చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా 280 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. తద్వారా రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో వెళ్లింది. ఈ మ్యాచ్‌లో భారత గెలుపులో స్టార్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ కీలకపాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టాడు. అశ్విన్.. సొంత మైదానమైన చెపాక్ స్టేడియంలో సెంచరీ సాధించడం రెండో సారి. ఐదు వికెట్ల ఘనత నమోదు చేయడం నాలుగోసారి.
అశ్విన్ సొంత మైదానంలో మ్యాచ్ ఆడుతుండటంతో అతని కుటుంబ సభ్యులంతా మ్యాచ్ వీక్షించేందుకు వచ్చారు. అశ్విన్ తల్లి, తండ్రితో పాటు అతని భార్య, ఇద్దరు పిల్లలు అశ్విన్ ఆటను నాలుగు రోజుల పాటు తిలకించారు.మ్యాచ్ పూర్తయిన అనంతరం అశ్విన్ కుటుంబ సభ్యులు మైదానంలో కలియ తిరిగారు. అశ్విన్ తన తల్లిదండ్రులను హత్తు కొని తన ప్రేమను చాటాడు. అశ్విన్ భార్య ప్రీతి నారాయణన్ అశ్విన్‌ను సరదాగా ఇంటర్వ్యూ చేసింది.
A special game calls for a special conversation 💙@ashwinravi99's family in a heartwarming interaction with him post Chepauk heroics.
P.S. - Ashwin has a gift for his daughters on this #DaughtersDay.
Watch 👇👇#INDvBAN | @IDFCFIRSTBank | @prithinarayanan pic.twitter.com/4rchtzemiz— BCCI (@BCCI) September 22, 2024
డాటర్స్ డే రోజు ఏం ఇస్తావని పిల్లలు అడుగుతున్నారని అడిగింది. ఇందుకు అశ్విన్ తాను ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన బంతి ఇస్తానని చెప్తాడు. దీనికి తన కుమార్తెల్లో ఒకరు వద్దు అని సరదాగా అంటుంది.
సొంత మైదానంలో రాణించడం ఎలా అనిపిస్తుంది అని ప్రీతి మరో ప్రశ్న అడిగింది. ఈ ప్రశ్నకు ఎలా స్పందించాలో అర్దం కావడం లేదని అశ్విన్ అంటాడు. తొలి రోజు అంతా త్వరత్వరగా జరిగిపోయింది. ఆ రోజు బ్యాటింగ్‌కు వస్తానని అస్సలు అనుకోలేదు. సెంచరీ గురించిన ఆలోచనే లేదు. ఇక్కడ ఆడిన ప్రతిసారి ఏదో ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఈ మైదానంలో ఏదో శక్తి ఉందనిపిస్తుందని అశ్విన్ అంటాడు.
ఇలా ప్రీతి, అశ్విన్ మధ్య పలు ఆసక్తికర అంశాలపై సంభాషణ జరిగింది. అంతిమంగా ప్రీతి అశ్విన్‌కు కంగ్రాట్స్ చెప్పగా.. యాష్ థ్యాంక్స్ చెప్తాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.
చదవండి: అదరగొట్టిన అశ్విన్.. విండీస్ దిగ్గజం ఆల్‌టైమ్ రికార్డు బద్దలు
Comments
Please login to add a commentAdd a comment