India-Sri Lanka
-
కచ్చతీవు ఎక్కడుంది?.. దీని వెనుక అసలు కథేంటి?
ఎప్పుడో 50 ఏళ్ల క్రితం నాటి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీలంకకు రాసిచ్చిన కచ్చతీవు ఇపుడు రాజకీయ వివాదం రాజేస్తోంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా పార్టీలకు కచ్చతీవు ఇంధనంగా మారుతోంది. 2016 ఎన్నికల్లో రచ్చ రచ్చ రాజేసిన కచ్చతీవు ఈ ఎన్నికల్లోనూ తెరపైకి వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ కచ్చతీవు విషయంలో కాంగ్రెస్, డిఎంకేలపై మండి పడ్డ సంగతి తెలిసిందే. అయితే దానికి దీటుగా కాంగ్రెస్ కూడా బిజెపిపై విరుచుకు పడుతోంది. పదేళ్లుగా అధికారంలో ఉన్న మోదీ కచ్చతీవును ఎందుకు స్వాధీనం చేసుకోలేదో చెప్పాలని కాంగ్రెస్ నిలదీస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ఈ కచ్చతీవు ఎక్కడుంది? ఏమీ దీని కథ అన్నది తెలుసుకోవాలి. చరిత్ర పుటలను ఒక్కసారి వెనక్కి తిప్పాలి. భారత్-శ్రీలంకల మధ్య.. తమిళనాడుకు సమీపంలో ఉన్న ఈ దీవే కచ్చతీవి. తమిళ నాడులోని రామేశ్వరానికి.. శ్రీలంక లోని జాఫ్నాకీ మధ్యలో ఉంది ఇది. తమిళనాడుకు పది మైళ్ల దూరంలో ఇది కొలువు తీరింది. అపారమైన మత్స్య సంపదకు మారు పేరు ఇది. వేల సంవత్సరాలుగా కచ్చతీవుల్లో చేపలు పట్టి పొట్టపోసుకుంటూ వస్తున్నారు తమిళ జాలర్లు. అయితే 1974లో భారత ప్రభుత్వం తీసుకున్న ఓ అనాలోచిత నిర్ణయం కారణంగా ఈ దీవి శ్రీలంక వశమైంది. అప్పటి నుండి తమిళ మత్స్య కారులకు కష్టాలు మొదలయ్యాయి.దీవులపై పెత్తనం సంపాదించుకున్న శ్రీలంక తమ నావికాదళాలను ఇక్కడ మోహరించింది. అందుకు కారణాలూ ఉన్నాయి ఒకప్పుడు ఎల్.టి.టి.ఇ. తీవ్రవాదులకూ ఇది షెల్టర్ గా ఉండేది. అందుకే ఇటు వైపు నావికాదళాలను మోహరించి ..ఇటు వైపు ఎవరొచ్చినా వారు శత్రువులే అన్నట్లు శ్రీలంక వ్యవహరిస్తోంది. కచ్చతీవుల వైపు వచ్చే తమిళ మత్స్యకారులపై లంక నావికాదళాల దౌర్జన్యాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. తమ సరిహద్దుజలాల్లోకి ప్రవేశించారన్న సాకుతో చాలా మంది జాలర్లను లంక దళాలు కాల్చి చంపేశాయి. 1983 నుంచి ఇప్పటి దాకా 500 మందికి పైగా తమిళ జాలర్లను శ్రీలంక దళాలు పొట్టన పెట్టుకున్నాయి. కనీసం మూడు వేల మందికి పైగా మత్స్యకారులు లంక ఆర్మీ దాడిలో శాస్వత వికలాంగులుగా మిగిలారు. వందలాది మంది గంగ పుత్రుల ఆచూకీ తెలీడం లేదు. వందలాది మందిని లంక ఆర్మీ తమ జైళ్లల్లో నిర్బంధించింది. మరి కొన్ని వందల మందిని అక్రమ నిర్బంధంలో ఉంచి చిత్రహింసలకు గురి చేస్తున్నారన్నది తమిళ జాలర్ల ఆరోపణ. వేలాది సంవత్సరాలుగా తమ హక్కుగా ఉన్న దీవులను తమకి కాకుండా చేసిన భారత ప్రభుత్వం పై తమిళ గంగ పుత్రులు తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నారు. ఇక ఈ కచ్చ దీవి విషయానికి వస్తే.. ఈ దీవి భారత్ దే అనడానికి అన్ని రకాల సాక్ష్యాలూ ఉన్నాయి. తమిళనాడుకు చెందిన రామనాథపురం జమీందారీలో కచ్చతీవులు భాగమేనని రెవిన్యూ రికార్డులు చెబుతున్నాయి. రామనాథ పురానికి చెందిన రాజు సేతుపతి పాలనలోనూ.. ఆ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలోనూ..స్వాతంత్ర్యం వచ్చాక స్వతంత్ర భారత పాలనలోనూ కూడా కచ్చతీవులు తమిళనాడు ఆధీనంలోనే ఉన్నాయి. 1605 లో రామనాథ పురాన్ని ఏలిన సేతుపతి రాజు హయాంలో 69 గ్రామాలు..ఏడు దీవులను పాలించాడు. వాటిలో కచ్చతీవులు కూడా ఉన్నాయి. రామనాథ పురం ఆస్థానంలో కచ్చదీవి ఆర్ధిక లెక్కల ఆడిటింగ్ కోసం ప్రత్యేక విభాగమే ఉంది. 1822 లో కచ్చ దీవులను ఈస్ట్ ఇండియా కంపెనీకి లీజుకు ఇచ్చినట్లు రామనాథపురం ఆస్థానంలో పత్రాలు ఉన్నాయి. అయితే వీటిని ఏ మాత్రం పట్టించుకోకుండా..1974లో అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ కచ్చ దీవులను శ్రీలంకకు రాసిచ్చేశారు. అప్పటి శ్రీలంక ప్రధాని సిరిమావో బండారి నాయకేకు స్వదేశంలో రాజకీయ ప్రయోజనాలు కల్పించేందుకే ఇందిరా గాంధీ తమ నోటికాడి ఆహారాన్ని తన్నేసి ..శ్రీలంకుకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారన్నది తమిళ జాలర్ల ఆరోపణ. తమిళ మత్స్యకారులతో కనీస సంప్రదింపులు కూడా జరపకుండా కేంద్రంలోని ఇందిరాగాంధీ ప్రభుత్వం..తమిళనాడులోని కరుణానిథి ప్రభుత్వం ఏక పక్ష నిర్ణయం తీసుకున్నారని ద్రవిడ దేశం అధ్యక్షుడు కృష్ణారావు ఆరోపిస్తున్నారు. రెండు దేశాల ప్రధానుల మధ్య కుదిరిన ఈ ఒప్పందం భారత పార్లమెంటు లో ఆమోదం పొందనే లేదు. ఇపుడు ఈ అంశాన్నే లేవనెత్తుతున్నాయి తమిళ రాజకీయ పార్టీలు. కచ్చ దీవుల విషయంలో శ్రీలంకతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని పునః పరిశీలించాలని..కచ్చదీవులను తిరిగి భారత ఆధీనంలోకి తీసుకోవాలని తమిళ జాలర్లు పట్టుబడుతున్నారు. కచ్చ దీవుల పై హక్కుల కోసం ఓ సంఘాన్ని నెలకొల్పి ఏళ్ల తరబడి ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. సీతయీన్ మైన్ థాన్ నాయకత్వంలో ఈ ఉద్యమం సాగుతోంది. కచ్చతీవులను శ్రీలంకకు ఇష్టారాజ్యంగా ఇచ్చేయడానికి ఇందిరాగాంధీకి ఏం హక్కు ఉందని మైన్ థాన్ నిలదీస్తున్నారు.కచ్చతీవులు మోతీ లాల్ నెహ్రూ సంపాదించుకున్న వంశపారం పర్య ఆస్తి ఏమీ కాదని ఆయన వ్యంగ్య ధోరణిలో విరుచుకుపడ్డారు. రెండు దేశాల పెద్దలూ కూడా తమ తమ రాజకీయ ప్రయోజనాలకోసమే మత్స్యకారుల జీవితాలను నాశనం చేశారని మైన్ థాన్ ఆరోపిస్తున్నారు. నిజానికి 1974 లో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం రెండు దేశాల పర్యాటకులు..మత్స్యకారులూ కచ్చ దీవులకు ఇష్టాను సారం రావచ్చు..పోవచ్చు. ఇందుకోసం ఎవరూ రెండో దేశపు అనుమతి పత్రాలు తీసుకోవలసిన అవసరం లేదు. అయితే ఈ వెసులుబాటును శ్రీలంక ఆర్మీ తోసి పుచ్చుతోంది. కచ్చ తీవులవైపు వచ్చే తమిళ జాలర్లను నానా హింసలూ పెడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. శ్రీలంక ఇలా ఒప్పందాన్ని ఉల్లంఘించాక భారత ప్రభుత్వం చేష్ఠలుడిగినట్లు మౌనంగా ఉండడంలో అర్ధం లేదన్నది మత్స్యకారుల ఆరోపణ. మైన్ థాన్ అనుమానం ఏంటంటే... శ్రీలంక లో పాకిస్థాన్ ఎయిర్ బేస్ ఏర్పాటుకు శ్రీలంక ప్రభుత్వం అనుమతించే అవకాశం ఉందని తెలియడంతో...పాకిస్థాన్ ను పక్కలో బల్లెంలా శ్రీలంకలో ఎందుకు పెట్టుకోవడం అని అనుకున్న ఇందిరా గాంధీ దాన్ని బ్రేక్ చేయడానికే శ్రీలంక కోరిన విధంగా కచ్చ తీవులను వదులుకోడానికి సిద్ధమయ్యారని మైన్ థాన్ వాదన. అటు శ్రీలంకలోనూ రాజకీయంగా వెనకబడుతోన్న బండారి నాయకే..పేరు ప్రతిష్ఠలను మూట కట్టుకోడానికే నెహ్రూ కుటుంబంతో తనకున్న సాన్నిహిత్యాన్ని వాడుకుని ఇందిరా గాంధీ చేత ఒప్పందం చేయించుకున్నారని మైన్ థాన్ ఆరోపిస్తున్నారు. అయితే ఇపుడు పాకిస్థాన్ కన్నా పెద్ద ప్రమాదం చైనా రూపంలో పొంచి ఉన్న సంగతిని ఇప్పటి ప్రభుత్వం గుర్తించాలంటున్నారు మైన్ థాన్. కచ్చతీవులకు వెళ్లి వచ్చే తమిళ జాలర్లు కూడ శ్రీలంక నావికా దళాల బోట్లలో చైనా సైనికులను చూసినట్లు చెబుతున్నారు. ఇప్పటికే శ్రీలంకలో లక్ష మందికి పైగా చైనా సైనికులు ఉన్నారని అది ఏ క్షణంలో అయినా భారత్ కు ముప్పేనని మైన్ థాన్ హెచ్చరిస్తున్నారు. మరో పక్క కొలంబో కేంద్రంగా లష్కరే తోయిబా ఉగ్రవాదులు సైతం శిక్షణ పొందుతున్నారని.. ఈ ఉగ్రవాదులు కూడ కచ్చతీవులను కేంద్రంగా చేసుకుని కార్యకలాపాలు ఆరంభిస్తే..భారత్ లో శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని అంటున్నారు. వీటిని దృష్ఠిలో పెట్టుకుని కచ్చతీవుల విషయంలో శ్రీలంకతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసి దీవులను స్వాధీనం చేసుకోవాలని..లేని పక్షంలో అది భారత సార్వభౌమాధికారానికే ముప్పుగా మారే ప్రమాదం ఉందని గంగపుత్రుల సంఘాలు హెచ్చరిస్తున్నాయి. అవసరమైతే అంతర్జాతీయ న్యాయ స్థానాలను ఆశ్రయించాలని కూడా వారు సూచిస్తున్నారు. కచ్చ తీవుల్లో అటు హిందూ దేవాలయాలతో పాటు సెయింట్ ఆంధోనీ చర్చి కూడా ఉంది. క్రైస్తవ పండగతో పాటు హిందూ జాతరలకూ తమిళనాడు నుంచి ఏటా వేలాది మంది కచ్చ తీవులకు వెళ్తూ ఉంటారు. ఇపుడు తమిళ నాట ఎన్నికల పుణ్యమా అని కచ్చతీవుల అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. అదే గంగపుత్రుల్లో కోటి ఆశలు రేపుతోంది. ఇదీ చదవండి: 10 ఏళ్లగా ప్రధాని మోదీ ఏం చేశారు? కచ్చతీవుపై చిదంబరం కీలక వ్యాఖ్యలు -
టీ కప్పులో తుపాను వివాదం
తమిళనాడులో లోక్‌సభ ఎన్నికలు ముగిసేదాకా కచ్చతీవు వివాదం వార్తల్లో ఉంటుంది. పరిమిత రాజకీయ జీవితకాలం ఉన్న ఈ అంశాన్ని భారత్–శ్రీలంక ద్వైపాక్షిక సమస్యగా పొడిగించాలని కోరుకునేవారు గమనించాల్సింది, నాయకుల మధ్య వ్యక్తిగత సమీకరణాలు విధాన మార్గదర్శ కాలుగా పనిచేశాయి. దానివల్ల వివాదాలు సామరస్యంగా పరిష్కారమయ్యాయి. కాబట్టి గత నిర్ణయాల పట్ల అర్థంలేని వివాదాలు ప్రయోజనం చేకూర్చవు. ఇంకా ముఖ్యంగా, ‘వియన్నా కన్వెన్షన్ ప్రకారం భారతదేశం ఏకపక్షంగా (కచ్చతీవు) ఒప్పందాన్ని రద్దు చేయలేదు. దేశం ఎదుగుతున్న శక్తిగా తనను తాను ప్రకటించుకుంటున్నప్పుడు ఒడంబడిక రద్దు అనేది అంతర్జాతీయ రాజకీయాల్లో తన ప్రతిష్ఠను కోల్పోయేలా చేస్తుంది.’ ఒక వారం క్రితం భారత ఎన్నికల వేదికపై కచ్చతీవు వివాదం విరుచుకుపడినప్పుడు, 1994 జనవరిలో విదేశాంగ కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన జేఎన్ దీక్షిత్‌తో మూడు దశాబ్దాల క్రితం గడిపిన సాయంత్రాల వైపు నా మనస్సు మళ్లింది. కొలంబోలో ఉన్న సమయంలో ‘వైస్రాయ్’ నామ కరణం పొందిన దీక్షిత్ 1985 నుండి 1989 వరకు భారత హైకమిషనర్‌గా, ఒక రకంగా మార్గదర్శకుడిగా వ్యవహరించారు. ఆయన సహ చరులు చాలామంది, విదేశీ వ్యవహారాల రహస్యాలను తాము చని పోయేంతవరకు దాచిపెడుతున్న సమయంలో, దౌత్యంపై జాతీయ మీడియాలో రాజకీయ కాలమ్‌ను ప్రారంభించిన మొదటి భారతీయ విదేశాంగ కార్యదర్శి జేఎన్ దీక్షిత్. నేను దీక్షిత్‌తో గురుగావ్‌లో గడిపాను. శ్రీలంకలో తాను పని చేసిన సంవత్సరాల గురించి ఆయన ఒక పుస్తకం రాయాలను కున్నారు. ఆయన పదవీకాలం భారత్, శ్రీలంక సంబంధాలలో అక్ష రాలా అత్యంత విస్ఫోటనా కాలం. ఇది జనావాసాలు లేని కచ్చతీవు ద్వీపంపై ప్రస్తుత టీకప్పులో తుపాను లాంటిది కాదు. అవి ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలలో వేగవంతమైన హెచ్చు తగ్గులతో కూడి, శ్రీలంకలో ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ ఎదుర్కొంటున్న దురదృష్టకరమైన సంవత్సరాలు. విదేశీ సంబంధాలలో ఇటు వంటి అస్థిరత చివరికి రెండేళ్ల వ్యవధిలోనే భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, అప్పటి శ్రీలంక అధ్యక్షుడు రణసింఘే ప్రేమదాస విషాద హత్యలకు దారితీసింది. దీక్షిత్‌కు జనాల కోసం రాయడం గురించి సందేహాలున్నాయి. రచయితగా మారే క్రమంలో నాలాంటి చాలామంది జర్నలిస్టులను ఆయన రప్పించుకున్నారు. ‘అసైన్ మెంట్ కొలంబో’ శీర్షికతో శ్రీలంకపై రాస్తున్నానంటూ దీక్షిత్ వెల్లడించిన పుస్తకం పూర్తి కావడానికి నాలుగేళ్లు పట్టింది. అధికారిక రహస్యాల చట్టంలోని నిబంధనలలో చిక్కుకోకుండా ఉండేందుకు ఆయన దానిని జ్ఞాపకాల నుండి మాత్రమే రాయాలనుకున్నారు. ఈలోగా, అంతగా వివాదాస్పదం కాని మరో మూడు పుస్తకాలను ప్రచురించారు. ఒక సాయంత్రం, శ్రీలంక సందర్శనకు విచ్చేసిన ఉన్నత స్థాయి భారతీయ ప్రతినిధి బృందానికి తాను ఏర్పాటు చేసిన రిసెప్షన్ గురించి ఆయన నాకు చెప్పారు. హైకమిషనర్ ప్రత్యేక అతిథిగా ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా ప్రధాన మంత్రి సిరిమావో బండారు నాయకే ఆ రిసెప్షన్ కు హాజరయ్యారు. ఆ సమావేశానికి హాజరైన వారి మానసిక స్థితి ఉల్లాసంగా ఉంది. కొంచెం మత్తులో ఉన్న భారతీయ సందర్శకులలో ఒకరు, సిరిమావో బండారునాయకే అధికారంలో ఉన్నప్పుడు ద్వీపంలో అంతర్యుద్ధం చెలరేగి ఉండినట్లయితే, ఎల్టీటీఈ అగ్రనేత వేలుపిళ్లై ప్రభాకరన్ విషయంలో ఆమె ఏమి చేసి ఉండే వారంటూ చికాకు కలిగించే ప్రశ్నను అడిగారు. ఒక్క క్షణం కూడా సంకోచించకుండా, బండారునాయకే ఇలా తిప్పికొట్టారు: ‘నేను న్యూఢిల్లీలో ఉన్న మా సోదరికి ఫోన్‌చేసి, ఈ ప్రభాకరన్ అనే వ్యక్తినీ, లంక తమిళ సమస్యకు అతని రకమైన పరిష్కారాన్నీ నేను క్రమబద్ధీ కరించేటప్పుడు ఈ అంశంపై దృష్టిసారించకుండా వేరే వైపు చూడ మని అడిగి ఉంటాను.’ ఆ ‘సోదరి’ మరెవరో కాదు, ఇందిరా గాంధీ. అనూహ్యంగా, శ్రీలంక జాతి కలహాల సమయంలో కొలంబోలో భారతదేశ మొదటి కార్యదర్శిగా ఉన్న నిరుపమారావు ఆ సమయంలో తన ప్రాణాలకు ముప్పు కలిగే స్థితిలో ఉన్నారు. ఏప్రిల్ 1న కచ్చతీవు వివాదం చెలరేగిన కొన్ని గంటల్లోనే తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) అకౌంటులో నిరుపమ వ్యాఖ్యానిస్తూ, తనను 1983లో ఉన్నట్లుండి శ్రీలంక నుండి స్వదేశం పంపించి వేశారని రాశారు. ‘1974 ఒప్పందం ముగింపులో ఇందిరా గాంధీ, సిరిమావో బండారునాయకే మధ్య వ్యక్తిగత సమీకరణం నిర్ణయాత్మక పాత్ర పోషించింది’ అని రాశారు. కచ్చతీవు చర్చల విషయంలో తనను రక్షించాల్సిందిగా ఇందిరకు బండారునాయకే వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేశారనీ, లేకుంటే ఆమెకు రాజ కీయంగా విపత్తు తప్పేది కాదనీ నిరుపమ చెప్పారు. దశాబ్దాల తర్వాత పూర్తిగా భిన్నమైన నేపథ్యంలో దీక్షిత్ దీన్నే చెప్పారు. తరు వాత నిరుపమారావు 2004 నుండి 2006 వరకు కొలంబోలో హై కమిషనర్‌గా పనిచేశారు. జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ పార్థ ఘోష్ ఇలా రాశారు: ‘బండారునాయకే దుఃస్థితిని ఇందిరా గాంధీ స్పష్టంగా గ్రహించారు. భారత ప్రతినిధి బృందం ప్రతిస్పందించకముందే పరిస్థితిని తారుమారు చేశారు. ఇందిర ప్రదర్శించిన ఈ ఔదార్యపు సంకేతాన్ని బండారునాయకే 1990 చివరిలో ఎంతో కృత జ్ఞతతో గుర్తు చేసుకున్నారు.’ ఘోష్ ఆ సంవత్సరాన్ని 2000 అని పేర్కొని ఉండాలి, అంటే బండారునాయకే ప్రధానమంత్రిగా తన చివరి పదవీకాలం పూర్తయ్యే వరకు అన్నమాట. ఒక దశాబ్దం పాటు శ్రీలంక ఏకైక మహిళా అధ్యక్షురాలుగా ఉన్న ఆమె కుమార్తె చంద్రికా కుమారతుంగ కూడా భారత్ 1974లో ప్రదర్శించిన ఈ స్నేహ పూర్వకమైన సంకేతాన్ని మరచిపోలేదు. కొలంబోలో తనకంటే ముందే పనిచేసిన దీక్షిత్, నిరుపమా రావు కాలం నుండి కచ్చతీవు విషయంలో పెద్దగా మార్పు రాలేదనే వాస్త వాన్ని అమృత్సర్ నుండి బీజేపీ తరపున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి తరణ్‌జిత్ సింగ్ సంధూ కూడా ధృవీకరించగలరు. సం«ధూ 2000 నుండి 2004 వరకు శ్రీలంకలో భారత రాయబార కార్యాలయంలో కౌన్సెలర్‌గానూ, హైకమిషనర్‌గానూ పనిచేశారు. 2017లో సంధు భారత హైకమిషన్ లో బాధ్యతలు స్వీకరించి నప్పుడు, శ్రీలంక బీజింగ్ అందాలకు పడిపోయింది. భారత ప్రభావ పరిధిలో ఉండటం మానేసింది. అధ్యక్షుడిగా మహింద రాజపక్స చైనా అనుకూల విధానాలను కలిగి ఉన్నప్పటికీ, తరణ్‌జీత్ సింగ్ సంధూ, ప్రతిపక్ష నాయకుడిగా రాజపక్సను ఒకసారి కాదు రెండుసార్లు భారత్‌ను సందర్శించేలా చేసే ఆహ్వానం కోసం పట్టుబట్టారు. ఆ రెండు సార్లలో మొదటి సందర్శన సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, మహింద రాజపక్స మధ్య ఏర్పడిన బంధం... శ్రీలంక కీల కమైన రాజకీయవేత్తను భారత మద్దతుదారుగా మార్చింది. రెండేళ్ల తర్వాత, మహింద ప్రధాని అయినప్పుడు, భారత్ లెక్కించినట్లుగానే, ఆయన తొలి బాహ్య సదస్సు మోదీతోనే వర్చువల్‌గా జరిగింది. మహింద సోదరుడు గొటబయ రాజపక్స అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తన మొదటి పర్యటన కోసం భారత్‌నే ఎంచుకున్నారు. ఏప్రిల్ 19న తమిళనాడులో ఓటింగ్ జరిగేదాకా పరిమిత రాజకీయ జీవితకాలమే ఉన్నప్పటికీ, కచ్చతీవు వివాదాన్ని ద్వైపాక్షిక సమస్యగా పొడిగించాలని కోరుకునే వారందరూ నేర్చుకోవలసిన ఒక పాఠం ఉంది. రాజపక్స కుటుంబం రాజకీయ అరణ్యంలో ఉన్నప్పటికీ భారత్–శ్రీలంక సంబంధాలు ఇప్పుడు అద్భుతంగా ఉన్నాయి. ప్రస్తుత శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే కంటే మెరుగైన మిత్రుడు భారత్‌కు దొరకరు. ప్రస్తుత ప్రధాని దినేశ్ గుణవర్దన విషయంలోనూ ఇది నిజం. యూఎస్‌లో తన క్లాస్మేట్ అయిన జయ ప్రకాశ్ నారాయణ్ ప్రభావంతో భారత స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నందుకు దినేశ్ తండ్రి ఫిలిప్ గుణవర్దనను బ్రిటిష్‌వాళ్లు బొంబాయిలో బంధించారని కొద్దిమంది భారతీయులకే తెలుసు. విదేశాంగ కార్యదర్శిగానూ పనిచేసిన నిరుపమారావు ప్రకారం, ‘వియన్నా కన్వెన్షన్ ప్రకారం భారతదేశం ఏకపక్షంగా (కచ్చతీవు) ఒప్పందాన్ని రద్దు చేయలేదు. దేశం ఎదుగుతున్న శక్తిగా తనను తాను ప్రకటించుకుంటున్నప్పుడు ఒడంబడిక రద్దు అనేది అంతర్జాతీయ రాజకీయాల్లో తన ప్రతిష్ఠను కోల్పోయేలా చేస్తుంది.’ కేపీ నాయర్ వ్యాసకర్త వ్యూహాత్మక అంశాల విశ్లేషకులు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
చిరుదీవిలో ఎన్నికల చేపలవేట
ఎన్నికలంటే సాధారణంగా ఉద్యోగాలు, ద్రవ్యోల్బణం లాంటివి ప్రస్తావనకొస్తాయి. కానీ, మూడు రోజులుగా ఓ విదేశాంగ విధానం ప్రధానాంశమై కూర్చుంది. లోక్‌సభ ఎన్నికల తొలి దశలోనే తమిళనాట పోలింగ్ జరగనున్న వేళ ఆ రాష్ట్రానికి అతి సమీపంగా భారత – శ్రీలంకల మధ్యనున్న చిరుద్వీపం కచ్చతీవు ఇప్పుడు వార్తల్లో నిలిచింది. స్టాలిన్ సారథ్యంలోని స్థానిక డీఎంకె ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రధాని, విదేశాంగ మంత్రి సహా సమస్త శక్తులనూ బీజేపీ కేంద్రీకరించినట్టు కనిపిస్తోంది. ఎన్నికల మాట అటుంచితే, భారత సర్కారే ఒకప్పుడు శ్రీలంకకు అప్పగించిన ఓ ద్వీపప్రాంత ప్రాదేశిక హక్కులపై ఇప్పుడు రగడ చేయడం సబబేనా? ప్రభుత్వాలు మారినప్పుడల్లా సముద్ర జలాల సరిహద్దులు మార్చేసే ప్రయత్నాలు ఎక్కడికి దారి తీస్తాయి? భారత్ – శ్రీలంకల మధ్య పాక్ జలసంధిలో 1.6 కిలోమీటర్ల పొడవు, 300 మీటర్ల వెడల్పున్న చిన్న ప్రాంతం కచ్చతీవు. భారత్‌లోని రామేశ్వరానికి ఉత్తరాన 30 కి.మీ.ల దూరంలో, శ్రీలంకలోని జాఫ్నాకు దక్షిణాన 60 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ ద్వీపం వ్యూహాత్మకంగా కీలకమైనది. కచ్చతీవు చారిత్రకంగా జాఫ్నా రాజ్యంలో, ఆపైన రామ్నాడ్ సహా పలువురు రాజుల ఏలుబడిలో, బ్రిటీష్ వారి హయాంలో మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేది. తాగునీటితో సహా ప్రాథమిక వసతులేవీ లేని ఈ ప్రాంతంలో ఒకే ఒక్క చర్చి మినహా నివాసాలే లేవు. ఈ ద్వీపం తాలూకు ప్రాదేశిక హోదాపై భారత్, శ్రీలంకల మధ్య దీర్ఘకాలం వివాదం నెలకొంది. అయితే, 1974లో ఇరుదేశాలూ ఓ ఒప్పందానికి వచ్చి, సంతకాలు చేశాయి. శ్రీలంకతో పటిష్ఠ బంధానికై కేంద్రంలో ఇందిరా గాంధీ సారథ్యంలోని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చిరుద్వీపాన్ని శ్రీలంకకు అప్పగించింది. ఇప్పుడు యాభై ఏళ్ళ తర్వాత మోదీ నేతృత్వంలోని బీజేపీ భారత సమైక్యతకు విఘాతం కలిగిస్తూ కాంగ్రెస్, డీఎంకెలు ‘నిర్లక్ష్యంగా’ ఆ ద్వీపాన్ని శ్రీలంకకు ధారాదత్తం చేసేశాయంటూ దాడికి దిగింది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఇటీవల ‘సమాచార హక్కు’ పిటిషన్ ద్వారా ఇప్పటి దాకా బయటపడని ఈ ద్వీపం అప్పగింత వివరాలను తీసుకున్నారు. అవన్నీ మీడియాలో వచ్చాయి. దక్షిణాదిన, అందునా తమిళనాట బీజేపీ జెండా ఎగరేయాలని తరచూ పర్యటిస్తున్న ప్రధాని మోదీ దాన్ని అందిపుచ్చుకొన్నారు. ద్వీపం అప్పగింత తప్పుడు నిర్ణయమంటూ కాంగ్రెస్‌ను దుయ్య బట్టారు. విదేశాంగ మంత్రి జైశంకర్ స్వరం కలిపారు. సమీప శ్రీలంక జలాల్లో భారతీయ జాలర్లను పదే పదే అరెస్టు చేస్తున్నారంటే, అదంతా అప్పటి తప్పుడు నిర్ణయం ఫలితమేనని ఆయన ఆరోపణ. ఈ చిరుద్వీపానికి తన దృష్టిలో పెద్దగా ప్రాధాన్యం లేదని 1961 మేలోనే ప్రధాని నెహ్రూ అన్నారట. ద్వీపాన్ని అప్పగించినా చేపలు పట్టుకొనేందుకు భారతీయులకున్న హక్కుల్ని 1974 ఒప్పందంలో పరిరక్షిస్తున్నామంటూ పార్లమెంట్‌కు హామీ ఇచ్చిన నాటి సర్కార్ తీరా ఆ ప్రాంతంలో చేపలు పట్టే హక్కులను సైతం 1976లో వదులుకుందని జైశంకర్ నిందిస్తున్నారు. గత ప్రధానులు ఈ అంశంపై ఉదాసీనంగా ఉన్నా, భారత – శ్రీలంక సముద్రజలాల సరిహద్దు చట్టం అమలు, భారతీయ జాలర్ల హక్కులపై తమ సర్కార్ శ్రీలంకతో చర్చలు జరుపుతుందని ఆయన చెబుతున్నారు. గమ్మత్తేమిటంటే, కేంద్రంలో అధికారంలో ఉన్న కమలనాథులు గత పదేళ్ళుగా ఆ పని ఎందుకు చేయలేదో తెలీదు. అలాగే, ఆ ద్వీపాన్ని తిరిగి స్వాధీనం చేసుకొనే పనిలో మోదీ సర్కార్ ఉన్నట్టు తమిళనాడు బీజేపీ చెబుతోంది కానీ, అసలు ఇప్పటి దాకా ఆ అంశంపై మోదీ సర్కార్ నుంచి అధికా రిక సమాచారమే లేదని శ్రీలంక మంత్రి ఒకరు తేల్చేశారు. మరి, కచ్చతీవు అంశాన్ని బీజేపీ ఉన్న ట్టుండి ఎందుకు లేవదీసినట్టు? లోక్‌సభ ఎన్నికల తొలి దశలో భాగంగా ఈ నెల 19న తమిళనాట పోలింగ్ జరగనుంది. ప్రాంతీయ, భాషాభిమానాలు మెండుగా ఉండే తమిళనాట చొచ్చుకుపోవడా నికి తంటాలు పడుతున్న బీజేపీ దీన్ని ఓ అస్త్రంగా భావించింది. కేంద్రంలోని కాంగ్రెస్ సర్కార్ ఆ ద్వీపాన్ని ఇచ్చేస్తుంటే, అడ్డుకోని కరుణానిధి సారథ్యంలోని డీఎంకె సర్కార్‌దీ తప్పుందని బీజేపీ నిందిస్తోంది. తమిళ ఓటర్లలో సెంటిమెంట్ రగిల్చి లబ్ధి పొందడమే దాని అజెండాగా కనిపిస్తోంది. నిజానికి, ఎవరు సలహా ఇచ్చారో కానీ ఆ దీవిని శ్రీలంకకు ఇచ్చేశాం. దీవి అప్పగింత విషయం అంతర్జాతీయ వ్యవహారం గనక అప్పట్లో కేంద్రం తమిళ సర్కార్‌కు సమాచారమిచ్చి ఉంటుందే తప్ప, సరేనన్న అనుమతి తీసుకొని ఉంటుందనుకోలేం. స్థానిక అనివార్యతల రీత్యా అప్పటి కరుణానిధి సర్కార్ నుంచి ఇప్పటి స్టాలిన్ సర్కార్ దాకా డీఎంకె ప్రభుత్వాలు శ్రీలంకతో ఒప్పందాన్ని నిరసిస్తూనే వచ్చాయి. చేపల వేటకు వెళ్ళే తమిళ జాలర్లు పదే పదే లంకేయుల చేతిలో అరెస్టవుతున్నారని చెబుతూనే ఉన్నాయి. ఆ మధ్య భారత – శ్రీలంక ప్రధానుల భేటీ ముందూ స్టాలిన్ ఈ సంగతి మోదీ దృష్టికి తెచ్చారు. అవేవీ పట్టించుకోని బీజేపీ ఎన్నికల ముందు ఈ అంశం పట్టుకోవడమే విడ్డూరం. ద్వైపాక్షిక బంధాలపై ప్రభావం చూపే సున్నితమైన అంశాన్ని ఎన్నికల లబ్ధి కోసం తలకెత్తుకోవడం ప్రమాదకరం. నేపాల్ లాంటి పొరుగుదేశాలతోనూ అపరిష్కృత ప్రాదేశిక వివాదాలున్న భారత్ గతాన్ని తవ్వితే తలనొప్పులే. శ్రీలంకలో జాతుల యుద్ధం ముగిశాక వాణిజ్యం, ఇంధన, రవాణా రంగాల్లో ఇరు దేశాలూ ముందుకు సాగుతున్నాయి. పాత చరిత్రను ఆశ్రయిస్తే కొత్త దౌత్య యత్నాలకు చిక్కులు తప్పవు. హిందూ మహాసముద్రంలో వ్యూహాత్మక ప్రాంతంలో లంగరేయడానికి చైనా సిద్ధంగా ఉన్నవేళ కచ్చతీవు వివాదం అభిలషణీయం కానే కాదు. అయినా, మనమే వదులుకున్న ఈ దక్షిణాగ్ర ద్వీపంపై ఇంత ప్రేమ ప్రదర్శిస్తున్న పాలకులు ఉత్తరాన వేలాది చదరపు కిలోమీటర్లు చైనా ఆక్రమించుకున్నట్టు వార్తలున్నా ఉలకరేం? పలకరేం? -
విన్నింగ్ షాట్ ధోనిదైతే ఆ కిక్కే వేరప్పా.!
సాక్షి, హైదరాబాద్ : క్రికెట్లో విన్నింగ్ షాట్ అంటేనే అభిమానులకు ప్రత్యేకం. ఇక ఆ షాట్ ధోనిదైతే మరింత ఆనందం. 2011 ప్రపంచకప్ ఫైనల్ విన్నింగ్ షాట్ అయితే ప్రతి క్రికెట్ అభిమాని మదిలో నిలిచిపోయింది. ఇప్పటికే ఎన్నో మ్యాచ్‌ల్లో విన్నింగ్ షాట్లతో భారత్‌ను గెలిపించిన ధోని తాజా భారత్-శ్రీలంక మధ్య జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో మరోసారి విన్నింగ్ షాట్‌తో మెరిసాడు. ఈ వీడియోను బీసీసీఐ ట్వీట్ చేయగా తెగ వైరల్ అయింది. పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే 31 వేలకు పైగా వ్యూస్, ఏడువేల లైక్‌లు వచ్చాయి. ఈ మ్యాచ్ చివర్లో కొంత ఉత్కంఠ రేపినా ధోని,కార్తీక్‌లు భారత్ విజయాన్ని సులువు చేశారు. చివరి రెండు ఓవర్లో భారత్ విజయానికి 15 పరుగులు రావల్సి ఉండగా.. ఈ ఇద్దరు బాల్ టు బాల్ సింగిల్స్ తీశారు. కార్తీక్ సిక్స్ కొట్టడంతో చివరి ఓవర్లో 3 పరుగులు అవసరమయ్యాయి. స్ట్రైకింగ్‌లో ఉన్న ధోని తొలి బంతికి రెండు పరుగులు రాబట్టాడు. రెండో బంతిని బౌండరీకి తరలించి విన్నింగ్ షాట్‌తో మ్యాచ్‌ను ముగించాడు. దీంతో నాలుగు బంతులు మిగిలి ఉండగానే విజయం భారత్ వశమైంది. ఈ గెలుపుతో భారత్ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. విన్నింగ్ షాట్ ధోనిదైతే ఆ కిక్కే వేరప్పా.! -
కెప్టెన్ అవకాశం మళ్లీ ఎప్పుడొస్తుందో..!
ఇండోర్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి విశ్రాంతితో తాత్కలిక కెప్టెన్‌గా బాధ్యతను నిర్వర్తిస్తున్న రోహిత్ శర్మ.. ఆదివారం జరిగే చివరి టీ20తో తన బాధ్యత ముగింపు చెప్పనున్నాడు. ఈ నేపథ్యంలో ‘కెప్టెన్‌గా అవకాశం మళ్లీ ఎప్పుడొస్తుందో తెలియదు. కాబట్టి ప్రతి క్షణాన్ని మైదానంలో గడుపూతూ.. ఆస్వాదిస్తున్నానని’ రోహిత్ వ్యాఖ్యానించాడు. ‘తొలి సారి కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తుండటంతో కొంతమేర ఒత్తిడి ఉంది. ఇది ముంబై మ్యాచ్‌లో కూడా ఉంటుంది. కెప్టెన్‌గా అవకాశం మళ్లెప్పుడొస్తుందో తెలియదు.కాబట్టి మైదానంలో గడిపే ప్రతిక్షణము నాకు ముఖ్యమే. ధర్మశాల మ్యాచ్‌లో దారుణ ఓటమి తీవ్ర ఒత్తిడిని కలిగించింది. జట్టు గురించి పదే పదే ఆలోచించా. కెప్టెన్సీ చేయడం చాలా కష్టం. ఎందుకంటే మేం 140 కోట్ల ప్రజలకు ప్రాతినిథ్యం వహిస్తున్నాం. ఇది మరింత ఒత్తిడిని పెంచుతోంది. అని’ రోహిత్ పేర్కొన్నాడు. తన బ్యాటింగ్‌పై స్పందిస్తూ.. ‘నా దగ్గర పెద్ద శక్తి ఏం లేదు. మాములుగానే బ్యాటింగ్ చేశాను. నేను నా టైమింగ్ నమ్ముకుంటాను. నా బలాలు బలహీనతలెంటో నాకు తెలుసు. ఒక వైపు కాకుండా మైదానమంతా ఆడుతా. దీంతో ప్రత్యర్థులు ఫీల్డింగ్ పెట్టుకోవడంలో ఇబ్బంది పడుతారు. అన్నిఫార్మట్లలో ఇలానే ఆడుతా. ఎప్పుడు సెంచరీ, డబుల్ సెంచరీల గురించి చూడను. సిక్సర్ల కొట్టడం కన్నా ఫీల్డర్ల మధ్యలోంచే బంతిని బౌండరీకి తరలించడం సంతోషాన్నిస్తుందని’ రోహిత్ చెప్పుకొచ్చాడు. రోహిత్ కెప్టెన్సీలో శ్రీలంకపై వన్డే, టీ20 సిరీస్‌లను భారత్ గెలుచుకున్న విషయం తెలిసిందే. ముంబై వాంఖడే స్టేడియంలో రాత్రి 7 గంటలకు భారత్-శ్రీలంక చివరి టీ20 జరగనుంది. -
తొలి టీ20లో భారత్ ఘనవిజయం
కటక్: శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చహల్ (4-23) మాయాజాలానికి శ్రీలంక బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో లంకపై భారత్ 93 పరుగుల తేడాతో భారీ విజయం సొంతం చేసుకుంది. ఈ గెలుపుతో 3 టీ20ల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యం సాధించింది. 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక బ్యాట్స్‌మెన్‌లో ఉపుల్ తరంగ 23( 16 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సులు), కుశాల్ పెరీరా(19), డిక్వెల్లా(13), చమీరా(12)లు మినహా మిగతా బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్‌కే పరిమితమవ్వడంతో శ్రీలంక 87 పరుగులకే కుప్పకూలింది. భారత్ బౌలర్లలో చాహల్ (4), పాండ్యా(3), కుల్దీప్ యాదవ్(2) వికెట్లు తీయగా.. ఉనద్కత్ ఒక వికెట్ తీశాడు. రాహుల్ హాఫ్ సెంచరీ.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఓపెనర్ రోహిత్(17) నిరాశపర్చగా.. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ 61 (48 బంతుల్లో 7 ఫోర్లు, 1సిక్సు) అర్ధ సెంచరీతో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. మరో యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ 24(20 బంతులు, 3 ఫోర్లు).. చివర్లో ధోని 39(22 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సు), మనీష్ పాండే 32(18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులు) రాణించడంతో భారత్ మూడు వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
తొలి టీ20: శ్రీలంక లక్ష్యం 181
కటక్: భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ అర్ధశతకంతో మెరిశాడు. దీనికి తోడు యువ ఆటగాడు మనీష్ పాండే 32(18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులు), ధోని 39(22 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సు) తోడవ్వడంతో భారత్ 181 పరుగుల లక్ష్యాన్ని లంకకు నిర్ధేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. మాథ్యూస్ బౌలింగ్‌లో క్యాచ్ అవుటై ఓపెనర్ రోహిత్(17) తీవ్రంగా నిరాశపరిచాడు. క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్‌తో మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. చాలా రోజుల తర్వాత అవకాశం దక్కించుకున్న రాహుల్ వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. 34 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సుతో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జట్టు స్కోర్ 101 పరుగుల వద్ద ప్రదీప్ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్(24) కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మరికాసేపటికే రాహుల్ 61 (48 బంతుల్లో 7 ఫోర్లు, 1సిక్సు) సైతం అవుటవ్వడంతో భారత్ స్కోర్ వేగం నెమ్మదించింది. ఈ పరిస్థితిల్లో ధోని, యువ ఆటగాడు మనీష్ పాండేలు వేగంగా ఆడే ప్రయత్నం చేశారు..కానీ లంక అద్బుత ఫీల్డింగ్‌తో పదే పదే బౌండరీలు ఆపడంతో భారత్ స్కోర్ నెమ్మదించింది. చివర్లో ప్రదీప్ వేసిన 19 ఓవర్ భారత్‌కు కలిసొచ్చింది. రెండు వైడ్లు ఒక నోబాల్ వేసి ప్రదీప్ మొత్తం 21 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో భారత్ 180 పరుగులు చేయగలిగింది. లంక బౌలర్లలో తిసారా పెరీరా, మాథ్యూస్, నువాన్ ప్రదీప్లకు తలో వికెట్ దక్కింది. -
లంకతో టీ20: సిరాజ్‌కు మళ్లీ నిరాశే.!
కటక్: భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి 20 మ్యాచ్‌లో హైదారాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు మళ్లీ నిరాశే ఎదురైంది. ఈ ఏడాదే అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేసిన ఈ హైదరాబాదీ తాజా సిరీస్‌కు ఎంపికైనా రిజర్వ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లంక ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇరు జట్లలో మార్పులు చోటు చేసుకున్నాయి. టీ20లకు విశ్రాంతి తీసుకున్న శిఖర్ ధావన్, భువనేశ్వర్‌ల స్థానాల్లో కేఎల్ రాహుల్, జయదేవ్ ఉనద్కత్‌లు జట్టులోకి వచ్చారు. శ్రీలంక జట్టులో నాలుగు మార్పులు చేసింది. ఈ మ్యాచ్‌తో లంక లెఫ్టార్మ్ పేసర్ విశ్వా ఫెర్నాండో అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేస్తుండగా.. చమీరా, శనక, కుశాల్‌లను తుది జట్టులోకి తీసుకున్నారు. ఇక ఈ పొట్టి సిరీసైనా గెలిచి సగర్వంగా స్వదేశానికి వెళ్లాలని లంకేయులు భావిస్తుండాగా.. తమ జైత్రయాత్రను కొనసాగించాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేయాలనుకున్న మరో యువ పేసర్ బసీల్ థంపీకి సైతం నిరాశే ఎదురైంది. తుది జట్లు: భారత్: రోహిత్ (కెప్టెన్), రాహుల్, అయ్యర్, దినేశ్ కార్తీక్, పాండే, ధోని, పాండ్యా, కుల్దీప్, బుమ్రా, చహల్, ఉనద్కత్ శ్రీలంక: తిసారా పెరీరా (కెప్టెన్), తరంగ, కుషాల్ పెరీరా, మాథ్యూస్, డిక్వెలా, గుణరత్నే, షనక, ధనంజయ, చమీరా, ఫెర్నాండో, ప్రదీప్. -
సిరీస్ మనదే..
-
లంకను కొట్టేసి...సిరీస్ పట్టేసి...
విశాఖ వేదిక భారత్‌కు మళ్లీ విజయ వీచిక అయ్యింది. ముచ్చటగా మూడోసారి ఈ మైదానంలో సిరీస్ నిర్ణయాత్మక వన్డేలో టీమిండియా సింహనాదం చేసింది. తొలుత బౌలర్లు... ఆ తర్వాత బ్యాట్స్‌మెన్ విజృంభణతో లంకను అలవోకగా కొట్టేసి భారత్ మరో సిరీస్‌ను పట్టేసింది. 2007లో ఇక్కడే లంకపై చివరి వన్డేలో నెగ్గి 2–1తో... గతేడాది న్యూజిలాండ్‌ను ఐదో వన్డేలో ఓడించి 3–2తో భారత్ సిరీస్‌లు గెలిచింది. సాక్షి, విశాఖపట్నం: 160/2... 27 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక స్కోర్ ఇది. 215 ఆలౌట్... ఇది కూడా లంక స్కోరే! కానీ 45వ ఓవర్ ఇంకా ముగియకముందే ఇన్నింగ్స్ ముగిసింది. ప్రత్యర్థి 300 స్కోరు ఖాయం... మ్యాచ్ ఇక కష్టమేమో అనుకున్న దశలో మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ (3/42), యజువేంద్ర చహల్ (3/46) మాయాజాలం చేశారు. క్రీజులో పాతుకుపోయిన బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్‌కు చేర్చారు. కొత్త బ్యాట్స్‌మెన్‌ను నిలదొక్కుకోకుండా చేశారు. తర్వాత శిఖర్ ధావన్ (85 బంతుల్లో 100 నాటౌట్; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ శతకంతో... శ్రేయస్ అయ్యర్ (63 బంతుల్లో 65; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. ఫలితంగా ఇక్కడి వై.ఎస్.రాజశేఖర రెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో ఆదివారం జరిగిన మూడో వన్డేలో రోహిత్ శర్మ బృందం 8 వికెట్ల తేడాతో జయభేరి మోగించి మూడు వన్డేల సిరీస్‌ను 2–1తో కైవసం చేసుకుంది. భారత్‌కిది వరుసగా ఎనిమిదో ద్వైపాక్షిక వన్డే సిరీస్ విజయం కావడం విశేషం. కుల్దీప్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’... శిఖర్ ధావన్‌కు ‘మ్యాన్ ఆఫ్ సిరీస్’ అవార్డులు లభించాయి. మొదట శ్రీలంక 44.5 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌటైంది. తరంగ (82 బంతుల్లో 95; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా... సమరవిక్రమ (42) రాణించాడు. తర్వాత భారత్ 32.1 ఓవర్లలో 2 వికెట్లకు 219 పరుగులు చేసి గెలిచింది. మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్ కటక్‌లో 20న మొదలవుతుంది. టాస్ నెగ్గిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకోగా... శ్రీలంక ఆరంభంలోనే గుణతిలక (13) వికెట్‌ను కోల్పోయింది. తర్వాత తరంగ, సమరవిక్రమతో కలిసి వేగంగా పరుగులు జతచేశాడు. ఇద్దరు రెండో వికెట్‌కు 121 పరుగులు జోడించారు. ఇక భారీ స్కోరు ఖాయమనుకుంటున్న దశలో 136 స్కోరు వద్ద సమరవిక్రమ, 160 పరుగుల వద్ద తరంగ అవుట్ కావడంతో లంక దిశ మారింది. భారత స్పిన్నర్ల ధాటికి అనూహ్యంగా 55 పరుగుల వ్యవధిలో చివరి 8 వికెట్లను కోల్పోయి ఆలౌటైంది. కుల్దీప్, చహల్ మూడేసి వికెట్లు తీయగా... పాండ్యాకు రెండు, బుమ్రా, భువనేశ్వర్‌లకు ఒక్కో వికెట్ దక్కింది. తర్వాత 216 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్... ఆదిలోనే కెప్టెన్ రోహిత్ (7) వికెట్ కోల్పోయి తడబడింది. ఈ దశలో ధావన్, శ్రేయస్ అయ్యర్ లంక బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. 44 బంతుల్లో శ్రేయస్ అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. రెండో వికెట్‌కు ధావన్‌తో 135 పరుగులు జోడించాక శ్రేయస్ అవుటయ్యాడు. అనంతరం దినేశ్ కార్తీక్ (26 నాటౌట్; 3 ఫోర్లు) ధావన్‌కు సహకరించాడు. 84 బంతుల్లో (13 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ పూర్తి చేసిన ధావన్ మూడో వికెట్‌కు కార్తీక్‌తో 70 పరుగులు జోడించి 107 బంతులు మిగిలి ఉండగానే భారత్ విజయాన్ని ఖాయం చేశాడు. స్కోరు వివరాలు శ్రీలంక ఇన్నింగ్స్: గుణతిలక (సి) రోహిత్ శర్మ (బి) బుమ్రా 13; తరంగ (స్టంప్డ్) ధోని (బి) కుల్దీప్ 95; సమరవిక్రమ (సి) ధావన్ (బి) చహల్ 42; మాథ్యూస్ (బి) చహల్ 17; డిక్వెలా (సి) శ్రేయస్ (బి) కుల్దీప్ 8; గుణరత్నే (సి) ధోని (బి) భువనేశ్వర్ 17; తిసారా పెరీరా ఎల్బీడబ్ల్యూ (బి) చహల్ 6; సచిత్ (సి) చహల్ (బి) పాండ్యా 7; ధనంజయ (బి) కుల్దీప్ 1; లక్మల్ ఎల్బీడబ్ల్యూ (బి) పాండ్యా 1; ప్రదీప్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (44.5 ఓవర్లలో ఆలౌట్) 215. వికెట్ల పతనం: 1–15, 2–136, 3–160, 4–168, 5–189, 6–197, 7–208, 8–210, 9–211, 10–215. బౌలింగ్: భువనేశ్వర్ 6.5–0– 35–1, బుమ్రా 8–1–39–1, పాండ్యా 10–1–49–2, కుల్దీప్ 10–0– 42–3, చహల్ 10–3–46–3. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (బి) ధనంజయ 7; ధావన్ నాటౌట్ 100; శ్రేయస్ అయ్యర్ (సి) లక్మల్ (బి) పెరీరా 65; దినేశ్ కార్తీక్ నాటౌట్ 26; ఎక్స్‌ట్రాలు 21; మొత్తం (32.1 ఓవర్లలో 2 వికెట్లకు) 219. వికెట్ల పతనం: 1–14, 2–149. బౌలింగ్: లక్మల్ 5–2–20–0, ధనంజయ 7.1–0–53–1, మాథ్యూస్ 3–0–30–0, సచిత్ 4–0–33–0, ఫెర్నాండో 3–0–10–0, పెరీరా 5–0–25–1, గుణరత్నే 4–0–30–0, గుణతిలక 1–0–12–0. నాడు డకౌట్... నేడు నాటౌట్ ఏడేళ్ల క్రితం (2010లో) ధావన్ ఉక్కు నగరంలోనే వన్డే క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఆ మ్యాచ్‌లో అతను డకౌట్ అయ్యాడు. ఇప్పుడు లంకపై నిర్ణాయక మ్యాచ్‌లో శివమెత్తాడు. కీలకమైన ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ జట్టు స్కోరు 14 పరుగులకే నిష్క్రమించగా ధావన్ ఇన్నింగ్స్ భారాన్ని కడదాకా మోశాడు. కుర్రాడు శ్రేయస్‌తో కలిసి విలువైన భాగస్వామ్యాన్ని జోడించాడు. దినేశ్ కార్తీక్‌తో కలిసి అజేయంగా జట్టును గెలిపించాడు. ధోని కన్ను... మూడో కన్ను...! తనకెంతో కలిసొచ్చిన వైజాగ్ మైదానంలో ఈసారి ధోని రెండు వికెట్లు తీశాడు. ఇదేంటనే ఆశ్చర్యం వద్దు. ఊపు మీదున్న తరంగ సెంచరీకి చేరువైన సమయంలో కుల్దీప్ ఇన్నింగ్స్ 28వ ఓవర్ వేశాడు. తొలి బంతి తరంగను దాటేసి కీపర్ ధోని చేతుల్లోకి వెళ్లింది. అతను వాయువేగంతో వికెట్లను గిరాటేసి, అంపైర్‌కు అప్పీల్ చేశాడు. ఇదంతా లిప్తపాటు కాలంలోనే జరిగింది. సహచరులంతా అప్పీల్ చేసి ఊరుకుంటే ధోని మాత్రం పట్టుబట్టాడు. దీంతో ఫీల్డ్ అంపైర్... థర్డ్ అంపైర్‌ను సంప్రదించడం... తరంగ అవుటై వెనుదిరగడం జరిగాయి. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన డిక్వెలా రెండు ఫోర్లు కొట్టాడు. బంతి దిశను మార్చేయమని కుల్దీప్కు చెప్పి తనకు సమీప దూరంలో శ్రేయస్ అయ్యర్‌ను పురమాయించాడు. ఈ ఎత్తుగడ ఫలించింది. శ్రేయస్‌కు క్యాచ్ ఇచ్చి డిక్వెలా నిష్క్రమించాడు. బౌలింగ్ కుల్దీప్దైనా... వ్యూహం ధోనిది. అతను పాలుపంచుకున్న ఈ వికెట్లు లంక దశను మార్చాయి. భారత్‌కు ఊతమిచ్చాయి. భారత్ 8 సిరీస్ విజయాలు ప్రత్యర్థి వేదిక ఏడాది వన్డేలు ఫలితం జింబాబ్వే జింబాబ్వే 2016 3 3–0 న్యూజిలాండ్ భారత్ 2016 5 3–2 ఇంగ్లండ్ భారత్ 2017 3 2–1 వెస్టిండీస్ వెస్టిండీస్ 2017 5 3–1 శ్రీలంక శ్రీలంక 2017 5 5–0 ఆస్ట్రేలియా భారత్ 2017 5 4–1 న్యూజిలాండ్ భారత్ 2017 3 2–1 శ్రీలంక భారత్ 2017 3 2–1 -
శిఖర్ ధావన్ మరో ఘనత
సాక్షి, విశాఖ: శ్రీలంకతో జరుగుతున్న నిర్ణయాత్మక మ్యాచ్‌లో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అత్యంత వేగంగా 4 వేల పరుగులు పూర్తి చేసిన రెండో భారత బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందాడు. అంతకు ముందు విరాట్ కోహ్లి 93 ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించగా ధావన్ 95 ఇన్నింగ్స్‌లో సాధించి మాజీ కెప్టెన్ గంగూలీ(105 ఇన్నింగ్స్‌ల)ని అధిగమించి ఈ రికార్డు సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ధావన్ 62 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద నాలుగు వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇక ఓవరాల్‌గా ఆరో బ్యాట్స్‌మన్‌గా రికార్డ్ నమోదు చేశాడు. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా ఆటగాడు ఆమ్లా (81 ఇన్నింగ్స్‌ల్లో) తొలి స్థానంలో ఉండగా రిచర్డ్స్(88), జోరూట్(91), విరాట్ కోహ్లి(93), వార్నర్(93)లు ముందు వరుసలో ఉన్నారు. -
భారత్ లక్ష్యం 216
-
భారత్ లక్ష్యం 216
సాక్షి, విశాఖ: శ్రీలంకతో జరుగుతున్న నిర్ణయాత్మక మ్యాచ్‌లో భారత బౌలర్లు విజృంభించడంతో లంక భారత్‌కు 216 పరుగుల స్పల్ప లక్ష్యాన్ని నిర్ధేశించింది. లంక బ్యాట్స్మన్లలో తరంగ 95 ( 82 బంతులు, 12 ఫోర్లు, 3 సిక్సులు) సదీర సమరవిక్రమా 42(57 బంతుల్లో 5 ఫోర్లు) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ చేతులెత్తయడంతో లంక 44.5 ఓవర్లకు 215 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. ఇక భారత బౌలర్లలో చహల్, కుల్దీప్లు మూడేసి వికెట్లు తీయగా పాండ్యా రెండు, బుమ్రా, భువనేశ్వర్‌లు ఒక వికెట్ తీశారు. లంక ఆరంభం అదుర్స్ టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంక ఓపెనర్ గుణతిలక మరో సారి నిరాశపరిచాడు. అయినా మరో ఓపెనర్ తరంగ, సమరవిక్రమాతో కలిసి మంచి శుభారంభాన్ని అందించాడు. ఈ ఇద్దరు సమన్వయంతో ఆడుతూ వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీలకు తరలించారు. పాండ్యా వేసిన 8 ఓవర్లో తరంగ ఏకంగా 5 ఫోర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో పవర్ ప్లే ముగిసే సరికి లంక వికెట్ నష్టపోయి 68 పరుగుల చేసింది. అనంతరం మరింత స్పీడ్ పెంచిన ఈ జోడి స్కోరు బోర్డును వేగంగా పరుగెత్తించింది. ఈ దశలోనే తరంగ 36 బంతుల్లో 10 ఫోర్లతో కెరీర్లో 36వ అర్ధ సెంచరీ సాధించాడు. జట్టు స్కోర్ 136 పరుగుల వద్ద సదీర చహల్ బౌలింగ్‌లో అనవసర షాట్‌కు ప్రయత్నించి ధావన్‌కు చిక్కాడు. దీంతో రెండో వికెట్‌కు నమోదైన 121 పరుగుల భాగ స్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన మాథ్యూస్‌తో తరంగా ఏమాత్రం వేగం తగ్గించుకుండా పరుగులు చేశాడు. మలుపు తిప్పిన ధోని స్టంప్ అవుట్.. భారత చైనామన్ కుల్దీప్ యాదవ్ వేసిన 27 ఓవర్ తొలి బంతిని ఉపుల్ తరంగ క్రీజు దాటి ఆడబోగా.. బంతిని అందుకున్న ధోని అంతే వేగంతో వికెట్లను కొట్టేశాడు. ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్‌ను రివ్యూ కోరగా రిప్లయ్‌లో తరంగ సరిగ్గా తన లెగ్ ఆన్ది లైన్‌పై పెట్టె సమయంలో ధోని వికెట్లను గీరేశాడు. థర్డ్ అంపైర్ అవుట్‌గా ప్రకటించడంతో తరంగ సెంచరీ చేజారింది. ఈ వికెట్ అనంతరం శ్రీలంక పేక ముక్కల్లా కుప్పకూలింది. ఇదే ఓవర్లో డిక్వెల్లా(8) అవుటయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన ఏ బ్యాట్స్‌మన్ నిలదొక్కుకోలేకపోయారు. మథ్యూస్(17), పెరీరా(6), పతిరణ(7) అఖిల ధనుంజయ(1), లక్మల్(1)లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. చివర్లో గుణరత్నే(17) కూడా అవుటవ్వడంతో శ్రీలంక ఇన్నింగ్స్ 44.5 ఓవర్లకే ముగిసింది. -
ఆరో వికెట్ కోల్పోయిన శ్రీలంక
సాక్షి, విశాఖ: భారత్‌తో జరుగుతున్న నిర్ణయాత్మక మ్యాచ్‌లో శ్రీలంక ఆరో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోర్ 197 పరుగుల వద్ద తిసారా పెరీరా(6) చాహల్ బౌలింగ్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 136 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయి పటిష్ట స్థితిలో ఉన్న శ్రీలంక కథ ఒక్కసారిగా అడ్డం తిరిగింది. ఓపెనర్ ఉపుల్ తరంగ (95) వికెట్ కోల్పోవడంతో వరుస వికెట్లను చేజార్చుకుంది. రెండో వన్డే సెంచరీ సాధించిన మాథ్యూస్ సైతం ఈ మ్యాచ్‌లో నిరాశ పరిచాడు. దీంతో శ్రీలంక 61 పరుగుల వ్యవధిలోనే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఇక భారత బౌలర్లలో యజువేంద్ర చాహల్ 3 వికెట్లతో చెలరేగగా కుల్దీప్ రెండు వికెట్లు, బుమ్రా ఓ వికెట్ పడగొట్టారు. ప్రస్తుతం శ్రీలంక స్కోర్ 204/6, క్రీజులో గుణరత్నే(10) పతిరణ(6)లున్నారు. -
ధోని మార్క్ కీపింగ్.. తరంగ సెంచరీ మిస్
సాక్షి, విశాఖ: శ్రీలంకతో జరుగుతున్న నిర్ణయాత్మక మ్యాచ్‌లో ధోని మరోసారి తన మార్క్ కీపింగ్‌ను ప్రదర్శించాడు. దీంతో శ్రీలంక ఓపెనర్ ఉపుల్ తరంగ 95( 82 బంతులు, 12 ఫోర్లు, 3 సిక్సులు) సెంచరీ చేజార్చుకున్నాడు. భారత చైనామన్ కుల్దీప్ యాదవ్ వేసిన 27 ఓవర్ తొలి బంతిని ఉపుల్ తరంగ క్రీజు దాటి ఆడబోగా.. బంతిని అందుకున్న ధోని అంతే వేగంతో వికెట్లను కొట్టేశాడు. ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్‌ను రివ్యూ కోరగా రిప్లయ్‌లో తరంగ సరిగ్గా తన లెగ్ ఆన్ది లైన్‌పై పెట్టె సమయంలో ధోని వికెట్లను గీరేశాడు. దీంతో థర్డ్ అంపైర్ అవుట్‌గా ప్రకటించాడు. నిజానికి ఇది అందరూ నాటౌట్ అనుకున్నా థర్డ్ అంపైర్ వికెట్‌గా ప్రకటించడంతో మైదానంలో అభిమానులు, ఆటగాళ్లు కేరింతలతో ఆనందం వ్యక్తం చేశారు. ధోని వ్యూహంతో డిక్వెల్లా అవుట్.. ఇక ఇదే ఓవర్ ఐదో బంతికి ధోని వ్యూహంతో కుల్దీప్ డిక్వెల్లాను అవుట్ చేశాడు. బంతి వేసే ముందు కుల్దీప్ దగ్గరకు వచ్చిన ధోని స్లిప్‌లో అయ్యర్‌ను ఫీల్డింగ్ పెట్టుకోమని సూచించాడు. ఈ బంతి డిక్వెల్లా బ్యాట్‌ను తగిలి నేరుగా అయ్యర్ చేతిలో పడింది. ఈ వికెట్‌తో ధోని వ్యూహం ఫలించింది. దీంతో శ్రీలంక నాలుగు వికెట్లు కోల్పోయింది. ధోని ఇప్పటికే వన్డేల్లో అత్యధిక స్టంప్అవుట్లు సాధించిన కీపర్‌గా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. -
ధోని మార్క్ కీపింగ్.. తరంగ సెంచరీ మిస్
-
పాండ్యా బౌలింగ్‌లో ఫోర్ల వర్షం.!
సాక్షి, విశాఖ: భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న నిర్ణయాత్మక మ్యాచ్‌లో లంక ఓపెనర్ ఉపుల్ తరంగ అర్థ సెంచరీ సాధించాడు. టీమిండియా ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా వేసిన 8 ఓవర్లో వరుసగా 5 ఫోర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో శ్రీలంక 9 ఓవర్లలోపే 65 పరుగులు చేసింది. ఈ ఓవర్‌కు ముందు లంక స్కోర్ 45/1 ఉండగా.. అనంతరం తరంగ 20 పరుగుల పిండుకోవడంతో 65 పరుగులకు చేరింది. ఈ దశలోనే తరంగ 36 బంతుల్లో 10 ఫోర్లతో కెరీర్లో 36వ అర్ధ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం 12 ఓవర్లకు లంక స్కోర్ 73/1. క్రీజులో తరంగ(50)తొ పాటు సమరవిక్రమా(10)లున్నారు. -
పాండ్యా బౌలింగ్‌లో ఒకే ఓవర్లో ఐదు ఫోర్లు
-
ఈ రోజు ఇరు జట్లకు ప్రత్యేకం
సాక్షి, హైదరాబాద్: సరిగ్గా ఏడేళ్ల క్రితం ఇదే రోజు (డిసెంబర్ 15) వన్డే క్రికెట్ చరిత్రలోనే భారత్ - శ్రీలంక జట్లకు ప్రత్యేకం. రాజ్‌కోట్ వేదికగా నరాలు తెగేంత ఉత్కంఠ మధ్య సాగిన ఈ మ్యాచ్ సగటు భారత అభిమానికి గుర్తుండే ఉంటుంది. వన్డే క్రికెట్ చరిత్రలోనే ఇరు జట్లు 400కు పైగా పరుగులు చేయడం రెండోసారి మాత్రమే. అంతేకాకుండా క్రికెట్ చరిత్రలోనే ఇరు జట్ల టాప్-3 బ్యాట్స్మెన్లు 50పైగా పరుగులు చేయడం తొలి సారి. అప్పటికి వన్డేల్లో భారత్ కూడా అత్యధిక స్కోర్ ఇదే కావడం విశేషం. (తర్వాత 2011లో వెస్టిండీస్‌పై భారత్ 418 పరుగులు చేసింది.) ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల బ్యాట్స్‌మెన్ పరుగుల తుఫానునే సృష్టించారు. నువ్వా-నేనా అన్నట్లు చివరి వరకు సాగిన ఈ సమరంలో నెహ్రా అద్భుత బౌలింగ్‌తో విజయం భారత్‌నే వరించింది. మ్యాచ్ భారత్ గెలిచినా ఇరు జట్లకు ఈ మ్యాచ్ ఓ ప్రత్యేకంగా నిలిచిపోయింది. టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకోగా భారత్ బ్యాటింగ్‌కు దిగింది. డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(146) విరోచిత ఇన్నింగ్స్‌కు మాస్టర్ బ్లాస్టర్ సచిన్(63), మహేంద్ర సింగ్ ధోని(72)లు తోడవ్వడంతో భారత్ అలవోకగా శ్రీలంకకు 414 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఈ భారీ లక్ష్యానికి ఎంత మాత్రం భయపడని ఆతిథ్య జట్టు దిల్షాన్(160) భారీ ఇన్నింగ్స్‌కు సంగక్కర(90), ఉపుల్ తరంగ (67)లు చెలరేగడంతో 411 పరుగులు చేసి 3 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. ధోని మార్క్ కెప్టెన్సీ.. చివరి ఓవర్లో లంక విజయానికి 11 పరుగుల కావాలి.. క్రీజులో ఆలౌరౌండర్ బ్యాట్స్‌మన్ మాథ్యూస్ ఉన్నాడు. అప్పటి వరకు చాలా పరుగులిచ్చిన నెహ్రాకు బౌలింగ్ ఇచ్చాడు ధోని. ఇక శ్రీలంక విజయం సులవనుకున్నారు అందరూ.. కానీ ఇక్కడ ధోని మార్క్ కెప్టెన్సీ లంక విజయాన్ని అడ్డుకుంది. మాథ్యూస్ అవుట్ చేయడంలో సఫలమైన నెహ్రా ఒక్క బౌండరీ ఇవ్వకుండా కేవలం ఏడు పరుగులే ఇచ్చాడు. ఆసాంతం ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ పైచేయి సాధించడం భారత అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఆ మధుర క్షణం ప్రతి అభిమాని గుండెల్లో నిలిచిపోయింది. -
ఖాతా తెరిచిన వాషింగ్టన్ సుంధర్
మొహాలీ: భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో వన్డేల్లో శ్రీలంక మూడో వికెట్ కోల్పోయింది. ఈ మ్యాచ్‌తోనే అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన 18 ఏళ్ల కుర్రాడు వాషింగ్టన్ సుంధర్ తన ఖాతా తెరిచాడు. సుంధర్ వేసిన 15 ఓవర్ మూడో బంతికి తిరమన్నే(21) రివర్స్ స్వీప్ షాట్ ఆడబోయి క్లీన్‌బౌల్ట్ అయ్యాడు. దీంతో లంక 62 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇక అంతకు ముందు ఓపెనర్లు గుణతిలక(16), ఉపుల్ తరంగా(7)లను బుమ్రా, పాండ్యాలు పెవిలియన్‌కు పంపించారు. 17 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక స్కోరు 78/3 . -
లక్మల్‌పై కసితీర్చుకున్న రోహిత్.!
మొహాలీ: భారత్-శ్రీలంక మధ్య జరిగిన రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ శ్రీలంక బౌలర్ లక్మల్‌పై కసి తీర్చుకున్నాడు. తొలి వన్డేల్లో 4 వికెట్లతో భారత ఘోర పరాభావాన్ని శాసించిన లక్మల్‌కు ఈ మ్యాచ్‌లో రోహిత్ తన బ్యాట్‌తో బదులిచ్చాడు. ధర్మశాల మ్యాచ్‌లో లక్మల్ రోహిత్(2)ను పెవిలియన్‌కు పంపించిన విషయం తెలిసిందే. రోహిత్ ఆడిన వరుస 9 బంతుల్లో 7 సిక్సులు బాది రికార్డు నమోదు చేశాడు. రెండో వన్డేల్లో లక్మల్ వేసిన 43 ఓవర్లో రోహిత్ వరుస సిక్సులతో విరుచుకుపడ్డాడు. నాలుగు బంతుల్లో నాలుగు సిక్సులు బాది లక్మల్‌కు ముచ్చెమటలు పట్టించాడు. లక్మల్ వేసిన ఓ వైడ్‌ను కలుపుకొని ఈ ఓవర్లో భారత్‌కు 26 పరుగులు జమయ్యాయి. ఇక అనంతరం ప్రదీప్ బౌలింగ్‌లో మరో మూడు బంతులు ఎదుర్కొన్న రోహిత్ మరో రెండు సిక్సులు, పెరీరా బౌలింగ్‌లో మరో సిక్స్ బాదాడు. దీంతో రోహిత్ వరుస 9 బంతుల్లో 7 సిక్సులు బాదినట్లైంది. రోహిత్ ‘డబుల్’ రికార్డులు ఇప్పటికే రెండు డబుల్ సెంచరీలు సాధించిన రోహిత్.. తాజా డబుల్‌తో వన్డే చరిత్రలో మూడు డబుల్ సెంచరీలు బాదిన తొలి క్రికెటర్‌గా రికార్డు నమోదు చేశాడు. ఇక వన్డే చరిత్రలో మెత్తం 7 డబుల్ సెంచరీలు నమోదు కాగా రోహిత్‌వే 3 డబుల్ సెంచరీలు కావడం విశేషం. రోహిత్ తొలి డబుల్(209) సెంచరీ 2013లో ఆస్ట్రేలియాపై చిన్నస్వామి స్టేడియంలో నమోదు చేశాడు. ఇక ఇదే శ్రీలంకపై రెండో డబుల్ సెంచరీ(264)ను 2014లో ఈడెన్ గార్డెన్స్‌లో సాధించాడు. మిగతా నాలుగు డబుల్ సెంచరీలు సచిన్ టెండూల్కర్(200) , సెహ్వాగ్(219), క్రిస్‌గేల్ (215) మార్టిన్గప్టిల్ (237)ల పేరిట ఉన్నాయి. ♦ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో కెప్టెన్‌గా రికార్డు నమోదు చేశాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు సెహ్వాగ్(219) పేరిట ఉంది. 2011 డిసెంబర్ 8న ఇండోర్ వేదికగా వెస్టిండీస్‌పై సెహ్వాగ్ డబుల్ సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌కు సెహ్వాగ్ కెప్టెన్సీ వహించడంతో ఈ రికార్డు తన సొంతమైంది. ♦ శ్రీలంకపై అత్యధిక పరుగుల చేసిన తొలి కెప్టెన్‌గా గుర్తింపు పొందాడు. -
19 ఏళ్ల తర్వాత టీమిండియా..
భారత్-శ్రీలంక మధ్య మొహాలీలో జరుగుతున్న రెండో వన్డేలో భారత బ్యాట్స్‌మెన్ చేలరేగిపోయారు. టీమిండియా సారథి రోహిత్ శర్మ (208 నాటౌట్) డబుల్ సెంచరీతో దుమ్మురేపాడు. దీంతో శ్రీలంకకు 393 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించారు. భారత్ 50 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 392 పరుగులు చేసింది. తొలి వన్డేలో దారుణంగా విఫలమై చెత్త రికార్డును మూటగట్టుకున్న టీం ఇండియా మొహాలీలో భారీ లక్ష్యంతో లంకకు సవాల్ విసిరింది. మరో వైపు 115 బంతుల్లో రోహిత్ శర్మ 8 ఫోర్లు ఒక సిక్సుతో కెరీర్లో 16 వ సెంచరీ పూర్తిచేసుకోగా.. వన్డేల్లో మూడో డబుల్ సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. ఇదిలా ఉండగా టీమిండియా మొహాలీ వన్డేలో మరో రికార్డును సమం చేసింది. ఒకే క్యాలెండర్ ఇయర్లో ఎక్కువ వన్డే సెంచరీలు చేసిన రికార్డును భారత్ సమం చేసింది.1998లో సచిన్ చేసిన సెంచరీతో క్యాలెండర్ ఇయర్లో 18 వన్డే సెంచరీలను భారత్ నమోదు చేసింది. అయితే 2017 క్యాలెండర్ ఇయర్లో ఇప్పటి వరకు టీమిండియా 17 వన్డే సెంచరీలను చేసింది. తాజాగా మొహాలీలో జరుగుతున్న వన్డేలో రోహిత్ 115 బంతుల్లో సెంచరీ సాధించాడు. దీంతో 19 ఏళ్ల తర్వాత ఒకే క్యాలెండర్ ఇయర్లో టీమిండియా 18 వన్డే సెంచరీలు చేసి గత రికార్డును సమం చేసింది. -
రో’హిట్’ డబుల్ సెంచరీ
-
రోహిత్ డబుల్ సెంచరీ.. లంకకు భారీ లక్ష్యం
మొహాలీ: భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో వన్డేల్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డు డబుల్ సెంచరీతో కదం తొక్కాడు. దీంతో లంకకు 393 పరుగుల భారీ లక్ష్యం నిర్ధేశించారు. భారత్ 50 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 392 పరుగులు చేసింది. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ(208 నాటౌట్), ధావన్(68)లు మంచి శుభారంభాన్ని అందించారు. 10 ఓవర్లలోపు నెమ్మదిగా ఆడిన ఈ జోడి అనంతరం చెలరేగింది. ఈ దశలో ధావన్ కెరీర్లో 35వ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారు. జట్టు స్కోరు 115 పరుగుల వద్ద ధావన్ క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్‌తో రోహిత్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. తొలి మ్యాచ్‌లో దారుణంగా విఫలమై కెప్టెన్‌గా చెత్త రికార్డు మూటగట్టుకున్న రోహిత్ అంతకంతకు లంక బౌలర్లపై బదులు తీర్చుకున్నాడు. 110 బంతుల్లో రోహిత్ 8 ఫోర్లు ఒక సిక్సుతో కెరీర్లో 16వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం శ్రేయస్ అయ్యర్ 50 బంతుల్లో 5 ఫోర్లతో కెరీర్ తొలి అర్ధ సెంచరీ సాధించాడు. అనంతరం చెలరేగిన ఈ ఇద్దరు స్కోరు బోర్డును పరుగెత్తించారు. రోహిత్ డబుల్ సెంచరీ.. అరంగేట్ర మ్యాచ్ అనుభవంతో తొలుత ఆచితూచి ఆడిన అయ్యర్ హాఫ్ సెంచరీ అనంతరం తన ఐపీఎల్ అనుభవాన్ని ప్రదర్శించాడు. సిక్సర్లు, ఫోర్లతో విరుచుకపడుతూ లంక బౌలర్లను ఓ ఆట ఆడాడు. వేగంగా ఆడుతూ తన అసలైన సత్తా ఎంటో నిరూపించుకున్నాడు. మరోవైపు రోహిత్ కూడా సెంచరీ అనంతరం చెలరేగి ఆడాడు. లక్మల్ వేసిన 43వ ఓవర్లో ఏకంగా 4 సిక్సులతో విరుచుకుపడ్డాడు. దీంతో 18 బంతుల్లోనే మరో 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ దశలో శ్రేయస్ అయ్యర్ (88) భారీ షాట్‌కు ప్రయత్నించి శతకాన్ని చేజార్చుకున్నాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన ధోని(7) ఓ సిక్సు కొట్టి అవుటయ్యాడు. ఇక చివర్లో రోహిత్ 151 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు. ఈ విధ్వంసానికి లంక బౌలర్లు పరుగులివ్వడంలో పొటీ పడ్డారు. తొలి మ్యాచ్‌లో విజృంభించిన లక్మల్(71), ప్రదీప్‌లు(103) పరుగులు సమర్పించుకున్నారు. చివరి బంతికి పాండ్యా(8) క్యాచ్ అవుటయ్యాడు. లంక బౌలర్లలో పెరీరాకు మూడు సచిత్ పతిరాణకు ఓ వికెట్ దక్కింది. గర్జించిన భారత బ్యాట్స్‌మెన్ -
లక్మల్‌పై కసితీర్చుకున్న రోహిత్.!
-
కొత్త కుర్రాడు కుమ్మేశాడు.!
మొహాలీ: భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో వన్డేల్లో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ (88) భారీ షాట్‌కు ప్రయత్నించి శతకాన్ని చేజార్జుకున్నాడు. అరంగేట్ర మ్యాచ్ అనుభవంతో తొలుత ఆచితూచి ఆడిన అయ్యర్ హాఫ్ సెంచరీ అనంతరం తన ఐపీఎల్ అనుభవాన్ని ప్రదర్శించాడు. సిక్సర్లు, ఫోర్లతో విరుచుకపడుతూ లంక బౌలర్లను ఓ ఆట ఆడాడు. వేగంగా ఆడుతూ తన అసలైన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. మరోవైపు రోహిత్ కూడా సెంచరీ అనంతరం చెలరేగి ఆడాడు. లక్మల్ వేసిన 43వ ఓవర్లో ఏకంగా 4 సిక్సులతో విరుచుకుపడ్డాడు. దీంతో 18 బంతుల్లోనే మరో 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. మరోవైపు భారత్ భారీ స్కోరు దిశగా దూసుకెళ్తుంది. దెబ్బతిన్న పులిలా రోహిత్ మైదానంలో గర్జిస్తున్నాడు. -
రోహిత్ 100.. శ్రేయస్ 50
మొహాలీ: భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో వన్డేల్లో భారత ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీతో లంకపై కసి తీర్చుకున్నాడు. తొలి మ్యాచ్‌లో దారుణంగా విఫలమై కెప్టెన్‌గా చెత్త రికార్డు మూటగట్టుకున్న రోహిత్ అంతకంతకు లంక బౌలర్లపై బదులు తీర్చుకున్నాడు. మరో వైపు యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ అర్ధ సెంచరీ సాధించాడు. తొలుత శ్రేయస్ అయ్యర్ 50 బంతుల్లో 5 ఫోర్లతో కెరీర్ తొలి అర్ధ సెంచరీ సాధించాడు. అనంతరం 115 బంతుల్లో రోహిత్ 9 ఫోర్లు ఒక సిక్సుతో కెరీర్లో 16వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో భారత్ 39.3 ఓవర్లకు వికెట్ నష్టపోయి 237 పరుగులు చేయగలిగింది. ఇక రెండో వికెట్‌కు ఈ ఇద్దరూ భాగస్వామ్యం 100 దాటింది. లంకతో తొలి మ్యాచ్‌తోనే అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన అయ్యర్ ఆ మ్యాచ్‌లో విఫలమైన రెండో మ్యాచ్‌లో రాణించి సెలక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టాడు. -
రోహిత్ హాఫ్ సెంచరీ.. ధావన్ అవుట్
మొహాలీ: భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో ఓపెనర్ రోహిత్ శర్మ అర్ధ సెంచరీ సాధించాడు. 65 బంతుల్లో 5 ఫోర్లతో కెరీర్లో 35వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక అంతకు ముందు టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. తిరుమన్నే వేసిన 21 ఓవర్ తొలి బంతికి ఓపెనర్ శిఖర్ ధావన్(68) క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. దీంతో తొలి వికెట్‌కు నమోదైన 115 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్‌తో రోహిత్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నాడు. 24 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోయి 127 పరుగులు చేసింది. -
మరో యువ కెరటం అరంగేట్రం..
-
మరో యువ కెరటం అరంగేట్రం..
మొహాలీ: శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో మరోసారి రోహిత్‌కు టాస్ కలిసిరాలేదు. టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్‌పై మంచు ప్రభావం కారణంగా టాస్ కీలకంగా మారిన దశలో రోహిత్ టాస్ కోల్పోయాడు. ఇక జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా శ్రీలంక బరిలోకి దిగుతుండగా.. భారత్ జట్టులో ఒక్క మార్పు చోటుచేసుకుంది. కుల్దీప్ యాదవ్ స్థానంలో యువ ఆటగాడు వాషింగ్టన్ సుంధర్‌ను తీసుకున్నారు.. తొలి మ్యాచ్‌తో శ్రేయస్ అయ్యర్ అంతర్జాతీయ మ్యాచుల్లో అరంగేట్రం చేయగా.. ఈ మ్యాచ్‌తో 18 ఏళ్ల వాషింగ్టన్ సుంధర్ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. అయితే రహానేను తీసుకుంటారని అందరు భావించగా మరో సారి అతనికి మొండిచేయ్యే ఎదురైంది. వాషింగ్టన్ సుంధర్ మ్యాచ్‌కు ముందు కోచ్ రవిశాస్త్రి చేతుల మీదుగా క్యాప్ అందుకున్నాడు. భారత్ తరఫున వన్డే ఫార్మాట్లో బరిలోకి దిగిన 220వ క్రికెటర్‌గా సుంధర్ గుర్తింపు పొందాడు. తొలుత టీ20లకే సెలక్ట్ అయిన ఈ 18 ఏళ్ల కుర్రాడు. ఆలౌరౌండర్ కేదార్ జాదవ్ గాయంతో జట్టుకు దూరం అవ్వడంతో అనూహ్యంగా జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. ఇక భారత్‌కు ఈ మ్యాచ్ చావోరేవో అన్నట్లుగా మారింది. ఇది గెలిస్తేనే సిరీస్‌పై ఆశలు సజీవంగా ఉంటాయి. శ్రీలంక జట్టులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. తొలి మ్యాచ్ విజయంతో లంకేయులు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతున్నారు. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ విజయాన్నందుకోవాలని ఉవ్విలూరుతున్నారు. జట్లు భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), ధావన్, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, మనీశ్ పాండే, ధోని, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్, వాషింగ్టన్ సుంధర్, బుమ్రా, చహల్. శ్రీలంక: తిసారా పెరీరా (కెప్టెన్), గుణతిలక, తరంగా, తిరిమన్నే, ధనంజయ డిసిల్వా, మాథ్యూస్, డిక్వెలా, గుణరత్నే, సచిత్, లక్మల్, అకిల ధనంజయ, ప్రదీప్. -
‘ధర్మశాల విజయాన్ని రిపీట్ చేస్తాం’
మొహాలి: ధర్మశాల విజయాన్ని పునరావృతం చేస్తామని శ్రీలంక కెప్టెన్ తిసారా పెరీరా ధీమా వ్యక్తం చేశాడు. మోహాలిలో ప్రాక్టీస్ అనంతరం మీడియాతో మాట్లాడారు. సిరీస్ గెలవడానికి ఇది ఓ మంచి అవకాశమని, పెద్ద పెద్ద జట్లకు భారత్‌లో సిరీస్ గెలవడం సాధ్యం కాలేదన్నాడు. ధర్మశాల మ్యాచ్ వలె తమ ప్రత్యేకతను చూపించడానికి ఉవ్విళ్లూరుతున్నామన్నాడు. తమపై ఎలాంటి ఒత్తిడి లేదన్న పెరీరా ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్ గెలుస్తామన్న విషయం ప్రతి ఒక్కరికి మెదళ్లలో నాటుకోపోయిందన్నాడు. మ్యాచ్ గెలవడానికి 200 శాతం ప్రదర్శన కనబరుస్తామన్నాడు. గత న్యూజిలాండ్ సిరీస్‌లో భారత్ కూడా తొలి మ్యాచ్ ఓడిపోయి తరువాతి రెండు మ్యాచ్‌లు గెలిచిందన్న విషయం తెలుసని, అయినా మా బాధ్యత మేం నిర్వర్తిస్తామన్నాడు. 12 ఓటముల తర్వాత గెలవడం ఆనందంగా ఉందన్న పెరీరా.. ధర్మశాల ప్రదర్శనను కనబరిస్తే సులువుగా మొహాలి మ్యాచ్ గెలువచ్చన్నాడు. ఇక జట్టు సభ్యుల్లో ధనుంజయ డిసిల్వా ఫిట్నెస్ సమస్యతో బాధపడుతున్నాడని మిగతా వారంతా ఫిట్‌గా ఉన్నారని తెలిపాడు. ఇక ధర్మశాలలో రహానేను ఆడించకపోవడంపై స్పందిస్తూ.. నేను భారత సెలక్టర్‌ను కాదు. ఎందుకు ఆడలేదో నాకు తెలియదు. అతను ఓ గొప్ప బ్యాట్స్‌మన్. ఈ విషయంపై నేను ఇంకా ఎక్కువ మాట్లాడదలుచుకోలేనన్నాడు. తొలి మ్యాచ్‌లో రోహిత్ సేనపై శ్రీలంక ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్‌లో 1-0తో ఆధిక్యం సాధించిన విషయం తెలిసిందే. ఇక బుధవారం జరిగే మ్యాచ్ భారత్ చావో రేవో అన్నట్లుగా ఉంది. వాతావారణ పరిస్థితుల దృష్ట్యా శ్రీలంక టీం ధర్మశాలలో ఒక రోజు ఎక్కువగా బసచేసింది. మంగళవారం ఉదయం మొహాలి చేరిన జట్టు మధ్యాహ్నం ప్రాక్టీస్‌లో పాల్గొంది. పెరీరాకు ఈ మైదానంలో కింగ్స్ఎలెవన్ పంజాబ్ తరుపున ఆడిన అనుభవం ఉంది. -
మరో రికార్డు చేరువలో ధోని
సాక్షి, హైదరాబాద్ : వన్డేల్లో 300 పైగా మ్యాచ్‌లు.. అత్యధిక నాటౌట్లు.. స్టంప్ అవుట్లతో ఈ ఏడాది రికార్డులు సృష్టించిన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మరో మైలు రాయి చేరువలో ఉన్నాడు. వన్డేల్లో 10 వేల పరుగుల మార్క్ దాటడానికి ధోని ఇంకా 109 పరుగుల దూరంలో ఉన్నాడు. భారత్-శ్రీలంక రేపటి మ్యాచ్‌లో ధోని ఈ పరుగులు చేస్తే వేగంగా 10 వేల పరుగులు పూర్తి చేసిన నాలుగో బ్యాట్స్‌మన్‌గా రికార్డులకెక్కనున్నాడు. 259 ఇన్నింగ్స్‌ల్లో సచిన్ 10 వేల మార్క్‌ను అందుకోగా సౌరవ్ గంగూలీ 263, రికీ పాంటింగ్ 266, జయసూర్య 272 ఇన్నింగ్స్‌ల్లో ఈ మార్క్‌ను అందుకున్నారు. ధోని ప్రస్తుతం 267 ఇన్నింగ్స్‌ల్లో 9,891 పరుగులు చేశాడు. మిగిలిన 109 పరుగులను ఒక ఇన్నింగ్స్‌లో లేకపోతే రెండు మూడు, నాలుగు ఇన్నింగ్స్‌లు తీసుకున్నా జయసూర్య స్థానాన్ని అధిగమిస్తాడు. అంతేగాకుండా 10 వేల మార్క్‌ను అందుకున్న నాలుగో భారత బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందనున్నాడు. ఈ జాబితాలో సచిన్, గంగూలీ, ద్రవిడ్‌లు ముందున్నారు. ఇప్పటికే ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన టీమిండియా ప్లేయర్లలో ధోని నాలుగో స్థానంలో ఉన్నాడు. కోహ్లి(1460) పరుగులతో అగ్రస్థానంలో ఉండగా రోహిత్ శర్మ(1078), శిఖర్ ధావన్(792), ధోని(781)లు తరువాతి వరుసలో ఉన్నారు. శ్రీలంకపై స్థిరమైన బ్యాటింగ్‌తో రాణిస్తున్న ధోని గత ఎనిమిది మ్యాచుల్లో 4 అర్థ సెంచరీలు సాధించాడు. ఇక రేపటి మ్యాచ్‌లో మరో 11 పరుగులు చేస్తే ధోని మోహాలీ మైదానంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందుతాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు సచిన్ పేరిట ఉంది. ఇక తొలి మ్యాచ్‌లో క్లిష్ట పరిస్థితిల్లో అర్ధసెంచరీతో భారత పరువును కాపాడిన ధోని మంచి ఫామ్‌లో ఉన్నాడు. -
పరువు నిలిపిన ధోని
ధర్మశాల: శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో సీనియర్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని టీమిండియా పరువు కాపాడాడు. శ్రీలంక పేసర్ సురంగ లక్మల్ దాటికి భారత బ్యాట్స్‌మన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. 29 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియా అత్యల్ప స్కోరుకే ఆలౌట్ అవుతుందని అందరూ భావించారు. కానీ ధోని గండం నుంచి గట్టెక్కించాడు. ఐదు వికెట్లు కోల్పోయిన అనంతరం క్రీజులోకి వచ్చిన ధోని తనదైన శైలిలో ఆడుతూ అండగా నిలిచాడు. స్పిన్ బౌలర్ అయిన కుల్దీప్తో ఆచితూచి ఆడుతూ భారత స్కోరును 70 పరుగులు దాటించాడు. దీంతో ఇప్పటి వరకు భారత పేరిట ఉన్న అత్యల్ప స్కోరు 54 నుంచి టీమిండియా గట్టెక్కింది. బ్యాట్స్మన్లు బంతిని బ్యాట్‌కు తగిలించాడానికే ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో అనుభవంతో ధోని 5 బౌండరీలు బాదాడు. మరో వైపు కుల్దీప్ 19 పరుగులతో చక్కని సాయం అందించాడు. ఈ దశలో 70 పరుగుల వద్ద కుల్దీప్ (19) స్టంప్ అవుట్ కావడంతో భారత్ ఎనిమిది వికెట్లు కోల్పోయింది. క్రీజులోకి వచ్చిన బుమ్రాతో ధోని (29) పోరాడుతున్నాడు. -
చెత్త రికార్డు నమోదు చేసిన భారత్
ధర్మశాల: శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ చెత్త రికార్డును మూట గట్టుకుంది. పవర్ ప్లే ముగిసే సరికి భారత్ మూడు వికెట్లు కోల్పోయి కేవలం 11 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో గత ఐదేళ్లలో వన్డేల్లో 10 ఓవర్లకు అత్యల్ప స్కోరు నమోదు చేసి తొలి జట్టుగా ఈ అప్రతిష్టను మూటగట్టుకుంది. ఇక ఓవరాల్‌గా ఈ చెత్త రికార్డు నమోదు చేసిన రెండో జట్టుగా నిలిచింది. భారత్ ఆడిన తొలి ఐదు ఓవర్లలో నాలుగు ఓవర్లు మేడిన్ కావడం గమనార్హం. ఓపెనర్లు శిఖర్ ధావన్ డకౌట్, రోహిత్ శర్మ(2),లు విఫలమవ్వడం, దినేశ్ కార్తీక్ డకౌట్లు కావడంతో భారత్‌కు ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ చెత్త రికార్డు రోహిత్ కెప్టెన్సీ వహిస్తున్న తొలి మ్యాచ్‌లోనే కావడం విశేషం. ఇక మరో వైపు వరుస గెలుపులతో రికార్డులు నమోదు చేసిన భారత జట్టు.. ఈ చెత్త రికార్డును మూటగట్టుకోవడం భారత అభిమానులకు మింగుడుపడటం లేదు. -
విఫలమైన భారత్ ఓపెనర్లు
-
స్కోరు 2, వికెట్లు 2
ధర్మశాల: శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో భారత ఓపెనర్లు దారుణంగా విఫలమయ్యారు. దీంతో భారత్ కేవలం రెండు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. తొలి వికెట్‌గా శిఖర్ ధావన్ డకౌట్ కాగా రెండో వికెట్ రోహిత్ క్యాచ్ అవుటయ్యాడు. మాథ్యూస్ వేసిన రెండో ఓవర్ చివరి బంతికి ధావన్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. తొలుత అంపైర్ నౌటౌట్ ప్రకటించగా..లంక కెప్టెన్ పెరీరా రివ్యూ కోరాడు. రిప్లేలో బంతి బ్యాట్‌కు తగలకపోవడం, బంతి మిడిల్ స్టంప్‌వైపు దూసుకుపోవడంతో థర్డ్ అంపైర్ అవుట్‌గా ప్రకటించారు. దీంతో భారత్ పరుగులు చేయకుండానే వికెట్ కోల్పోయింది. అనంతరం రోహిత్.. లక్మల్ వేసిన ఐదో ఓవర్ తొలి బంతికి క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. అయితే ఈ వికెట్ కూడా శ్రీలంక రివ్యూతో సాధించడం విశేషం. పిచ్ పేసర్లకు అనుకూలిస్తుండటంతో లంక బౌలర్లను ఎదుర్కోవడానికి భారత బ్యాట్స్‌మన్ ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇన్నింగ్స్‌లో తొలి ఐదు ఓవర్లు నాలుగు మేడిన్ కాగా భారత్ రెండు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. -
అయ్యర్ అరంగేట్రం.. రహానే ఔట్
ధర్మశాల: భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్‌తో భారత యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ అంతర్జాతీయ వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు. మ్యాచ్‌కు ముందు సీనియర్ ఆటగాడైన మహేంద్ర సింగ్ ధోని చేతుల మీదుగా క్యాప్ అందుకున్నాడు. కెప్టెన్ కోహ్లి విశ్రాంతి తీసుకోవడంతో ఈ సిరీస్‌కు రోహిత్ కెప్టెన్సీ వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక సీనియర్ ఆటగాడైన అజింక్యా రహానేకు జట్టులో చోటు దక్కలేదు. పేసర్లకు అనుకూలించే పిచ్ అని, కెప్టెన్‌గా ఓ గొప్ప బాధ్యత తనపై ఉందని, మంచి జట్టుతో బరిలోకి దిగుతున్నామని రోహిత్ వ్యాఖ్యానించాడు. ఇక బ్యాటింగ్ పిచ్ కావడంతో చేజింగ్ సులువని ఫీల్డింగ్ ఎంచుకున్నట్లు కెప్టెన్ పెరీరా పెర్కొన్నాడు. తుది జట్లు: భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), ధావన్, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, మనీశ్ పాండే, ధోని, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్, కుల్దీప్, బుమ్రా, చహల్ శ్రీలంక: తిసారా పెరీరా (కెప్టెన్), తరంగ, గుణతిలక, తిరిమన్నె, డిక్వెలా, మాథ్యూస్, గుణరత్నే, సచిత్, లక్మల్, ప్రదీప్, అకిల ధనంజయ -
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంక
-
శభాష్ డిసిల్వా.. లంక క్రికెటర్‌కు కోహ్లీ, రోహిత్ కంగ్రాట్స్
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ చివరి రోజు ఆటలో శ్రీలంక బ్యాట్స్‌మన్ ధనంజయ డిసిల్వా శతకం సాధించాడు. షమీ బౌలింగ్‌లో మూడు పరుగులు తీసి 188 బంతుల్లో 12 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో సెంచరీ మార్కు చేరుకున్నాడు. ధనంజయ కెరీర్లో ఇది మూడో టెస్ట్ శతకం. 119 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. కాగా, కష్ట సమయంలో జట్టును ఆదుకున్న డిసిల్వాను లంకేయులతో పాటు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు అభినందించారు. టెస్ట్ చివరిరోజు తొలి సెషన్, లేక రెండో సెషన్లోనే టీమిండియా బౌలర్లు లంకను చాప చుట్టేస్తారనుకుంటే లంక కెప్టెన్ చండిమాల్ (36) సాయంతో డిసిల్వా స్కోరు బోర్డుకు పరుగులు జోడించాడు. చండిమాల్ ఔటయ్యాక రోషన్ డిసిల్వా వికెట్ పడకుండా సహకరించడంతో ధనంజయ అజేయ శతకంతో మెరిశాడు. సెంచరీ అనంతరం 110 పరుగుల వద్ద ధనంజయకు లైఫ్ లభించడంతో లంకేయులు ఊపిరి పీల్చుకున్నారు. 69వ ఓవర్ రెండో బంతిని ధనంజయ ఆడగా.. గాల్లోకి లేచిన బంతి అశ్విన్ చేతుల్లో పడినట్లే అనిపించినా క్యాచ్ చేజారింది. ధనంజయ డిసిల్వా (210 బంతుల్లో 119 రిటైర్డ్ హర్ట్: 15 ఫోర్లు, 1 సిక్స్). ప్రస్తుతం రోషన్ డిసిల్వా (25), డిక్వెల్లా(0) క్రీజులో ఉన్నారు. 74 ఓవర్లలో రెండో ఇన్నింగ్స్‌లో లంక స్కోరు 206/5. భారత్ తొలి ఇన్నింగ్స్ 536/7 డిక్లేర్, రెండో ఇన్నింగ్స్ 246/5 డిక్లేర్ శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 373 ఆలౌట్ -
ఐదో వికెట్ కోల్పోయిన శ్రీలంక
న్యూఢిల్లీ: భారత్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో శ్రీలంక ఐదో వికెట్ కోల్పోయింది. లంక కెప్టెన్ చండిమాల్ (36) అశ్విన్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో ఐదో వికెట్‌కు నమోదైన 112 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. మరో వైపు డిసిల్వా(90) సెంచరీ చెరువలో ఉన్నాడు. క్రీజులోకి వచ్చిన రోషన్ సిల్వాతో డిసిల్వా ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నాడు. ప్రస్తుత లంక స్కోర్ 147/5. -
చండిమాల్‌కు లైఫ్..డిసిల్వా హాఫ్ సెంచరీ..
న్యూఢిల్లీ: భారత్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ చివరి రోజు ఆటలో శ్రీలంక బ్యాట్స్‌మన్ డిసిల్వా అర్ధశతకం చేయగా.. చండిమాల్‌కు లైఫ్ దొరికింది. జడేజా వేసిన 43 ఓవర్ మూడో బంతికి చండిమాల్ క్లీన్‌బౌల్డ్ కాగా రిప్లయ్‌లో నోబాల్ కావడంతో లంకకు అదృష్టం కలిసొచ్చింది. ఇక అంతకు ముందు డిసిల్వా 92 బంతుల్లో 8 ఫోర్లు 1 సిక్సుతో కెరీర్లో మూడో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 34 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును గట్టెక్కించేందుకు డిసిల్వా(72) కెప్టెన్ చండిమాల్(27)లు పోరాడుతున్నారు.45 ఓవర్లలో శ్రీలంక స్కోర్ 119/4. -
ఆశల భేటీ
చెన్నై, సాక్షి ప్రతినిధి: భారత్-శ్రీలంక మధ్య దశాబ్దాల తరబడి నానుతున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించే వాతావరణం నెలకొందా? ఈలం తమిళులకు, తమిళనాడు జాలర్లకు ఊరట లభించనుందా? అనే ప్రశ్నలకు రాష్ట్రంలో అవుననే సమాధానం వస్తోంది. 28 ఏళ్ల తరువాత భారత ప్రధాని శ్రీలంక గడ్డపై కాలుమోపడం, ఆ దేశాధ్యక్షునితో శుక్రవారం జరిపిన భేటీలో ప్రధానమైన ఈ అంశాలన్నీ చోటుచేసుకోవడమే ఇందుకు కారణంగా భావించవచ్చు. ఏళ్లుగా నానుతున్న సమస్యలు శ్రీలంకలో స్థిరపడి, ఆక్కడే తరతరాలుగా జీవిస్తున్న ఈలం తమిళులు తమకు ప్రత్యేక హోదా లేదా రాష్ట్రం కావాలనే డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై ఎల్టీటీఈ సైతం పోరాడి సైనికపోరులో హతమైంది. ఈలం తమిళులపై శ్రీలంక సైన్యం దమనకాండను సాగించి. గృహ దహనాలు, మానభంగాలు, హత్యాకాండలతో మారణహోమం సృష్టిం చారు. వేలాది మంది మృత్యువాత పడగా, లక్షలాది మంది శ్రీలంకను వీడి భారత్‌లో శరణార్థులుగా తలదాచుకున్నారు. ఇదిలా ఉండగా, కచ్చదీవులపై హక్కును భారత్ శ్రీలంకకు ధారాదత్తం చేయగా, గత ఆచారం ప్రకారం ఆవైపు సముద్రంలో చేపలవేటకు వెళుతున్న తమిళనాడు మత్స్యకారులపై శ్రీలంక గస్తీదళం జులుం చేస్తోంది. దాడులు చేయడం, జైళ్లలోకి నెట్టడం, మరపడవలు, ఇతర ఆస్తులను స్వాధీనం చేసుకోవడం వంటివి సాగిస్తోంది. చేపల వేటనే వృత్తిగా చేసుకుని జీవిస్తున్న తమిళనాడులోని వేలాది కుటుంబాలు శ్రీలంక దాష్టీకానికి బిక్కచచ్చిపోయాయి. కచ్చదీవులను భారత్ తిరిగి స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ జయలలిత ప్రభుత్వం గత ఏడాది అసెంబ్లీలో తీర్మానం కూడా చేసింది. ఈలం తమిళులు, జాలర్ల సమస్య రెండు దేశాల మధ్య రావణకాష్టంలా మండుతూనే ఉంది. తమిళుల హక్కులకు భారత్ అండ ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్రమోదీ విదేశీ పర్యటనలో భాగంగా గురువారం రాత్రి శ్రీలంకకు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం ఆ దేశాధ్యక్షుడు సిరిసేనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మోదీ మీడియాతో మాట్లాడారు. భారత ప్రధానిగా శ్రీలంకలో పర్యటించడం ఆనందాన్నిస్తోందని చెప్పారు. ఈ పర్యటన ఇరుదేశాల మధ్య స్నేహాన్ని పెంచేందుకు దోహదపడగలదని విశ్వసిస్తున్నానని అన్నారు. శ్రీలంకలోని ఈలం తమిళులకు ఇతర పౌరులతో సమానహక్కు కల్పించాలని, తమిళ జాలర్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూడాలని సిరిసేనను కోరినట్లు చెప్పారు. మత్య్సకారుల జీవనాధారాన్ని దృష్టిలో ఉంచుకుని మానవతా దృక్పథంతో నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరినట్లు చెప్పారు. శ్రీలంకలోని జాలర్ల ప్రతినిధులు తనను కలిశారని తెలిపారు. ఈలం తమిళులకు సమానహక్కు అంశంలో ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని మోదీ అన్నారు. ఈలం తమిళులకు సమానహక్కుపై ఇప్పటికే చట్టంలో సవరణలు చేసి ఉన్నారని, ఆయితే వాటిని నిర్ధిష్టంగా, నిబద్ధతతో అమలు చేయాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. దశాబ్దాల తరబడి పాతుకుపోయిన సమస్యలు కావడంతో పరిష్కారం కనుగొనేందుకు కొంత సమయం పడుతుందని చెప్పారు. ఇందుకు అవసరమైన అన్నిరకాల సహకారం భారత్ అందిస్తుందని తాను సిరిసేనతో చెప్పినట్లు తెలిపారు. ప్రధాని మోదీ శ్రీలంక పర్యటన ఈలం తమిళులకు, తమిళనాడు జాలర్లకు పునర్జన్మను ప్రసాదిస్తుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ హర్షం వ్యక్తం చేశారు.