జడేజా సరికొత్త చరిత్ర.. తొలి భారత క్రికెటర్‌గా | Ravindra Jadeja becomes fastest Indian to reach 3,000 runs and 300 wickets in Test | Sakshi
Sakshi News home page

IND vs BAN: జడేజా సరికొత్త చరిత్ర.. తొలి భారత క్రికెటర్‌గా

Published Mon, Sep 30 2024 3:53 PM | Last Updated on Mon, Sep 30 2024 3:59 PM

Ravindra Jadeja becomes fastest Indian to reach 3,000 runs and 300 wickets in Test

టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా టెస్టుల్లో 300 వికెట్ల మైలు రాయిని అందుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో ఈ ఘ‌న‌త సాధించిన ఏడో భారత బౌలర్‌గా రవీంద్ర జడేజా నిలిచాడు. 

కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఖాలీల్ ఆహ్మద్‌ను ఔట్ చేసిన జడ్డూ ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ జాబితాలో అతడి కంటే ముందు అనిల్ కుంబ్లే (619), అశ్విన్ (524), కపిల్ (434), హర్భజన్‌ (417), ఇషాంత్ శర్మ (311), జహీర్ ఖాన్ (311) ఉన్నారు.

మ‌రో అరుదైన రికార్డు.. 
ఈ మ్యాచ్‌లో జ‌డేజా మ‌రో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో 3,000 పరుగులతో పాటు 300 వికెట్లు అత్యంత వేగంగా సాధించిన భార‌త క్రికెట‌ర్‌గా జ‌డేజా రికార్డుల‌కెక్కాడు. 78* టెస్టు మ్యాచ్‌లు ఆడిన జ‌డేజా.. 3122 ప‌రుగుల‌తో పాటు 300 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

ఓవరాల్‌గా వ‌ర‌ల్డ్ క్రికెట్‌లో ఈ ఘ‌న‌త సాధించిన రెండో క్రికెట‌ర్‌గా జ‌డేజా నిలిచాడు. ఇక ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో ఇంగ్లండ్ క్రికెట్ దిగ్గ‌జం ఇయాన్ బోథమ్ పేరిట ఉంది. ఆయ‌న కేవ‌లం 72 మ్యాచ్‌ల్లోనే ఈ ఫీట్‌ను అందుకున్నాడు. 
చదవండి: IND vs BAN: టీమిండియా వరల్డ్ రికార్డు.. 147 ఏళ్ల క్రికెట్ చరిత్రలోనే

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement