
చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో లోకల్ బాయ్, భారత స్టార్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ అదరగొడుతున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాట్‌తో సత్తాచాటిన అశ్విన్.. ఇప్పుడు రెండో ఇన్నింగ్స్‌లో బంతితో మాయచేస్తున్నాడు.
సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు 15 ఓవర్లు వేసిన అశ్విన్.. 3 కీలక వికెట్లు పడగొట్టి బంగ్లాను బ్యాక్ ఫుట్‌లో ఉంచాడు. ఈ క్రమంలో బంగ్లా బ్యాటర్ మోమినుల్ హక్‌ను యాష్ ఔట్ చేసిన విధానం గురించి ఎంతచెప్పుకున్న తక్కువే. అద్భుతమైన బంతిని మోమినుల్‌ను అశ్విన్ క్లీన్ బౌల్డ్ చేశాడు.
బంగ్లా ఇన్నింగ్స్ 30వ ఓవర్‌లో ఆఖరి బంతిని మోమినుల్ ఆఫ్ స్టంప్ దిశగా టాస్‌డ్ ఆప్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని మోమినుల్ డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నం చేశాడు. కానీ బంతి టర్న్ అద్భుతంగా అవుతూ స్టంప్స్‌ను గిరాటేసింది. దీంతో సదరు బంగ్లా బ్యాటర్ బిత్తర పోయాడు. ఈ బంతిని చూసి మైదానంలో ఉన్న విరాట్ కోహ్లి ఫిదా అయిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
చదవండి: భయపడకు కోహ్లి.. నీ స్టైల్లో ఆడు: రవిశాస్త్రి
— Bangladesh vs Sri Lanka (@Hanji_CricDekho) September 21, 2024