Wankhade
-
పంత్ పోరాటం వృథా.. మూడో టెస్టులో టీమిండియా ఘోర ఓటమి
సొంత గడ్డపై టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో 25 పరుగుల తేడాతో భారత్ దారుణ ఓటమి చవిచూసింది. 147 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించడంలో టీమిండియా చతకలపడింది.లక్ష్య చేధనలో కేవలం 121 పరుగులకే భారత జట్టు కుప్పకూలింది. భారత బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరిచారు. రిషబ్ పంత్(64) మినహా మిగితా అందరూ విఫలమయ్యారు. విరాట్ కోహ్లి, జైశ్వాల్, గిల్, సర్ఫరాజ్, జడేజా వంటి స్టార్ ప్లేయర్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.ఆరేసిన అజాజ్ పటేల్..మరోసారి వాంఖడేలో కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్ అద్బుతం చేశాడు. తన స్పిన్ మయాజాలంతో భారత్ బ్యాటర్లను ముప్పు తిప్పులు పెట్టాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఏకంగా 6 వికెట్లు పడగొట్టి టీమిండియా పతనాన్ని శాసించాడు. అతడితో పాటు పార్ట్ టైమ్ స్పిన్నర్ గ్లెన్ ఫిలిప్స్ 3 వికెట్లతో సత్తాచాటాడు. పేసర్ మాట్ హెన్రీ కూడా ఓ వికెట్ సాధించాడు.ఇదే తొలిసారి..భారత గడ్డపై మూడు లేదా అంతకంటే ఎక్కువ టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియాను వైట్‌వాష్ చేసిన తొలి జట్టుగా న్యూజిలాండ్ రికార్డులకెక్కింది. ఈ సిరీస్ ముందు వరకు ఏ జట్టు చేతిలో కూడా టీమిండియా స్వదేశంలో వైట్ వాష్‌కు గురువ్వలేదు. ఇప్పుడు న్యూజిలాండ్ భారత జట్టును వైట్ వాష్ చేసి చరిత్ర సృష్టించింది.భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మూడో టెస్టు(నవంబర్ 1- 5)వేదిక: ముంబై, వాంఖడే స్టేడియంటాస్: న్యూజిలాండ్.. తొలుత బ్యాటింగ్న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 235టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరు: 263న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ స్కోరు: 174భారత్ రెండో ఇన్నింగ్స్ స్కోరు: 121ఫలితం: 25 పరుగుల తేడాతో భారత్ ఓటమి -
Ind vs NZ: కివీస్‌తో మూడో టెస్టు.. ప్లాన్ ఛేంజ్.. ‘పిచ్’ మారింది!?
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో ఘోర పరాభవం పాలైన టీమిండియా.. ఆఖరి మ్యాచ్‌లోనైనా గెలవాలని పట్టుదలగా ఉంది. ఇందుకోసం రోహిత్ సేన పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. మరోవైపు పిచ్ విషయంలోనూ మేనేజ్మెంట్ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. వాంఖడే వికెట్ తొలిరోజు బ్యాటర్లకు పూర్తిగా అనుకూలించేలా రూపొందించారని వార్తలు వినిపిస్తున్నాయి.డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటేకాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25లో భారత్‌కు ఇంకా ఆరు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. స్వదేశంలో న్యూజిలాండ్‌తో ఒకటి, ఆస్ట్రేలియా పర్యటనలో ఐదు టెస్టులు ఆడాల్సి ఉంది. వీటిలో కనీసం మూడు గెలిస్తేనే తప్ప టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరేందుకు మార్గం సుగమం కాదు. కాబట్టి న్యూజిలాండ్‌తో సొంతగడ్డపై మిగిలిన మ్యాచ్ గెలిస్తేనే.. ఆస్ట్రేలియాలో ఆత్మవిశ్వాసంతో అడుగుపెట్టగలదు.తొలిరోజు వారికే అనుకూలం!అందుకే ఏ రకంగా చూసినా న్యూజిలాండ్‌తో ఆడబోయే మూడో టెస్టు భారత్‌కు అత్యంత కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో వాంఖడేలో స్పోర్టింగ్ ట్రాక్ తయారుచేయించినట్లు తెలుస్తోంది. ‘‘ప్రస్తుతం పిచ్ మీద కాస్త పచ్చిక ఉంది. తొలిరోజు బ్యాటింగ్‌కు అనుకూలించేలా కనిపిస్తోంది. రెండో రోజు నుంచి బంతి కాస్త టర్న్ అయ్యే ఛాన్స్ ఉంది. రెండో రోజు నుంచే స్పిన్నర్లకు అనుకూలంగా ఉండనుంది’’ అని విశ్వసనీయవర్గాలు తెలిపినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. కాగా బెంగళూరు, పుణె టెస్టులో పిచ్ స్పిన్ బౌలింగ్‌కు బాగా అనుకూలించింది. ముఖ్యంగా రెండో టెస్టులో కివీస్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ ఏకంగా పదమూడు వికెట్లు కూల్చి భారత బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. టీమిండియా బౌలర్లలో వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్ తమ స్పిన్‌తో ఆకట్టుకున్నప్పటికీ బ్యాటర్ల వైఫల్యం కారణంగా 113 పరుగుల తేడాతో ఓడి సిరీస్‌ను చేజార్చుకుంది. ఈ క్రమంలో నవంబరు 1 నుంచి ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగనున్న ఆఖరి టెస్టులో గెలిస్తేనే రోహిత్ సేన పరువు నిలుస్తుంది. చదవండి: IPL 2025: వాషింగ్టన్ సుందర్ కోసం ఎగబడుతున్న ఫ్రాంఛైజీలు -
ఎందుకలా నెట్టేస్తున్నావు?.. రోహిత్‌పై విమర్శలు
ఐసీసీ ట్రోఫీ గెలవాలన్న చిరకాల కోరిక నెరవేరడంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సంతోషంలో మునిగి తేలుతున్నాడు. టీ20 ప్రపంచకప్-2024 ట్రోఫీని ముద్దాడిన క్షణాలను తలచుకుంటూ హిట్‌మ్యాన్ కుటుంబం సైతం ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది.ఇలాంటి సంతోషకర సమయంలో కొద్ది మంది నెటిజన్లు మాత్రం రోహిత్ శర్మపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తల్లిదండ్రులంటే అతడికి ఏమాత్రం గౌరవం లేదంటూ ఇష్టారీతిన ట్రోల్ చేస్తున్నారు. మరికొంత మందేమో ఈ విషయంలో విరాట్ కోహ్లి పేరును ప్రస్తావిస్తూ అతడినీ విమర్శిస్తున్నారు.అమెరికా- వెస్టిండీస్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో భారత్ గెలుపొందిన విషయం తెలిసిందే. లీగ్ దశ నుంచి ఫైనల్ వరకు అజేయంగా నిలిచిన రోహిత్ సేన.. ఆఖరి పోరులో సౌతాఫ్రికాను ఓడించి టైటిల్‌ను సొంతం చేసుకుంది.తద్వారా భారత్ ఖాతాలో పదమూడేళ్ల తర్వాత మరో వరల్డ్‌కప్ ట్రోఫీ చేరింది. టైటిళ్ల సంఖ్య నాలుగైంది. ఈ నేపథ్యంలో టీమిండియాకు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన తర్వాత ముంబైకి పయనమైన రోహిత్ సేన బస్ పెరేడ్లో పాల్గొంది.అదే విధంగా.. ప్రఖ్యాత వాంఖడే స్టేడియంలో అభిమానులకు అభివాదం చేస్తూ చిరస్మణీయ విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. ఇదిలా ఉంటే.. కెప్టెన్ రోహిత్ శర్మ తల్లి పూర్ణిమ శర్మ సైతం ఈ ఆనందోత్సవంలో భాగమయ్యారు.ఈ క్రమంలో కుమారుడిని చూసి తీవ్ర భావోద్వేగానికి గురైన ఆమె.. ఆప్యాయంగా ముద్దుల వర్షం కురిపించారు. అయితే, అందుకు ప్రతిగా రోహిత్ శర్మ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ట్రోలింగ్‌కు కారణమయ్యాయి.‘‘ఇక చాల్లే.. అందరూ చూస్తున్నారమ్మా’’ అన్నట్లుగా బిడియం ప్రదర్శించిన రోహిత్.. కాస్త ఇబ్బందిగా ఫీలయ్యాడు. ఈ క్రమంలో కొంతమంది రోహిత్‌ను టార్గెట్ చేశారు. ‘‘భార్య, కూతురితో ఉన్నంత అనుబంధం తల్లితో లేదా? ఆమె అంత ఆత్మీయంగా దగ్గరికి తీసుకుంటూ ఉంటే ఇలా చేయడం అస్సలు బాలేదు’’ అని విమర్శిస్తున్నారు.ఇక మరికొంత మందేమో.. ‘‘రోహిత్ కనీసం తన తల్లిదండ్రులనైనా ఇక్కడిదాకా తీసుకువచ్చాడు. కోహ్లి అయితే భార్యను తప్ప తల్లిని ఏనాడూ ఎక్కడికీ తీసుకురాడు’’ అని ట్రోల్ చేస్తున్నారు.అప్పుడే తన నిర్ణయం చెప్పాడుఇదిలా ఉంటే.. రోహిత్ శర్మ సాధించిన విజయం పట్ల అతడి తల్లి పూర్ణిమ శర్మ స్పందించారు. ‘‘ఇలాంటి ఒకరోజు వస్తుందని నేను అస్సలు ఊహించలేదు.వరల్డ్‌కప్ ఆడేందుకు వెళ్లే కంటే ముందు రోహిత్ మమ్మల్ని కలవడానికి వచ్చాడు. అప్పుడే అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలకాలన్న తన నిర్ణయాన్ని వెల్లడించాడు.గెలిచినా.. ఓడినా తన ఆలోచనలో మార్పు ఉండదని చెప్పాడు. అప్పుడు నేను గెలవడానికి ప్రయత్నించు అని మాత్రమే చెప్పగలిగాను. నిజానికి ఇప్పుడు కూడా నా ఆరోగ్యం అంతగా బాలేదు. అయితే, డాక్టర్ అప్పాయింట్మెంట్ మిస్ చేసుకుని మరీ ఇక్కడికి వచ్చాను’’ అని పుత్రోత్సాహంతో పొంగిపోయారు.Such a sweet moment between Rohit Sharma and his mom 🥹❤️ pic.twitter.com/u8hXhr3LVL— Vinesh Prabhu (@vlp1994) July 4, 2024 -
భారత క్రికెటర్ల వందేమాతర గీతాలాపన.. గూస్ బంప్స్ రావాల్సిందే..!
టీమిండియా టీ20 వరల్డ్‌కప్ 2024 సాధించిన నేపథ్యంలో భారత దేశ వ్యాప్తంగా సంబురాలు జరుగుతున్నాయి. ఊరూ వాడా భారత క్రికెట్ జట్టు సాధించిన విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. టీమిండియా 13 ఏళ్ల తర్వాత వరల్డ్‌కప్ సాధించడంతో అభిమానులతో పాటు భారత క్రికెటర్ల ఆనందానికి అవథుల్లేకుండా పోయాయి. GOOSEBUMPS GUARANTEED...!!!! 😍- Team India singing 'Vande Maataram' with Wankhede crowd. 🇮🇳pic.twitter.com/SfrFgWr4x9— Mufaddal Vohra (@mufaddal_vohra) July 4, 2024నిన్న (జులై 4) జరిగిన వరల్డ్‌కప్ విన్నింగ్ పెరేడ్లో భారత ఆటగాళ్లు తమనుతాము మైమరిచిపోయి సంబురాల్లో మునిగిపోయారు. డ్యాన్స్‌లు, పాటలతో తెగ సందడి చేశారు. వాంఖడేలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో టీమిండియా ఆటగాళ్లను పట్టడానికి వీల్లేకుండా పోయింది. ప్రతి ఒక్క ఆటగాడు చిన్న పిల్లాడిలా మారిపోయి ఆనందంలో మునిగి తేలారు. వందేమాతర గీతాలపన సందర్భంగా భారత క్రికెటర్లు అభిమానులతో గొంతు కలపడం చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే. ఈ సందర్భంగా కోహ్లి, హార్దిక్ చాలా ఎమోషనల్ అయ్యారు. వీరిద్దరు దిక్కులు పిక్కటిల్లేలా వందేమాతర గీతాలాపన చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఈ వీడియోను ఎంతసేపు చూసినా చూడాలనిపించేలా ఉంది.THE DANCE OF ROHIT SHARMA, VIRAT KOHLI & PLAYERS AT WANKHEDE.🥹🏆- One of the Most beautiful Moments in Indian cricket history. ❤️ pic.twitter.com/IjBujoejgb— Tanuj Singh (@ImTanujSingh) July 5, 2024ఇదిలా ఉంటే, టీమిండియా 13 ఏళ్ల ప్రపంచకప్ నిరీక్షణకు తెరదించుతూ యూఎస్ఏ, కరీబియన్ దీవులు వేదికగా జరిగిన టీ20 వరల్డ్‌కప్ 2024ను సాధించిన విషయం తెలిసిందే. వరల్డ్‌కప్ విజయానంతరం భారత క్రికెట్ జట్టు నిన్న ఉదయం న్యూఢిల్లీకి చేరుకుంది. అక్కడ ప్రధానితో భేటి అనంతరం విజయోత్సవ ర్యాలీలో పాల్గొనేందుకు ముంబైకు వచ్చింది. 11 ఏళ్ల అనంతరం ఐసీసీ ట్రోఫీ సాధించడంతో భారత క్రికెట్ జట్టుకు అడుగడుగునా నీరాజనాలు అందాయి. టీమిండియాకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ముంబైలో జరిగిన విన్నింగ్ పెరేడ్లో భారత క్రికెటర్లను చూసేందుకు జనాలు ఎగబడ్డారు. ముంబై నగర వీధులు భారత క్రికెటర్ల నామస్మరణతో మార్మోగాయి. విజయోత్సవ ర్యాలీ మెరైన రోడ్ గుండా సాగగా.. రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. భారత క్రికెటర్లు ఓపెన్ టాప్ బస్ నుంచి జనాలకు అభివాదం చేశారు. విన్నింగ్ పెరేడ్ మెరైన్ రోడ్ గుండా వాంఖడే వరకు సాగింది. అనంతరం వాంఖడే స్టేడియంలో భారత క్రికెటర్లకు బీసీసీఐ ఆథ్వర్యంలో సన్మానం జరిగింది. భారత క్రికెటర్లను, వరల్డ్‌కప్‌ను చూసేందుకు వాంఖడే స్టేడియంకు జనాలు పోటెత్తారు. -
రోహిత్ తన రాజ్యంలో చెలరేగిపోతున్నాడు.. సెంచరీ పూర్తి చేశాడు..!
ముంబై ఇండియన్స్ ఓపెనర్ రోహిత్ శర్మ తన సొంత మైదానమైన వాంఖడే స్టేడియంలో చెలరేగిపోతున్నాడు. ఈ మైదానంలో పట్టపగ్గాల్లేకుండా విరుచుకుపడే రోహిత్ ఆర్సీబీతో నిన్నటి మ్యాచ్‌లో మరోసారి రెచ్చిపోయాడు. 24 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 38 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో బాదిన సిక్సర్లతో హిట్‌మ్యాన్ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. వాంఖడే లో వంద సిక్సర్లు (టీ20ల్లో) సిక్సర్ల సెంచరీ కొట్టిన తొలి ముంబై ఇండియన్స్ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ రికార్డు గురించి తెలిసి అభిమానులు హిట్‌మ్యాన్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రోహిత్ తన రాజ్యంలో చెలరేగిపోతున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, రోహిత్‌తో పాటు బ్యాటర్లంతా చెలరేగడంతో ఆర్సీబీపై ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. డుప్లెసిస్ (40 బంతుల్లో 61; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), రజత్ పాటిదార్ (26 బంతుల్లో 50; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), దినేశ్ కార్తీక్ (53 నాటౌట్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. బుమ్రా ఐదు వికెట్ల ప్రదర్శనతో (4-0-21-5) చెలరేగాడు. అనంతరం 197 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై.. ఇషాన్ కిషన్ (39 బంతుల్లో 69; 7 ఫోర్లు, 5 సిక్సర్లు), రోహిత్ శర్మ (24 బంతుల్లో 38; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (19 బంతుల్లో 52; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (6 బంతుల్లో 21 నాటౌట్; 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటంతో 15.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఆర్సీబీ బౌలర్లు మరోసారి చెత్త ప్రదర్శన చేసి గెలిచే మ్యాచ్‌ను ఓడేలా చేశారు. -
CWC 2023 IND VS NZ Semi Final: టాస్ గెలిస్తే మ్యాచ్ గెలిచినట్లే..!
వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా ఇవాళ (నవంబర్ 15) అత్యంత కీలక సమరం జరుగనుంది. ముంబై వేదికగా జరుగనున్న తొలి సెమీఫైనల్లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. భారీ అంచనాలు కలిగిన ఈ మ్యాచ్‌లో టాస్ అత్యంత కీలకపాత్ర పోషించనుంది. వాంఖడే పిచ్ తొలుత బ్యాటింగ్ చేసే జట్టుకు పూర్తిగా సహకరించనుందని అంచనాలు ఉండటంతో ఏ జట్టైనా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవాలని భావిస్తుంది. ఈ పిచ్‌పై గతంలో పరుగుల వరద పారిన సందర్భాలు కోకొల్లలు. ఇదే టోర్నీలో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచినప్పటికీ బౌలింగ్ ఎంచుకుని చేయరాని తప్పు చేసింది. అనంతరం ఫలితం (302 పరుగుల భారీ తేడాతో ఓటమి) అనుభవించింది. ఇది దృస్టిలో ఉంచుకుని ఇరు జట్లు టాస్ గెలిస్తే తప్పక బ్యాటింగ్ ఎంచుకుంటాయి. ఈ మైదానంలో మరో అడ్వాంటేజ్ కూడా ఉంది. బౌండరీ చిన్నదిగా ఉండటంతో బ్యాటర్లు అవలీలగా ఫోర్లు, సిక్సర్లు బాది భారీ స్కోర్లకు దోహదపడగలరు. తొలుత బ్యాటింగ్ చేసి ప్రత్యర్ధి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచితే మిగతా పనిని పేస్ బౌలర్లు చూసుకుంటారు. ఈ పిచ్ తొలుత బ్యాటింగ్‌కు ఎంతగా సహకరిస్తుందో, సెకెండాఫ్‌లో పేస్ బౌలింగ్‌కు అంతగానే సహకరిస్తుంది. ఇది కూడా మనం ఇటీవలే చూశాం. లీగ్ దశలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 357 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో భారత పేసర్లు షమీ (5/18), సిరాజ్ (3/16), బుమ్రా (1/8) రెచ్చిపోయి లంకేయులను 55 పరుగులకే కుప్పకూల్చారు. ఈ పరిస్థితులన్నిటినీ దృష్టిలో ఉంచుకుని టాస్ గెలిచిన జట్టు తప్పక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంటుంది. జట్టు ఏదైనా టాస్ గెలిచిందా.. సగం మ్యాచ్ గెలిచినట్లే. ఇక వాతావరణం విషయానికొస్తే.. వర్ష సూచన లేదు. ఒకవేళ అవాంతరం ఎదురైనా రిజర్వ్ డే ఉంది. కాబట్టి వంద వాతం పూర్తి మ్యాచ్‌కు ఢోకా ఉండదు. మరి ఏ జట్టు గెలిచి ఫైనల్‌కు చేరుతుందో, ఏ జట్టు ఓడి ఇంటిబాట పడుతుందో వేచి చూడాలి. -
WC 2023: నేను చెత్త కెప్టెన్ అవడానికి ఎంతో సేపు పట్టదు: రోహిత్ శర్మ
ICC Cricket World Cup 2023 - Rohit Sharma Comments: వన్డే వరల్డ్‌కప్-2023లో టీమిండియా వరుస విజయాల నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మపై ప్రశంసల జల్లు కురుస్తోంది. సారథిగా వ్యూహాత్మకంగా జట్టును ముందుకు నడిపిస్తూనే.. కష్టాల్లో ఉన్న వేళ బ్యాట్ ఝలిపిస్తూ ఆటగాడిగానూ ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో జట్టు అజేయంగా నిలవడంలో కీలక పాత్ర పోషించిన హిట్‌మ్యాన్ ఇప్పటికే రెండుసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు. ఈ క్రమంలో సొంతమైదానం ముంబైలోని వాంఖడే వేదికగా కీలక మ్యాచ్‌కు తన జట్టుతో కలిసి సిద్ధమయ్యాడు రోహిత్ శర్మ. లంకపై గెలిస్తే సెమీస్‌కు ఇక శ్రీలంకతో గురువారం నాటి మ్యాచ్ గెలిస్తే.. భారత్ నేరుగా సెమీ ఫైనల్లో అడుగుపెట్టడం ఖాయమవుతుందన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రతి మ్యాచ్ కీలకమే.. విజయాల వెనుక రహస్యం అదే ‘‘ఈ విజయాలు నా ఒక్కడి వల్ల సాధ్యం కాలేదు. జట్టు సమిష్టి కృషితోనే ఇక్కడిదాకా వచ్చాము. అన్నీ బాగున్నపుడు.. అంతా బాగానే కనిపిస్తుంది. అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే అందరికీ సంతోషమే. అయితే, వీటన్నింటి వెనుక మా కష్టం ఎంత ఉందో నాకు తెలుసు. ప్రతి ఒక్క మ్యాచ్ మాకు కీలకమే. ఇప్పుడు అన్నీ బాగున్నాయి కాబట్టి ఒకే. లేదంటే నాపై చెత్త కెప్టెన్ అనే ముద్ర పడటానికి ఎంతో సేపు పట్టదు. అలా అయితే బ్యాడ్ కెప్టెన్ అయిపోతానని తెలుసు ఇక్కడి నుంచి ఏ చిన్న పొరపాటు జరిగినా.. అకస్మాత్తుగా నేను బ్యాడ్ కెప్టెన్ అయిపోతాను. కాబట్టి జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని.. విజయాలకు అవసరమైన ప్రణాళికలు రచించడంపై మాత్రమే నా దృష్టి కేంద్రీకరించాను. వరల్డ్‌కప్ ఆసాంతం అజేయంగా ఉండటమే మా లక్ష్యం. ఈ మ్యాచ్ నుంచి ప్రతి మ్యాచ్ మరింత జాగ్రత్తగా ఆడాలి. అప్పుడే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలం’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. వరుస విజయాల నేపథ్యంలో తనను ప్రశంసిస్తున్న వాళ్లే.. వరల్డ్‌కప్ ట్రోఫీ గెలిచే ప్రయాణంలో గనుక ఆటుపోట్లు ఎదురైతే తనను విమర్శించడానికి ఏమాత్రం వెనుకాడరని హిట్‌మ్యాన్ చెప్పుకొచ్చాడు. గొప్ప కెప్టెన్ అన్న నోటితోనే చెత్త కెప్టెన్ అనడానికి ఒక్క మ్యాచ్ ఫలితం చాలని పేర్కొన్నాడు. కాబట్టి తను ప్రతి మ్యాచ్‌ను సీరియస్‌గానే తీసుకుంటానని స్పష్టం చేశాడు. కాగా లీగ్ దశలో శ్రీలంక తర్వాత.. టీమిండియా సౌతాఫ్రికా, నెదర్లాండ్స్‌తో తలపడనుంది. చదవండి: రింకూ సింగ్ విధ్వంసం.. 33 బంతుల్లో 6 సిక్సర్ల సాయంతో..! -
Rajinikanth: అభిమానం స్టేడియానికి రప్పించిన వేళ..
సూపర్‌స్టార్ రజనీకాంత్ ముంబైలోని వాంఖడే వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి వన్డేకు హాజరయ్యారు. స్వతహగా క్రికెట్ అభిమాని అయిన రజనీని గతంలో చాలా మంది క్రికెటర్లు ప్రత్యేకంగా కలుసుకున్నారు. ఇటీవలే టీమిండియా వికెట్ కీపర్ సంజు శాంసన్ చెన్నైలో రజినీకాంత్‌ని ప్రత్యేకంగా కలిశాడు. గతంలో ధోనీ కూడా సూపర్ స్టార్‌ని కలిసి చాలా సేపు ముచ్చటించాడు. ఇక క్రికెట్‌పై ఆయనకున్న అభిమానం ఇవాళ వాంఖడే స్టేడియానికి రప్పించిందని ముంబై క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమోల్ ఖేల్ పేర్కొన్నాడు. ''వాంఖడే స్టేడియానికి వచ్చి తొలి వన్డే మ్యాచ్ చూడాలని లెజెండరీ యాక్టర్ రజినీకాంత్‌ని ఆహ్వానించా. ఆయన నా ఆహ్వానాన్ని మన్నించారు. చాలా రోజుల తర్వాత వాంఖడేలో సూపర్ స్టార్ అడుగుపెట్టారు'' అని అమోల్ ఖేల్ చెప్పుకొచ్చారు. స్టేడియంలోని బిగ్ స్క్రీన్స్‌పై రజినీకాంత్ కనిపించగానే స్టేడియం కేరింతలతో హోరెత్తిపోయింది. వీఐపీ గ్యాలరీలో కూర్చుని రజనీకాంత్ మ్యాచ్‌ని వీక్షిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచింది. రోహిత్ శర్మ మ్యాచ్‌కు దూరంగా ఉండడంతో జట్టు తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 28 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. Superstar #Rajinikanth at the Wankhede stadium watching the #INDvsAUS 1st ODI match pic.twitter.com/8XB0Uvsltu — Chennai Times (@ChennaiTimesTOI) March 17, 2023 చదవండి: భారత్, ఆసీస్ తొలి వన్డే.. రణరంగంగా ఆజాద్ మైదాన్ సచిన్ రికార్డును బద్దలు కొట్టేందుకు కోహ్లితో రోహిత్ పోటాపోటీ! -
‘అత్యుత్తమ ఫినిషర్’.. నా కెరీర్ ముగిసిపోలేదు.. అందుకే ఇప్పుడిలా!
IPL 2022 RR Vs RCB- Dinesh Karthik Comments: కీలక సమయంలో 23 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 44 పరుగులు.. అద్భుత ఇన్నింగ్స్‌తో ఆఖరి వరకు అజేయంగా నిలిచి తమ జట్టును విజయతీరాలకు చేర్చాడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు దినేశ్ కార్తిక్. జట్టు కష్టాల్లో కూరుకుపోయిన వేళ షాబాజ్ అహ్మద్(45 పరుగులు)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్ది.. సంచలన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా డీకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. గతంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహించిన దినేశ్ కార్తిక్‌న ఐపీఎల్ మెగా వేలం బరిలోకి రాగా.. ఆర్సీబీ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ టీమిండియా వెటరన్ ఆటగాడి కోసం రూ. 5 కోట్ల 50 లక్షలు ఖర్చు చేసింది. ఇందుకు తగినట్లుగా అద్భుత ప్రదర్శనతో దినేశ్ కార్తిక్ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటి వరకు ఈ సీజన్లో ఆడిన మూడు మ్యాచ్‌లలో పంజాబ్‌పై 32(నాటౌట్), కేకేఆర్‌పై 14 (నాటౌట్).. తాజాగా రాజస్తాన్‌పై 44 (నాటౌట్) పరుగులు సాధించాడు. ఈ క్రమంలో ముఖ్యంగా మంగళవారం నాటి ఇన్నింగ్స్‌తో డీకేపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అత్యుత్తమ ఫినిషర్ అంటూ అతడు కితాబులు అందుకుంటున్నాడు. 36 ఏళ్ల వయసులో ఏమాత్రం ఆడగలడు అని సందేహాలు వ్యక్తం చేసిన వారికి బ్యాట్‌తోనే సమాధానం ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న దినేశ్ కార్తిక్ మాట్లాడుతూ... క్రికెటర్‌గా తన కెరీర్ ఇంకా ముగిసిపోలేదని వ్యాఖ్యానించాడు. ఇప్పటి వరకు తన క్రికెట్ ప్రయాణంలో తోడుగా నిలిచిన వారి పట్ల కృతజ్ఞతా భావం చాటుకున్నాడు. ‘‘గతేడాది ఇంకాస్త మెరుగ్గా ఆడి ఉంటే బాగుండేది అనిపించింది. అందుకే ఈసారి ఎలాగైనా రాణించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నా. నెట్స్‌లో కష్టపడ్డాను. నాకు శిక్షణ ఇచ్చిన వ్యక్తికే ఈ క్రెడిట్ మొత్తం దక్కుతుంది. నిజానికి ప్రతిసారి.. నాకు నేనే.. ‘‘నీ పని అయిపోలేదు’’ అని చెప్పుకొంటూ.. నేను ఇంకా క్రికెట్ ఆడగలననే నమ్మకాన్ని పెంపొందించుకున్నాను. నా పని నేను చేసుకుంటూనే విమర్శలకు సమాధానం చెప్పాలనకున్నా. నా ప్రయాణం ఇక్కడి వరకు చేరడంలో చాలా మంది పాత్ర ఉంది. టీ20 క్రికెట్లో అనూహ్య పరిణామాలు ఉంటాయి. ముందుగా ప్లాన్ చేసినట్లుగానే కాకుండా అప్పటికప్పుడు టార్గెట్‌కు అనుగుణంగా మనల్ని మనం సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది’’ అని దినేశ్ కార్తిక్ చెప్పుకొచ్చాడు. కాగా రాజస్తాన్‌తో ముంబైలోని వాంఖడే మైదానంలో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. 🗣️🗣️ "I am not done yet; I have a goal and I want to achieve something"@DineshKarthik on his transformation and goals ahead 👍 #TATAIPL #RRvRCB pic.twitter.com/ctOu0q4j79 — IndianPremierLeague (@IPL) April 5, 2022 చదవండి: Ravi Shastri: "అతడు యార్కర్ల కింగ్.. ప్రపంచకప్‌లో అతడి సేవలను కోల్పోయాం" -
వాంఖడేలో చాపకింద నీరులా కరోనా.. తాజాగా మరో ముగ్గురికి
ముంబై: వాంఖడే మైదానం వేదికగా 14వ ఎడిషన్ ఐపీఎల్ మ్యాచ్‌లు యధాతధంగా జరుగుతాయని మహారాష్ట్ర సర్కారు ప్రకటించిన గంటల వ్యవధిలోనే మరో ముగ్గురు సిబ్బందికి కరోనా సోకినట్లు తేలింది. వైరస్ నిర్ధారణ అయిన వారిలో ఒకరు ప్లంబర్ కాగా, మరో ఇద్దరు గ్రౌండ్ స్టాఫ్ అని ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) వెల్లడించింది. గత కొద్ది రోజులుగా వాంఖడే మైదానంలో కరోనా కేసులు చాపకింద నీరులా విస్తరిస్తున్న నేపథ్యంలో మ్యాచ్‌ల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే మహారాష్ట్ర సర్కార్ బీసీసీఐతో సంప్రదింపులు జరిపి, షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్‌లు నిర్వహించాలని నిర్ణయించింది. కాగా, టోర్నీని సజావుగా నడిపే ఉద్దేశంతో మైదాన సిబ్బంది స్టేడియంలోనే బస చేస్తున్నారని, ప్రయాణాలు చేయడం లేదని ఎంసీఏ స్పష్టం చేసింది. కొద్దిరోజుల కిందట ఇదే స్టేడియంలో పని చేసే పది మంది సిబ్బందికి కరోనా సోకినట్లు బయటపడటంతో ముంబై క్రికెట్ అసోసియేషన్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇదిలా ఉండగా ముంబై వేదికగా మొత్తం 10 మ్యాచ్‌లు జరగాల్సి ఉన్నాయి. అందులో తొలి మ్యాచ్ ఏప్రిల్ 10న చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరుగనుంది. చదవండి: పృథ్వీషా ఆ అలవాటును మార్చుకోవాలి: పాంటింగ్ -
విన్నింగ్ షాట్ ధోనిదైతే ఆ కిక్కే వేరప్పా.!
సాక్షి, హైదరాబాద్ : క్రికెట్లో విన్నింగ్ షాట్ అంటేనే అభిమానులకు ప్రత్యేకం. ఇక ఆ షాట్ ధోనిదైతే మరింత ఆనందం. 2011 ప్రపంచకప్ ఫైనల్ విన్నింగ్ షాట్ అయితే ప్రతి క్రికెట్ అభిమాని మదిలో నిలిచిపోయింది. ఇప్పటికే ఎన్నో మ్యాచ్‌ల్లో విన్నింగ్ షాట్లతో భారత్‌ను గెలిపించిన ధోని తాజా భారత్-శ్రీలంక మధ్య జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో మరోసారి విన్నింగ్ షాట్‌తో మెరిసాడు. ఈ వీడియోను బీసీసీఐ ట్వీట్ చేయగా తెగ వైరల్ అయింది. పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే 31 వేలకు పైగా వ్యూస్, ఏడువేల లైక్‌లు వచ్చాయి. ఈ మ్యాచ్ చివర్లో కొంత ఉత్కంఠ రేపినా ధోని,కార్తీక్‌లు భారత్ విజయాన్ని సులువు చేశారు. చివరి రెండు ఓవర్లో భారత్ విజయానికి 15 పరుగులు రావల్సి ఉండగా.. ఈ ఇద్దరు బాల్ టు బాల్ సింగిల్స్ తీశారు. కార్తీక్ సిక్స్ కొట్టడంతో చివరి ఓవర్లో 3 పరుగులు అవసరమయ్యాయి. స్ట్రైకింగ్‌లో ఉన్న ధోని తొలి బంతికి రెండు పరుగులు రాబట్టాడు. రెండో బంతిని బౌండరీకి తరలించి విన్నింగ్ షాట్‌తో మ్యాచ్‌ను ముగించాడు. దీంతో నాలుగు బంతులు మిగిలి ఉండగానే విజయం భారత్ వశమైంది. ఈ గెలుపుతో భారత్ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. విన్నింగ్ షాట్ ధోనిదైతే ఆ కిక్కే వేరప్పా.! -
సన్‌రైజర్స్ హ్యాట్రిక్ కొట్టనుందా?
ముంబై: ఐపీఎల్-10లో విజయాలతో దూసుకుపోతున్న డిఫెండింగ్ ఛాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. బుధవారం వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో పోరుకు సిద్దమైంది. ఇరు జట్ల పటిష్టంగా ఉండటంతో హోరాహోరి పోరు జరుగనుంది. ఆదివారం కొల్కతా నైట్‌రైడర్స్‌తో నువ్వానేనా అన్న రీతిలో సాగిన మ్యాచ్‌లో ముంబై త్రిల్లింగ్ విజయంతో భోణి కొట్టింది. దాదాపు ఓటమి అంచుల నుంచి జట్టు విజయానందించిన యువ హిట్టర్లతో డెత్ ఓవర్లలో ముంబై బ్యాటింగ్ బలంగా ఉంది. ఈ విజయంతో ఉత్సాహంగా ఉన్న ముంబై ఆటగాళ్లు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి ప్రతికారం తీర్చుకోవాలనుకుంటున్నారు. గత సీజన్లో ఈ జట్లు రెండు సార్లు తలపడగా సన్‌రైజర్స్ హైదరాబాద్ నే విజయం వరించింది. ఈ మ్యాచ్ కు ఆతిథ్యం ఇస్తున్న వాంఖడే స్టేడియం ముంబై ఇండియన్స్‌కు హోం గ్రౌండ్ కావడంతో ఆజట్టు గెలుపుపై ధీమాగా ఉంది. ఇప్పటికే హోంగ్రౌండ్లో కొల్కతాపై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. యువ ఆటగాళ్లు నితీష్‌రాణా, హార్దిక్ పాండ్యాల మెరుపు బ్యాటింగ్‌తో ముంబై పదో సీజన్లో తొలి విజయాన్ని నమోదు చేసింది. ఐపీఎల్ మొత్తంలో ముంబై సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో 5 సార్లు తలపడగా 3 సార్లు నెగ్గి 2 సార్లు ఓడింది. ముంబై ఇండియన్స్ యవ ఆటగాళ్లు హార్దిక్‌పాండ్యా, నితీశ్‌రాణా, క్రుణాల్పాండ్యా, శ్రీలంకన్ యార్కర్స్ స్పెషలిస్టు లసిత్ మలింగాలతో జట్టు బలంగా ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ, స్పిన్నర్ హర్భజన్ సింగ్, పోలార్డ్ తమ స్థాయి తగ్గ ఆట ప్రదర్శిస్తే ముంబైకి తిరుగులేదు. ఆతిథ్య జట్టు సన్‌రైజర్స్‌లో యువ సంచలనం అప్ఘన్ బౌలర్ రషీద్‌ఖాన్, కెప్టెన్ వార్నర్ . యువరాజ్, శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్, అశిశ్నేహ్రా ఆల్‌రౌండర్ హెన్రీక్స్లతో జట్టు బలంగా ఉంది. మంచి ఫాంలో ఉన్న సన్‌రైజర్స్ ఆటగాళ్లు మరోసారి విజృంభిస్తే హైదరాబాద్‌కు తిరుగులేదు.