చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా స్టార్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ సెంచరీతో కదం తొక్కాడు. తన సొంత ప్రేక్షకుల ముందు అశ్విన్ చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. టీ20 క్రికెట్‌ను తలపించిన అశ్విన్.. కేవలం 108 బంతుల్లోనే 10 ఫోర్లు, 2 సిక్సర్లతో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.
అంతేకాకుండా 144 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును తన విరోచిత సెంచరీతో అశూ ఆదుకున్నాడు. మరో ఆల్‌రౌండర్ జడేజాతో కలిసి భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఈ ఇద్దరూ ఏడో వికెట్‌కు అజేయంగా 195 పరుగుల ఆజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 80 ఓవర్లలో 6 వికెట్లకు 339 పరుగులు చేసింది. క్రీజులో అశ్విన్(102 బ్యాటింగ్), జడేజా(86 బ్యాటింగ్) ఉన్నారు. ఇక తొలి రోజు ఆట అనంతరం సెంచరీ హీరో అశ్విన్ స్పందించాడు. జడేజా సహకారంతో తన సెంచరీ సాధించగల్గాని అశ్విన్ తెలిపాడు.
"సొంత ప్రేక్షకుల ముందు ఎల్లప్పుడూ నాకు ప్రత్యేకమే. చెపాక్‌లో క్రికెట్ ఆడటం నాకు చాలా ఇష్టం. ఈ మైదానం నాకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలను అందించింది. నేను చివరగా ఈ మైదానంలో సెంచరీ సాధించాడు. అప్పుడు రవిశాస్త్రి భాయ్ కోచ్‌గా ఉన్నారు.
మళ్లీ ఇప్పుడు సెంచరీ సాధించడం చాలా సంతోషంగా ఉంది. ఇది నాకు చాలా స్పెషల్. టీఎన్‌పీఎల్ టీ20 టోర్నీ ఆడటం నా బ్యాటింగ్‌కు చాలా ఉపయోగపడింది. సాధారణంగా నేను ఎప్పుడూ ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా ఆడేందుకు ప్రయత్నిస్తుంటాను.
ఇటువంటి వికెట్‌పై దూకుడుగా ఆడటమే ఉత్తమం. మనం బంతిని ఫాలో అవుతూ ఆడితే ఇబ్బంది పడక తప్పదు. పంత్ ఆవిధంగానే తన వికెట్‌ను కోల్పోయాడు. ఇది పాత తరహా చెన్నై పిచ్. బౌన్స్‌తో పాటు కాస్త క్యారీ ఉంటుంది. రెడ్ సాయిల్ పిచ్‌పై మనం సరిగ్గా లైన్‌లో ఉంటే కొన్ని షాట్లు ఈజీగా ఆడవచ్చు.
ఈ ఇన్నింగ్స్‌లో జడేజా కూడా నాకు సపోర్ట్‌గా నిలిచాడు. నా ఇన్నింగ్స్ మధ్యలో నేను కాస్త ఆలిసిపోయి చెమటలు పట్టాను. అది చూసిన జడేజా నన్ను గైడ్ చేస్తూ ముందుకు సాగేలా ప్రోత్సహించాడు. గతకొన్నేళ్లగా జడ్డూ మా జట్టులోనే బెస్ట్ బ్యాటర్. నాకు చాలా సహకారం అందించాడు.
మూడు పరుగులు తీసే దగ్గర కూడా అతడు రెండు పరుగులు చాలు అని సరిపెట్టాడు. దీంతో నాకు కొంచెం అలసట తగ్గి నా ఇన్నింగ్స్ కొనసాగించగలిగాను. అతడికి థాంక్స్ చెప్పాలి. రేపు పిచ్ ఎలా ప్రవర్తిస్తుంది నాకు తెలియదు. కొంచెం స్పిన్,కొంచెం బౌన్స్‌కు అనుకూలించే అవకాశముంది" అని అశ్విన్ పేర్కొన్నాడు.
చదవండి: IND vs BAN: చరిత్ర సృష్టించిన అశ్విన్.. ప్రపంచంలోనే క్రికెటర్‌గా
Comments
Please login to add a commentAdd a comment