టీమిండియా స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్ ఇవాళ (సెప్టెంబర్ 17) 38వ పడిలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా అశ్విన్ కెరీర్‌లోని ముఖ్యాంశాలపై ఓ లుక్కేద్దాం. 1986 సెప్టెంబర్ 17న మద్రాస్‌లో జన్మించిన యాశ్.. 2010లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. భారత్ తరఫున అశ్విన్ కెరీర్ వన్డేలతో మొదలైంది.
రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్‌తో పాటు లోయర్ ఆర్డర్‌లో ఉపయోగకరమైన బ్యాటర్ అయిన అశ్విన్.. భారత్ తరఫున 100 టెస్ట్‌లు (516 టెస్ట్ వికెట్లు), 116 వన్డేలు (156 వన్డే వికెట్లు), 65 టీ20లు (72 టీ20 వికెట్లు) ఆడాడు. అశ్విన్ ఖాతాలో 5 టెస్ట్ సెంచరీలు, 14 టెస్ట్ హాఫ్ సెంచరీలు, ఓ వన్డే హాఫ్ సెంచరీ ఉంది. అశ్విన్ కెరీర్‌లో 36 సార్లు ఐదు వికెట్ల ఘనతలు సాధించాడు.
అశ్విన్ కెరీర్‌లో ముఖ్యాంశాలు..
భారత్ తరఫున టెస్ట్‌ల్లో రెండో అత్యధిక వికెట్లు (516).
భారత్ తరఫున మూడు ఫార్మాట్లలో రెండో అత్యధిక వికెట్లు (744).
భారత్ తరఫున బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో (ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్) అత్యధిక వికెట్లు.
భారత్ తరఫున వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక వికెట్లు.
భారత్ తరఫున టెస్ట్‌ల్లో వేగవంతమైన 50, 100, 150, 200, 250, 300, 350, 400, 450, 500 వికెట్లు.
వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్, ఐపీఎల్, విజేత.
కాగా, సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్‌తో జరుగబోయే టెస్ట్ సిరీస్‌లో అశ్విన్ పాల్గొననున్నాడు. ఈ సిరీస్‌లో యాశ్ 14 వికెట్లు పడగొడితే.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక వికెట్ల వీరుడిగా.. 26 వికెట్లు సాధిస్తే డబ్ల్యూటీసీలో 200 వికెట్ల మార్కును తాకిన తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టిస్తాడు.
ప్రస్తుతం అశ్విన్ డబ్ల్యూటీసీలో మూడో హైయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా (35 మ్యాచ్‌ల్లో 174 వికెట్లు) ఉన్నాడు. ఓవరాల్‌గా టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో ముత్తయ్య మురళీథరన్ (800) అగ్రస్థానంలో ఉండగా.. షేన్ వార్న్ (708), ఆండర్సన్ (704), కుంబ్లే (619), స్టువర్ట్ బ్రాడ్ (604), మెక్‌గ్రాత్ (563) టాప్-6లో ఉన్నారు.
తొలి టెస్ట్‌కు భారత జట్టు..
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్, రిషబ్ పంత్, మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్‌దీప్, యశ్ దయాల్, జస్ప్రీత్ బుమ్రా
చదవండి: బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్.. తుది జట్టులో ఉండనున్న ముగ్గురు స్పిన్నర్లు వీరే..!
Comments
Please login to add a commentAdd a comment