విన్నింగ్‌ షాట్‌ ధోనిదైతే ఆ కిక్కే వేరప్పా.! | Dhoni winning shot Viral | Sakshi
Sakshi News home page

విన్నింగ్‌ షాట్‌ ధోనిదైతే ఆ కిక్కే వేరప్పా.!

Published Mon, Dec 25 2017 8:32 AM | Last Updated on Mon, Dec 25 2017 8:52 AM

Dhoni winning shot Viral - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : క్రికెట్‌లో విన్నింగ్‌ షాట్‌ అంటేనే అభిమానులకు ప్రత్యేకం. ఇక ఆ షాట్‌ ధోనిదైతే మరింత ఆనందం. 2011 ప్రపంచకప్‌ ఫైనల్‌ విన్నింగ్‌ షాట్‌ అయితే ప్రతి క్రికెట్‌ అభిమాని మదిలో నిలిచిపోయింది. ఇప్పటికే ఎన్నో మ్యాచ్‌ల్లో విన్నింగ్‌ షాట్‌లతో భారత్‌ను గెలిపించిన ధోని తాజా భారత్‌-శ్రీలంక మధ్య జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో మరోసారి విన్నింగ్‌ షాట్‌తో మెరిసాడు. ఈ  వీడియోను బీసీసీఐ ట్వీట్‌ చేయగా తెగ వైరల్‌ అయింది. పోస్ట్‌ చేసిన కొద్ది గంటల్లోనే 31 వేలకు పైగా వ్యూస్‌, ఏడువేల లైక్‌లు వచ్చాయి.

ఈ మ్యాచ్‌ చివర్లో కొంత ఉత్కంఠ రేపినా ధోని,కార్తీక్‌లు భారత్‌ విజయాన్ని సులువు చేశారు. చివరి రెండు ఓవర్లో భారత్‌ విజయానికి 15 పరుగులు రావల్సి ఉండగా.. ఈ ఇద్దరు బాల్‌ టు బాల్‌ సింగిల్స్‌ తీశారు. కార్తీక్‌ సిక్స్‌ కొట్టడంతో చివరి ఓవర్‌లో 3 పరుగులు అవసరమయ్యాయి. స్ట్రైకింగ్‌లో  ఉన్న ధోని తొలి బంతికి రెండు పరుగులు రాబట్టాడు. రెండో బంతిని బౌండరీకి తరలించి విన్నింగ్‌ షాట్‌తో మ్యాచ్‌ను ముగించాడు. దీంతో నాలుగు బంతులు మిగిలి ఉండగానే విజయం భారత్‌ వశమైంది. ఈ గెలుపుతో భారత్‌ సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది.   

విన్నింగ్‌ షాట్‌ ధోనిదైతే ఆ కిక్కే వేరప్పా.!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement