చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్ 280 పరుగుల తేడాతో విజయ డంఖా మోగించింది. 515 పరుగుల భారీ లక్ష్యం చేధించడంలో బంగ్లాదేశ్ చతకిలపడింది. భారత స్పిన్నర్ల దాటికి 234 పరుగలకు బంగ్లా ఆలౌటైంది.
కాగా భారత్ విజయంలో స్టార్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్‌ది కీలక పాత్ర. ఈ మ్యాచ్‌లో అశ్విన్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో సత్తాచాటిన యాష్.. రెండో ఇన్నింగ్స్‌లో బంతితో మ్యాజిక్ చేశాడు. ఏకంగా 6 వికెట్లు పడగొట్టి బంగ్లా పతనాన్ని శాసించాడు. ఈ క్రమంలో పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
అశ్విన్ సాధించిన రికార్డులు ఇవే..
టెస్టు క్రికెట్‌లో అత్యధిక సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించిన రెండో బౌలర్‌గా ఆసీస్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ రికార్డును అశ్విన్ సమం చేశాడు. షేన్ వార్న్ 145 టెస్టుల్లో 37 సార్లు ఫైవ్ వికెట్ల హాల్స్ సాధించగా.. అశ్విన్ కేవలం 101 మ్యాచ్‌ల్లోనే ఈ ఘనతను అందుకున్నాడు.
అశ్విన్ మరో ఫైవ్ వికెట్ల హాల్ సాధిస్తే వార్న్‌ను అధిమిస్తాడు. అశ్విన్ తర్వాతి స్ధానంలో న్యూజిలాండ్ దిగ్గజం రిచర్డ్ హాడ్లీ(36) ఉన్నారు. ఈ మ్యాచ్ కంటే ముందు హాడ్లీతో కలిసి అశ్విన్ మూడో స్ధానంలో కొనసాగాడు. అయితే తాజా మ్యాచ్‌తో హ్యాడ్లీని అధిగమించాడు.
అదే విధంగా టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్ల జాబితాలో 8వ స్థానంలో ఉన్న కోట్నీ వాల్ష్‌ను అశ్విన్ వెనక్కి నెట్టాడు.
అశ్విన్ 522 వికెట్లతో 8వ స్ధానంలో నిలిచాడు. ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో మురళీధరన్ (800), వార్న్ (708), అండర్సన్ (704), కుంబ్లే (619), స్టువర్ట్ బ్రాడ్ (604), మెక్‌గ్రాత్ (563), లయన్ (530) మాత్రమే అశ్విన్ కంటే ముందున్నారు.
చదవండి: IND vs BAN: చరిత్ర సృష్టించిన టీమిండియా.. 92 ఏళ్ల టెస్టు క్రికెట్ హిస్టరీలోనే
Comments
Please login to add a commentAdd a comment