
బెంగళూరు వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ దుమ్ములేపుతోంది. మొదటి ఇన్నింగ్స్‌లో కివీస్ 402 పరుగుల భారీ సాధించింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో బ్లాక్ క్యాప్స్‌కు 356 పరుగుల ఆధిక్యం లభించింది.
న్యూజిలాండ్ బ్యాటర్లలో స్టార్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర(134) అద్బుతమైన సెంచరీతో చెలరేగగా.. కాన్వే(91), టిమ్ సౌథీ(65) ఆర్ధశతకాలు సాధించారు. భారత బౌలర్లలో జడేజా, కుల్దీప్ యాదవ్ తలా మూడు వికెట్లు పడగొట్టారు. వీరిద్దరితో పాటు సిరాజ్ రెండు, బుమ్రా, అశ్విన్ చెరో వికెట్ సాధించారు.
జడ్డూ మ్యాజిక్..
ఇక ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా సంచలన బంతితో మెరిశాడు. కివీస్ స్టార్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్‌ను జడ్డూ ఔట్ చేసిన తీరు ఇన్నింగ్స్ మొత్తానికే హైలెట్. జడేజా అద్భుతమైన బంతితో ఫిలిప్స్‌ను బోల్తా కొట్టించాడు. ఇన్నింగ్స్ 63వ ఓవర్‌లో మూడో బంతిని మిడిల్ స్టంప్ దిశగా లెంగ్త్ డెలివరీని జడ్డూ సంధించాడు.
ఆ బంతిని ఫిలిప్స్ బ్యాక్ ఫుట్ నుండి డిఫెన్సివ్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి అతడి బ్యాట్‌ను మిస్స్ అయ్యి స్టంప్స్‌ను గిరాటేసింది. అది చూసిన ఫిలిప్స్ ఒక్కసారిగా షాకయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
Phillips' bright start has a dim end thanks to Ravindra Jadeja 👌#IDFCFirstBankTestTrophy #JioCinemaSports #INDvNZ pic.twitter.com/sjjrzLnGxX
— JioCinema (@JioCinema) October 18, 2024