IND vs BAN: అశ్విన్ స్పిన్ మాయ‌.. బంగ్లాపై భారత్‌ ఘన విజయం | India beats Bangladesh by 280 runs to lead series 1-0 | Sakshi
Sakshi News home page

IND vs BAN: అశ్విన్ స్పిన్ మాయ‌.. బంగ్లాపై భారత్‌ ఘన విజయం

Published Sun, Sep 22 2024 11:45 AM | Last Updated on Sun, Sep 22 2024 12:13 PM

IND beats BAN by 280 runs to lead series 1-0

బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భార‌త్ శుభారంభం చేసింది. చెన్నై వేదిక‌గా జ‌రిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్‌పై 280 ప‌రుగుల తేడాతో టీమిండియా ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి భార‌త్ దూసుకెళ్లింది. ఇక‌ 515 ప‌రుగుల లక్ష్యంతో బ‌రిలోకి దిగిన బంగ్లా జ‌ట్టు  234 పరుగులకు ఆలౌటైంది.

అశ్విన్ స్పిన్ మాయ‌..
158/4 ఓవర్ నైట్ స్కోర్‌తో నాలుగో రోజును ఆటను ప్రారంభించిన బంగ్లాదేశ్ అశ్విన్ స్పిన్ ఉచ్చులో చిక్కు కుంది. క సెకెండ్ ఇన్నింగ్స్‌లో బంగ్లా బ్యాట‌ర్ల‌కు అశ్విన్ చుక్క‌లు చూపించాడు. స్పిన్ మాస్ట్రో బౌలింగ్‌ను ఎదుర్కొలేక వ‌రుస క్ర‌మంలో బంగ్లా బ్యాట‌ర్లు పెవిలియ‌న్‌కు క్యూ క‌ట్టారు. ఈ మ్యాచ్‌లో 6 వికెట్ల‌తో చెల‌రేగాడు. అత‌డికి తోడు మ‌రో స్పిన్న‌ర్ ర‌వీంద్ర జడేజా కూడా 3 వికెట్ల స‌త్తాచాటాడు. దీంతో కేవ‌లం మూడున్నర రోజల్లోనే చెపాక్ టెస్టు ముగిసిపోయింది.

శాంటో ఒక్క‌డే..
బంగ్లా బ్యాట‌ర్ల‌లో కెప్టెన్ న‌జ్ముల్ హోస్సేన్ శాంటో(82) మిన‌హా మిగితా బ్యాట‌ర్లంద‌రూ చెప్పుకోద‌గ్గ ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేక‌పోయారు. మూడో రోజు ఆట‌లో కాస్త ప‌ట్టుద‌లతో క‌న్పించిన బంగ్లా బ్యాట‌ర్లు.. నాలుగో రోజు మాత్రం పూర్తిగా తేలిపోయారు. ష‌కీబ్(25) ఔటైన త‌ర్వాత‌ వ‌చ్చిన‌వారు వచ్చిన‌ట్లే పెవిలియ‌న్‌కు క్యూ క‌ట్టారు. 76 ప‌రుగుల వ్య‌వ‌ధిలోనే 6 వికెట్లు కోల్పోయి బంగ్లా ఓట‌మి చ‌విచూసింది.

అశ్విన్- జ‌డ్డూ ఫైటింగ్ ఇన్నింగ్స్‌..
ఇక తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అయితే ఫ‌స్ట్ ఇన్నింగ్స్‌లో స్టార్ బ్యాట‌ర్లు విఫ‌ల‌మైన‌ప్ప‌ట‌కి ర‌విచంద్ర‌న్ అశ్విన్‌, ర‌వీంద్ర జ‌డేజా అద్బుత‌మైన పోరాట ప‌టిమ క‌న‌రిబ‌రిచారు. అశ్విన్(113) సెంచ‌రీతో మెర‌వ‌గా.. జ‌డ్డూ(86) ప‌రుగుల‌తో రాణించారు. 

వీరిద్ద‌రూ ఏడో వికెట్‌కు 199 ప‌రుగుల భారీ భాగ‌స్వామ్యం నెల‌కొల్పారు. అనంత‌రం బంగ్లాదేశ్‌ 149 పరుగులకే ఆలౌటైంది. ఆ త‌ర్వాత భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 287/4 స్కోరు వద్ద డిక్లేర్డ్ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ల‌భించిన భారీ ఆధిక్యాన్ని జోడించి బంగ్లా ముందు 515 ప‌రుగుల ల‌క్ష్యాన్ని టీమిండియా ఉంచింది. ఈ ల‌క్ష్యాన్ని చేధించ‌డంలో బంగ్లా చేతులేత్తేసింది.
చదవండి: IND vs AUS: ఆసీస్‌ను చిత్తు చేసిన టీమిండియా

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement