లంకతో టీ20: సిరాజ్‌కు మళ్లీ నిరాశే.! | Sri Lanka won the toss and elected Field first | Sakshi
Sakshi News home page

లంకతో టీ20: సిరాజ్‌కు మళ్లీ నిరాశే.!

Published Wed, Dec 20 2017 6:53 PM | Last Updated on Wed, Dec 20 2017 9:04 PM

Sri Lanka won the toss and elected Field first - Sakshi

కటక్‌: భారత్‌-శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి 20 మ్యాచ్‌లో హైదారాబాద్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌కు మళ్లీ నిరాశే ఎదురైంది. ఈ ఏడాదే అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేసిన ఈ హైదరాబాదీ తాజా సిరీస్‌కు ఎంపికైనా రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇక ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన లంక ఫీల్డింగ్‌ ఎంచుకుంది.

ఇరు జట్లలో మార్పులు చోటు చేసుకున్నాయి. టీ20లకు విశ్రాంతి తీసుకున్న శిఖర్‌ ధావన్‌, భువనేశ్వర్‌ల స్థానాల్లో కేఎల్‌ రాహుల్‌, జయదేవ్‌ ఉనద్కత్‌లు జట్టులోకి వచ్చారు.  శ్రీలంక  జట్టులో నాలుగు మార్పులు చేసింది. ఈ మ్యాచ్‌తో లంక లెఫ్టార్మ్‌ పేసర్‌ విశ్వా ఫెర్నాండో అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేస్తుండగా.. చమీరా, శనక,  కుశాల్‌లను తుది జట్టులోకి తీసుకున్నారు. ఇక ఈ పొట్టి సిరీసైనా గెలిచి సగర్వంగా స్వదేశానికి వెళ్లాలని లంకేయులు భావిస్తుండాగా.. తమ జైత్రయాత్రను కొనసాగించాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేయాలనుకున్న మరో యువ పేసర్‌ బసీల్‌ థంపీకి సైతం నిరాశే ఎదురైంది.

తుది జట్లు:
భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), రాహుల్, అయ్యర్, దినేశ్‌ కార్తీక్, పాండే, ధోని, పాండ్యా, కుల్దీప్, బుమ్రా, చహల్, ఉనద్కత్‌
శ్రీలంక: తిసారా పెరీరా (కెప్టెన్‌), తరంగ, కుషాల్‌ పెరీరా, మాథ్యూస్, డిక్‌వెలా, గుణరత్నే, షనక, ధనంజయ, చమీరా, ఫెర్నాండో, ప్రదీప్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement