నమై ఉన్నాయి. బంగ్లాదేశ్‌తో పోలిస్తే భారత్ ఇంకాస్త ఎక్కువగా శ్రమిస్తుంది. టీమిండియా టెస్ట్ క్రికెట్ ఆడి చాన్నాళ్లు కావడంతో ఈ ఫార్మాట్‌కు అలవాటు పడేందుకు చెమటోడుస్తుంది.
సెప్టెంబర్ 13 నుంచే చెన్నైలో భారత శిక్షణా శిబిరం మొదలైంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో భారత ఆటగాళ్లు లయను అందుకున్నారు. భారత ఆటగాళ్ల ప్రాక్టీస్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
మ్యాచ్ ప్రారంభానికి మరో రెండు రోజులే ఉండటంతో భారత తుది జట్టు కూర్పుపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. తుది జట్టులో వారుండబోతున్నారు.. వీరుండబోతున్నారంటూ సోషల్‌మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. భారత మేనేజ్‌మెంట్ నుంచి మాత్రం తుది జట్టు విషయమై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
అయితే పీటీఐ నుంచి వస్తున్న సమాచారం మేరకు బంగ్లాతో తొలి టెస్ట్‌లో భారత స్పిన్ విభాగం ఖరారైనట్లు తెలుస్తుంది. తుది జట్టులో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ ఉండనున్నారని సమాచారం. అక్షర్ పటేల్ బెంచ్‌కే పరిమితం కానున్నట్లు తెలుస్తుంది.
మరోవైపు బ్యాటింగ్ విభాగంలో ఓ బెర్త్ మినహా బెర్త్‌లు అన్నింటి విషయమై క్లారిటీ ఉంది. ఓపెనర్లుగా రోహిత్, జైస్వాల్, వన్‌డౌన్‌లో శుభ్‌మన్ గిల్, నాలుగో స్థానంలో విరాట్ బరిలోకి దిగడం దాదాపుగా ఖరారైంది. ఐదో స్థానం కోసం కేఎస్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్ పోటీ పడుతున్నప్పటికీ.. రాహుల్‌కు అవకాశం దక్కే ఛాన్స్ ఉంది.
వికెట్ కీపర్ కోటాలో రిషబ్ పంత్ ఆడటం దాదాపుగా ఖాయమైంది. ఆతర్వాతి స్థానాల్లో జడేజా, అశ్విన్, కుల్దీప్ అనుకుంటే తొమ్మిది బెర్త్‌లు ఖరారైపోయినట్లే. ఇక మిగిలింది పేస్ విభాగం. ఈ కేటగిరీలో బుమ్రా స్థానం ఖరారు కాగా.. మరో పేసర్ కోటాలో అనుభవజ్ఞుడు సిరాజ్‌కు ఛాన్స్ ఇస్తారా లేక ఆకాశ్‌దీప్, యశ్ దయాల్‌లలో ఎవరో ఒకరివైపు మొగ్గు చూపుతారా అన్నది వేచి చూడాల్సి ఉంది.
బంగ్లాతో తొలి టెస్ట్‌కు భారత తుది జట్టు (అంచనా)..
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్‌దీప్
చదవండి: ముమ్మర సాధనలో...
Comments
Please login to add a commentAdd a comment