
బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రికార్డుల మోత మోగిస్తున్నాడు. తాజాగా కాన్పూర్ వేదికగా బంగ్లాతో జరుగుతున్న రెండో టెస్టులో అశ్విన్ మరో అరుదైన రికార్డను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆసియాలో అత్యధిక టెస్టు వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా యాష్ రికార్డులకెక్కాడు.
తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటోను ఔట్ చేసిన అశ్విన్ ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అశ్విన్ ఇప్పటివరకు ఆసియాలో 420 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే పేరిట ఉండేది.
కుంబ్లే తన కెరీర్‌లో ఆసియాలో 419 వికెట్లు సాధించాడు. ఇక ఓవరాల్‌గా ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో శ్రీలంక లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ 612 వికెట్లతో తొలి స్ధానంలో ఉన్నాడు. ఆ తర్వాత స్ధానంలో అశ్విన్(420) ఉన్నాడు. అశ్విన్ తర్వాత స్ధానాల్లో కుంబ్లే, రంగనా హెరత్(354), హార్భజన్ సింగ్(300) ఉన్నారు. ఓవరాల్‌గా టెస్టు క్రికెట్‌లో 101 మ్యాచ్‌లు ఆడిన అశ్విన్.. 2.82 ఏకానమీతో 522 వికెట్లు పడగొట్టాడు.
చదవండి: జడేజా ప్రపంచ రికార్డు.. 147 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి
Comments
Please login to add a commentAdd a comment