పంత్ పోరాటం వృథా.. మూడో టెస్టులో టీమిండియా ఘోర ఓటమి | New Zealand Beat India By 25 Runs, Whitewash Hosts 3-0 | Sakshi
Sakshi News home page

IND vs NZ: పంత్ పోరాటం వృథా.. మూడో టెస్టులో టీమిండియా ఘోర ఓటమి

Published Sun, Nov 3 2024 1:28 PM | Last Updated on Sun, Nov 3 2024 2:29 PM

New Zealand Beat India By 25 Runs, Whitewash Hosts 3-0

సొంత గడ్డపై టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో 25 పరుగుల తేడాతో భారత్ దారుణ ఓటమి చవిచూసింది. 147 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించడంలో టీమిండియా చతకలపడిం‍ది.

లక్ష్య చేధనలో కేవలం 121 పరుగులకే భారత జట్టు కుప్పకూలింది. భారత బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరిచారు. రిషబ్ పంత్‌(64) మినహా మిగితా అందరూ విఫలమయ్యారు. విరాట్ కోహ్లి, జైశ్వాల్‌, గిల్‌, సర్ఫరాజ్‌, జడేజా వంటి స్టార్ ప్లేయర్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.

ఆరేసిన అజాజ్ పటేల్‌..
మరోసారి వాంఖడేలో కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్ అద్బుతం చేశాడు. తన స్పిన్ మయాజాలంతో భారత్ బ్యాటర్లను ముప్పు తిప్పులు పెట్టాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఏకంగా 6 వికెట్లు పడగొట్టి టీమిండియా పతనాన్ని శాసించాడు. అతడితో పాటు పార్ట్ టైమ్ స్పిన్నర్ గ్లెన్ ఫిలిప్స్ 3 వికెట్లతో సత్తాచాటాడు. పేసర్ మాట్ హెన్రీ కూడా ఓ వికెట్ సాధించాడు.

ఇదే తొలిసారి..
భారత గడ్డపై మూడు లేదా అంతకంటే ఎక్కువ టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియాను  వైట్‌వాష్ చేసిన తొలి జట్టుగా న్యూజిలాండ్ రికార్డులకెక్కింది. ఈ సిరీస్ ముందు వ‌ర‌కు ఏ జ‌ట్టు చేతిలో కూడా టీమిండియా స్వ‌దేశంలో వైట్ వాష్‌కు గురువ్వ‌లేదు. ఇప్పుడు న్యూజిలాండ్ భార‌త జ‌ట్టును వైట్ వాష్ చేసి చ‌రిత్ర సృష్టించింది.

భారత్‌ వర్సెస్‌ న్యూజిలాండ్ మూడో టెస్టు(న‌వంబ‌ర్ 1- 5)
వేదిక:  ముంబై, వాంఖ‌డే స్టేడియం
టాస్‌: న్యూజిలాండ్‌.. తొలుత బ్యాటింగ్‌
న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోరు: 235
టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ స్కోరు: 263
న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌ స్కోరు: 174
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ స్కోరు: 121
ఫలితం: 25 పరుగుల తేడాతో భారత్‌ ఓటమి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement